సాక్షి, కృష్ణా: జిల్లాలో ఆదివారం ఉదయం నుంచి ఉరుములు, మెరుపులతో కుండపోత వర్షం కురుస్తోంది. భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఇప్పటికే మూడు రోజుల నుంచి కురుస్తున్న వానలకు జిల్లాలోని వాగులు, వంకలు పొంగిపోర్లుతున్నాయి. వర్షపు నీటితో కొన్ని చోట్ల వాగులు పొంగడంతో రహదారులపై వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. విజయవాడ నగరంలో కుండపోతగా కురుస్తున్న వానకి రహదారులు జలమయమై చిన్నపాటి చెరువులను తలపిస్తున్నాయి.
వన్ టౌన్, పాళీక్లినిక్ రోడ్డు, నక్కల రోడ్డు, గణపతిరావు రోడ్డు, గాంధీబొమ్మ సెంటర్, మహాలక్ష్మిటెంపుల్ వీధి, నైజం గేట్ సెంటర్ రోడ్డు ఇతర ప్రాంతాలు నీట మునిగాయి.రోడ్లపై మోకాలు లోతు వర్షపు నీళ్లు రావటంతో వాహన చోదకులు నానా అవస్థలు పడ్డారు. వన్ టౌన్ ప్రాంతంలోని రోటరీ నగర్‌లో ఇళ్లలోకి వర్షపు నీరు చేరాయి. దీంతో నిర్వాసితులు తీవ్ర అవస్థలు పడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment