Gym Center
-
వ్యాపారవేత్తగా మారిన స్టార్ హీరోయిన్.. రకుల్‌కు పోటీగా
Kriti Sanon Turns Entrepreneur Launches The Tribe Fitness Startup: హీరోయిన్లు కేవలం గ్లామర్ రోల్స్‌కే పరిమితం కాకుండా కథానాయిక ప్రాధాన్యత ఉన్న పాత్రలు చేస్తుంటారు. అలాగే తమలోని సింగర్ వంటి వివిధ కళలను బయటపెడుతుంటారు. హీరోయిన్లు ఓ పక్క నటిస్తూనే మరోపక్క నిర్మాతలుగా కూడా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. అంతేకాకుండా మంచి ఫామ్‌లో ఉన్నప్పుడే పలు వ్యాపార రంగాల్లో కూడా సక్సేస్ అయ్యేందుకు కృషి చేస్తున్నారు మన కథానాయికలు. ఇలా బిజినెస్‌లోనే కాకుండా ఫిట్నెస్ రంగంలోకి దిగుతున్నారు ఫిట్నెస్ బ్యూటీలు. ఇప్పటికే కూల్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్‌కు ఎఫ్ 45 పేరుతో హైదరబాద్‌తోపాటు వైజాగ్‌లో జిమ్‌లు ఉన్న విషయం తెలిసిందే. . ప్రస్తుతం ఈ ఫిట్నెస్ బ్యూటీకి మరో బ్యూటీ పోటీ రానుంది. ఆ భామ ఇంకెవరో కాదు.. 'వన్ నేనొక్కడినే' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన కృతి సనన్. ది ట్రైబ్ అనే జిమ్ సెంటర్‌ను ప్రారంభిస్తున్నట్లు సోషల్ మీడియా ద్వారా తెలిపింది ఈ ఫిట్నెస్గుమ్మ. '8 ఏళ్ల క్రితం నటిగా హిందీ చిత్ర పరిశ్రమలో నా ప్రయాణాన్ని ప్రారంభించాను. సరిగ్గా అదే రోజున ముగ్గురు సూపర్ టాలెంటెడ్ కో-ఫౌండర్లు అనుష్క నందానీ, కరణ్ సాహ్నీ, రాబిన్ బెహ్ల్‌లతో కలిసి ఒక వ్యాపారవేత్తగా ది ట్రైబ్‌ను లాంచ్ చేస్తున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది.' అని కృతి సనన్ ట్వీట్ చేసింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అయింది. దీనికి సంబంధించిన యాప్‌ను వచ్చే సంవత్సరం ప్రవేశపెట్టనుంది. తను నటించిన 'మిమి' సినిమాలో పాత్ర తన ఫిట్‌నెస్‌కు స్ఫూర్తినిచ్చిందని కృతి పేర్కొంది. చదవండి: 👇 పగిలిన గాజు ముక్కలతో డ్రెస్.. 20 కేజీల బరువు.. కొండపై నుంచి బైక్‌తో సహా దూకిన హీరో.. 8yrs ago, I started my journey as an actor in the hindi film industry! Today, exactly on the same day, I am thrilled to announce my journey as an Entrepreneur with my 3 super talented Co-founders Anushka Nandani, Karan Sawhney and Robin Behl as we launch “The Tribe”. #KeepMoving pic.twitter.com/EovBRSUlt2 — Kriti Sanon (@kritisanon) May 23, 2022 -
జిమ్ చేస్తూనే కుప్పకూలిన మహిళ.. సీసీటీవీలో దృశ్యాలు.. క్షణాల వ్యవధిలో
బెంగళూరు: జిమ్‌లో వ్యాయామం చేస్తుండగా మహిళ కింద పడి మృతి చెందిన ఘటన బెంగళూరులో జరిగింది. శనివారం ఉదయం మల్లేశ్వపాళ్యంలోని ఒక జిమ్‌లో వినయకుమారి (44) అనే మహిళ వ్యాయామం చేస్తూ కింద పడిపోయింది. దీంతో వెంటనే పక్కనున్నవారు ఆమెను రక్షించాలని చూసిన క్షణాల వ్యవధిలోనే ప్రాణాలు కోల్పోయింది. దీంతో అక్కడున్నవారు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. ఈ దృశ్యాలన్నీ అక్కడి సీసీ కెమెరాల్లో నమోదయ్యాయి. వినయకుమారి ఐడీసీ సంస్థలో ఉద్యోగం చేస్తోంది. జిమ్ సిబ్బంది ఆమెను ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. -
ట్రెడ్మిల్ మీద వాకింగ్! 12 గంటల్లో ఏకంగా..
