intellectuals
-
వట్టి మేధావులు కాదు... మట్టి మేధావులు కావాలి!
2024 జూలై 24న కొల్లూరి సత్తయ్య అనే బీహెచ్ఈఎల్ కార్మిక నాయకుడు రిటైర్ అయ్యాడు. ఆయన రిటైర్మెంట్ సందర్భంగా ఆయన ఆత్మకథ ప్రచురిత మైంది. దాన్ని సత్తయ్య సొంత మాటల్లో పసునూరి రవీందర్ రాశాడు. ఈ ఆత్మకథను ప్రచురించే ముందు దానికి ముందు మాట రాయాలని పూర్తి పుస్తకాన్ని రవీందర్ నాకు ఆన్లైన్లో పంపించాడు. దాన్ని పూర్తిగా చదివాక బాల్య దశ నుండి సత్తయ్య జీవితం నన్ను నిజంగా ఆశ్చర్యపరిచింది. అటు వంటి ఒక దళిత కార్మికుని జీవిత కథను నేను ఎప్పుడూ చదవలేదు. ఆ పుస్తకానికి టైటిల్ కూడా మీరే సూచించండి అని సత్తయ్య, రవీందర్ అడిగి నప్పుడు ఈయనను ‘మట్టి మేధావి’ అనొచ్చని సూచించాను. ఆ పుస్తకం ఇప్పుడు ‘మట్టి మేధావి – కొల్లూరి సత్తయ్య – ఆటోబయోగ్రఫీ’ అనే టైటిల్‌తో బయటికి వచ్చింది.ముందుమాటలో నేను, ఇలా రాశాను: ‘‘కొల్లూరి సత్తయ్య జీవితకథ... ఒక మట్టి మేధావి చరిత్రలా కనిపిస్తుంది. ఆయన జీవితం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఒక చిన్న పల్లెటూరిలో (హైదరాబాద్ శివారు తెల్లాపూర్‌లో) ఒక మాదిగ కుటుంబంలో పుట్టి ఈ విధంగా ఎట్లా ఎదిగాడు అనిపిస్తుంది.’’సత్తయ్య మొదట్లో అసలు చదువురాని పది రూపాయల కూలీ మనిషి. బీహెచ్ఈఎల్లో పాకీ దొడ్లు కడుగుడు, క్యాంటీన్ ప్లేట్లు కడుగుడు పని చేసేవాడు. ఇంట్ల రైల్ వే గాంగ్మన్ తండ్రికి ఇద్దరు భార్యలు, 14 మంది పిల్లలు. సత్తయ్య అందరికంటే చిన్నవాడు. తండ్రి తప్ప మిగతా కుటుంబీకులు కూలీపని చేసేవారే. సత్తయ్య తల్లి మాత్రం మంత్ర సాని. ఆమె కులం మాదిగైనా డెలివరీలు చాలా బాగా చేసేది గనుక ఊళ్ళో పుట్టిన ప్రతి పిల్లకు క్షేమంగా కాన్పు చేయించే మంత్రసాని ఆమె.అందువల్ల ఆమెకు ఊళ్ళో బువ్వ దొరకని రోజుండేది కాదట. ఎక్కువ దొరికిన రోజు ఇంట్లో అందరి తోపాటు చుట్టు ఉన్న బిచ్చగాళ్లకు ఆమె బువ్వ పెట్టేది. అవ్వ (తల్లి) నుండి నేర్చుకున్న కొడుకు 10 రూపాయల్లో ఒక్క రూపాయి పక్కకు పెట్టి తమ గ్రామ శివార్లలో ఒంటికి చినిగిన బట్ట పేగులతో బతికే స్త్రీలకు చీర కొనిచ్చే పని మొదలుపెట్టాడు. క్రమంగా బీహెచ్ఈఎల్లో కార్మిక నాయకుడ య్యాడు. తనతో పాటు అతి చిన్న ఉద్యోగులను పర్మనెంటు చెయ్యాలని పోరాటాలు మొదలుపెట్టి కార్మికుల హక్కు కోసం అలుపెరుగని పోరాటాలు చేశాడు. ఈ క్రమంలో తెలుగులో చదవడం నేర్చు కున్నాడు.గ్రామ స్థాయిలో దళితుల భూములను (ముఖ్యంగా ఇనామ్ భూములు) భూదందా దారులు ఆక్రమించకుండా కాపాడే పోరాటాలు చేశాడు. క్రమంగా ఆర్థికంగా పుంజుకుంటూ కంప్యూటర్ సమస్య బీద విద్యార్థులు ఎదుర్కోగానే చిన్న కంప్యూటర్ సెంటర్ ప్రారంభించి బీద విద్యా ర్థులకు నేర్పించే ఏర్పాటు చేశాడు. కరోనా రాక ముందే అనాథ పిల్లలను తెచ్చి తన తాతకు ఇనాముగా వచ్చిన భూమిలో గదులు కట్టి తన పిల్లలు చదువుకున్న ఇంగ్లిష్ మీడియం బడుల్లో చేర్పించాడు. కరోనాతో ఆ సేవ ఆపాల్సి వచ్చింది. అప్పుడు ఆకలితో అలమటిస్తున్న వలస కూలీలకు బువ్వ బండి ప్రారంభించాడు. తన సొంత ఆదాయం నుండి ఖర్చుపెట్టి రోజుకు 400 మందికి మిల్లెట్ బ్రేక్‌ఫాస్ట్ రోజూ పెట్టేవాడు. ఆ బువ్వ బండి ఇప్పటికీ నడుస్తోంది. ఆ క్రమంలోనే నా సలహాతో ‘ఫూలే–అంబేడ్కర్ సెంటర్ ఫర్ ఫిలాసఫీ అండ్ ఇంగ్లిష్ ట్రైనింగ్’ ప్రారంభించాడు. దీన్ని చట్టపరంగా నడిపేందుకు ‘అమృత–సత్తయ్య కొల్లూరి ఎడ్యుకేషన్ సొసైటీ’ స్థాపించాడు. 2022 జనవరి 26న ప్రారంభమైన ఈ ఫిలాసఫీ–ఇంగ్లిష్ ట్రైనింగ్ దాదాపు 500 మందిని 23 రాష్ట్రాల నుండి సెలెక్ట్ చేసి ప్రతి 40 మందితో బ్యాచ్‌కి నెలరోజులు ఉచిత వసతి, ఉచిత తిండితో ట్రైనింగ్ ఇచ్చారు. ఈ సత్తయ్యే 2024 జనవరి 30న తెల్లాపూర్‌లో గద్దర్ విగ్రహాన్ని స్థాపించాడు. దానికి ప్రభుత్వం 10 కుంటల భూమి ఇచ్చింది.సత్తయ్యను మట్టిమేధావి (ఇంగ్లిష్‌లో ఇటువంటి వారినే ఆర్గానిక్ ఇంటలెక్చువల్స్) అని ఎందుకన్నారని నన్ను కొంతమంది అడిగారు. ఆయన పెద్దగా చదువుకోలేదు కానీ దళితుల, ఆది వాసుల, శూద్ర, బీసీలలో బీద పిల్లల చదువుల గురించి చాలా కృషి చేస్తున్నాడు. మట్టి అన్ని ఉత్ప త్తులకు మూలం. ఉత్పత్తులకు మతం మూలం లేదు. మట్టికి–గింజకు, మట్టికి–జంతు వుకు ఉన్న సంబంధాన్ని మట్టిలో పనిచేసే మనుషులే మేధా వులై కనిపెట్టారు. ఇక్కడే మొట్టమొదట మానవ తత్వశాస్త్రం పుట్టింది. స్త్రీ కడుపులో పుట్టిన మను షులు తిరిగి మట్టి బొందలోకి పోయేవరకు మట్టిని ప్రేమిస్తారు. మట్టితో పోరాడుతారు. అన్ని ఉత్పత్తి సంబంధాలు, మానవ సంబంధాలను మట్టిలో పని చేసే మనుషులు... పుస్తకాలు, మతాలు లేక ముందే ఏర్పర్చుకున్నారు. మట్టి మేధావులు... పుస్తకాలు, మతాలు సమాజంలోకి రాకముందే సమాజాలను అభివృద్ధి చేసుకుంటూ వచ్చారు. అయితే భారత దేశంలో మతాలు, వేదాలు వచ్చాక శూద్రుల్లో, దళితుల్లో, ఆదివాసుల్లో ఇటువంటి మట్టి మేధా వులు ఉన్నారు. కాబట్టి వారిని చదువుకు, రాతకు, మతాలను నడపడానికి దూరంగా ఉంచారు. కాల్ప నిక, ఊహాజనిత అంశాలపై పుస్తకాలు రాసేవారు మేధావులనీ; రైతులు, కార్మికులు సత్తయ్యలా మానవత్వంతో సమాజాన్ని మార్చుకుంటూ వచ్చిన వారిని అసలు గుర్తించని సాహిత్యం తయారు చేశారు. ఇటువంటి ఉత్పత్తి సంబంధ రహిత రచయితలను ‘వట్టి మేధావులు’ అనాలి.ఈ దేశంలో కాళిదాసు నుండి కాళోజీ వరకు ఊహాజనిత కవిత్వాన్ని కావ్యాల రూపంలో రాసినవాళ్లే. కాళిదాసు ‘మేఘ సందేశం’లో భూమి మీదికి తొయ్యబడ్డ యక్షుడు మేఘం ద్వారా కైలాసంలో ఉన్న భార్యకు పంపిన ప్రేమ సందేశంలో ఈ దేశ వర్ణన అంతా ఊహాజనితమైందే. ఇక్కడి వ్యవసాయ భూములు, వాటిలో పంటలు పండిస్తున్న రైతుల గురించి ఒక పద్యం కూడా అందులో లేదు. మహాకాళి ఆలయ వర్ణన ఉంది గానీ, మహా ఉత్పత్తి రంగమైన పంటపైగానీ, శ్రమచేసి పండించే రైతు బతుకుపై కానీ ఒక పద్యం కూడా లేదు.ఆనాటి సంస్కృత సాహిత్య ఉత్పత్తి వ్యతిరేక వారసత్వం ప్రాంతీయ భాషల్లోకి కూడా పాకి శ్రమను గౌరవించని, లేదా శ్రమను పట్టించుకోని రచయితలు పుట్టుకొచ్చారు. అందుకే ఈ సాహి త్యానికి ప్రపంచ గుర్తింపు లభించలేదు. ప్రకృతి వర్ణన స్త్రీ పురుషుల ప్రేమ కోసమో, యుద్ధ నిర్మా ణాల అవసరాల కోసమో కాదు చెయ్యాల్సింది. ప్రకృతిని ప్రజల శ్రమ జీవనంతో ముడేసిన రచనలు దేశంలో వచ్చినప్పుడు సాహిత్యం సార్వ జనీనత్వం సంతరించుకుంటుంది.గద్దర్ పాటల సాహిత్యంలో పుట్టుకొచ్చిన మట్టి చేతులకు గౌరవం గానీ, సత్తయ్య మాన వత్వపు మట్టిమేధావితత్వం గానీ సమాజాన్ని రోజువారీగా అభివృద్ధి వైపు పయనింపజేస్తుంది. మట్టి మేధావులకు వట్టి మేధావులకు ఉండే తేడా... భూమిపైన మానవ సమానత్వ స్వర్గాన్ని సృష్టించడానికీ, మనుషులు చనిపోయాక స్వర్గం చూపెట్టే తత్వానికీ ఉండే తేడా! మొదటి ఆలోచనలో దేవుడు శ్రమ గౌరవ వాది. రెండవ ఆలోచనలో దేవుడు శ్రమ వ్యతిరేకవాది. ఉత్పత్తి కులాలను ప్రేమించ లేని కుల సమీకరణలు సాహిత్య రంగాన్ని యుద్ధ మయం, ప్రేమమయం చేశాయి. అందుకే సత్తయ్య లాంటి వారి ఆత్మకథలను పిల్లలు చదివినప్పుడు ఉత్పత్తి, శ్రమ, సర్వజంతు ఆదరణవాదులౌతారు. జంతువుల్లో ఒక దాన్ని ఎన్నుకొని పూజించడం జంతుజాతిని కాపాడదు. అన్ని జంతువులనూ ప్రేమించి మేపాలి.భూములు పంచిన భూస్వాములున్నారు. ఆస్తులొదిలి స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్న అగ్ర కులస్థులున్నారు. కానీ వాళ్ళు మానవ సమా నత్వాన్ని కోరుకోవడంలో విఫలమయ్యారు. ముఖ్యంగా విద్యా సమానత్వం రూపొందించాలనే ఆలోచనకు వాళ్ళ కులం అడ్డొచ్చింది. సత్తయ్య మాత్రం తాను బడిలో, కాలేజీలో, యూనివర్సి టీలో చదువుకోక పోయినా అంబేడ్కర్ లాగా, మహాత్మా ఫూలే లాగా ఈ దేశ బీద పిల్లలు ఇంగ్లి ష్లో చదువుకొని వాళ్ళ సిద్ధాంతాలను నేర్చుకొని దేశ మార్పునకు కృషి చెయ్యాలని పనిచేస్తున్నాడు.అందుకే సత్తయ్యను మట్టి మేధావి అనాలి. వట్టి మేధావులు కూడా ఆయన జీవిత చరిత్ర చదివి నేర్చుకుంటే దేశానికి మేలు చెయ్యగలరు.ప్రొ‘‘ కంచ ఐలయ్య షెపర్డ్ వ్యాసకర్త ప్రముఖ రచయిత,సామాజిక కార్యకర్త -
చంద్రబాబును మరోసారి నమ్మొద్దు
సాక్షి, అమరావతి: అధికారంలో ఉన్నన్నాళ్లూ ప్రభుత్వ ఉద్యోగులను ముప్పతిప్పలు పెట్టిన చంద్రబాబును మరోసారి నమ్మవద్దని పలువురు విశ్రాంత ఉద్యోగులు, మేధావులు, విద్యావేత్తలు కోరారు. సమస్యలపై ప్రశ్నిస్తే ఉద్యోగుల తోకలు కత్తిరించాలంటూ వారి ఆత్మాభిమానంపై దెబ్బకొట్టారని గుర్తు చేశారు. ‘ప్రజలు–ప్రభుత్వం–ఉద్యోగులు’ అనే అంశంపై రాష్ట్ర స్థాయి సదస్సు విజయవాడలో మంగళవారం జరిగింది. ఓపెన్ మైండ్స్ సంస్థ అధ్యక్షుడు డాక్టర్ ఎన్.రాజశేఖర్‌రెడ్డి నేతృత్వంలో జరిగిన ఈ సదస్సులో పాల్గొన్న ప్రతి ఒక్కరూ ఉద్యోగుల మద్దతు వారికి మేలు చేసిన వైఎస్సార్సీపీకే ఉంటుందని తేల్చిచెప్పారు. ఉద్యోగులు, సీఎం వైఎస్ జగన్ మధ్య అన్నదమ్ముల అనుబంధం ఉందని వెల్లడించారు. సామాన్య ప్రజలను దృష్టిలో ఉంచుకుని ఉద్యోగుల డిమాండ్లు ఉంటే బాగుంటుందన్నారు. వారు కూడా ప్రభుత్వంలో అంతర్భాగం కాబట్టి ప్రభుత్వాన్ని విమర్శించడం సరికాదని హితవు పలికారు. పొరపాటున చంద్రబాబు అధికారంలోకి వస్తే 15వ తేదీకి కూడా జీతాలు అందవని హెచ్చరించారు. అసలు ప్రభుత్వ ఉద్యోగులనే వ్యవస్థే కనుమరుగయినా ఆశ్చర్యపోనవసరం లేదన్నారు. కార్యక్రమంలో మెజర్ కిరణ్ కుమార్, లెక్చరర్ కళ్యాణి, సమాజిక కార్యకర్త శాంతమూర్తి, సాఫ్ట్వేర్ ప్రొఫెçషనల్ జగన్మోహన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వక్తలు ఏమన్నారంటే..3రాష్ట్రాన్ని ఆర్థిక సంక్షోభంలోకి నెట్టింది చంద్రబాబే..రాష్ట్ర విభజన తర్వాత అధికారంలోకి వచ్చి, రాష్ట్రాన్ని చంద్రబాబు ఆర్థిక సంక్షోభంలోకి నెట్టారు. జగన్ అధికారంలోకి వచ్చాక దానికి కాయకల్ప చికిత్స చేయడం మొదలుపెట్టారు. కానీ కరోనా వల్ల ఆర్థిక వ్యవస్థ మళ్లీ దెబ్బతింది. రూ.60 వేల కోట్లను ప్రభుత్వం నష్టపోయింది. రాష్ట్ర బడ్జెట్లో సగం ఉద్యోగుల జీతభత్యాలకే పోతోంది. మిగిలిన సగం నాలుగున్నర కోట్ల మంది ప్రజలకు ఖర్చు చేయాల్సి ఉంది. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు కాంట్రాక్టు వ్యవస్థను ప్రవేశపెట్టారు. కొత్త ఉద్యోగాలివ్వలేదు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యాక నియామకాల విప్లవం తెచ్చారు. కాంట్రాక్టు ఉద్యోగులకు సైతం 1వ తేదీనే నేరుగా జీతాలందేలా చేశారు. దశాబ్దాలుగా పదోన్నతులు లేని వారికి పదోన్నతులిచ్చారు. చైల్డ్ కేర్ సెలవులను 180 రోజులకి పెంచారు. సచివాలయ ఉద్యోగులను రెగ్యులర్ చేశారు. తాజా మేనిఫెస్టోలో మరికొన్ని హామీలిచ్చి నెరవేరుస్తాననే నమ్మకమిచ్చారు. అదే చంద్రబాబు హామీలు నెరవేర్చాలంటే పీఆర్సీ, జీతాలు ఎగ్గొట్టాలి. లేదంటే రాష్ట్ర బడ్జెట్ సరిపోదు. –డాక్టర్ ఎన్.రాజశేఖర్‌రెడ్డి, అధ్యక్షుడు, ఓపెన్ మైండ్స్చంద్రబాబు వస్తే జీతాలు కష్టమే..అడగకుండానే సీఎం జగన్ క్లాస్ 4 ఉద్యోగుల జీతాలను పెంచారు. అదే చంద్రబాబు ‘ఉద్యోగుల తోకలు కత్తిరించాలి’ అన్నమాటను నేటికీ ఎవరూ మర్చిపోలేదు. ఇప్పుడు రూ.లక్ష కోట్లతో సంక్షేమ పథకాలు అమలు చేస్తానని అంటున్నారు. అంటే అప్పుడు 15వ తేదీకి కూడా జీతాలు రావు. పోనీ ఉద్యోగులకు ఏదైనా చేస్తానని మేనిఫెస్టోలో చెప్పారా అంటే లేదు. గతంలో ఉద్యోగుల ఆత్మాభిమానాన్ని చంద్రబాబు దెబ్బతీశారు. ప్రభుత్వ ఉద్యోగులు అనే వ్యవస్థనే లేకుండా చేయాలనుకున్నారు. –పి.విజయబాబు, అధ్యక్షుడు, ఏపీ ఇంటలెక్చువల్ ఫోరంచంద్రబాబు ఉద్యోగులకు డీఏ అవసరం లేదన్నారు..ప్రభుత్వ ఉద్యోగులు ఈ ప్రభుత్వానికి సహకరించాలి. ఎందుకంటే గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని సచివాలయాల ద్వారా సీఎం జగన్ తీసుకువచ్చారు. విద్యకు ఆయన అత్యధిక ప్రాధాన్యతనిచ్చారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు పెన్షన్‌దారులకు డీఏ అవసరం లేదన్నారు. అంతేకాకుండా ప్రభుత్వ ఉద్యోగుల గురించి ఎంత దారుణంగా మాట్లాడారో చూశాం. –ప్రొఫెసర్ జి. రామచంద్రారెడ్డి, విద్యావేత్తఆర్టీసీని ఆదుకుంది జగన్ ప్రభుత్వమే..అప్పుల్లో ఉన్న ఆర్టీసీని సీఎం వైఎస్ జగన్ తమ ప్రభుత్వంలో విలీనం చేశారు. గతంలో జీతాల కోసం బ్యాంకుల చుట్టూ తిరగాల్సి వచ్చేది. అప్పుచేసి జీతాలిచ్చేవారు. ఇప్పుడు ప్రభుత్వం ప్రతి నెలా రూ.300 కోట్లు ఇస్తోంది. రూ.5 వేల నుంచి రూ.10 వేల వరకూ ఉద్యోగుల జీతాలు పెరిగాయి. ప్రభుత్వ సహకారంతో అప్పులు రూ.6 వేల కోట్ల నుంచి రూ.2 వేల కోట్లకు ఆర్టీసీ తగ్గించగలిగింది. –కోటేశ్వరరావు, విశ్రాంత ఆర్టీసీ అధికారిమంచి చేస్తున్న ప్రభుత్వాన్ని కాపాడుకోవాలివైఎస్ జగన్ ప్రభుత్వం ఉద్యోగులకు మేలు చేసింది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసింది. వేతన సవరణ అడగకుండానే ఇచ్చింది. మళ్లీ అధికారంలోకి రాగానే ఇళ్ల స్థలాలు ఉచితంగా ఇస్తామంటోంది. ఇంత మంచి చేస్తున్న ప్రభుత్వాన్ని అందరం కాపాడుకోవాలి. –ప్రొ.వి.నారాయణరెడ్డి, మాజీ రిజిస్ట్రార్ప్రభుత్వానికి ఉద్యోగులు మద్దతు ఇవ్వాలిప్రభుత్వాన్ని ఉద్యోగులు విమర్శించడం సరికాదు. అన్నదమ్ముల్లా ఉద్యోగులు, ప్రభుత్వం కలిసుండాలి. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఏం కావాలో అవన్నీ చేస్తోంది. సంక్షేమ పథకాలను ఇంటి వద్దే అందిస్తోంది. ఉద్యోగులు కూడా ప్రజా సంక్షేమాన్ని పట్టించుకునే ప్రభుత్వానికే మద్దతివ్వాలి. –పి.సుశీలరెడ్డి, సామాజిక కార్యకర్త -
ల్యాండ్ టైట్లింగ్ చట్టంపై అన్నీ అపోహలే
