Restoration works
-
‘మణిపూర్’పై ఏం చర్యలు తీసుకున్నారు: సుప్రీం
న్యూఢిల్లీ: మణిపూర్‌లో ప్రార్థనా స్థలాల రక్షణకు తీసుకున్న చర్యలను తాము ఏర్పాటు చేసిన ప్రత్యేక కమిటీకి వివరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ సారథ్యంలోని ధర్మాసనం మణిపూర్‌లో ప్రార్థనాస్థలాల పునరుద్ధరణ అంశంపై శుక్రవారం విచారణ చేపట్టింది. వర్గ హింసలో దెబ్బతిన్న, ధ్వంసమైన మత సంబంధ నిర్మాణాలపై రెండు వారాల్లోగా కమిటీకి సమగ్ర వివరాలను అందించాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఉత్తర్వులు జారీ చేసింది. -
హెరిటేజ్ కోసం.. చిత్తూరు డెయిరీని కుట్రపూరితంగా మూసేశారు: సీఎం జగన్
Updates: ►సీఎంసీ హాస్పిటల్‌కు శంకుస్థాపన చేసిన సీఎం జగన్ ►300 బెడ్స్ కెపాసిటీతో అత్యాధునిక సీఎంసీ హాస్పిటల్ నిర్మాణం ►చిత్తూరు డెయిరీ నష్టాల్లో ఉంటే హెరిటేజ్ డెయిరీ లాభాల్లోకి వెళ్లడం ఆశ్చర్యమేసింది: సీఎం జగన్ ►చంద్రబాబు హయాంలో అతిపెద్ద చిత్తూరు డెయిరీ దోపిడీకి గురైంది ►పాదయాత్రలో ఇచ్చిన మాట ప్రకారం హామీ నెరవేర్చా ►182 కోట్ల బకాయిలను తీర్చి డెయిరీ రీఒపెన్ చేస్తున్నాం ►అమూల్ రూ.325 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చింది ►హెరిటేజ్ డెయిరీ కోసం.. చిత్తూరు డెయిరీని కుట్రపూరితంగా మూసేశారని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. ఎలాంటి నోటీస్ ఇవ్వకుండానే చిత్తూరు డెయిరీని మూసేశారని, తన స్వార్థం కోసం చంద్రబాబు సొంత జిల్లా రైతులనే నిలువునా ముంచేశారని సీఎం అన్నారు. మూతపడిన చిత్తూరు డెయిరీని తెరిపిస్తున్నామన్నారు. ►చిత్తూరు డెయిరీ వద్ద అమూల్ ప్రాజెక్ట్‌కు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి భూమిపూజ చేశారు. అనంతరం చిత్తూరు పోలీస్ పరేడ్ గ్రౌండ్స్‌లో ఫొటో సెషన్, ఎగ్జిబిషన్ పరిశీలించారు. కాసేపట్లో బహిరంగ సభలో సీఎం ప్రసంగించనున్నారు. చదవండి: పచ్చని చిత్తూరు విజయా డెయిరీపై ‘పచ్చ’ కుట్ర.. పక్కాగా ప్లాన్ అమలు చేసిన చంద్రబాబు ►రేణిగుంట ఎయిర్‌పోర్టుకు సీఎం జగన్ చేరుకున్నారు. అక్కడ నుంచి ప్రత్యేక హెలికాఫ్టర్‌లో చిత్తూరుకు బయలుదేరారు. కాసేపట్లో అమూల్ డెయిరీని సీఎం ప్రారంభించనున్నారు. అనంతరం చిత్తూరు పోలీస్ పరేడ్ గ్రౌండ్స్‌లో ఫొటో సెషన్, ఎగ్జిబిషన్ పరిశీలించిన తర్వాత బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. మధ్యాహ్నం 1.05 గంటలకు సీఎంసీ ఆసుపత్రి ఆవరణలో 300 పడకల ఆసుపత్రి భవన నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. సాక్షి, అమరావతి\చిత్తూరు: రెండు దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న పాడి రైతులకు శుభ గడియ రానేవచ్చింది. దేశంలోనే రెండో అతిపెద్దదైన చిత్తూరు డెయిరీ పునరుద్ధరణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. రూ. 385 కోట్లతో చేపడుతున్న ఈ పునరుద్ధరణ పనులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం భూమి పూజ చేయనున్నారు. ఎన్నికల ముందు పాదయాత్రలో ఇచ్చిన మరో కీలకమైన హామీ ఆచరణకు నోచుకోబోతోంది. 2024 ఏప్రిల్ నాటికి ఉత్పత్తి ప్రారంభించే లక్ష్యంతో కార్యాచరణ సిద్ధమైంది. తొలి దశలో లక్ష టన్నుల సామర్థ్యంతో మిల్క్ ప్రాసెసింగ్ యూనిట్‌ను ఏర్పాటు చేయబోతున్నారు. ఈ యూనిట్ ద్వారా పాలు, పెరుగు, వెన్న, పన్నీర్, మజ్జిగను ఉత్పత్తి చేయనున్నారు. మలిదశలో రూ. 150 కోట్లతో దేశంలోనే అతిపెద్ద ఐస్‌క్రీం ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తారు. ఆ తర్వాత దశల వారీగా పాల కర్మాగారం, వెన్న, పాలపొడి, చీజ్, పన్నీర్, యోగర్ట్, స్వీట్లు తయారీ విభాగాలతో పాటు అల్ట్రా హై ట్రీట్మెంట్ (యూహెచ్‌టీ) ప్లాంటు ఏర్పాటు చేయనున్నారు. ఈ డెయిరీ పునరుద్ధరణ ద్వారా ప్రత్యక్షంగా 5 వేల మందికి, పరోక్షంగా 2 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. అలాగే 25 లక్షల మంది పాడి రైతులకు లబ్ధి చేకూరనుంది. సహకార డెయిరీలకు పాతరేసిన బాబు రైతుల నుంచి గిట్టుబాటు ధరకు పాలు సేకరించి, వినియోగదారులకు సరసమైన ధరకే నాణ్యమైన పాల సరఫరా లక్ష్యంతో 6 వేల లీటర్ల సామర్థ్యంతో చిత్తూరు డెయిరీని ఏర్పాటు చేశారు. దశల వారీగా విస్తరించడంతో రోజుకు 2.5 లక్షల లీటర్ల సామర్థ్యంతో దేశంలోనే రెండో అతిపెద్ద డెయిరీగా అవతరించింది. 1992–93 వరకు విజయవంతంగా పనిచేసిన ఈ డెయిరీని 1995లో అధికారం చేపట్టిన తర్వాత చంద్రబాబు తన హెరిటేజ్ డెయిరీ కోసం నిర్వీర్యం చేయడంతో చిత్తూరు డెయిరీ తన ప్రాభవాన్ని కోల్పోతూ వచ్చింది. లాభాల్లో కొనసాగుతున్న డెయిరీని స్వార్థ ప్రయోజనాలతో నిరీ్వర్యం చేసి ఆర్థిక నష్టాలకు గురిచేయడం ద్వారా 2002లో మూతపడేటట్టు చేశారు. చిత్తూరు డెయిరీనే కాదు.. బాబు హయాంలో 2017 జనవరి 23న పులివెందుల డెయిరీ, 2018 జూలై 31న రాజమండ్రి డెయిరీ, 2018 నవంబర్ 30న కృష్ణా జిల్లాలోని మినీ డెయిరీ, 2019 మార్చి 15న చిత్తూరులోని మదనపల్లి డెయిరీతో సహా మరో 8 సహకార డెయిరీలను మూతపడేటట్టు చేశారు. అంతేకాదు అన్నమయ్య జిల్లాలోని యూహెచ్‌టీ ప్లాంట్, ప్రకాశం జిల్లాలోని మిల్క్ పౌడర్ ప్లాంట్, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లో ఒక్కొక్కటి చొప్పున ఎంసీసీతో పాటు 141 బీఎంసీయూలు మూతపడ్డాయి. తద్వారా సహకార రంగంలోఉన్న పాల డెయిరీలన్నీ ప్రొడ్యూసర్ కంపెనీల చేతుల్లోకి వెళ్లేటట్టు చేశారు సహకార రంగం బలోపేతమే లక్ష్యంగా.. సహకార డెయిరీ రంగం బలోపేతమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్న ఒప్పందం మేరకు జగనన్న పాల వెల్లువ కింద రాష్ట్రంలో 3,551 మహిళా పాడి రైతుల సంఘాలకు చెందిన 3.07 లక్షల మంది పాడి రైతుల నుంచి రోజుకు సగటున 1.72 లక్షల లీటర్ల పాలను అమూల్ సేకరిస్తోంది. రెండేళ్లలో 8.78 కోట్ల లీటర్ల పాలు సేకరించగా, రూ.393 కోట్లు చెల్లించారు. అమూల్ రాకతో గత రెండేళ్లలో పెంచిన పాలసేకరణ ధరల వల్ల ప్రైవేటు డెయిరీలకు పాలు పోసే రైతులకు రూ.4,243 కోట్ల మేర అదనపు ప్రయోజనం చేకూరింది. మూతపడిన డెయిరీల పునరుద్ధరణలో భాగంగా ఇప్పటికే మదనపల్లి డెయిరీని అందుబాటులోకి తీసుకొచ్చారు. తాజాగా మరో అడుగు ముందుకేసి చిత్తూరు డెయిరీని పునరుద్ధరిస్తున్నారు. ఇందుకోసం డెయిరీకు ఉన్న రూ.182 కోట్ల అప్పులను రాష్ట్ర ప్రభుత్వం తీర్చింది. మంగళవారం చిత్తూరులో జరగనున్న భూమి పూజ కార్యక్రమంలో గుజరాత్ కో ఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ లిమిటెడ్ చైర్మన్ షమల్బాయ్ బి.పటేల్, కైరా జిల్లా కో ఆపరేటివ్ మిల్క్ ప్రొడ్యూసర్స్ యూనియన్ లిమిటెడ్ చైర్మన్ విపుల్ పటేల్, రాష్ట్ర మంత్రులు, వ్యవసాయ, సహకార శాఖ స్పెషల్ సీఎస్ గోపాలకృష్ణ ద్వివేది తదితరులు పాల్గొననున్నారు. ఒక్క చిత్తూరు డెయిరీకే నష్టాలు ఎందుకు? ఒకే జిల్లాలో ఒకే సమయంలో ఉన్న రెండు డెయిరీల్లో ఒకటి ఏటా లాభాలను పెంచుకుంటూ పోతే.. మరో డెయిరీ నష్టాలను పెంచుకుంటూ పోయింది. రైతులు అందరూ కలిసి నిర్వహించుకుంటున్న చిత్తూరు డెయిరీ చంద్రబాబు తొలిసారి ముఖ్యమంత్రిగా పదవి చేపట్టిన తర్వాత క్రమంగా నష్టాలను పెంచుకుంటూ పోతే.. అదే సమయంలో ఆయన సొంత డెయిరీ మాత్రం లాభాలను రెట్టింపు చేసుకుంటూ పోయింది. ఇదే సమయంలో దేశంలోని అమూల్ వంటి పలు సహకార డెయిరీలు లాభాల్లో నడుస్తుంటే ఒక్క చిత్తూరు డెయిరీ మాత్రమే నష్టాలను మూటకట్టుకుంది. ఇదంతా ఒక పద్ధతి ప్రకారం చేసి చివరకు 2002లో ఆ డెయిరీని మూసివేయించారు. ఇందుకోసం తనే ఒక కమిటీ వేసి ఆ కమిటీ సిఫార్సుల మేరకు చిత్తూరు డెయిరీని మూసేస్తున్నట్లు ప్రకటించారు. అప్పటికే హెరిటేజ్ పెట్టి 10 ఏళ్లు దాటింది. తన సొంత డెయిరీ కోసం సొంత జిల్లా రైతుల నోటిలో మట్టి కొడుతూ చిత్తూరు సహకార డెయిరీని మూయించేశారు అనడానికి ఇంతకంటే ఉదాహరణలు ఏమి కావాలి. చిత్తూరు డెయిరీ మూసివేత గురించి ఎవరైనా మాట్లాడుతుంటే వెంటనే హెరిటేజ్ డెయిరీ ఉలిక్కిపడటం చూస్తుంటే.. చేసిన తప్పును చెప్పకనే చెపుతోంది అని అర్థమవుతుంది. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
10 నుంచి తిరుమల రెండో ఘాట్ రోడ్డు సిద్ధం
సాక్షి ప్రతినిధి, తిరుపతి: గత నెలలో పెనుగాలులు, భారీ వర్షాల నేపథ్యంలో కొండచరియలు విరిగిపడి దెబ్బతిన్న తిరుమల ఎగువ(రెండో) ఘాట్ రోడ్డు పునరుద్ధరణ పనులు తుది దశకు చేరుకున్నాయి. పదో తేదీకల్లా ఘాట్ రోడ్డును పూర్తి స్థాయిలో వినియోగంలోకి తెచ్చేందుకు టీటీడీ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. గడిచిన 30 ఏళ్లలో తిరుమలలో ఎప్పుడూ లేని విధంగా డిసెంబర్ ఒకటో తేదీ తెల్లవారుజామున ఒక్కసారిగా పెద్ద పెట్టున కొండ చరియలు విరిగిపడి నాలుగు చోట్ల ఎగువ ఘాట్ రోడ్డు తీవ్రంగా దెబ్బతిన్న విషయం తెలిసిందే. అప్రమత్తమైన టీటీడీ యంత్రాంగం ఆ రోడ్డులో రాకపోకలను నిలిపేసి యుద్ధప్రాతిపదికన ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టింది. లింక్ రోడ్డును తెరచి తిరుమలకు వెళ్లే వాహనాలను ఆ రోడ్డు మీదుగా మళ్లించింది. మరోవైపు నిరంతరాయంగా పునర్నిర్మాణ పనులను చేపట్టింది. 12, 14, 15, 16 కి.మీ. వద్ద దెబ్బతిన్న ఘాట్ రోడ్డు పునర్నిర్మాణ పనులను తిరుపతిలో శ్రీనివాస సేతు ఫ్లై ఓవర్ నిర్మిస్తున్న ఆఫ్కాన్ సంస్థకు అప్పగించారు. ఇప్పటికే ఆ సంస్థ సైడ్ వాల్స్ నిర్మాణాలను పూర్తి చేసింది. కొండ చరియలు విరిగిపడే ప్రమాదమున్న చోట రాక్ బోల్ట్ టెక్నాలజీతో చేపట్టిన మెష్‌ల నిర్మాణం తుది దశకు చేరుకుంటోంది. ఈ నెల 10న రెండో ఘాట్ రోడ్డును తిరిగి వినియోగంలో తెస్తామని టీటీడీ ఎస్ఈ జగదీశ్వర్‌రెడ్డి సోమవారం ‘సాక్షి’తో చెప్పారు. -
‘యాస్’ నష్టం రూ.610 కోట్లు: జల దిగ్బంధంలో 500 గ్రామాలు
