vijaywada
-
ప్రభుత్వానికి ముందే తెలుసు
⇒ బుడమేరుకు 35 వేల క్యూసెక్కుల వరద ప్రవాహం వస్తుందని ముందు రోజే మాకు తెలుసు. 2 లక్షల మందిని పునరావాస శిబిరాలకు తరలించడం అసాధ్యమైన ప్రక్రియ. గోదావరి జిల్లాల్లో వరద వస్తుందని చెబితే.. మాకు తెలుసు, తగ్గిపోతుందిలే అని లంక గ్రామాల ప్రజలు చెబుతారు. ప్రజలు వెళ్లరనే మేము వారికి చెప్పలేదు. – శనివారం మీడియాతో రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా ⇒ బుడమేరుకు వరద వస్తోందని.. వెలగలేరు రెగ్యులేటర్ గేట్లు ఎత్తి దిగువకు విడుదల చేస్తామని శనివారం (ఆగస్టు 31) నా కంటే ముందే ఎస్ఈ, ఈఈలు ప్రభుత్వానికి సమాచారం ఇచ్చారు. ఆ తర్వాత మధ్యాహ్నం నేను తహసీల్దార్లకు ఫోన్ చేసి చెప్పా. – వెలగలేరు రెగ్యులేటర్ డీఈ మాధవ్ నాయక్ ⇒ బుడమేరు ప్రవాహ సామర్థ్యం 15 వేల క్యూసెక్కులు. అలాంటిది 40 వేల క్యూసెక్కుల వరద వచ్చింది. దీంతో గండ్లు పడ్డాయి. వెలగలేరు రెగ్యులేటర్ గేట్లు ఎత్తారు. రెండు వైపుల నుంచి వచి్చన వరద విజయవాడను చుట్టుముట్టింది. వరద వస్తుందనే సమాచారం మాకు లేదు. – మీడియాతో ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ సృజనసాక్షి, అమరావతి: బుడమేరుకు 35 వేల క్యూసెక్కుల వరద ప్రవాహం వస్తోందని ఒక రోజు ముందుగానే ప్రభుత్వానికి సమాచారం ఉందని రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా తెలిపారు. అయితే 2 లక్షల మందిని పునరావాస శిబిరాలకు తరలించడం అసాధ్యమైన ప్రక్రియ అన్నారు. ‘వరద వస్తోందని చెబితే గోదావరి జిల్లాల్లోని లంకల్లో ప్రజలెవరూ వెళ్లరు.. మాకు తెలుసులే.. ఇలాంటి వరదలెన్నిటినో చూశాం అంటారు.. అందుకే మేం ప్రజలకు చెప్పలేదు’ అని ఆర్పీ సిసోడియా శనివారం మీడియాకు అసలు విషయం చెప్పేశారు.అలాగే.. బుడమేరుకు వరద వస్తోందని.. వెలగలేరు రెగ్యులేటర్ గేట్లు ఎత్తి దిగువకు విడుదల చేస్తామని శనివారం (ఆగస్టు 31) మధ్యాహ్నం తన కంటే ముందే ఎస్ఈ, ఈఈలు ప్రభుత్వానికి సమాచారం ఇచ్చారని వెలగలేరు రెగ్యులేటర్ డీఈ మాధవ్ నాయక్ వెల్లడించారు. ఆ తర్వాత మధ్యాహ్నం తాను తహసీల్దార్లకు ఫోన్ చేసి విషయం చెప్పానన్నారు. దీన్నిబట్టి తమకు సమాచారం లేదని ఎనీ్టఆర్ జిల్లా కలెక్టర్ సృజన చెబుతున్న మాటలు అబద్ధమని ఆర్పీ సిసోడియా, మాధవ్ నాయక్ మాటలతో తేటతెల్లమైంది.బుడమేరుకు భారీ వరద ప్రవాహం వస్తుందని చంద్రబాబు ప్రభుత్వానికి ముందే తెలిసినా.. దానివల్ల ఉధృతికి భారీగా ఆస్తి, ప్రాణనష్టాలు తప్పవని తెలిసినా వారిని నిర్లక్ష్యంగా వరదకొదిలేసింది. తద్వారా 57 నిండు ప్రాణాలు పోవడానికి కారణమైంది. మరోవైపు కృష్ణా కరకట్టలోని ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసం వరదకు నీట మునగడంతో ఆయన తన మకాంను విజయవాడ కలెక్టరేట్‌కు మార్చారు. అక్కడ నుంచే బాధితులకు సాయం పేరిట తన ‘షో’ మొదలుపెట్టారు. ఆగస్టు 31 మధ్యాహ్నమే సమాచారం ఇచి్చనా.. వెలగలేరు రెగ్యులేటర్ గేట్లు ఎత్తి దిగువకు వరద ప్రవాహాన్ని వదిలేస్తామని జలవనరుల శాఖ అధికారులు శనివారం (ఆగస్టు 31) మధ్యాహ్నం లోపే సమాచారం ఇచి్చనా.. విజయవాడ, ఎనీ్టఆర్ జిల్లాలో లోతట్టు ప్రాంతాలను అప్రమత్తం చేయకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. సురక్షిత ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన శిబిరాలకు తరలించాలనే ఆలోచన కూడా చేయలేదు. ఫలితంగా విజయవాడలో బుడమేరు జలప్రళయం సృష్టించింది.ఇప్పటివరకూ వెల్లడైన సమాచారం మేరకు వరదల వల్ల 57 మంది మరణించారు. రూ.6,882 కోట్ల మేర ఆస్తి నష్టం వాటిల్లిందని ప్రాథమికంగా అంచనా వేసినట్లు ప్రభుత్వమే ప్రకటించింది. చంద్రబాబు సర్కార్ ముందే తమను అప్రమత్తం చేసి ఉంటే సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లేవారమని బాధితులు వాపోతున్నారు. తమకు జరిగిన తీవ్ర ఆస్తి, ప్రాణ నష్టాలకు ఎవరిది బాధ్యతని ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. ప్రోటోకాల్ ప్రకారం ప్రభుత్వం వ్యవహరించి ఉంటే ఇలాంటి విపత్తు సంభవించేది కాదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ప్రభుత్వ వైఫల్యం వల్లే జలప్రళయం చోటుచేసుకుందని నీటిపారుదలరంగ నిపుణులు, ప్రజాసంఘాల నేతలు మండిపడుతున్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే విపత్తు.. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావం వల్ల ఆగస్టు 30, 31 తేదీల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని ఆగస్టు 28నే భారత వాతావరణ విభాగం (ఐఎండీ) వెల్లడించింది. కర్ణాటక, మహారాష్ట్రల్లో కురిసిన వర్షాలకు ఎగువ నుంచి కృష్ణా నది భారీ వరదతో పోటెత్తింది. దీనికి తెలంగాణ, మన రాష్ట్రంలో కురిసిన వర్షాల ప్రభావంతో మూసీ, మున్నేరు, కట్టలేరు, పాలేరు తదితర వాగుల వరద కూడా తోడవడంతో ఆగస్టు 31 కృష్ణా మహోగ్రరూపం దాలి్చంది. అదే సమయంలో మరోవైపు బుడమేరు ఉప్పొంగింది. వెలగలేరు రెగ్యులేటర్ గేట్లు ఎత్తి దిగువకు వరదను విడుదల చేస్తామని ప్రభుత్వానికి జలవనరుల శాఖ అధికారులు సమాచారం ఇచ్చారు.దీన్ని రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా ధ్రువీకరించారు కూడా. వరద వస్తుందని ముందే తెలిసినా.. ప్రోటోకాల్ ప్రకారం లోతట్టు ప్రాంతాలను ఎందుకు అప్రమత్తం చేయలేదు? సురక్షిత ప్రాంతాల్లోని పునరావాస శిబిరాలకు ఎందుకు తరలించలేదు? అన్నది అంతుచిక్కడం లేదు. ప్రభుత్వం చేసిన నిర్లక్ష్యం వల్లే విపత్తు సంభవించిందని, అపార ప్రాణ, ఆస్తి నష్టానికి దారితీసిందంటూ బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
బెజవాడ ‘ప్రళయానికి’ బాబే కారణం..
-
జగన్‌ను చూసి చిన్నారి భావోద్వేగం.. కన్నీళ్లు తుడిచిన జననేత
-
KSR Live Show: తప్పంతా చంద్రబాబుదే.. నిజం ఒప్పుకున్న ఎల్లో మీడియా
-
చరిత్ర ఎరుగని విపత్తు కాదు...చంద్రబాబు సృష్టించిన విపత్తు
-
ఈ మంత్రులు అంతా ఎక్కడ?: ఆర్కే రోజా
సాక్షి, తిరుపతి: భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలంగా మారిన విజయవాడలో ప్రజల కష్టాలను చూసి గుండె తరుక్కుపోతుందన్నారు మాజీ మంత్రి ఆర్కే రోజా. వరదల్లో చిక్కుకుపోయి అవస్థలు పడుతున్న చిన్న పిల్లలు, మహిళలు, వృద్ధుల కష్టాలు వర్ణనాతీతమని పేర్కొన్నారు. ఈ మేరకు ఆమె ఓ వీడియో సందేశం విడుదల చేశారు. బాధితుల మాటలు విటుంటే నాలుగురోజుల నుండి వాళ్లు ఎంత నరకం అనుభవించారో అర్థమవుతుందని అన్నారు. కనీసం పసిబిడ్డలకు పాలు కూడా అంలేదని తెలిపారు. రోజుల తరబడి మంచి నీళ్లు కూడా అందలేదని, ఎంతమంది వరదల్లో కొట్టుకువెళ్లిపోయారో కూడా తెలియని పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు.ప్రభుత్వం విఫలం కావడం దారుణంప్రజలు ఇన్ని కష్టాలు పడటానికి, ఇంత మంది ప్రాణాలు పోవడానికి రాష్ట్ర ప్రభుత్వం వైపల్యమే కారణమని మండిపడ్డారు. త్రులు విహార యాత్రలకు వెళ్లి.. ప్రజలను వరదల్లో ముంచేశారని విమర్శించారు. విజయవాడ మునిగిపోతుంటే ప్రభుత్వం ఐదురోజులైన కనీసం ఆహారం కూడా అందించడంలో విఫలం కావడం దారుణమని అన్నారు. ఏ టీవీ చూసినా, తెలుగుదేశం పార్టీ చానళ్లు చూసినా ప్రజలు ఎంత నరక యాతన అనుభవిస్తున్నారో, జనాన్ని మూడు రోజుల పాటు ఎలా గాలికొదిలేశారో వాళ్ల మాటల్లోనే మనకు అర్థమవుతుందన్నారు. వరద సహాయ చర్యల్లో ఈ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ధ్వజమెత్తారు.ముందే అప్రమత్తం చేసి ఉంటే..‘చంద్రబాబు ఇంటికి మూడు కిలోమీటర్ల దూరంలోనే ఇంత పెద్ద విపత్తు వచ్చినా కనీసం ప్రజలను ఆదుకోలేకపోయారంటే.. ఇది ముమ్మాటికీ ఈ రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఫల్యం. కనీసం గంట ముందు అప్రమత్తం చేసినా.. విజయవాడ నగరంలోని ప్రజలు ముంపు బారిన పడేవారు కాదు. నాలుగు రోజుల పాటు కరెంట్ లేకుండా, నీళ్లు లేకుండా, ఆహారం లేకుండా కష్టాలు పడ్డారంటే...ఇంతకంటే ఘోరమైన వైఫల్యం మరొకటి ఉండదు... ముఖ్యమంత్రికి, మంత్రులు ప్రజల కష్టాల కోసం ఆలోచించడం లేదు. గత నెల 29, 30 వ తేదీల్లో సీఎం నుండి మంత్రుల వరకు అందరూ వీకెండ్ విహార యాత్రలకు ప్లాన్ చేసుకున్నారు. కానీ, 28వ తేదీనాడే వాతావరణ శాఖ భారీ వర్షాలు పడతాయి అయినా సమాచారం ఇచ్చింది. కనీసం సీఎం చంద్రబాబు కానీ హోంమంత్రి కానీ, పంచాయతీరాజ్ మంత్రి కానీ, రెవెన్యూ మంత్రికానీ, మున్సిపల్ శాఖ మంత్రి కానీ, ఇరిగేషన్ మంత్రి కానీ.. ఒక్కరంటే ఒక్కరు కూడా ఎలాంటి సమీక్ష కూడా చేయలేదు... ప్రభుత్వం భారీ వర్షాలపైనా ముందస్తు చర్యలు తీసుకోకపోవడం వలన 10 మంది ప్రాణాలు పోయాయి. వరదల కోసం కూడా ముందస్తు చర్యలు తీసుకోకపోవడం వలన ఏకంగా మూడు లక్షల మంది విజయవాడ సెంట్రల్, వెస్ట్, మైలవరం, నందిగామ, గన్నవరం, అవనిగడ్డ, పామర్రు నియోజకవర్గాల్లో జనం వరదలో చిక్కుకుపోయారు. జగనన్న హయాంలో..మా జగనన్న ప్రభుత్వంలో ఉన్నప్పుడు వర్షాలు, వరదలు, తుఫాన్లు వస్తాయన్న సమాచారం ఉంటే.. ముందుగానే సచివాలయాలు, వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రజలను అప్రమత్తం చేసే వాళ్లం. పునరావాస కేంద్రాల్లో ప్రజలకు ఆహారం, పాలు, మంచినీళ్లు అందించేవాళ్లం. అంతేకాదు వరద, తుఫాన్ బాధితులకు వాళ్ల ఇళ్లకు కూడా ఆహారం, నిత్యవసరాలు పంపిణీ చేసేవాళ్లంజగనన్న నిరంతరం అధికారులతో సమీక్షలు జరిపి, ఆయన చుట్టూ అధికారులను తిప్పుకోకుండా ప్రజలకు ముందు సహాయ చర్యలు అందేలా చేసేవారు. ఈరోజు విజయవాడ వరదల్లో అలాంటి సహాయం ఎవ్వరికైనా ఇంటికి వెళ్లి అందించారా..? అధికారులను కనీసం సీఎం కానీ, మంత్రులు కానీ ముందుగా సిద్ధం చేశారా..? మంత్రులు ఏం చేస్తున్నారు?