సాక్షి, అమరావతి: ల్యాండ్టైట్లింగ్ చట్టంపై అవగాహన లేకుండా కొందరు దుర్మార్గ ప్రచారం చేస్తున్నారని ఇండియన్ ఇంటెలెక్చువల్ ఫోరం మండిపడింది. రెవెన్యూ, న్యాయపరమైన అంశాలు తెలియనివారు దీనిపై మాట్లాడుతున్నారని ధ్వజమెత్తింది. ప్రభుత్వం భూములు లాక్కుంటుందనేది శుద్ధ అబద్ధమని తేల్చిచెప్పింది. గుంటూరు జిల్లా తాడేపల్లిలో సోమవారం ఇండియన్ ఇంటెలెక్చువల్ ఫోరం ఆధ్వర్యంలో ల్యాండ్ టైట్లింగ్ చట్టంపై రౌండ్‌టేబుల్ సమావేశం జరిగింది. ఇందులో సీఎం సలహాదారు, విశ్రాంత ఐఏఎస్ అధికారి అజేయ కల్లం, భూచట్టాల నిపుణుడు సునీల్ కుమార్, తదితరులు పాల్గొన్నారు. అజేయ కల్లం మాట్లాడుతూ ఈ చట్టంపై హైకోర్టు స్టే ఇచ్చిందని, ఇక ఎలా అమలు చేస్తారని ప్రశ్నించారు. భూముల రీ సర్వే పూర్తయ్యాక టైట్లింగ్ మొదలవుతుందని, అప్పుడే డిక్లరేషన్ జరుగుతుందన్నారు. తీసుకువచ్చే మార్పులు చేర్పుల గురించి కోర్టుకు తెలిపాక, అందరితో సంప్రదించాక ఈ చట్టాన్ని అమలు చేస్తామని స్పష్టం చేశారు. టైట్లింగ్ యాక్ట్, రీ సర్వే, ఇ–స్టాంపింగ్ విధానాలు అద్భుతమైన సంస్కరణలని కొనియాడారు. ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందనే వాటిని ఎలాగైనా అడ్డుకోవాలని దుష్ప్రచారాలు చేస్తున్నారని విమర్శించారు. ల్యాండ్ టైటిల్స్ కోర్టులు ఇవ్వాలి తప్ప రెవెన్యూ శాఖకు ఏం పని అంటున్నారని, దీనిపై నవ్వాలో, ఏడవాలో తెలియడం లేదన్నారు. ఆర్ఓఆర్ లేక ల్యాండ్ టైట్లింగ్ చట్టం చేసే అధికారం కేవలం కార్వనిర్వాహక వ్యవస్థకే ఉంటుందన్నారు. కోర్టుల్లో కేవలం వివాదాల పరిష్కారానికి, వాటిపై అభిప్రాయాలు చెప్పడానికి మాత్రమే అవకాశం ఉంటుందని తెలిపారు. భూ రికార్డుల వ్యవస్థను భ్రష్టు పట్టించినవారే ఇప్పుడు వాటిని పరిష్కరించేందుకు తీసుకువస్తున్న ల్యాండ్ టైట్లింగ్ చట్టంపై దుష్ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. 1983 నుంచే భూ రికార్డుల వ్యవస్థ భ్రష్టు పట్టడం మొదలైందన్నారు. ప్రతి సంవత్సరం జమాబందీ, అజమాయిషీ సర్వేలు చేస్తూ కచ్చితమైన రికార్డుల వ్యవస్థగా ఉన్న కరణం వ్యవస్థను ప్రత్యామ్నాయం లేకుండా ఒక్కసారిగా రద్దు చేశారని విమర్శించారు. దీంతో పదేళ్లపాటు క్షేత్రస్థాయిలో రెవెన్యూ రికార్డులు తయారు చేసేవారు లేకుండాపోయారన్నారు. దీనివల్లే వివాదాలు పెరిగాయని, నకిలీలు, రాజకీయ జోక్యం పెరిగిపోయిందన్నారు. ఆ వ్యవస్థను ప్రక్షాళన చేసి మంచి వ్యవస్థను తీసుకువçస్తుంటే దానిపై వ్యతిరేక ప్రచారం చేస్తున్నారని విమర్శించారు.12కి పైగా రాష్ట్రాల్లో ఇ–స్టాంపింగ్ వ్యవస్థ తెల్గీ స్టాంపుల కుంభకోణం తర్వాత కేంద్ర ప్రభుత్వం స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ ఏర్పాటు చేసిందని అజేయ కల్లం గుర్తు చేశారు. ఇప్పుడున్న స్టాంప్ పేపర్ల కంటే ఎక్కువ భద్రతా ఫీచర్లతో ఆ సంస్థ ఇ–స్టాంపింగ్ వ్యవస్థను తెచ్చిందన్నారు. మహారాష్ట్రలో 2015లో ఈ విధానాన్ని తొలిసారి అమలు చేశారని, అది విజయవంతమయ్యాక ఇప్పుడు 12కిపైగా రాష్ట్రాలు అమలు చేస్తున్నాయని తెలిపారు. 2016లో మన రాష్ట్రంలోనూ తాను రెవెన్యూ కార్యదర్శిగా ఉన్నప్పుడు ఆ కార్పొరేషన్‌ను ఆహ్వానించి పైలెట్ ప్రాజెక్టు చేయమన్నానని గుర్తు చేశారు. ఆ తర్వాత ఇప్పుడు ప్రభుత్వం మళ్లీ సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేసి ఇ–స్టాంపింగ్ వ్యవస్థను తీసుకువచ్చిందన్నారు. దాని ట్రయల్స్ కోసం 16 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో 135 డాక్యుమెంట్లు చేయాలని రిజిస్ట్రేషన్ల శాఖ మెమో ఇస్తే.. దానికి, ల్యాండ్ టైట్లింగ్ చట్టానికి లింకు పెట్టి తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఇ–స్టాంపులు జిరాక్స్ పేపర్లు కావన్నారు. అందులో నాన్–జ్యుడీషియల్ స్టాంపు పేపర్ల కంటే ఎక్కువ భద్రతా ఫీచర్లు ఉంటాయని తెలిపారు.నల్లచట్టంగా ప్రచారం చేయడం దురదృష్టకరం: భూచట్టాల నిపుణుడు సునీల్కుమార్భూ చట్టాల నిపుణులు, నల్సార్ యూనివర్సిటీ అసోసియేట్ ప్రొఫెసర్ సునీల్‌కుమార్ మాట్లాడుతూ ల్యాండ్ టైట్లింగ్ చట్టాన్ని నల్ల చట్టంగా ప్రచారం చేయడం దురదృష్టకరమన్నారు. ఈ చట్టం ద్వారా భూములు లాగేసుకుంటారని, కోర్టులకు అధికారాలు ఉండవని, అన్ని అధికారాలు తీసుకెళ్లి టైటిల్ రిజిస్టర్ అధికారికి ఇస్తున్నారని, ఆయన ఎవరికి కావాలంటే వారికి భూములు రాసేస్తారనే ప్రచారాలు పూర్తిగా తప్పని స్పష్టం చేశారు. ఈ చట్టం అమలు జరగకపోతే రాష్ట్రం మళ్లీ 50 ఏళ్లు వెనక్కిపోతుందన్నారు. ఉన్న భూములకు ప్రభుత్వమే గ్యారంటీ ఇచ్చి వారి హక్కులను కాపాడుతుందే తప్ప భూములను లాక్కునే ప్రశ్నే ఉత్పన్నం కాదన్నారు. ఉన్న రికార్డుల ఆధారంగా ప్రభుత్వం ఒక రిజిస్టర్ తయారు చేస్తుందని, దాన్ని ప్రజలందరికీ అందుబాటులో పెడతారన్నారు. దానిపై అభ్యంతరాలు వ్యక్తం చేసే అవకాశం ఉంటుందని చెప్పారు. రీ సర్వే ద్వారా తయారయ్యే రికార్డును టైటిల్ రిజిస్టరింగ్ చట్టం కింద ప్రకటిస్తారని, అది ఆన్లైన్లో అందరికీ అందబాటులో ఉంటుందని వివరించారు. కోర్టుకు వెళ్లే అవకాశం ఉండదనేది తప్పని, ప్రస్తుతం కోర్టుల్లో నడుస్తున్న కేసులు అలాగే నడుస్తాయన్నారు. అలాగే భూములు అమ్మాలన్నా, దానం చేయాలన్నా టైటిల్ రిజిస్ట్రార్ అనుమతి కావాలనేది అపోహేనని తేల్చిచెప్పారు. కొత్త చట్టం తహశీల్దార్‌కి, సబ్ రిజిస్ట్రార్‌కి ఉన్న అధికారాలను ఒక చోటకు చేరుస్తుందన్నారు. ఒకసారి రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఆటోమేటిక్‌గా రిజిస్ట్రేషన్ జరిగి రికార్డులోనూ మార్పు కూడా జరిగిపోతోందన్నారు. భూముల రీ సర్వే పూర్తయితే భూములకు సంబంధించి 80 రకాల సమస్యల్లో చాలావరకు తగ్గుతాయన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ లీగల్ సెల్ కన్వీనర్ మనోహర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
చారిత్రక మూలాల్లో జ్ఞాన కాంతులు
ఏ దేశానికైనా, ఏ జాతికైనా చారిత్రక తాత్విక జ్ఞానం అవసరం. నిజానికి తొలి నుంచీ ఉన్నది భౌతికవాదమే. భారతదేశంలోని భౌతికవాద చింతన అన్ని కీలక పరిణామాల్లో ప్రధాన శక్తిగా నిలిచింది. మానవుడు భౌతిక ప్రపంచం నుండి ప్రభవించడం వల్ల అతని ఆలోచనలు, భావాలు, ఊహలు భౌతిక వాస్తవికత వైపే మొదట్లో పయనించాయి. నిప్పును, నీరును, గాలిని, భూమిని; వాటి భౌతిక రూపాలను తెలుసుకోవడమే మానవుని అభివృద్ధి సోపానం. అయితే అనేక సందర్భాలలో ప్రజలు వెలుగు నుండి చీకట్లోకి, జ్ఞానం నుండి అజ్ఞానంలోకి, వాస్తవం నుండి భ్రమలలోకి తిరోగమిస్తూ ఉంటారు. అప్పుడే అభ్యుదయవాదులు వారిలో జ్ఞానతృష్ణను కలిగించాలి. భారతదేశ తాత్విక మూలాలపై ఈనాడు లోతైన చర్చ జరుగుతోంది. నిజానికి భారతీయ తత్వశాస్త్రాన్ని సృష్టించినవారు మూలవాసులు. వీరు మెసపటో మియా, సింధూ నాగరికతల కాలం నాటివారు. వీరి మౌఖిక జ్ఞాన సంపదకు ప్రత్యామ్నాయంగానే వైదిక సాహిత్యం వచ్చింది. వైదిక సాహిత్యం కూడా మొదట్లో మౌఖిక రూపంలోనే ఉంది. తర్వాత లిఖిత రూపం ధరించింది. భారతీయ తత్వశాస్త్రం ప్రధానంగా భౌతికవాద తత్వశాస్త్రం. భారతదేశంలో తత్వశాస్త్రమంటే ఆధ్యాత్మిక వాదంగా ప్రచారం చేశారు. తత్వశాస్త్రమనగానే అది ఆత్మ గురించో, పరలోకం గురించో చెప్పేదనే భావన ఏర్పడింది. నిజానికి భౌతిక అంశాల నుండి రూపొందినదే తత్వశాస్త్రం. భారతదేశంలో అతి ప్రాచీన జాతులు తాత్వికాంశాల మీద సుదీర్ఘమైన చర్చ చేశాయి. శరీరానికీ, చైతన్యానికీ ఉన్న సంబంధాన్నీ; మానవునికీ, ప్రకృతికీ ఉన్న సంబంధాన్నీ, విశ్వ పరిణామాన్నీ, మానవ పరిణామాన్నీ వీరు అర్థం చేసు కోవడానికి ప్రయత్నించారు. ప్రకృతి; సమాజం పట్ల ఉదయించిన అనేక ప్రశ్నలకు భౌతిక దృక్పథంతో సమాధానం వెదికారు. మానవుడు భౌతిక ప్రపంచం నుండి ప్రభవించడం వల్ల అతని ఆలోచనలు, భావాలు, ఊహలు భౌతిక వాస్తవికత వైపే మొదట్లో పయనించాయి. నిప్పును, నీరును, గాలిని, భూమిని; వాటి భౌతిక రూపాలను తెలుసుకోవడమే మానవుని అభివృద్ధి సోపానం. నిప్పు మానవ సామాజిక పరిణామంలో కీలక పాత్ర వహించింది. నిప్పును ఆరాధించిన జాతుల కంటే, నిప్పును భౌతిక శక్తిగా గుర్తించిన జాతులు శక్తిమంతంగా ముందుకు నడిచాయి. నిప్పు మానవ జీవితాన్ని ఒక భౌతిక శక్తిగా ప్రభావితం చేసింది. నిప్పును ఆరాధించే జాతులకూ, నిప్పును అధీనం చేసుకొన్న జాతులకూ సమరం జరిగింది. తన చుట్టూ వున్న భౌతిక ప్రపంచాన్ని సమన్వయించుకోవడంలో విఫలమై నవారు భావవాదులుగా రూపొందారు. వీరు భౌతిక సామాజిక వాస్తవికతకు భిన్నమైన భావవాదంతో భౌతికవాదులకు ఎదురు నిలుస్తూ వచ్చారు. అంతేగాక వానరుడి నుండి నరుడిగా పరిణామం చెందిన ప్రతి కీలక దశలోనూ మానవుని భౌతిక దృక్పథమే అతనికి నిర్ణయాత్మక మెట్టుగా ఉపకరించింది. లక్షలాది సంవత్సరాలకు పూర్వం ఉష్ణమండలంలో ఎక్కడో ఒక చోట నరవానరుడిగా ఉన్న మానవుడు మానవుడిగా రూపొందిన పరిణామంలో చేతుల్ని ఉపయోగించుకున్న తీరును ఎంగెల్స్ వర్ణించాడు. రోమ శరీరులైన మన పూర్వీకులు మొదట ఒక నియమంగానూ, తరువాత అవసరంగానూ నిలబడ టానికి కారణం ఆనాటికి చేతులకు వివిధ రకాలైన ఇతర పనులు ఏర్పడి ఉంటాయని అనుకోవాలి. వానరాలు ఆహారాన్ని స్వీకరించడానికి, ఆహారాన్ని పట్టుకోవడానికి చేతులను ఉపయోగిస్తాయి. కొన్ని రకాల క్రింది తరగతి స్తన్య జంతువులలో కూడా ముందు పంజాలను ఉపయోగించడం మనం చూస్తాం. చాలా రకాల కోతులు తాము చెట్ల మీద నివసించడానికై గూళ్ళను నిర్మించడానికి చేతులను ఉప యోగిస్తాయి. చింపాంజీలు తమ చేతులతో చెట్ల కొమ్మల మధ్య కప్పులు చేసుకొని ఎండ వానల నుండి కాపాడుకుంటాయి. శత్రువుల నుండి ఆత్మ రక్షణకై ఇవి చేతులతో కర్రలను, కొమ్మలను పట్టుకొని కొట్టడానికి పూనుకొంటాయి. బోనుల్లో ఉంచిన కోతులు మానవులను చూచి నేర్చుకున్న అనేక చిన్న చిన్న పనులను తమ చేతులతో చేయగలవు. కానీ మానవునికెంతో సన్నిహితమైన దశకు చేరుకున్న వానరుని చేతినీ, అనేక లక్షల సంవత్సరాల కర్మల వల్ల అభివృద్ధి నొందిన మానవుడి చేతిని చూస్తే ఎంతో భేదం కనబడుతుంది. కండ రాల సంఖ్య ఒక్కటే, నిర్మాణం కూడా ఒక్కటే. అయినా ఎంతటి నికృష్టస్థితిలోని ఆటవికుడైన మానవుని హస్తం కూడా ఎంతో అభివృద్ధి చెందిన వానర హస్తం చేయలేని వందలాది పనులను అలవోకగా చేస్తుంది. వానర హస్తం ఏ చిన్న రాతి పనిముట్టును ఎంత బండగా నైన చేసి ఎరుగదు. భారతదేశంలోని భౌతికవాద చింతన అన్ని కీలక పరిణామాల్లో ప్రధాన శక్తిగా నిలిచింది. మానవ జాతి ప్రతి అడుగులో తన అస్తిత్వాన్ని, వ్యక్తిత్వాన్ని నిలుపుకొంటూ ముందుకు నడిచింది. ఈ భౌతిక దృక్పథంతో కూడిన మానవ ప్రయాణానికి భావవాదం ఒక పెద్ద అవరోధంగా నిలిచింది. మానవ ప్రగతిలో అసమానతలు సృష్టించింది. చరిత్ర పరిణామ క్రమంలో మానవ సమాజాన్ని సమన్వయించడాన్ని మార్క్స్ గతి తార్కిక చారిత్రక భౌతికవాద దృక్పథం అన్నాడు. ఈ క్రమంలో భారత సమాజాన్ని పరిశీలిస్తే చార్వాకులు భారత ఉత్తరఖండంలో భౌతిక సిద్ధాంత కర్తలుగా మన ముందు నిలుస్తారు. వారికి ఎదురు నిలిచిన వైదికులు భావ వాదానికి కొమ్ము కాసిన ప్రతినిధులు అయ్యారు. వేద వాఙ్మయానికి ప్రత్యామ్నాయంగా భారతీయ భౌతికవాదంగా చార్వాకవాదం ముందుకొచ్చింది. భారతీయ భౌతికవాదాన్ని సాంఖ్యదర్శనం ముందుకు తీసుకువెళ్ళింది. ఈ సాంఖ్య శాస్త్రానికి మూల పురుషులు కపిలుడు, అసురీ, పంచశిఖుడు, ఈశ్వర కృష్ణుడు. ఈశ్వర కృష్ణుని 26 మంది గురుతరాల నుండి ఈ సాంఖ్యం బోధింపబడినట్లు చెప్పబడింది. ఒక్కొక్క గురువు నుండి మరొక గురువు తరానికి 30 సంవత్సరాల అంతరం ఉందని అనుకుంటే, 780 సంవ త్సరాల అంతరం కపిలుడికీ, ఈశ్వర కృష్ణుడికీ ఉంది. దీనిని బట్టి కపిలుడు క్రీ.పూ.7, 8 శతాబ్దాల వాడై ఉండవచ్చునని చరిత్రకారుల అంచానా. బుద్ధుడి మీద కూడా సాంఖ్య ప్రభావం ఉందనేది స్పష్టం. బుద్ధుడు క్రీ.పూ. 6వ శతాబ్దం వాడనుకుంటే సాంఖ్య సిద్ధాంతం అప్పటికే ప్రాచుర్యం పొంది ఉంది. దీనినిబట్టి కూడా కపిలుని సాంఖ్య శాస్త్రం క్రీ.పూ. 8 శతాబ్దిదని అనుకోవచ్చు. ఇకపోతే సమాజ నిర్మాణానికి సంబంధించిన మూలాలను అధ్య యనం చేయకుండా, సమాజ వ్యవస్థను ఉన్నదున్నట్లుగా అంగీకరించడం యధాతథవాదం. అది మార్పును అంగీకరించని వాదం. మార్పునకు భావజాలం ఒక చోదకశక్తి. దళితుల చరిత్ర నిర్మాణంలో హేతువాదమే కీలకం అవుతుంది. బి.ఆర్. అంబేడ్కర్ హేతువాద దృక్పథంతోనే సామాజిక చరిత్ర నిర్మాణంలోని చిక్కుముడులను విప్పారు. కానీ లిఖిత పరమైన ఆధారాలు లేవని వీరి చరిత్రను మనువాదులు నిరాకరిస్తారు. భారతదేశంలో మనువాదం ఉత్పత్తికి భిన్నమైనది. జీవిక కోసం సృష్టించిన ఆ«ధ్యాత్మిక కల్పన వాదం ఇబ్బడి ముబ్బడిగా పెరిగి చివరికి దేశ చరిత్రను గజిబిజి చేసింది. అనేక వైరుద్ధ్యాలు, ప్రక్షిప్తాలతో కూడిన సాహిత్యంలో తాత్విక అంశాలు, చారిత్రక అంశాలు మృగ్యమైనాయి. ప్రజలు ఎల్లప్పుడు రాజకీయాల్లో వంచనకు, ఆత్మ వంచనకు తెలివి తక్కువగా బలి అవుతూనే ఉన్నారు. అన్ని నైతిక, మత, రాజ కీయ, సాంఘిక పదజాలాల ప్రకటనల వెనుక ఏదో ఒక వర్గపు ప్రయోజనాలు దాగివున్నాయనే విషయాన్ని గ్రహించేంత వరకు వారలా బలి అవుతూనే ఉంటారు. ప్రతి పురాతన సంస్థ అది ఎంత అనాగరికమైనదిగా, కుళ్ళిపోయినదిగా కనబడినప్పటికీ పాలక వర్గాలకు చెందిన కొన్ని శక్తులచే అది నిలబెట్టబడుతోంది. ఈ విషయాన్ని గ్రహించనంతవరకూ సంస్కరణ వాదులు, అభివృద్ధి కాముకులు పాత వ్యవస్థను సమర్థించే వారి చేత మోసగించబడుతూనే వుంటారు. ఆ వర్గాల ప్రతిఘటనను పటాపంచలు చేయడానికి ఒకే ఒక మార్గం వుంది. అదేమిటంటే మన చుట్టూ ఉన్న సమాజంలోనే పాతను తుడిచి వేసి కొత్తను సృష్టించే సామర్థ్యం కలిగివున్న శక్తులను విజ్ఞానవంతులను చేసి సంఘటిత పర్చడం. డా‘‘ కత్తి పద్మారావు వ్యాసకర్త దళితోద్యమ నాయకుడు ‘ 98497 41695 -
బుద్ధి కుశలత
కుశలత అంటే నేర్పరితనం. ఏ పని చేయటానికైనా ఒక నేర్పరితనం అవసరం. ఏదో ఒక తీరులో తోచిన విధంగా చేయటం కాక, సులువైన పద్ధతిలో సునాయాసంగా చేయగలగటం నేర్పరితనం. బుద్ధిని దాని సామర్థ్యాన్ని తగిన విధంగా ఉపయోగించటమే బుద్ధి కుశలత. సాధారణంగా మనస్సుని, బుద్ధిని సమానార్థకాలుగా వాడుతూ ఉంటాం. కాని రెండింటికీ తేడా ఉంది. ఆలోచన చేసేది, పంచేంద్రియాలని ప్రేరేపించేది, వాటిపై పెత్తనం చేసేది, తనకి నచ్చినట్టు, కావలసినట్టు ఊహ చేసేది, కలలు కనేది, ఆశపడేది, రాగద్వేషాలకి నిలయమైనది మనస్సు. బుద్ధిలో కూడా మనోవ్యాపారం ఉన్నా, దానిలో విచక్షణా, సహేతుకతా ఉంటాయి. ఒక మంచిపని, తనకి, కుటుంబానికి, సమాజానికి, దేశానికి ఉపయోగపడేది చేద్దామని నిర్ణయం తీసుకున్నప్పుడు పని చేసింది బుద్ధి. తీరా ఆ పని మొదలుపెట్టిన తరువాత ఏవేవో పనికిరాని కారణాలతో సమర్థించుకుని వాయిదా వేసుకుంటూ వచ్చినప్పుడు పని చేసింది మనస్సు. మనస్సు శారీరిక, మానసిక సుఖాన్ని అపేక్షిస్తుంది. మంచి చెడులను వేర్పరచి విచక్షణతో నిర్ణయం తీసుకునేది బుద్ధి. అయితే ఎన్నో సందర్భాలలో మనసు బుద్ధి వేషం వేసుకుని వస్తుంది. పని వాయిదా వేయటానికి కారణాలు వెదకినట్టుగా మనోవ్యాపారమైన ఆలోచనల సహకారంతో ఏది మంచి ఏది చెడు ఏది శాశ్వతం, ఏది తాత్కాలికం, ఏది తనకి, సమాజానికి ఉపయోగ పడుతుంది, ఏది ఉపయోగ పడదు అనే అంశాలను విడదీసి, విమర్శించి, వేర్పరచి సరైన నిర్ణయం తీసుకునేందుకు సహకరించే శక్తి బుద్ధి. ఒకప్పుడు గురుకులాల్లో గురువులు శిష్యులకి విద్యాబుద్ధులు నేర్పేవారు. విద్యావంతులు బుద్ధిమంతులుగా ఉండేవారు. విద్య అంటే విషయ సేకరణ మాత్రమే కాదు. సేకరించిన విషయాలను, సముపార్జించిన జ్ఞానాన్ని జీవితానికి అన్వయం చేసి, ఆచరణలో పెట్టగలగటం, ఆ జ్ఞానాన్ని ఎప్పుడు ఎంత అవసరమో నిర్ణయించగల మెలకువ కలిగి ఉండటం. అదే బుద్ధికుశలత. ఒక పండితుడికి, శాస్త్రవేత్తకి తమ తమ రంగాలకి సంబంధించిన జ్ఞానం చాలా ఉండవచ్చు. దానిని సందర్భానుసారంగా ఎట్లా ఉపయోగించుకోవాలో తెలియక నలుగురిలోనూ నవ్వులపాలు కావటం చూస్తూ ఉంటాం. మెదడు బాగా ఎదిగింది కాని, విచక్షణ లేదు అని అర్థం. గొప్ప మేథావులు కూడా జీవితంలో సరయిన నిర్ణయం తీసుకోక నష్టపోవటానికి ఎంతోమంది శాస్త్రవేత్తల జీవితాలని ఉదాహరణలుగా గమనించవచ్చు. కారణం విద్యతో పాటు బుద్ధి గరపిన వారు లేకపోవటమే. ప్రస్తుత విద్యావిధానంలో చదువులు నేర్పి అక్షరాస్యులని తయారు చేయటం మాత్రమే కనిపిస్తోంది. కాని, బుద్ధివికాసం ఎంతవరకు జరుగుతోంది? అన్నది ప్రశ్నార్థకమే. ఈ కారణంగానే పెద్ద పెద్ద విద్యార్హతలు ఉన్న వారు కూడా సంఘవిద్రోహకశక్తులుగా మారటం, దేశద్రోహులుగా మారటం కుటుంబ దేశ పరువు ప్రతిష్ఠలను దెబ్బ తీసే విధంగా ప్రవర్తించటం చివరికి తమకే హాని చేసుకోవటం గమనించవచ్చు. ఆకలి దహించుతోంది, నిద్ర ముంచుకు వస్తోంది. తినటం, పడుకోటం లలో ఏది ముందు చేయాలి? అని నిర్ణయించుకుని మేలు పొందటానికి కావలసినది విచక్షణ మాత్రమే కాని చదువులు కాదు. కార్యసాధకుల లక్షణాలలో ప్రధానమైనది బుద్ధికుశలత. జీవితంలో గొప్ప విజయాలు సాధించి అత్యున్నత స్థానానికి చేరుకున్నవారందరు బుద్ధికుశలురే. చదువులు సహాయం చేసి ఉండవచ్చు. కుశలత... విచక్షణ ప్రతి మనిషికి మనసు ఉన్నట్టే బుద్ధి కూడా ఉంటుంది. కాని, అందరూ బుద్ధిని సరిగా ఉపయోగించరు. దానిని ఉపయోగించటంలోని మెలకువలు తెలియటమే బుద్ధి కుశలత. ఏ పని ఎట్లా చేయాలో తెలిసి ఉండటమన్న మాట. దీనినే ఒడుపు అని కూడా అనవచ్చు. ఏ పనినైనా గుడ్డెద్దు చేలో పడ్డట్టు అడ్డదిడ్డంగాను చేయవచ్చు. ఎక్కువమంది చేసేది ఆ విధంగానే. లేదా క్రమపద్ధతిలోనూ చేయవచ్చు. ఇది నేర్పరులు చేసే పద్ధతి. బుద్ధిని ఉపయోగించటంలో ఇటువంటి నేర్పరితనం ఉంటే దాన్నే బుద్ధి కుశలత అనవచ్చు. అంటే చురుకుగా పనిచేసే విచక్షణాజ్ఞానం అన్నమాట. – డా.ఎన్.అనంతలక్ష్మి -
నాలుగున్నరేళ్లుగా ప్రజారంజక పాలన
‘పేదవాళ్లు పింఛన్ కావాలన్నా.. రేషన్ కార్డును అడగాలన్నా గత ప్రభుత్వంలో జన్మభూమి కమిటీల చుట్టూ తిరగాల్సి వచ్చేది. అయినా వారికి న్యాయం జరుగుతుందనే నమ్మకం లేదు. కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన దగ్గర్నుంచీ సంక్షేమ పథకాలు అర్హుల ఇంటి గుమ్మంలోకే వస్తున్నాయి. గ్రాఫిక్స్‌లోనే కనిపించిన అభివృద్ధిని గ్రామ స్థాయిలో చేసి చూపించారు సీఎం వైఎస జగన్. అసత్య హామీలతో ప్రజలను చంద్రబాబు వంచించారు. అన్నం పెట్టే జగన్‌ను కాదని.. సున్నం రాసే బాబుకు జనం ఓటేయరు.’ అంటూ మేథావి వర్గం స్పష్టంగా చెప్పింది. ఆంధ్రప్రదేశ్ ఎడిటర్స్ అసోసియేషన్, సోషల్ డెమొక్రటిక్ ఫ్రంట్ సంయుక్తంగా ‘జగన్ పాలన–ప్రజా తీర్పు’ అనే అంశంపై బుధవారం విజయవాడలో రాష్ట్రస్థాయి ప్రజా సదస్సు నిర్వహించాయి. ఈ సమావేశంలో వివిధ రంగాలకు చెందిన మేధావులు పాల్గొన్నారు. వారి అభిప్రాయాలు వారి మాటల్లోనే.. – సాక్షి, అమరావతి విద్యా రంగంలో మరో నార్వేలా ఆంధ్రప్రదేశ్ – ఎడిటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వీవీఆర్ కృష్ణంరాజు సీఎం జగన్ రాష్ట్రంలో విద్యా రంగాన్ని అత్యున్నత స్థాయికి తీసుకెళ్తున్నారు. విద్యా రంగంలో ఏపీ మరో నార్వేగా మారుతోంది. తొలిసారిగా విద్యార్థులకు సీఎం జగన్ 6 లక్షల ట్యాబ్‌లు ఇచ్చారు. రూ. 8 వేల కోట్ల విలువైన కంటెంట్‌ను ఉచితంగా ఇస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో నో అడ్మిషన్స్ బోర్డు పెట్టే స్థాయికి తెచ్చారు. దేవాలయాలను పునరుద్ధరిస్తున్నారు. ప్రధాన దేవాలయాల అభివృద్ధికి మాస్టర్ ప్లాన్లు రూపొందించారు. ప్రతి రంగంలోనూ ఏపీ అభివృద్ధిలో ఉంది. కోవిడ్ సమయంలో సీఎం జగన్ చేపట్టిన చర్యల వల్ల ఇతర రాష్ట్రాలతో పోల్చితే మరణాలు తక్కువ. ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఇతర ఎల్లో మీడియా సీఎం జగన్ ప్రభుత్వంపై బురద జల్లడమే పనిగా పెట్టుకున్నాయి. అసత్యాలతో ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నాయి. ఉదాహరణకు ఈ నెల 4న ఈనాడులో 53, జ్యోతిలో 50 నెగెటివ్ వార్తలు వచ్చాయి. సాక్షి పత్రికలో ప్రజా సంక్షేమం, రాష్ట్రాభివృద్ధిని ప్రతిబింబిస్తూ కథనాలు వస్తున్నాయి. ఏ పార్టీ లక్షణాలు ఏమిటో తెలుసుకోవడానికి ఇంతకంటే ఉదాహరణ అవసరంలేదు. వై నాట్ 175 జరిగి తీరుతుంది సీఎం వైఎస్ జగన్ అందిస్తున్న సంక్షేమ పథకాల వల్ల వైనాట్ వైఎస్సార్సీపీ మరోసారి ఘనవిజయం సాధిస్తుంది. సీఎం జగన్ చెప్పిన వై నాట్ 175 జరిగితీరుతుంది. సీఎం జగన్ ప్రజల జీవన ప్రమాణాలను పెంచేలా పాలన చేస్తున్నారు. రాష్ట్రానికి ఆర్థిక పరిపుష్టిని తీసుకువస్తున్నారు. ఎల్లో మీడియా విషపు రాతలు, ప్రతిపక్షాల కుట్రలు పటాపంచలయ్యేలా ప్రజలు మరోసారి సీఎం జగన్‌కు పట్టం కడతారు. సీఎం జగన్ పేదలకు ఇళ్లు కట్టిస్తుంటే చంద్రబాబు స్టేలు తెచ్చి వాటిని అడ్డుకోవాలని చూస్తున్నారు. – సోషల్ డెమొక్రటిక్ ఫ్రంట్ అధ్యక్షుడు మాదిగాని గురునాథం సీఎం జగన్ సంస్కరణలు మంచి ఫలితాలనిస్తాయి సంక్షేమం అంటే మంచి జరగడం. సీఎం జగన్ పాలనలో ఇదే జరుగుతోంది. అన్ని వర్గాలకూ పథకాలు అందుతున్నాయి. సామాజిక న్యాయం, సంక్షేమమే ప్రధాన కర్తవ్యంగా సీఎం పనిచేస్తున్నారు. రాష్ట్ర ఆరి్థక సూచీలు వృద్ధిలో ఉన్నాయని కేంద్రమే ప్రశంసిస్తోంది. జగన్ చేస్తున్న సంస్కరణలు భవిష్యతులో మంచి ఫలితాలనిస్తాయి. – గీతావిజన్ ట్రస్ట్ వ్యవస్థాపకులు పొక్కులూరి సుబ్బారావు అది దుష్ప్రచారమే బలిసినొడికీ బక్కోడికీ జరుగుతున్న పోరాటం ఇది. బలిసినోళ్ల వైపు చంద్రబాబు ఉంటే.., బక్కోళ్లకు అండగా సీఎం జగన్ ఉన్నారు. బాబు పాలనలో ఆటోడ్రైవర్లపై వేధింపులు ఎక్కువగా ఉండేవి. ఇప్పుడు వాహన మిత్రతో జగన్ మమ్మల్ని ఆదుకుంటున్నారు. పేదలకు సంక్షేమ ప«థకాలిచ్చి సోమరిపోతులను చేస్తున్నారనేది దు్రష్పచారమే. – ఆటో డ్రైవర్స్ అసోసియేషన్ ప్రతినిధి వినోద్ బెస్ట్ సీఎం వైఎస్ జగన్ సంక్షేమం, అభివృద్ధి, అనేక సంస్కరణలతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బెస్ట్ సీఎం అనిపించుకుంటున్నారు. కోవిడ్ సమయంలో సీఎం వైఎస్ జగన్ చేపట్టిన చర్యలు నభూతో నభవిష్యతి. రెండేళ్లు కోవిడ్‌లో పోయాయి. ఆ తర్వాత రెండేళ్ల నుంచే అసలు పాలన మొదలైంది. ఈ రెండేళ్లలోనే విద్యా రంగంలో రాష్ట్రం కేరళను అధిగమించేలా చేశారు. మరో ఇరవై ఏళ్లు సీఎంగా జగన్‌కు అవకాశం ఇస్తే అమెరికా, సింగపూర్‌లా ఏపీ ఎందుకు అవదు? పాత ముఖ్యమంత్రిలా గ్రాఫిక్స్ చూపించడం లేదు. పోర్టులు వస్తున్నాయి. పరిశ్రమలు వస్తున్నాయి. ఇంటింటికీ డాక్టర్ వస్తున్నారు. ఇది జరుగుతుందని ఎప్పుడైనా ఊహించామా? రేషన్ ఇంటికే వస్తోంది. ఇలాంటి పాలన, ఇలాంటి సీఎం లేకపోతే రాష్ట్రం మరో 75 ఏళ్లు వెనక్కి పోతుంది. – ఆంధ్రా అడ్వకేట్స్ ఫోరం కన్వీనర్ అశోక్ కుమార్ అందరికీ మంచి జరుగుతోంది గత ప్రభుత్వంలో సబ్సిడీ లోన్ అని మూడో వంతు లంచాల రూపంలో తినేశారు. సీఎం జగన్ మమ్మల్ని ప్రతి దేవాలయంలో బోర్డు డైరెక్టర్లుగా నియమిస్తున్నారు. జగనన్న చేదోడు ద్వారా సాయం చేస్తున్నారు. మంత్రివర్గంలో చోటిచ్చారు. నాయీ బ్రాహ్మణులకు గతంలో కనీస వేతనాలు కోరినా ఇవ్వలేదు. సీఎం జగన్ గుడిబయట ఉండే నాయీ బ్రాహ్మణులను గుడిలోపలికి తీసుకువచ్చారు. క్షౌరశాలల్లో రూ.20 వేల జీతం ఇస్తున్నారు. – నాయీ బ్రాహ్మణ సంఘం ప్రతినిధులు గణపతిరావు, మల్కాపురం కనకారావు సీఎం జగన్ పాలన కోల్పోతే రాక్షస పాలన వస్తుంది సీఎం జగన్ పేదల సంక్షేమం, రాష్టర సమగ్రాభివృద్ధితో సుపరిపాలన అందిస్తున్నారు. ఆయన క్రిస్టియన్ అయితే అనేక దేవాలయాలను అభివృద్ధి చేస్తారా? సీఎం వైఎస్ జగన్ అందిస్తున్న జనరంజక పాలనను కోల్పోతే రాక్షస పాలన వస్తుంది. – ప్రొఫెసర్ రాచకొండ ముత్యాలరాజు అభివృద్ధికి ఇదే నిదర్శనం రాష్ట్రంలోని బ్యాంకుల్లో డిపాజిట్లు గతంలోకంటే ఇప్పుడు రూ.85 వేల కోట్లు పెరిగాయి. అభివృద్ధికి ఇదే నిదర్శనం. ప్రజల తలసరి ఆదాయం పెరిగింది. పరిశ్రమలు పారిపోతే ఈజ్ ఆఫ్ డూయింగ్‌లో ఏపీ ఏటా ప్రథమ స్థానంలో ఉంటుందా? అన్నం పెట్టే జగన్‌కే ప్రజలంతా ఓటేస్తారు. అబద్ధాలు, మోసాలతో సున్నం రాసే చంద్రబాబుకు జనం ఓటేయరు. – బెటర్ ఆంధ్రప్రదేశ్ సంస్థ అధ్యక్షుడు మాదిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఎల్లో మీడియాదంతా అసత్య ప్రచారమే చంద్రబాబుని మరోసారి అధికారంలోకి తెచ్చేందుకు ఎల్లో మీడియా మొత్తం అసత్య ప్రచారం చేస్తోంది. ఈ ప్రయత్నాన్ని అడ్డుకోవాలి. పెత్తందారుల పాలనను రానివ్వకూడదు. సీఎం జగన్ రూపాయి అవినీతి లేకుండా రూ. 2.50 లక్షల కోట్లు ప్రజలకు అందించారు. వాటి ద్వారా మన రాష్ట్ర ఆరి్థక వ్యవస్థ బాగుపడుతోంది. ప్రభుత్వ, ప్రైవేట్ సెక్టార్లో ఉద్యోగాలొచ్చాయి. రాష్ట్రానికి ఆస్తుల కల్పన జరిగింది. – ఎన్నారై వెంకట్ మేడపాటి ఇప్పుడున్నది ఆరోగ్యవంతమైన సమాజం సీఎం వైఎస్ జగన్ పాలనలో రాష్ట్రం అన్ని విధాలా ముందుంది. ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నది ఆరోగ్యవంతమైన సమాజం. సీఎం జగన్ నాణ్యమైన విద్య, వైద్యాన్ని అందిస్తున్నారు. వ్యవసాయ రంగానికి భరోసా కల్పిస్తున్నారు. హెల్త్ క్లినిక్‌లు, ఆర్బీకేలతో గ్రామీణులకు మేలు చేస్తున్నారు. – సోషల్ వర్కర్ వెంకటరెడ్డి పేద పిల్లలు విదేశాల్లో చదవడం చిన్న విషయం కాదు సీఎం జగన్ విద్యా రంగంలో విప్లవాత్మక సంస్కరణలు తెస్తున్నారు. ఎన్నో కష్ట నష్టాలకోర్చి ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లాలనుకొనే పేద పిల్లల కలలను సాకారం చేస్తున్నారు. వారికి అయ్యే ఖర్చంతా చెల్లిస్తున్నారు. పేద పిల్లలు విదేశాల్లో చదవడం చిన్న విషయం కాదు. – విశ్రాంత అధ్యాపకులు రెహమాన్ సాయెబ్ ఏపీ తలెత్తుకొనేలా జగన్ పాలన ఏపీ తలెత్తుకొనేలా సీఎం జగన్ పాలన సాగుతోంది. చంద్రబాబు హయాంలో ఒక్క పోర్టు, ఒక్క మెడికల్ కాలేజీ కట్టలేకపోయారు. సీఎం జగన్ 4 పోర్టులు, 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్ ల్యాండ్ సెంటర్లు కడుతున్నారు.17 వైద్య కళాశాలలు నిర్మిస్తున్నారు. 2.94 లక్షల ఉద్యోగాలిచ్చారు. కేంద్ర ఈపీఎఫ్ లెక్కల ప్రకారం 16 లక్షల ఉద్యోగాలొచ్చాయి. – సామాజిక కార్యకర్త గూడపురెడ్డి శేఖరరెడ్డి సుపరిపాలనంటే ఇదీ సుపరిపాలన అంటే సీఎం జగన్ అందిస్తున్న పాలన. ప్రతి పేదవాడికీ ఇల్లు ఇస్తున్నారు. కార్పొరేట్ వైద్యం ఉచితంగా అందుతోంది. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా పాలనను ప్రజల ముంగిటకే తెచ్చారు. గతంలో ప్రభుత్వ విద్యా వ్యవస్థను నాశనం చేసి ప్రైవేటు విద్యాసంస్థలను ప్రోత్సహించారు. – హోటల్స్ అసోసియేషన్ ప్రతినిధి ముక్కు వెంకటేశ్వరరెడ్డి మదర్ థెరిసా ఆదర్శంగా జగన్ పాలన మదర్ థెరిస్సాను సీఎం జగన్ ఆదర్శంగా తీసుకున్నారు. పార్టీలతో సంబంధం లేకుండా అన్ని వర్గాల పేదలకు నవరత్న పథకాలు అందిస్తున్నారు. పని చేయని వారు పని చేస్తున్న వారిని విమర్శించడం సహజం. – గుంటూరు ఏసీ కళాశాల మాజీ ప్రిన్సిపల్ డాక్టర్ పోలే ముత్యం బ్రాహ్మణులకు మేలు చేస్తున్న సీఎం జగన్ రాష్ట్రంలో బ్రాహ్మణులకు సీఎం వైఎస్ జగన్ చాలా మేలు చేస్తున్నారు. వంశ పారంపర్య వ్యవస్థను పునరుద్ధరించారు. బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. కామన్ డెవలప్మెంట్ ఫండ్ ఇచ్చారు. ధూప దీప నైవేద్యాలకు, అర్చకుల వేతనాలను కూడా భారీగా ఇస్తున్నారు. – అర్చకులు ప్రసన్నాంజనేయ కుమారశర్మ -
కేసీఆర్.. మీ పార్టీ సిద్ధాంతం ఏంటో?: అమిత్‌షా
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తోందని.. తాము అభివృద్ధి, సంక్షేమం కోసం పని చేస్తున్నామన్నారు బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా. హైదరాబాద్‌లోని ఇంపీరియల్ గార్డెన్లో మేధావుల సదస్సులో మాట్లాడిన అమిత్‌షా.. కేసీఆర్ తన పార్టీ సిద్ధాంతం ఏంటో చెప్పాలన్నారు. ఆయన లక్ష్యం కూతురును జైల్‌కు వెళ్లకుండా కాపాడుకోవడం, కొడుకును ముఖ్యమంత్రి చేయడం. బీజేపీ సిద్ధాంత పార్టీ. విదేశాల్లో భారత్ గౌరవం పెరిగింది. 2014కు ముందు దేశంలో అశాంతి ఉండేది’’ అని ఆయన పేర్కొన్నారు. మోదీ నాయకత్వంలో దేశం ప్రగతి పథంలో దూసుకుపోతోందన్న ఆయన.. వచ్చే 50 ఏళ్లలో ప్రపంచంలోనే భారత్ కీలక పాత్ర పోషించబోతోందన్నారు. బీఆర్ఎస్ను కుటుంబ పార్టీగా అభివర్ణించిన అమిత్‌షా.. ఇలాంటి పార్టీలు ప్రజాస్వామ్యబద్ధంగా ఉండవన్నారు. కేటీఆర్‌ను సీఎం చేయడమే కేసీఆర్ లక్ష్యం.. బీఆర్ఎస్ పార్టీ స్టీరింగ్ ఎంఐఎం చేతుల్లో ఉంది’’ అంటూ అమిత్‌షా ఎద్దేవా చేశారు. ‘‘వచ్చే ఐదేళ్ల కోసం మూడు పార్టీల మధ్య ఎవరిని ఎన్నుకోవాలో తెలంగాణ ప్రజలు ఆలోచించాలి. 2014 ముందు దేశం లో అశాంతి, మహిళ లకు రక్షణ లేదు.. యువత ఉద్యోగాలు లేక, పారిశ్రామికవేత్తలు కూడా ఆందోళన.. దేశం ఏమవుతుంది అనే అవేదన ఉండేది.. 9 ఏళ్ల తర్వాత దేశం పరిస్థితి ఏందో అర్థం చేసుకోవచ్చు. మోదీపైన అవినీతి ఆరోపణలు లేవు. అంతర్గత రక్షణ పటిష్టంగా తయారయ్యింది’’ అని అమిత్‌షా పేర్కొన్నారు. ‘‘కరోనా టైమ్‌లో దీపాలు వెలిగించాలి అంటే కేటీఆర్ వెటకారం చేశారు. కరోనా వ్యాక్సిన్‌ను మోదీ వ్యాక్సిన్ అంటూ రాహుల్ గాంధీ ఎద్దేవా చేశారు. కేసీఆర్ నీళ్లు నిధుల నియామకాలు కోసం ఉద్యమం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌తో సంపాదించుకున్నాడు. నీళ్లు ఇవ్వలేదు.. మిగులు బడ్జెట్ రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చారు. తెలంగాణ ప్రజలను ఓటు అడిగే హక్కు కేసీఆర్‌కు లేదు. దేశాన్ని మహోన్నత స్థానానికి తీసుకెళ్లే మోదీతో తెలంగాణ ఉంటుందా.. కొడుకును సీఎం చేయాలనుకుంటున్న కేసీఆర్‌తో ఉంటుందా తెలంగాణ ప్రజలు తేల్చుకోవాలి. కేసీఆర్‌తో ఎప్పుడు కలిసేది లేదు.. కలిసి వెళ్లేది లేదు.. కాంగ్రెస్, బీఆర్ఎస్లకు ఓటు వేస్తే అవినీతి ప్రభుత్వం వస్తుంది. అభివృద్ది తెలంగాణ బీజేపీతోనే సాధ్యం’’ అని అమిత్‌షా పేర్కొన్నారు. అంతకు ముందు ఆదిలాబాద్ జనగర్జన సభలో ప్రసంగించిన అమిత్‌షా.. బీఆర్ఎస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ఆదిలాబాద్‌లో నినాదిస్తే.. హైదరాబాద్‌లో కేసీఆర్‌కు వినిపించాలన్నారు. డిసెంబర్ 3 తర్వాత తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో మోదీ నాయకత్వంలో బీజేపీ ప్రభుత్వం రావాలి.. బీజేపీ అధికారంలోకి వస్తే ప్రతి జిల్లాల్లో సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహిస్తామని అమిత్ షా ప్రకటించారు. చదవండి: కేసీఆర్‌ను గద్దె దించండి: అమిత్‌షా -
