pragati
-
‘ప్రగతి’ సూపర్ సక్సెస్
సాక్షి బెంగళూరు: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలుచేస్తున్న పథకాలు, ప్రాజెక్టులపై ఎప్పటికప్పడు సమీక్ష జరుపుతూ సమయానికి పనులు పూర్తయ్యేలా చేసేందుకు నేరుగా ప్రధాని మోదీ పాల్గొని నిర్వహించే వర్చువల్ సమావేశం ప్రో–యాక్టివ్ గవర్నెన్స్ అండ్ టైమ్లీ ఇంప్లిమెంటేషన్ (ప్రగతి) కార్యక్రమం అద్భుత ఫలితాలనిస్తోందని ప్రఖ్యాత ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం కితాబునిచ్చింది. రెండో తేదీన బెంగళూరులో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్లో జరిగిన కార్యక్రమంలో ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం ‘ప్రగతి’కార్యక్రమంపై జరిపిన అధ్యయనాన్ని ఒక బిజినెస్ స్కూల్ కేస్ స్టడీ రూపంలో విడుదల చేసింది. ‘గ్రిడ్లాక్ టూ గ్రోత్’పేరిట చేసిన అధ్యయనంలో ప్రగతి కార్యక్రమం అమలు, వాటి ఫలితాలను విశ్లేషించింది. దేశంలో భారీ ఎత్తున మౌలిక వసతులు, సామాజికాభివృద్ధి కార్యక్రమాలు ఈ ప్రగతి పథకం ద్వారా విజయవంతంగా అమలు చేస్తున్నారని ఆక్స్ఫర్డ్ ప్రశంసించింది. గేట్స్ ఫౌండేషన్ సహకారంతో నిర్వహించిన ఈ పరిశోధనలో ‘ప్రగతి’కార్యక్రమం ద్వారా దేశంలో జరిగిన డిజిటల్ గవర్నెన్స్ అభివృద్ధిని ఆక్స్ఫర్డ్ ప్రస్తావించింది. 2015లో ‘ప్రగతి’ప్రస్థానం మొదలైన నాటి నుంచి ఇప్పటివరకు 205 బిలియన్ డాలర్ల విలువైన 340 ప్రాజెక్టులను విజయవంతంగా పూర్తిచేశారని వెల్లడించింది. ‘ప్రగతి’కార్యక్రమంలో భాగంగా సుమారు 50 వేల కిలోమీటర్ల మేర జాతీయ రహదారుల నిర్మాణం జరిగిందని, రెట్టింపు స్థాయిలో విమానాశ్రయాలు అందుబాటులోకి వచ్చాయని తెలిపింది. మౌలికవసతుల కల్పన కోసం ఖర్చు చేసిన ప్రతి రూపాయి జీడీపీలో రూ. 2.5 నుంచి రూ. 3.5 మేర తిరిగి లబ్ధి చేకూర్చినట్లు ఆక్స్ఫర్డ్ అధ్యయనం తెలిపింది. ప్రధాన మంత్రి మౌలికవసతుల అభివృద్ధి కోసం ఉద్దేశించిన పీఎం గతిశక్తి, పర్యావరణ అనుమతుల నిమిత్తం రూపొందించిన పరివేశ్లను నిర్వహించడంలో ఈ ప్రగతి ఎంతగానో దోహదపడిందని వర్సిటీ తెలిపింది. గతంలో పర్యావరణ అనుమతుల కోసం 600 రోజులు పడుతుండగా ప్రస్తుతం ‘ప్రగతి’కారణంగా జీఐఎస్ మ్యాపింగ్, డ్రోన్ పర్యవేక్షణ ద్వారా ఆ గడువు దాదాపు 75 రోజులకు తగ్గిందని వెల్లడించింది. గ్రామాల్లోని కుళాయి కనెక్షన్స్ కూడా కేవలం ఐదేళ్లలో 17 శాతం నుంచి 79 శాతానికి పెరిగినట్లు తెలిపింది. -
Pragati Srivastava: పెదకాపు హీరోయిన్ ఎంత ముద్దుగా ఉందో (ఫొటోలు)
-
రెండోపెళ్లిపై ఆసక్తికర కామెంట్స్ చేసిన నటి ప్రగతి
నటి ప్రగతి గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన పనిలేదు. అమ్మ, వదిన పాత్రలతో ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. ఇక సినిమాల కంటే సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయిన ప్రగతి వర్కవుట్, డ్యాన్స్ వీడియోలతో నెట్టింట అలరిస్తుంటుంది. తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో రెండోపెళ్లిపై ఆసక్తికర కామెంట్స్ చేసింది. సింగిల్ మథర్ కాబట్టి ఎప్పుడైనా మళ్లీ పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన వచ్చిందా అన్న ప్రశ్నకు ఆమె మాట్లాడుతూ.. ''పెళ్లి అనే పదంకన్నా కంప్యానియన్ అనేది చాలా ముఖ్యం. చాలాసార్లు నాకు కూడా కంప్యానియన్ ఉంటే బాగుంటుందనిపిస్తుంది. కానీ మళ్లీ నా మెచ్యూరిటీ లెవల్‌కి మ్యాచ్ అయ్యేవారు దొరకాలి కదా అనిపిస్తుంటుంది. కొన్ని విషయాల్లో ఇలాగే ఉండాలి అని చాలా కశ్చితంగా ఉంటాను. ఒకవేళ 20ఏళ్ల వయసులో ఉంటే అడ్జస్ట్ అయ్యేదాన్నేమో. కానీ ఇప్పుడు చాలా కష్టం'' అంటూ చెప్పుకొచ్చింది. -
నటి ప్రగతి ఇల్లు చూశారా? సింపుల్‌గా ఉన్నా అదిరిపోయింది
నటి ప్రగతి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. తొలుత హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన ప్రగతి ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టుగా గుర్తింపు పొందింది. పలు చిత్రాల్లో అక్క, అమ్మ పాత్రల్లో నటించి తెలుగులో మంచి పాపులారిటీని సంపాదించుకుంది. ఇక సోషల్ మీడియాలోనూ తెగ యాక్టివ్‌గా ఉండే ప్రగతి జిమ్, వర్కవుట్ వీడియోలతో మరింత ఫేమ్ దక్కించుకుంది. రీసెంట్‌గానే సొంతంగా యూట్యూబ్ ఛానెల్ స్టార్ట్ చేసిన ప్రగతి ఫుడ్, బ్యూటీ, వర్కవుట్ వంటి పలు ఇంట్రెస్టింగ్ విశేషాలను నెటిజన్లతో పంచుకుంది. తాజాగా తన ఇంటికి సంబంధించి హోంటూర్ వీడియోను షేర్ చేసింది. ప్రతి రూపాయి కూడబెట్టుకొని ఎంతో ఇష్టపడి ప్రతి వస్తువును కొనుగోలు చేసినట్లు ప్రగతి పేర్కొంది. అంతేకాకుండా తన ఇంట్లో ప్రతి వస్తువుకు ఓ కథ ఉందని, ప్రపంచంలోనే తనకు ఎంతో ఇష్టమైన ప్రదేశం ఇల్లేనని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. -
ఆర్థిక ఇబ్బందులు.. నగలు అమ్మి ఆ గడ్డు పరిస్థితుల నుంచి బయటపడ్డా: ప్రగతి
నటి, క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్రగతి.. తెలుగు ప్రేక్షకులకు బాగా సుపరిచితురాలు. సినిమాల్లో హీరోలకు తల్లి పాత్రలు పోషించి ఆమె బాగా గుర్తింపు పొందింది. ఇక ఈ మధ్య ఆమె సోషల్ మీడియాల్లో సైతం ఫుల్ యాక్టివ్‌గా ఉంటోంది. ట్రెండింగ్ పాటలకు స్టెప్పులేస్తూ, జిమ్‌లో వర్కౌట్ చేస్తున్న వీడియోలను తరచూ పంచుకుంటుంది. ఈ క్రమంలో ఆమె ట్రోల్స్ బారిన పడుతోంది. అయితే తల్లి పాత్రలు చేస్తున్న ఆమె మొదట ఇండస్ట్రీకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. చదవండి: ఆడిషన్స్‌కి వెళ్లినప్పుడు దారుణంగా అవమానించారు: ప్రియదర్శి నటనపై మక్కువతో మోడల్‌గా కెరీర్ స్టార్ట్ చేసిన ఆమె తమిళ నటుడు, దర్శకుడు భాగ్యరాజ్ సరసన హీరోయిన్గా నటించే చాన్స్ కొట్టేసింది. ‘వీట్ల విశేశాంగ’ మూవీతో ప్రగతి హీరోయిన్గా తమిళ సినీ పరిశ్రమలో అడుగు పెట్టింది. అదే సమయంలో ఆమె 7 తమిళ సినిమాలతో పాటు ఒక మలయాళ మూవీలో కూడా నటించింది. ఈ క్రమంలో ఓ సీన్‌కు ఆమె అభ్యంతరం చెప్పడంతో హీరో చేసిన వ్యాఖ్యలు తనని బాధించాయని, దీంతో హీరోయిన్గా చేయొద్దని నిర్ణయించుకున్నట్లు ఇటీవల ఆమె ఓ టాక్‌లో షో చెప్పింది. ఈ సందర్భంగా ప్రగతి తన వ్యక్తిగత విషయాలను కూడా పంచుకుంది. చదవండి: Actress Prema: మోహన్ బాబు గారిని చూస్తేనే భయం వేసేది, అలాంటిది..: ప్రేమ లాక్డౌన్లో ఆర్థికపరమైన ఇబ్బందులు ఫేస్ చేశానంటూ ఆవేదన వ్యక్తం చేసింది. ‘కరోనా సమయంలో షూటింగ్స్ లేవు. దీంతో ఆర్థిక పరమైన ఇబ్బందులు ఎదురయ్యాయి. దీంతో నా నగలు తాకట్టు పెట్టి ఆ గడ్డు పరిస్థితుల నుంచి బయటపడ్డా’ అని తెలిపింది. ఇక అలాగే తన వైవాహిక జీవితం, విడాకులపై స్పందించింది. ‘నా వైవాహిక జీవితం సాఫీగా సాగడానికి ఎన్నో రకాలుగా ప్రయత్నించాను. కానీ అది కుదరలేదు. అందుకే విడాకులు తీసుకున్నా. నా పిల్లలను ఒంటరిగా నేనే చదివించాను. ఇప్పుడు వాళ్లు వారి లైఫ్‌కి సంబంధించిన నిర్ణయాలను సొంతంగా తీసుకునే స్థాయికి ఎదిగారు’ అంటే చెప్పుకొచ్చింది. -
నన్ను అలా అనడంతో మేకప్ రూంకి వెళ్లి ఏడ్చా: నటి ప్రగతి
నటి ప్రగతి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. సినిమాల్లో హీరోహీరోయిన్లకు అమ్మ పాత్రలు చేస్తూ నటిగా మంచి గుర్తింపు పొందింది. ఈ మధ్య తెరపై కంటే సోషల్ మీడియాలో ట్రోల్స్‌తో ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది. ఈ నేపథ్యంలో రీసెంట్గా ఓ టాక్ షోలో పాల్గొన్న ఆమె తన వ్యక్తిగత విషయాలను పంచుకుంది. అయితే మొదట హీరోయిన్గా నటించని ఆమె మదర్ రోల్స్ చెయడానికి కారణమెంటో తెలిపింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘ఒక హీరోతో రెయిన్ సీన్ చేయాలన్నారు. కాస్ట్యూమ్స్ విషయంలో నేను అభ్యంతరం చెప్పాను. చదవండి: మరో కొత్త బిజినెస్‌లోకి మహేశ్? ఈసారి భార్య పేరు మీదుగా..! ఆ సమయంలో ఆ హీరో చేసిన వ్యాఖ్యలు నాకు నచ్చలేదు. దాంతో ఆ పాట చేయకుండా వెళ్లిపోయాను. ఆ సంఘటనతో ఇకపై హీరోయిన్గా నటించొద్దని నిర్ణయించుకున్న. అందుకే తల్లి పాత్రలు, సీరియల్స్ చేసుకోవడం మొదలుపెట్టాను’ అని చెప్పుకొచ్చింది. అలాగే మొదటి సారి తాను తల్లి పాత్ర చేసినప్పుడు తనకు చేదు అనుభవం ఎదురైందని చెప్పంది. ‘‘తొలిసారి నేను మదర్ రోల్ చేసినప్పుడు నా వయసు 24 ఏళ్లు అప్పుడు నాకు చాలా బాధ వేసింది. ఇక మేకప్ అయ్యాక సెట్‌కి వెళితే డైరెక్టర్ నన్ను చూసి ‘ఈవిడెంటి జడ వేసుకుని వచ్చింది. ముడి వేసుకుని రమ్మనండి’ అని అన్నారు. చదవండి: ‘ఓరి దేవుడా’కు వెంకి షాకింగ్ రెమ్యునరేషన్!, 15 నిమిషాలకే అన్ని కోట్లా? ఆ మాటలు నన్ను చాలా బాధించాయి. ఎందుకంటే అప్పటికే నేను కొన్ని సినిమాల్లో హీరోయిన్గా చేశాను. నా వయసు ఉన్న హీరోయిన్స్‌కి నేను తల్లి పాత్రలు చేయాల్సి వచ్చింది. అప్పటికే బాధలో ఉన్న నాకు డైరెక్టర్ మాటలు ఇంకా బాధించాయి. దీంతో మేకప్ రూంకు వెళ్లి వెక్కి వెక్కి ఏడ్చాను. అయితే ఆ తర్వాత నుంచి మాత్రం తల్లి పాత్రలను గౌరవించడం మొదలు పెట్టాను. ఆ తరహా పాత్రలు వేయడానికి ఆలోచన చేయలేదు. ఆ రోజు నుంచి అవకాశాలు కావాలని నేను ఎవరి దగ్గర నోరు తెరిచి అడిగింది లేదు’’ అని పేర్కొంది. -
నేను ఎలా ఉన్నా అందగత్తెనే, సినిమాలు అవే వస్తాయి!
ఒకప్పుడు హీరోయిన్గా చేసిన ప్రగతి తర్వాత అమ్మ పాత్రలు చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. అందానికి, ఆరోగ్యానికి పెద్ద పీట వేస్తూ ఆమె చేసే వర్కవుట్లు సోషల్ మీడియాలో ఎంత హల్చల్ చేస్తాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత విషయాలను పంచుకుంది. 'నేను పుట్టి పెరిగింది హైదరాబాద్‌లో. పదో తరగతి చదివేటప్పుడు చెన్నైకి షిఫ్ట్ అయ్యాం. సింగిల్ పేరెంట్‌గా అమ్మ పెంచింది. కొన్నిసార్లు ఇల్లు గడవడానికి కష్టమైనప్పుడు అమ్మ బంగారం కుదువ పెట్టేది. నేను సైకిల్ మీద వెళ్లి నెలనెలా వడ్డీ కట్టేదాన్ని. చెన్నైలో నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నప్పుడు రోజా మూవీ రిలీజైంది. అది చూశాక నేను మధుబాలలా ఉంటానని అందరూ అనేవారు. సరిగ్గా అదే సమయంలో సీనియర్ నటి సీఆర్ సరస్వతి నన్ను చూసి భాగ్యరాజాగారికి చెప్పారు. అలా ఆయన నన్ను హీరోయిన్గా తీసుకున్నారు. కానీ అప్పట్లో కొత్తగా వచ్చిన హీరోయిన్స్‌ను పెద్దగా పట్టించుకునేవారే కాదు. కొందరి ప్రవర్తన వల్ల ఇబ్బందితో పాటు బాధేసింది. అందుకని హీరోయిన్గా చేయడం వద్దనుకున్నాను. అలా హీరోయిన్గా చాలా తక్కువ సినిమాలు చేశాను. తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా సెటిలయ్యాను. జిమ్‌కు వెళ్లేది అందం కోసం కాదు బలం కోసం! నేను ఎలా ఉన్నా అందగత్తెనే! నాకు సినిమాలు వస్తాయి' అని చెప్పుకొచ్చింది ప్రగతి. చదవండి: గాడ్‌ఫాదర్ హిట్, కానీ ఆ సినిమా కంటే వెనుకంజ నువ్వు కన్నింగ్.. యాంకర్ మాటకు షాకైన అర్జున్ -
ప్రగతి చారిటీస్‌కు వేమిరెడ్డి రూ.3 లక్షల విరాళం
నెల్లూరు(సెంట్రల్): నెల్లూరులోని ప్రగతి చారిటీస్‌కు రాజ్యసభసభ్యుడు, వైఎస్సార్సీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, ప్రశాంతిరెడ్డి దంపతులు రూ.3 లక్షల విరాళాన్ని అందజేశారు. మంగళవారం నెల్లూరులోని తన స్వగృహంలో వేమిరెడ్డి చెక్కు ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 15 సంవత్సరాలుగా మానసిక వికలాంగులైన చిన్నారులకు చేయూతనివ్వడం తమకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తోందన్నారు. విద్యార్థినికి అభినందన పదో తరగతి ఫలితాల్లో 581 మార్కులు సాధించిన నెల్లూరు రూరల్ పరిధిలోని వీపీఆర్ విద్య విద్యార్థిని వైష్ణవిని రాజ్యసభసభ్యుడు, వీపీఆర్ ఫౌండేషన్ చైర్మన్ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, ఫౌండేషన్ చైర్పర్సన్ వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి మంగళవారం అభినందించారు. ఈ సందర్భంగా వేమిరెడ్డి మాట్లాడుతూ ప్రతిభ చూపిన అమ్మా యిని ఫౌండేషన్ ద్వారా చదివిస్తామన్నారు. తమ విద్యాసంస్థలో చదివి ప్రథమ స్థానంలో వచ్చిన వారి ఉన్నత చదువులకు ఫౌండేషన్ ద్వారా సహకారం అందిస్తామన్నారు. వైష్ణవి వారికి ధన్యవాదాలు తెలిపింది. -
నటి ప్రగతి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన మూవీ తెలుసా?
About Telugu Actress Pragathi: నటి, క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్రగతి.. తెలుగు ప్రేక్షకులకు బాగా సుపరిచితురాలు. సినిమాల్లో హీరోలకు తల్లి పాత్రలు పోషించి ఆమె బాగా గుర్తింపు పొందింది. ఇక ఈ మధ్య ఆమె సోషల్ మీడియాల్లో సైతం ఫుల్ యాక్టివ్‌గా ఉంటోంది. ట్రెండింగ్ పాటలకు స్టెప్పులేస్తూ ఆ వీడియోలను తన సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది. ఈక్రమంలో ఆమె వీపరితమైన ఫ్యాన్ ఫాలోయింగ్‌కు సంపాదించుకుంటోంది. ఈ రోజు(మార్చి 17) ఆమె బర్త్‌డే. ఈ సందర్భంగా ప్రగతి గురించిన కొన్ని ఆసక్తికర విషయాలను తెలుసుకుందాం. ప్రగతి 1976 మార్చి 17న ఆంధ్రప్రదేశ్‌లోని ఒంగోలు జిల్లాలో జన్మించింది. నటనపై మక్కువతో మోడల్‌గా కెరీర్ స్టార్ట్ చేసిన ఆమె తమిళ నటుడు, దర్శకుడు భాగ్యరాజ్ సరసన హీరోయిన్గా నటించే చాన్స్ కొట్టేసింది. ‘వీట్ల విశేశాంగ’ మూవీతో ప్రగతి హీరోయిన్గా తమిళ సినీ పరిశ్రమలో అడుగు పెట్టింది. అదే సమయంలో ఆమె 7 తమిళ సినిమాలతో పాటు ఒక మలయాళ మూవీలో కూడా నటించింది. కెరీర్ సాఫీగా సాగుతున్న క్రమంలో ఆమె పెళ్లి చేసుకుంది. కొంతకాలం నటనకు బ్రేక్ ఇచ్చిన ఆమె ఆ తర్వాత మహేశ్ బాబు బాబీ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయం అయ్యింది. ఇలా క్యారెక్టర్ అర్టిస్ట్‌గా తెలుగులో అడుగుపెట్టిన ఆమె హీరోలకు తల్లి పాత్రలకు పోషిస్తూ ఒదిగిపోయింది. ఈ క్రమంలో తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఇలా వరస ఆఫర్లు అందుకుంది ప్రగతి పరిశ్రమలో తల్లి పాత్రలకు పాపులరిటీని తెచ్చుకుంది. ఈ నేపథ్యంలో ఆమె తెలుగులో 100కు పైగా చిత్రాల్లో నటించింది. ఉత్తమ నటిగా రెండు నంది అవార్డులు కూడా అందుకుంది. ఇక తమిళంలో 23, మలయాళంలో 2 చిత్రాలు చేసిన ప్రగతి ఈ మూడు భాషల్లో పలు పలు సీరియల్స్‌లో కూడా నటించింది. ఇక రీసెంట్గా ‘సూపర్ మచ్చి’ సినిమాలో కనిపించిన ప్రగతి ప్రస్తుతం ‘ఎఫ్ 3’, ‘భోళా శంకర్’ చిత్రాలతో బిజీగా ఉంది. ప్రస్తుతం ఒంటరిగా ఉంటున్న ప్రగతికి ఒక కుమారుడు ఉన్నాడు. -
స్టార్ హీరో తనతో గడిపితే చాన్స్ ఇస్తానన్నారు.. నటి ప్రగతి షాకింగ్ కామెంట్స్!
క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటి ప్రగతి ఎంత పేరు ప్రఖ్యాతలు పొందిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తనదైన సహజ నటనతో అమ్మ, తల్లి, భార్య పాత్రలకు వన్నెతెచ్చింది. ఇటీవల సినిమాల్లో ఎక్కువ కనిపించకున్నా.. సోషల్ మీడియా ద్వారా మాత్రం ఎప్పుడూ అభిమానులతో టచ్‌లోనే ఉంటుంది. ఫిట్‌నెస్‌కు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే ప్రగతి..వాటికి సంబంధించిన ఫోటోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటుంది. ఆమె షేర్ చేసే వర్కౌట్ వీడియోలు వైరల్ అయిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అలాగే అప్పుడప్పుడు ఆమె చేసే కొన్ని కామెంట్స్ కూడా నెట్టింట వైరల్ అవుతుంటాయి. ఏ విషయాన్ని అయినా కుండ బద్దలు కొట్టినట్లు చెప్పే ప్రగతి... ఓ ఇంటర్వ్యూలో క్యాస్టింగ్ కౌచ్ గురించి షాకింగ్ కామెంట్స్ చేసిందట. ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో అందరిలాగే తాను కూడా ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నానని, దర్శక, నిర్మాతలే కాకుండా.. ఓ స్టార్ హీరో కూడా తనతో గడిపితే సినిమాలో అవకాశం ఇస్తామని చెప్పినట్లు ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఎలాగోలా ఆ హీరో దగ్గరి నుంచి ప్రగతి తప్పించుకుందట. ఆ హీరో ఎవరనేది మాత్రం ఆమె సీక్రెట్‌గా ఉంచిందట. అయితే ఆమె ఏ ఇంటర్వ్యూలో ఈ కామెంట్స్ చేసిందో తెలియదు కానీ.. దానికి సంబంధించిన వార్తలు మాత్రం నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. గతంలో కూడా పలుమార్లు క్యాస్టింగ్ కౌచ్ గురించి ప్రగతి మాట్లాడిన సంగతి తెలిసిందే. -
ఊ అంటావా మావా.. పాటకు ప్రగతి స్టెప్పులు
-
ఊ అంటావా మావ అంటూ జిమ్‌లో ప్రగతి స్టెప్పులు
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ హీరోయిన్ రష్మిక మందన్నా జంటగా నటించిన చిత్రం పుష్ప: ద రైజ్. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ మూవీ డిసెంబర్ 17న థియేటర్లలో విడుదదలైంది. సినిమా రిలీజై నెల రోజులు కావస్తున్నా ఇప్పటికీ కలెక్షన్ల వర్షం కురిపిస్తూనే ఉంది. సినిమానే కాదు ఇందులోని పాటలు కూడా బ్లాక్‌బస్టర్ హిట్ అయ్యాయి. 'చూపే బంగారమాయెనా శ్రీవల్లీ..', 'సామీ నా సామీ..', 'ఏ బిడ్డా ఇది నా అడ్డా', 'దాక్కో దాక్కో మేక..', 'ఊ అంటావా మావా..ఉఊ అంటావా మావా..' పాటలు ఇప్పటికీ మార్మోగుతున్నాయి. సౌత్ నుంచి నార్త్ దాకా ఎక్కడ చూసినా ఇవే పాటలు వినిపిస్తున్నాయి. బాలీవుడ్ సెలబ్రిటీలు, టీమిండియా క్రికెటర్లు కూడా ఈ పాటలకు స్టెప్పులేస్తూ సందడి చేస్తున్నారు. ఇదిలా ఉంటే నిత్యం జిమ్‌లో వర్కవుట్స్ చేస్తూ దానికి సంబంధించిన వీడియోలు షేర్ చేసే సీనియర్ నటి ప్రగతి తాజాగా 'ఊ అంటావా మావా..' సాంగ్‌కు తనదైన స్టైల్లో డ్యాన్స్ చేసింది. అది కూడా జిమ్‌లోనే స్టెప్పులేయడం విశేషం. ఈ వీడియోను ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయగా అది కాస్తా హల్చల్ అవుతోంది. -
‘నాగిని’పాటకు ప్రగతి ఊరమాస్ స్టెప్పులు.. వీడియో వైరల్
టాలీవుడ్లో ‘గ్లామరస్ మదర్’అనగానే అందరికి టకీమని గుర్తొచ్చే ఏకైక పేరు ప్రగతి. తనదైన సహజ నటనతో అమ్మ, తల్లి, భార్య పాత్రలకు వన్నెతెచ్చింది. ఇటీవల సినిమాల్లో ఎక్కువ కనిపించకున్నా.. సోషల్ మీడియా ద్వారా మాత్రం ఎప్పుడూ అభిమానులతో టచ్‌లోనే ఉంటుంది. ఫిట్‌నెస్‌కు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే ప్రగతి.. వాటికి సంబంధించిన ఫోటోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటుంది. ఆమె షేర్ చేసే వర్కౌట్ వీడియోలు వైరల్ అయిన సందర్భాలు చాలానే ఉన్నాయి. (చదవండి: ‘రారా సామి’అంటూ రష్మిక స్టెప్పులు.. వీడియో వైరల్) తాజాగా ఆమె నాగిని సాంగ్‌కి స్టెప్పులేసింది. జిమ్ సెంటర్‌కి వెళ్లిన ప్రగతి.. అక్కడ ‘నాగిని’సాంగ్‌కి ఊరమాస్ స్టెప్పులేసి అందరిని అలరించింది. దానికి సంబంధించిన వీడియోని తన ఇన్‌స్టా ఖాతాలో షేర్ చేస్తూ.. ‘నేను చేసే ప్రతి పనిలో ఆనందాన్ని సృష్టిస్తాను’అని క్యాప్షన్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. View this post on Instagram A post shared by Pragathi Mahavadi (@pragstrong) -
ఆస్ట్రేలియా నుంచి నిత్యం వీడియో కాల్స్.. నగ్న వీడియోలు, ఫొటోలతో
మహేశ్వరం: కాబోయే భార్య అశ్లీల వీడియోలు, ఫొటోలు తీసి బ్లాక్ మెయిల్‌కు పాల్పడి ఆమె ఆత్మహత్యకు కారకుడైన కీచకుడిని పోలీసులు అరెస్టు చేశారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం అమీర్‌పేట్ గ్రామానికి చెందిన జుట్టు రామ్ కార్తీక్ అలియాస్ రమేశ్ ఆస్ట్రేలియాలో ఉద్యోగం చేసేవాడు. కార్తీక్‌కు మహేశ్వరం మండలం పెండ్యాల గ్రామానికి చెందిన ప్రగతితో ఏడాది కిందట వివాహం నిశ్చయమైంది. అప్పటి నుంచి రామ్ కార్తీక్ ఆస్ట్రేలియా నుంచి నిత్యం ప్రగతితో వీడియో కాల్స్, వాట్సాప్ ద్వారా మాట్లాడేవాడు. ఈ సందర్భంగా ఫోన్లో ప్రగతి నగ్న వీడియోలు, ఫొటోలను రికార్డు చేశాడు. ఆరు నెలల కిందట కార్తీక్ స్వగ్రామానికి వచ్చాడు. ఇక్కడికి వచ్చాక కూడా ప్రగతితో చనువుగా తిరిగాడు. కొంతకాలం తర్వాత తన అసలు స్వరూపం బయటపెట్టిన కార్తీక్.. పెళ్లికి బంగారం, నగదుతో పాటు ప్లాట్, భూమి ఇవ్వాలని ప్రగతి, ఆమె తల్లిపై పలుమార్లు ఒత్తిడి తెచ్చాడు. తాను ఆస్ట్రేలియాలో ఉద్యోగం చేస్తున్నానని.. వేరే సంబంధమైతే ఇంతకన్నా అధిక కట్నం ఇచ్చేవారని, తాను అడిగినన్ని కట్నకానుకలు ఇస్తేనే పెళ్లి చేసుకుంటానని లేకపోతే ప్రగతి అశ్లీల వీడియోలు, ఫొటోలను బయటపెడతానని బ్లాక్ మెయిల్ చేసేవాడు. చదవండి: (‘సల్మా! నన్ను క్షమించు.. మీకు ఏమీ చేయలేకపోయా') ఇదిలా ఉండగా అక్టోబర్ 21న నిశ్చితార్థం ఉండగా, 17వ తేదీన పెద్దల మధ్య కట్నకానుల విషయంలో గొడవ జరగడంతో సంబంధాన్ని రద్దు చేసుకున్నారు. దీంతో కార్తీక్ తన ఫొటోలు, వీడియోలు బయటపెడితే జీవితం నాశనం అవుతుందని భావించిన ప్రగతి అక్టోబర్ 18న అర్ధరాత్రి ఇంట్లో ప్యాన్‌కు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తులో భాగంగా ప్రగతి, రామ్ కార్తీక్‌ల సెల్ఫోన్లను స్వాధీనం చేసుకుని వాటిని పరిశీలించగా ఫొటోలు, వీడియోలు, కార్తీక్ బ్లాక్మెయిల్ విషయం వెలుగు చూసింది. ప్రగతి ఆత్మహత్యకు రామ్ బ్లాక్ మెయిల్ కారణమని నిర్ధారించిన పోలీసులు బుధవారం అతడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. -
Actress Pragathi: మాస్ స్టెప్పులతో అదరగొట్టిన నటి ప్రగతి
నటి ప్రగతి సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుందన్న సంగతి తెలిసిందే. ఎప్పటికప్పుడు అప్డేట్స్ని షేర్ చేస్తూ ఫ్యాన్స్‌తో టచ్‌లో ఉంటుంది. లాక్డౌన్లో ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టిన ప్రగతి అప్పటి నుంచి తరచూ ఫిటినెస్ సహా పలు వీడియోలను అభిమానులతో పంచుకునేది. తాజాగా ఇంటర్నేషనల్ డ్యాన్స్ డే సందర్భంగా తన స్నేహితురాలితో కలిసి పాపులర్ 'ఫేమస్ డ్రీమమ్ వేకపమ్' అనే సాంగ్‌కు చిందేసింది. చీరకట్టులో మాస్ స్టెప్పులతో ఇంటర్నెట్ను షేక్ చేసింది. ఈ వీడియోను ప్రగతి తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయగా కొద్ది గంటల్లోనే వీడియో వైరల్‌గా మారింది. ఈ ఏజ్‌లో కూడా ఫిట్‌గా ఉంటూ ఎంతో ఎనర్జీగా డ్యాన్స్ చేశారంటూ పలువురు నెటిజన్లు ఈ నటి డ్యాన్స్‌కు ఫిదా అవుతున్నారు. గతంలోనూ బొంబాయి చిత్రంలోని ‘హమ్మ.. హమ్మ..’ పాటకు డ్యాన్స్ చేసిన వీడియోను పోస్టు చేసి అందరిని ఆకట్టుకుంది. ఆ తర్వాత వరుసగా మాస్ పాటలకు స్టెప్పులేసిన వీడియోలను షేర్ చేస్తు అందరి చూపు తనవైపుకు తిప్పుకుంటోంది ప్రగతి. ఇటీవల విజయ్ నటించిన మాస్టర్ మూవీ సాంగ్‌కు తన కుమారుడితో కలిసి లుంగితో తీన్మార్ స్టెప్పులేసింది. View this post on Instagram A post shared by Pragathi Mahavadi (@pragstrong) చదవండి : కూతురిని ఆటపట్టించిన ప్రగతి, వీడియో వైరల్ గుడ్డు ఎలా ఉడకబెట్టాలో కూడా తెలియదు: హీరోయిన్ -
కూతురిని ఆటపట్టించిన ప్రగతి, వీడియో వైరల్
టాలీవుడ్ టాలెంటెడ్ నటీనటులలో సీనియర్ నటి ప్రగతి ఒకరు. హీరోహీరోయిన్లకు తల్లిగా నటిస్తు హోమ్లీ లుక్‌తో ఆ పాత్రల్లో ఒదిగిపోయే ప్రగతి లాక్డౌన్లో తన డ్యాన్స్ వీడియోలు షేర్ చేసి అభిమానులను ఆశ్చర్యపరిచింది. అప్పటి నుంచి వరుసగా వీడియోలు షేర్ చేస్తూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటున్నారు. ఈ క్రమంలో తాజాగా ప్రగతి తన కూతురిని ఆటపట్టించిన ఓ వీడియోను షేర్ చేసింది. ఇందులో తన కూతురిని సిల్క్ పదాన్ని ఐదుసార్లు చెప్పమనడంతో ఆమె వెంటనే ఐదు సార్లు చెప్పింది. ఆ తర్వాత స్కిల్ స్పెల్లింగ్ చెప్పమని అడగ్గా.. వెంటనే తడబడకుండా అలవోకగా చెప్పేసింది. ఇక చివరగా ఆవు ఏం తాగుతుందని అడగ్గానే ఆమె కూతురు మిల్క్ అంటూ సమాధానం ఇచ్చి పప్పులో కాలేసింది. కూతురి సమాధానం విని ప్రగతి ఒక్కసారిగా గట్టిగా నవ్వేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియా వైరల్ అవుతోంది. దీనికి నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. కాగా లాక్డౌన్లో ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టిన ప్రగతి అప్పటి నుంచి తరచూ వ్యాయమం వీడియోలను అభిమానులతో పంచుకునేది. ఈ క్రమంలో ముంబాయి చిత్రంలోని హమ్మ.. హమ్మ.. పాటకు డ్యాన్స్ చేసిన వీడియోను పోస్టు చేసి అందరిని ఆకట్టుకుంది. ఆ తర్వాత వరుసగా మాస్ పాటలకు స్టేప్పులేసిన వీడియోలను షేర్ చేస్తు అందరి చూపు తనవైపుకు తిప్పుకుంటోంది. ఇటీవల దళపతి విజయ్ నటించిన మాస్టర్ మూవీ సాంగ్‌కు తన కుమారుడికి పోటిగా లుంగితో తీన్మార్ స్టేప్పులేసింది. View this post on Instagram A post shared by Pragathi Mahavadi (@pragstrong) -
'టాప్' లేపిన రాశీ, ఆడేసుకున్న ప్రగతి
♦ 'టాప్' లేపేసిన రాశీ ఖన్నా ♦ ప్రేమకు అర్థం చెప్తోన్న సోనాల్ చౌహాన్ ♦ రోడ్డు మీద పడ్డ మాస్కును వీడియో తీసిన రెజీనా ♦ కూతురిని ఓ ఆటాడేసుకున్న ప్రగతి ♦ హ్యాపీ సోల్ అంటోన్న మిషా నారంగ్ ♦ అభిమానులతో చిత్ర శుక్లా సెల్ఫీ ♦ చుడీదార్లో ప్రియాంక అరుళ్ మోహన్] ♦ సెట్స్‌లో నవ్వులు చిందిస్తోన్న తాప్సీ ♦ ఎల్లో డ్రెస్‌లో ఫుల్ హ్యాపీ అంటోన్న పూనమ్ కౌర్ View this post on Instagram A post shared by Raashii Khanna (@raashiikhanna) View this post on Instagram A post shared by Sonal Chauhan (@sonalchauhan) View this post on Instagram A post shared by Regina Cassandra (@reginaacassandraa) View this post on Instagram A post shared by Pragathi Mahavadi (@pragstrong) View this post on Instagram A post shared by Misha Narang (@misha_narang) View this post on Instagram A post shared by Chitra Shukla (@chitrashuklaofficial) View this post on Instagram A post shared by Chitra Shukla (@chitrashuklaofficial) View this post on Instagram A post shared by Mannara❤️ (@memannara) View this post on Instagram A post shared by Priyanka Mohan (@priyankaamohanofficial) View this post on Instagram A post shared by Taapsee Pannu (@taapsee) View this post on Instagram A post shared by Poonam kaur (@puunamkhaur) View this post on Instagram A post shared by Poonam kaur (@puunamkhaur) -
పడిలేచిన ‘ప్రగతి’!
అవయవాలన్నీ బాగున్నప్పటికీ కష్టపడకుండా ఎవరో ఒకరి మీద ఆధారపడి జీవిస్తుంటారు కొందరు. రెండు చేతులు కోల్పోయిన ఓ అమ్మాయి మాత్రం ఎవరి మీదా ఆధారపడకుండా, తన పనులు తానే చేసుకుంటూ, ఖర్చులకోసం సొంతంగా సంపాదిస్తూ ఎందరికో ఆదర్శంగా నిలుస్తోంది. ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్‌కు చెందిన ప్రగతి దురదృష్ట వశాత్తు రెండు చేతులను కోల్పోయింది. 2010లో ప్రగతి అనుకోకుండా విద్యుత్ సరఫరా అవుతున్న వైర్‌ను పట్టుకోవడంతో..∙రెండు చేతులు కాలిపోయాయి. చికిత్సలో భాగంగా చేతులను మోచేయి వరకు డాక్టర్లు తొలగించారు. దీంతో తన రోజువారి పనులు చేసుకోవడానికి కూడా ప్రగతి చాలా కష్టపడేది. అయినా ఎలాగైనా ఎవరిసాయం తీసుకోకుండా బతకాలనుకుంది. క్రమంగా తన ఆత్మవిశ్వాసం పెంపొందించుకుని మొబైల్ ఫోన్, కంప్యూటర్లను ఆపరేట్ చేయడం నేర్చుకుంది. అంతేగాకుండా ఒకపక్క విద్యార్థులకు పాఠాలు చెబుతూ మరోపక్క బ్యాంక్ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతోంది. ‘‘ఎన్ని కష్టాలు ఎదురైనా అమ్మాయిలు తమ కలల్ని నిజం చేసుకోవడంలో వెనక్కి తగ్గకుండా కష్టపడి సాధించాలి’’ అని ప్రగతి చెప్పింది. మొదట్లో తన పనులు తాను చేసుకోవడానికి కూడా చాలా కష్టంగా ఉండేది. క్రమంగా పనులు చేసుకోవడం మొదలు పెట్టాను. అలా పనులు చేసుకోవడం వల్ల ఏదైనా చేయగలను అనిపించింది. ఈ క్రమంలోనే ఫోన్ ఆపరేట్ చేయగలిగాను. తల్లిదండ్రులకు భారం కాకూడదన్న ఉద్దేశ్యంతో టీచర్‌గా పనిచేస్తూ సంపాదిస్తున్నానని, భవిష్యత్తులో బ్యాంక్ ఉద్యోగం పొందడమే తన కలని ప్రగతి చెప్పింది. -
‘అందరికీ ఇళ్లు’లో అడ్డంకులొద్దు
న్యూఢిల్లీ: 2022కల్లా అందరికీ ఇళ్లు పథకం లక్ష్యా న్ని చేరుకోవడంలో ఎదురయ్యే అవాంతరాలను తొలగించాలని ఉన్నతాధికారులను ప్రధాని మోదీ ఆదేశించారు. కేంద్రంలో రెండోసారి ఎన్డీఏ సర్కార్ కొలువుదీరాక తొలి ‘ప్రగతి (ప్రో–యాక్టివ్ గవర్నెన్స్ అండ్ టైమ్లీ ఇంప్లిమెంటేషన్) సమీక్షా సమావేశం బుధవారం మోదీ అధ్యక్షతన ఢిల్లీలో జరిగింది. ఈ సమావేశంలో పీఎం ఆవాస్ యోజన(పట్టణ) పథకంలో ఎదురవుతున్న అవాంతరాలను ఎలా అధిగమించాలనే దానిపై సమీక్షించారు. ‘నీటి సంరక్షణపైన ప్రత్యేకంగా వానాకాలంలో తీసుకున్న చర్యలపైనా రాష్ట్రాలు పూర్తి సన్నద్ధతతో పనిచేయాలని ప్రధాని సూచించారు’ అని ఓ అధికారిక ప్రకటన పేర్కొంది. మోదీ ప్రధానిగా ఎన్డీఏ తొలి పాలన కాలంలో ఇలాంటి 29 ‘ప్రగతి’ సమావేశాలు నిర్వహించారు. ఈ సమావేశాల్లో రూ.12లక్షల కోట్ల విలువైన 257 ప్రాజెక్టుల పురోగతిని సమీక్షించారు. ప్రజా సమస్యలు, అందరికీ ఆరోగ్యబీమా పథకమైన ‘ఆయుష్మాన్ భారత్’ అంశాలపైనా సమీక్ష జరిగింది. -
కొత్త నటీనటులతో దండనై దూరమిల్‌లై
నూతన తారలు నటిస్తున్న చిత్రం దండనై దూరమిల్‌లై. నవ నటుడు ఎడిన్ హీరోగా పరిచయం అవుతూ రోడ్‌షో ఎంటర్టెయిన్మెంట్ పతాకంపై సొంతంగా నిర్మిస్తున్న చిత్రం దండనై దూరమిల్‌లై. ప్రగతి నాయకిగా నటిస్తున్న ఈ చిత్రంలో నిర్మల్, తామరై సెల్వన్, సుభాష్ మణికంళన్, ప్రియాంక, షర్మిళ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. దీంతోపాటు ఈ చిత్రానికి దర్శకత్వం, కూర్పు బాధ్యతలను సద్దాం హుస్సేన్ నిర్వహిస్తున్నారు. చిత్ర వివరాలను దర్శకుడు తెలుపుతూ ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్న ఐదుగురు యువకులు వాటి నుంచి బయట పడడానికి పని వెతుక్కుంటూ మలేషియా వెళతారన్నారు. అయితే అక్కడ అనుకోకుండా ఒక ముఠా చేతిలో చిక్కుకుని పలు కష్టాలు పడతారని.. వాటి నుంచి వారు బయట పడ్డారా? లేదా? అన్నది అత్యంత సహజత్వంతోనూ, అదే సమయంలో ఉత్కంఠభరితంగానూ తెరకెక్కిస్తున్నట్లు తెలిపారు. చిత్ర నేపథ్యం చాలా కొత్తగానూ, కథ, కథనాలు ఆసక్తిగానూ ఉంటాయని చెప్పారు. దండనై దూరమిల్‌లై చిత్రం ప్రేక్షకులు కచ్చితంగా కొత్త అనుభూతిని కలిగిస్తుందనే నమ్మకాన్ని దర్శకుడు వ్యక్తం చేశారు. -
ప్రగతే లక్ష్యం కావాలి
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం:ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నప్పుడు విద్య, క్రీడలు, సాంస్కృతికం, సాహిత్యం.. ఇలా వివిధ రంగాల్లో ఎంతోమంది మేరునగధీరులు జిల్లా పేరు ప్రతిష్టలను దేశవ్యాప్తం చేశారు. ఎన్నో విషయాల్లో ఘనమైన చరిత్ర గల ఈ జిల్లా.. అభివృద్ధి విషయంలో మాత్రం ఇప్పటికీ వెనుకబడే ఉంది. ఎన్నో ఆటంకాలు ఎదుర్కొంటోంది. ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. రాష్ట్ర విభజన జరిగింది. సార్వత్రిక ఎన్నికలు ముగిశాయి. పది నియోజకవర్గాల్లో ఏడింట తెలుగుదేశం విజయం సాధించింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి ముగ్గురు ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. పస్తుతం తొలి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ‘జిల్లాను ప్రగతి పథంలోకి తీసుకువెళ్లండి.. అసెంబ్లీలో మా వాణి గట్టిగా వినిపించండి..ఇక్కడి సమస్యలు ప్రభుత్వానికి విన్నవించండి..’ అని జిల్లా వాసులు శాసనసభ్యులకు వేడుకుం టున్నారు. ‘ముఖ్యమంత్రి సహా నేతలందరూ విశాఖ, విజయవాడ, తిరుపతి వంటి నగరాలపైనే దృష్టి సారిస్తున్నారు.. శ్రీకాకుళం లాంటి పట్టణాలనూ అభివృద్ధి చేసేలా వారిపై ఒత్తిడి తెండి’ అని కోరుతున్నారు. మంత్రి పదవి దక్కించుకున్న కింజరాపు అచ్చెన్నాయుడుపై మరింత బాధ్యత ఉందని అంటున్నారు. ఈ పనులు పూర్తి చేయించండి.. గత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జలయజ్ఞం కార్యక్రమంలో భాగంగా రెండు లక్షల ఎకరాలకు సాగు నీరందించే వంశధార రెండో దశ పనులు పెండింగ్‌లో ఉండిపోయాయి. 2009 తర్వాత వాటిని పట్టిం చుకోలేదు. సుమారు రూ.933 కోట్ల అంచనాతో ప్రారంభించిన ఈ ప్రాజెక్టు పూర్తయితే జిల్లా రైతుల కడగండ్లు చాలావరకు తీరతాయి. పలాస ప్రాంతంలో చేపట్టిన ఆఫ్‌షోర్ రిజర్వాయర్ నిర్మాణం పూర్తి చేయాల్సి ఉంది. నారాయణపురం కాలువ, తోటపల్లి రిజర్వాయర్ ఆధునికీకరణ పనులు పూర్తిచేయాల్సి ఉంది. వర్షాల సీజన్ వచ్చేసింది. వంశధార, నాగావళి నదీ తీర ప్రాంతాల్లోని గ్రామాలకు వరద ముప్పు పొంచి ఉంది. ఈ నదులకు ఇరువైపులా కరకట్టలు నిర్మించాలి. సీతంపేట, భామిని, కొత్తూరు, పాల కొండ, పాతపట్నం, సారవకోట, మెళియాపుట్టి, మందస వంటి ప్రాంతాలు జిల్లాలో గిరిజన, సరిహద్దు ప్రాంతాలుగా ఉన్నాయి. గిరిజన విశ్వవిద్యాలయం సహా ఉపాధి శిక్షణ కేంద్రాలు ఈ ప్రాంతాల్లో నెలకొల్పితే గిరిజనులకు ఉపయోగకరంగా ఉంటుంది. అలాగే మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేయాలి. పైడి భీమవరం, రాజాం, టెక్కలి ప్రాం తాల్లో పరిశ్రమలున్నాయి. అయినా జిల్లా వాసులకు లభిస్తున్న ఉపాధి అవకాశాలు అంతంతమాత్రమే. ఈ సమస్యను పరిష్కరించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. పవర్ హాలిడే తప్పించడంతోపాటు కొత్త పరిశ్రమల ఏర్పాటుకు తగిన సదుపాయాలు కల్పించాలి. జిల్లాలోని ఇసుక రీచ్‌లకు వేలం నిర్వహించకపోవటంతో అవి ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్లిపోయాయి. వందలాది ట్రాక్ట ర్ల ఇసుక అక్రమ మార్గాల్లో తరలిపోతోంది. ఫలితంగా ప్రభుత్వ ఆదాయానికి లక్షలాది రూపాయల మేర గండి పడుతోంది. ఈ దందాకు అడ్డుకట్ట వేయాలి. జిల్లాలో సుమారు 176 కి.మీ పొడవున తీర ప్రాంతం ఉంది. భావనపాడులో హార్బ ర్ నిర్మిస్తామన్న హామీ ఇంతవరకు నెరవేరలేదు. కళింగపట్నం, శాలిహుండం, దంతవరపుకోట, బారువ వంటి ప్రాంతాల్లో పర్యాటకాభివృద్ధి వెనకబడిపోయింది. పేరుగాంచిన ఉద్దానం కొబ్బరి పంటకు ప్రోత్సాహం కరువైంది. ఈ ప్రాంతంలో కాయిర్ పరిశ్రమ ఏర్పాటైతే ఎంతోమందికి ఉపాధి లభిస్తుంది. రక్షిత తాగునీటి కోసం ఉద్దాన ప్రాంత వాసులు ఎంతో కష్టపడుతున్నారు. ఈ ప్రాంతంలోని కిడ్నీ వ్యాధిగ్రస్తు ల్ని ఆదుకునేందుకు డయాలిసిస్ సెంటర్ ఏర్పాటు ప్రస్తుత పరిస్థితుల్లో అత్యవసరం. నాగావళి నదిపై వీరఘట్టం మండలం కిమ్మి, వంగర మండలం రుషింగి గ్రామాల మధ్య, శ్రీకాకుళం పొన్నాడ వద్ద, శ్రీకాకుళంలోని పాత వంతెన వద్ద కొత్త బ్రిడ్జి నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాల్సి ఉంది. జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆస్పత్రిలో నెల కొన్న సమస్యల కారణంగా రోగులు అవస్థలు పడుతున్నారు. మెరుగైన వైద్యం ఇక్కడ ఎండమావే. వైద్యులు స్థానికంగా ఉండడం లేదన్న ఆరోపణలున్నాయి. ప్రతి ఇంటికీ ఉద్యోగం అన్న టీడీపీ హామీ నెరవేరేలా చూడాలి. ప్రతి మండలంలోనూ మినీ స్టేడియం నిర్మించాల్సి ఉంది. జిల్లా కేంద్రంలోని కోడి రామ్మూర్తి స్టేడియాన్ని అభివృద్ధి చేయాలి. -
విద్యార్థుల ‘ప్రగతి’ కోసం...
షాబాద్, న్యూస్‌లైన్ : విద్యార్థుల ‘ప్రగతి’ కోసం విద్యాశాఖ సరికొత్త విధానానికి శ్రీకారం చుట్టింది. ఇప్పటివరకూ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు సంబంధించిన ప్రగతి వివరాలను ఏడాదికి ఒక సారి మాత్రమే నమోదు చేసేవారు. ప్రస్తుతం అమలు చేస్తున్న ప్రగతి కార్డుల్లో సంవత్సరంలో విద్యార్థులు సాధించిన వివరాలతో పాటు వరుసగా ఐదేళ్లకు సంబంధించిన ప్రగతిని ఒకే కార్డులో నమోదు చేయొచ్చు. ‘జవహర్ బాల ఆరోగ్య రక్ష’ పేరుతో ‘బాల్యానికి భరోసా... బాల ఆరోగ్య రక్ష’ నినాదంతో ఈ కార్డులను అందుబాటులోకి తెచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తున్న ఈ ప్రగతి కార్డులు జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలకు చేరాయి. గతంలో విద్యార్థుల మార్కుల వివరాలను మాత్రమే అందించేవారు. ప్రస్తుత విధానంలో వాటితో పాటు ఆరోగ్య వివరాలు, సాధించిన నైపుణ్యం, కంప్యూటర్, వ్యాయామ, సాంస్కృతిక అంశాల్లో సాధించిన ప్రగతి, విద్యార్థి రక్తం గ్రూపు, ఎత్తు, బరువు తదితర అంశాలను పొందుపరుస్తారు. విద్యాశాఖ అమలు చేస్తున్న ప్రగతి కార్డుల్లో విద్యార్థికి సంబంధించిన వివిధ అంశాలను తల్లిదండ్రులు క్షుణ్ణంగా గమనించే వీలు కలుగుతుంది. గ్రేడింగ్ పద్ధతి... విద్యార్థులు సాధించిన మార్కుల ఆధారంగా గ్రేడింగ్‌ను ఇచ్చే పద్ధతిని విద్యాశాఖ అమలు చేస్తోంది. 91 నుంచి 100మార్కులు సాధించిన విద్యార్థి అత్యున్నత ప్రతిభ కనబర్చినట్లుగా ఏ ప్లస్ గ్రేడు ఇస్తారు. 71 నుంచి 90మార్కులు సాధించిన విద్యార్థికి ఏ గ్రేడు కేటాయిస్తారు. 51 నుంచి 70మార్కులు సాధించిన విద్యార్థికి ఇంకా కృషి చేయాలంటూ బీ ప్లస్ గ్రేడును ఇస్తారు. 41 నుంచి 50మార్కులు సాధించిన విద్యార్థికి బీగ్రేడు ఇస్తారు. 0 నుంచి 40మార్కులు సాధించిన విద్యార్థికి నామామాత్రపు చదువుగా భావించి సీ గ్రేడు ఇస్తారు. ఉపాధ్యాయులు ఏం చేయాలంటే... {పతి సంవత్సరం విద్యార్థులకు సంబంధించి సంగ్రహాత్మక, నిర్మాణాత్మక మూల్యాంకనాలు నిర్వహించి విద్యార్థిస్థాయి వివరాలను కార్డుల్లో నమోదు చేయాలి. {పగతి కార్డులను తల్లిదండ్రులకు పంపి వారి సంతకాలతో పాటు సూచనలు, సలహాలు సేకరించాలి. విద్యార్థుల ప్రగతిపై సమీక్షలు నిర్వహించి తల్లిదండ్రులు, పాఠశాల కమిటీ సమక్షంలో సమావేశాలు నిర్వహించాలి. విద్యార్థులు వెనుకబడిన విషయాలను గుర్తించి మెరుగుపర్చుకోవాలి. విద్యార్థి పాఠశాలను వీడుతున్నా లేదా మారుతున్న సమయంలో కార్డు చివరన ఉన్న ధృవీకరణ పత్రాన్ని విద్యార్థికి అందజేయాలి. కార్డుల్లో నమోదు చేయాల్సిన వివరాలు... నిరంతర మూల్యాంకనం ద్వారా ఒకటి నుంచి ఐదో తరగతి వరకు, ఆరు నుంచి ఎనిమిదో తరగతి వరకు విద్యార్థులు వివిధ అంశాల్లో సాధించిన ప్రగతిని ఉపాధ్యాయులు ప్రగతి కార్డుల్లో నమోదు చేయాలి. విద్యార్థి బడిలో చేరిన నాటి నుంచి బయటకు వెళ్లే వరకు విద్యార్థి ఫొటోతో పాటు చదువులో సాధించిన ప్రగతి, నైపుణ్యం, ఆరోగ్య వివరాలు, కంప్యూటర్, వ్యాయామ, సాంస్కృతిక అంశాల్లో సాధించిన ప్రగతిని పొందుపర్చాలి. విద్యార్థి రక్తం గ్రూపు, ఎత్తు, బరువు వివరాలను ఎప్పటికప్పుడు కార్డుల్లో నమోదు చేస్తుండాలి. తల్లిదండ్రులకు సమీక్షించుకునే అవకాశం... మండలంలోని అన్ని ప్రభుత్వ పాఠశాల లకు ప్రగతి కార్డులను సరఫరా చేశాం. వీటితో విద్యార్థికి సంబంధించిన విద్యా విషయాలు, ఆరోగ్య సమస్యలు, సాంస్కృతిక అంశాల్లో సాధించిన ప్రగతితో పాటు రక్తం గ్రూపు, ఎత్తు, బరువు లాంటి ప్రగతిని తల్లిదండ్రులు సమీక్షించుకునే అవకాశం లభిస్తుంది.-అంగూర్‌నాయక్, ఎంఈఓ, షాబాద్