
నటి ప్రగతి సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుందన్న సంగతి తెలిసిందే. ఎప్పటికప్పుడు అప్‌డేట్స్‌ని షేర్ చేస్తూ ఫ్యాన్స్‌తో టచ్‌లో ఉంటుంది. లాక్‌డౌన్‌లో ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టిన ప్రగతి అప్పటి నుంచి తరచూ ఫిటినెస్ సహా పలు వీడియోలను అభిమానులతో పంచుకునేది. తాజాగా ఇంటర్నేషనల్ డ్యాన్స్ డే సందర్భంగా తన స్నేహితురాలితో కలిసి పాపులర్ 'ఫేమస్ డ్రీమమ్ వేకపమ్' అనే సాంగ్‌కు చిందేసింది. చీరకట్టులో మాస్ స్టెప్పులతో ఇంటర్నెట్‌ను షేక్ చేసింది.
ఈ వీడియోను ప్రగతి తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయగా కొద్ది గంటల్లోనే వీడియో వైరల్‌గా మారింది. ఈ ఏజ్‌లో కూడా ఫిట్‌గా ఉంటూ ఎంతో ఎనర్జీగా డ్యాన్స్ చేశారంటూ పలువురు నెటిజన్లు ఈ నటి డ్యాన్స్‌కు ఫిదా అవుతున్నారు. గతంలోనూ బొంబాయి చిత్రంలోని ‘హమ్మ.. హమ్మ..’ పాటకు డ్యాన్స్ చేసిన వీడియోను పోస్టు చేసి అందరిని ఆకట్టుకుంది. ఆ తర్వాత వరుసగా మాస్ పాటలకు స్టెప్పులేసిన వీడియోలను షేర్ చేస్తు అందరి చూపు తనవైపుకు తిప్పుకుంటోంది ప్రగతి. ఇటీవల విజయ్ నటించిన మాస్టర్ మూవీ సాంగ్‌కు తన కుమారుడితో కలిసి లుంగితో తీన్మార్ స్టెప్పులేసింది.
చదవండి :
కూతురిని ఆటపట్టించిన ప్రగతి, వీడియో వైరల్
గుడ్డు ఎలా ఉడకబెట్టాలో కూడా తెలియదు: హీరోయిన్
Comments
Please login to add a commentAdd a comment