తిరుమల ఘాట్ రోడ్డులో పనులు ప్రారంభం
తిరుమల : తిరుపతి నుంచి తిరుమలకు వెళ్లే రెండో ఘాట్‌లో 15వ కిలోమీటరు భాష్యకార్ల సన్నిధి వద్ద మంగళవారం ‘భూమి’ అనే ఇంజనీరింగ్ సంస్థ పునరుద్ధరణ పనులు ప్రారంభించింది. ఈ సందర్భంగా చెన్నై నుంచి ప్రత్యేక యంత్రాలు తెప్పించారు. ముందుగా అమర్చిన పైపుల ద్వారా గ్రౌటింగ్, యాంకరింగ్ పద్దతుల్లో పనులు ప్రారంభించారు.
సుమారు 360కిపైగా బొరియలు వేసి అందులో సిమెంట్‌ను గ్రౌట్ పద్దతుల్లో పగుళ్లను పూడుస్తారు. తర్వాత గోడ మొత్తాన్ని యాంకరింగ్ పద్ధతిలో పూర్తిస్థాయిలో పటిష్టత చేకూరుస్తారు. ఈ పనులు సుమారు నెలరోజులపాటు సాగే అవకాశం ఉంది. అయినప్పటికీ ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా పనులు కొనసాగించేలా టీటీడీ ఇంజనీర్లు ఏర్పాట్లు చేశారు.