విజయవాడలో జరిగిన సదస్సులో పాల్గొన్న వక్తలు
‘పేదవాళ్లు పింఛన్ కావాలన్నా.. రేషన్ కార్డును అడగాలన్నా గత ప్రభుత్వంలో జన్మభూమి కమిటీల చుట్టూ తిరగాల్సి వచ్చేది. అయినా వారికి న్యాయం జరుగుతుందనే నమ్మకం లేదు. కానీ వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన దగ్గర్నుంచీ సంక్షేమ పథకాలు అర్హుల ఇంటి గుమ్మంలోకే వస్తున్నాయి. గ్రాఫిక్స్‌లోనే కనిపించిన అభివృద్ధిని గ్రామ స్థాయిలో చేసి చూపించారు సీఎం వైఎస జగన్. అసత్య హామీలతో ప్రజలను చంద్రబాబు వంచించారు. అన్నం పెట్టే జగన్‌ను కాదని.. సున్నం రాసే బాబుకు జనం ఓటేయరు.’ అంటూ మేథావి వర్గం స్పష్టంగా చెప్పింది. ఆంధ్రప్రదేశ్ ఎడిటర్స్ అసోసియేషన్, సోషల్ డెమొక్రటిక్ ఫ్రంట్ సంయుక్తంగా ‘జగన్ పాలన–ప్రజా తీర్పు’ అనే అంశంపై బుధవారం విజయవాడలో రాష్ట్రస్థాయి ప్రజా సదస్సు నిర్వహించాయి. ఈ సమావేశంలో వివిధ రంగాలకు చెందిన మేధావులు పాల్గొన్నారు. వారి అభిప్రాయాలు వారి మాటల్లోనే..
– సాక్షి, అమరావతి
విద్యా రంగంలో మరో నార్వేలా ఆంధ్రప్రదేశ్
– ఎడిటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వీవీఆర్ కృష్ణంరాజు
సీఎం జగన్ రాష్ట్రంలో విద్యా రంగాన్ని అత్యున్నత స్థాయికి తీసుకెళ్తున్నారు. విద్యా రంగంలో ఏపీ మరో నార్వేగా మారుతోంది. తొలిసారిగా విద్యార్థులకు సీఎం జగన్ 6 లక్షల ట్యాబ్‌లు ఇచ్చారు. రూ. 8 వేల కోట్ల విలువైన కంటెంట్‌ను ఉచితంగా ఇస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో నో అడ్మిషన్స్ బోర్డు పెట్టే స్థాయికి తెచ్చారు. దేవాలయాలను పునరుద్ధరిస్తున్నారు. ప్రధాన దేవాలయాల అభివృద్ధికి మాస్టర్ ప్లాన్లు రూపొందించారు.
ప్రతి రంగంలోనూ ఏపీ అభివృద్ధిలో ఉంది. కోవిడ్ సమయంలో సీఎం జగన్ చేపట్టిన చర్యల వల్ల ఇతర రాష్ట్రాలతో పోల్చితే మరణాలు తక్కువ. ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఇతర ఎల్లో మీడియా సీఎం జగన్ ప్రభుత్వంపై బురద జల్లడమే పనిగా పెట్టుకున్నాయి. అసత్యాలతో ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నాయి. ఉదాహరణకు ఈ నెల 4న ఈనాడులో 53, జ్యోతిలో 50 నెగెటివ్ వార్తలు వచ్చాయి. సాక్షి పత్రికలో ప్రజా సంక్షేమం, రాష్ట్రాభివృద్ధిని ప్రతిబింబిస్తూ కథనాలు వస్తున్నాయి. ఏ పార్టీ లక్షణాలు ఏమిటో తెలుసుకోవడానికి ఇంతకంటే ఉదాహరణ అవసరంలేదు.
వై నాట్ 175 జరిగి తీరుతుంది
సీఎం వైఎస్ జగన్ అందిస్తున్న సంక్షేమ పథకాల వల్ల వైనాట్ వైఎస్సార్‌సీపీ మరోసారి ఘనవిజయం సాధిస్తుంది. సీఎం జగన్ చెప్పిన వై నాట్ 175 జరిగితీరుతుంది. సీఎం జగన్ ప్రజల జీవన ప్రమాణాలను పెంచేలా పాలన చేస్తున్నారు. రాష్ట్రానికి ఆర్థిక పరిపుష్టిని తీసుకువస్తున్నారు. ఎల్లో మీడియా విషపు రాతలు, ప్రతిపక్షాల కుట్రలు పటాపంచలయ్యేలా ప్రజలు మరోసారి సీఎం జగన్‌కు పట్టం కడతారు. సీఎం జగన్ పేదలకు ఇళ్లు కట్టిస్తుంటే చంద్రబాబు స్టేలు తెచ్చి వాటిని అడ్డుకోవాలని చూస్తున్నారు.
– సోషల్ డెమొక్రటిక్ ఫ్రంట్ అధ్యక్షుడు మాదిగాని గురునాథం
సీఎం జగన్ సంస్కరణలు మంచి ఫలితాలనిస్తాయి
సంక్షేమం అంటే మంచి జరగడం. సీఎం జగన్ పాలనలో ఇదే జరుగుతోంది. అన్ని వర్గాలకూ పథకాలు అందుతున్నాయి. సామాజిక న్యాయం, సంక్షేమమే ప్రధాన కర్తవ్యంగా సీఎం పనిచేస్తున్నారు. రాష్ట్ర ఆరి్థక సూచీలు వృద్ధిలో ఉన్నాయని కేంద్రమే ప్రశంసిస్తోంది. జగన్ చేస్తున్న సంస్కరణలు భవిష్యతులో మంచి ఫలితాలనిస్తాయి.
– గీతావిజన్ ట్రస్ట్ వ్యవస్థాపకులు పొక్కులూరి సుబ్బారావు
అది దుష్ప్రచారమే
బలిసినొడికీ బక్కోడికీ జరుగుతున్న పోరాటం ఇది. బలిసినోళ్ల వైపు చంద్రబాబు ఉంటే.., బక్కోళ్లకు అండగా సీఎం జగన్ ఉన్నారు. బాబు పాలనలో ఆటోడ్రైవర్లపై వేధింపులు ఎక్కువగా ఉండేవి. ఇప్పుడు వాహన మిత్రతో జగన్ మమ్మల్ని ఆదుకుంటున్నారు. పేదలకు సంక్షేమ ప«థకాలిచ్చి సోమరిపోతులను చేస్తున్నారనేది దు్రష్పచారమే.
– ఆటో డ్రైవర్స్ అసోసియేషన్ ప్రతినిధి వినోద్
బెస్ట్ సీఎం వైఎస్ జగన్
సంక్షేమం, అభివృద్ధి, అనేక సంస్కరణలతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బెస్ట్ సీఎం అనిపించుకుంటున్నారు. కోవిడ్ సమయంలో సీఎం వైఎస్ జగన్ చేపట్టిన చర్యలు నభూతో నభవిష్యతి. రెండేళ్లు కోవిడ్‌లో పోయాయి. ఆ తర్వాత రెండేళ్ల నుంచే అసలు పాలన మొదలైంది. ఈ రెండేళ్లలోనే విద్యా రంగంలో రాష్ట్రం కేరళను అధిగమించేలా చేశారు. మరో ఇరవై ఏళ్లు సీఎంగా జగన్‌కు అవకాశం ఇస్తే అమెరికా, సింగపూర్‌లా ఏపీ ఎందుకు అవదు? పాత ముఖ్యమంత్రిలా గ్రాఫిక్స్ చూపించడం లేదు. పోర్టులు వస్తున్నాయి. పరిశ్రమలు వస్తున్నాయి. ఇంటింటికీ డాక్టర్ వస్తున్నారు. ఇది జరుగుతుందని ఎప్పుడైనా ఊహించామా? రేషన్ ఇంటికే వస్తోంది. ఇలాంటి పాలన, ఇలాంటి సీఎం లేకపోతే రాష్ట్రం మరో 75 ఏళ్లు వెనక్కి పోతుంది.
– ఆంధ్రా అడ్వకేట్స్ ఫోరం కన్వీనర్ అశోక్ కుమార్
అందరికీ మంచి జరుగుతోంది
గత ప్రభుత్వంలో సబ్సిడీ లోన్ అని మూడో వంతు లంచాల రూపంలో తినేశారు. సీఎం జగన్ మమ్మల్ని ప్రతి దేవాలయంలో బోర్డు డైరెక్టర్లుగా నియమిస్తున్నారు. జగనన్న చేదోడు ద్వారా సాయం చేస్తున్నారు. మంత్రివర్గంలో చోటిచ్చారు. నాయీ బ్రాహ్మణులకు గతంలో కనీస వేతనాలు కోరినా ఇవ్వలేదు. సీఎం జగన్ గుడిబయట ఉండే నాయీ బ్రాహ్మణులను గుడిలోపలికి తీసుకువచ్చారు. క్షౌరశాలల్లో రూ.20 వేల జీతం ఇస్తున్నారు.
– నాయీ బ్రాహ్మణ సంఘం ప్రతినిధులు గణపతిరావు, మల్కాపురం కనకారావు
సీఎం జగన్ పాలన కోల్పోతే రాక్షస పాలన వస్తుంది
సీఎం జగన్ పేదల సంక్షేమం, రాష్టర సమగ్రాభివృద్ధితో సుపరిపాలన అందిస్తున్నారు. ఆయన క్రిస్టియన్ అయితే అనేక దేవాలయాలను అభివృద్ధి చేస్తారా? సీఎం వైఎస్ జగన్ అందిస్తున్న జనరంజక పాలనను కోల్పోతే రాక్షస పాలన వస్తుంది.
– ప్రొఫెసర్ రాచకొండ ముత్యాలరాజు
అభివృద్ధికి ఇదే నిదర్శనం
రాష్ట్రంలోని బ్యాంకుల్లో డిపాజిట్లు గతంలోకంటే ఇప్పుడు రూ.85 వేల కోట్లు పెరిగాయి. అభివృద్ధికి ఇదే నిదర్శనం. ప్రజల తలసరి ఆదాయం పెరిగింది. పరిశ్రమలు పారిపోతే ఈజ్ ఆఫ్ డూయింగ్‌లో ఏపీ ఏటా ప్రథమ స్థానంలో ఉంటుందా? అన్నం పెట్టే జగన్‌కే ప్రజలంతా ఓటేస్తారు. అబద్ధాలు, మోసాలతో సున్నం రాసే చంద్రబాబుకు జనం ఓటేయరు.
– బెటర్ ఆంధ్రప్రదేశ్ సంస్థ అధ్యక్షుడు మాదిరెడ్డి శ్రీనివాసరెడ్డి
ఎల్లో మీడియాదంతా అసత్య ప్రచారమే
చంద్రబాబుని మరోసారి అధికారంలోకి తెచ్చేందుకు ఎల్లో మీడియా మొత్తం అసత్య ప్రచారం చేస్తోంది. ఈ ప్రయత్నాన్ని అడ్డుకోవాలి. పెత్తందారుల పాలనను రానివ్వకూడదు. సీఎం జగన్ రూపాయి అవినీతి లేకుండా రూ. 2.50 లక్షల కోట్లు ప్రజలకు అందించారు. వాటి ద్వారా మన రాష్ట్ర ఆరి్థక వ్యవస్థ బాగుపడుతోంది. ప్రభుత్వ, ప్రైవేట్ సెక్టార్‌లో ఉద్యోగాలొచ్చాయి. రాష్ట్రానికి ఆస్తుల కల్పన జరిగింది.