భువనేశ్వర్: యాస్ తుపానుతో రాష్ట్రంలో రూ.610 కోట్ల నష్టం సంభవించింది. రూ. 520 కోట్ల విలువైన ప్రభుత్వ ఆస్తులు నష్టపోగా ప్రభుత్వేతర ఆస్తులకు రూ.90కోట్ల నష్టం వాటిల్లిందని పలు విభాగాల ఉన్నతాధికారులు ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌కు వివరించారు. యాస్ తుపాను నష్టం, పునరుద్ధరణ కార్యకలాపాల్ని ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఆన్లైన్లో గురువారం సమీక్షించారు. అధికారులకు అభినందనలు ప్రభుత్వ అధికారులు, ప్రభావిత జిల్లా యంత్రాంగం అద్భుతమైన కార్యాచరణతో ప్రజల ప్రాణాలతో పాటు ఆస్తులను పరిరక్షించారని సీఎం ప్రత్యేకంగా అభినందించారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సహాయక, పునరుద్ధరణ కార్యకలాపాలు అత్యంత స్వల్ప వ్యవధిలో ముగించడం విశేషమని మెచ్చుకున్నారు. యాస్ తుపాను తీరం తాకే ముందు, తాకే సమయం, తదనంతర పరిస్థితుల్లో చేపట్టిన సమగ్ర విపత్తు నిర్వహణ దస్తావేజులతో భద్రపరిస్తే భావి విపత్తు నిర్వహణ వ్యవహారాల్లో మార్గదర్శకంగా నిలుస్తుందని అభిప్రాయ పడ్డారు. జల దిగ్బంధంలో 500 గ్రామాలు సమావేశంలో పాల్గొన్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సురేష్ చంద్ర మహాపాత్రో మాట్లాడుతు యాస్ తుపాను ప్రభావంతో సమగ్రంగా 150 గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. సుమద్రపు నీరు పొలాల్లోకి వచ్చి పంటలకు నష్టం కలిగించింది. తుపాను తర్వాత ప్రభావిత ప్రాంతాల్లో విద్యుత్, తాగు నీరు సరఫరా పునరుద్ధరణకు 1,000 డీజీ సెట్లతో ట్యాంకర్లు, పీవీసీ ట్యాంకులు వినియోగించినట్లు వివరించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు జీరో ప్రాణ హాని నినాదంతో యాస్ తుపాను విపత్తు నిర్వహణ కోసం నిరంతరం కృషి చేసినట్లు ప్రత్యేక సహాయ కమిషనర్ (ఎస్సార్సీ) ప్రదీప్ కుమార్ జెనా తెలిపారు. పంటలపై తుపాను ప్రభావం యాస్ తుపాను తీవ్రతతో కోస్తా ప్రాంతంలోని పొలాల్లోకి సముద్రపు నీరు చొరబడింది. దీని ప్రభావం ఖరీఫ్ సాగుపై పడే ప్రమాదం పొంచి ఉంది. ఈ పరిస్థితులపై ఒడిశా వ్యవసాయ, సాంకేతిక విశ్వ విద్యాలయం, కేంద్రీయ వరి పరిశోధన సంస్థ పరిశోధన చేసి రైతాంగానికి సరైన మార్గదర్శకాలు జారీ చేయాలని ఎస్సార్సీ ప్రతిపాదించారు. ముగిసిన విద్యుత్ పునరుద్ధరణ యాస్ తుపానుతో 30 లక్షల మంది విద్యుత్ వినియోగదారులు ప్రభావితమయ్యారని ఆ విభాగం కార్యదర్శి తెలిపారు. 99.8 శాతం వినియోగదారులకు విద్యుత్ సరఫరా పునరుద్ధరణ కార్యకలాపాలు ముగిశాయి. 230 విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు పునరుద్ధరించారు. విద్యుత్ విభాగానికి రూ.150 కోట్ల నష్టం సంభవించిందని వివరించారు. రహదారులు ఛిన్నాభిన్నం తుపాను ప్రభావిత ప్రాంతాల్లో మే 31వ తేదీ నాటికి గొట్టపు బావులు, కుళాయి నీరు సరఫరా, పారిశుద్ధ్యం కార్యకలాపాలు ముగించినట్లు రాష్ట్ర పంచాయతీ రాజ్, తాగునీరు విభాగం తెలిపింది. యాస్ తుపాను 8 నగర, పట్టణ ప్రాంతాల్లో 58 రహదారుల్ని ఛిన్నాభిన్నం చేసింది. తుపాను ఉద్ధృతితో సముద్ర తీరం, నదీ గట్లు కోతకు గురవడంతో జల వనరుల విభాగానికి రూ.108 కోట్లు, రోడ్లు–భవనాల శాఖకు రూ.246 కోట్లు, గ్రామీణ అభివృద్ధి విభాగానికి రూ.60 కోట్ల నష్టం వాటిల్లిందని ఆయా విభాగాలు వివరించాయి. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సురేశ్‌చంద్ర మహాపాత్రో, ప్రత్యేక సహాయ కమిషనర్ ప్రదీప్ కుమార్ జెనా, యాస్ ప్రభావిత జిల్లాలు బాలాసోర్, భద్రక్, మయూర్భంజ్, కేంద్రాపడా కలెక్టర్లు, విద్యుత్, పంచాయతీ రాజ్, రోడ్లు భవనాల శాఖ అధికారులు, పాల్గొన్నారు. -
గర్భగుడిలో గుప్తనిధి.. రంగంలోకి అధికారులు..
సాక్షి, చెన్నై: ఆలయ పునరుద్ధరణ పనుల్లో లభించిన నిధి తమకే సొంతం అని ఉత్తర మేరు గ్రామస్తులు తేల్చారు. ఆ నిధిని అప్పగించాలని అధికారులు పట్టుబట్టినా, గ్రామస్తులు ఏ మాత్రం తగ్గలేదు. కాంచీపురం జిల్లా ఉత్తర మేరు గ్రామంలో పురాతన కులంబేశ్వరర్ ఆలయం ఉంది. ఈ ఆలయ జీర్ణోద్ధరణ పనులపై గ్రామస్తులు దృష్టి పెట్టారు. గర్భగుడిలో శనివారం తవ్వకాల సమయంలో సాయంత్రం 561 గ్రాములతో కూడిన ఈ బంగారు నగలు బయట పడ్డాయి. బంగారాన్ని ట్రెజరీకి అప్పగించాలని గ్రామస్తులకు కాంచీపురం జిల్లా కలెక్టర్ మహేశ్వరి ఆదేశాలు జారీ చేశారు. ఆ నిధి తమకే సొంతం అని గ్రామస్తులు ప్రకటించారు. దీంతో ఆదివారం కాంచీపురం ఆర్డీఓ దివ్య నేతృత్వంలో బృందం ఆ గ్రామానికి వెళ్లింది. చదవండి: (సీళ్లు సేఫ్.. బంగారం ‘ఉఫ్’) గ్రామస్తులను బుజ్జగించి ఆ నిధిని ట్రెజరీకి తరలించేందుకు తగ్గ ప్రయత్నం చేశారు. అయితే, గ్రామస్తులు ఏమాత్రం తగ్గ లేదు. ఆ నిధి తమ గ్రామ ఆలయానికి చెందింది అని, దీనిని ప్రభుత్వానికి అప్పగించే ప్రసక్తే లేదని తేల్చారు. వందేళ్లకు పైగా చరిత్ర కల్గిన ఈ ఆలయం చోళుల హయాంలో నిర్మించినట్టు, అయితే, ఈ ఆలయం దేవదాయశాఖ పరిధిలో లేదని, వంశపారంపర్యంగా గ్రామ పెద్దలే నిర్వహణ బాధ్యతలు నిర్వర్తిస్తున్నట్టు గ్రామస్తులు తేల్చారు. ఈ నిధి తమ ఆలయానికి సొంతమని, తమ ఆలయానికే ఉపయోగిస్తామని తేల్చడంతో పోలీసుల్ని రంగంలోకి దించాల్సి ఉంటుందని అధికారులు హెచ్చరించారు. ఒత్తిడితో వెనక్కి... పోలీసుల్ని రంగంలోకి దించేందుకు అధికార యంత్రాంగం చర్యలు తీసుకుంది. తమపై ఒత్తిడి పెరగడంతో గ్రామ పెద్దలు వెనక్కి తగ్గారు. కొందరు అప్పగింతకు వ్యతిరేకించినా, పెద్దలు దిగిరాక తప్పలేదు. అధికారులకు ఓ మెలిక పెట్టారు. నిర్మాణం, జీర్ణోద్ధరణ పనులు ముగిసినానంతరం ఆభరణాలు ఆలయానికే అప్పగించాలని, అంత వరకు ట్రెజరీలో ఉండేలా అధికారులతో ఒప్పందం కుదుర్చుకున్న అనంతరం అప్పగించారు. చదవండి: (రజనీ కోసం 28 ఏళ్లుగా ఓటు భద్రం..) -
‘యస్’పై 18న మారటోరియం ఎత్తివేత
న్యూఢిల్లీ: సంక్షోభంలో చిక్కుకున్న ప్రైవేట్ రంగ యస్ బ్యాంక్ పునరుద్ధరణ ప్రణాళిక అమల్లోకి రావడంతో మార్చి 18న బ్యాంకుపై మారటోరియం తొలగిపోనుంది. ప్రస్తుతం ఆర్బీఐ నియమిత అడ్మినిస్ట్రేటరుగా ఉన్న ప్రశాంత్ కుమార్ ఆ తర్వాత సీఈవో, ఎండీగా బాధ్యతలు చేపడతారు. ఆయన సారథ్యంలో కొత్త బోర్డు ఏర్పాటవుతుంది. పునర్వ్యవస్థీకరించిన బోర్డులో సునీల్ మెహతా (పంజాబ్ నేషనల్ బ్యాంక్ మాజీ నాన్–ఎగ్జిక్యూటివ్ చైర్మన్).. నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గాను, మహేష్ కృష్ణమూర్తి, అతుల్ భెడా నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లుగా ఉంటారు. మార్చి 13 నుంచి యస్ బ్యాంక్ పునరుద్ధరణ స్కీమ్ 2020ని అమల్లోకి తెస్తూ జారీ చేసిన నోటిఫికేషన్లో ప్రభుత్వం ఈ అంశాలు పొందుపర్చింది. ‘ప్రణాళిక అమల్లోకి తెచ్చిన మూడో పని దినం సాయంత్రం 6 గం.లకు మారటోరియం తొలగిపోతుంది. ఆ పైన 7 రోజుల తర్వాత కొత్త బోర్డు ఏర్పాటవుతుంది’ అని నోటిఫికేషన్లో పేర్కొంది. ఏప్రిల్ 3 దాకా విత్‌డ్రాయల్స్‌ను రూ. 50,000కు పరిమితం చేస్తూ మార్చి 5న యస్ బ్యాంకుపై ఆర్బీఐ మారటోరియం విధించిన సంగతి తెలిసిందే. ఎన్పీఏల ఒత్తిడి కొనసాగుతుంది.. మొండిబాకీలు తీవ్రం కావడంతో భారీనష్టాలు ప్రకటించిన యస్ బ్యాంక్ .. వచ్చే ఆర్థిక సంవత్సరంలో కూడా నిరర్థక ఆస్తుల (ఎన్పీఏ)పరమైన ఒత్తిడి కొనసాగుతుందని పేర్కొంది. అయితే, కొత్తగా వచ్చే రూ. 10,000 కోట్ల పెట్టుబడులతో బ్యాంక్ నిలదొక్కుకోగలదని, సమస్యలను అధిగమించగలదని ప్రశాంత్ కుమార్ ధీమా వ్యక్తం చేశారు. షేర్లకు మూడేళ్ల లాకిన్.. పునరుద్ధరణ ప్రణాళిక ప్రకారం.. యస్ బ్యాంక్‌లో 49 శాతం దాకా వాటాలు తీసుకునే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) వచ్చే మూడేళ్లలో తన వాటాలను 26 శాతం లోపు తగ్గించుకోవడానికి వీల్లేదు. ఇతర ఇన్వెస్టర్లు, ప్రస్తుత షేర్‌హోల్డర్ల పెట్టుబడుల్లో 75 శాతం షేర్లకు మూడేళ్ల లాకిన్ పీరియడ్ ఉంటుంది. తమ దగ్గరున్న మొత్తం షేర్లలో 25 శాతానికి మించి విక్రయించుకోవడానికి వీలు ఉండదు. అయితే, 100 లోపు షేర్లు ఉన్న వారికి ఈ లాకిన్ పీరియడ్ వర్తించదు. నోటిఫికేషన్ ప్రకారం.. యస్ బ్యాంక్‌లో 49% వాటాలు తీసుకునే ఎస్బీఐ.. ఇద్దరు డైరెక్టర్లను నామినేట్ చేస్తుంది. రిజర్వ్ బ్యాంక్ ఒకరు లేదా అదనంగా మరింత మంది డైరెక్టర్లను నియమించవచ్చు. ఎస్బీఐ మినహా 15 శాతం వోటింగ్ హక్కులు ఉన్న ఇతర ఇన్వెస్టర్లు ఒక్కొక్క డైరెక్టరు చొప్పున యస్ బ్యాంక్ బోర్డుకు నామినేట్ చేయొచ్చు. పునరుదద్ధరణ ప్రణాళిక ప్రకారం.. యస్ బ్యాంక్ అధీకృత మూలధనం రూ. 6,200 కోట్లుగా ఉంటుంది. యస్ బ్యాంక్ ఉద్యోగులు గత జీతభత్యాలు, సర్వీస్ నిబంధనల ప్రకారమే కొనసాగుతారు. అయితే ‘మేనేజ్మెంట్లో కీలక ఉద్యోగుల’ సేవలను కొత్త బోర్డు ఎప్పుడైనా ఉపసంహరించవచ్చని నోటిఫికేషన్ పేర్కొంది. క్యూ3 నష్టాలు రూ.18,654 కోట్లు భారీగా పెరిగిన మొండి భారం ముంబై: కష్టాల్లో కూరుకుపోయిన యస్ బ్యాంక్ ను తాజాగా ప్రకటించిన ఆర్థిక ఫలితాలు మరింత నిరాశపరిచాయి. ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికం(2019–20, క్యూ3)లో రూ.18,654 కోట్ల నికర నష్టాలు వచ్చాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో రూ.1,009 కోట్ల నికర లాభం నమోదైంది. మొండి బకాయిలు భారీగా పెరిగిపోవడంతో కేటాయింపులు కూడా బాగా పెరగడం, డిపాజిట్లు తరిగిపోవడంతో నికర నష్టాలు ఈ స్థాయిలో పెరిగాయి. కాగా ఈ ఏడాది క్యూ2లో నష్టాలు రూ.600 కోట్లు. స్థూల మొండి బాకీలు ఈ ఏడాది మూడో త్రైమాసికంలో రూ.40,709 కోట్లకు(18.87 శాతం) ఎగిశాయి. నికర మొండి బకాయిలు 5.97 శాతానికి చేరాయి. -
మణిహారానికి మెరుగులు
