మీడియాతో మాట్లాడుతున్న రాయలసీమ మేధావుల ఫోరం నాయకులు ( ఫైల్ ఫోటో )
తిరుపతి: రాయలసీమ మేధావుల ఫోరం తిరుపతిలో సమావేశమయ్యింది. తుంగభద్ర నదిపై అప్పర్ భద్ర ప్రాజెక్టును వెంటనే నిలిపివేయాలని సమావేశంలో తీర్మానించారు. కర్ణాటక ఎన్నికల నేపథ్యంలో దీన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించారని, అప్పర్ భద్ర ప్రాజెక్టు పూర్తయితే రాయలసీమ ఎడారి అవుతుందని మేధావుల ఫోరం పేర్కొంది.
ఈ ప్రాజెక్టు వల్ల రాయలసీమకు తాగునీటి కష్టాలు తప్పవని చెప్పారు. ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం వేసిన పిటిషన్‌ను స్వాగతిస్తున్నామని రాయలసీమ మేధావుల ఫోరం తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment