బస్సెక్కాలంటేనే.. భయం భయం | Drivers are being forced to work | Sakshi
Sakshi News home page

బస్సెక్కాలంటేనే.. భయం భయం

Published Fri, Jan 9 2015 12:51 AM | Last Updated on Sat, Sep 2 2017 7:24 PM

బస్సెక్కాలంటేనే.. భయం భయం

బస్సెక్కాలంటేనే.. భయం భయం

12 లక్షల కి.మీ.లకు పైబడి తిరిగిన ఆర్టీసీ బస్సులు 30 శాతంపైనే
ఘాట్‌రోడ్‌లు, మలుపులు... కానరాని హెచ్చరికలు
డ్రైవర్స్ ఏకాగ్రతను దెబ్బతీస్తున్న టిమ్స్   ఓవర్ టైంల పేరుతో డబుల్ డ్యూటీలు..

 
 ఒకప్పుడు ఆర్టీసీలో ప్రయాణం సురక్షితం.. సుఖమయం... సుఖవంతం అనేవారు. కానీ ఇప్పుడు గాలిలో దీపమవుతోంది. భయం..భయంగా సాగుతోంది. ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందో తెలియని ఆందోళనకర పరిస్థితులు నెలకొంటున్నాయి. ఒక వైపు కాలం చెల్లిన, కండిషన్ లేని బస్సులు..మరొక వైపు రోజురోజుకు పెరుగుతున్న పని ఒత్తిడితో డ్రైవర్లు ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా భారీ ప్రాణనష్టానికి దారితీస్తున్నది. అనంతపురం జిల్లాలో బస్సు ప్రమాద ఘటనతో ఆర్టీసీ బస్సు ప్రయాణం సురక్షితమా కాదా అన్న అంశంపై సర్వత్రా చర్చ మొదలైంది.    
 
 విశాఖపట్నం: జిల్లాలో తొమ్మిది ఆర్టీసీ డిపోల పరిధిలో 1017 బస్సులున్నాయి. వీటిలో 650కు పైగా బస్సులు గ్రేటర్ విశాఖ పరిధిలోనే నడుస్తున్నాయి. ఈ బస్సులు ప్రతిరోజు 6.5 లక్షల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరవేస్తున్నాయి. సుమారు లక్షన్నర నుంచి రెండులక్షల మంది వి ద్యార్థులే ఉంటారు. అత్యధిక గి రిజన జనాభా ఉన్న జిల్లా మన ది. ఏజెన్సీలోని పాడేరు, అరకు, చోడవరం, మాడుగుల తదితర పర్యాటక ప్రాంతాలను చూసేందుకు ప్రతి ఏటా వెళ్లే లక్షలాదిమంది పర్యాటకుల్లో ఎక్కువమంది ఆశ్రయించేది ఆర్టీసీ బస్సులనే. మరి రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నిర్వహణ ఎలా ఉందో ఓసారి పరిశీలిస్తే...
 
పనిఒత్తిడికి గురవుతున్న డ్రైవర్లు

బస్సుల పరిస్థితి ఇలా ఉంటే డ్రైవర్ల పరిస్థితి మరీ దయనీయంగా ఉంది. గతంలో 8 గంటలు మాత్రమే పనిచేసే వీరు నేడు 10 నుంచి 12 గంటలు ఏకబికిన డ్రైవింగ్ చేస్తూనే ఉంటున్నారు. పైగా రెస్టాఫ్ డ్యూటీలు చేసే వారికి కూడా రెస్ట్ లేకుండా మర్నాడు మళ్లీ డ్యూటీ లు వేసేస్తున్నారు. ఉదాహరణకు గతంలో బెంగుళూరు డ్యూటీ ఐదు రోజులుండేది. దీన్ని నాలుగు రోజులకు కుదించేశారు. ఇక కాకినాడ నాన్ స్టాప్ సర్వీసు నడిపే డ్రైవర్లకు అసలు రెస్టే లేకుండా ఉం టుంది. ఇక ఓవర్ టైంలు.. డబుల్ డ్యూటీల తో డ్రైవర్లకు క్షణం తీరిక చేస్తున్నారు. వీటికితోడు కండక్టర్ల స్థానంలో టికె ట్ ఇష్యూ మిషన్స్ (టిమ్స్) ప్రవేశపెట్టడంతో డ్రైవర్లు ఒత్తిడికి గురవుతున్నారు. ఒక పక్క బస్సులు నడుపుతూనే టికెట్లు ఇచ్చుకోవడం, పైగా నిర్ణీత సమయంలోగా డిపోలకు చేరకుంటే క్రమశిక్షణ చర్యలకు గురికావల్సి వస్తుందనే భయంతో డ్రైవర్లు వలన డ్రైవింగ్‌పై ఏకాగ్రత పెట్టలేక ప్రమాదాలకు గురికావాల్సి వస్తుంది. ఏ ప్ర మాదం జరిగినా బస్సుల కండిషన్, పని ఒత్తిడిని పక్కదారి పట్టించేందుకు ఈ నెపా న్ని డ్రైవర్లపై నెట్టడం పరిపాటిగా మారుతోం దని  కార్మిక సంఘ నేతలు వాపోతున్నారు.

ఆర్టీసీ బస్సుల పరిస్థితి ఇలా ఉంటే ప్రైవేటు, స్కూల్ బస్సుల పరిస్థితి మరీ అధ్వానంగా ఉంటున్నాయి. కాలం చెల్లిన వాటిని స్కూల్ బస్సులుగా నడుపుతున్న పలు కార్పొరేట్ విద్యాసంస్థలు విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నాయి. గడిచిన 3 నెలల్లో 21 ప్రైవేటు, స్కూల్ బస్సులను సీజ్ చేయగా, కండిషన్ లేని మరో 30 బస్సులపైగా రవాణా శాఖ  కేసులు నమోదు చేసింది. ఆర్టీసీ బస్సులన్నీ కండిషన్‌లోనే ఉన్నాయని, 12 లక్షల కి లోమీటర్ల పైబడి నడిచిన బస్సులను తొలగిస్తామని ఆర్టీసీ ఆర్‌ఎం జగదీష్‌బాబు తెలిపారు.
 
 
ఒకప్పుడు ఆర్టీసీలో ప్రయాణం సురక్షితం.. సుఖమయం... సుఖవంతం అనేవారు. కానీ ఆ ప్రయాణం భయం..భయంగా సాగుతుంది. ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందో తెలియని ఆందోళనకర పరిస్థితులు కన్పిస్తున్నాయి. ఒక వైపు కాలం చెల్లిన, కండిషన్ లేని బస్సులు..మరొక వైపు రోజురోజుకు పెరుగుతున్న పని ఒత్తిడితో డ్రైవర్లు ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా భారీ ప్రాణనష్టానికి దారితీస్తుంది. అనంతపురం జిల్లా జరిగిన బస్సు ప్రమాద ఘటనతో ఆర్టీసీ బస్సు ప్రయాణం సురక్షితమా కాదా అన్న అంశంపై సర్వత్రా చర్చ మొదలైంది.
 
డొక్కు బస్సులతో చిక్కులు
 
యలమంచిలి: అనంతపురం రోడ్డు ప్రమాదం నేపథ్యంలో కాలం చెల్లిన బస్సుల వల్ల ఏ క్షణంలో ఏ ఉపద్రవం ముంచుకొస్తుందోనన్న భయం వ్యక్తమవుతోంది. ఊడిన బాడీరేకులు, కమాన్‌పట్టీలు, బస్సులో అడుగు భాగాన పడ్డ రంధ్రాలు... ఇలా ఒక్కో డిపోలో కాలం చెల్లిన బస్సుల సంఖ్య పదుల్లోనే ఉంది. ఇవి తరచూ మొరాయిస్తున్నాయి. అప్పుడప్పుడు అదుపు తప్పి ప్రమాదాలకు గురవుతున్నాయి. ఆర్టీసీ నిబంధనల ప్రకారం ఒక్కో బస్సు 9 లక్షల కిలోమీటర్లు నడపాలి. ఇటీవల దీనిని 10 లక్షల కిలోమీటర్లకు పెంచారు. ఎక్స్‌ప్రెస్ బస్సు 12 లక్షల కిలోమీటర్లు నడపాలి. కాలపరిమితి పూర్తవగానే ఇలాంటి బస్సులను సంబంధిత ఆర్టీసీ వర్క్‌షాపునకు పంపాలి. అక్కడ ఇలాంటి కాలం చెల్లిన బస్సులను ధ్వంసం చేసి ఇంజిన్, ఇతర విడిభాగాలను విక్రయిస్తారు. వాటి స్థానంలో కొత్త బస్సులను డిపోలకు పంపిస్తారు. ఇపుడీ ప్రక్రియ ఏమాత్రం సజావుగా సాగడం లేదు. గత ఆరు నెలల కాలంలో జిల్లాలోని పలు ప్రాంతాల్లో పల్లె వెలుగు, మెట్రో, పాసింజర్ బస్సులు అనేకసార్లు ఆగిపోయాయి. వీటికి మరమ్మతు చేపట్టేవరకు, లేదా వేరొక బస్సులోకి ప్రయాణికులను ఎక్కించే వరకు ఎదురుచూపులు తప్పడం లేదు. ఇటీవల యలమంచిలి బస్‌కాంప్లెక్స్‌లో విశాఖ - యలమంచిలి మెట్రో బస్సు ఆగిపోయింది. దీనికి మరమ్మతు పనులు చేపట్టినప్పటికీ స్థానికుల సహాయంతో గంటసేపు అటు ఇటు నెట్టితే తప్ప ఇంజన్ స్టార్ట్ కాలేదు. ఇక పల్లె వెలుగు బస్సుల సంగతి సరేసరి. అవి ఎప్పుడు ఆగిపోతాయో ఎవరికీ తెలియని పరిస్థితి.
 
మూడేళ్లలో 37 ప్రమాదాలు

 
ద్వారకానగర్: విశాఖ రీజియన్‌కు సంబంధించి మూడు సంవత్సరాలలో 37 ప్రమాదాలు జరిగాయి. సూపర్ డీలక్స్, డీలక్స్, లగ్జరీ బస్సులే ఎక్కువ ప్రమాదాలకు గురయ్యాయని విశాఖపట్నం డిపో మేనేజర్ అల్లాడ గంగాధర్‌రావు తెలిపారు. అనంతపురం ప్రమాదం నేపథ్యంలో గురువారం ఆర్టీసీ అధికారులు బస్సుల భద్రతపై సమీక్ష నిర్వహించారు. వేగాన్ని పెంచకుండా పరిమిత హాల్ట్‌లతో ప్రయాణికులను సకాలంలో గమ్యాలకు చేర్చాలన్నది అధికారుల సరికొత్త వ్యూహం. దూర ప్రాంతాలకు వెళ్లే ఏసీ సర్వీసులన్నింటి వేగాన్ని గంటకు వంద కిలోమీటర్లకు నియంత్రించారు. ఇటీవల జరుగుతున్న ప్రమాదాలను దృష్టిలో పెట్టుకొని వేగం కంటే భద్రతకే అధిక ప్రాధాన్యతమిస్తున్నట్టు ఆర్టీసీ అధికారులు తెలిపారు.
 
జరిగిన ప్రమాదాలివీ...

ఏడాదిన్నర క్రితం అరకు నుంచి విశాఖపట్నం వచ్చే డీలక్స్ బస్సు ఘాట్ రోడ్డు నుంచి కిందపడి ప్రమాదానికి గురైంది. ప్రయాణికులు తీవ్ర గాయాల పాలయ్యారు.

గత ఏడాది హైదరాబాద్ నుంచి విశాఖ వస్తున్న సూపర్ లగ్జరీ బస్సు అతివేగంతో డివైడర్‌ను ఢీకొని ప్రమాదానికి లోనైంది.

పాడేరు, నర్సీపట్నం, అనకాపల్లి డిపోల్లో ఎక్కువగా పాడైపోయిన డొక్కు బస్సులను లోతట్టు ప్రాంతాలకు మాత్రమే పరిమితం చే స్తున్నారు. దీంతో అవి బయలు దేరిన వేళా విశేషం బాగుంటే సక్రమంగా తిరిగి వస్తాయి...లేకపోతే ఎక్కడ ఆగిపోతాయో ఎలాంటి ప్రమాదాలకు గురవుతాయో తెలియని పరిస్థితి.

సిటీ పరిధిలో తిరిగే సాధారణ సిటీ బస్సుల్లో 45 శాతం కండిషన్ బాగులేనివే. వాల్తేరు, సింహాచలం, గాజువాక డిపోల్లో ఎక్కువగా ఉన్నాయి.
 
ఘాట్ రోడ్డులో దేవుడే దిక్కు
 
పాడేరు: ఏజెన్సీ రోడ్లు అధ్వానంగా ఉండటంతో ప్రయాణం భయానకంగా మారింది. పాడేరు నుంచి సీలేరు వరకు పోయే రోడ్డులో కొక్కిరాపల్లి, జీకేవీధి నుంచి సీలేరు పోయే 50 కి.మీ రోడ్డు పూర్తిగా శిథిలమైంది. రక్షణ గోడలు కూడా ధ్వంసమవడంతో ఆర్టీసీ బస్సులతోపాటు ప్రైవేటు వాహనాల్లో ప్రయాణం ప్రమాదకరంగా మారింది. పాడేరు నుంచి మైదాన ప్రాంతాలకు పోయే ఘాట్ రోడ్డులో కూడా పలు చోట్ల రక్షణ గోడలు ధ్వంసమయ్యాయి. ఏసు ప్రభువు విగ్రహం ఉన్న మలుపు వద్ద రక్షణ గోడతోపాటు రోడ్డు కోతకు గురవడంతో ఏడాది నుంచి ఇక్కడ భయంభయంగానే వాహనాలను నడుపుతున్నారు. ఏజెన్సీ 11 మండలాల్లో సర్వీసు చేస్తున్న పాడేరు డిపోకు చెందిన 40 ఆర్టీసీ బస్సుల్లో 22 తరచు మరమ్మతులకు గురవుతున్నాయి. ఘాట్ రోడ్లపై 6 లక్షల కిలోమీటర్లు తిరిగిన బస్సులను వెంటనే మైదాన ప్రాంతాలకు తరలించి వాటి స్థానంలో కొత్తబస్సులను రప్పించాలనే నిబంధనలను ఆర్టీసీ యాజమాన్యం పట్టించుకోవడం లేదు. ఆర్టీసీ బస్సులు నడవని ప్రధాన రోడ్లలో గిరిజనులంతా ప్రైవేటు వాహనాలపైనే ఆధారపడుతున్నారు. ప్రైవేటు జీపుల ఆపరేటర్లు నిబంధనలకు విరుద్ధంగా 15 మంది ప్రయాణించాల్సిన జీపుల్లో 30 నుంచి 40 మంది వరకు ఎక్కించుకొంటున్నారు. దీంతో తరచు ప్రమాదాలు జరుగుతున్నాయి    
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement