న్యూఢిల్లీ: మణిపూర్‌లో ప్రార్థనా స్థలాల రక్షణకు తీసుకున్న చర్యలను తాము ఏర్పాటు చేసిన ప్రత్యేక కమిటీకి వివరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది.
ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ సారథ్యంలోని ధర్మాసనం మణిపూర్‌లో ప్రార్థనాస్థలాల పునరుద్ధరణ అంశంపై శుక్రవారం విచారణ చేపట్టింది. వర్గ హింసలో దెబ్బతిన్న, ధ్వంసమైన మత సంబంధ నిర్మాణాలపై రెండు వారాల్లోగా కమిటీకి సమగ్ర వివరాలను అందించాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఉత్తర్వులు జారీ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment