తిరుమలలో భక్తుల రద్దీ ఓ మోస్తరుగా ఉంది. ప్రస్తుతం ఆరు కంపార్టుమెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం ఎదురుచూస్తున్నారు.
తిరుపతి: తిరుమలలో భక్తుల రద్దీ ఓ మోస్తరుగా ఉంది. ప్రస్తుతం ఆరు కంపార్టుమెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం ఎదురుచూస్తున్నారు. సర్వదర్శనానికి నాలుగు గంటల సమయం, నడకదారిన వెళ్లే భక్తులకు మూడుగంటల సమయం పట్టనుంది. మరోపక్క, కుండపోత వర్షాల కారణంగా తిరుమలలో వర్షపు నీరు వరదలా పారుతుంది.
తిరుమల ఘాట్ రోడ్డులో మరోసారి కొండచరియలు విరిగి పడుతున్నాయి. దీంతో ఆ రోడ్డులో అధికారులు అప్రమత్తత ప్రకటించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు టీటీడీ అధికారులు దగ్గరుండి ఈ పనులు పర్యవేక్షిస్తున్నారు. కొండ చరియల కారణంగా ఘాట్ రోడ్డులో భారీగా ట్రాఫిక్ జామ్ నెలకొంది. ఓ వైపు వర్షం మరోవైపు కొండచరియల కారణంగా భక్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.