-ఆర్‌ఎస్‌ఐతో పాటు డ్రైవర్‌కు గాయాలు
మల్యాల: జగిత్యాల జిల్లా కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి ఆలయం ఘాట్‌రోడ్డులో సోమవారం తెల్లవారుజామున పోలీస్‌వ్యాన్ బోల్తాపడింది. ఈ ఘటనలో ఆర్‌ఎస్సైతో పాటు డ్రైవర్‌కు గాయాలయ్యాయి. ఉదయం 4 గంటల సమయంలో 22 మంది స్పెషల్‌పార్టీ పోలీసులు కొండగట్టుకు వ్యాన్‌లో వెళ్తున్నారు. ఘాట్‌పై కొంత దూరం వెళ్లగానే డీజిల్ అయిపోవడంతో వ్యాన్ ఆగిపోయింది. దీంతో వ్యాన్‌లోని కానిస్టేబుళ్లు దిగారు. డ్రైవ ర్, ఆర్‌ఎస్సై పుండరీకం అందులోనే ఉండి.. డీజిల్ కోసం వ్యాన్‌ను కిందికి దింపేదుకు యత్నించారు. ఈ క్రమంలో బ్రేకులు పడక వ్యాన్ అదుపుతప్పి.. చిన్న లోయలోకి పడిపోయింది. ధ్వంసం కాగా.. డ్రైవర్ చంద్రశేఖర్, ఆర్‌ఎస్సై పుండరీకం స్వల్పంగా గాయపడ్డారు. విషయం తెలుసుకున్న ఎస్పీ అనంతశర్మ సంఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు.
కొండగుట్టు ఘాట్‌రోడ్డులో పోలీస్ వ్యాన్ బోల్తా
Published Mon, Oct 17 2016 8:01 PM | Last Updated on Mon, Sep 4 2017 5:30 PM
Advertisement
Advertisement