చెన్నై, తిరువళ్లూరులో విద్యాసంస్థలకు సెలవు | Schools, colleges to remain closed on Monday in Chennai, Tiruvallur due to heavy rain | Sakshi
Sakshi News home page

చెన్నై, తిరువళ్లూరులో విద్యాసంస్థలకు సెలవు

Published Mon, Oct 21 2013 9:27 AM | Last Updated on Fri, Sep 1 2017 11:50 PM

చెన్నై, తిరువళ్లూరులో విద్యాసంస్థలకు సెలవు

చెన్నై, తిరువళ్లూరులో విద్యాసంస్థలకు సెలవు

చెన్నై: ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తిరునల్వేలి, కన్యాకుమారి, తూత్తుకుడి, దిండుగల్, తేని, విరుదనగర్, తిరుచ్చి, పుదుకోట్టై, నాగపట్నం, తంజావూరు, కోయంబత్తూరు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి.

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో చెన్నై, తిరువళ్లూరు, కాంచీపురం, విల్లుపురం, కడలూరుల్లో వర్షాలు కురుస్తున్నాయి. దీంతో అధికార యంత్రాంగం అప్రమత్తమయింది. చెన్నై, తిరువళ్లూరులో పాఠశాలలు, కళాశాలకు నేడు సెలవు ప్రకటించారు. రేపటి వరకు వర్షాలు కొనసాగే అవకాశముందని వాతావరణ శాఖ తెలపడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. భారీ వర్షాలపై అప్రమత్తంగా ఉండాలని అధికారులకు ప్రభుత్వం సూచించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement