సాక్షి, అనకాపల్లి: ఏపీలో కూటమి పాలనలో కొత్త సిత్రాలు వెలుగు చూస్తున్నాయి. చంద్రబాబు ప్రభుత్వం పవర్ బిల్లులు చూపి ప్రజలు అవాక్కవుతున్నారు. తాజాగా జిమ్‌కు కోటి రూపాయలు కరెంట్ బిల్లు(Power Bill) రావడంతో నిర్వాహకుడు ఖంగుతున్నాడు. సదరు బిల్లుపై అధికారాలను ప్రశ్నించగా.. ఈ విషయం బయటకు చెప్పవద్దని అధికారులు ఆదేశించడం గమనార్హం.
వివరాల ప్రకారం.. అనకాపల్లిలోని జిమ్‌కు ఏకంగా కోటి రూపాయలు కరెంట్ బిల్లు రావడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. కరెంట్ బిల్లు చూసి బిల్లు చూసి నిర్వాహకుడు ఒక్కసారిగా ఖంగుతిన్నాడు. ప్రతీ నెలా 18 నుంచి 20వేల బిల్లు వస్తుండేది. ఈనెల కోటి 15వేల రూపాయల కరెంటు బిల్లు రావడంతో ఆశ్చర్యపోయాడు. అనంతరం, బిల్లుపై విద్యుత్ అధికారులకు సమాచారం అందించాడు. అయితే, విద్యుత్ బిల్లుపై మీడియాతో మాట్లాడవద్దని నిర్వాహకుడిని అధికారుల ఆదేశించారు. బిల్లు పెరిగిన విషయాన్ని ఎక్కడా చెప్పవద్దని హెచ్చరించారు. కాగా, అధికారులు తప్పిదం కారణంగానే తనకు ఇంత బిల్లు వచ్చిందని చెప్పడానికి వెళ్లిన వ్యక్తి మరలా అధికారులే బెదిరించడమేంటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
ఇదిలా ఉండగా.. అంతకుముందు అల్లూరు జిల్లా పాత పాడేరులో ఓ పేద గిరిజన కుటుంబానికి కరెంట్ బిల్లు షాక్ కొట్టింది. కిల్లు బాబూరావుకు చెందిన పెంకుటింటికి ఉచిత విద్యుత్ పథకం అమలులో ఉంది. గత నెలలో మైనస్ రూ.1,496 విద్యుత్ బిల్లు వచ్చింది. ఈ నెలకు కూడా మైనస్ విద్యుత్ బిల్లు రావాల్సి ఉండగా, ప్లస్‌లో రూ.69,314.91 బిల్లు జారీ అయింది. పెంకుటింట్లో కేవలం రెండు బల్బులు మాత్రమే ఉన్నాయి. అప్పుడప్పుడు టేబుల్ ఫ్యాన్ వినియోగిస్తారు. ప్రతి నెల 100 యూనిట్ల లోపే మైనస్ బిల్లు వస్తోంది.
కిల్లు బాబూరావు మరణించినా, ఆయన పేరుతోనే విద్యుత్ మీటరు ఉంది. ఆయన కుమారుడు భరత్ ఈ ఇంట్లో నివాసం ఉంటున్నాడు. గత నెల 113 యూనిట్ల విద్యుత్ వినియోగం చూపి రూ.1,496 మైనస్ బిల్లు ఇచ్చారని, ఈ నెలలో 349 యూనిట్ల రీడింగ్ చూపి, రూ.69,314 బిల్లు ఇవ్వడం అన్యాయమని భరత్ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. నెల వ్యవధిలోనే పెంకుటింటికి రూ.వేలల్లో విద్యుత్ బిల్లు రావడం గ్రామంలో చర్చనీయాంశమైంది. ఈ విషయాన్ని విద్యుత్ పంపిణీ సంస్థ పాడేరు ఏడీ మురళీ దృష్టికి ‘సాక్షి’ తీసుకు వెళ్లింది. గతంలో వినియోగదారుడి విద్యుత్ వినియోగాన్ని, మీటరును పరిశీలిస్తామని తెలిపారు. ఇక, ఇలాంటి ఘటనలు చాలా చోట్ల వెలుగు రావడం విశేషం. అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఇలా ఎక్కువ బిల్లు వస్తుందని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment