
పెన్షన్ కోసం తొక్కిసలాట.. వృద్ధురాలి మృతి
విజయవాడలో విషాదం చోటు చేసుకుంది. పెన్షన్ తీసుకునేందుకు వచ్చిన ఓ వృద్ధురాలు తొక్కిసలాటలో చనిపోయింది.
హైదరాబాద్: విజయవాడలో విషాదం చోటు చేసుకుంది. పెన్షన్ తీసుకునేందుకు వచ్చిన ఓ వృద్ధురాలు తొక్కిసలాటలో చనిపోయింది. వివరాలిలా ఉన్నాయి..
చిట్టినగర్లో పెన్షన్ తీసుకునేందుకు సోమవారం తెల్లవారుజాము నుంచే వృద్ధులు వేచియున్నారు. గేటు తీయడంతో వారు ఒక్కసారిగా లోపలి వెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో తొక్కిసలాట జరగడంతో కొందరు కిందపడిపోయారు. కాంతమ్మ అనే మహిళ తీవ్రంగా గాయపడింది. ఆమెను ఆస్పత్రికి తరలిస్తుండగా, మార్గమధ్యంలో చనిపోయింది. తొక్కిసలాటలో మరో ఇద్దరు కూడా గాయపడ్డారు. ఈ ఘటనపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వృద్ధులు పెన్షన్ తీసుకునేందుకు తగిన ఏర్పాట్లు చేయలేదని, అధికారుల నిర్లక్ష్యం వల్లే తొక్కిసలాట జరిగిందని ఆరోపించారు. రోడ్డుపై వృద్ధురాలి మృతదేహంతో స్థానికులు బైఠాయించారు.