ఒకప్పుడు హీరోయిన్‌గా చేసిన ప్రగతి తర్వాత అమ్మ పాత్రలు చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. అందానికి, ఆరోగ్యానికి పెద్ద పీట వేస్తూ ఆమె చేసే వర్కవుట్లు సోషల్ మీడియాలో ఎంత హల్‌చల్ చేస్తాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత విషయాలను పంచుకుంది.
'నేను పుట్టి పెరిగింది హైదరాబాద్‌లో. పదో తరగతి చదివేటప్పుడు చెన్నైకి షిఫ్ట్ అయ్యాం. సింగిల్ పేరెంట్‌గా అమ్మ పెంచింది. కొన్నిసార్లు ఇల్లు గడవడానికి కష్టమైనప్పుడు అమ్మ బంగారం కుదువ పెట్టేది. నేను సైకిల్ మీద వెళ్లి నెలనెలా వడ్డీ కట్టేదాన్ని. చెన్నైలో నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నప్పుడు రోజా మూవీ రిలీజైంది. అది చూశాక నేను మధుబాలలా ఉంటానని అందరూ అనేవారు. సరిగ్గా అదే సమయంలో సీనియర్ నటి సీఆర్ సరస్వతి నన్ను చూసి భాగ్యరాజాగారికి చెప్పారు. అలా ఆయన నన్ను హీరోయిన్‌గా తీసుకున్నారు. కానీ అప్పట్లో కొత్తగా వచ్చిన హీరోయిన్స్‌ను పెద్దగా పట్టించుకునేవారే కాదు.
కొందరి ప్రవర్తన వల్ల ఇబ్బందితో పాటు బాధేసింది. అందుకని హీరోయిన్‌గా చేయడం వద్దనుకున్నాను. అలా హీరోయిన్‌గా చాలా తక్కువ సినిమాలు చేశాను. తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా సెటిలయ్యాను. జిమ్‌కు వెళ్లేది అందం కోసం కాదు బలం కోసం! నేను ఎలా ఉన్నా అందగత్తెనే! నాకు సినిమాలు వస్తాయి' అని చెప్పుకొచ్చింది ప్రగతి.
చదవండి: గాడ్‌ఫాదర్ హిట్, కానీ ఆ సినిమా కంటే వెనుకంజ
నువ్వు కన్నింగ్.. యాంకర్ మాటకు షాకైన అర్జున్
Comments
Please login to add a commentAdd a comment