
సాక్షి, విజయవాడ: అనారోగ్యంతో ఇటీవల మృతిచెందిన ఎమ్మెల్సీ మహ్మద్ కరీమున్నీసా స్థానంలో ఆమె కుమారుడు రుహుల్లాను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఖరారు చేశారు. సీఎం నిర్ణయంతో ఎమ్మెల్సీ కార్యాలయం వద్ద సంబరాలు నిర్వహించారు.
ఎండీ రుహుల్లా, కార్పొరేటర్ షాహీన సుల్తానా సీఎం జగన్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం ఎండీ రుహుల్లా మీడియాతో మాట్లాడుతూ.. జీవిత కాలం సీఎం జగన్‌కి రుణపడి ఉంటాము. స్వర్గీయ ఎమ్మెల్సీ కరిమున్నీసా ఆశయాలను నెరవేరుస్తాం. మైనార్టీల సమస్యలు పరిష్కారమే ధ్యేయంగా పనిచేస్తానని ఎండీ రుహుల్లా అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment