సాక్షి, విజయవాడ: రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ మరోసారి వివాదాస్పద ఉత్తర్వులు జారీ చేశారు. ఎన్నికల కోడ్‌ను సాకుగా చూపుతూ ఏపీ ప్రభుత్వం సంక్షేమ పథకాలను నిలిపేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఎన్నికల సంఘం సర్క్యులర్ జారీ చేసింది. దీంతో లక్షలాది మంది తల్లులు ఎదురుచూస్తున్న అమ్మఒడి పథకానికి ఎన్నికల కోడ్ అడ్డంకిగా మారింది. ఇదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇళ్లపట్టాల పంపిణీపైనా ఆంక్షలు విధించారు. చదవండి: (మళ్లీ ఏకపక్ష నిర్ణయం)
అయితే ఇప్పటికే అమ్మఒడి కార్యక్రమానికి సంబంధించి నెల్లూరులో సన్నాహాలు చురుగ్గా సాగుతున్నాయి. సంక్షేమ పథకాలపై గవర్నర్ ప్రసంగంలో పేర్కొన్నా, బడ్జెట్ కేటాయింపులు చేసినా పథకాల అమలు ఓటర్లను ప్రభావితం చేస్తుందంటూ ఎస్‌ఈసీ వాటిని ప్రజలకు అందించడం ఆపేయాలంటూ సర్క్యులర్ జారీ చేసింది. అయితే ఈ ఆదేశాల్లో స్పష్టంగా రాజకీయ అజెండా కనిపిస్తోందని నిపుణులు పేర్కొంటున్నారు. ఎస్‌ఈసీ ఏకపక్ష నిర్ణయాలపై పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. చదవండి: ('పుట్టుకతోనే ఎన్నికల కమిషనర్‌గా ఫీలవుతున్నాడు')
Comments
Please login to add a commentAdd a comment