లక్నో: సాధారణంగా చాలా మంది యువత.. సరైన శరీరాకృతి, ఆరోగ్యం కోసం జిమ్‌లలో వ్యాయామాలు చేస్తుంటారు. దీని కోసం ప్రత్యేకంగా ట్రేడ్ మిల్, డంబెల్స్, సైక్లింగ్స్ మొదలైన ఎక్విప్మెంట్ ఉంటాయి. ఈ క్రమంలో వాటితో గంటల కొలది వ్యాయమం చేసి శరీరంలోకి కొవ్వును తగ్గించుకుంటారు. వీటిని జిమ్‌లో ట్రైనర్ సమక్షంలో చేస్తుంటారు. అయితే, యూపీకి చెందిన జైనూల్ అబేదిన్ అనే వ్యక్తికి జిమ్ చేయడం అంటే ఇష్టం. ఇతడిని గ్రామస్థులు ‘మొరాదాబాద్ ఎక్స్‌ప్రెస్’ అని పిలుస్తారు. ఇతనికి ట్రెడ్‌మిల్‌పై నడవటం అంటే ఎంతో ఇష్టం. తాజాగా, ఇతను ట్రెడ్‌మిల్‌పై 12 గంటలపాటు ఏకధాటిగా 66 కిలోమీటర్లు నడిచి రికార్డు సృష్టించాడు. దీంతో ప్రస్తుతం ఇతను వార్తల్లో నిలిచాడు. ఇతడి ట్రెడ్మిల్ విన్యాసాన్ని చూడటానికి జిల్లాల నుంచి అధికారులు పెద్దఎత్తున యూపీకి తరలివచ్చారు. ఈ క్రమంలో జైనూల్‌ను ఉత్సాహపరిచారు. గెలవగానే అతనిపై సభ్యులు పూలవర్శం కురిపించారు. ఇప్పటికే జైనూల్.. న్యూఢిల్లీలోని ఇండియాగేట్ నుంచి ఆగ్రా, జైపూర్‌కు ప్రయాణించి మరల ఢిల్లీ చేరుకున్నాడు. ఈ పోటీని ఇతను 7 రోజులు 22 గంటలలో పూర్తిచేశాడు. ఈ అరుదైన ఘనతతో.. ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించాడు. అదే విధంగా కరోనా లాక్డౌన్ కాలంలో పోలీసుల గౌరవార్థం 50 కిలోమీటర్లు నడక సాగించిన విషయం తెలిసిందే. -
‘నాగిని’పాటకు ప్రగతి ఊరమాస్ స్టెప్పులు.. వీడియో వైరల్
టాలీవుడ్లో ‘గ్లామరస్ మదర్’అనగానే అందరికి టకీమని గుర్తొచ్చే ఏకైక పేరు ప్రగతి. తనదైన సహజ నటనతో అమ్మ, తల్లి, భార్య పాత్రలకు వన్నెతెచ్చింది. ఇటీవల సినిమాల్లో ఎక్కువ కనిపించకున్నా.. సోషల్ మీడియా ద్వారా మాత్రం ఎప్పుడూ అభిమానులతో టచ్‌లోనే ఉంటుంది. ఫిట్‌నెస్‌కు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే ప్రగతి.. వాటికి సంబంధించిన ఫోటోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటుంది. ఆమె షేర్ చేసే వర్కౌట్ వీడియోలు వైరల్ అయిన సందర్భాలు చాలానే ఉన్నాయి. (చదవండి: ‘రారా సామి’అంటూ రష్మిక స్టెప్పులు.. వీడియో వైరల్) తాజాగా ఆమె నాగిని సాంగ్‌కి స్టెప్పులేసింది. జిమ్ సెంటర్‌కి వెళ్లిన ప్రగతి.. అక్కడ ‘నాగిని’సాంగ్‌కి ఊరమాస్ స్టెప్పులేసి అందరిని అలరించింది. దానికి సంబంధించిన వీడియోని తన ఇన్‌స్టా ఖాతాలో షేర్ చేస్తూ.. ‘నేను చేసే ప్రతి పనిలో ఆనందాన్ని సృష్టిస్తాను’అని క్యాప్షన్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. View this post on Instagram A post shared by Pragathi Mahavadi (@pragstrong) -
జిమ్‌లో అసభ్య ప్రవర్తన... టిక్టాక్లోషేర్ చేయడంతో పరార్!!
కొన్ని సంఘటనలు చూస్తే ఎన్ని చట్టాలు వచ్చినప్పటికీ ఇంకా మహిళలు పనులను స్వతంత్రంగా, స్వేచ్ఛగా ఇబ్బందిపడకుండా చేసుకునే అవకాశం మాత్రం ఎప్పటికీ కుదరదేమో అనిపిస్తుంది. అచ్చం అలాంటి సంఘటనే ఇక్కడ ఒకటి జరిగింది. (చదవండి: యూకే లివర్‌పూల్ నగంలో కారు బ్లాస్ట్... ఒకరు మృతి) సాధారణంగా జిమ్ సెంటర్లలో అందరూ ఒకేసారి తమ వర్క్ అవుట్లను చేసుకుంటుంటారు. అదేవిధంగా ఇక్కడొక మహిళ అలానే తాను తన వర్కవుట్లు కొనసాగిస్తుండగా ఒక సీనియర్ సిటిజన్ తనను తదేకంగా చూస్తుంటాడు. దీంతో ఆమె అసౌకర్యంగా ఫీలై ఆమె తన భర్తను తన పక్కన నిలబడమని చెబుతుంది. అయితే ఆమె భర్త తన పక్కన నిలబడి ఉన్నప్పటికీ సదరు వ్యక్తి మళ్లీ అలానే చూస్తుంటాడు. దీంతో ఆమె తన ఫోన్ కెమెరా ఆన్ చేసి ఆ ఘటనను చిత్రికరించి టిక్‌టాక్‌లో పోస్ట్ చేస్తుంది. పైగా ఆ విషయాన్ని అతనికి చెప్పడంతో సదరు వ్యక్తి అక్కడ్నుంచి నెమ్మదిగా జారుకున్నాడు. అంతేకాదు ఆ విషయాన్ని గమనిస్తున్న జిమ్ ట్రైనర్ ఆమె చేసిన పనికి ప్రశంసిస్తాడు. అయితే ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దీంతో నెటిజన్లు ఆమె చేసిన పనికి ప్రశంసలు వర్షం కురిపించడమే కాక మంచి పనిచేశారంటూ రకరకాలుగా ట్వీట్ చేశారు. (చదవండి: మెక్‌డొనాల్డ్స్ ‘టాయిలెట్’ వివాదం) -
పునీత్ మరణం: కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం
బెంగళూరు(కర్ణాటక): కన్నడ నటుడు పునీత్ రాజ్‌కుమార్ మరణం అనంతరం ఆ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ సందర్భంగా కర్ణాటక ఆరోగ్య మంత్రి కె సుధాకర్ మాట్లాడుతూ.. ఇక నుంచి జిమ్‌లు, ఫిట్నెస్ సెంటర్లలలో ట్రైనర్లకు ప్రథమ చికిత్స, ప్రత్యేక శిక్షణపై మార్గదర్శకాలను జారీచేస్తామని తెలిపారు. జిమ్‌లో వర్కవుట్స్ సమయంలో.. తీసుకోవాల్సిన జాగ్రత్తలను సూచిస్తామని తెలిపారు. అదే విధంగా, ట్రైనర్ పర్యవేక్షణ లేకుండా అధిక బరువులు ఎత్తకుండా జిమ్ నిర్వాహకులు చూడాలన్నారు. రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి కె సుధాకర్, పలువురు కార్డియాలజిస్ట్‌లతో సమస్యను చర్చించి మరిన్ని మార్గదర్శకాలను జారీచేస్తామని పేర్కొన్నారు. కాగా, గత ఆదివారం 46 ఏళ్ల వయసులో జిమ్‌లో వర్కవుట్స్ చేస్తూ గుండెపోటుతో.. కన్నడ నటుడు పునీత్‌రాజ్ కుమార్ మృతి చెందిన విషయం తెలిసిందే. -
Puneeth Rajkumar: ఆ ఇష్టమే రాజ్‌కుమార్‌కు కంటకంగా మారిందా?
Puneeth Rajkumar Death Reason: ఫిట్‌నెస్‌కు మారుపేరు పునీత్ రాజ్‌కుమార్. ఆయన చేసే కఠినమైన వ్యాయామ విన్యాసాలు సంభ్రమాశ్చర్యాలకు గురి చేసేవి. ఫిట్ నెస్ కోసం ప్రాణం పెట్టి మరీ వర్కవుట్స్ చేస్తారు. వర్కౌట్ చేయపోతే ఆ రోజు వృథా అయినట్టే అనేది పునీత్ అభిప్రాయం. అంత ఫిట్‌గా ఉండే రాజ్‌కుమార్ గుండెపోటుతో మరణించడం విస్మయానికి గురిచేయడంతో పాటు పలు అనుమానాలకు దారితీసింది. ఫిట్నెస్ కోసం కఠిన వ్యాయామం చేయడమే పునీత్‌కు కంటకంగా మారిందా? వర్కౌట్లు, వ్యాయామంపై రాజ్‌కుమార్‌కు ఉన్న ఇష్టమే ఆయన ప్రాణం తీసిందా? అనేది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. వ్యాయామం కోసం రాజ్‌కుమార్‌కు స్పెషల్‌గా ఒక జిమ్ సెంటర్ ఉంది. అందులో ఆధునిక వ్యాయామ సామగ్రిని అమర్చారు. నిత్యం ఒకటి రెండు గంటల పాటు అక్కడే గడిపేవారు. కరోనా సమయంలోనూ ఆయన వ్యాయామం చేయడం ఆపలేదు. ఆయన చేసి కఠినమైన వ్యాయామ విన్యాసాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో అనేకసార్లు వైరల్ అయ్యాయి. ఫిట్‌నెస్‌పై ఆయనకు ఉన్న ఇష్టమే ప్రాణాలు తీసిందని, కఠిన వ్యాయామం చేయడమే పునీత్‌కు కంటకంగా మారిందని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. అయితే గుండెలోని రక్తనాళాలు చిట్లిపోవడం వల్లే పునీత్ మృతి చెందారని వైద్యులు వెల్లడించారు. జిమ్ సమయంలో కార్డియాక్ అరెస్ట్ జరిగి ప్రాణాలు కోల్పోయినట్లు వివరించారు. -
Puneeth Rajkumar: రాజ్‌కుమార్ ఫ్యామిలీకి ‘జిమ్’ గండం!
Puneeth Rajkumar Workout Video: పునీత్ రాజ్‌కుమార్ ఫిజికల్‌గా చాలా ఫిట్‌గా ఉంటారు. ఇలాంటి వయసులో, ఇంత ఫిట్‌గా ఉన్నవారికి గుండెపోటు రావడం కొంత విస్మయం, మరికొంత ఆందోళన కలిగించే అంశమే. రాజ్‌కుమార్ చివరిరోజుల వరకు యోగా, వ్యాయామం చేస్తూ వచ్చారు. అలాగే పునీత్ కూడా దేహ దారుఢ్యం, ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యత ఇచ్చారు. మంచి ఫిజిక్‌ను సాధించాలనే ఆసక్తే ఆయన్ను పూర్తి స్థాయి ఫిట్నెస్ లవర్‌గా మార్చింది. జిమ్ వర్కవుట్‌తో పాటు క్రాస్ ఫిట్, మార్షల్ ఆర్ట్స్, యోగా వంటివి కూడా ప్రతిరోజూ తప్పనిసరిగా సాధన చేసేవారు. తరచుగా తన వర్కవుట్ వీడియోలను అభిమానులతో పంచుకునేవారు. (చదవండి: పునీత్ కుటుంబాన్ని వెంటాడుతున్న ‘గుండె పోటు’!) పునీత్ కఠినమైన వ్యాయామ విన్యాసాలు సంభ్రమాశ్చర్యాలకు గురి చేసేవి. లాక్డౌన్ టైమ్‌లో వీలైనన్ని వ్యాయామాలు చేసినా 2 నుంచి 3 కిలోలు బరువు పెరిగానని, లాక్డౌన్ ఎత్తేయగానే తిరిగి షేప్ సాధించడం కోసం ఎదురు చూస్తున్నానని పునీత్ ఆ మధ్య అన్నారు. ఆయన ఫిట్నెస్ ప్రియత్వానికి ఓ ఉదాహరణ ఇది. వర్కవుట్ చేయని రోజు అంటే తన దృష్టిలో అది వృథా అయిన రోజు అనే పునీత్.. ఏ ఫిట్నెస్ మీద ఇష్టంతో గంటల పాటు జిమ్‌లో గడిపారో అదే జిమ్‌లో గుండెపోటుకు గురి కావడం విషాదం. ఈ నేపథ్యంలో రాజ్‌కుమార్ కుటుంబానికి వ్యాయామశాల కలసి రాలేదనే చర్చ సాగుతోంది. గతంలో పునీత్ రెండో సోదరుడు రాఘవేంద్ర జిమ్ చేస్తుండగా పక్షవాతం వచ్చింది. అలాగే గతంలో శివ రాజ్‌కుమార్ కూడా జిమ్‌లో కసరత్తులు చేస్తుండగా అస్వస్థతకు గురయ్యారు. View this post on Instagram A post shared by Puneeth Rajkumar (@puneethrajkumar.official) View this post on Instagram A post shared by Puneeth Rajkumar (@puneethrajkumar.official) -
కండలు పెంచిన సీనియర్ నటుడు, వైరల్
సాక్షి , చెన్నై: అద్భుతమైన ఫిట్నెస్తో సీనియర్ హీరోలు కుర్ర హీరోల గుండెల్లో గుబులు రేపుతున్నారు. ఇప్పటికే బాలీవుడ్ హీరో అనిల్ కపూర్ 63 సంవత్సరాల వయసులో కండలు పెంచి అటు యంగ్ హీరోలను, ఇటు నెటిజన్లను ఆశర్యపరిస్తే, తాజాగా తమిళ సూపర్ హీరో శరత్‌కుమార్ (66) తన బాడీ బిల్డింగ్‌తో అదర గొట్టేస్తున్నాడు.. 66 ఏళ్ల వయసులో కూడా తన కండలతో నెట్టింట హల్చల్ చేస్తున్నాడు. సహజంగానే బాడీ బిల్డర్ అయిన శరత్ కుమార్ లేటెస్ట్ జిమ్ ఫోటో వైరల్ అవుతోంది. (ప్రముఖ నటి ఇంట్లో అపరిచితుడి గలాటా) కాగా పృథ్వీరాజ్, బిజు మీనన్ నటించిన మలయాళ సూపర్ హిట్ మూవీ 'అయ్యపనమ్ కోషియం' తమిళ రీమేక్‌లో శరత్ కుమార్ నటించనున్నారని తెలుస్తోంది. ఈ మల్టీస్టారర్ మూవీలో పృథ్వీరాజ్ పాత్రను శశికుమార్, శరత్ కుమార్ బిజు మీనన్ పాత్రను పోషించనున్నారని అంచనా. మరోవైపు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఈ సినిమాని తెలుగులో రీమేక్ చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. -
జిమ్స్ రీ ఓపెన్.. కేంద్రం మార్గదర్శకాలు
న్యూఢిల్లీ: కరోనా కట్టడి కోసం దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించిన సంగతి తెలిసిందే. దాంతో యోగా సెంటర్లు, జిమ్‌లు మూతపడ్డాయి. అయితే అన్‌లాక్ 3.0లో భాగంగా వీటిని తిరిగి ప్రారంభించేకుందుకు కేంద్రం అనుమతిచ్చింది. ఈ నెల 5 నుంచి వీటిని తిరిగి ప్రారంభించవచ్చని తెలిపింది. ఈ మేరకు పాటించాల్సిన జాగ్రత్తల గురించి వివరించింది. జిమ్ ట్రైనర్లు, సిబ్బందితో సహా ప్రతి ఒక్కరు సామాజిక దూరం పాటించాలని తెలిపింది. మాస్క్ తప్పక ధరించాలని.. అంతేకాక జిమ్‌కు వచ్చే ప్రతి ఒక్కరి మొబైల్లో ఆరోగ్య సేతు యాప్ తప్పనిసరిగా ఉండాలని సూచించింది. అయితే కంటైన్మెంట్ జోన్లలోని యోగా ఇనిస్టిట్యూట్లు, జిమ్‌లు తెరిచేందుకు కేంద్రం ఇంకా అనుమతి ఇవ్వలేదు. అంతేకాక స్పాలు, స్మిమ్మింగ్ ఫూల్లు తెరవడానికి కూడా అనుమతిలేదు. జిమ్‌లు తెరుస్తున్న నేపథ్యంలో పాటించాల్సిన జాగ్రత్తలకు సంబంధించి కేంద్రం మార్గదర్శకాలు విడుదల చేసింది. అవి... (లాక్డౌన్ ఎఫెక్ట్.. శరీరం సహకరించడం లేదు) 1. 65 ఏళ్లు పైబడిన వారు, అనారోగ్యంతో ఉన్నవారు, గర్భిణీ స్త్రీలు, పదేళ్లలోపు వయస్సు ఉన్న పిల్లలు మూసివేసిన ప్రదేశాలలోని జిమ్‌లను ఉపయోగించవద్దని కోరింది. 2. జిమ్ సెంటర్లలో అన్ని వేళలా ఫేస్ కవర్, మాస్క్ తప్పనిసరి. కానీ వ్యాయామం చేసేటప్పుడు, మాస్క్ వాడితే శ్వాస తీసుకోవడం కష్టం అవుతుంది కనుక విజర్ మాత్రమే ఉపయోగించవచ్చు. 3. ప్రతి ఒక్కరి మొబైల్లో ఆరోగ్య సేతు యాప్ తప్పనిసరి. 4. యోగా సెంటర్, జిమ్‌లో వ్యక్తుల మధ్య నాలుగు మీటర్ల దూరం ఉండాలి. పరికరాలను ఆరు అడుగుల దూరంలో ఉంచాలి. సాధ్యమైతే వాటిని ఆరుబయట ఉంచాలి. 5. గోడలపై సరైన గుర్తులతో భవనంలోకి ప్రవేశించడానికి, బయటకు వెళ్లడానికి నిర్దిష్ట మార్గాలను ఏర్పాటు చేయాలి. 6. ఎయిర్ కండిషనింగ్, వెంటిలేషన్ కోసం, ఉష్ణోగ్రతను 24-30 డిగ్రీల సెల్సియస్ పరిధిలో ఉంచాలి. వీలైనంతవరకు తాజా గాలిని తీసుకోవాలి. ఆరోగ్య మంత్రిత్వ శాఖ మార్గదర్శకాల ప్రకారం జిమ్, యోగా సెంటర్ గేట్లలో శానిటైజర్ డిస్పెన్సర్లు, థర్మల్ స్క్రీనింగ్ పరికరాలు తప్పనిసరిల. సిబ్బందితో సహా కరోనా లక్షణాలు లేని వ్యక్తులు మాత్రమే జిమ్‌లోనికి అనుమతించబడతారు. -
కరోనా: మహారాష్ట్ర కీలక నిర్ణయం
ముంబై : కరోనా కారణంగా గత మూడు నెలల నుంచి మూసి ఉన్న సెలూన్లలకు అనుమతిస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జూన్ 28 నుంచి రాష్ట్రవ్యాప్తంగా క్షౌరశాలలు తెరిచేందుకు ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. గురువారం జరిగిన సమీక్షలో కేబినెట్ దీనికి ఆమోదముద్ర వేసిందని మంత్రి విజయ్ తివార్ తెలిపారు. లాక్డౌన్ కారణంగా సెలూన్ ఆపరేటర్లు ఆర్థికంగా చితికిపోయారని, ఇప్పటికే 12 మంది బార్బర్లు ఆత్మహత్య చేసుకున్నారని చెప్పారు. ఈ నేపథ్యంలో పరిస్థితి ఇంకా దిగజారకముందే వాళ్లకు ఉపశమనం కలిగించేలా ప్రభుత్వం తాజా చర్యలు చేపట్టిందని విజయ్ పేర్కొన్నారు. (రెండు వారాల పాటు సంపూర్ణ లాక్డౌన్) గత వారం రోజుల నుంచి దీనికి సంబంధించిన చర్చలు జరుగుతున్నాయని, త్వరలోనే జిమ్ సెంటర్లకు కూడా అనుమతిస్తామని దీనికి సంబంధించి మార్గదర్శకాలను రూపొందిస్తామని తెలిపారు. అయితే తమ వ్యాపారాలను పునరుద్దరించడానికి అనుమతించాలని డిమాండ్ చేస్తూ మహారాష్ట్ర నభీక్ మహామండల్, రాష్ట్రస్థాయి బార్బర్ సంఘాలు గత కొద్దిరోజులుగా ఆందోళనలు చేస్తున్నాయి. లాక్డౌన్ కారణంగా ఆదాయం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వెంటనే దుకాణాలు తెరిచేందుకు అనుమతించాలని, లేని పక్షంలో ఆర్థిక ప్యాకేజీ అయినా ప్రకటించాలని డిమాండ్ చేశాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తాజా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. సెలూనల్లోమాస్క్, శానిటైజర్ల వాడకం లాంటి వ్యక్తిగత శుభ్రతా ప్రమాణాలు పాటించాలని మంత్రి విజయ్ ఆదేశించారు. ఒక కస్టమర్ కోసం ఉపయోగించిన తువాలు లేదా వస్త్రాన్ని ఇతరులకు ఉపయోగించరాదన్నారు. భారత్‌లో నమోదవుతున్న కరోనా కేసుల్లో అత్యధికంగా మహారాష్ట్రలోనే నమోదవుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 142,900కి చేరగా 6,739 మంది కోవిడ్ కారణంగా ప్రాణాలు కోల్పోయారు. (భూటాన్-అస్సాం నీటి వివాదం అవాస్తం: భారత్) -
జిమ్, ఫిట్నెస్ సెంటర్లకు అనుమతులు!
బెంగళూరు: లాక్డౌన్ మూడో దశ గడువు మే 17 నాటితో ముగియనున్న నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఇన్నాళ్లు మూతపడిన జిమ్‌లు, ఫిట్నెస్ సెంటర్లు, గోల్ఫ్ కోర్సులు తెరిచేందుకు అనుమతించేందుకు సిద్ధమైంది. ఈ మేరకు రాష్ట్ర పర్యాటక, క్రీడా మంత్రిత్వ శాఖా మంత్రి సీటీ రవి బుధవారం మాట్లాడుతూ... ‘‘ఈరోజు ముఖ్యమంత్రితో భేటీ అయ్యాను. లాక్‌డౌన్‌తో మూతపడిన జిమ్, ఫిట్నెస్ సెంటర్లు, గోల్ఫ్‌కోర్సులను తిరిగి ప్రారంభించే అంశం గురించి చర్చించాను. అదే విధంగా పర్యాటక రంగం పూర్వస్థితికి చేరుకోవడానికి.. భౌతిక దూరం పాటిస్తూ పర్యాటకులను అనుమతించాలని విన్నవించాను. హోటళ్లు తెరిచే అంశాన్ని పరిశీలించాల్సిందిగా కోరాను’’ అని తెలిపారు.(జిల్లా సరిహద్దులు తెరిచే అవకాశం లేదు..) ఈ క్రమంలో మే 17 తర్వాత నిబంధనలు పాటిస్తూ జిమ్‌లు తెరిచేందుకు ముఖ్యమంత్రి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారని రవి పేర్కొన్నారు. ఇక గోల్ఫ్‌కోర్సుల విషయంలో గోల్పర్స్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినట్లయితే ఆ అంశాన్ని పరిశీలిద్దామని తనతో చెప్పారన్నారు. లాక్డౌన్ కారణంగా పర్యాటక రంగం భారీగా నష్టపోయిన దృష్ట్యా.. ‘‘లవ్ యువర్ నేటివ్’’ కాన్సెప్ట్‌తో స్థానిక పర్యాటకులను ఆకట్టుకునేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలిపారు. ఆ తర్వాత దశల వారీగా అంతర్జిల్లా, అంతర్రాష్ట్ర, విదేశీ పర్యాటకులకు అనుమతినిస్తామని పేర్కొన్నారు. కేంద్రం ఇచ్చే ప్యాకేజీ ఆధారంగా వివిధ కార్యక్రమాలు చేపట్టబోతున్నామని రవి తెలిపారు. (లాక్డౌన్ 4.0 : మోదీ కీలక భేటీ) ఈపీఎఫ్: 3 నెలలు పొడిగింపు.. రూ. 2500 కోట్లు -
నమ్మడానికి విడ్డూరంగా ఉన్నా ఇది నిజమే..!
వ్యాయామంతో శారీరక, మానసిక ఒత్తిడి తొలగి ఉల్లాసంగా ఉంటామనే సంగతి మనందరికీ తెలిసిందే! అయినా వ్యాయామం చేయడానికి బద్ధకిస్తాం! ఇందుకు కారణాలనూ వెతుక్కుంటాం! కానీ వ్యాయామాన్ని ఆనందంగా ఆస్వాదిస్తూ చక్కగా ఓ కుక్క క్లాసులు కూడా చెప్పేస్తోంది. నమ్మడానికి కాస్త విడ్డూరంగా ఉన్నా ఇది నిజమే..! అయితే ఓ సారి ఈ వీడియో చూడండి. ఆస్ట్రేలియన్ షెప్‌యార్డ్ ఎక్సర్సైజులు ఎలా చేయాలో క్లాసులు చెప్తుంది. ఈ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారి చక్కర్లు కొడుతోంది. జనవరి 10న టెస్లా అనే కుక్క స్కిల్స్‌ను తొలిసారిగా పోస్టు చేశారు. ఆ తర్వాత ట్విటర్లో వేల కామెంట్లు రావడంతో మరిన్ని ఫీట్లను పోస్టు చేశారు. ఆస్సీస్ డూయింగ్ థింగ్స్ అనే అకౌంట్లో కుక్క దొర్లుతూ ఎగురుతూ క్లాస్ చెప్తుండటం చూసే వాళ్లందరికీ నవ్వు తెప్పిస్తుంది. ఈ వీడియో ట్విటర్లో 42లక్షల వ్యూయర్స్‌ను దక్కించుకుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో 92వేల మంది వీక్షించారు. టెస్లా పేరు మీదనే ఓ ఇన్స్టాగ్రామ్ అకౌంట్.. దానికి 40వేల మంది ఫాలోవర్లు ఉన్నారంటేనే అర్థమైపోతోంది కదా అది కూడా ఓ సెలబ్రిటీ అని. View this post on Instagram Craussfit part II. Looking for a gift this holiday season? @fpmovement is the gift that keeps you moving 🏃♀️🤸♀️🏋️♀️ Swipe ➡️ to see the roll 😁 #movingtogether #freepeoplepartner #freepeople . . . #dogsofinstagram #dog #puppy #dogsofinsta #pupsofinstagram #miniaussie #austrailianshepherd #bluemerle #miniaussie #bluemerleaussie #aussiepuppies #americanshepherd #wigglebutt #aussiesofinstagram #miniaussiesofinstagram #dogtraining #aussiesdoingthings @laur_fotsch @crossfitsj @crossfittraining A post shared by Tesla (@teslatheminiaussie) on Nov 14, 2019 at 8:23am PST View this post on Instagram Perfecting the wall stand. 😱💪👏 #teslatricks #crossfit #gymnasticsday . . . #dogsofinstagram #dog #dogsofinsta #pupsofinstagram #miniaussie #austrailianshepherd #bluemerle #miniaussie #bluemerleaussie #aussiepuppies #americanshepherd #wigglebutt #aussiesofinstagram #miniaussiesofinstagram #dogtraining #aussiesdoingthings #dogyoga A post shared by Tesla (@teslatheminiaussie) on Jan 13, 2020 at 5:17pm PST -
ఏముంది.. అక్కడే పడుకో: భార్య
ఉటావా: జిమ్‌లో గంటల తరబడి వ్యాయామం చేస్తూ ఓ వ్యక్తి సమయాన్నే మర్చిపోయాడు. దీంతో అతన్ని గమనించని నిర్వాహకులు జిమ్ సెంటర్‌కు తాళం వేసి వెళ్లిపోయిన ఘటన అమెరికాలోని ఉటావాలో చోటు చేసుకుంది. వివరాలు.. డేన్ హిల్ అనే వ్యక్తి ‘24 హవర్స్ ఫిట్నెస్’ అనే జిమ్ సెంటర్లో చేరాడు. అయితే జనవరి 12న అతను జిమ్‌లోని స్విమ్మింగ్ పూల్‌లో ఈత కొడుతూ ప్రపంచాన్నే మర్చిపోయినట్టున్నాడు. ఇక ఇతన్ని ఆ జిమ్ నిర్వాహకులు కూడా గమనించనట్టున్నారు. దీంతో అర్ధరాత్రి సమయంలో జిమ్‌ను మూసేసి వెళ్లిపోయారు. ఈ విషయం ఆలస్యంగా తెలుసుకున్న డేన్ జిమ్ నుంచి బయటపడే దారి కోసం ప్రయత్నించాడు. కానీ ఏ మార్గం అతని కంట పడలేదు. దీంతో జిమ్‌లో చిక్కుకున్న విషయాన్ని అతను ఫొటోలతో సహా ఫేస్బుక్లో పోస్ట్ చేశాడు. ‘ఈ జిమ్ 24 గంటలు తెరిచి ఉండనపుడు దానికి ఆ పేరు ఎలా సూటవుతుంది?’ అని కాస్త విసుగు ప్రదర్శించాడు. ఇక ఈ పోస్ట్ క్షణాల్లోనే వైరల్‌గా మారింది. జిమ్ నుంచి బయటపడే దారి దొరక్కపోవడంతో డేన్ తన భార్యకు కాల్ చేశాడు. అయితే ఆమె ‘మంచి స్థలం చూసుకుని అక్కడే పడుకొ’మ్మని సలహా ఇచ్చింది. ‘ఏముంది.. అద్దాలు పగలగొట్టి బయటపడు’ అని కొందరు నెటిజన్లు ఐడియాలు ఇచ్చారు. ‘24 హవర్స్ ఫిట్నెస్ అంటే 24 గంటలపాటు లోపలే ఉంచి లాక్ చేయడమేమో’ అని మరికొందరు వ్యంగ్యంగా కామెంట్ చేశారు. కాగా కాసేపటికే పోలీసులు అతన్ని జిమ్ నుంచి బయటికి తీసుకువచ్చేందుకు సహాయం చేశారు. దీనిపై జిమ్ యాజమాన్యం క్షమాపణలు చెప్పింది. రాత్రిళ్లు అంతగా ఉపయోగం లేని చోట్ల మాత్రమే జిమ్‌ను క్లోజ్ చేస్తున్నామని తెలిపింది. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకుంటామని హామీ ఇచ్చింది. -
జిమ్ చేస్తూ యువకుడి మృతి
హైదరాబాద్: సరైన శిక్షణ లేకుండా జిమ్ చేస్తూ కొందరు యువకులు ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. సోమవారం ఎస్ఆర్నగర్లోని గోల్డెన్ జిమ్‌లో ఆదిత్య (30) అనే యువకుడు జిమ్ చేసిన అనంతరం అస్వస్థతకులోనై మృతి చెందాడు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... పంజాబ్‌కు చెందిన ఆదిత్య బీకేగూడలో ఓ ఇంట్లో అద్దెకు ఉంటూ డిజిటల్ మార్కెటింగ్‌లో ఉద్యోగం చేస్తున్నాడు. ఎస్ఆర్నగర్ పోలీస్‌స్టేషన్ పక్కనే ఉన్న గోల్డెన్ జిమ్‌లో ప్రతిరోజు ఉదయం కసరత్తులు చేసేవాడు. సోమవారం ఉదయం 10 గంటల సమయంలో జిమ్‌కు వచ్చిన ఆదిత్య గంటపాటు ఎప్పటిలాగే జిమ్ చేశాడు. ఆ తర్వాత కడుపులో నలతగా ఉందని, శ్వాస తీసుకోవడం కష్టంగా ఉందని నిర్వాహకులతో చెప్పి కుప్పకూలిపోయాడు. అయితే ఆదిత్యను నిర్వాహకులు ఆసుపత్రికి తీసుకువెళ్లే ప్రయత్నం చేయలేదు. ఆదిత్య స్నేహితుడు హుసేన్‌కు వారు ఫోన్ చేయగా హుసేన్ ఆదిత్యను ఇంటికి తీసుకువెళ్లాడు. ఇంటికి వెళ్లాక పరిస్థితి విషమంగా మారడంతో చికిత్స నిమిత్తం సనత్‌నగర్‌లోని నీలిమా ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు ఆదిత్య అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. స్నేహితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సంఘటన స్థలానికి వచ్చిన పోలీసులు పంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. గోల్డెన్ జిమ్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. జిమ్‌లోని సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. మాత్రలు వేసుకున్నానని చెప్పాడు ‘ఆదిత్యకు ఉదయం ఫోన్ చేస్తే తీయలేదు. దీంతో అతడిని తీసుకువచ్చేందుకు జిమ్‌కు వెళ్లాను, అప్పటికే ఆదిత్య పరిస్థితి విషమంగా ఉంది. ఇంటికి తెచ్చాక పరిస్థితి విషమంగా మారడంతో ‘జిమ్‌లో ఏమైనా తిన్నావా’అని అడిగాను. జీఎంజీ మాత్ర వేసుకున్నానని ఆదిత్య చెప్పడంతో జిమ్ ట్రైనర్ అఖిల్‌కు ఫోన్ చేసి పరిస్థితిని వివరించాను. ఆయన సలహా మేరకు వెంటనే ఆసుపత్రికి తీసుకువెళ్లాను’అని స్నేహితుడు హుసేన్ తెలిపాడు. అయితే జిమ్ చేసేముందు మాత్రలు వేసుకున్నాడా లేక అస్వస్థతకు గురైన అనంతరం మాత్ర వేశారా అన్నది తెలియాల్సి ఉంది. -
‘ఓపెన్’ బెని‘ఫిట్’
దైనందిన కార్యక్రమాల్లో వ్యాయామం కూడా ఒకటి. దనికోసమే యువత పోలీస్, ఇతర పరీక్షలకు సిద్ధం కావలంటే శారీరక సౌష్టవం, పటిష్టత కోసం జిమ్స్ అవసరం. మహిళలు, పట్టణ వాసులు కూడా వ్యాయామం వైపు మొగ్గు చూపుతున్నారు. దీని కోసం సిద్దిపేట పట్టణంలో ఇప్పటికే కోమటి చెరువు, బ్లాక్ ఆఫీస్ చౌరస్తా, సిరిసిల్లా కమాన్ ప్రాంతాల్లో ఓపెన్ జిమ్స్ ఏర్పాటు చేశారు. ఇప్పుడు కొత్తగా కోమటి చెరువు అడ్వంచర్ పార్కు, హౌసింగ్‌బోర్డు పార్కు, ఎర్రచెరువు ప్రాంతాల్లో జిమ్స్ ఏర్పాటు చేస్తున్నారు. యువత కోరిక మేరకు సిద్దిపేట నియోజకవర్గంలోని గుర్రాల గొందిలో కూడా ఏర్పాటు చేశారు. దీన్ని చూసిన చిన్నకోడూరు, ఇబ్రహింపూర్, విఠలాపూర్, చంద్లాపూర్, ఇర్కొడు, నంగునూరు మొదలైన గ్రామాల యువకులు తమ గ్రామాల్లో కూడా జిమ్ ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. దీనిపై స్పందించిన హరీశ్‌రావు ఆయా గ్రామాల్లో కూడా జిమ్స్ ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నారు. సాక్షి, సిద్దిపేట: నాటి తెలంగాణ ఉద్యమం నుంచి నేడు జిల్లా సమగ్ర అభివృద్ధి వరకు సిద్దిపేట అంటే ఓ ప్రత్యేకత. రాష్ట్రంలో ఏ జిల్లా అభివృద్ధి చెందనంతగా సిద్దిపేట అభివృద్ధిలో దూసుకుపోతోంది. రోడ్లు, కార్యాలయాలు, భవనాలు, ప్రభుత్వ పథకాల అమలులో మందంజలోనే కాకుండా ఇప్పుడు వినూత్న రీతిలో యువతకు ఉపయోగపడే కార్యక్రమాలకు మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు నేతృత్వంలో శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా యువత అతి త్వరగా ఆకర్షితులయ్యే ఓపెన్ జిమ్స్ ఏర్పాటుకు ప్రణాళిక రూపొందించారు. ఇందులో భాగంగా సిద్దిపేటలో ప్రతీ కూడలిలో ఓపెన్ జిమ్‌లను ఏర్పాటు చేశారు. వీటిని గ్రామాలకు కూడా విస్తరించేందుకు కార్యచరణ సిద్ధం చేస్తున్నారు. యువతను ప్రోత్సహించేలా.. నేటి బాల బాలికలే రేపటి పౌరులు. వీరే విలువైన మానవ వనరులు.. వీరు సంపూర్ణ ఆరోగ్యంతో పెరిగితే రేపటి ఆరోగ్యవంతమైన సమాజంలో భాగస్వామ్యులు అవుతారనే విధానాన్ని నమ్మిన మాజీ మంత్రి హరీశ్‌రావు యువతకు పదికాలల పాటు ఉపయోగపడే వాటికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇప్పటికే జిల్లాలో ఉపాధ్యాయుల నియామకం కోసం పోటీ పడుతున్న విద్యార్థులకు టెట్, టీఆర్టీతోపాటు, వీఆర్వో, వీఆర్ఏ, గ్రూప్స్‌కు కూడా శిక్షణ ఇప్పించారు. దాతల సహకారంతో విద్యార్థులు ఉచిత భోజనం, వసతులు కల్పించారు. దీంతో వేలాది మంది విద్యార్థులకు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించేందుకు మార్గం సుగమనం అయ్యింది. అదేవిధంగా పోలీస్ కానిస్టేబుల్స్, ఎస్సై ఉద్యోగాలకు ప్రత్యేక శిక్షణ ఇప్పించారు. ఆర్మీ, ఎయిర్‌పోర్స్ నియామకాలు కూడా జిల్లాలో ఏర్పాటు చేస్తున్నారు. అయితే ప్రతీ మనిషి సంపూర్ణ ఆరోగ్యవంతుడుగా ఎదగాలంటే మంచి గాలి, శారీరక వ్యాయామం అవసరం. దీనికోసమే సిద్దిపేట పరిసర ప్రాంతాలతోపాటు మారుమూల ప్రాంతాల్లో కూడా విరివిరిగా చెట్లు నాటే కార్యక్రమాన్ని యజ్ఞంలా ప్రారంభించారు. పచ్చటి సిద్దిపేటే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నారు. అదేవిధంగా మంచి వ్యాయామం చేయాలంటే వారికి అందుబాటులో జిమ్స్ ఏర్పాటు చేయాలనే ఆలోచనతో ప్రధాన కూడళ్ల వద్ద జిమ్స్ ఏర్పాటు చేస్తున్నారు. వ్యాయామంతో క్రమశిక్షణ ‘‘యువత రేపటి విలువైన మానవ వనరులు. చిన్న చిన్న పొరపాట్లు చేసి జీవితాలను ఆంధకారంలోకి పోతున్నారు. వీరిని ప్రోత్సహించాలనే ఆలోచనతోనే అన్ని పోటీ పరీక్షలకు ఉచితంగా శిక్షణ ఇప్పించాం. కానిస్టేబుల్, ఎస్సై పరీక్షలకు సన్నద్ధం చేశాం. ఎయిర్‌పోర్స్ సెలక్షన్లు పెట్టడంతో వందలాది మంది ఉద్యోగాలు పొందారు. ఇక సిద్దిపేటలో కోమటి చెరువు అభివృద్ధి చేశాం. ఉదయం వేలసంఖ్యలో చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు వ్యాయామం చేస్తున్నారు. వీరందరికీ జిమ్స్ అందుబాటులో ఉండాలన్నదే ఆలోచన. యువత జిమ్స్‌ను ఉపయోగించుకొని పోలీస్, ఇతర ఉద్యోగాల్లో ఎంపిక కావడం సంతోషకరం. ’’ – తన్నీరు హరీశ్‌రావు, మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే ‘‘ఒకప్పుడు సిద్దిపేట అంటే మారుమూల గ్రామం. కానీ ఇప్పుడు ఇక్కడి ప్రజలకు అన్ని సౌకర్యాలు ఉన్నాయి. సిద్దిపేట కోమటి చెరువు, బ్లాక్ ఆపీస్ చౌరస్తా, సిరిసిల్లా కమాన్ వద్ద ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్స్తో యువతకు ఉపయోగకరంగా ఉంది. నెలకు వేలాది రూపాయలు ఖర్చుచేసి జిమ్‌కు వెళ్లలేని నిరుపేదలు వీటిని వినియోగించుకొని మంచి క్రీడాకారులుగా ఎదుగుతున్నారు.’’ – మల్లికార్జున్, క్రికెట్ క్రీడాకారుడు ‘‘మా ఊళ్లో మూడు వందలకు పైగా యువత ఉంటారు. జిమ్ చేయాలంటే సిద్దిపేటకు రావాల్సి ఉండేది. యుత అందరం కలిసి మాకు జిమ్ కావాలని మాజీ మంత్రి హరీశ్‌రావును కోరాం. వెంటనే మా ఊళ్లో ఓపెన్ జిమ్ ఏర్పాటు చేశారు. యువత ఉదయం, సాయంత్రం జిమ్ చేసుకుంటున్నారు. క్రమశిక్షణకు అలవాటు పడుతున్నారు. కొందరు కానిస్టేబుల్, ఎస్సై వంటి ఉద్యోగాలు కూడా పొందుతున్నారు. యువతలో మార్పు వచ్చింది’’. – ఆంజనేయులు, సర్పంచ్, గుర్రాల గొంది -
జిమ్ తలుపు తెరిచే సరికి...
సాక్షి, ముంబై : గోరేగావ్ ప్రాంతంలో చిరుతపులి కలకలం సృష్టించింది. ఆరే కాలనీలోని ఎస్ఆర్పీఎఫ్ క్యాంప్‌లోని జిమ్‌లోకి శనివారం రాత్రి ఓ చిరుత చొరబడింది. ఆదివారం ఉదయం జిమ్ తాళాలు తెరవటానికి వచ్చిన సిబ్బంది ఒకరు జిమ్ లోపల చిరుతపులి ఉండటాన్ని గుర్తించాడు. వెంటనే జిమ్ తలుపులు మూసేసి అటవీశాఖ అధికారులకు సమాచారమిచ్చాడు. సంజయ్ గాంధీ నేషనల్ పార్క్, థానే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అధికారులు రెండు గంటలు శ్రమించి చిరుతను పట్టుకోగలిగారు. అధికారులు మాట్లాడుతూ.. ఈ జిమ్ అటవి ప్రాంతానికి చాలా దగ్గర ఉండటంతో అడవి మృగాలు తరుచుగా అక్కడికి వస్తుంటాయన్నారు. బంధించిన చిరుతపులిని అధికారులు చిరుతపులుల సంరక్షణా కేంద్రానికి తరలించారు. త్వరలోనే దానిని అడవిలోకి వదిలి పెడతామని అధికారులు చెప్పారు. కాగా, జిమ్‌లో చిరుత.. వార్తతో జనం ఎక్కువ సంఖ్యలో జిమ్ దగ్గర గుమిగూడగా వారిని నిలువరించడానికి అధికారులు కష్టపడాల్సి వచ్చింది. -
నా కోపాన్ని అక్కడ కక్కేస్తా!
కోపం వస్తే మీద పడి కరిచినంత పని చేస్తారు కొంతమంది. కొట్టేంత పని చేస్తారు ఇంకొంత మంది. మరి కొంతమంది సెలైంట్‌గా ఉండిపోతారు. మరి.. సమంత ఏం చేస్తారో తెలుసా? జిమ్ చేస్తారు. ‘‘ఔను.. నా కోపాన్ని జిమ్ సెంటర్లో కక్కేస్తా. మామూలుగా నాకు ఫిట్‌నెస్‌పై శ్రద్ధ ఎక్కువ. క్రమం తప్పకుండా వర్కవుట్స్ చేస్తా. కాకపోతే కోపంగా ఉన్నప్పుడు ఎక్కువ చేస్తా. ఆ తర్వాత శాంతిస్తా’’ అని నవ్వుతూ అన్నారు సమంత. తెలుగు, తమిళ భాషల్లో నాలుగైదు సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారామె. ఆ విషయం గురించి సమంత చెబుతూ - ‘‘ఈ మధ్య నాన్‌స్టాప్‌గా షూటింగ్స్ చేస్తున్నా. అయినప్పటికీ వర్కవుట్స్‌ని దాదాపు మిస్ కాను. ఆడవాళ్లు ఇలాంటి వర్కవుట్సే చేయాలనే నియమం పెట్టుకోను. ఎంత కష్టమైనవాటినైనా చేసి, అమ్మాయిని అయినప్పటికీ స్ట్రాంగే అని నిరూపించుకోవాలన్నది నా ఆశయం’’ అన్నారు. ఇప్పుడు స్టార్ హీరోయిన్ హోదాలో ఉన్నారు కదా.. నంబర్ గేమ్‌ని నమ్ముతారా? అనే ప్రశ్నను సమంత ముందుంచితే - ‘‘నేను నమ్మను. కానీ, నేను చేసే సినిమాల జయాపజయాలను మాత్రం సీరియస్‌గా తీసుకుంటా. సినిమాలో ఎక్కడ తప్పు జరిగిందో విశ్లేషించుకుంటా. నా నటనలో ఏమైనా లోపాలున్నాయేమో అని ఎనలైజ్ చేసుకుంటా’’ అని చెప్పారు.