హోంమంత్రి , విపత్తుల నిర్వహణ మంత్రి కనీసం ఈ విపత్తుపైనా అధికారులను కానీ, ఇతర శాఖలను కానీ అప్రమత్తం చేసిందా..? ఒక్క సమీక్ష అయినా ముందుగా చేసిందా..? ఇక మంత్రి లోకేష్ ఏం చేశారు. మంగళగిరిలో వర్షాలు కురిస్తే, విజయవాడలో వరద వస్తే వాళ్లను వదిలేసి హైదరాబాద్‌కు వెళ్లిపోతారా..?మున్సిపల్ శాఖమంత్రి నారాయణ ఏం చేశారు. విజయవాడలో ప్రజలను ముంచేసింది మున్సిపల్ శాఖ నిర్లక్ష్యం కాదా..? మంత్రి నారాయణ ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించండని కనీసం ఒక్క రివ్యూ మీటింగ్ అయినా పెట్టారా? ఇరిగేషన్ శాఖ మంత్రి రామానాయుడు...ప్రతిపక్షంలో ఉన్నప్పుడు డ్రామాలు తెలుసు కానీ..ఇప్పుడు ఇంత పెద్ద వరద వస్తుందని ఆ మంత్రికి తెలియదా..?జనాన్ని ముంచేస్తుందని తెలియదా? ఇంత వరద వస్తే కనీసం జనం కోసం బోట్లు కూడా సిద్ధం చేయలేదురెవెన్యూ మంత్రి నాలుగు రోజులు కనిపించలేదు..జనం వరదల్లో ఉంటే రెవెన్యూ మంత్రి సత్య ప్రసాద్ ఎక్కడో విహార యాత్రలకు వెళ్లారు. రెవెన్యూ మంత్రి ఇంత వర్షాలు వస్తాయని తెలిసి కనీసం ఒక్క సమీక్ష అయినా చేశారా..? అసలు పునరావాస కేంద్రాలు లేవు...వరదలు, వర్షాలు వస్తే రెవెన్యూ శాఖనే కీలకం. అలాంటిది ఆ మంత్రి కనీసం పట్టించుకోలేదుకేంద్రంలో చక్రం తిప్పుతాం అని చెప్పుకుంటారు. కనీసం నాలుగు రోజులుగా వరద ఉంటే ఆరు హెలికాఫ్టర్లకు మించి తెప్పించలేకపోయారు. విమానయాన మంత్రి కూడా ఈ టీడీపీ నేత రామ్మోహన్ నాయుడే ఉన్నారు కదా.. ఆయనేమో నాలుగు రోజులు కనీసం పట్టించుకోలేదు. పంచాయతీరాజ్ శాఖమంత్రి పవన్ కల్యాణ్ ఐదు రోజులైనా ఇంకా విజయవాడ వెళ్లలేదు. కనీసం వరదలపై ఆయన శాఖ అధికారులతోను, సహాయ చర్యలపైనా సమీక్ష చేయలేదుఇలా మంత్రులు, ముఖ్యమంత్రి అందరూ జనాన్ని ఎలాంటి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోకుండా గాలికివదిలేశారు. ఇప్పటికైనా గతంలో మా జగనన్న ప్రభుత్వంలో ఎలా సహాయ చర్యలు అందించామో తెలుసుకుని...వాటిని అమలు చేయండి. దయచేసి ఈ ప్రభుత్వం ప్రజలను కాపాడండి. ముందు ఆహారం, నీళ్లు అందించండని ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాను.’ అని రోజా పేర్కొన్నారు. -
Krishna Floods: వరదల నుంచి కోట వంటి రక్షణ
సాక్షి ప్రతినిధి, విజయవాడ: గతంలో చినుకు పడితే విజయవాడ కృష్ణలంక వాసులు వణికిపోయేవారు. ప్రకాశం బ్యారేజీ గేట్లు ఎత్తితే బెంబేలెత్తిపోయేవారు. కరకట్ట వెంబడి ఇళ్లను నీళ్లు ముంచెత్తడంతో జనం కంటిమీద కునుకు లేకుండా అల్లాడిపోయేవారు. మోయగలిగినన్ని సామాన్లు సర్దుకుని పునరావాస కేంద్రాలకు వెళ్లేవారు. కానీ.. ఇప్పుడు ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. దశాబ్దాలుగా కృష్ణలంక ప్రాంత ప్రజలను తీవ్ర భయాందోళనలకు గురిచేస్తున్న వరద ముంపు సమస్య శాశ్వతంగా తప్పింది.గత సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి దార్శనికత వల్ల నేడు 8లక్షల క్యూసెక్కులు వరద వచ్చినా.. ఆ విషయమే తెలియకుండా ప్రశాంతంగా తమ ఇళ్లలో ఉంటున్నారు. గతంలో ప్రకాశం బ్యారేజీ నుంచి కేవలం మూడు లక్షల క్యూసెక్కుల వరదనీరు వదిలితే చాలు... కృష్ణలంక, రాణిగారితోట, రామలింగేశ్వరనగర్, కోటినగర్, పోలీస్‌కాలనీ, రణదివెనగర్, గౌతమినగర్, నెహ్రూనగర్, చలసానినగర్, గీతానగర్, బాలాజీనగర్, ద్వారకానగర్, భూపే‹Ùగుప్తానగర్, భ్రమరాంబపురం, తారకరామానగర్ ప్రాంతాలు నీటమునిగేవి.వరద మొదలవగానే ఈ ప్రాంతాల్లోని దాదాపు 80వేల మంది ప్రజలు పునరావాస కేంద్రాలకు వెళ్లాల్సి వచ్చేది. ఈ పరిస్థితులను గమనించిన గత సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి 12 లక్షల క్యూసెక్కులు వరద వచ్చినా చుక్కనీరు ఇళ్లలోకి రాకుండా రూ.474.51 కోట్లతో కృష్ణా నది వెంబడి పద్మావతి ఘాట్ నుంచి యనమలకుదురు వరకు మూడు దశల్లో 5.66 కిలో మీటర్లు పటిష్టంగా రక్షణ గోడ నిరి్మంచారు. ఈ ప్రాంత ప్రజలకు వరద ముంపు నుంచి రక్షణ కలి్పంచడమే కాకుండా రూ.12.3 కోట్లతో రివర్ ఫ్రంట్ పార్కును అభివృద్ధి చేశారు. -
రాజ్యాంగ నిర్మాతపై 'రాజ్యోన్మాదం'
సాక్షి ప్రతినిధి, విజయవాడ: సామాజిక అభ్యున్నతి ద్వారానే దళిత వర్గాల తలరాత మారుతుందని రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేడ్కర్ నినదించి గురువారం నాటికి సరిగ్గా 95 ఏళ్లు. అణగారిన వర్గాలకు మద్దతుగా నాగ్‌పూర్‌లో 1930 ఆగస్టు 8న ఏర్పాటైన మహాసభకు దళితుల ఆరాధ్య దైవమైన అంబేడ్కర్ అధ్యక్షత వహించిన రోజే ఆ మహనీయుడి విగ్రహాన్ని లక్ష్యంగా చేసుకుని విజయవాడ నడిబొడ్డున రాష్ట్రానికి తలమానికంగా ఉన్న అంబేడ్కర్ విగ్రహంపై తెలుగుదేశం మూకలు ఉన్మాదంతో పేట్రేగిపోవడం దేశవ్యాప్తంగా యావత్ దళిత సమాజాన్ని నివ్వెరపోయేలా చేసింది. స్వయంగా ప్రభుత్వమే పూనుకుని రాజ్యాంగ నిర్మాతపై దాడికి ఉన్మత్త మూకలను ప్రేరేపించడం దేశచరిత్రలో కనీవినీ ఎరుగని దారుణం. గురువారం రాత్రి కుట్రపూరితంగా అంబేడ్కర్ మహాశిల్పం చుట్టుపక్కల విద్యుత్ సరఫరా నిలిపివేయించి, సిబ్బందిని బయటకు తరలించి.. తెలుగుదేశం మూకలు భీంరావ్ అంబేద్కర్ విగ్రహాన్ని లక్ష్యంగా చేసుకుని దాడికి తెగబడ్డాయి. రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సిన కొందరు అధికారులు, పోలీసుల సమక్షంలో ఈ సామాజిక న్యాయ మహాశిల్పాన్ని ధ్వంసం చేసేందుకు బరితెగించారు. వీరి మాటలను బట్టిచూస్తే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మంత్రి లోకేశ్ ప్రోద్బలంతోనే ఎంపిక చేసిన కొందరు అధికారుల సమక్షంలో ఇదంతా జరిగినట్లు స్పష్టమవుతోంది. నిజానికి.. గత సీఎం వైఎస్ జగన్ దీనిపై ప్రత్యేక శ్రద్ధపెట్టి రూ.404.35 కోట్లతో అంబేడ్కర్ విగ్రహాన్ని అత్యద్భుతంగా తీర్చిదిద్దారు. ఆయన చేతుల మీదుగా ఈ ఏడాది జనవరి 19న జాతికి అంకితం చేశారు. అధికారంలోకి వచ్చింది మొదలు ‘పచ్చ’మూకలు దీనిపై కన్నేశారు. ఇందులో భాగంగానే పై నుంచి వచ్చిన ఆదేశాలతో గురువారం రాత్రి 9 గంటల తర్వాత పచ్చబ్యాచ్ రంగప్రవేశం చేసింది. అక్కడున్న వారందరినీ బలవంతంగా బయటకు పంపేశారు. అందులో పనిచేసే కొందరి సిబ్బంది ఫోన్లను లాకున్నారు. మరికొందరిని ఫోన్లు స్విచ్ఛాఫ్ చేసి వెళ్లిపోమని బెదిరించారు. ఈ తతంగానికి పోలీసులే కాపాలా కాశారు. విగ్రహం నలుమూలలా పహారా కాసి, చుట్టూ గేట్లు వేసి అనుకున్న పని మొదలుపెట్టారు. ఇంతలో ఈ సమాచారం బయటకు పొక్కింది. ప్రజలు, మీడియా, అంబేడ్కర్ ఆలోచనాపరులు రావడంతో వారంతా పరారయ్యారు. అధికారుల పర్యవేక్షణలోనే ఈ దారుణానికి తెగబడడం గమనార్హం. పట్టించుకోని సీపీ.. ఈ విషయాన్ని సీపీకి తెలిపేందుకు మీడియా ప్రయత్నించినా ఆయన అందుబాటులోకి రాలేదు. మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చినా పట్టించుకోలేదు. ఘటనా స్థలికి ఆయన హుటాహుటిన చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. రాష్ట్రానికే తలమానికంగా ఉన్న అంబేడ్కర్ విగ్రహంపై దాడి చేయడం దుర్మార్గం అని ఆయన మండిపడ్డారు. ఇలాంటి చర్యలు మంచివి కాదన్నారు. అలాగే, ప్రజాస్వామ్యం ఖూనీ అయిందని ప్రజాస్వామ్యవాదులు ముక్తకంఠంతో మండిపడుతున్నారు. మరోవైపు.. పచ్చమూకల దాడిలో అంబేడ్కర్ విగ్రహ ఏర్పాటుకు గుర్తుగా అక్కడ ఏర్పాటుచేసిన బోర్డులో మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పేరుతో ఉన్న స్టీల్ మెటల్ అక్షరాలు ధ్వంసమయ్యాయి. వీటిని సుత్తులతో కొట్టి మరీ ధ్వంసం చేసినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. సామాజిక అభ్యున్నతి ద్వారానే దళిత వర్గాల తలరాత మారుతుందని రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ నినదించి గురువారం నాటికి సరిగ్గా 95 ఏళ్లు. అణగారిన వర్గాలకు మద్దతుగా నాగ్‌పూర్‌లో 1930 ఆగస్టు 8న ఏర్పాటైన మహాసభకు దళితుల ఆరాధ్య దైవమైన అంబేద్కర్ అధ్యక్షత వహించిన రోజే ఆ మహనీయుడి విగ్రహాన్ని లక్ష్యంగా చేసుకుని విజయవాడ నడిబొడ్డున తెలుగుదేశం మూకలు ఉన్మాదంతో పేట్రేగిపోవడం దేశవ్యాప్తంగా యావత్ దళిత సమాజాన్ని నివ్వెరపోయేలా చేసింది. స్వయంగా ప్రభుత్వమే పూనుకుని రాజ్యాంగ నిర్మాతపై దాడికి ఉన్మత్త మూకలను ప్రేరేపించడం దేశచరిత్రలో కనీవినీ ఎరుగని దారుణం. గురువారం రాత్రి కుట్రపూరితంగా అంబేద్కర్ మహాశిల్పం చుట్టుపక్కల విద్యుత్తు సరఫరా నిలిపివేయించి, సిబ్బందిని బయటకు తరలించి ... తెలుగుదేశం మూకలు భీంరావ్ అంబేద్కర్ విగ్రహాన్ని లక్ష్యంగా చేసుకుని దాడికి తెగబడ్డాయి. ఆ క్రమంలోనే ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల గుండెల్లో చిరస్థానం ఏర్పరచుకున్న దళితజనబాంధవుడు జగన్మోహన్రెడ్డి పేరును మహాశిల్పం శిలాఫలకంనుంచి తొలగించడం ప్రజాస్వామ్య వాదులందరినీ తీవ్రంగా కలచివేసింది. సామాజిక, ఆరి్థక, రాజకీయ స్థాయుల్లో దారుణంగా విస్తరించిన అంటరానితనంపై ముఖ్యమంత్రిగా యుద్ధభేరి మోగించిన జగన్మోహన్ రెడ్డి పేరును మహనీయుడి పాదాల చెంత ఏర్పాటైన శిలాఫలకంనుంచి తుడిచివేయడం ద్వారా పచ్చమూకలు తాత్కాలిక పైశాచికానందాన్ని పొంది ఉండవచ్చు గాక... కానీ ‘నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ’ అని పరితపించిన జగనన్నను అణగారిన వర్గాల హృదయ ఫలకాలనుంచి తొలగించడం ఈ ఉగ్రవాద తండాలకు సాధ్యమయ్యే పనేనా? -
ఓటమి భయంతో పిరికిపందలు చేసే పని...
-
అంబేద్కర్ జీవిత చరిత్ర? మ్యూజియంలో నమ్మలేని విశేషాలు
-
విజయవాడ ఎంపీ కేశినేని నానిపై దేవినేని అవినాష్ ప్రశంసలు
-
వ్యూహం ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ఏర్పాట్లు (ఫొటోలు)
-
సీనియర్ IAS పూనం మాలకొండయ్య కుమారుని వివాహ వేడుకులకు సీఎం జగన్
-
‘ఏపీలో కులగణన చారిత్రక ఘట్టం’
సాక్షి, విజయవాడ: ఏపీలో కుల గణన -2023పై ప్రాంతీయ సదస్సు విజయవాడలో జరుగుతోంది. ఈ సదస్సుకు మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, కర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్, ఎమ్మెల్యే ముస్తఫా, ఎస్సీ కమిషన్ ఛైర్మన్ మారుమూడి విక్టర్ ప్రసాద్, ఎమ్మెల్సీలు కల్పలతారెడ్డి, కె.లక్ష్మణరావు, కాపు కార్పొరేషన్ ఛైర్మన్ అడపా శేషు, విజయవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మి, పలువురు హాజరయ్యారు. ఈ సందర్బంగా మంత్రి చెల్లుబోయిన మాట్లాడుతూ..‘ఏపీలో కులగణన అనే చారిత్రక ఘట్టానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శ్రీకారం చుట్టారు. సీఎం జగన్ సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు. దేశమంతా సీఎం జగన్ ఆలోచనలను ఫాలో అవుతోంది. గతంలో మంజునాథన్ కమిషన్ ఫెయిలైంది. అందుకే సీఎం జగన్ శాశ్వత బీసీ కమిషన్‌ను వేశారు. బీహార్‌లో కులగణనకు రాజకీయ కోణం ఉంది. కానీ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీసుకున్న నిర్ణయం రాజకీయ ప్రయోజనాల కోసం కాదు. సామాజిక ప్రయోజనాల కోసం తీసుకున్న నిర్ణయం. అన్ని సామాజిక వర్గాలపై సీఎం జగన్‌కు ఎంతో గౌరవం ఉంది. గతంలో ఉద్యమాలు చేసినా కులగణన ప్రక్రియలో ఫలితాలు రాలేదు’ అన్నారు. ఎంపీ సంజీవ్ కుమార్ మాట్లాడుతూ..‘ఏపీలో కులగణనతో ఒక చరిత్ర మొదలవ్వబోతోంది. బీసీలు ఏకమైతే రాజకీయంగా బలవంతులవుతారని 70 ఏళ్లుగా మనల్ని ఎదగనివ్వలేదు. సీఎం జగన్ ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు. ఆనాడు మనకు రిజర్వేషన్లు కల్పించిన కారణజన్ముడు అంబేద్కర్. ఈనాడు కులగణనకు శ్రీకారం చుట్టి సీఎం జగన్ కారణజన్ముడయ్యాడు. ముఖ్యమంత్రి జగన్ రాజకీయాల కోసం కులగణన చేయడం లేదు. కులగణనపై రాజకీయ విమర్శలు చేయడం సరికాదు. ఏపీలో జరగబోయే కులగణన దేశానికే ఒక నిర్ధేశం అవుతుంది’. ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్ మాట్లాడుతూ.. కులగణన చేయాలని సీఎం జగన్ చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. సీఎం జగన్, మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణకు ధన్యవాదాలు. అన్ని కులాలకు మేలు జరగాలని 90 ఏళ్ల తర్వాత సీఎం జగన్ ధైర్యంగా ఒక అడుగు ముందుకేశారు. మన దేశంలో కులం అనేది ఒక కల్చరల్ ఈవెంట్ వంటిది. కులగణన జరిపే క్రమంలో పకడ్భంధీగా వ్యవహరించాలని కోరుతున్నాను. ఎమ్మెల్సీ లక్ష్మణరావు మాట్లాడుతూ..‘బీసీ కులగణన చేయాలన్న సీఎం జగన్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాను. కులగణనకు చట్టబద్ధత ఉండాలి. సచివాలయ సిబ్బందికి ఇతర ప్రభుత్వ ఉద్యోగులను జతచేసి చేయాలి. కోర్టు సమస్యలు రాకుండా ఉండాలంటే వాలంటీర్లను కులగణనలో భాగస్వామ్యులను చేయొద్దని కోరుతున్నాను. రాష్ట్రంలోని నాలుగు కమిషన్లను భాగస్వామ్యులను చేయాలి. వలస కార్మికులు, సంచార జాతులపై ప్రత్యేక దృష్టి సారించాలి. కులగణన జరిగిన తర్వాత సచివాలయాల వద్ద లిస్టులు ప్రదర్శించాలి. కులగణన జరిగే పది రోజుల్లో ఒక రోజు సెలవు ప్రకటించి ఆరోజు అందరి వివరాలు తీసుకోవాలి. ఈకేవైసీకి కులగణనకు ముడి పెట్టవద్దని కోరుతున్నా. కులగణన విజయవంతం కావాలని కోరుతున్నాను’. ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి మాట్లాడుతూ..‘కులగణన జరిగితేనే అన్ని వర్గాలకు మేలు జరుగుతుంది. కులగణనను సీఎం జగన్ రాజకీయం కోసం చేయడం లేదు. దొంగ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు పొందేవారికి కులగణనతో చెక్ పడుతుంది. సీఎం జగన్ చొరవతో 90 ఏళ్ల తర్వాత కులగణన జరగబోతోంది. కులగణన విజయవంతం కావాలని కోరుతున్నాను’. -
చిన్నారుల ఆరోగ్యానికి రక్ష
-
ఏపీకి గుడ్ న్యూస్.. మరో రీజనల్ పాస్ పోర్టు కేంద్రం ఏర్పాటు
సాక్షి, విజయవాడ: ఏపీ ప్రజలకు మరో గుడ్ న్యూస్. విజయవాడ కేంద్రంగా త్వరలో రీజనల్ పాస్ పోర్ట్ కార్యాలయం ప్రారంభం కానుంది. ఈ విషయాన్ని రీజనల్ పాస్ పోర్టు ఆఫీసర్ శివ హర్ష ఈరోజు అధికారికంగా ప్రకటించారు. ప్రస్తుతం ఉన్న పాస్ పోర్ట్ సేవా కేంద్రానికి అదనంగా విజయవాడ బందర్ రోడ్డులో రీజనల్ పాస్ పోర్ట్ కార్యాలయం ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. కాగా, శివ హర్ష శనివారం మీడియాతో మాట్లాడుతూ..‘రీజనల్ పాస్ పోర్టు సేవా కేంద్రానికి రోజుకు రెండు వేల అప్లికేషన్స్ వస్తున్నాయి. కోవిడ్ తరువాత పాస్ పోర్ట్ అప్లికేషన్స్ సంఖ్య గణనీయంగా పెరిగింది. అక్టోబర్ నెల వరకు మూడు లక్షల పాస్ పోర్టులు జారీ చేశాం. పోస్టల్, పోలీసు శాఖల భాగస్వామ్యంతో పాస్ పోర్టులు త్వరితగతిన అందజేస్తున్నాం. విజయవాడ రీజనల్ ఆఫీసు కేంద్రంగానే ఇక పై పాస్ పోర్ట్ ప్రింటింగ్ ప్రారంభమవుతుంది. విజయవాడలో ఆఫీసు ప్రారంభం కావడం వల్ల త్వరగా సేవలు అందుతాయి. మరో రెండు మూడు నెలల్లోనే రీజనల్ పాస్ పోర్టు కార్యాలయం ప్రారంభిస్తాం. గతం కంటే ప్రస్తుతం పాస్ పోర్టు సేవలు సులభతరం చేశాం. తక్కువ సమయంలోనే పాస్ పోర్టులు అందజేస్తున్నాం. దయచేసి ఎవరూ ఫేక్ సైట్లు, బ్రోకర్లను నమ్మకండి’ అని సూచించారు. ఇది కూడా చదవండి: రాష్ట్రంలో మహిళా ఓటర్లే అధికం -
విజయవాడలో నేడు పోలీస్ అమరవీరుల సంస్మరణ దినం
-
పేదవాడికి పెత్తందారుడికి మధ్య యుద్ధం జరగబోతోంది
-
Live: విజయవాడలో వైఎస్ఆర్ సీపీ ప్రతినిధుల సభ
-
చంద్రబాబు న్యాయవాది..సిద్ధార్థ్ లూథ్రా వాదనలు..
-
Live: సీఎం వైఎస్ జగన్ విజయవాడ పర్యటన
-
చలో విద్యుత్ సౌద మహాధర్నాకు అనుమతి లేదు: సీపీ కాంతి రానా
-
భారీ వర్షాలతో కృష్ణానదికి పోటెత్తిన వరద నీరు
-
ప్రతిభ కలిగిన విద్యార్థులకు రాష్ట్రస్థాయిలో సన్మానం
-
గుడివాడలో వైఎస్ఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన సీఎం జగన్
-
విజయవాడలో దొంగల బీభత్సం
-
నేను ఓ జోక్ చెప్పడానికే బెజవాడ వచ్చాను: రాంగోపాల్ వర్మ
-
విజయవాడలో వైభవంగా శ్రీ మహాలక్ష్మి యజ్ఞం
-
విజయవాడలో బయటపడ్డ టీడీపీ నేతల దారుణాలు
-
సాధికారతకు జయహో
-
Solar Eclipse: 22 ఏళ్ల తర్వాత అరుదైన సూర్య గ్రహణం
సాక్షి, తిరుపతి/విజయవాడ: దాదాపు రెండు దశాబ్దాలు తర్వాత అరుదైన సూర్య గ్రహణం ఈ రోజు ఏర్పడుతోంది. ఇది కేతు గ్రస్త సూర్య గ్రహణం కావడం విశేషం. సహజంగా రాహు, కేతు ప్రభావంతో ఏర్పడే గ్రహణాల్లో రాహు ప్రభావంతో ఏర్పడే దానిని రాహు గ్రస్తమని, కేతు ప్రభావంతో ఏర్పడే దానిని కేతు గ్రస్తమని అంటారు. సూర్య గ్రహణం సాయంత్రం 4 గంటల 29 నిమిషాలకు ప్రారంభమై సూర్యాస్తమయం తర్వాత కూడా ఉంటుంది. ఈ గ్రహణ కాలం దాదాపు గంట 15 నిముషాలు పాటు ఉంటుందని పంచాగకర్తలు చెబుతున్నారు. సూర్య గ్రహణం కారణంగా తిరుమల శ్రీవారి ఆలయ ద్వారాలు మూసివేయనున్నారు. ఉదయం 8 గంటల నుంచి రాత్రి 7.30 గంటల వరకు మూసివేయనున్నారు. చదవండి: AP: మహిళలకు బ్యాంకుల రెట్టింపు రుణాలు ఉదయం 11 గంటలకు విజయవాడ దుర్గగుడి పాటు ఉపాలయాలు మూసివేయనున్నారు. నేడు ప్రదోషకాలంలో నిర్వహించే సేవలు కూడా రద్దు చేశారు. రేపు(బుధవారం) స్నపనాభిషేకాలు, అర్చన, హారతి, మహానివేదన అనంతరం మధ్యాహ్నం 12 గంటల నుంచి దర్శనాలకు అనుమతించనున్నారు. రేపు ఉదయం నిర్వహించే అన్ని ఆర్జిత సేవలు రద్దు చేశారు. రేపు సాయంత్రం పంచహారతులు,పల్లకీ సేవ మాత్రమే ఆలయ అర్చకులు నిర్వహించనున్నారు. వైఎస్సార్ జిల్లా ఒంటిమిట్ట కోదండ రామాలయం ఆలయ తలుపులు మూసివేయనున్నారు. సూర్యగ్రహణం సందర్భంగా ఆలయాన్ని ఉదయం 9 నుండి సాయంత్రం 7 గంటల వరకు మూసివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. పుణ్యా వచనం, స్వామివారికి అభిషేకం తరువాత దర్శనానికి భక్తులను అనుమతించనున్నారు. సూర్య గ్రహణం కారణంగా శ్రీశైల మల్లన్న ఆలయ ద్వారాలు, స్వామి, అమ్మవారి ఉభయ దేవాలయాల ద్వారాలను అధికారులు మూసివేశారు. తిరిగి సాయంత్రం 6:30 గంటలకు ఆలయ ద్వారాలు తెరచి ఆలయశుద్ధి,సంప్రోక్షణ చేయనున్నారు. రాత్రి 8 గంటల నుంచి భక్తులకు స్వామివారి అలంకార దర్శనానికి అనుమతి ఇవ్వనున్నట్లు ఆలయ ఈవో తెలిపారు. యాదాద్రి ఆలయం మూసివేత యాదాద్రి భువనగిరి జిల్లా: సూర్య గ్రహణం సందర్భంగా యాదాద్రి ఆలయం మూసివేయనున్నారు. ఉదయం 8:50 గంటల నుంచి రేపు ఉదయం 8 గంటల వరకు ఆలయాన్ని మూసివేయనున్నారు. నిత్య, శాశ్వత కల్యాణం, శాశ్వత బ్రహ్మోత్సవం రద్దు చేశారు. రేపు(బుధవారం) స్వాతి నక్షత్రం సందర్బంగా నిర్వహించే శత ఘట్టాభిషేకం, సహస్రనామార్చనను రద్దు చేశారు. రేపు ఉదయం సంప్రోక్షణ నిర్వహించి 10:30 గంటలకు ఆలయాన్ని తెరవనున్నారు. అనంతరం యాథావిధిగా నిత్య కైంకర్యాలు మొదలు కానున్నాయి కానున్నాయి -
చలో విజయవాడకు అనుమతి లేదు
విజయవాడ: ఉపాధ్యాయ సంఘాల నాయకులు ఈ నెల 25వ తేదీన విజయవాడలో నిర్వహించ తలపెట్టిన చలో విజయవాడ, సీఎం కార్యాలయ ముట్టడి కార్యక్రమానికి అనుమతి మంజూరు చేయలేదని విజయవాడ నగర పోలీస్ కమిషనర్ టి.కె.రాణా తెలిపారు. ఆయన ఆదివారం విలేకరులతో మాట్లాడారు. శాంతిభద్రతల పరిరక్షణ దృష్ట్యా ఈ కార్యక్రమానికి అనుమతి ఇవ్వలేదని స్పష్టం చేశారు. నగరంలో 30 పోలీస్ యాక్ట్, 144 సీఆర్పీసీ ఆంక్షలు అమలులో ఉన్నాయని తెలిపారు. ఈ నిబంధనలు అతిక్రమించవద్దని ఉపాధ్యాయ సంఘాల నాయకులకు సూచించారు. ఈ ఆంక్షలు ఉల్లగించిన వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇప్పటికే పలువురికి ముందస్తుగా నోటీసులు ఇచ్చామన్నారు. ఈ విషయాలను పరిగణలోకి తీసుకుని చలో విజయవాడ కార్యక్రమాన్ని విరమించుకోవాలని సూచించారు. -
గురువారం బెంజ్ సర్కిల్ పశ్చిమ ఫ్లైఓవర్ ప్రారంభోత్సవం
-
ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎండీ రుహుల్లాను ఖరారు చేసిన సీఎం జగన్
సాక్షి, విజయవాడ: అనారోగ్యంతో ఇటీవల మృతిచెందిన ఎమ్మెల్సీ మహ్మద్ కరీమున్నీసా స్థానంలో ఆమె కుమారుడు రుహుల్లాను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఖరారు చేశారు. సీఎం నిర్ణయంతో ఎమ్మెల్సీ కార్యాలయం వద్ద సంబరాలు నిర్వహించారు. ఎండీ రుహుల్లా, కార్పొరేటర్ షాహీన సుల్తానా సీఎం జగన్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం ఎండీ రుహుల్లా మీడియాతో మాట్లాడుతూ.. జీవిత కాలం సీఎం జగన్‌కి రుణపడి ఉంటాము. స్వర్గీయ ఎమ్మెల్సీ కరిమున్నీసా ఆశయాలను నెరవేరుస్తాం. మైనార్టీల సమస్యలు పరిష్కారమే ధ్యేయంగా పనిచేస్తానని ఎండీ రుహుల్లా అన్నారు. చదవండి: (CM YS Jagan: సీఎం వైఎస్ జగన్ నూతన ఏడాది కానుక) -
మూడు నెలలుగా సహజీవనం.. మనస్పర్థల కారణంగా ఆత్మహత్య
సాక్షి, గన్నవరం: యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆదివారం జరిగింది. గన్నవం పోలీసుల సమాచారం మేరకు.. విజయవాడ రూరల్ మండలం గూడవల్లికి చెందిన సొంగా శశి, జి.మండలం కవులూరుకు చెందిన కంచర్ల అహల్య (22) రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. వారిద్దరూ బంధువులే. అహల్య కుటుంబ సభ్యులు వారి ప్రేమను అంగీకరించలేదు. కొండపల్లిలో ఉంటూ బ్యూటీషియన్‌గా పనిచేస్తున్న అహల్య మూడు నెలలు క్రితం గూడవల్లి వచ్చి శశితో సహజీవనం చేస్తోంది. చదవండి: ప్రాణాలు తీసిన ‘పార్టీ’ ఈ నేపథ్యంలో వారి మధ్య విభేదాలు తలె త్తాయి. దీంతో అహల్య ఆదివారం ఇంటిలో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. కొద్ది సేపటికి శశి కుటుంబ సభ్యులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనాస్థలాన్ని సందర్శించి మృతదేహాన్ని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని ఎస్ఐ రమేష్‌బాబు తెలిపారు. -
ఆ ప్రాంతాల్లో నిత్యావసరాల పంపిణీకి ఏపీ ప్రభుత్వం ప్రత్యేక ఆదేశాలు
సాక్షి, విజయవాడ: వరద ప్రభావిత జిల్లాల్లో నిత్యవసరాల పంపిణీకి ప్రభుత్వం ప్రత్యేక ఆదేశాలు జారీ చేసింది. దీంతో వరద బారిన పడిన కుటుంబాలకు 25 కిలోల బియ్యం, కేజీ కందిపప్పు, లీటర్ వంటనూనె, కేజీ ఉల్లిగడ్డలు, కేజీ బంగాళా దుంపలు పంపిణీ చేయనున్నారు. వీటన్నిటిని కూడా బాధితులకు ఉచితంగా అందించనున్నారు. చదవండి: (మరోసారి మానవత్వాన్ని చాటుకున్న సీఎం జగన్) -
మరోసారి మానవత్వాన్ని చాటుకున్న సీఎం జగన్
సాక్షి, విజయవాడ: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మరోసారి మానవత్వాన్ని చాటుకున్నారు. హైదరాబాద్ నుంచి తిరిగి వచ్చిన సీఎం, గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి తాడేపల్లి నివాసానికి వెళుతుండగా విజయవాడ శివారు ఎనికేపాడు వద్ద 108 అంబులెన్స్ వేగంగా వెళ్లాల్సి వచ్చింది. దీనిని గమనించిన సీఎం తన కాన్వాయ్‌ని స్లో చేయించి అంబులెన్స్‌కు రూట్ క్లియర్ చేయించారు. దీంతో అంబులెన్స్ వేగంగా కాన్వాయ్‌ని దాటి ముందుకెళ్ళింది. చదవండి: (ఒకే వేదికపై రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలు..) -
వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ కన్నుమూత
సాక్షి, విజయవాడ: కృష్ణా జిల్లా ఎమ్మెల్సీ ఎండీ కరీమున్నిసా గుండెపోటుతో శుక్రవారం అర్థరాత్రి మృతి చెందారు. శాసనమండలి సమావేశానంతరం ఇంటికి వచ్చిన ఆమె రాత్రి 11.30 గంటల సమయంలో ఛాతిలో నొప్పి వస్తోందని చెప్పడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన విజయవాడలోని రెండు హాస్పటల్స్‌కు తరలించినా ఫలితం లేకపోయింది. వైఎస్సార్సీపీ ఆవిర్భావం నుంచి కరీమున్నీసా పార్టీకోసం నిరంతరం శ్రమించారు. ఈ ఏడాది ఎమ్మెల్సీగా ఆమెకు సీఎం జగన్ అవకాశం కల్పించారు. శుక్రవారం ఉదయం శాసనమండలిలో ఆమె సీఎం జగన్, శాసనమండలి చైర్మన్ మోషేన్ రాజును కలిశారు. కరీమున్నీసాకు భర్త, ఐదుగురు కుమారులు ఉన్నారు. సీఎం వైఎస్ జగన్ సంతాపం ► ఎమ్మెల్సీ కరీమున్నీసా హఠాన్మరణం పట్ల సీఎం జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ‘ నా సోదరి మహ్మద్ కరీమున్నీసా ఆకస్మిక మరణం తీవ్రంగా కలిచివేసింది. నిన్న శాసనమండలికి హాజరై రాత్రి అకస్మాత్తుగా గుండెపోటుకు గురై మరణించడం బాధాకరం. ఆమె కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి. వారికి నాతో సహా పార్టీ అండగా ఉంటుంది’ అని ట్విటర్ ద్వారా పేర్కొన్నారు. నా సోదరి మహ్మద్ కరీమున్నీసా ఆకస్మిక మరణం నన్ను తీవ్రంగా కలచివేసింది. నిన్న శాసనమండలికి హాజరై రాత్రి అకస్మాత్తుగా గుండెపోటుకు గురై మరణించడం చాలా బాధాకరం. ఆమె కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నా. వారికి నాతో సహా పార్టీ అండగా ఉంటుంది. — YS Jagan Mohan Reddy (@ysjagan) November 20, 2021 -
విజయవాడలో మొదలైన దీపావళి సందడి
-
విజయవాడ పీఎన్ బీఎస్ లో దారుణం
-
సీఎంపై పట్టాభి అనుచిత వ్యాఖ్యలకు వ్యతిరేకంగా నిరసనలు
-
సామాన్యులకు షాక్.. మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
న్యూఢిల్లీ: రోజు రోజుకి పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరల వల్ల సామాన్యుడు బతుకు జీవుడా అంటూ బతుకు కొనసాగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. రోజు రోజుకి పెరిగి పోతున్న ఈ ధరల వల్ల సామాన్యుడు ఉక్కిరిబిక్కిరి అవుతున్నాడు. తాజాగా మరోసారి పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. పెట్రోల్ ధరలు 20 పైసలు పెరగగా, డీజిల్ మంగళవారం 25 పైసలు పెరిగింది. ఈ పెంపు తర్వాత ఢిల్లీలో పెట్రోల్ ధర లీటరుకు రూ.101.39కు చేరుకుంది. దేశ రాజధానిలో ఒక లీటర్ డీజిల్ ను రూ.89.57కు విక్రయిస్తున్నారు. భారతదేశ ఆర్థిక రాజధాని ముంబైలో పెట్రోల్ ధర లీటరుకు రూ.107.47, డీజిల్ ధర లీటరుకు రూ.97.21గా ఉన్నాయి. గత రెండు నెలల వ్యవధిలో పెట్రోల్ ధరలు పెరగడం ఇది తొలిసారి కాగా.. డీజిల్ ధరలు నాలుగోసారి. అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు దాదాపు మూడేళ్ల గరిష్ఠానికి చేరాయి. గత కొన్ని రోజులుగా అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు భారీగా పెరిగి పోతున్నాయి. దీంతో దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలను ప్రభుత్వ రంగ చమురు సంస్థలు పెంచాయి. బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ బ్యారెల్ 17 సెంట్లు లేదా 0.2 శాతం తగ్గి 79.36 డాలర్లకు చేరుకుంది. కరోనా మహమ్మారి భయాలు తగ్గడం, వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాన్ని క్రమ క్రమంగా తొలిగించడంతో ఇంధన ధరలకు అంతర్జాతీయంగా డిమాండ్ ఏర్పడింది.(చదవండి: 35వేల కోట్ల జరిమానా సరే! యాపిల్ సంగతేంది?) దేశంలోని ప్రధాన నగరాల్లో లీటర్ డీజిల్, పెట్రోల్ ధరలు.. City Name Petrol Price Diesel Price హైదరాబాద్ 105.48 97.46 విజయవాడ 107.54 99.25 విశాఖపట్నం 106.77 98.51 ఢిల్లీ 101.39 89.57 ముంబై 107.47 97.21 బెంగళూరు 104.92 95.06 చెన్నై 99.15 94.17 -
Vijayawada: నేడు, రేపు వాణిజ్య ఉత్సవం - 2021
సాక్షి, కృష్ణా: రాష్ట్ర వాణిజ్య ఎగుమతులను రెట్టింపు చేయడమే లక్ష్యంగా ‘వాణిజ్య ఉత్సవం-2021’ నేడు(మంగళవారం) విజయవాడలో వైభవంగా ప్రారంభంకానుంది. ఈ కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉదయం 10:30 గంటలకు ప్రారంభించనున్నారు. కాగా, ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా రాష్ట్ర వాణిజ్య ఎగుమతుల రెట్టింపు దిశగా చర్యలు చేపట్టనున్నారు. ఈ రోజు ప్రారంభం కానున్న వాణిజ్య ఉత్సవం బుధవారం కూడా కొనసాగుతుంది. ఏపీ నుంచి అత్యంత చౌకగా ఎగుమతుల లక్ష్యంగా ఈడీబీ ప్రణాళికలు చేస్తుంది. ప్రస్తుతం ఏపీ నుంచి 4 ఓడరేవుల ద్వారా ఎగుమతులు జరుగుతున్నట్లు అధికారులు తెలిపారు. అదే విధంగా ఏపీ నుంచి 16.8 బిలియన్ డాలర్ల విలువైన ఎగుమతులు జరుగుతున్నాయి. 2030 నాటికి 33.7 బిలియన్ డాలర్ల ఎగుమతులే లక్ష్యంగా చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. చదవండి: ఎగుమతులకు ప్రత్యేక ప్రణాళిక -
ఎన్నికల బహిష్కరణ టీడీపీ డ్రామానే: బొత్స
సాక్షి, అమరావతి: పరిషత్ ఎన్నికల బహిష్కరణ టీడీపీ ఆడిన డ్రామా అని మునిసిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అందిస్తున్న సంక్షేమాభివృద్ధి పాలనకు ప్రజలు మరోసారి పట్టం కట్టారని చెప్పారు. ప్రతిపక్షం తన పాత్రను పోషించకుండా ఎల్లో మీడియాను అడ్డుపెట్టుకుని అబద్ధాలు ప్రచారం చేసిందన్నారు. ఓట్లు వేసిన ప్రజలకు ఏమీ తెలియదు.. వారు అమాయకులని అనుకుంటే పొరపాటేనని ఆయనన్నారు. చంద్రబాబుకి ఓటమిని అంగీకరించే ధైర్యంలేదని.. పరాజయాన్ని అంగీకరించి ఫలితాలను విశ్లేషించుకోవాలని బొత్స హితవు పలికారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం మీడియా పాయింట్ వద్ద సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. మళ్లీ ఎన్నికలు పెట్టాలన్న టీడీపీ నేత అచ్చెన్నాయుడి వ్యాఖ్యలను పట్టించుకోవాల్సిన అవసరంలేదని కొట్టిపారేశారు. సీఎం జగన్ గృహ నిర్మాణాలపై సోమవారం సమీక్ష నిర్వహించారని.. సుమారు 60 లక్షల మందికి శాశ్వత ఇళ్ల పట్టాలను ఇవ్వాలన్నదే ఆయన ఆలోచనన్నారు. దీనిపై విధివిధానాల గురించి ముఖ్యమంత్రి సమీక్షించారని బొత్స తెలిపారు. త్వరలోనే 80 వేల టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు అందజేస్తామని ఆయన వెల్లడించారు. ‘పరిషత్’ ఎన్నికల కౌంటింగ్ నిర్వహించాలని తీర్పు వచ్చిన రోజు నుంచి టీడీపీలో ఆందోళన మొదలైందన్నారు. తమ సమస్యలు పరిష్కరించే ప్రభుత్వాన్ని ప్రజలు ఆదరిస్తారని ఎన్నికల ఫలితాలతో నిరూపితమైందని మంత్రి తెలిపారు. తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు పనైపోయిందని.. టీడీపీకి ప్రజల్లో మనుగడ లేదనేది స్పష్టమవుతోందని మంత్రి చెప్పారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఫలితాలతో టీడీపీ ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాలని హితవు పలికారు. నామినేషన్లకు ముందే ఎన్నికల బహిష్కరణ నిర్ణయాన్ని ప్రకటించి ఉండాల్సిందని.. అవి పూర్తయిన అనంతరం చేతకాక బహిష్కరించారని బొత్స చెప్పారు. ప్రజాతీర్పు స్ఫూర్తితో సీఎం జగన్ ప్రజాసేవకు పునరంకితమవుతారన్నారు. అచ్చెన్నాయుడు రాజీనామా చేయాలి ప్రభుత్వాన్ని రద్దు చేయాలని అచ్చెన్నాయుడు డిమాండ్ చేయడం సరైంది కాదన్నారు. అచ్చెన్నాయుడుని తన పదవికి రాజీనామా చేయమనండి.. తానూ చేస్తానని.. ఇద్దరం పోటీచేసి తేల్చుకుందామని బొత్స సత్యనారాయణ చెప్పారు. స్థాయిని తగ్గించుకునేలా టీడీపీ నేతలు మాట్లాడొద్దన్నారు. చంద్రబాబుని చంపడానికి, కొట్టడానికే ఆయన ఇంటికి వైఎస్సార్సీపీ నేతలు వెళ్లారనడం సరికాదని చెప్పారు. చదవండి: ఈ ఫలితాలు నా బాధ్యతను మరింత పెంచాయి: సీఎం జగన్ -
గుజరాత్ లో పట్టుబడిన హెరాయిన్ కు విజయవాడలో లింకులు
-
విజయవాడ కనక దుర్గమ్మను దర్శించుకున్న సోనూసూద్
సాక్షి, విజయవాడ: సినీ నటుడు, రియల్ హీరో సోనూసూద్ విజయవాడ దుర్గమ్మను దర్శించుకున్నారు. ఓ ప్రైవేటు కార్యక్రమంలో భాగంగా బుధవారం సాయంత్రం విజయవాడకు చేరుకున్నారు. అనంతరం నేరుగా ఇంద్రకిలాద్రికి వెళ్లి కనక దుర్గమ్మను దర్శించుకున్నారు. ఆ తరువాత ఆలయ అర్చకులు, అధికారులు ఆయనకు అమ్మవారి చిత్ర పటం, ప్రసాదం అందజేశారు. ఈ సందర్భంగా సోనూ సూద్ మీడియాతో మాట్లాడుతూ.. దుర్గమ్మను దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. కరోనా వల్ల ఎంతో మంది అనేక ఇబ్బందులు పడ్డారు. రాష్ట్రం, దేశం అభివృద్ధి చెందాలని, అందరిని చల్లగా కాపాడాలని ఆ అమ్మవారిని కొరుకున్నా అని తెలిపారు. కాగా కరోనా కాలంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టి రియల్ హీరోగా మారారు సోనూసూద్. ప్రత్యక్షంగా పరోక్షంగా లక్షలాది మందికి సాయం అందించి వారి పాలిట దేవుడిగా నిలిచారు. విద్య, వైద్యం, ఉపాధి ఇలా అనేక రకాలుగా సేవలు అందించారు. ఇక కరోనా సెకండ్ వేవ్ సమయంలో కూడా పెద్ద ఎత్తున ఆక్సిజన్ సిలెండర్లను సప్లై చేశారు. అంతేగాక ఇందుకోసం ఆయన ప్రత్యేకం ఫౌండేషన్ కూడా ప్రారంభించి దాని ద్వారా ప్రజల కోసం విరాళాలు సేకరించి గొప్ప మనసు చాటుకున్నారు. ప్రభుత్వాలు చేయాల్సిన పనులను సైతం సోనూ సూద్ తన బాధ్యత భావించిన లక్షలాదిమంది అవసరాలు తీర్చి అపర దాన కర్ణుడుగా కీర్తించబడుతున్నారు. దీంతో ఈ రీయల్ హీరోను నేరుగా చూసేందుకు విజయవాడకు ప్రజలు గుంపులుగా తరలివచ్చారు. -
నకిలీ చలానాల వ్యవహారం లో రూ. 4 కోట్లు దాటినా రికవరీ
-
రాహుల్ హత్య కేసులో విచారణ ముమ్మరం
-
ఇంద్రకీలాద్రిపై ఆధ్యాత్మిక శోభ
-
వీడిన ఫాతిమా హత్య కేసు మిస్టరీ.. మొదటి భార్య గొడవ చేయడంతో..
సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లో సంచలనంగా మారిన ఫాతిమా మిస్సింగ్ కేసును కొత్తపేట పోలీసులు ఛేదించారు. తయ్యబ్ సాయంతో ఫాతిమాను వాసిమ్ హత్య చేశాడని ఏడీసీపీ బాబురావు మంగళవారం మీడియా సమావేశంలో తెలిపారు. ఆయన కేసు వివరాలను వెల్లడిస్తూ.. గత నెల 11న తేదిన చిట్టినగర్ పీఎస్ పరిధిలో నజీర్ అనే వ్యక్తి తన కుమారై కనిపించడం లేదని ఫిర్యాదు చేశాడు. ఫాతిమా మానసిక రోగంతో బాధపడేదని ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఆమె వ్యాధి నయం చేయించడానికి యూపీకి చెందిన వాసిఫ్ అనే భూత వైద్యుడి దగ్గర చికిత్స కోసం తీసుకెళ్లినట్లు వెల్లడించాడు. ఈ క్రమంలో తమ స్వస్థలానికి వచ్చిన వాసిఫ్ ఆమెకు మాయమాటలు చెప్పి.. ఢిల్లీకి తీసుకుపోయాడు. అక్కడి నుంచి సహారంగ్ పూర్లోని తన ఇంటికి తీసుకెళ్లి కాపురం పెట్టాడు. దీంతో వాసిఫ్ మొదటి భార్య గొడవకు దిగింది. ఈ క్రమంలో వాసిఫ్ .. ఫాతిమాను వదలించుకోవాలనుకున్నాడు. దీనికోసం తన స్నేహితుడు తయ్యబ్ సహకారం తీసుకున్నాడు. ఇద్దరు కలసి ఫాతిమాకు మాయమాటలు చెప్పి సహరంగ్పూర్లోని హత్నికుండ్కు తీసుకెళ్లారు. ఆ తర్వాత అక్కడి జలశయంలో తోసేశారు. కాగా, నాలుగు కిలోమీటర్ల దూరంలో ఆమె మృత దేహం పోలీసులకు దొరికింది. కాగా, సహరంగ్ పోలీసులు సహకరంతో.. మృత దేహన్ని స్వాధీనం చేసుకున్న ఏపీ పోలీసులు.. నిందితులిద్దరినీ ట్రాన్సిట్ వారెంట్ ద్వారా విజయవాడకు రప్పించారు. కాగా, నిందితులను అదుపులోకి తీసుకుని విజయవాడ కోర్టులో హజరుపర్చారు. నిందితులిద్దరికి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. వీరిని మచిలీపట్నం జైలుకు తరలించినట్లు పోలీసులు తెలిపారు. కాగా, వాసిఫ్ వద్ద 60 గ్రాముల బంగారాన్ని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇలాంటి మాయగాళ్లను నమ్మవద్దని విజయవాడ పోలీసు అధికారి బాబూరావు ఈ సందర్భంగా ప్రజలకు విజ్ఙప్తి చేశారు. -
విజయవాడ రైల్వే స్టేషన్ సరికొత్త రికార్డు
విజయవాడ: దక్షిణ భారతదేశంలో ప్రముఖ రైల్వే స్టేషన్లలో ఒకటైన విజయవాడ రైల్వే స్టేషన్ సరికొత్త రికార్డు సృష్టించింది. దేశంలో 130 కిలోవాట్స్ సామర్థ్యం గల మొట్ట మొదటి సోలార్ రైల్వే స్టేషన్‌గా విజయవాడ రికార్డు సృష్టించింది. రైల్వే మంత్రి పీయూష్ గోయల్ దీనికి సంబంధించి ఒక వీడియోను కూడా షేర్ ట్విటర్ లో షేర్ చేశారు. ఈ రైల్వే స్టేషన్ మొత్తం విద్యుత్ వినియోగంలో 18 శాతం ఈ సౌర శక్తి నుంచి లభిస్తుంది. ఇండియన్ రైల్వే పర్యావరణ అనుకూల చర్యలు తీసుకోవడం వల్ల వార్షికంగా రూ.8 లక్షలకు పైగా పొదుపు కావడంతో పాటు కర్బన ఉద్గారాల శాతం కూడా తగ్గిస్తుందని మంత్రి తెలిపారు. విజయవాడ డివిజనల్ రైల్వే మేనేజర్ పీ. శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం.. స్టేషన్లో 2019 డిసెంబర్లో 4, 5 ప్లాట్‌ఫారాలపై 65 కిలోవాట్స్ సామర్థ్యం గల బీఐపీవీ సోలార్ ప్యానల్స్‌ను ఏర్పాటు చేశారు. తాజాగా అదనంగా రూ.62 లక్షల ఖర్చుతో 4, 5 ప్లాట్‌ఫారాలపై 54 కిలోవాట్స్ 8, 9 ప్లాట్‌ఫారాలపై 11 కిలోవాట్స్ మొత్తం 65 కిలోవాట్స్ సామర్థ్యం గల బీఐపీవీ సోలార్ ప్యానల్స్‌తో ఏర్పాటు చేసారు. దీంతో దేశ వ్యాప్తంగా ఉన్న రైల్వే స్టేషన్లలోనే మొదటగా 130 కిలోవాట్స్ సామర్థ్యం కలిగిన సోలార్ విద్యుదుత్పత్తి గల స్టేషన్‌గా విజయవాడ రికార్డు సృష్టించిందని రైల్వే మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. భారతీయ రైల్వే ట్రాక్షన్ విద్యుత్ అవసరాల కోసం ఖాళీగా ఉన్న రైల్వే భూమిలో సోలార్ ప్లాంట్లను ఏర్పాటు చేయాలని యోచిస్తున్నట్లు తెలిపింది. భారతీయ రైల్వే 20 జిజీబ్ల్యు భూ ఆధారిత సోలార్ ప్లాంట్లను ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. आंध्र प्रदेश का विजयवाड़ा स्टेशन बना 130 kWp सोलर पैनल से ढका देश का पहला स्टेशन। अब स्टेशन की कुल बिजली खपत में से 18% बिजली इसी सौर ऊर्जा से मिलेगी। इससे वार्षिक 8 लाख रुपये की बचत होगी, व कॉर्बन उत्सर्जन में भी कमी आयेगी। Watch on Koo: https://t.co/rghkl7q4ya pic.twitter.com/B9WYhFMkDk — Piyush Goyal (@PiyushGoyal) July 6, 2021 -
విజయవాడ పడమట లో సైకో కలకలం
-
2018 గ్రూప్-1 క్వాలిఫైడ్ అభ్యర్ధుల ఆందోళన
-
బెజవాడలో మాయలేడీ మోసాలు
-
కర్ఫ్యూ నిబంధనలు పాటించాలని ప్రజలకు విజ్ఞప్తి
-
రౌడీషీటర్ పండు వీరంగం.. స్నేహితుడిపై కత్తులతో దాడి
సాక్షి, అమరావతి బ్యూరో/పెనమలూరు: సరిగ్గా ఏడాది కిందట నగరంలో గ్యాంగ్‌వార్‌తో రెచ్చిపోయిన కొండూరి మణికంఠ అలియాస్ కేటీఎం పండు మరోసారి నగరంలో వీరంగం సృష్టించాడు. ఆదివారం కానూరు వంద అడుగుల రోడ్డులో పండు స్నేహితులతో మారణాయుధాలతో ప్రజల్ని భయాభ్రాంతులకు గురిచేస్తున్నాడన్న సమాచారంతో పెనమలూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సోమవారం పండుతో పాటు ఆరుగురు గ్యాంగ్ సభ్యుల్ని అరెస్టు చేసి కోర్టులో హాజరుచారు. గత ఏడాది మే నెల 30వ తేదీన పటమట పప్పులమిల్లు సెంటర్ సమీప మైదానంలో రౌడీషీటర్ తోటా సందీప్, కేటీఎం పండు స్నేహితుల మధ్య గ్యాంగ్‌వార్ చోటుచేసుకుంది. ఇరువర్గాలు కత్తులు, రాడ్లు, బ్లేడ్లతో పరస్పరం దాడులకు పాల్పడ్డారు. ఈ దాడుల్లో తోటా సందీప్ గాయపడి మే 31న ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ కేసులో ఇరువర్గాలకు చెందిన 40 మందిపై పోలీసులు రౌడీషీటు తెరిచారు. సందీప్ మృతితో ప్రధాన నిందితుడు పండుతో పాటు మిగిలిన వారందరిపైనా ఐపీసీ 302, 307, 188, 269 సెక్షన్లతో కోవిడ్–19 చట్ట ప్రకారం కేసులు నమోదు చేశారు. అప్పటి నుంచి జైలులో ఉన్న పండు ఈ ఏడాది జనవరిలో షరతులతో కూడిన బెయిల్‌పై విడుదలయ్యాడు. మూడు నెలలపాటు నగరంలో అడుగుపెట్టరాదని కోర్టు షరతు విధించడంతో పండు పామర్రులో మూడు నెలలు ఉన్నాడు. అనంతరం చికిత్స నిమిత్తం తనకు నగరంలో ఉండేందుకు అనుమతి ఇవ్వాలని కోర్టుకు విన్నవించడంతో సనత్‌నగర్‌లోని రామాలయం వీధిలో ఉంటున్నాడు. ఈ సమయంలోనే అక్రమ సంపాదనకు తెరతీశాడు. 20 రోజుల క్రితం పండు, అతడి అనుచరులు విశాఖపట్నం వెళ్లి గంజాయి తీసుకొచ్చారు. విజయవాడ శివారుతో పాటు నగరంలో వివిధ ప్రాంతాల్లో గంజాయి విక్రయాలకు పాల్పడుతున్నాడు. స్నేహితుడిపై కత్తులతో దాడి వీడియోతో.. గత బుధవారం రౌడీషీటర్ మణికంఠ స్నేహితుడు కోనేరు రాజా పుట్టిన రోజు కావడంతో పండు తన స్నేహితులతో కలిసి వేడుకల్లో మద్యంతోపాటు గంజాయి తీసుకున్నారు. అనంతరం కోనేరు రాజాను పండుతోపాటు ఇతరులు కలసి కత్తులతో, కర్రలతో కొడుతున్నట్లు ఓ వీడియో చిత్రీకరించి ఫేస్బుక్లో అప్లౌడ్ చేశాడు. ఇది ప్రస్తుతం వైరల్ అయింది. గతంలోనూ పండు తనలోని క్రూరత్వాన్ని ప్రదర్శిస్తూ అనేకసార్లు టిక్‌టాక్ వీడియోలతో హల్చల్ చేశాడు. మారణాయుధాలతో సంచరిస్తూ... ఆదివారం పండు తన స్నేహితులతో కలిసి మారణాయుధాలతో సంచరిస్తూ ఓ సెటిల్మెంట్కు ప్రయత్నిస్తున్న సమయంలో పెనమలూరు పోలీసులు పక్కా సమాచారంతో కానూరు వంద అడుగుల రోడ్డులో వారిని అదుపులోకి తీసుకున్నారు. సనత్‌నగర్‌కు చెందిన పండుతోపాటు కోనేరు రాజా, కవి ప్రవీణ్, తిరుమలశెట్టి నాగరాజు, సప్పా దర్గారావు, విజయవాడ ఫకీర్గూడెంకు చెందిన షేక్ గాలీబ్‌ల నుంచి రెండు పెద్ద కత్తులు, 8 చిన్నకత్తులు, 15 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. వారిని సోమవారం అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చగా కోర్టు వారికి రిమాండ్ విధించినట్లు సీఐ ఎం.సత్యనారాయణ తెలిపారు. పండు నేర చరిత్ర ... కేటీఎం పండు నేర చరిత్ర పెద్దదే. పండుపై విజయవాడ నగరంలో ఏడు కేసులు నమోదు అయ్యాయి. పటమట పీఎస్ పరిధిలో ఒక హత్య, ఒక హత్యాయత్నం కేసు, ఒక కొట్లాట కేసు, కృష్ణలంక పీఎస్‌లో ఒక కొట్లాట కేసు, పెనమలూరు పీఎస్ పరిధిలో రెండు కొట్లాట కేసులు, ఒక బైండోవర్ కేసు నమోదు అయ్యాయి. 2020లో అతనిపై రౌడీషీటు తెరిచారు. -
విజయవాడలో మరోసారి రెచ్చిపోయిన రౌడీ షీటర్ పండు
-
విజయవాడ లో కర్ఫ్యూ ఎలా నడుస్తోంది ?
-
ఆనందయ్య ఔషధం పై వివరాలు సీఎంకు అందించాం
-
కరోనా కట్టడికి చర్యలు చేపట్టిన విజయవాడ నగర పాలక సంస్థ
-
విజయవాడ లో భవానీపురం పీఎస్ ఆవరణలో అగ్ని ప్రమాదం
-
వ్యాక్సిన్‌తో పాటు జాగ్రత్తలూ అవసరమే
మే 1 నుంచీ 18ఏళ్లు దాటిన వారికి కూడా వ్యాక్సిన్ వేయనున్నారు. ఇప్పటికే దాదాపుగా 2 కోట్ల మంది వ్యాక్సిన్ కోసం నమోదు చేసుకున్నారు. ఈ నమోదు చేసుకుంటున్న వేగం చూస్తుంటే సగటున రోజుకి కోటికిపైగానే రిజిస్ట్రేషన్లు జరుగనున్నాయి. దీంతో మరికొన్ని నెలల పాటు దేశం మొత్తం నలువైపులా వ్యాక్సినేషన్ ముమ్మరం కానుంది. మరోవైపు వ్యాక్సిన్ పనిచేసే తీరు తెన్నులపైనా ప్రజల్లో ఇంకా అనేక సందేహాలు, అపోహలూ కొనసాగుతూనే ఉన్నాయి. ఈ నేపధ్యంలో విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్స్‌లో గత కొంత కాలంగా కోవిడ్ బాధితులతో పనిచేస్తున్న డా.గుట్టా లోకేష్ ఆ సందేహాలకు ఇసక్తున్న సమాధానాలివి... మార్పు చేర్పులు ఉండవు... 18 ఏళ్లు పైబడిన వారందరికీ వేయనున్నారు కాబట్టి... వీరికి సంబంధించి ఏమైనా మార్పు చేర్పులుంటాయా అని కొందరు సందేహిస్తున్నారు. అయితే అలాంటివేం ఉండవు. గతంలో 45ఏళ్లు పైబడిన వారికి వ్యాక్సిన్ వేసినట్టే వీరికి కూడా వేయడం జరుగుతుంది. వయసును బట్టి వ్యాక్సిన్ పరిమాణంలోగానీ, మరే విషయంలో గానీ తేడా ఉండదు. వ్యాక్సిన్‌తో అంతా అయిపోదు.. చాలా మంది వ్యాక్సిన్ వేయించుకుంటే చాలు ఇక కోవిడ్ సంబంధించి ఏ సమస్య ఉండదు అనుకుంటున్నారు. అయితే అది సరైంది కాదు. వ్యాక్సిన్ ద్వారా మనకి 100శాతం సురక్షితమైన పరిస్థితి రాదు. వ్యాక్సిన్ తయారీ దారులు కూడా 60 నుంచి 70శాతం మాత్రమే అది మనకు రక్షణ ఇస్తుందని చెబుతున్నారు. కాబట్టి వ్యాక్సిన్ వేయించుకున్నాంలే అనే అతి థీమా పనికిరాదు. ఇమ్మీడియట్ ఇమ్యూనిటీ రాదు.. వ్యాక్సిన్ వేయించుకున్న వెంటనే మనకు వ్యాధి నిరోధక శక్తి వచ్చేసినట్టు అనుకోవద్దు. దీనికి కొంత సమయం పడుతుంది. సెకండ్ డోస్ వేయించుకున్న 2 వారాలకు గాని వ్యక్తిలో ఇమ్యూనిటీ స్టార్ట్ అవదు.. అంటే ఇమ్యూనిటీ పూర్తి స్థాయిలో సంతరించుకోవాలంటే తొలి డోస్ నుంచి కనీసం 45 రోజులు పడుతుంది. శరీరంలో యాంటీ బాడీస్ చెక్ చేయించుకోవాలి అనుకుంటే అప్పటిదాకా ఆగాల్సిందే. తొలి డోస్ వేయించుకోవడం వెంటనే ఏమీ కాదులే అనుకుని తిరగొద్దు. చాలా మందికి వ్యాక్సినేషన్ పూర్తయి 45 రోజుల తర్వాత యాంటీ బాడీస్ వచ్చిన వారిలో కూడా కొంత మందికి పాజిటివ్ వచ్చిన దాఖలాలున్నాయి అయితే మిగతా వారితో పోలిస్తే చాలా స్పీడ్ రికవరీ ఉంది. డోస్కీ డోస్కీ మధ్య వ్యవధి... ఇక తొలిడోస్‌కి రెండో డోస్‌కి మధ్య వ్యవధి విషయంలో చాలా రకాల సందేహాలు గమనించాం. ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్న వ్యాక్సిన్లైన కోవిషీల్డ్, కోవాగ్జిన్ రెండింటికీ వ్యవధి ఒకటే. రెండింటికీ.. తొలి డోస్ నుంచి రెండో డోస్‌కి మధ్య తొలుత 28 రోజుల వ్యవధి చాలని చెప్పారు ఆ తర్వాత మరింత మెరుగైన ఫలితాలు వస్తాయని దాన్ని 6 నుంచి 8వారాల వరకూ పెంచారు. ఆలస్యమైతే...ఎలా? గత 2, 3 వారాల నుంచీ డిమాండ్ బాగా పెరగడం వల్ల తగినంత పరిమాణంలో వ్యాక్సిన్ అందుబాటులో లేకపోవడం కొంత మందికి సెకండ్ డోస్ ఆలస్యం అవుతోంది. ఏదేమైనా కోవిషీల్డ్ లేదా కోవ్యాగ్జిన్ గానీ రెండోడోస్ తీసుకోవడానికి అత్యధికంగా 8 వారాలు లేదా 2 నెలల వరకూ వ్యవధి ఉండవచ్చు. ఈ లోగానే వేయించుకోవడం బెటర్. థర్డ్ వేవ్ టైమ్‌కి ఇది పనికి వస్తుందా? అనూహ్యంగా వచ్చిపడిన సెకండ్ వేవ్ చాలా త్వరగా ఇతరులకు వ్యాపిస్తోంది. కాబట్టి ఈ సమయంలో మనం దాన్ని ఎదుర్కోవడంలో ఇబ్బంది పడుతున్నాం కానీ, దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ పూర్తయిపోయిన తర్వాత ఒకవేళ థర్డ్‌వేవ్ లాంటిది ఈ సారి వస్తే... మనం దాన్ని సమర్ధవంతంగా ఎదుర్కోగలుగుతామని చెప్పవచ్చు. -డాక్టర్ గుట్టా లోకేష్, కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్, మణిపాల్ హాస్పిటల్స్, విజయవాడ -
మీ పేరుతో ఎవరైనా సిమ్ తీసుకున్నారో తెలుసుకోండిలా?
మనకు తెలియకుండానే మన పేరు మీద ఎన్ని ఫోన్ నంబర్లున్నాయో మీకు తెలుసా?. ఇలా మనకు తెలియకుండానే కొందరి పేరు మీద సైబర్ నెరగాళ్లు సిమ్ లు తీసుకుంటు న్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. ఈ సిమ్ ద్వారా అనైతిక, అసాంఘిక కార్యక్రమాలకు ఈ మొబైల్ నెంబర్ వాడుతున్నట్లు చాలా కేసులలో బయటపడింది. ఇలా మీకు తెలియకుండా ఇతరులు సిమ్ తీసుకోవడంతో మీరు మీకు సంబంధం లేని కేసులలో చిక్కుకునే ప్రమాదం చాలా ఎక్కువ. ఇలా మన పేరు మీద లేదా మన వివరాలతో ఎవరైనా మొబైల్ నెంబర్ తీసుకుంటే వాటిని బ్లాక్ చేసే సదుపాయం ఇప్పడు మీకు కల్పిస్తున్నారు. దీని కోసం మీరు విజయవాడ టెలికాం విభాగం(డీవోటీ) రూపొందించిన వెబ్సైట్(https://tafcop.dgtelecom.gov.in)ను సందర్శించాలి. వెబ్సైట్ ఓపెన్ చేశాక అందులో మీరు ప్రస్తుతం వాడుతున్న మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు మీరు ఇచ్చిన మొబైల్ నెంబర్ ఒక ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేయగానే మన పేరు మీద ఉన్న ఫోన్ నంబర్ల వివరాలన్నీ వస్తాయి. వాటిలో మనకు అవసరం లేనివి, మనకు తెలియకుండా మన పేరుమీద ఉన్న వాటిని సెలక్ట్ చేసి రిపోర్ట్ చేస్తే టెలికం శాఖ తగు చర్యలు తీసుకుంటుంది. ఒకరి పేరు మీద అత్యధికంగా 9 నంబర్లు మాత్రమే ఉండేందుకు వీలుంది అని విజయవాడ టెలికం శాఖ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ రాబర్ట్ రవి పేర్కొన్నారు. కొందరి పేర్ల మీద అంతకంటే ఎక్కువ నంబర్లు ఉన్నాయని తమ దృష్టికి వచ్చిందని. అందుకే, ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు ఈ పోర్టల్‌ను ప్రారంభించామన్నారు. దీనివల్ల అనధికారికంగా వినియోగిస్తున్న నంబర్లకు చెక్ పెట్టే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు. ముందుగా తెలుగు రాష్ట్రాల టెలికం సర్కిళ్లలో ఈ సదుపాయాన్ని ప్రారంభించామని. త్వరలో దేశ వ్యాప్తంగా అందుబాటులోనికి వస్తుందన్నారు. ఎవరికైనా అనుమానం వెంటనే ఇలా చెక్ చేసుకోవాలని తెలిపారు. చదవండి: సింగిల్ చార్జ్ తో 100 కి.మీ ప్రయాణించే సైకిల్ -
గత కొంతకాలంగా హోంగార్డు వినోద్, భార్య రత్నప్రభకు విభేదాలు
-
విజయవాడ లో జెడ్పిటిసి ఎంపిటిసి ఎన్నికల పోలింగ్
-
మరోసారి వివాదాస్పద ఉత్తర్వులు జారీచేసిన నిమ్మగడ్డ
సాక్షి, విజయవాడ: రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ మరోసారి వివాదాస్పద ఉత్తర్వులు జారీ చేశారు. ఎన్నికల కోడ్‌ను సాకుగా చూపుతూ ఏపీ ప్రభుత్వం సంక్షేమ పథకాలను నిలిపేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఎన్నికల సంఘం సర్క్యులర్ జారీ చేసింది. దీంతో లక్షలాది మంది తల్లులు ఎదురుచూస్తున్న అమ్మఒడి పథకానికి ఎన్నికల కోడ్ అడ్డంకిగా మారింది. ఇదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇళ్లపట్టాల పంపిణీపైనా ఆంక్షలు విధించారు. చదవండి: (మళ్లీ ఏకపక్ష నిర్ణయం) అయితే ఇప్పటికే అమ్మఒడి కార్యక్రమానికి సంబంధించి నెల్లూరులో సన్నాహాలు చురుగ్గా సాగుతున్నాయి. సంక్షేమ పథకాలపై గవర్నర్ ప్రసంగంలో పేర్కొన్నా, బడ్జెట్ కేటాయింపులు చేసినా పథకాల అమలు ఓటర్లను ప్రభావితం చేస్తుందంటూ ఎస్ఈసీ వాటిని ప్రజలకు అందించడం ఆపేయాలంటూ సర్క్యులర్ జారీ చేసింది. అయితే ఈ ఆదేశాల్లో స్పష్టంగా రాజకీయ అజెండా కనిపిస్తోందని నిపుణులు పేర్కొంటున్నారు. ఎస్ఈసీ ఏకపక్ష నిర్ణయాలపై పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. చదవండి: ('పుట్టుకతోనే ఎన్నికల కమిషనర్‌గా ఫీలవుతున్నాడు') (ఎస్ఈసీ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ప్రభుత్వం పిటిషన్) -
‘విమానం’ మోత
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నుంచి విజయవాడకు ఈ నెల 11వ తేదీ ఇండిగో విమానం చార్జీ రూ.2,600. అదే రోజు కోసం ఒక ప్రైవేట్ ట్రావెల్స్ ఏసీ బస్సు చార్జీ సుమారు రూ.2,000. సాధారణ రోజుల్లో ఈ బస్సు చార్జీ రూ.650 మాత్రమే. కానీ సంక్రాంతి రద్దీని దృష్టిలో ఉంచుకొని మూడు రెట్లు పెంచేశారు. ప్రయాణికుల రద్దీ, డిమాండ్ ఎక్కువగా ఉండే హైదరాబాద్–విజయవాడ, హైదరాబాద్–విశాఖ వంటి రూట్లు మాత్రమే కాదు. సంక్రాంతి పర్వదినం సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లోని సొంత ఊళ్లకు వెళ్లే ప్రయాణికులకు అన్ని రూట్లలోనూ ప్రైవేట్ బస్సులు చుక్కలు చూపిస్తున్నాయి. వీటికి తోడు వైట్ నంబర్ ప్లేట్లపైన క్యాబ్ సర్వీసులను అందజేసే ట్రావెల్స్ కార్లు సైతంచార్జీలలో ‘విమానం’మోత మోగిస్తున్నాయి. సంక్రాంతి రద్దీని దృష్టిలో ఉంచుకొని తెలంగాణ ఆర్టీసీ ఏర్పాటు చేసిన 4,850కి పైగా ప్రత్యేక బస్సుల్లో 50 శాతం అదనపు చార్జీలను విధించి ప్రయాణికుల జేబు గుల్ల చేస్తున్నారు. దీంతో నగరవాసులకు సంక్రాంతి ప్రయాణం తీవ్ర ఇబ్బందిగా మారింది. ట్రావెల్స్ సంస్థలు లాక్డౌన్ కాలంలో కోల్పోయిన ఆదాయాన్ని ఇప్పుడు భర్తీ చేసుకొనేందుకు దోపిడీకి దిగుతున్నారు. ఓ కుటుంబానికి రూ.10,000.. సాధారణంగా హైదరాబాద్–విశాఖ ఏసీ స్లీపర్ క్లాస్ బస్సులో రూ.980 నుంచి 1,200 వరకు ఉంటుంది. కానీ ఇప్పుడు రూ.2,500 వరకు వసూలు చేస్తున్నారు. ఇప్పటికే అన్ని బస్సుల్లోనూ సీట్లు బుక్ అయ్యాయని, అదనంగా చెల్లిస్తే తప్ప తాము ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయలేమని ఆపరేటర్లు చెబుతున్నారు. కరోనా మహమ్మారి కారణంగా సుమారు 10 నెలలుగా సొంత ఊళ్లకు వెళ్లలేకపోయిన నగరవాసులు సంక్రాంతికి వెళ్లి సంతోషంగా గడపాలని భావిస్తున్నారు. కానీ, ప్రయాణ చార్జీలు మోయలేని భారంగా మారాయి. నలుగురు కుటుంబ సభ్యులు ఉన్న ఇంట్లో ప్రయాణ చార్జీలు ఏకంగా రూ.10,000 దాటుతోంది. అరకొర రైళ్లే... సాధారణంగా హైదరాబాద్, సికింద్రాబాద్ నుంచి ప్రతి రోజు సుమారు 200 రైళ్లు వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తాయి. సంక్రాంతి రద్దీని దృష్టిలో ఉంచుకొని మరో 150 రైళ్లను నడుపుతారు. ఈ సారి కరోనా ఆంక్షల నేపథ్యంలో ప్రత్యేక రైళ్లకే పరిమితమయ్యారు. ప్రస్తుతం 70 ప్రత్యేక రైళ్లు నడుస్తుండగా, సంక్రాంతి దృష్ట్యా మరో 45 రైళ్లను అదనంగా ఏర్పాటు చేశారు. ప్రయాణికుల డిమాండ్‌కు తగినన్ని రైళ్లు లేకపోవడంతో వెయిటింగ్ లిస్టు భారీగా పెరిగింది. విశాఖ, విజయవాడ, కాకినాడ, రాజమండ్రి, తదితర ప్రాంతాలకు వెళ్లే అన్ని ప్రధాన రైళ్లలో 250 నుంచి 350 వరకు నిరీక్షణ జాబితా ఉంది. కొన్ని రైళ్లలో ‘నోరూమ్’దర్శనమిస్తోంది. -
సుబ్బయ్యపై 2002 నుంచి 14 కేసులు
సాక్షి, విజయవాడ : టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు హత్యా రాజకీయాలతో పైకి ఎదిగిన వ్యక్తని, ఆయన కొడుకు హత్యారాజకీయాల గురించి ట్వీట్లు చేయడం హాస్యాస్పదంగా ఉందని సమాచార శాఖ మంత్రి పేర్ని నాని వ్యాఖ్యానించారు. ప్రొద్దుటూరు సుబ్బయ్య మృతిపై విచారణ జరుగుతుందని, చనిపోయిన వారి గురించి మాట్లాడటం సబబు కాదని అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ టీడీపీ వాళ్లలా మేము మాట్లాడలేము. సుబ్బయ్యపై 2002 నుంచి 14 కేసులు ఉన్నాయి. టీడీపీ హయాంలోనే ఆయనకు రెండు కేసుల్లో శిక్ష పడింది. ఫ్యాక్షన్ రాజకీయాలను ప్రోత్సహించి ఈ రోజు సుబ్బయ్యను పొట్టన పెట్టుకుంది టీడీపీనే. తన తండ్రిని హత్య చేస్తేనే వదిలేసిన చరిత్ర వైఎస్సార్ కుటుంబానిది. రాయలసీమలో ఫ్యాక్షన్‌ను ప్రోత్సహించింది చంద్రబాబే. లోకేష్ ఈ మధ్య కొవ్వు తగ్గించుకున్నాడు...ఇప్పుడు మదం కూడా తగ్గించుకోవాలి. ఎవరో రాసిస్తే ట్వీట్ చేయడం కాదు.. వాస్తవాలు తెలుసుకో లోకేష్ బాబు’’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. -
సింహం ప్రతిమలు మాయం, మంత్రి పర్యటన
సాక్షి, విజయవాడ: బెజవాడ దుర్గమ్మ గుడిలోని వెండి రథం, సింహం ప్రతిమలు మాయమైనట్టు ఆలయ అధికారులు గుర్తించారు. రథానికి నాలుగు వైపులా ఉండాల్సిన సింహం ప్రతిమల్లో మూడు కనిపించడం లేదని తెలిపారు. ఈ నేపథ్యంలో మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అమ్మవారి వెండి రథాన్ని బుధవారం పరిశీలించారు. అమ్మవారి వెండిరథంపై మూడు సింహాలు కనిపించడం లేదని పరిశీలనలో తేలిందని వెల్లడించారు. ఆలయాల్లో రథాల పరిరక్షణకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని మంత్రి ఈ సందర్భంగా స్పష్టం చేశారు. చాలా ఆలయాల్లో భద్రతను ప్రైవేట్ ఏజెన్సీలు చూస్తున్నాయని గుర్తు చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రథాన్ని ఉపయోగించలేదని తెలిపారు. ఘటనపై దేవాదాయశాఖ ఆధ్వర్యంలో కమిటీ వేస్తామని మంత్రి చెప్పారు. అన్ని విషయాలు విచారణలో తేలుతాయని అన్నారు. (చదవండి: మంత్రి సీదిరి అప్పలరాజు సాహసం) -
త్వరలో ఐటీ పాలసీ విడుదల
సాక్షి, విజయవాడ: రాష్ట్రంలో ఉద్యోగాల కల్పన లక్ష్యంగా నూతన పారిశ్రామిక పాలసీని విడుదల చేశామని పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి అన్నారు. కొత్త పారిశ్రామిక పాలసీని అవిష్కరించిన అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. నేడు విడుదల చేసింది కేవలం పారిశ్రామిక పాలసీ అని త్వరలో ఐటీ పాలసీని కూడా విడుదల చేస్తామని తెలిపారు. కరోనావైరస్ తగ్గుముఖం పట్టిన తర్వాత పరిస్థితులను అనువుగా మార్చుకుంటామని పేర్కొన్నారు. రాష్ట్రంలో మూడు పోర్టులు, ఎయిర్‌పోర్టుల్లో మౌలిక వసతులు కల్పించామని చెప్పారు. పారిశ్రామికవేత్తలు రాష్ట్రంలో పెట్టుబడి పెట్టేందుకు అనువైన వాతవరణాన్ని కల్పిస్తున్నామని తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తామని తెలిపారు. (ఏపీ: కొత్త ఇండస్ట్రియల్ పాలసీ విడుదల) గత ప్రభుత్వం చేసినట్టు పారిశ్రామికవేత్తలను మోసం చేయమని పేర్కొన్నారు. తాము పాలసీలో ఏం చెప్తే అది కచ్చితంగా చేసి చూపిస్తామని వ్యాఖ్యానించారు. అందుకే తమ పెట్టుబడులు, ఉద్యోగాలపై అబద్ధపు ప్రకటనలు చేయడం లేదని తెలిపారు. అన్ని ప్రాంతాల్లో పరిశ్రమలు వచ్చేలా ప్రణాళికను సిద్ధం చేశాని వెల్లడించారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా పరిశ్రమలకు స్కిల్‌మాన్ పవర్ ఇస్తున్నామని పేర్కొన్నారు. ఇంతకంటే పెద్ద రాయితీ పరిశ్రమలకు వేరే ఏమి ఉండదని తెలిపారు. నూతన పారిశ్రమిక పాలసీతో రాష్ట్రంలోని యువతకు ఉద్యోగలు వస్తాయన్న నమ్మకాన్ని కలిగించామని మంత్రి గౌతమ్ రెడ్డి తెలిపారు. (సమగ్ర అభివృద్ధికి కొత్త పాలసీ: గౌతమ్‌రెడ్డి) నూతన పారిశ్రామిక పాలసీపై ఏపీఐఐసీ చైర్ పర్సన్, ఎమ్మెల్యే రోజా మాట్లాడుతూ.. పారిశ్రామిక పాలసీలో కూడా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మహిళలకు ప్రాధాన్యం ఇచ్చారని తెలిపారు. మహిళలకు పరిశ్రమలు పెట్టేందుకు భూమి ధర, జీఎస్టీ, విద్యుత్, వడ్డీ రాయితీలను ఇస్తున్నామని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు ప్రోత్సాహకాలను అందించామని తెలిపారు. మొట్ట మొదటిసారి మైనారిటీలకు ప్రాధాన్యం ఇచ్చిన ఘనత సీఎం వైఎస్ జగన్‌కి దక్కుతుందని చెప్పారు. చంద్రబాబులా తాము అబద్ధాలు చెప్పలేదన్నారు. సీఎం వైఎస్ జగన్ నీతి, నిజాయితీ, పారదర్శకతతో కొత్త పారిశ్రామిక పాలసీ తీసుకొచ్చారని తెలిపారు. చంద్రబాబు కేవలం ఆయన పప్పుకి మాత్రమే ఉద్యోగ అవకాశం కల్పించారని ఎద్దేవా చేశారు. సీఎం జగన్ ఈ పాలసీతో యువతకు పెద్దఎత్తున ఉద్యోగాలు ఇవ్వబోతున్నారని చెప్పారు. రాబోయే రోజుల్లో 47వేల ఎకరాల భూమిని ఏపీఐఐసీకి కేటాయించి పరిశ్రమలను ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నామని ఆమె పేర్కొన్నారు. (గ్రామ, వార్డు సచివాలయాలపై సీఎం జగన్ సమీక్ష) -
బెజవాడలో కుండపోత వర్షం
సాక్షి, కృష్ణా: జిల్లాలో ఆదివారం ఉదయం నుంచి ఉరుములు, మెరుపులతో కుండపోత వర్షం కురుస్తోంది. భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఇప్పటికే మూడు రోజుల నుంచి కురుస్తున్న వానలకు జిల్లాలోని వాగులు, వంకలు పొంగిపోర్లుతున్నాయి. వర్షపు నీటితో కొన్ని చోట్ల వాగులు పొంగడంతో రహదారులపై వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. విజయవాడ నగరంలో కుండపోతగా కురుస్తున్న వానకి రహదారులు జలమయమై చిన్నపాటి చెరువులను తలపిస్తున్నాయి. వన్ టౌన్, పాళీక్లినిక్ రోడ్డు, నక్కల రోడ్డు, గణపతిరావు రోడ్డు, గాంధీబొమ్మ సెంటర్, మహాలక్ష్మిటెంపుల్ వీధి, నైజం గేట్ సెంటర్ రోడ్డు ఇతర ప్రాంతాలు నీట మునిగాయి.రోడ్లపై మోకాలు లోతు వర్షపు నీళ్లు రావటంతో వాహన చోదకులు నానా అవస్థలు పడ్డారు. వన్ టౌన్ ప్రాంతంలోని రోటరీ నగర్లో ఇళ్లలోకి వర్షపు నీరు చేరాయి. దీంతో నిర్వాసితులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. -
గ్యాంగ్ వార్ కేసులో పురోగతి
సాక్షి, విజయవాడ: విజయవాడ పటమటలో సంచలనం సృష్టించిన గ్యాంగ్ వార్‌కు సంబంధించిన కేసులో పోలీసులు పట్టు బిగుస్తున్నారు. వివాదానికి కారణమైన ల్యాండ్ ఓనర్స్ శ్రీధర్ రెడ్డి ,ప్రదీప్ రెడ్డిలను పోలీసులు అరెస్ట్ చేసి న్యాయస్థానం ముందు హాజరుపరిచారు. కేసును విచారించిన న్యాయమూర్తి నిందితులకు 14 రోజుల రిమాండ్ విధించినట్లు తెలిపారు. పోలీసులు నిందితులను రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. కాగా ఇది వరకే గ్యాంగ్ లీడర్ పండుతో పాటు రెండు గ్రూపులకు చెందిన 33 మందిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించిన విషయం తెలిసిందే. పరారిలో ఉన్న మిగతా 15 మంది నిందితుల కోసం ఆరు ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలను ముమ్మరం చేశాయి. -
టీడీపీ గొప్పలు చెప్పుకుంది: కన్నా
సాక్షి,విజయవాడ: అవినీతి కేసులో మాజీమంత్రి, టీడీపీఎమ్మెల్యే కింజరాపు అచ్చెన్నాయుడు అరెస్ట్ కావడాన్ని బీజేపీ స్వాగతిస్తోందని ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ.. చట్టానికి ఎవరు అతీతులు కాదని తెలిపారు. తాము పారదర్శక పాలన అందించామని టీడీపీ గొప్పలు చెప్పుకుందని ఎద్దేవా చేశారు. ఇప్పుడు అరెస్టులు అక్రమమని ఘోషిస్తోందని, అవినీతి చేయకపోతే టీడీపీ నేతలకు భయమెందుకని తీవ్రంగా ప్రశ్నించారు. (జేసీ ప్రభాకర్ రెడ్డికి 14 రోజుల రిమాండ్) అవినీతి పరులకు శిక్ష తప్పదని, టీడీపీ హయాంలో రాజధానిలో ఇంసైడర్ ట్రేడింగ్ జరిగిందని కన్నా అన్నారు. పోలవరంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని తెలిపారు. పోలవరంలో నిధులు పక్కదారి పట్టాయని, టీడీపీ అవినీతిపై బీజేపీ పెద్ద ఎత్తున పోరాటం చేసిందని కన్నా గుర్తుచేశారు. ఇక ఈఎస్ఐ కుంభకోణం కేసులో ఏ2గా ఉన్న అచ్చెన్నాయుడికి ఏసీబీ న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించిన విషయం తెలిసిందే.(‘రాష్ట్రంలో అరెస్టుల పర్వం మొదలైంది’) -
తెలంగాణ, రాయలసీమ మీదుగా ఉపరితల ద్రోణి
సాక్షి, విజయవాడ : రాగల 48 గంటలలో మాల్దీవులు, కోమోరిన్ ప్రాంతం, దక్షిణ బంగాళఖాతంతో పాటి మరికొన్ని ప్రాంతాలకు నైరుతి రుతుపవనాలు విస్తరించే అవకాశం ఉందని గురువారం వాతావారణ శాఖ వెల్లడించింది. దీంతో దక్షిణ బంగాళాఖాతంలో, అండమాన్ & నికోబార్ దీవులతో పాటు ఆగ్నేయ అరేబియా సముద్రం, దానిని ఆనుకొని ఉన్న తూర్పు మధ్య అరేబియా సముద్ర ప్రాంతాలలో మే 31వ తేదీన అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని పేర్కొంది. దీని ప్రభావం వలన సుమారుగా జూన్ 1వ తేదీన కేరళలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించే అవకాశం కూడా ఉందని తెలిపింది. (ఆ జిల్లాలో పిడుగుపడే అవకాశం) పశ్చిమ మధ్య అరేబియా సముద్రం, దానిని ఆనుకొని ఉన్న నైరుతి అరేబియా సముద్ర ప్రాంతాలలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావం వల్ల పశ్చిమ మధ్య అరేబియా సముద్ర ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడినట్లు పేర్కొంది. దీనికి అనుబంధంగా మధ్యస్థ ట్రోపోస్పీయర్ స్థాయిల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం ఏర్పడటంతో ఇది మరింత బలపడిందని వెల్లడించింది. దీంతో రాగల 48 గంటలలో ఈ అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావారణ శాఖ పేర్కొంది. మరో 72 గంటల్లో ఇది వాయువ్య దిశగా దక్షిణ ఒమన్, తూర్పు ఒమన్ తీరం వైపు ప్రయాణించే అవకాశం ఉందని, విదర్భ నుంచి ఇంటీరియర్ తమిళనాడు వరకు తెలంగాణ, రాయలసీమ మీదుగా 1.5 km ఎత్తు వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతోందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచన: ఉత్తర కోస్తాంధ్ర, యానాం : ఇవాళ, రేపు, ఎల్లుండి ఉరుములు, మెరుపులతో పాటు ఉత్తర కోస్తా ఆంధ్రాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దక్షిణ కోస్తా ఆంధ్ర : ఈ రోజు ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. గరిష్ట ఉష్ణోగ్రతలు 41వినుండి 44వి నమోదయ్యే అవకాశం ఉంది. రేపు, ఎల్లుండి ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాయలసీమ : ఈ రోజు, రేపు ఉరుములు, మెరుపులతో పాటు రాయలసీమలో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. గరిష్ట ఉష్ణోగ్రతలు 41° నుండి 44° నమోదయ్యే అవకాశం ఉంది. ఎల్లుండి ఉరుములు, మెరుపులతో పాటు రాయలసీమలో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. -
‘వారి ప్రమేయం ఉన్నా వదలం’
సాక్షి, విజయవాడ : నిబంధనలకు విరుద్ధంగా బిఎస్-3 వాహనాలను స్క్రాప్ కింద కొనుగోలు చేసి అక్రమ ధ్రువ పత్రాల ద్వారా ఆంధ్రపదేశ్‌లో తిప్పడంపై ట్రాన్స్పోర్ట్ విజిలెన్స్ జాయింట్ కమిషనర్ ప్రసాద్ గురువారం మీడియాతో మాట్లాడారు. బిఎస్-౩ వాహనాలు 31-03-2017 తరువాత అమ్మకూడదని సుప్రీంకోర్టు ఆదేశాలున్నాయని అన్నారు. అశోక్ లైల్యాండ్ నుంచి బీఎస్-3 వాహనాలు కొనుగోలు చేసి తిప్పుతున్నట్లు తెలిసిందన్నారు. 66 వాహనాలు స్క్రాప్‌గా అమ్మడం జరిగిందని, అశోక్ లైల్యాండ్ వాళ్లు తెలిపారని చెప్పారు. దేశంలో తిరగడానికి వీలులేని వాహనాలను తిప్పుతున్నారని, పోలీసుల సర్టిఫికెట్లు కూడా దొంగవి పెట్టారన్నారు. పోలీస్ శాఖ కూడా క్రిమినల్ కేసులు కూడా పెట్టిందని తెలిపారు. 25 వాహనాలు ఇతర రాష్ట్రాల్లో తిరుగుతున్న కారణంగా ఆ రాష్ట్రాలలో కూడా లావాదేవీలు నిలిపివేయాలని కోరామన్నారు. ఆయన తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ.. ‘‘ అక్రమ ధ్రువ పత్రాలు ఉన్న వాహనాలను సీజ్ చేసే ప్రక్రియ మొదలు పెట్టాం. ఇప్పటికి 23 వాహనాలు సీజ్ చేసాం.వాహనాలు కొని మోసపోయిన వారు అమ్మిన వారిపై కేసులు పెట్టాలని సూచించాం. జఠాధర ఇండస్ట్రీస్, సి గోపాల కృష్ణ కంపెనీకి చెందిన 80 బస్సులు ఉన్నాయి. లారీలు తీసుకువచ్చి బస్సులు కింద మార్చారు. ఆ బస్సుల్లో ప్రయాణం ప్రాణాంతకం. 88 వాహనాలకు సంబంధించి 3 కేసులు నమోదు అయ్యాయి. 23 వాహనాలకు సంబంధించి రవాణా శాఖ అధికారుల ప్రమేయం ఉన్నా వారిని వదిలే ప్రసక్తి లేదు. ఆగష్టు 2018న నాగాలాండ్‌లో ఈ వాహనాలు రిజిష్టర్ చేశారు. 45 వాహనాలు ఏపీలోనే ఉన్నాయని తెలిసింది. గోపాల్ రెడ్డి అండ్ కంపెనీ పేరిట 45 వాహనాలు, మిగిలినవి జఠాధర ఇండస్ట్రీస్ ప్రైవేటు లిమిటెడ్ పేరిట రిజిష్టర్ చేశారు. పీఆర్ హిల్ కోహిమా అని అడ్రస్ ఇచ్చారు, తాడిపత్రిలో పర్మనెంట్ అడ్రస్ ఇచ్చారు. జె.సి.ఉమారెడ్డి నాలుగు వాహనాలకు సంతకం చేశారు. సి.గోపాల్ రెడ్డి రెండు వాహనాలకు సంతకం చేశారు. నాగాలాండ్‌లో రిజిష్టర్ చేస్తే పట్టుబడమని అనుకున్నారు. అక్కడి నుంచి ఎన్ఓసీ కింద ఆంధ్రప్రదేశ్‌కు వచ్చాయి. అనంతపురంలో ఒక క్రిమినల్ కేసు వేశాము. ఇన్సూరెన్స్ కూడా దొంగ ఇన్సూరెన్స్ ఇచ్చారు. ఏప్రిల్ 2020 నుంచీ బీఎస్ - 6 కాకపోతే తిగడానికే వీలు లేదు. మోటారు వాహనాల చట్టం సెక్షన్ 182 ప్రకారం మేనుఫ్యాక్చరర్ తప్పుంటే చర్యలు తీసుకుంటాం. తప్పుడు పత్రాలు కనుక.. రిజిస్ట్రేషన్ రద్దు చేసి, ఇతర రాష్ట్రాలకు కూడా తెలిపాం. చట్ట వ్యతిరేకంగా తిరుగుతున్న వాహనాలు కనుక ఇప్పటి వరకూ 23 వాహనాలు సీజ్ చేశాం. లారీలను బస్సులుగా మార్చడంతో క్రిమినల్ కేసు నమోదు. ఏపీలోనే 29 రిజిష్టర్ కావడంతో, ట్రాన్స్పోర్ట్ అధికారులెవరైనా చర్యలు తప్పవు. అనంతపురంలోనే 29వాహనాలు రిజిష్టర్ అయ్యాయి. లారీ ఛాసిస్ తో మూడు బస్సులుగా మార్చారు. వాహనాలన్ని సి గోపాల్ రెడ్డి అండ్ కంపెనీ, జఠాధర కంపెనీ కింద రిజర్వేషన్లు అయ్యాయి. 6 వాహనాలకు సంబంధించి వాహన యజమానులతో పాటు అశోక్ లైలాండ్ కంపెనీపై కూడా క్రిమినల్ కేసు నమోదు చేశాం. దొంగ ఇన్సూరెన్స్‌లు పెట్టారు. యునైటెడ్ చీఫ్ ఇన్సూరెన్స్ కంపెనీతో కూడా ఈ విషయంపై మాట్లాడుతున్నాం . ఈ వ్యవహారంపై జాయింట్ కమిషనర్ నేతృత్వంలో యాక్షన్ కమిటీ ఏర్పాటు చేశార’ని తెలిపారు. -
శ్రీచైతన్య, నారాయణ కాలేజీల్లో ఐటీ దాడులు
-
టూరిజం రంగంలో దూసుకుపోతున్న ఏపీ
-
అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే రోజా
-
విజయవాడకు స్టాలిన్
-
టీడీపీ సర్కార్ క్యాన్సర్‌లా పట్టుకుంది: పార్థసారథి
సాక్షి, విజయవాడ : టీడీపీ సర్కార్ రాష్ట్రానికి క్యాన్సర్ జబ్బులా పట్టుకుందని, ఆర్థికంగా అతలాకుతలం చేస్తోందని వైఎస్సార్ సీపీ నేత కొలుసు పార్థసారథి దుయ్యబట్టారు. మంగళవారం ఆయన పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబు రాష్ట్రాన్ని ఆర్థిక వనరుగా మార్చుకుని విచ్చలవిడిగా దోచుకుంటున్నారని ఆరోపించారు. స్వలాభం కోసం విభజన హామీలను తాకట్టు పెట్టారని, అప్పుల అప్పారావుగా మారి రాష్ట్రాన్ని అప్పులో ఊబిలో ముంచేస్తున్నారని మండిపడ్డారు. బాబు దోచుకున్న సొమ్మునే బాండ్ల రూపంలో ఇన్వెస్టర్ల పేరుతో కొంటున్నారని, సీఆర్డీఏ ఆర్థికంగా బలంగా ఉంటే ఎందుకు బాండ్లు ఇవ్వాల్సి వస్తోందని ప్రశ్నించారు. రాష్ట్రంపై పడుతున్న ఆర్థిక భారం ఎవరు మోస్తారని నిలదీశారు. మంత్రుల ఛాంబర్లలోకి నీళ్లు ఎలా వచ్చాయని, మంత్రులే పైపులు కోశారా? అని ఎద్దేవా చేశారు. చంద్రబాబు ప్రభుత్వం రాష్ట్ర హక్కులను కాపాడటంలో విఫలమైందన్నారు. అందుకే అందినకాడికి దోచుకుందాం అనే ఆలోచనలో ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.