ఏపీ సంక్షేమ పథకాలు ఆదర్శనీయం
ఏఎన్‌యూ: సమాజంలోని అణగారిన వర్గాల అభ్యున్నతి, సాధికారత కోసం రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని, అవి లేకపోతే ఆ వర్గాల అభివృద్ధే లేదని పలువురు విద్యావేత్తలు, ఆర్థి కవేత్తలు అన్నారు. ఓపెన్ మైండ్స్ సంస్థ ఆధ్వర్యంలో ‘సంక్షేమం–అభివృద్ధి’ అనే అంశంపై ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో శుక్రవారం నిర్వహించిన సదస్సులో వారు పాల్గొని తమ అభిప్రాయాలను వెల్లడించారు. అణగారిన వర్గాల సాధికారితకు సంక్షేమ పథకాలు అందించడం ప్రభుత్వాల కనీస బాధ్యత అని రాజ్యాంగం చెబుతోందని.. ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో అమలవుతున్న పలు ఉచిత పథకాలను వృథా అని కొందరు విమర్శించడం అర్థరహితమని చెప్పారు. అభివృద్ధి చెందిన ఫ్రాన్స్‌లో 31 శాతం, అమెరికాలో 30 శాతం, స్కాండినేవియాలో 29 శాతం నిధులు సంక్షేమానికి ఖర్చుచేస్తున్నారని.. మన దేశంలో 20 శాతం సంక్షేమానికి ఖర్చుచేస్తుండగా మన రాష్ట్రంలో 22 శాతం ఖర్చుచేస్తున్నారని వారు వెల్లడించారు. ఈ సందర్భంగా ఎవరెవరు ఏమన్నారంటే.. సంక్షేమం లక్ష్యమే అభివృద్ధి.. ప్రభుత్వాలు అమలుచేసే సంక్షేమం ధ్యేయమే అభివృద్ధి.. అభివృద్ధి లక్ష్యమే సంక్షేమం. ఈ రెండింటినీ వేర్వేరుగా చూడటం సరికాదు. సంక్షేమంపై ప్రభుత్వం చేస్తున్న ఖర్చులో అభివృద్ధి, మానవ వనరుల వృద్ధి దాగి ఉన్నాయని గుర్తించాలి. విద్య, వైద్యం, ఇల్లు, మంచి ఆహారం, నీరు వంటి కనీస వసతులు కల్పించడం ప్రభుత్వాల కనీస బాధ్యత. ఆ బాధ్యత నెరవేర్చడంలో ఏపీ ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తోంది. ప్రజలకు కల్పించే పలురకాల ఉచిత పథకాలు వృథా, అనవసర ఖర్చు అనడం అర్థరహితం. ఏపీలో 2016లో 11.7 శాతం పేదరికం ఉంటే 2021–22కి అది 6 శాతానికి తగ్గింది. – డాక్టర్ ఎన్ రాజశేఖర్‌రెడ్డి, ఓపెన్ మైండ్స్ సంస్థ అధ్యక్షుడు,మాజీ మెంబర్ సెక్రటరీ అండ్ సీఈఓ ఏపీహెచ్ఈఆర్ఎంసీ రానున్న రోజుల్లో మరిన్ని విప్లవాత్మక సంస్కరణలు.. గడచిన నాలుగున్నరేళ్లలో ఏపీ ప్రభుత్వం అనేక ఆదర్శవంతమైన పథకాలు అమలుచేసింది. రానున్న రోజుల్లో మరిన్ని విప్లవాత్మక సంస్కరణలు అమలుచేసేందుకు సీఎం నిర్థిష్టమైన ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు. వచ్చే ఏడాదిలో 8–10 తరగతులకు ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ వంటి అంతర్జాతీయ సాంకేతిక విద్యను అందించనున్నారు. నిజమైన అభివృద్ధిని కాంక్షించే వారు సంక్షేమాన్ని స్వాగతించాల్సిందే. – ఆచార్య ఈ. శ్రీనివాసరెడ్డి, అకడమిక్ డీన్, ఏఎన్‌యూ విద్యపై ఖర్చు భావితరాలపై పెట్టుబడే.. ప్రభుత్వం విద్యపై ఖర్చుచేస్తున్న నిధులు భావితరాలపై, దేశంపై పెడుతున్న పెట్టుబడే. దీనిని ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి కూడా స్పష్టంచేశారు. విలువైన మానవ వనరులను తయరుచేసేందుకు, సామాజిక అసమానతలు రూపుమాపేందుకు, జాతీయ ఆర్థికాభివృద్ధికి, పేదరిక నిర్మూలనకు, సామాజిక, సాంకేతిక అభివృద్ధికి విద్య దోహదం చేస్తుంది. ఇన్ని అంశాలతో ముడిపడి ఉన్న విద్యకు అధిక ప్రాధాన్యమిస్తున్న ఏపీ ప్రభుత్వాన్ని అభినందించి తీరాలి. ఏపీ ప్రభుత్వం అమలుచేస్తున్న ద్విభాషా పుస్తకాల విధానాన్ని ప్రధాని మోదీ స్వయంగా అభినందించారు. ప్రపంచంలో చాలా ఫ్యూడల్ దేశాలు కూడా ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తుంటే దార్శనికతతో ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమాన్ని విమర్శించడం అర్థరహితం. పాఠశాల విద్యకు సంబంధించిన చాలా సంస్కరణల్లో జాతీయ గణాంకాల కంటే ఏపీ అగ్రస్థానంలో ఉంది. ఎయిడెడ్ విద్యా సంస్థలను ప్రభుత్వంలో విలీనం చేయడం ఆదర్శవంతమైన సంస్కరణ. అంతర్జాతీయ విద్య, బోధనా ప్రమాణాలకు అధిక ప్రాధాన్యమివ్వడం హర్షణీయం. – ఆచార్య జంధ్యాల బిజి తిలక్, మాజీ వైస్ చాన్సలర్ ఎన్‌యూఈపీఏ, న్యూఢిల్లీ రాజనీతిజు్ఞలు మంచి మార్పు కోసం పాటుపడతారు.. రాజకీయ నాయకులు ఓట్ల కోసం పథకాలు అమలుచేస్తే రాజనీతిజు్ఞలు మంచి మార్పుకోసం పాటుపడతారు. ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మంచి మార్పుకోసం పాటుపడుతున్న రాజనీతిజు్ఞడు. అణగారిన వర్గాల సాధికారిత, ప్రపంచ స్థాయి అవకాశాల కల్పన, మానవ వనరుల అభివృద్ధి, పేదరికం నిర్మూలనకు దోహదం చేసే అన్ని సంస్కరణలు, పథకాలు ఏపీలో చిత్తశుద్ధితో అమలుచేస్తున్నారు. అణగారిన వర్గాలకు అవకాశాలు కల్పిస్తే ప్రపంచస్థాయి అద్భుతాలు సృష్టిస్తారనే వాస్తవాన్ని ఏపీ ప్రభుత్వం చాటిచెప్పింది. రానున్న రోజుల్లో మన దేశంలో యువ సంపద తగ్గే ప్రమాదం ఉంది. ప్రస్తుతం ఉన్న యువతను ప్రయోజకులుగా తీర్చిదిద్దటంలో అన్ని రాష్ట్రాలకు ఏపీ ఆదర్శంగా నిలుస్తోంది. – బి.జి. తిలక్, ప్రముఖ జర్నలిస్ట్, రాజకీయ విశ్లేషకులు ఏపీలో నిజమైన అభివృద్ధి ప్రపంచంలో పురాతన కాలం నుంచి సాగిన ఆదర్శ పాలనలన్నీ సంక్షేమానికి ప్రాధాన్యమిచ్చాయి. ఇప్పటివరకు అనేక అభివృద్ధి అంశాల్లో దేశానికి కేరళ ఆదర్శంగా నిలిస్తే కేరళకు ఆదర్శవంతమైన సంస్కరణలు కూడా ప్రస్తుతం ఏపీలో అమలవుతున్నాయి. ఏపీలో జరుగుతున్న నిజమైన అభివృద్ధిని క్షేత్రస్థాయిలో యూనివర్సిటీలు అధ్యయనం చేసి సమాజానికి తెలియజేయాలి. – ఆచార్య పి. రాజశేఖర్, వీసీ, ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పథకాలే కాదు వాటి అమలూ ఆదర్శనీయం.. ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ, అభివృద్ధి పథకాలే కాదు వాటి అమలునూ ఆదర్శవంతంగా చేస్తోంది. నిరక్షరాస్యత నిర్మూలన ద్వారా పేదరిక నిర్మూలనకు ప్రభుత్వం ఖర్చుచేస్తోంది. పేదలను శాశ్వత అభివృద్ధి వైపు నడిపించే గొప్ప మార్గం విద్య మాత్రమే. దానిని సీఎం జగన్ చిత్తశుద్ధితో అమలుచేస్తున్నారు. ఒకప్పుడు ప్రభుత్వ పాఠశాలల వైపు వెళ్లాలంటేనే చాలామంది ఇష్టపడే వారు కాదు. కానీ, నేడు ఏపీలో పాఠశాలల ముందు నిలబడి ఫొటోలు దిగుతున్నారు. నాడు–నేడు, అమ్మఒడి, జగనన్న విద్యా కానుక, జగనన్న గోరుముద్ద వంటి సంక్షేమ కార్యక్రమాల్లో ఎంతో దార్శనికమైన సమగ్రాభివృద్ధి దాగి ఉంది. – ఆచార్య ఎన్. వెంకట్రావు, వీసీ, అంబేడ్కర్ విశ్వవిద్యాలయం, శ్రీకాకుళం సంక్షేమ పథకాలు కనీస బాధ్యత.. ఏపీలో అమలుచేస్తున్న అనేక సంక్షేమ పథకాలు కొందరు విలాసాలని అంటున్నారు. అది సరికాదు. ప్రభుత్వం తన కనీస బాధ్యతను నెరవేరుస్తోంది. ఆహారం, వసతి, మంచి దుస్తులు వంటి ప్రాథమిక అవసరాలు తీర్చడం ప్రభుత్వాల బాధ్యత అనేది అందరూ గుర్తించాలి. విద్యపై ప్రభుత్వం పెడుతున్న పెట్టుబడి అభివృద్ధిలో భాగమే. విద్య, ఆరోగ్యం వంటి రంగాలకు ప్రభుత్వాలు అధిక ప్రాధాన్యమివ్వడం వల్ల ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయి. ఏపీలో ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేయడం ఎంతో దార్శనికమైన నిర్ణయం. – ఆచార్య బి. కరుణ, రిజిస్ట్రార్ , ఏఎన్‌యూ -
భారత్ మేథోశక్తిని అమెరికా గుర్తించింది
న్యూఢిల్లీ: భారత్‌కు ఉన్న అపారమైన మేధో మూలధనాన్ని అమెరికా గుర్తిచిందని ఇండస్ఇంటర్నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ (ఐఐఆర్ఎఫ్) వ్యవస్థాపకుడు గురుప్రసాద్ సౌలే తెలిపారు. సెమీ కండక్టర్ తదితర కీలక రంగాల్లో భారత్‌తో అనుసంధానం కోసం ముందుకు రావడం కీలక పరిణామమన్నారు. భారత్‌ను కేవలం సేవల కేంద్రంగా అమెరికా ఇంక ఎంతమాత్రం చూడడం లేదన్నారు. ఈ విషయమై అగ్రరాజ్య ధోరణలో స్పష్టమైన మార్పు కనిపిస్తున్నట్టు చెప్పారు. ఈ ఏడాది జూన్‌లో అమెరికా పర్యటన సందర్భంగా ప్రధాని మోదీతో గురుప్రసాద్ సమావేశం కావడం గమనార్హం. ‘‘అమెరికా నుంచి సాంకేతిక పరిజ్ఞానం భారత్‌కు బదిలీ అవ్వడం నిదానంగా జరుగుతుంది. కొన్ని టెక్నాలజీలను భారత్‌తో పంచుకునేందుకు అమెరికా నిజంగా సిద్ధంగా లేదు. కానీ ప్రధాని మోదీ పర్యటన తర్వాత భారత్‌లో తయారీ విషయమై చెప్పుకోతగ్గ మార్పు అమెరికాలో వచ్చింది’’అని గరుప్రసాద్ వివరించారు. ఏరోస్పేస్, ఆటోమోటివ్, హెల్త్‌కేర్, ఏఐ రంగాల్లో భారత్ మరింత పురోగమిస్తుందని అమెరికా భావిస్తున్నట్టు చెప్పారు. అమెరికాలో భారత స్టార్టప్‌లకు అపార అవకాశాలున్నాయంటూ.. చాలా స్టార్టప్‌లకు నాస్డాక్లో లిస్ట్ అయ్యేందుకు ఆదాయం అవసరం లేదన్న విషయం తెలియదన్నారు. -
బాబును రాష్ట్రం నుంచి బహిష్కరించాలి
సాక్షి, అమరావతి: ‘ప్రజాస్వామ్యంలో హింసా రాజకీయాలు ప్రమాదకరం. ప్రతిపక్షాలు విధానపరమైన అంశాలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి. అధికారం కోసం అమాయకులను రెచ్చగొట్టడం సమంజసం కాదు. అసమర్థుల ఆఖరి అస్త్రమే హింస. పుంగనూరు, అంగళ్లు ఘటనలను నివారించాల్సిన చంద్రబాబు.. ఆయనే కార్యకర్తలను ఉసిగొల్పి పోలీసులపై దాడి చేయించడం హేయమైన చర్య. రాజ్యాధికారాన్ని ఎలాగైనా పొందాలనే ఉద్దేశంతో దారుణాలకు తెగబడుతున్న చంద్రబాబును రాష్ట్రం నుంచి, రాజకీయాల నుంచి బహిష్కరించాలి. తనపై పోలీసులు కేసు నమోదు చేస్తే స్పందించిన చంద్రబాబు.. దాడుల్లో గాయపడిన పోలీసులకు సంఘీభావం తెలియజేయకపోవడం ఆయన నీచత్వానికి పరాకాష్ట. అదేవిధంగా కొన్ని పత్రికలు వాస్తవాలను వక్రీకరిస్తూ ఏకపక్షంగా వార్తలు రాస్తూ మీడియా స్వేచ్ఛను దుర్వినియోగం చేస్తున్నాయి. అల్లరిమూకల దాడిలో కన్ను పోగొట్టుకున్న కానిస్టేబుల్, గాయపడిన 30 మంది పోలీసుల గురించి ఒక్కమాట కూడా రాయకపోవడం సిగ్గుచేటు. ఇదేమి జర్నలిజం..’ అని వివిధ రంగాల ప్రముఖులు, మేధావులు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆంధ్రప్రదేశ్ మీడియా అకాడమీ, ఏపీ ఎడిటర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గురువారం విజయవాడలో ‘ఆంధ్రప్రదేశ్‌లో హింసా రాజకీయాలు–కట్టడి–మీడియా పాత్ర’ అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. అంతకుముందు హింసా రాజకీయాలపై ప్రజలకు వాస్తవాలను తెలిపేలా ప్రచారం పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడిన పలువురు ప్రముఖుల అభిప్రాయాలు వారి మాటల్లోనే.. అనిశ్చితిని పెంచే కుట్ర ఎన్నికలు సమీపిస్తుండటంతో హింసా ధోరణిని పెంచి ప్రజల్లో అనిశ్చితిని సృష్టిస్తున్నారు. దానిని తిరిగి పాలకపక్షంపై నెట్టే ప్రయత్నం చేస్తున్నారు. హింసను ప్రభుత్వం అరికట్టలేకపోతోందని ఒక వర్గం మీడియా ప్రజలను తప్పుదారి పట్టిస్తోంది. పవన్ కళ్యాణ్ తన ప్రసంగాల్లో కార్యకర్తలు చావులకు సిద్ధపడి రావాలని పిలుపునివ్వడం వెనుక పెద్ద కుట్ర ఉందనే అనుమానం కలుగుతోంది. లోకేశ్ సైతం ఎక్కువ కేసులు ఉన్నవారికి పదవులు కట్టబెడతామని చెప్పడం హింసా రాజకీయానికి నిదర్శనం కాదా!. ప్రజలు ఇవన్నీ గుర్తించాలి. హింసను ప్రోత్సహించేవారికి బుద్ధి చెప్పాలి. – మేడపాటి వెంకట్, ఏపీ ఎన్ఆర్టీ సొసైటీ అధ్యక్షుడు రూట్ మ్యాప్‌ను ఎందుకు మార్చారు? చంద్రబాబు ప్లాన్ ప్రకారమే తన పర్యటన రూట్ మ్యాప్‌ను పుంగనూరు ఊరిలోకి మార్పు చేసినట్లు తెలుస్తోంది. శాంతిభద్రతల సమస్య సృష్టిస్తే పోలీసులు కాల్పులు జరుపుతారని, అప్పుడు తమ కార్యకర్తలు చనిపోతే సానుభూతి పొందవచ్చని పథకం రచించారు. సభకు వచ్చేటప్పుడు వ్యాన్లలో రాడ్లు, తుపాకులు తీసుకురావడమే ఇందుకు నిదర్శనం. కానీ పోలీసులు సంయమనంతో వ్యవహరించారు. – చెన్నంశెట్టి చక్రపాణి, మాజీ పోలీసుల అధికారి దిగజారిన ప్రతిపక్షాలు నాలుగేళ్లుగా ప్రభుత్వంపై దాడి జరుగుతూనే ఉంది. ప్రతిపక్షాలు దిగజారిపోయి ప్రవర్తిస్తున్నాయి. బాధితులను పట్టించుకోకుండా దాడులకు పురిగొల్పిన వారిని కొన్ని పత్రికలు, చానళ్లు వెనకేసుకురావడం క్రూరమైన చర్య. మేనిఫెస్టోను అమలు చేయని ప్రభుత్వాలను రీకాల్ చేయాలి. అప్పుడు చంద్రబాబు లాంటి నాయకులు నిలవలేరు. – చలాది పూర్ణచంద్రరావు, ఏపీ జర్నలిస్టు యూనియన్ అధ్యక్షుడు పవన్.. బలిదానాలు ఎందుకు? ప్రస్తుతం ప్రజలు ప్రశాంతంగా ఉన్నారు. ఇది నచ్చకనే చంద్రబాబు.. ఆయన తనయుడు లోకేశ్.. దత్తపుత్రుడు పవన్‌కళ్యాణ్ ప్రజలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఆత్మబలిదానాలకు సిద్ధం కావాలని జనసేన కార్యకర్తలకు చెబుతున్నారు. ఎవరి ఆత్మను ఎవరు బలి తీసుకుంటారు. ఒక్కసారైనా ప్రతిపక్ష నాయకులుగా ప్రజల మేలుకోరే సూచనలను చేశారా?. – సునీత, మూరుతీ మహిళా సొసైటీ అధ్యక్షురాలు చంద్రబాబుపై సివిల్ వార్ తప్పదు హింసను ప్రేరేపిస్తున్న చంద్రబాబు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. చంద్రబాబుపై పోలీసులే తిరగబడే రోజు వస్తుంది. ఇకపై సివిల్ వార్ ప్రారంభమవుతుంది. అప్పుడు బయటకు రావాలంటేనే బాబు భయపడక తప్పదు. చంద్రబాబు తనను ప్రశ్నించిన వ్యక్తి రక్తం చూస్తాడు. ఈ విషయం అనేకసార్లు రుజువైంది. – మాదిగాని గురునాథం, ఎస్డీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రతిపక్షాల తీవ్రవాద రాజకీయం ఎన్నడూ రాష్ట్రంలో ఇలాంటి అరాచక పరిస్థితులు కనిపించలేదు. అధికారం కోసం అర్రులు చాస్తూ.. హింసాత్మక ధోరణిని అవలంబిస్తున్నారు. ప్రతిపక్షాలు తీవ్రవాద రాజకీయాలు చేస్తున్నాయి. పుంగనూరులో పోలీసులపై దాడి గురించి జాతీయ మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేశాం. ఇందులో ఆరు సెక్షన్ల ప్రకారం చంద్రబాబు నేరాలకు పాల్పడ్డారు. చంద్రబాబు, పవన్, లోకేశ్ చేస్తున్న వ్యాఖ్యలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ అరాచక తీవ్రవాద రాజకీయాలను మొగ్గలోనే తుంచాలి. –వీవీఆర్ కృష్ణంరాజు, ఏపీ ఎడిటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు బాబు, పవన్ చీడపురుగులు చంద్రబాబు, పవన్‌కళ్యాణ్ రాష్ట్రానికి పట్టిన చీడపురుగులు. అధికారం కోసం ఎంతకైనా తెగిస్తున్నారు. ప్రజల ఆర్థిక పరిస్థితులు పెంచాలని సీఎం జగన్ చూస్తుంటే... ప్రతిపక్షాలు మాత్రం జనం చావులను కోరుకుంటున్నాయి. చంద్రబాబు చేసే ప్రతి పనిలోనూ హింస దాగుంటుంది. కార్యకర్తలు చనిపోతే వారి శవాలపై నుంచి వచ్చి అధికారం పొందాలని ప్లాన్ వేశారు. – మాదిరెడ్డి శ్రీనివాసరెడ్డి, ఫోరం ఫర్ బెటర్ సొసైటీ గుంటూరు కన్వినర్ రక్తపాతాన్ని కోరుకుంటున్న బాబు చంద్రబాబు ఓ ఘోరీ, ఓ గజినీ మహ్మద్ మాదిరిగా రక్తపాతాన్ని కోరుకుంటున్నారు. అల్లర్లు సృష్టించి ప్రభుత్వాన్ని కూలదోయాలని ప్రయత్నిస్తున్నారు. విధి నిర్వహణలో మహిళా సీఐ ఓ వ్యక్తిని చెంపదెబ్బ కొడితే వీరంగం చేసిన వికృత రాజకీయ నటుడు పవన్ కళ్యాణ్.. ఇంతమంది పోలీసులకు గాయాలైతే ఎందుకు నోరు మెదపడంలేదు. అధికారాన్ని ప్రజల మనసుల ద్వారా గెలుచుకోవాలి. – విజయబాబు, ఏపీ అధికార భాషా సంఘం అధ్యక్షుడు కన్నుపోయిన కానిస్టేబుల్పైసానుభూతి చూపరా..? రాష్ట్రంలో హింసా రాజకీయం పేట్రేగుతోంది. దీనిపై మేధావులు, పాత్రికేయులు, రాజకీయ పక్షాలు ప్రజలను అప్రమత్తం చేయాలి. అసలు హింసకు పాల్పడినవారెవరో, బాధితులెవరో అందరికీ తెలిసినా కొన్ని పత్రికలు, చానళ్లు పోలీసులదే తప్పని వక్రీకరించి వార్తలు రాయడం, ప్రసారం చేయడం సిగ్గుచేటు. కన్ను కోల్పోయిన కానిస్టేబుల్‌పై కనీస సానుభూతి చూపని చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లు ప్రజలకు ఏం సమాధానం చెబుతారు. పుంగనూరు, అంగళ్లులో పోలీసులు దెబ్బలు తిని ప్రజల ప్రాణాలు కాపాడారు. – కొమ్మినేని శ్రీనివాసరావు, ఏపీ మీడియా అకాడమీ చైర్మన్ -
సంక్షేమాభివృద్ధిలో దేశానికే ఆదర్శంగా ఏపీ
సాక్షి, అమరావతి: సంక్షేమాభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని మేధావులు, ప్రజా సంఘాల నాయకులు చెప్పారు. రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందుతోందని కేంద్ర నివేదికలు చెబుతుంటే.. ప్రతిపక్షాలు, కొన్ని పత్రికలు మాత్రం అసత్యాలను ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. ఏపీ ఇమేజ్ను దెబ్బతీసే కుట్రలను పౌరసమాజం తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. విభజనతో నష్టపోయిన రాష్ట్రాన్ని గత పాలకుల పాపాలు మరింత కష్టాల్లోకి నెట్టాయని చెప్పారు. బిల్డింగులు, పరిశ్రమలు, వంతెనలు కడితేనే అభివృద్ధి కాదని, సామాన్యుడి జీవనం బాగుపడాలని స్పష్టంచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ సామాజిక న్యాయం దిశగా పయనిస్తోందన్నారు. ఏపీ ఎడిటర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బెటర్ ఫర్ ఏపీ సొసైటీ పేరుతో పౌరులకు వాస్తవాలను తెలియజేసేందుకు రూపొందించిన ‘ఆంధ్రప్రదేశ్ ప్రగతి నాడు–నేడు’ సమగ్ర నివేదికను శుక్రవారం విజయవాడలో విడుదల చేశారు. ఈ సందర్భంగా జరిగిన సదస్సులో పలువురు మేధావులు, ప్రజా సంఘాల నేతలు మాట్లాడారు. ‘ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చినప్పటి పరిస్థితులు, ఇప్పటి పరిస్థితులు బేరీజు వేసుకుంటే మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. చిన్న రాష్ట్రం అయినప్పటికీ, దేశానికి ఆర్థిక శక్తిని అందించడంలో ఏపీ కీలకంగా మారింది. ఆర్బీఐ, నీతి ఆయోగ్, సోషియో ఎకనామిక్ రిపోర్టు.. ఇలా అన్ని నివేదికల్లో నాలుగేళ్లుగా ఏపీ సాధిస్తున్న వృద్ధి కనపడుతోంది. ఎటువంటి అవినీతికి తావు లేకుండా నాలుగేళ్లలో 3.26 లక్షల కోట్ల సంక్షేమాన్ని ప్రజలకు అందించడం చరిత్రలోనే ప్రథమం. ఫలితంగా పేదలు ఆర్థి క పరిపుష్టి సాధించారు. వారిలో కొనుగోలు శక్తి పెరిగింది. ఫలితంగా 16.22 శాతం స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటుతో ఏపీ దేశంలోనే అగ్రస్థానంలో కొనసాగుతోంది. దేశంలో అత్యధిక ప్రభుత్వ ఆస్పత్రులతో సామాన్య ప్రజలకు కార్పొరేట్ వైద్యం ఏపీలోనే లభిస్తోంది. పరిశ్రమల నెట్ అసెట్ విలువలో దక్షిణాదిన టాప్‌లో, ఫ్యాక్టరీల సంఖ్యలో దేశంలో నాలుగో స్థానం, చిన్న, మధ్య తరహా పారిశ్రామిక యూనిట్లలో రెండో స్థానం, ఎగుమతుల్లో 9 నుంచి 4వ స్థానానికి వచ్చింది. ఇంత అభివృద్ధి జరిగింది కాబట్టే.. 2018–19లో తలసరి ఆదాయం రూ.1.50 లక్షలు ఉంటే ఇప్పుడు 2.30 లక్షలకు పెరిగింది. పేదరికం 6.6 శాతానికి దిగివచ్చింది. కోవిడ్ సంక్షోభంలోనూ రాష్ట్రాన్ని సమర్థంగా నడిపించిన తీరు సీఎం జగన్ దార్శనికతకు అద్దం పట్టింది. సంక్షేమ పథకాలు లేకుంటే కోవిడ్ సమయంలో ప్రజా జీవనం తల్లకిందులయ్యేది. వ్యవసాయ ఆధారిత రాష్ట్రమైన ఏపీలో పరిశ్రమలకంటే వ్యవసాయంపైనే ఎక్కువ దృష్టి సారిస్తే మంచిది’ అని వారు వెల్లడించారు. ఈ సమావేశంలో నేత్ర వైద్యులు బి.సుబ్బారావు, వాకర్స్ ఇంటర్నేషనల్ డి్రస్టిక్ట్ గవర్నర్ రామలింగరాజు, లోక్‌సత్తా ఉద్యమ సంస్థ నగర అధ్యక్షుడు అశోక్ కుమార్, రిటైర్డు ప్రొఫెసర్ రెహా్మన్, సీనియర్ జర్నలిస్టు పీజీకే మూర్తి, సామాజికవేత్త అనంత హృదయరాజ్, గీతా విజన్ ట్రస్టు చైర్మన్ గీతా సుబ్బారావు, ఫోరం ఫర్ బెటర్ సొసైటీ కో–కన్వినర్ ఎస్.కోటేశ్వరరావు, తెలుగు రాజ్యాధికార సమితి పార్టీ అధ్యక్షుడు శ్రీనివాస్, సిల్వెస్టర్, సామాజిక కార్యకర్త బి.జయప్రకాశ్ తదితరులు ప్రసగించారు. అంతకు ముందు కళాశాల విద్యార్థులకు ‘రాష్ట్రంలో నాడు–నేడు అభివృద్ధి’పై క్విజ్ పోటీలు నిర్వహించి, విజేతలకు బహుమతులు అందజేశారు. అసత్యాలే వారికి ఆయుధాలు సమాజాన్ని పీడిస్తున్న ప్రధాన సమస్య ఫేక్ న్యూస్. ఏపీలో బాధ్యతాయుత మీడియా సైతం అభివృద్ధి లేదని ప్రచారం చేయడం సిగ్గుచేటు. నిత్యం పత్రికల్లో వచ్చే వార్తలను చూసి ఏపీ అభివృద్ధిపై వాస్తవాలు తెలుసుకునేందుకు అధ్యయనం చేశాం. మా పరిశీలనలో ఏపీ ఏ రంగంలోనూ వెనుకబడలేదు. – వీవీఆర్ కృష్ణంరాజు, అధ్యక్షుడు, ఏపీ ఎడిటర్స్ అసోసియేషన్ నాలుగు రెట్ల పారిశ్రామిక వృద్ధి ఆంధ్రప్రదేశ్ ప్రగతి పథంలో పయనిస్తుంటే తప్పుడు ప్రచారం చేసే మీడియాను అందరూ ఎండగట్టాలి. రాష్ట్రంలో గ్రామీణ ప్రజలను దృష్టిలో పెట్టుకుని పాలన సాగుతోంది. పారిశ్రామిక రంగం వృద్ధి గతంలో 3.2 శాతం ఉంటే ఇప్పుడు 12 శాతానికి పెరిగింది. ఒకప్పుడు 60 వేల ఎంఎస్ఎంఈలు ఉంటే ఇప్పుడు వాటి సంఖ్య 1.10 లక్షలకు చేరింది. 10 లక్షలకు పైగా ఉద్యోగులకు మేలు జరిగింది. 600 పెద్ద పరిశ్రమల్లో 6 లక్షలకు పైగా ఉపాధి వచ్చింది. – మేడపాటి వెంకట్, అధ్యక్షుడు, ఏపీ ఎన్ఆర్టీ సొసైటీ సామాజిక మార్పుతోనే అభివృద్ధి సాధ్యం సామాజిక మార్పు ద్వారానే నిజమైన అభివృద్ధి సాధ్యం. జీడీపీ పెరిగిందంటే ప్రజా జీవనం బాగుపడినట్టే. రాష్ట్రంలో పేదరికం తగ్గింది. అంటే సామాజిక న్యాయం కచ్చితంగా జరిగింది. ప్రస్తుత ప్రభుత్వం గతేడాది ఏకంగా రూ.44 వేల కోట్లు సామాజిక న్యాయానికి ఖర్చు చేసింది. – ఏఆర్ సుబ్రహ్మణ్యం, అధ్యక్షుడు,నవ్యాంధ్ర ఇంటెలెక్చువల్ ఫోరం నిత్యం అప్పులంటూ విష ప్రచారం రాష్ట్రాన్ని చంద్రబాబు అప్పుల కుప్పగా మార్చేస్తే.. సీఎం జగన్ అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారు. చంద్రబాబు రూ. 2.64 లక్షల కోట్లు అప్పు చేస్తే ప్రస్తుత ప్రభుత్వం ఇప్పటివరకు రూ.1.77లక్షల కోట్లు మాత్రమే అప్పు తెచ్చింది. కానీ, ఎల్లో మీడియా, ప్రతిపక్షాలు రూ.10 లక్షల కోట్లు అప్పు అంటూ దు్రష్పచారం చేయడం సిగ్గుచేటు. ఇప్పుడిస్తున్న సంక్షేమ పథకాలు గతంలో ఎన్నడూ లేవు. అప్పట్లో తెచ్చిన డబ్బంతా ఎటు పోయిందని ఎవరూ అడగట్లేదు. టీడీపీ హయాంలో సంపద పంపిణీ కొంత మంది చేతుల్లోనే ఉంది. ఇప్పుడు ప్రజల చేతుల్లోకి వెళ్లింది. – పి.విజయ్‌బాబు, అధ్యక్షుడు, అధికార భాషా సంఘం సమానత్వం కోసం కృషి జరుగుతోంది స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఇప్పుడు ఏపీలో సమానత్వం కోసం కృషి జరుగుతోంది. చంద్రబాబు 14 ఏళ్లలో ఒక్క ఇంటి పట్టా కూడా ఇవ్వలేదు. సీఎం జగన్ రూ.21 వేల కోట్లతో 30 లక్షలకు పైగా ఇళ్లు కట్టిస్తున్నారు. అసైన్డ్ భూములకు హక్కులు ఇచ్చారు. అమరావతిలో ఇప్పుడు 50 వేల ఇళ్ల పట్టాలతో రూ.3 లక్షల కోట్ల ఆస్తి రాబోతోంది. – మాదిగాని గుర్నాథం, అధ్యక్షుడు, సోషల్ డెమోక్రాటిక్ ఫ్రంట్ పేదల అభివృద్ధే నిజమైన సూచీ మనిషి జీవన ప్రమాణం పెరుగుదలే నిజమైన అభివృద్ధికి సూచీ. ఏపీపై కేంద్రం సవతి ప్రేమ చూపిస్తోంది. ప్రతిపక్షాలు విష ప్రచారం చేస్తున్నాయి. సీఎం జగన్ మాత్రం పేదల సంక్షేమమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు. పోర్టులు, ఎయిర్ పోర్టుల నిర్మాణం సాగుతోంది. కొత్తగా 17 వైద్య కళాశాలలు వస్తున్నాయి. – గౌతమ్‌రెడ్డి, చైర్మన్, ఏపీ ఫైబర్ నెట్ ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి తీసుకెళ్లారు చంద్రబాబు హయాంలో దళితులు ఎంఎస్ఎంఈలు పెట్టుకోవాలంలే సబ్సిడీ వచ్చేది కాదు. కానీ, సీఎం జగన్ ఎంఎస్ఎంఈలను బలోపేతం చేశారు. ఒక్క కరోనాలోనే రూ. 2 వేల కోట్లు ఎంఎస్ఎంఈల కోసం ఖర్చు చేశారు. జగనన్న బడుగు వికాసం, ఇతర కార్యక్రమాల ద్వారా ఊపిరిపోశారు. దళితులను ఉద్యోగం చేసుకునే స్థాయి నుంచి ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి తీసుకెళ్లారు. – కాలే వెంకటరమణారావు, దళిత ఇండియన్ చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు -
వలంటీర్లకు పవన్ క్షమాపణ చెప్పాల్సిందే
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రజలకు నిస్వార్థంగా సేవ చేస్తున్న గ్రామ, వార్డు వలంటీర్లపై చేసిన వ్యాఖ్యలు తప్పు అని ఒప్పుకుంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బహిరంగ క్షమాపణ చెప్పాలని పలువురు మేధావులు డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ ఇంటెలెక్చువల్స్ సిటిజన్స్ ఫోరం ఆధ్వర్యంలో విజయవాడలో గురువారం ‘మానవ అక్రమ రవాణా–గ్రామ వలంటరీ వ్యవస్థ’పై రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న వారు మాట్లాడుతూ.. ఏ వారాహిపై నుంచి పవన్ నిందలు వేశారో అదే వారాహిపై నుంచి క్షమాపణలు చెప్పకపోతే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్లలో అతనిపై ప్రైవేటు కేసులు పెట్టాలని, అలాగే పరువునష్టం దావా వేయాలని ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. వలంటీర్ల వ్యవస్థ ఏర్పడినపుడు.. సంచులు మోసే ఉద్యోగం అని, ఇంట్లో మగాళ్లు లేనప్పుడు వెళ్లి తలుపులు కొడతారా అని అప్పట్లో చంద్రబాబు విమర్శించారని గుర్తు చేశారు. చంద్రబాబు మాటలను జనం పట్టించుకోకపోవడంతో పవన్‌ను రంగంలోకి దించారన్నారు. నిఘా సంస్థల పేరును వాడుకుని చంద్రబాబు రాసిచ్చిన స్క్రిప్ట్‌ను పవన్ యథాతథంగా చదువుతున్నారని అన్నారు. అసలు ఏపీ కంటే తెలంగాణలోనే అధికంగా ఇలాంటి కేసులు నమోదవుతున్నాయని, అక్కడ కేసీఆర్‌ను పవన్ ప్రశ్నించగలరా అని నిలదీశారు. ఈ కార్యక్రమంలో మేధావులు వెల్లడించిన అభిప్రాయాలు వారి మాటల్లోనే.. బిల్లును పాస్ చేయమని కేంద్రాన్ని కోరు.. యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ వ్యవస్థలను ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు చేసింది. మానవ అక్రమ రవాణాకు పేదరికం ఒక కారణమని గుర్తించి, దానిని నిర్మూలించడానికి ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలు చేపడుతోంది. కేంద్రంలో గతంలో మేనకా గాంధీ మంత్రిగా ఉన్నప్పుడు మానవ అక్రమ రవాణాపై ఒక బిల్లు తయారు చేశారు. దానిని ఇప్పటి వరకూ పాస్ చేయలేదు. దీనిపై పవన్ నిలదీయాల్సింది కేంద్ర ప్రభుత్వాన్ని గానీ రాష్ట్రాన్ని కాదు. ప్రతి వ్యవస్థలోనూ తప్పులు చేసేవారున్నారు.. సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్లను లోబరుచుకుని పిల్లలు పుట్టాక వదిలేసే వారున్నారు. అలాగని హీరోలందరూ అలానే ఉన్నారని అంటామా? –పి.విజయ్‌బాబు, ఏపీ ఇంటెలెక్చువల్స్ సిటిజన్స్ ఫోరం వ్యవస్థాపక అధ్యక్షులు. పవన్ మాటలు సమంజసం కాదు రాష్ట్రంలో ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండటానికి జగన్ నిర్ణయాలు కారణం. గత ప్రభుత్వంలో పింఛన్ కావాలంటే జన్మభూమి కమిటీలకు లంచాలు సమర్పించాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు ఒకటో తేదీనే కోడి కూయకముందే ఇంటికొచ్చి ఇస్తున్నారు. దీంతో పల్లెల్లో బిక్షాటన పూర్తిగా పోయింది. వలంటీర్ల గురించి తప్పుగా మాట్లాడటం పవన్‌కు సమంజసం కాదు. –డాక్టర్ రామచంద్రారెడ్డి, విద్యావేత్త నిఘా వర్గాలు మీకెందుకు చెప్పాయి? ఏ రాజ్యాంగ పదవిలో ఉన్నారని పవన్‌కు కేంద్ర నిఘా వర్గాలు సమాచారం చెప్పాయి. నిఘా వర్గాల పేరును అడ్డుపెట్టుకుని కుట్ర పూరితంగా మాట్లాడుతున్నారు. వలంటీర్ల వ్వవస్థను నిర్వీర్యం చేయాలనే ప్రయత్నం చేస్తున్నారు. – పిల్లా రవి, న్యాయవాది. డేటా, పేర్లు బయటపెట్టండి భవిష్యత్ తరాల భవితకు పునాదులు వేస్తున్న ప్రభుత్వం ఇది. పవన్‌కు ఉన్న భావదారిద్య్రం మరొకరికి ఉండదు. రెండు లక్షల పుస్తకాలు చదివాడంట. కేంద్ర నిఘా సంస్థలు ఎలా పనిచేస్తాయో కూడా తెలియదా. పవన్ దగ్గర ఉన్న డేటా, అది చెప్పిన సంస్థల పేరు బయటపెట్టాలని డిమాండ్ చేస్తున్నా –శిష్ల్ట ధనలక్ష్మి, న్యాయవాది. చంద్రబాబు ఉచ్చులో పవన్ ఏ వలంటీర్ ఎంత మందిని అక్రమ రవాణా చేశారో ఆధారాలుంటే పవన్ బయటపెట్టాలి. ప్రజల్లో జనసేన చులకనై.. ఆ పార్టీ తన చెప్పు చేతల్లో ఉండాలని చంద్రబాబు పన్నిన ఉచ్చులో కుట్రలో పవన్ ఇరుక్కుంటున్నారు –ఎన్వీ రావ్, అంతర్జాతీయ బీసీ సంఘం అధ్యక్షులు. పవన్ చేసింది నేరం సెంట్రల్ ఇంటిలిజెన్స్ బ్యూరోని పవన్ బజారున పెట్టారు. మానవ అక్రమ రవాణా గురించి మాత్రమే ఇంటిలిజెన్స్ బ్యూరో చెవిలో చెప్పిందా లేక దేశ భద్రత రహస్యాలు కూడా చెప్పిందా? ఏపీ ప్రజలకు తెలియజేయమని తనకు నిఘా వర్గాలు చెప్పాయని పవన్ అనడం చాలా పెద్ద నేరం. –ఎ.ఎస్.ఎన్. రెడ్డి, విశ్రాంత పోలీస్ అధికారి. అప్పుడు నోరు లేవలేదేం చదువురాని ఎంతో మందికి వలంటీర్లు సేవలందిస్తున్నారు. కాస్టింగ్ కౌచ్ అభియోగం వచ్చినప్పుడు పవన్ ఎందుకు మాట్లాడలేదు. ఆధార్ డేటాను టీడీపీ హయాంలో సాఫ్ట్వేర్ సంస్థకు ఇచ్చినప్పుడు నోరెందుకు మూగబోయింది. 60 శాతం పైగా ఉన్న మహిళా వలంటీర్లు మానసికంగా బాధపడేలా చేశారు. – చంగవల్లి సాయిరాం, న్యాయవాది. జగన్ ఓ స్టేట్స్ మేన్ సీఎం వైఎస్ జగన్‌ను ఏకవచనంతో పిలిస్తే ఏమవుతుంది. దాని వల్ల జగన్‌కు ఏమీ నష్టం లేదు. ఆయన సమర్థవంతమైన పాలనతో దేశవ్యాప్తంగా మంచి పేరు సంపాదించుకున్నారు. ఎన్నో జాతీయ అవార్డులను తెచ్చుకుంటున్న స్టేట్స్ మేన్(గొప్ప రాజనీతిజ్ఞుడు) సీఎం జగన్. పవన్ బహిరంగ క్షమాపణ చెబితే ఆయనకే మంచిది. కాదంటే ఇకపై సహించేది లేదు. – నరహరిశెట్టి నరసింహారావు, న్యాయవాది. -
ఎప్పటికీ ‘మేధావులు’ అవసరమే!
ఫ్రెంచ్ సమాజంలో జరిగిన పరిణామాల నేపథ్యంలో ‘మేధావులు’ ఆవిర్భవించారు. అయితే ఈ మేధావులు అనే మాటను వామపక్షీయులను ఉద్దేశించి వాడింది సంప్రదాయవాదులు (రైట్‌వింగ్), కాకపోతే నిందాపూర్వకంగా! వారి దృష్టిలో ఈ మేధావులు దేశ వ్యతిరేకులు. నేటి భారత్‌లో కూడా అదే పరి స్థితి ఉండటం గమనార్హం. అయితే మేధావులు ఈ దాడులను మొదటినుంచీ తమ లక్ష్య సాధనలో ప్రాసంగికత లేనివిగా కొట్టిపారేస్తారు. అన్యాయం, నిరంకుశాధికారం, మత ఘర్షణల మీద పోరాటమే తమ లక్ష్యమని చెబుతారు. సమాజంలో జరిగే వ్యవహారాలకు మేధావులు తమ సొంత ప్రపంచాల్లో కళ్లుమూసుకుని ఉండలేరు. కానీ మునుపటిలా శక్తిమంతంగా వారు పోరాడుతున్నారా అన్నది సందేహం. 1993లో ‘బీబీసీ రీత్ ప్రసంగం’ చేస్తూ పాలస్తీనియన్ –అమెరికన్ ప్రొఫెసర్ ఎడ్వర్డ్ సెడ్ ఇలా ప్రశ్నించారు: ‘‘సృజనాత్మకతకూ, దౌర్బల్యుల పట్ల నిబద్ధ తకూ మధ్య సమతౌల్యత సాధించడం ఎలా?’’ ఇంకా ఆయన ఇలా కొనసాగించారు: ‘‘అదిభౌతికమైన ఉద్వేగాలు, ఆసక్తి ఉండని న్యాయం, సత్యం వంటి సూత్రాలు కదిలించినప్పుడల్లా అసలైన మేధావులు ఎన్నడూ లేనంత తాముగా ఉన్నారు. వారు అక్రమాలను నిరసించారు, బలహీనుల పక్షాన నిలిచారు, అధికారాన్ని ప్రశ్నించారు.’’ ప్రజా మేధావి అన్న భావన మొట్టమొదట 1894 డిసెంబరులో ఫ్రాన్ ్సలో పుట్టుకొచ్చింది. ఆర్మీ కెప్టెన్ ఆల్ఫ్రెడ్ డ్రేఫస్‌పై దేశద్రోహం ఆరోపణలు వచ్చాయి. జర్మన్లకు మిలటరీ రహస్యాలు అమ్మేశాడన్నది ఆయనపై ఆరోపణ. ఇదే అదనుగా యూదు వ్యతిరేక సంస్థలు చెల రేగాయి. ఉదాహరణకు ఎడువార్డ్ డ్రూమాంట్ సంపాదకత్వంలో నడిచిన ‘లా లిబ్రే’ ఫ్రెంచ్ యూదులు విశ్వాస ఘాతకులన్నట్టుగా కథనాలు ప్రచురించింది. కొంతమంది డ్రేఫస్‌కు మద్దతుగా నిలిచారు. ఆయనకు వ్యతిరేకంగా ఉన్న సాక్ష్యం బలహీనంగా ఉంది. ఫెర్డినాండ్ వాల్సిన్ ఈస్టర్‌హేజీ అనే మరో అధికారిపై ఇలానే దేశద్రోహ ఆరోప ణలు వస్తే మిలటరీ కోర్టు వాటిని కొట్టివేసింది. జరిగిన అన్యాయం గురించి అందరికీ స్పష్టంగా అర్థమైంది. జాతి వివక్ష కూడా ప్రస్ఫుటంగా కనిపించింది. ఈ నేపథ్యంలో మేధావులు తమ సొంత ప్రపంచాల్లో కళ్లుమూసుకు ఉండలేని పరిస్థితి. విఖ్యాత నవలా రచయిత ఎమిలీ జోలా ‘జా అక్యూస్’ పేరుతో రాసిన బహి రంగ లేఖ ‘లా అరోర్’ పత్రికలో ప్రచురితమైంది. డ్రేఫస్‌ను అక్రమంగా దోషిగా నిర్ధారించి ఆ విషయాన్ని కప్పిపుచ్చేందుకు ప్రయత్నించారని ఎమిలీ ఆ లేఖలో సైన్యాన్ని తీవ్రంగా విమర్శించారు. ఇది మరో వివాదానికి దారితీసింది. జోలా మద్దతుదారులు సైన్యాన్ని కించ పరచడం ద్వారా దేశాన్ని బలహీన పరిచారని సంప్రదాయవాదులు (రైట్ వింగ్) విరుచుకుపడ్డారు. మండించే స్వభావం గల అలంకార ప్రాయమైన దేశభక్తి కంటే వ్యక్తిగత స్వేచ్ఛకు ఉదారవాద వామ పక్షీయులు మద్దతిచ్చారు. సంప్రదాయవాదులు వారిని ‘మేధావులు’ అని నిందాపూర్వకంగా పిలిచారు. వారి దృష్టిలో ఈ మేధావులు దేశ వ్యతిరేకులు. నేటి భారత్‌లో కూడా అదే జరుగుతోంది. అయితే మేధావులు ఎప్పుడూ ఈ దాడులను తమ లక్ష్య సాధనలో ప్రాసంగికత లేనివిగా కొట్టిపారేస్తారు. అన్యాయం, నిరంకుశాధికారం, మత ఘర్షణల మీద పోరాటమే తమ లక్ష్యమని చెబుతారు. తత్వవేత్త, రచయిత జా పాల్ సార్త్ర్ 1980లో మరణించినప్పుడు సుమారు యాభై వేల మంది ఆయన అంతిమయాత్రలో పాల్గొన్నారు. వివాదానికి దూరంగా ఉండే హక్కు మేధావికి లేదనే వారు సార్త్ర్. అన్నింటికీ అతీతంగా ఉంటామనే సౌలభ్యం కూడా వారికి నాస్తి అంటారాయన. సమాజాన్ని మార్చేందుకు ప్రజా మేధావి అనేవాడు తన సొంత విషయాలను పక్కనబెట్టాలనీ, వ్యక్తిగత జీవితం వంటివి అతడు లేదా ఆమెకు ఉండవనీ అంటారు. 1935లో ఫ్రెంచ్ మేధావులు అంతర్జాతీయ రచయితల సంఘం ఒకదాన్ని ఏర్పాటు చేశారు. ప్యారిస్ సంస్కృతి పరిరక్షణ దీని ఉద్దేశం. ఈ సంఘం ఏర్పాటు చేసిన సదస్సులో ఫాసిజానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ప్రజలు ఏకమయ్యారు. జూన్ నెలలో జరిగిన ఈ సదస్సుకు సజ్జాద్ జహీర్, ముల్క్‌రాజ్ ఆనంద్ వంటివారూ హాజరయ్యారు. తరువాతి కాలంలో వీరిద్దరూ భారతీయ సాహిత్యం, ఉర్దూ కవిత్వంలో మార్పునకు కృషి చేశారు. ఆల్డస్ హక్స్లీ, ఈఎం ఫార్స్టర్, బోరిస్ ప్యాస్టర్‌నాక్, బెర్తోల్ట్ బ్రెష్ట్, ఇంకా ఇతర దిగ్గజ రచయితలు ఈ సదస్సుకు హాజరయ్యారు. సదస్సులో తలెత్తిన వివాదాలు కాస్తా ప్యారిస్ వీధుల వరకూ విస్తరించాయి. సోవియట్ యూనియన్ చరిత్రకారుడు ఇల్యా ఎహ్రెన్ బర్గ్ ‘దోపిడిదారులను దునుమాడేందుకు ఆయుధంగా మారని ఏ కళ అయినా నిష్ప్రయోజనమైంది!’ అన్నారు ఇల్యా మీద ఆండ్రే బ్రెటన్ లాంటివారు బహిరంగంగానే విమర్శించారు. చివరకు ఆ సదస్సు ఫాసిస్టులకు వ్యతిరేకంగా ఒక సమాఖ్యనైతే ఏర్పాటు చేయలేకపోయింది. సదస్సుకు హాజరైన వారందరూ ఫాసిజాన్ని ద్వేషించారు. కానీ సోవియట్ యూనియన్ తరహా పరి ష్కారం ఉండాలన్న ఆకాంక్షపై మాత్రం ఏకాభిప్రాయానికి రాలేక పోయారు. అధివాస్తవికులు, కమ్యూనిస్టుల మధ్య సయోధ్య కోసం రెనె క్రేవెల్ (అధివాస్తవికుడు) విఫలయత్నం చేశారు. ఆ నిస్పృహలో రెనె తన ఇంటికొచ్చేసి గ్యాస్ కనెక్షన్ ఆన్ చేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ‘ఏవగింపు’ అని రాసి ఉన్న నోట్ అతడి కోటు జేబుకు అతికించి ఉండింది! ప్రగతిశీల రచయితల బాధ్యత రచయితలు, కవుల సామాజిక బాధ్యతలపై అదే కాలంలో భారత్‌లో కూడా ఎన్నో చర్చోపచర్చలు జరుగుతున్నాయి. కవులు, రచయితలు సామాన్యులతో కలిసిపోవాలంటే వారు తమ వ్యక్తిగత ఆనందాలు, కోరికలు, ఉద్వేగాలు, నిస్పృహలకు అతీతంగా తమ రచనలు, కవితలను తీసుకెళ్లాలన్న నమ్మకంతో 1936లో ప్రోగ్రెసివ్ రైటర్స్ అసోసియేషన్ (అఖిల భారతీయ ప్రగతిశీల రచయితల సంఘం) ఏర్పడింది. మతం, జాతీయత రాజకీయాల నుంచి పేద రికం, వివక్ష, వర్గం వైపు కవులను మళ్లించిన ఘనత దీనిదే. ప్రోగ్రెసివ్ రైటర్స్ అసోసియేషన్ సభ్యులు ఇటలీ కాలమిస్ట్ ఆంటోనియో గ్రాంసీ రచనలను అప్పటికి చదివి ఉండేందుకు అవకాశం లేదు. ఆయన ‘ప్రిజన్ నోట్‌బుక్’ 1970లలో ఆంగ్లంలో ప్రచురితమైంది. కానీ ముస్సోలిని అపఖ్యాతి జైలు వ్యవస్థలో మగ్గిన గ్రాంసీ రాసినదానిలో ఈ ప్రగతిశీల రచయితలు నమ్మకం ఉన్నవారే. అదేమిటంటే... మేధావి అనేవాడు సామాజిక, ఆర్థిక, రాజకీయ పరివర్తనకు అవసర మైన వాతావరణాన్ని సృష్టించాలి. ఉదారవాదులు రాజకీయ జీవితంలోకి ప్రవేశించాలి! ప్రోగ్రెసివ్ రైటర్స్ అసోసియేషన్ సభ్యుడు, ఇండియన్ పీపుల్స్ థియేటర్ అసోసియేషన్ సభ్యుడైన కె.ఏ. అబ్బాస్ తన ఆత్మకథలో ‘నేనేమీ ఓ ద్వీపాన్ని కాదు’ అన్న వాక్యం ఉంటుంది. 1946 నాటి బాంబే గురించి ఈ వ్యాఖ్య. అప్పట్లో హిందూ, ముస్లింల మధ్య బాంబే రెండుగా విడిపోయి ఉండేది. ప్రోగ్రెసివ్ రైటర్స్ అసోసియేషన్ , ఇండియన్ పీపుల్స్ థియేటర్ అసోసియేషన్ ఓ శాంతి ప్రదర్శన ఏర్పాటు చేశాయి. పృథ్వీరాజ్ కపూర్‌కు చెందిన పృథ్వీ థియేటర్స్‌తో పాటు సుమారు 52 సాంస్కృతిక సంఘాలు ఈ ప్రదర్శనలో పాల్గొ న్నాయి. కపూర్లు(పృథ్వీరాజ్, రాజ్, షమ్మీ), దేవానంద్, బల్రాజ్ సహానీ, అభ్యుదయ ఉర్దూ కవులు, రచయితలు సజ్జాద్ జహీర్, మజ్రూహ్ సుల్తాన్ పూరి, అలీ సర్దార్ జాఫ్రీ, కైఫీ అజ్మీ, సాహిర్ లూధి యాన్వీతో పాటు మరాఠీ, గుజరాతీ రచయితలు కూడా బోరిబందర్ నుంచి బాంద్రా వరకూ సాగిన ఈ ప్రదర్శనలో పాల్గొన్నారు. శాంతి, సామరస్యాలు, సౌభ్రాతృత్వాలను సూచించే పాటలు పాడుతూ సాగిందా ఊరేగింపు. తద్వారా మత ఘర్షణల గాయాలకు మందు పూసే ప్రయత్నం జరిగింది. ప్రస్తుతానికి వస్తే... మన నటులను అధికార పక్షంపై ప్రశంసలు కురిపించేలా బలవంతం చేస్తున్నారు. జైలుకెళ్లాల్సి వస్తుందని రచ యితలు భయపడుతున్నారు. విప్లవాత్మక ఆలోచనలున్న నాటక రంగం కనుమరుగైంది. కవులు రాస్తున్నారు కానీ వారి వారి ఏకాంతాల్లో! విద్యావేత్తలు తమ ఉపకులపతుల ఆగ్రహానికి గురి కాకుడ దన్న రంధిలో ఉన్నారు. ఏతావాతా... సమాజపు చేతన కాస్తా నిశ్శబ్దంలో అంగలారుస్తోంది. ఇది ఉపమాలంకారమే కావొచ్చుగానీ, మేధావుల చుట్టూ సంకెళ్ల శృంఖలాలు చుట్టుకుపోయి ఉన్నాయి. దశాబ్దాలపాటు ఫాసిస్టు వ్యతిరేక కూటమి కట్టిన శక్తులు మమ్మల్ని మళ్లీ ఆవహిస్తే బాగుండు. సామాజిక మేధావులు లేని సమాజం నశించిపోతుందనీ, అది కూడా చాలా నెమ్మదిగా కానీ కచ్చితంగా జరుగు తుందనీ ఆ శక్తులు గుర్తుచేస్తున్నాయి. నీరా చంఢోక్ వ్యాసకర్త రాజకీయ విశ్లేషకులు (‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
వెంటాడు... వేటాడు...
పరిశోధన, ప్రజా విధానాలకు సూచన, సలహాల్లో యాభై ఏళ్ళుగా కృషి చేస్తూ, స్వర్ణోత్సవం జరుపుకోవడమనేది ఉత్సాహంగా ముందుకు అడుగేయాల్సిన సందర్భం. కానీ, అందుకు విరుద్ధంగా అడుగులు ముందుకు పడకుండా పాలకులే అడ్డం పడితే? పౌర విధానానికి సంబంధించి దేశంలోకెల్లా అత్యంత గౌరవనీయమైన ఢిల్లీకి చెందిన మేధావుల బృందమైన ‘సెంటర్ ఫర్ పాలసీ రిసెర్చ్’ (సీపీఆర్) విషయంలో ఇప్పుడు జరుగుతున్నది అలానే ఉంది. ఆ సంస్థకు విదేశీ విరాళాలు, ఆర్థిక సహాయం అందే వీలు లేకుండా ‘విదేశీ సహాయ (నియంత్రణ) చట్టం’ (ఎఫ్సీఆర్ఏ) కింద రిజిస్ట్రేషన్‌ను ఆరు నెలల పాటు కేంద్రం రద్దు చేసింది. ఈ మేరకు కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖ ఫిబ్రవరి 27న ఉత్తర్వులివ్వడం జాతీయ, అంతర్జాతీయ మేధావులను ఉలిక్కిపడేలా చేసింది. విద్యావిషయిక కార్యక్రమాలకే లైసెన్స్ ఇచ్చామనీ, కానీ సీపీఆర్ మాత్రం విదేశీ విరాళాలను పుస్తక ప్రచురణ లాంటి వాటికీ వినియోగిస్తోందనీ ఆ ఉత్తర్వుల ఆరోపణ. అయిదు నెలల క్రితం గత సెప్టెంబర్‌లో ఢిల్లీలోని సీపీఆర్ కార్యాలయం, అలాగే ఆక్స్‌ఫామ్ ఇండియా, పలు డిజిటల్ మీడియా సంస్థలకు నిధులిచ్చే బెంగళూరుకు చెందిన ‘ఇండిపెండెంట్ అండ్ పబ్లిక్ స్పిరిటెడ్ మీడియా ఫౌండే షన్’ (ఐపీఎస్ఎంఎఫ్)లపై ఆదాయపు పన్ను (ఐటీ) శాఖ విరుచుకుపడింది. సర్వేలు నిర్వహించింది. ఆ వెంటనే సిబ్బందికి సమన్లు వెళ్ళాయి. దానికి కొనసాగింపుగా పన్ను మినహాయింపును రద్దు చేస్తామని హెచ్చరిస్తూ, షోకాజ్ నోటీసు వెళ్ళాయి. ఒక రకంగా దాని కొనసాగింపే – ఇప్పుడీ లైసెన్స్ రద్దు. నిజానికి, లాభాపేక్ష రహిత స్వచ్ఛంద సంస్థగా 1976 నుంచి సీపీఆర్‌కు పన్ను మినహాయింపు లభిస్తోంది. వచ్చే 2027 దాకా మినహాయింపు ఉన్నా, ఇప్పుడీ బెదిరింపులు గమనార్హం. ఆదాయపు పన్ను లెక్కల్లో తేడాలుంటే విచారించడం తప్పు కాదు. చట్టం ముందు అందరూ సమానులే గనక ఏమన్నా తప్పు చేసినట్టు రుజువైతే చర్యలు తీసుకోవడమూ తప్పనిసరే. కానీ, మనసులో ఏదో పెట్టుకొని, ఏ చిన్న లోపం కనిపించినా, వెంటాడి వేధించాలని అనుకుంటేనే అది హర్షించలేని విషయం. ఆ సంస్థ బాధ్యుల్లోని పరిశోధకులు కొందరు ప్రభుత్వ విధానాల్ని తప్పుబడుతూ ఇటీవల రాసిన వ్యాసాలే దీనికి హేతువని ఓ బలమైన విమర్శ. ఎక్కడా, ఏ తప్పూ చేయలేదని తేలినప్పటికీ, సాంకేతిక కారణాలే సాకుగా సీపీఆర్ లాంటి స్వతంత్ర మేధాసంస్థను వేధిస్తున్నారన్నది స్పష్టం. కొండను తవ్వి ఎలుకను పట్టే ఈ దీర్ఘకాల ప్రక్రియతో మానసికంగా వేధించడమే పాలక వర్గాల పరమార్థంగా కనిపిస్తోంది. నిజానికి, సీపీఆర్ అనేది దేశంలోని అగ్రేసర స్వతంత్ర పరిశోధనా సంస్థల్లో ఒకటి. విభిన్నరంగాలకు చెందిన పరిశోధకులు, వృత్తినిపుణులు, విధాన నిర్ణేతలతో కూడిన మేధావుల బృందం ఇది. ఈ లాభాపేక్ష రహిత సంస్థ 50 ఏళ్ళ క్రితం 1973లో ఏర్పాటైంది. ప్రభుత్వ విధానాల్లోని వివిధ అంశాలపై ఈ సంస్థలోని బుద్ధిజీవులు దృష్టి సారిస్తుంటారు. ఆర్థికవేత్త – మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి వై.వి. చంద్రచూడ్ సహా పలువురు మేధావులు ఈ సంస్థ కార్యవర్గంలో మాజీ సభ్యులు. అనేక కేంద్ర శాఖలతో, రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగాలతోనూ కలసి పనిచేసిన ఈ సంస్థను భారత ప్రభుత్వం గుర్తించింది. దశాబ్దాలుగా పన్ను మినహాయింపూ ఇస్తోంది. గత ఏడాదీ వివిధ రాష్ట్రాలు, కేంద్ర శాఖల నుంచి సీపీఆర్‌కు నిధులు వచ్చాయి. మరి, ఉన్నట్టుండి సీపీఆర్ జీవితం మీద పాలకులకు ఎందుకు విరక్తి కలిగినట్టు? దీనికి రకరకాల కథనాలు వినిపిస్తున్నాయి. ఛత్తీస్‌గఢ్‌లో పనిచేస్తున్న ‘జన అభివ్యక్తి సామాజిక్ వికాస్ సంస్థ’ (జస్వాస్) సహా దాదాపు 30 సంస్థలకు డేటా సేకరణ, పర్యావరణ చట్టం సహా పలు అంశాల్లో పరిశోధనకు సీపీఆర్ నిధులిచ్చింది. ఛత్తీస్‌గఢ్‌లో ఏనుగులు తిరిగే జీవవైవిధ్య ప్రాంతం హస్‌దేవ్‌లో బొగ్గు గనుల అక్రమ తవ్వకంపై ఆదివాసీ ఉద్యమంలో జస్వాస్ ట్రస్టీ అయిన ఒక పరిశోధకుడి భాగం కూడా ఉంది. ఆ గనులు పాలకుల ఆశీస్సులున్న వ్యాపార సంస్థవనీ, ఆ ఉద్యమానికీ – సీపీఆర్‌తో జస్వాస్ భాగస్వామ్యానికీ సంబంధం లేకున్నా పాలకులకు అది కోప కారణమైందనీ విశ్లేషకుల మాట. కారణాలు ఏమైనా, ఏలినవారికి కోపమొస్తే బండి నడవడం కష్టమనే విషయం తాజా సీపీఆర్ లైసెన్స్ రద్దుతో మరోసారి రుజువు చేస్తోంది. గమనిస్తే – ఐటీ విభాగం తన నోటీసుల్లో పేర్కొన్న పరిశీలనలు, చేసిన ఆరోపణలు దాని పరిధిని దాటి ఉన్నాయి. ఇది పాలకులపై అనుమానాలకు ఊతమిస్తోంది. సీపీఆర్ మాత్రం తమ కార్యకలాపాలన్నీ చట్టబద్ధమైనవేననీ, ప్రభుత్వ సంస్థలు తమ ఆదాయ వ్యవహారాలను ఎప్పటి కప్పుడు ఆడిట్ చేస్తూనే ఉన్నాయనీ స్పందించింది. రాజ్యాంగ విలువల స్ఫూర్తితో ఈ వివాదం వీలైనంత త్వరలో సమసిపోతుందని అభిలషించింది. ఆ అభిలాష వాస్తవరూపం ధరిస్తే సంతో షమే. అయితే, పాలకులు తమ చేతుల్లోని దర్యాప్తు సంస్థలనూ, విభాగాలనూ దుర్వినియోగం చేయ డానికి ఏ మాత్రం వెనుకాడని గతం, వర్తమానమే భయపెడుతున్నాయి. నిబంధనల్లోని సాంకేతిక అంశాలను ఆయుధంగా చేసుకొని, భావప్రకటన స్వేచ్ఛకున్న అవకాశాల్ని అడ్డుకోవాలని పాలకులు చూడడం ఆందోళన రేపుతోంది. ఐటీనైనా, విదేశీ స్వార్థ ప్రయోజనాలు మన దేశ రాజకీయాలను ప్రభావితం చేయరాదని పెట్టుకున్న ఎఫ్సీఆర్ఎ లాంటి నియంత్రణ వ్యవస్థనైనా ప్రభుత్వేతర సంస్థల పీక నులమడానికి వాడితే అది అప్రజాస్వామికమే కాదు... అచ్చమైన ప్రతీకారమే! -
అప్పర్‌భద్రతో రాయలసీమకు నీటి గండం
సాక్షి,అమరావతి/తిరుచానూరు(తిరుపతి జిల్లా): కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఏపీ పట్ల చూపుతున్న వివక్షతతో రాయలసీమకు తీవ్ర నీటిగండం ఎదురయ్యే ప్రమాదం ఉందని రాయలసీమ మేధావుల ఫోరం కన్వీనర్ పురుషోత్తంరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్వీ యూనివర్సిటీలోని ఆడిటోరియంలో మంగళవారం ఫోరం ప్రతినిధుల సమావేశం నిర్వహించారు. ప్రొఫెసర్ జయచంద్రారెడ్డి, ప్రయాగతో కలిసి పురుషోత్తంరెడ్డి విలేకరులతో మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం కర్ణాటక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని అప్పర్ భద్రను జాతీయ ప్రాజెక్ట్‌గా ప్రకటన చేస్తూ నిధులు మంజూరు చేయడం అన్యాయమన్నారు. ఈ ప్రాజెక్ట్ పూర్తయితే రాయలసీమ ఎడారిగా మారుతుందని తెలిపారు. కర్ణాటక ప్రభుత్వం చేపట్టిన చట్టబద్ధత లేని ఎగువ భద్రను నిలువరించాల్సిన కేంద్ర ప్రభుత్వం అందుకు భిన్నంగా జాతీయ హోదాను ప్రకటించడం ద్వారా ఫెడరల్ స్ఫూర్తిని తంగలో తొక్కిందన్నారు. ఈ విషయంపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో ఎస్ఎల్పీ వేయడాన్ని తాము స్వాగతిస్తున్నామని చెప్పారు. ఈ నేపథ్యంలో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి కేంద్రంపై సమష్టి పోరాటం సాగించాలన్నారు. పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న తరుణంలో ఏపీకి చెందిన సభ్యులు కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న వివక్షకు వ్యతిరేకంగా పోరాడాలని కోరారు. కాగా, ఎగువన ఉన్న కర్ణాటక తుంగభద్రపై అదనంగా మరో ఎత్తిపోతల పథకం పూర్తి చేస్తే దిగువనున్న రాయలసీమలోని తుంగభద్రపై నికర జలాలు కలిగి ఉన్న ఎల్ఎల్సీ, హెచ్ఎల్సీ, కేసీ కెనాల్, గుండ్రేవుల ప్రమాదంలో పడతాయి. కృష్ణా నదిలో ప్రవాహం తగ్గి తుంగభద్ర నీరే ప్రధానం అవుతున్న నేపథ్యంలో కర్ణాటక నిర్మించే ఎగువ భద్రతో గాలేరు నగరి, హంద్రీనీవా, తెలుగు గంగ, ఎస్‌ఆర్‌బీసీలకు సైతం ప్రమాదం ఏర్పడుతుంది. -
అప్పర్ భద్ర ప్రాజెక్టు పూర్తయితే రాయలసీమ ఎడారే: మేధావుల ఫోరం
తిరుపతి: రాయలసీమ మేధావుల ఫోరం తిరుపతిలో సమావేశమయ్యింది. తుంగభద్ర నదిపై అప్పర్ భద్ర ప్రాజెక్టును వెంటనే నిలిపివేయాలని సమావేశంలో తీర్మానించారు. కర్ణాటక ఎన్నికల నేపథ్యంలో దీన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించారని, అప్పర్ భద్ర ప్రాజెక్టు పూర్తయితే రాయలసీమ ఎడారి అవుతుందని మేధావుల ఫోరం పేర్కొంది. ఈ ప్రాజెక్టు వల్ల రాయలసీమకు తాగునీటి కష్టాలు తప్పవని చెప్పారు. ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం వేసిన పిటిషన్‌ను స్వాగతిస్తున్నామని రాయలసీమ మేధావుల ఫోరం తెలిపింది. -
జీవో నంబర్ 1లో నిషేధమనే పదమే లేదు
ఏఎన్‌యూ: ప్రజల ప్రాణాలు, జీవితాలను కాపాడేందుకు రోడ్లపై బహిరంగ సభల విషయంలో నియంత్రణ విధిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని మేధావుల ఐక్యవేదిక కొనియాడింది. జీవో నంబర్ 1లో బహిరంగ సమావేశాలు నిషేధమనే పదమే లేదని వక్తలు గుర్తు చేశారు. నియంత్రణకు, నిషేధానికి చాలా వ్యత్యాసం ఉందనేది గుర్తించాలని సూచించారు. తొక్కిసలాటల్లో 11 మంది ప్రాణాలు పోతే ప్రభుత్వం స్పందించకుండా ఎలా ఉంటుందని నిలదీశారు. ప్రజా సంరక్షణ చర్యలు చేపట్టడం పాలకుల కనీస బాధ్యతనే విషయం మరిచిపోకూడదన్నారు. ప్రభుత్వం ఒక కొత్త నిర్ణయం అమల్లోకి తెస్తే దానిపై అవగాహన కల్పించడం మీడియా బాధ్యత అని తెలిపారు. ఇలా కాకుండా ప్రభుత్వ నిర్ణయాలను భూతద్దంలో చూపుతూ.. ఇవి ప్రజలకు నష్టమన్నట్టు ప్రచారం చేయడం సరికాదన్నారు. భావ ప్రకటన స్వేచ్ఛ ఉందని.. ఇతరుల హక్కులు, స్వేచ్ఛ, ప్రాణాలను హరించకూడదని స్పష్టం చేశారు. ఈ ఉత్తర్వుల ఆవశ్యకత, ఇందులోని అంశాలపై విద్యావేత్తలు, మేధావులు సమాజానికి అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. అలాగే పౌర హక్కుల సంఘాలు, ప్రజా సంఘాలు కూడా స్పందించాలని కోరారు. మేధావుల ఐక్య వేదిక ఆధ్వర్యంలో గుంటూరు ఆచార్య నాగార్జున యూనివర్సిటీ (ఏఎన్‌యూ)లో బుధవారం జీవో నంబర్ 1పై అవగాహన సదస్సు జరిగింది. ఈ సందర్భంగా వక్తలు ఏమన్నారంటే.. రాజకీయ కోణంలో చూడకూడదు.. సామాన్యుల ప్రాణాలు పరిరక్షించేందుకు ప్రభుత్వం జారీ చేసిన ఈ ఉత్తర్వులను రాజకీయకోణంలో చూడటం సరికాదు. తొక్కిసలాటల్లో 11 మంది ప్రాణాలు పోతే ప్రభుత్వం స్పందించకుండా ఎలా ఉంటుంది? కందుకూరు, గుంటూరు ఘటనలపై పౌరహక్కులు, దళిత సంఘాలు కూడా స్పందించకపోవడం విచారకరం. ఇదే ఘటన అమెరికా, బ్రిటన్ వంటి దేశాల్లో జరిగితే అక్కడ సమాజమంతా గొంతెత్తేది. మరణించిన వారికి కనీసం సంతాప సభ కూడా నిర్వహించకపోవడం హర్షణీయమా? కనీసం భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు జరగనీయబోమని ప్రకటించకుండా యధావిధిగా సభలు, సమావేశాలు నిర్వహించడం సరైన పనేనా? ప్రభుత్వ చారిత్రాత్మక నిర్ణయంపై మేధావులు సమాజానికి అవగాహన కల్పించాలి. –ఆచార్య పి.రాజశేఖర్, వీసీ, ఏఎన్‌యూ మరిన్ని సదస్సులు నిర్వహించి అవగాహన కల్పిస్తాం.. సమాజానికి ప్రయోజనం చేకూర్చే ప్రభుత్వ ఉత్తర్వులపై సమాజానికి అవగాహన కల్పించడం విద్యావేత్తలు, మేధావుల బాధ్యత. ప్రభుత్వ ఉత్తర్వులపై మేధావుల ఐక్య వేదిక ఆధ్వర్యంలో మరిన్ని సదస్సులు నిర్వహించి అవగాహన కల్పిస్తాం. –ఆచార్య శ్రీనివాసరెడ్డి, ప్రిన్సిపాల్, ఆర్కిటెక్చర్ కళాశాల, ఏఎన్‌యూ ప్రభుత్వ ఉత్తర్వులు అందరికీ వర్తిస్తాయని గుర్తించాలి.. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఆసక్తి ఉన్నవారు సూచనలు, సలహాలు ఇవ్వవచ్చు. కానీ ఆ నిర్ణయమే తప్పంటే ఎలా? ప్రభుత్వ ఉత్తర్వులు అందరికీ వర్తిస్తాయనేది గుర్తించాలి. –ఆచార్య బి.కరుణ, రిజిస్ట్రార్, ఏఎన్‌యూ ప్రభుత్వ చర్యను అందరూ హర్షించాలి.. సమాజంలోని పౌరులందరి హక్కులు, స్వేచ్ఛ కాపాడటం ప్రభుత్వాల బాధ్యత. ప్రజాప్రయోజనాల కోసం ప్రభుత్వం చేపట్టిన చర్యలను అందరూ హర్షించాలి. – ఆచార్య పి.వరప్రసాదమూర్తి, రెక్టార్, ఏఎన్‌యూ ఎవరికీ ఇబ్బంది లేనిచోట నిర్వహించుకోవాలి.. ఎవరికీ ఇబ్బంది లేనిచోట బహిరంగ సభలు, సమావేశాలు నిర్వహించుకోవాలి. అసలు సమావేశాలే నిర్వహించకూడదని ఆదేశాలు జారీ చేస్తే ఇబ్బంది కానీ ఎవరికీ ఇబ్బంది కలిగించకుండా జరుపుకోండంటే తప్పెలా అవుతుంది? – ఆచార్య కె.సునీత, ఓఎస్డీ, ఏఎన్‌యూ ఈ జీవోతో ఇబ్బందులేమీ లేవు.. జీవో నంబర్ 1తో ఇబ్బందులేమీ లేవు. దీనిలోని వాస్తవాలను అందరూ గ్రహించాలి. అన్ని వర్గాల ప్రయోజనాలను కాపాడే చర్యలను ఎవరు చేపట్టినా హర్షించాలి. –ఆచార్య కె.మధుబాబు, డీన్, సీడీసీ, ఏఎన్‌యూ -
జీవోను రాజకీయ కోణంలో చూడకండి
ఏయూ క్యాంపస్: ప్రజల ప్రాణాలకు రక్షణ కవచంగా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవో నంబర్ 1 నిలుస్తుందని పలువురు మేధావులు అభిప్రాయపడ్డారు. జీవోను రాజకీయ కోణంలో చూడొద్దని కోరారు. ఎవరి స్వేచ్ఛను ప్రభుత్వం హరించలేదని స్పష్టం చేశారు. విశాఖపట్నంలోని ఆంధ్రా యూనివర్సిటీలో ఏయూ, విశాఖ నగర మేధావుల వేదిక సంయుక్తంగా బుధవారం ‘ప్రజల ప్రాణాలకు రక్ష జీవో నంబర్ 1’ అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించాయి. ప్రభుత్వం ప్రజల ప్రాణాలను రక్షించాలనే ఏకైక లక్ష్యంతో తీసుకువచ్చిన జీవో ఇదని వక్తలు స్పష్టం చేశారు. దీన్ని తామంతా స్వాగతిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో న్యాయవాది చిన్నారావు, డాక్టర్ ఎ.కె.ఎం.పవార్, ఆచార్య ఎన్.సత్యనారాయణ, డాక్టర్ రాజమాణిక్యం, డాక్టర్ ఎస్.శ్రీనివాసరావు, డాక్టర్ బాలకోటయ్య, డాక్టర్ అంబేడ్కర్ రాజు, డాక్టర్ ఎ.సీతారత్నం, డాక్టర్ రాజ్‌కుమార్, తదితరులు ప్రసంగించారు. జీవో నంబర్ 1 మన బాధ్యతను గుర్తు చేసింది. ఈ జీవోతో ప్రజలకు ఎటువంటి అసౌకర్యం, ఇబ్బంది కలగదు. – ఆచార్య జేమ్స్ స్టీఫెన్, అంబేడ్కర్ చైర్ ప్రొఫెసర్, ఏయూ ప్రజల ప్రాణాలకు నష్టం జరగకుండా సమావేశాలు పెట్టుకోవచ్చని జీవో స్పష్టం చేస్తోంది. దీన్ని వక్రీకరిస్తూ ఎమర్జెన్సీని తలపిస్తోందని ప్రచారం చేయడం సరికాదు. – ఆచార్య కె.శ్రీరామమూర్తి, పూర్వ ప్రిన్సిపాల్, ఏయూ ఆర్ట్స్ కళాశాల ర్యాలీలు, సభలు నిర్వహించవద్దని ప్రభుత్వం ఎక్కడా చెప్పలేదు. ప్రజలకు ఇబ్బంది కలగకుండా నిర్వహించుకోవాలని జీవో స్పష్టం చేస్తోంది. – ఆచార్య ఎన్.ఎ.డి.పాల్, బీసీడీఈ సమన్వయకర్త విమర్శించే వ్యక్తులు ముందుగా జీవోను చదివి, అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. ప్రజల మేలు కోసమే ప్రభుత్వం ఈ జీవో తెచ్చింది. – ఆచార్య పి.విశ్వనాథం, గౌరవ ఆచార్యులు, డీసీఎంఎస్ విభాగం ఏయూ మహిళా ఉద్యోగుల సంఘం తరఫున జీవో నంబర్ 1ని తాము స్వాగతిస్తున్నాం. ఇటువంటి జీవోలు ప్రజల రక్షణకు, భద్రతకు ఉపయుక్తంగా నిలుస్తాయి. – ఆచార్య టి.శోభశ్రీ, ప్రిన్సిపాల్, ఐఏఎస్ఈ జీవో నంబర్ 1 అప్రజాస్వామికం అనడం సరికాదు. కందుకూరు, గుంటూరు ఘటనలు పునరావృతం కాకుండా ప్రజల ప్రాణాలను కాపాడాలనే ఈ జీవో తీసుకువచ్చారు. – ఆచార్య పి.అర్జున్, గౌరవ ఆచార్యులు, సోషల్ వర్క్ విభాగం నిషేధం, ఆంక్షలకు వ్యత్యాసం ఉందనే విషయాన్ని గమనించకుండా కొందరు ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం సరికాదు. ఈ జీవోపై వాస్తవాలు తెలిపే విధంగా విస్తృత చర్చలు జరపాలి. – పాకా సత్యనారాయణ, న్యాయవాది ప్రజల ప్రాణాలు ఎంతో ప్రధానం. ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేయడం అర్థరహితం. – ఆచార్య విజయ్‌మోహన్, డీన్, విద్యార్థి వ్యవహారాలు కొంత మంది ఏకపక్షంగా ఈ జీవోను వ్యతిరేకిస్తూ మాట్లాడుతున్నారు. ఇది సరికాదు. – ఆచార్య ఎస్.పుల్లారావు, అర్థశాస్త్ర విభాగాధిపతి అన్ని పార్టీలకు ఈ జీవో వర్తిస్తుంది, ఎక్కడా నిషేధం లేదు.. కేవలం నిబంధనలు మాత్రమే ఉన్నాయి. వీటిని అనుసరిస్తూ సమావేశాలు, ర్యాలీలు జరుపుకోవడానికి ఇబ్బంది ఏముంది? – ఆచార్య ఎ.పల్లవి, క్రీడా విభాగాధిపతి, ఏయూ -
దేశ చరిత్రలోనే ‘గృహ’త్తర అధ్యాయం
పాత గుంటూరు: గతంలో ఇంటి స్థలం కావాలంటే రోజుల తరబడి పోరాడాల్సి వచ్చేదని, సీఎంగా వైఎస్ జగన్మోహన్రెడ్డి బాధ్యతలు చేపట్టాక ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయిందని మేధావులు, ప్రజా సంఘాల నేతలు అభిప్రాయపడ్డారు. ‘పేదల ఇళ్లు – రాజకీయ సవాళ్లు’ అంశంపై మేధావులు, ప్రజా సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో గురువారం గుంటూరులోని ఎన్జీవో హాల్లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజా పార్టీ వ్యవస్థాపకుడు జి.శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, లబ్ధిదారులు పాల్గొన్నారు. పేదల ఇళ్లపై రాజకీయం చేస్తున్న పలు పార్టీల వైఖరిని ఎండగట్టారు. విపక్షాల రాద్ధాంతం తగదు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన హామీకి కట్టుబడి అర్హులందరికీ ఇళ్లు కట్టించి ఇస్తుండటం గొప్ప విషయం. విపక్షాలు విజ్ఞత కోల్పోయి విమర్శలు చేయడం తగదు. – ఆచార్య డీఏఆర్ సుబ్రహ్మణ్యం, మహాత్మా గాంధీ కళాశాల వ్యవస్థాపకుడు బాబు, పవన్ రాజకీయాలకు తగరు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేడ్కర్ ఆలోచనా విధానాన్ని సీఎం వైఎస్ జగన్ ఆచరణలో అమలు చేసి చూపిస్తున్నారు. నా దృష్టిలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇద్దరూ రాజకీయ నేతలే కారు. ప్రజల బాధలు పట్టనోళ్లు రాజకీయాలకు తగరు. – ఆచార్య గురవయ్య, ఏసీ న్యాయ కళాశాల ప్రిన్సిపాల్ ఇది స్వర్ణయుగం గుప్తుల స్వర్ణ యుగం గురించి మనం పుస్తకాలలో చదువుకున్నాం. ఇప్పుడు సీఎం వైఎస్ జగన్ పాలనలో దానిని ప్రత్యక్షంగా చూస్తున్నాం. అందరికీ ఇళ్లు ఇవ్వడం అనేది అతిపెద్ద యజ్ఞం. – చక్రపాణి, విశ్రాంత ఎస్పీ పేదల ఇళ్లు – పవర్‌స్టార్ కన్నీళ్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇళ్లను మహిళల పేరిట రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వడం మహిళా సాధికారతకు నిదర్శనం. పేదల ఇళ్లు–పవర్ స్టార్ కన్నీళ్లు అనే నినాదంతో మహిళలంతా ఉద్యమిస్తే కానీ వాళ్లకు బుద్ధి రాదు. – మంజుల, సీనియర్ న్యాయవాది, సామాజిక కార్యకర్త సీఎం నిజమైన ప్రజా పాలకుడు ఏకంగా 31 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇవ్వడమే కాకుండా ఇళ్లు కట్టించి ఇచ్చే బృహత్తర కార్యక్రమానికి సీఎం వైఎస్ జగన్ శ్రీకారం చుట్టడం గొప్ప విషయం. జగనే నిజమైన ప్రజా పరిపాలకుడు. – గోళ్లమూడి రాజసుందరబాబు, ఐద్వా వ్యవస్థాపకులు రాజకీయాలకు అతీతంగా హర్షిద్దాం గతంలో ఇళ్ల స్థలాలు కావాలంటే రోజుల తరబడి ఆందోళన చేయాల్సి వచ్చేది. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యాక పేదలందరికీ ఇళ్లు కట్టించి ఇస్తున్నారు. రాజకీయాలకు అతీతంగా ఇది అందరూ హర్షించదగ్గ అంశం. – జి.శ్రీనివాస్, ఆంధ్ర రాష్ట్ర ప్రజా పార్టీ వ్యవస్థాపకుడు గొప్ప విషయం ప్రజలకు ఇళ్ల స్థలాల కోసం ప్రభుత్వం 71,811 ఎకరాల భూమి సేకరించింది. నిరుపేదల ఇళ్ల కోసం మొత్తం 25 వేల ఎకరాల భూమిని కొనుగోలు చేసింది. రూ.11 వేల కోట్లు ఖర్చు చేసింది. ఇది వాస్తవం. – పరిశపోగు శ్రీనివాసరావు, నవ్యాంధ్ర ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు పవన్ ఆందోళన హాస్యాస్పదం జగనన్న ఇళ్లపై పవన్ కళ్యాణ్ ఆందోళన హాస్యాస్పదం. జగనన్న ఇళ్లు – జనసేనాని కన్నీళ్లు అని కార్యక్రమం పేరు మార్చితే బాగుంటుంది. – భగవాన్ దాస్, రాష్ట్ర విద్యార్థి ఉద్యమ నేత గూడు చెదరగొట్టే కుట్ర అంబేడ్కర్ ఆశయాలకు అనుగుణంగా పేదలకు ముఖ్యమంత్రి జగన్ కల్పిస్తున్న గూడు చెదర గొట్టేందుకు రాష్ట్రంలో ఒక పెద్ద కుట్ర జరుగుతోంది. దీన్ని తిప్పికొట్టాల్సిన అవసరం ఉంది. – తిప్పాబత్తుని గోవింద్, ఎస్సీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఇది సరికొత్త చరిత్ర తాడి తన్నేవాడి తల తన్నేవాడే జగన్. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఎన్ని ఎత్తులు వేసినా.. వాటికి పైఎత్తు వేసి చిత్తు చేయగల సమర్థుడు. ఇళ్ల నిర్మాణం ద్వారా సరికొత్త చరిత్ర సృష్టించారు. – వేముల భారతి, అస్మిత మహిళా మండలి అధ్యక్షురాలు పవన్‌కొచ్చిన నొప్పేంటి? సొంత ఇంటి కోసం ఎన్నో ఇక్కట్లు పడ్డాం. సీఎం జగన్ పుణ్యాన ఇప్పుడు సొంతింటిలో దర్జాగా ఉంటున్నాం. మాలాంటోళ్లకు జగనన్న ఇళ్లు ఇస్తే మీకొచ్చిన నొప్పేమిటి? – రత్నకుమారి, ఇంటి లబ్ధిదారురాలు -
ప్రధాని నరేంద్ర మోదీకి తెలంగాణ మేధావులు లేఖ
సాక్షి, హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోదీకి తెలంగాణ మేధావులు లేఖ రాశారు. 8 డిమాండ్లలతో తమ సంతకాలతో 64 మంది ప్రొఫెసర్లు, విద్యావేత్తలు.. మోదీకి లేఖ రాశారు. ‘‘విభజన చట్టంలోని హామీలు అమలు చేయాలి.ఐటిఐఆర్‌ను పునరుద్ధరించాలి. రాష్ట్రానికి సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్ కేటాయించాలి. మెడికల్ కాలేజీలు, నవోదయ విద్యాసంస్థలు, ఐఐఎం లాంటి ఉన్నత విద్యాసంస్థలను కేటాయించాలి’’ అని లేఖలో పేర్కొన్నారు. ‘‘వివక్ష లేకుండా తెలంగాణ వ్యవసాయ ఉత్పత్తులను కొనుగోలు చేయాలి. రాష్ట్రం పట్ల కక్షపూరిత, వివక్షపూరిత ధోరణి విడనాడాలి. మతతత్వ ధోరణి విడనాడి దేశ ఐక్యతను, బహుళత్వాన్ని కాపాడుకునే పాలన కొనసాగించాలి. దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే నిర్ణయాలను తీసుకోవాలి’’ అని లేఖలో డిమాండ్ చేశారు. చదవండి: గవర్నర్ వర్సెస్ గవర్నమెంట్.. లేఖపై మంత్రి సబిత కీలక వ్యాఖ్యలు -
వికేంద్రీకరణపై తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాలి
బీచ్ రోడ్డు (విశాఖ తూర్పు): పరిపాలన వికేంద్రీకరణపై కొన్ని మీడియా సంస్థలు, కొన్ని పార్టీలు చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాల్సిన బాధ్యత మనందరిపై ఉందని మేధావులు పిలుపునిచ్చారు. రాజధానిగా అమరావతి అసలు పనికి రాదని స్పష్టంగా చెప్పారు. మూడు రాజధానులతోనే రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలూ అభివృద్ధి చెందుతాయని తేల్చి చెప్పారు. శుక్రవారం పరిపాలన వికేంద్రీకరణ పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో ఏయూ హిందీ విభాగంలో మేధావుల రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్రంలోని పలువురు మేధావులు, పలు సంస్థల ప్రతినిధులు, విద్యార్థులు, ఇతరులు పాల్గొన్నారు. పరిపాలన వికేంద్రీకరణ జరగల్సిందేనని చెప్పారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ ప్రొఫెసర్ లజపతిరాయ్ మాట్లాడుతూ.. రాజధాని, కోర్టులు ఎక్కడ ఏర్పాటు చేయాలనే అంశం భారత రాజ్యాంగంలో ఎక్కడా లేదని చెప్పారు. ప్రధాని, ముఖ్యమంత్రి పాలనకు అనుకూలమైన ప్రాంతంలో ఏర్పాటు చేసుకునే అవకాశం ఉందని తెలిపారు. అమరావతి కాకుండా వేరే ప్రాంతంలో రాజధాని పెట్టడానికి రాజ్యాంగం ఒప్పుకోదంటూ కొంతమంది తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. రాజధానులు ఎన్ని పెట్టుకోవాలి, ఎక్కడ పెట్టుకోవాలి అనేది పాలకుడి నిర్ణయమేనని అన్నారు. ఒక ప్రాంతం మీద అభిమానంతో కాకుండా రాష్ట్రాభివృద్ధి, భవిష్యత్ తరాలను దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానులు ఏర్పాటు చేయడం మంచి నిర్ణయమని తెలిపారు. ప్రాంతాలతో సంబంధం లేకుండా అందరూ స్వాగతించాల్సిన అంశమన్నారు. చంద్రబాబు రక్తం మరిగిన పులి పరిపాలన వికేంద్రీకరణ పరిరక్షణ వేదిక అధ్యక్షుడు సత్యనారాయణ మాట్లాడుతూ మనిషి రక్తం రుచి మరిగిన పులి మాదిరిగానే 14 ఏళ్లు సీఎంగా చేసిన చంద్రబాబు ప్రవర్తన కూడా ఉందన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రతి అంశాన్నీ వ్యతిరేకించడమే బాబు ధ్యేయమని అన్నారు. ఏదో ఒక విధంగా రాష్ట్రాన్ని నాశనం చేసి లాభం పొందాలని ఆశిస్తున్నారన్నారు. అమరావతి రాజధాని కాదని, అది ఒక కమ్మ సామాజికవర్గం వ్యాపార సామ్రాజ్యమని అన్నారు. పరిపాలన వికేంద్రీకరణ ద్వారా ఇప్పటివరకు వెనుకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల అభివృద్ధి సాధ్యమవుతుందని చెప్పారు. సీఎం జగన్మోహన్రెడ్డి తీసుకున్న నిర్ణయాలు సరైనవేనని, అందుకు సచివాలయ వ్యవస్థ, జిల్లాల విభజన నిదర్శనమని తెలిపారు. కరోనా సమయంలో సచివాలయ వ్యవస్థ ద్వారా వందలాది మంది ప్రాణాలను కాపాడారని అన్నారు. మారుమూల గ్రామాల ప్రజలు వారి సమస్యలు చెప్పుకొనేందుకు కలెక్టర్ కార్యాలయానికి రావాలంటే రెండు రోజులు పట్టేదని, ఇప్పుడు జిల్లాల విభజనతో వారి చెంతకే కలెక్టరేట్ వచ్చిందన్నారు. అమరావతి రైతులంతా బడా బాబులే: ప్రొఫెసర్ ఎన్ఏడీ పాల్ వికేంద్రీకరణ పరిరక్షణ వేదిక గౌరవాధ్యక్షులు ప్రొఫెసర్ ఎన్ఏడీ పాల్ మాట్లాడుతూ తమిళనాడు నుంచి ఆంధ్రను విభజించినప్పుడు రాజధానికి మొదట విశాఖపట్నమే అనుకున్నా.. కొన్ని రాజకీయ పరిస్థితుల దృష్ట్యా కర్నూలుకు మార్చారన్నారు. ఆ తరువాత హైదరాబా«ద్‌కు మార్చి రాష్ట్ర ప్రజల సంపద అంతా అక్కడ పెట్టుబడులుగా పెట్టారన్నారు. ఇప్పుడు కూడా అదేవిధంగా చేయడం వల్ల ఒక ప్రాంతం మాత్రమే అభివృద్ధి చెందుతుందని, అన్ని ప్రాంతాలూ అభివృద్ధి చెందాలంటే వికేంద్రీకరణ జరిగి తీరాల్సిందేనని చెప్పారు. వికేంద్రీకరణ ద్వారా అన్ని ప్రాంతాలకు విద్య, వైద్య, ఉద్యోగావకాశాలు సమానంగా అందుతాయని తెలిపారు. అమరావతి రైతులు అసలు రైతులే కాదని, అంతా బడాబాబులేనని విమర్శించారు. అసలు సిసలైన రైతులు ఉత్తరాంధ్రలో ఉన్నారన్నారు. వరదలొస్తే అమరావతి కొట్టుకుపోతుంది : ప్రొఫెసర్ ముత్తయ్య ప్రొఫెసర్ ముత్తయ్య మాట్లాడుతూ అమరావతి రాజధానిగా అస్సులు పనికి రాదన్నారు. వరదలు వస్తే అమరావతి కొట్టుకుపోయే పరిస్థితి ఉందన్నారు. లక్షల కోట్లు వృథా తప్ప మరో ప్రయోజనం ఉండదన్నారు. వాయు, జల, రోడ్డు మార్గాలు ఉన్న విశాఖ నగరాన్ని రాజధానిగా చేస్తే రాష్ట్రానికి అనేక పరిశ్రమలు వస్తాయని చెప్పారు. తద్వారా ఆదాయం పెరిగి సంక్షేమ పథకాలను అమలు చేయవచ్చని తెలిపారు. విద్యార్థుల పోరాటాలు విజయవంతం అవుతాయి : ప్రొఫెసర్ పుల్లారావు ప్రొఫెసర్ పుల్లారావు మాట్లాడుతూ అన్ని ప్రాంతీల అభివృద్ధి కోసమే పరిపాలన వికేంద్రీకరణ అని, ప్రాంతీయ అభిమానంతో కాదని చెప్పారు. విద్యార్థులు చేసిన ఏ పోరాటమైనా విజయవంతం అవుతుందన్నారు. పరిపాలన వికేంద్రీకరణ పరిరక్షణ కోసం విద్యార్థులను భాగస్వామ్యం చేయటం అభినందనీయమన్నారు. ఈ సమావేశంలో ప్రొఫెసర్లు సూర్యనారాయణ, శోభ శ్రీ , నల్ల సత్యనారాయణ, ప్రేమానందం, కృష్ణ, రాజామాణిక్యం, బార్ కౌన్సిల్ సభ్యులు అరుణ్ కుమార్, కృష్ణమోహన్ తదితరులు పాల్గొన్నారు. -