సాక్షి, హైదరాబాద్: భాగ్యనగరానికే మణిమకుటం. తెలంగాణకే తలమానికం. అదో అపురూపమై కట్టడం. నాలుగు శతాబ్దాలకుపైగా చరిత్ర దీని సొంతం. అదే చార్మినార్. హైదరాబాద్ అనగానే మొదటగా గుర్తుకు వచ్చేది ఈ అరుదైన నిర్మాణమే. నిత్యం పర్యాటకులు, సందర్శకులతో కిటకిటలాడుతూ ఉంటుంది చార్మినార్ ప్రాంతం. కాలుష్యం బారిన పడి వన్నె తగ్గడంతో చార్మినార్‌కు ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ) మరమ్మతులు చేపట్టింది. మసకబారిన మినార్లతో పాటు అక్కడక్కడ పెచ్చులూడి, పగుళ్లు ఏర్పడటంతో 2016లో మరమ్మతులకు శ్రీకారం చుట్టింది. గత అక్టోబర్ దాకా ఈ పనులు కొనసాగాయి. మరికొన్ని పనులు చేయాల్సి ఉంది. రూ.3 కోట్లు మంజూరు కావాల్సి ఉందని.. అవి వచ్చిన వెంటనే పనులు పూర్తి చేస్తామని అధికారులు చెబుతున్నారు. ఇప్పటి వరకు నాలుగు మినార్లకు మరమ్మతు పనులతో పాటు రంగులు వేశారు. వచ్చే ఏడాది మార్చి నెల వరకు పనులు పూర్తి కానున్నాయి. క్రీ.శ.1591–92లో కుతుబ్‌షాహీ వంశంలోని ఐదో పాలకుడు, హైదరాబాద్ నగర వ్యవస్థాపకుడు మహ్మద్ కులీ కుతుబ్‌షా నిర్మించిన చార్మినార్ కట్టడం గత కొన్నేళ్లుగా కాలుష్యం కారణంగా పూర్తిగా మసకబారడంతో పురావస్తు శాఖ అధికారులు మరమ్మతు పనులు చేపట్టారు. 2016–17లో ఉత్తరం– పశ్చిమం వైపు పనులు జరిగాయి. 2017–18లో దక్షిణం–పశ్చిమం వైపు, 2018–19లో ఉత్తరం–తూర్పు వైపు, దక్షిణం– తూర్పు వైపు ఇప్పటికే మరమ్మతు పనులు పూర్తయ్యాయి. రంగులు వేయాల్సి ఉంది. వచ్చే మార్చి వరకు చార్మినార్ కట్టడం బయటి గోడలకు రిపేర్ పూర్తి అవుతుంది. లోపలి గోడలకు మరమ్మతులు చేయాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. విశిష్టత ఇదీ.. కుతుబ్‌షాహీల కాలంలోని కళానైపుణ్యానికి అద్దం పట్టేలా చార్మినార్ కట్టడం చరిత్ర పుటల్లో నిలుస్తోంది. చార్మినార్‌ను తిలకించడానికి పర్యాటకులు సైతం ఉత్సాహం చూపుతున్నారు. చార్మినార్ ఒక్కో మినార్ నేల నుంచి 56 మీటర్లు ఉండగా.. రెండో అంతస్తు నుంచి 34 మీటర్ల ఎత్తులో ఉన్నాయి. ఈ మినార్లలో కూడా మళ్లీ మూడంతస్తులున్నాయి. ప్రతి మినార్‌లో కింది నుంచి పైకి వెళ్లడానికి సర్పాకారంలో 149 మెట్లున్నాయి. విరిగిపడుతున్న డిజైన్ దిమ్మెలు.. చారిత్రక చార్మినార్ కట్టడంలోని మక్కా మసీదు వైపు ఉన్న మినార్‌పై ఉన్న పూల డిజైన్ ఈ ఏడాది మే 1న రాత్రి 11.40 గంటలకు భారీ శబ్దంతో ఊడి పడింది. 2002, 2010లలోనూ చార్మినార్ కట్టడం పైఅంతస్తులోని బయటి వైపు ఉన్న పూల డిజైన్ల గచ్చులు ఊడి కింద పడ్డాయి. వెంటనే స్పందించిన పురావస్తు శాఖ అధికారులు తగిన చర్యలు చేపట్టారు. అప్పట్లో డంగు సున్నంతో ఏర్పాటు చేసిన డిజైన్ పూల గచ్చు దిమ్మెలకు చార్మినార్ కట్టడంలోని రాళ్లతో అనుసంధానం (బాండింగ్) లేకపోవడంతో సమస్యలు తలెత్తుతున్నాయని నిఫుణులు స్పష్టం చేస్తున్నారు. రాళ్లతో కట్టిన చార్మినార్ నలువైపులా గోడలు, మినార్లకు డంగు సున్నంతో డిజైన్లను ఏర్పాటు చేయడంతో పటుత్వం లేకుండాపోతోంది. ప్రస్తుతం జరిగే భారీ కట్టడాలకు స్టీల్, ఐరన్ల సపోర్టు ఇస్తూ నిర్మిస్తుండడంతో పటుత్వం కోల్పోకుండా ఏళ్ల తరబడి ఉంటున్నాయి. సున్నంతో నిర్మించినందున