తిరుమల ఘాట్ రోడ్డులో మళ్లీ మంటలు
Published Fri, Jul 18 2014 8:35 PM | Last Updated on Thu, Sep 13 2018 5:11 PM
తిరుమల: తిరుమల ఘాట్ రోడ్డులో మళ్లీ మంటలు చెలరేగాయి. శేషాచల అడవుల్లోని తిరుమల మొదటి ఘాట్ రోడ్డులోని 35వ మలుపు సమీపంలోని చిట్టడుగు అటవీప్రాంతంలో మంటలు చెలరేగినట్టు టీటీడీ అధికారులు తెలిపారు.
మంటల్ని అదుపులోకి తెచ్చేందుకు ఫైర్ సిబ్బంది పనుల్లో నిమగ్నమయ్యారు. ఇతర ప్రాంతాలకు మంటలు వ్యాప్తి చెందకుండా ఫైర్ సిబ్బంది చర్యలు చేపట్టారు. గతంలో శ్రీవారి మెట్టుకు సమీపంలోని నారాయణ గిరి పర్వత శ్రేణుల్లో మంటలు చెలరేగిన సంగతి తెలిసిందే.
Advertisement
Advertisement