వికేంద్రీకరణతోనే సమగ్రాభివృద్ధి
సాక్షి, అమరావతి: అధికారం దూరమైందనే అక్కసుతో టీడీపీ నాయకులు ప్రజలపై కక్ష పెంచుకుని అడుగడుగునా అభివృద్ధి పనులకు ఆటంకాలు సృష్టిస్తున్నారని ఏపీ ఇంటెలెక్చువల్స్ అండ్ సిటిజన్స్ ఫోరం మండిపడింది. విజయవాడలో ఆదివారం నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ‘పాలనా వికేంద్రీకరణ: ప్రచారాలు, వాస్తవాలు’ అనే అంశంపై పలువురు న్యాయవాదులు, వ్యాపారవేత్తలు, విద్యావేత్తలు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. చంద్రబాబు బృందం మూడేళ్లుగా అభివృద్ధిని అడ్డుకుంటోందని ధ్వజ మెత్తారు. చారిత్రక తప్పిదాలను పునరావృతం చేసేందుకు మీడియాను, న్యాయవ్యవస్థను సైతం ఉపయోగించుకుంటోందన్నారు. అమరావతి పేరు తో దోపిడీ చేయడమే కాకుండా ఇతర ప్రాంతాలు ఎదగకుండా నీచ రాజకీయాలు చేయడం క్షమించరానిదన్నారు. ప్రభుత్వం దృష్టిలో శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్చాపురం నుంచి చిత్తూరు జిల్లాలోని చివరి గ్రామం వరకు ఒక్కటేనని, అన్ని ప్రాంతాలు సమగ్రాభివృద్ధి జరగాలన్నారు. చంద్రబాబు బృందం ఆయన వర్గ ప్రయోజనాలకే పెద్దపీట వేస్తూ రెండు జిల్లాలు మాత్రమే అభివృద్ధి చెందాలని చెబుతోందన్నారు. మరో 30ఏళ్లకు కూడా పూర్తికాని అమరావతి కోసం రూ.లక్ష కోట్ల కు పైగా వెచ్చిస్తే మిగతా ప్రాంతాలు ఏం కావాలని ప్రశ్నించారు. రాష్ట్రం విడిపోయాక బాబుకు ప్రజలు అధికారం ఇస్తే దుర్వినియోగం చేశారన్నారు. ప్రజలపై పగబట్టిన బాబు చంద్రబాబు బృందం తప్పిదాలను కప్పిపుచ్చుకునేందుకు అమరావతి రైతులను పావులుగా మార్చేసింది. రైతులను పురిగొల్పి చంద్రబాబు తెరవెనుక ఆనందిస్తున్నారు. అమరావతి ప్రపంచ రాజధాని ఎలా అవుతుంది? భారీ నిర్మాణాలకు ఈ ప్రాంతం అనువుకాదని ఐఐటీ నిపుణులు నివేదిక ఇచ్చినా పట్టించుకోలేదు. నిర్మాణాల భారం లేకుండా రాజధాని కోసం నాగార్జున వర్సిటీ భవనాలు ఇస్తామన్నా తీసుకోకుండా గడ్డి తినేందుకు అమరావతిని ఎంచుకున్నారు. ఇక్కడ ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగింది. ఇలాంటి తప్పులకు విదేశాల్లో అయితే మరణ శిక్ష విధించేవారు. అధికారం ఊడగొట్టి 23 మంది ఎమ్మెల్యేలకు పరిమితం చేసినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేకపోగా ప్రజలపై పగబట్టారు. చేసిన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు కోర్టులను వాడుకుంటున్నారు. అమరావతి భూములు వ్యవసాయయోగ్యమైనవి, ఇక్కడ ఆ తరహా పరిశ్రమలకే అనుకూలం. చంద్రబాబు ఇప్పటికైనా మారాలి, అన్ని ప్రాంతాల అభివృద్ధికి సహకరించాలి. – పి.విజయబాబు, రాష్ట్ర సమాచార హక్కు చట్టం మాజీ కమిషనర్ మిగతా ప్రాంతాలు ఏం కావాలి? చంద్రబాబు స్వార్థ ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రగతిని బలిపెడుతున్నారు. ఆయనకు వంతపాడుతూ కొన్ని పత్రికలు, మీడియా అమరావతి రైతులను తప్పుదారి పట్టిస్తున్నాయి. ప్రాంతీయ అసమానతల వల్లనే తెలంగాణ విడిపోయింది, అదే తప్పు చంద్రబాబు అమరావతి పేరుతో చేశారు. వికేంద్రీకరణ అవసరమని శివరామకృష్ణ కమిటీ చెప్పినా పట్టించుకోకుండా అమరావతి పేరుతో రూ.వేల కోట్లు వెచ్చించి అన్నీ తాత్కాలిక భవనాలే నిర్మించారు. రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచి వెళ్లారు. రూ.లక్షల కోట్లను అమరావతిలోనే వెచ్చిస్తే రాష్ట్రంలో మిగిలిన ప్రాంతాలు ఏమైపోవాలి? మూడు రాజధానులతోనే అన్ని ప్రాంతాల ప్రజలకు న్యాయం జరుగుతుంది. – పిళ్లా రవి, న్యాయవాది కొత్త రాజధాని నిర్మాణం అసాధ్యం ఏ దేశంలోనైనా అన్ని విధాలా అభివృద్ధి చెందిన నగరాన్నే రాజధానిగా ఎంచుకుంటారు. అప్పుడే అభివృద్ధి సాధ్యమవుతుంది. భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడినప్పుడు అన్నిచోట్లా పెద్ద నగరాలను రాజధానిగా ఎంచుకున్నారు. సృష్టికి ప్రతి సృష్టి చేయాలని కలలు కంటూ చంద్రబాబు అమరావతిని ఎంచుకున్నారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుంటే ఇలాంటి తప్పు ఏ నాయకుడూ చేయరు. రాష్ట్రంలోని మూడు పెద్ద నగరాల్లో అధికార వికేంద్రీకరణ చేయాలి. కొత్త రాజధాని నగరం నిర్మించడం మాటలు కాదు. గుజరాత్ రాజధాని గాంధీనగర్ ఇప్పటికీ ప్రగతి సాధించలేకపోయింది. – కొణిజేటి రమేష్, పారిశ్రామికవేత్త రెండు జిల్లాలే ముఖ్యమా? అభివృద్ధి అంటే భవనాలు, పార్కులు కాదు. సామాన్యుడు తలెత్తుకు తిరిగేలా ఉండాలి. అమరావతిలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు చోటు ఇవ్వరట. వారికి స్థానం లేని ప్రాంతం రాజధాని ఎలా అవుతుంది? చంద్రబాబు అధికారాన్ని అడ్డుపెట్టుకుని నిరుపేదలు, సామాన్యుల హక్కులను దోచుకున్నారు. కేవలం రెండు జిల్లాలు అభివృద్ధి చెందితే చాలా? ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రజలు ఏమైపోవాలి? దీనికి చంద్రబాబు సమాధానం చెప్పాలి. – నామాల కోటేశ్వర్రావు, న్యాయవాది వికేంద్రీకరణ తప్పనిసరి అవసరం ఎవరైనా ఒకసారి తప్పు జరిగితే దాన్నుంచి గుణపాఠం నేర్చుకుంటారు. పాలకులైతే మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తారు. చేసిన తప్పును కప్పిపుచ్చుకునేందుకు మళ్లీమళ్లీ తప్పులు చేసేవారిని ఏమనాలి? చంద్రబాబు నాయుడు అదే చేస్తున్నారు. అధికారంలో ఉన్నవారు అన్ని ప్రాంతాల అభివృద్ధిపై దృష్టి పెట్టాలి. ప్రతిపక్ష టీడీపీ అమరావతి మాత్రమే అభివృద్ధి చెందాలని కోరుకుంటోంది. ఉత్తరాంధ్ర, రాయలసీమ రాష్ట్రంలో అంతర్భాగం కాదా? ఆ ప్రాంతాల అభివృద్ధి టీడీపీకి అవసరం లేదా? ప్రభుత్వం తీసుకున్న వికేంద్రీకరణ నిర్ణయాన్ని అడ్డుకుంటూ మరో తప్పు చేస్తున్నారు. – డాక్టర్ చన్నంశెట్టి చక్రపాణి, రిటైర్డ్ ఎస్పీ సమగ్రాభివృద్థికి వెన్నుపోటు పాలకులు విజ్ఞతతో నిర్ణయాలు తీసుకోవాలి. దేశంలో ఏ రాష్ట్రానికీ లేనన్ని ఆటంకాలను చంద్రబాబు సృష్టిస్తున్నారు. కేంద్రీకృత అభివృద్ధితో తెలుగు ప్రజలు ఏం కోల్పోయారో చరిత్ర చూస్తే అర్థమవుతుంది. చారిత్రక తప్పిదాలను చంద్రబాబు పునరావృతం చేశారు. వాస్తవానికి అమరావతి ప్రజలు ఇక్కడ రాజధాని కావాలని అడగలేదు. చంద్రబాబు తన వర్గం వారితో రైతుల భూములు బలవంతంగా తీసుకున్నారు. సైబర్ టవర్స్ నిర్మాణం సమయంలోనూ బ్లూప్రింట్ తయారీకి ముందే తనవారితో భూములు కొనిపించారు. అదే సూత్రాన్ని ఇక్కడా అమలు చేశారు. నాడు కేంద్ర మంత్రిగా ఉన్న వెంకయ్యనాయుడు, ఈనాడు అధినేత రామోజీరావు దీనికి సూత్రధారులు. అమరావతి అంతా అవినీతిమయం. – కృష్ణంరాజు, రాజకీయ విశ్లేషకులు -
సంక్షేమం వద్దనడం రాజ్యాంగ విరుద్ధం
సాక్షి, అమరావతి: ఆది నుంచి భారతదేశం సంక్షేమ రాజ్యమని, ఆధునిక ప్రజాస్వామ్యంలో సైతం అదే భావన అనుసరిస్తున్నామని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. రాజ్యాంగ పీఠికలోనూ సంక్షేమ భావన స్పష్టంగా ఉందని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో లక్షలాది కుటుంబాల్లో జీవన ప్రమాణాలు మెరుగు పడ్డాయని, కోవిడ్ కష్టకాలంలో ఈ పథకాలే ప్రజలను ఆదుకున్నాయని పేర్కొన్నారు. ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాలపై ఇటీవల సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలపై ఏపీ ఇంటలెక్చువల్స్– సిటిజన్స్ ఫోరం (ఎపిక్) ఆధ్వర్యంలో శనివారం విజయవాడలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ‘సంక్షేమ పథకాలు అభివృద్ధి సోపానాలా? నిరోధకాలా?’ అంశంపై జరిగిన ఈ చర్చలో పలువురు మేధావులు తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఇందులో రిటైర్డ్ ప్రొఫెసర్లు, హైకోర్టు న్యాయవాదులు, పాత్రికేయులు, పరిశ్రమ రంగ నిపుణులు పాల్గొన్నారు. 75 ఏళ్ల స్వతంత్ర భారతావని.. భారత రాజ్యాంగం సూచించిన సంక్షేమ రాజ్యంలో సగం కూడా చేరుకోలేదని, అయినా కొందరు రాజకీయ లబ్ధి కోసం సంక్షేమ పథకాలు ఉచితాలని, వీటిని రద్దు చేయాలని కోర్టుకెక్కడం విచారకరమన్నారు. నాయకుల చిత్రపటాలకు వేలకొద్దీ లీటర్ల పాలతో అభిషేకం చేసే దేశంలో.. గుక్కెడు పాలు దొరక్క ప్రాణాలు కోల్పోతున్న చిన్నారులు కూడా ఉన్నారనే విషయం గమనించాలని కోరారు. పాలకులు ప్రజల సంక్షేమం చూడాల్సిందేనని, అది వారి బాధ్యత అని పేర్కొన్నారు. కూడు, గూడు ప్రజల ప్రాథమిక హక్కు పాలకులు ప్రజలకు కూడు, గూడు ఇచ్చి సంక్షేమం చూడాల్సిందే. రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులు కూడా అదే చెబుతున్నాయి. విమానాల్లో తిరిగినంత మాత్రాన అభివృద్ధి చెందామని, అందువల్ల సంక్షేమ పథకాలు వద్దనడం భావ్యం కాదు. టీవీ, ఫ్రిడ్జ్ వంటివి ఉచితాలు. – విజయబాబు, ఎపిక్ అధ్యక్షుడు, సమాచార హక్కు చట్టం మాజీ కమిషనర్ అధికారం కోసం పేదలను బలిచేయొద్దు కేంద్ర ప్రభుత్వం దేశంలో 80 కోట్ల మందికి రేషన్ సరుకులు అందిస్తోంది. అంటే ఆ స్థాయిలో నిరుపేదలు ఇంకా ఉన్నట్టే కదా! అభివృద్ధి చెందిన స్కాండినేవియన్ దేశాల్లో ఇప్పటికీ జాతీయాదాయంలో 70 శాతం విద్య, వైద్యంతో పాటు ప్రజల అభివృద్ధి పథకాలకు ఖర్చు చేస్తున్నారు. – కృష్ణంరాజు, సీనియర్ జర్నలిస్ట్ ఏపీ ప్రగతిలో సంక్షేమ పథకాలు భాగం కోవిడ్ లాంటి గడ్డు కాలంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఉచిత వైద్యం అందించి ఆదుకుంది. ఇలాంటి వాటిని ఉచితంగా ఇవ్వడం అంటూ కోర్టులు తప్పు పట్టడం సబబుకాదు. విద్యా దీవెన, నేతన్న నేస్తం, చేయూత, ఆసరా, పేదలందరికీ ఇళ్లు.. తదితర పథకాలు ఏ లెక్కనా ఉచితాలు కావు. ఏపీ ప్రగతిలో సంక్షేమ పథకాలు భాగం అని గుర్తించాలి. – పిళ్లా రవి, హైకోర్టు న్యాయవాది ప్రజా సంక్షేమంపై కుట్ర! జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే ఆంధ్రప్రదేశ్‌లో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై కోర్టుల ద్వారా కుట్ర జరుగుతోందనిపిస్తోంది. కొన్ని మీడియా వర్గాలు సంక్షేమ పథకాలను ఉచిత పథకాలని ప్రచారం చేయడం బాధాకరం. ఆరోగ్యశ్రీ పథకం ఎంతో మందికి లబ్ధి చేకూరుస్తోంది. ఈ పథకాన్ని రద్దు చేయాలని ఎవరైనా అడగ్గలరా? – అశోక్, లోక్‌సత్తా నేత -
‘అంబేడ్కర్ కోనసీమ జిల్లా’గానే కొనసాగించాలి
ఏయూ క్యాంపస్: కోనసీమకు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ పేరు కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆంధ్ర యూనివర్సిటీ ఆచార్యులు, మేధావులు కోరారు. విదేశాల్లో సైతం అంబేడ్కర్ విగ్రహాలు, సెంటర్లు పెడుతుంటే.. మన రాష్ట్రంలో మాత్రం అడ్డుకోవడం దారుణమన్నారు. శనివారం విశాఖ ఆంధ్ర యూనివర్సిటీలో నిర్వహించిన మేధావుల చర్చాగోష్టిలో ప్రొఫెసర్లు, వివిధ సంఘాల నాయకులు పాల్గొన్నారు. మాజీ ప్రిన్సిపాల్ ఆచార్య కె.శ్రీరామమూర్తి మాట్లాడుతూ.. అంబేడ్కర్ భావజాలాన్ని అర్థం చేసుకున్నవారు ఇలా విధ్వంసాలకు పాల్పడరన్నారు. సీఎం జగన్ దావోస్ పర్యటిస్తూ.. రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకువస్తున్న సమయంలో ఇలాంటి హింసాత్మక ఘటనలు జరగడం విచారకరమన్నారు. మహిళా విద్య కోసం అంబేడ్కర్ ఎనలేని కృషి చేశారని చెప్పారు. ఏయూ లా కాలేజీ మాజీ ప్రిన్సిపాల్ డి.సూర్యప్రకాశరావు మాట్లాడుతూ.. కొలంబియా యూనివర్సిటీలో సైతం అంబేడ్కర్ కార్నర్ ఉందన్నారు. అంబేడ్కర్‌ను గౌరవించడమంటే.. మనల్ని మనం గౌరవించుకోవడమేనన్నారు. ఉత్తరాంధ్ర కాపు సంఘం అధ్యక్షుడు పి.రవీంద్రనాథ్ఠాగూర్ మాట్లాడుతూ.. సమాజ శ్రేయస్సును ఆకాంక్షించే అంబేడ్కర్ పేరును కోనసీమ జిల్లాకు పెట్టడం స్వాగతించాల్సిన అంశమన్నారు. సమావేశంలో పాలకమండలి సభ్యులు ఆచార్య జేమ్స్ స్టీఫెన్, ఆచార్యులు డి.వి.ఆర్ మూర్తి, కె.పల్లవి, కె.విశ్వేశ్వరరావు, చల్లా రామకృష్ణ, ఎన్.విజయమోహన్, డాక్టర్ జి.రవికుమార్, రెక్టార్ కె.సమత, ప్రిన్సిపాల్స్ పి.రాజేంద్ర కర్మార్కర్, టి.శోభశ్రీ, డీన్లు ఆచార్య ఎన్.సత్యనారాయణ, టి.షారోన్ రాజు, పాల్ తదితరులు పాల్గొన్నారు. -
హైకోర్టు తీర్పుపై సుప్రీంలో అప్పీల్ చేయాలి
యూనివర్సిటీ క్యాంపస్ (తిరుపతి): రాజధాని నిర్మాణంపై హైకోర్టు ఇటీవల వెలువరించిన తీర్పును యథావిధిగా అమలు చేయడం వల్ల రాయలసీమకు రాజధాని, హైకోర్టు, కీలక కార్యాలయాలు ఏర్పాటు చేయాలన్న న్యాయమైన ఆకాంక్ష తీరకుండా పోతుందని రాయలసీమ మేధావుల ఫోరం సమన్వయకర్త మాకిరెడ్డి పురుషోత్తంరెడ్డి అన్నారు. ఎస్వీయూలో సోమవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏపీ ప్రభుత్వం హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టులో అప్పీల్ చేయాలని డిమాండ్ చేశారు. రాజధానిగా అమరావతి ఎంపిక సమయంలో మాజీ సీఎం చంద్రబాబు ఏకపక్షంగా.. ఒక వర్గానికి మేలు జరిగేలా వ్యవహరించారన్నారు. 1872 కాంట్రాక్టు యాక్టు, విభజన చట్టం ప్రకారం రాజధాని ఎంపిక జరగలేదన్నారు. విభజన చట్టాన్ని పార్లమెంట్ ఆమోదించిందని, రాజ్యాంగ బద్ధంగా ఏర్పడిన శివరామకృష్ణన్ కమిటీ నివేదికను రాజధాని ఎంపిక సమయంలో పరిగణనలోకి తీసుకోలేదన్నారు. కమిటీ నివేదికతో సంబంధం లేకుండా తాను ముందు అనుకున్న నిర్ణయం మేరకు రాజధానిని ఎంపిక చేశారన్నారు. ఇది విభజన చట్టానికి వ్యతిరేకం కాదా? చట్టం ప్రకారం కేంద్రం ఏ సలహా ఇచ్చింది? శివరామకృష్ణన్ కమిటీ నివేదికను ఎందుకు అసెంబ్లీలో ప్రవేశ పెట్టలేదని ప్రశ్నించారు. ఒప్పంద ప్రయోజనాలు సహజ న్యాయసూత్రాలకు లోబడి ఉండాలన్నారు. మహానగర నిర్మాణం పేరుతో రాష్ట్ర రాజధానిని 29 గ్రామాల రైతులతో ఎలా అవగాహన చేసుకుంటారన్నారు. శ్రీకృష్ణ కమిటీ, శివరామకృష్ణన్ కమిటీల నివేదికలను దృష్టిలో పెట్టుకుని రాజధానిలో న్యాయమైన భాగస్వామ్యం రాయలసీమకు ఉండేలా తుది నిర్ణయం తీసుకోవాలని ఏపీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఎస్వీయూ విశ్రాంత ప్రొఫెసర్ జి.జయచంద్రారెడ్డి, ప్రొఫెసర్ కృష్ణమోహన్‌రెడ్డి, మస్తానమ్మ, తిమ్మప్ప తదితరులు పాల్గొన్నారు.