అప్పుడప్పుడు యాసిడ్‌తో కూడిన వర్షాలు పడుతుండడంతో రెండింటికి కెమికల్ రియాక్షన్ జరిగి రాతి కట్టడానికి డంగు సున్నానికి నడుమ గ్యాప్ ఏర్పడుతోంది. ఇలా ఏర్పడిన గ్యాప్‌లో నీరు చేరుతుండడంతో బరువు ఎక్కువై సున్నం పటుత్వాన్ని కోల్పోయి కింద పడుతోంది. జీహెచ్ఎంసీ స్థలం ఇస్తే.. జీహెచ్ఎంసీ అధీనంలోని ఖాళీ స్థలాన్ని తమకు కేటాయిస్తే చార్మినార్ కట్టడాన్ని వీక్షించడానికి వచ్చే సందర్శకులకు పలు సౌకర్యాలను ఏర్పాటు చేయడానికి పురావస్తు శాఖ ఇప్పటికే ప్రణాళికలు రూపొందించింది. ఇందులో భాగంగా ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ) హైదరాబాద్ సర్కిల్ సూపరింటెండెంట్ డాక్టర్ మిలన్ కుమార్ చావ్లే జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులకు లేఖలు రాశారు. సాధ్యమైనంత వెంటనే తమకు ఖాళీ స్థలాన్ని కేటాయిస్తే.. పర్యాటకుల సౌకర్యార్ధం టాయిలెట్లు, క్లాక్ రూంలు, టికెట్ కౌంటర్లు ఏర్పాటు చేస్తామంటున్నారు. ప్రస్తుతం చార్మినార్ కట్టడం ప్రాంగణంలో కొనసాగుతున్న టికెట్ కౌంటర్‌ను బయట ఏర్పాటు చేయడానికి అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేయనున్నారు. జీహెచ్ఎంసీ వెంటనే స్పందించి స్థలాన్ని కేటాయిస్తే.. పర్యాటకులకు మరిన్ని వసతుల కల్పనకు ఏఎస్ఐ సంసిద్ధత వ్యక్తంచేస్తోంది. పనులు చకచకా.. చార్మినార్ కట్టడానికి 2016 నుంచి మరమ్మతు పనులు చకచకా జరుగుతున్నాయి. డంగు సున్నంతో పనులు చేస్తుండటంతో అది ఆరడం కోసం సమయం పడుతోంది. గత నెల వరకు పనులు జరిగాయి. ప్రస్తుతం మిగిలిన పనుల కోసం రూ.3 కోట్ల నిధులు అవసరం. ఉన్నతాధికారులకు నివేదికలు అందజేశాం. అప్పుడప్పుడు పూల డిజైన్ల పెచ్చులు ఊడి కింద పడుతున్నాయి. వాటన్నింటికి తిరిగి మరమ్మతులు చేపట్టాం. పటుత్వం కోసం అవసరమైన చోట స్టీల్ రాడ్లతో సపోర్ట్ ఏర్పాటు చేసి మరమ్మతులు చేశాం. బయట పనులు పూర్తయితే.. వచ్చే ఏడాది లోపల పనులు ప్రారంభిస్తాం. జీహెచ్ఎంసీ ఖాళీ స్థలం కేటాయిస్తే.. పర్యాటకుల సౌకర్యార్థం మరిన్ని అభివృద్ధి చేస్తాం. – మిలన్ కుమార్ చావ్లే, ఏఎస్ఐ, హైదరాబాద్ సర్కిల్ సూపరింటెండెంట్ -
తిరుమల ఘాట్ రోడ్డులో పనులు ప్రారంభం
తిరుమల : తిరుపతి నుంచి తిరుమలకు వెళ్లే రెండో ఘాట్‌లో 15వ కిలోమీటరు భాష్యకార్ల సన్నిధి వద్ద మంగళవారం ‘భూమి’ అనే ఇంజనీరింగ్ సంస్థ పునరుద్ధరణ పనులు ప్రారంభించింది. ఈ సందర్భంగా చెన్నై నుంచి ప్రత్యేక యంత్రాలు తెప్పించారు. ముందుగా అమర్చిన పైపుల ద్వారా గ్రౌటింగ్, యాంకరింగ్ పద్దతుల్లో పనులు ప్రారంభించారు. సుమారు 360కిపైగా బొరియలు వేసి అందులో సిమెంట్‌ను గ్రౌట్ పద్దతుల్లో పగుళ్లను పూడుస్తారు. తర్వాత గోడ మొత్తాన్ని యాంకరింగ్ పద్ధతిలో పూర్తిస్థాయిలో పటిష్టత చేకూరుస్తారు. ఈ పనులు సుమారు నెలరోజులపాటు సాగే అవకాశం ఉంది. అయినప్పటికీ ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా పనులు కొనసాగించేలా టీటీడీ ఇంజనీర్లు ఏర్పాట్లు చేశారు.