protection of assets
-
‘మణిపూర్’పై ఏం చర్యలు తీసుకున్నారు: సుప్రీం
న్యూఢిల్లీ: మణిపూర్లో ప్రార్థనా స్థలాల రక్షణకు తీసుకున్న చర్యలను తాము ఏర్పాటు చేసిన ప్రత్యేక కమిటీకి వివరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ సారథ్యంలోని ధర్మాసనం మణిపూర్లో ప్రార్థనాస్థలాల పునరుద్ధరణ అంశంపై శుక్రవారం విచారణ చేపట్టింది. వర్గ హింసలో దెబ్బతిన్న, ధ్వంసమైన మత సంబంధ నిర్మాణాలపై రెండు వారాల్లోగా కమిటీకి సమగ్ర వివరాలను అందించాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఉత్తర్వులు జారీ చేసింది. -
'హైదరాబాద్లో ఆస్తులకు రక్షణ కల్పించాలి'
ఢిల్లీ: సీమాంధ్రులకు చెందిన హైదరాబాద్లోని ఆస్తులకు రక్షణ కల్పించాలని బిజెపి సీమాంధ్ర నేతలు ఆ పార్టీ అధ్యక్షుడు రాజ్నాధ్సింగ్ను కోరారు. వారు ఈరోజు ఇక్కడ రాజ్నాధ్సింగ్ను కలిశారు. రాష్ట్రవిభజన జరిగితే పోలవరం ముంపు గ్రామాలను సీమాంధ్రలో కలపాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర విభజనకు బిజెపి మద్దతు పలుకులుతున్న విషయం తెలిసిందే. తెలంగాణ బిల్లు ప్రవేశపెడితే పార్లమెంటులోనూ, అసెంబ్లీలోనూ తాము మద్దతు తెలుపుతామని బిజెపి ప్రకటించింది.