Actress Pragathi Interesting Comments In Latest Interview - Sakshi
Sakshi News home page

Actress Pragati: నన్ను అలా అనడంతో మేకప్‌ రూంకి వెళ్లి వెక్కి వెక్కి ఏడ్చాను: ప్రగతి

Published Tue, Oct 25 2022 9:46 AM | Last Updated on Wed, Oct 26 2022 7:42 AM

Actress Pragathi Interesting Comments in Latest Interview - Sakshi

నటి ప్రగతి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. సినిమాల్లో హీరోహీరోయిన్లకు అమ్మ పాత్రలు చేస్తూ నటిగా మంచి గుర్తింపు పొందింది. ఈ మధ్య తెరపై కంటే సోషల్‌ మీడియాలో ట్రోల్స్‌తో ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది. ఈ నేపథ్యంలో రీసెంట్‌గా ఓ టాక్‌ షోలో పాల్గొన్న ఆమె తన వ్యక్తిగత విషయాలను పంచుకుంది. అయితే మొదట హీరోయిన్‌గా నటించని ఆమె మదర్‌ రోల్స్‌ చెయడానికి కారణమెంటో తెలిపింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘ఒక హీరోతో రెయిన్ సీన్ చేయాలన్నారు. కాస్ట్యూమ్స్ విషయంలో నేను అభ్యంతరం చెప్పాను.

చదవండి: మరో కొత్త బిజినెస్‌లోకి మహేశ్‌? ఈసారి భార్య పేరు మీదుగా..!

ఆ సమయంలో ఆ హీరో చేసిన వ్యాఖ్యలు నాకు నచ్చలేదు. దాంతో ఆ పాట చేయకుండా వెళ్లిపోయాను. ఆ సంఘటనతో ఇకపై హీరోయిన్‌గా నటించొద్దని నిర్ణయించుకున్న. అందుకే తల్లి పాత్రలు, సీరియల్స్ చేసుకోవడం మొదలుపెట్టాను’ అని చెప్పుకొచ్చింది. అలాగే మొదటి సారి తాను తల్లి పాత్ర చేసినప్పుడు తనకు చేదు అనుభవం ఎదురైందని చెప్పంది.  ‘‘తొలిసారి నేను మదర్‌ రోల్‌ చేసినప్పుడు నా వయసు 24 ఏళ్లు అప్పుడు నాకు చాలా బాధ వేసింది. ఇక మేకప్‌ అయ్యాక సెట్‌కి వెళితే డైరెక్టర్‌ నన్ను చూసి ‘ఈవిడెంటి జడ వేసుకుని వచ్చింది. ముడి వేసుకుని రమ్మనండి’ అని అన్నారు.

చదవండి: ‘ఓరి దేవుడా’కు వెంకి షాకింగ్‌ రెమ్యునరేషన్‌!, 15 నిమిషాలకే అన్ని కోట్లా?

ఆ మాటలు నన్ను చాలా బాధించాయి. ఎందుకంటే అప్పటికే నేను కొన్ని సినిమాల్లో హీరోయిన్‌గా చేశాను. నా వయసు ఉన్న హీరోయిన్స్‌కి నేను తల్లి పాత్రలు చేయాల్సి వచ్చింది. అప్పటికే బాధలో ఉన్న నాకు డైరెక్టర్‌ మాటలు ఇంకా బాధించాయి. దీంతో మేకప్‌ రూంకు వెళ్లి వెక్కి వెక్కి ఏడ్చాను. అయితే ఆ తర్వాత నుంచి మాత్రం తల్లి పాత్రలను గౌరవించడం మొదలు పెట్టాను. ఆ తరహా పాత్రలు వేయడానికి ఆలోచన చేయలేదు. ఆ రోజు నుంచి అవకాశాలు కావాలని నేను ఎవరి దగ్గర నోరు తెరిచి అడిగింది లేదు’’ అని పేర్కొంది. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement