
టాలీవుడ్‌లో ‘గ్లామరస్ మదర్’అనగానే అందరికి టకీమని గుర్తొచ్చే ఏకైక పేరు ప్రగతి. తనదైన సహజ నటనతో అమ్మ, తల్లి, భార్య పాత్రలకు వన్నెతెచ్చింది. ఇటీవల సినిమాల్లో ఎక్కువ కనిపించకున్నా.. సోషల్ మీడియా ద్వారా మాత్రం ఎప్పుడూ అభిమానులతో టచ్‌లోనే ఉంటుంది. ఫిట్నెస్‌కు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే ప్రగతి.. వాటికి సంబంధించిన ఫోటోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటుంది. ఆమె షేర్ చేసే వర్కౌట్ వీడియోలు వైరల్ అయిన సందర్భాలు చాలానే ఉన్నాయి.
(చదవండి: ‘రారా సామి’అంటూ రష్మిక స్టెప్పులు.. వీడియో వైరల్)
తాజాగా ఆమె నాగిని సాంగ్‌కి స్టెప్పులేసింది. జిమ్ సెంటర్‌కి వెళ్లిన ప్రగతి.. అక్కడ ‘నాగిని’సాంగ్‌కి ఊరమాస్ స్టెప్పులేసి అందరిని అలరించింది. దానికి సంబంధించిన వీడియోని తన ఇన్‌స్టా ఖాతాలో షేర్ చేస్తూ.. ‘నేను చేసే ప్రతి పనిలో ఆనందాన్ని సృష్టిస్తాను’అని క్యాప్షన్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Comments
Please login to add a commentAdd a comment