– ఎన్నారై వెంకట్ మేడపాటి
ఇప్పుడున్నది ఆరోగ్యవంతమైన సమాజం
సీఎం వైఎస్ జగన్ పాలనలో రాష్ట్రం అన్ని విధాలా ముందుంది. ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నది ఆరోగ్యవంతమైన సమాజం. సీఎం జగన్ నాణ్యమైన విద్య, వైద్యాన్ని అందిస్తున్నారు. వ్యవసాయ రంగానికి భరోసా కల్పిస్తున్నారు. హెల్త్ క్లినిక్‌లు, ఆర్బీకేలతో గ్రామీణులకు మేలు చేస్తున్నారు.
– సోషల్ వర్కర్ వెంకటరెడ్డి
పేద పిల్లలు విదేశాల్లో చదవడం చిన్న విషయం కాదు
సీఎం జగన్ విద్యా రంగంలో విప్లవాత్మక సంస్కరణలు తెస్తున్నారు. ఎన్నో కష్ట నష్టాలకోర్చి ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లాలనుకొనే పేద పిల్లల కలలను సాకారం చేస్తున్నారు. వారికి అయ్యే ఖర్చంతా చెల్లిస్తున్నారు. పేద పిల్లలు విదేశాల్లో చదవడం చిన్న విషయం కాదు.
– విశ్రాంత అధ్యాపకులు రెహమాన్ సాయెబ్
ఏపీ తలెత్తుకొనేలా జగన్ పాలన
ఏపీ తలెత్తుకొనేలా సీఎం జగన్ పాలన సాగుతోంది. చంద్రబాబు హయాంలో ఒక్క పోర్టు, ఒక్క మెడికల్ కాలేజీ కట్టలేకపోయారు. సీఎం జగన్ 4 పోర్టులు, 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్ ల్యాండ్ సెంటర్లు కడుతున్నారు.17 వైద్య కళాశాలలు నిర్మిస్తున్నారు. 2.94 లక్షల ఉద్యోగాలిచ్చారు. కేంద్ర ఈపీఎఫ్ లెక్కల ప్రకారం 16 లక్షల ఉద్యోగాలొచ్చాయి.
– సామాజిక కార్యకర్త గూడపురెడ్డి శేఖరరెడ్డి
సుపరిపాలనంటే ఇదీ
సుపరిపాలన అంటే సీఎం జగన్ అందిస్తున్న పాలన. ప్రతి పేదవాడికీ ఇల్లు ఇస్తున్నారు. కార్పొరేట్ వైద్యం ఉచితంగా అందుతోంది. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా పాలనను ప్రజల ముంగిటకే తెచ్చారు. గతంలో ప్రభుత్వ విద్యా వ్యవస్థను నాశనం చేసి ప్రైవేటు విద్యాసంస్థలను ప్రోత్సహించారు.
– హోటల్స్ అసోసియేషన్ ప్రతినిధి ముక్కు వెంకటేశ్వరరెడ్డి
మదర్ థెరిసా ఆదర్శంగా జగన్ పాలన
మదర్ థెరిస్సాను సీఎం జగన్ ఆదర్శంగా తీసుకున్నారు. పార్టీలతో సంబంధం లేకుండా అన్ని వర్గాల పేదలకు నవరత్న పథకాలు అందిస్తున్నారు. పని చేయని వారు పని చేస్తున్న వారిని విమర్శించడం సహజం.
– గుంటూరు ఏసీ కళాశాల మాజీ ప్రిన్సిపల్ డాక్టర్ పోలే ముత్యం
బ్రాహ్మణులకు మేలు చేస్తున్న సీఎం జగన్
రాష్ట్రంలో బ్రాహ్మణులకు సీఎం వైఎస్ జగన్ చాలా మేలు చేస్తున్నారు. వంశ పారంపర్య వ్యవస్థను పునరుద్ధరించారు. బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. కామన్ డెవలప్‌మెంట్ ఫండ్ ఇచ్చారు. ధూప దీప నైవేద్యాలకు, అర్చకుల వేతనాలను కూడా భారీగా ఇస్తున్నారు.
– అర్చకులు ప్రసన్నాంజనేయ కుమారశర్మ
Comments
Please login to add a commentAdd a comment