
About Telugu Actress Pragathi: నటి, క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్రగతి.. తెలుగు ప్రేక్షకులకు బాగా సుపరిచితురాలు. సినిమాల్లో హీరోలకు తల్లి పాత్రలు పోషించి ఆమె బాగా గుర్తింపు పొందింది. ఇక ఈ మధ్య ఆమె సోషల్ మీడియాల్లో సైతం ఫుల్ యాక్టివ్‌గా ఉంటోంది. ట్రెండింగ్ పాటలకు స్టెప్పులేస్తూ ఆ వీడియోలను తన సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది. ఈక్రమంలో ఆమె వీపరితమైన ఫ్యాన్ ఫాలోయింగ్‌కు సంపాదించుకుంటోంది. ఈ రోజు(మార్చి 17) ఆమె బర్త్‌డే. ఈ సందర్భంగా ప్రగతి గురించిన కొన్ని ఆసక్తికర విషయాలను తెలుసుకుందాం.
ప్రగతి 1976 మార్చి 17న ఆంధ్రప్రదేశ్‌లోని ఒంగోలు జిల్లాలో జన్మించింది. నటనపై మక్కువతో మోడల్‌గా కెరీర్ స్టార్ట్ చేసిన ఆమె తమిళ నటుడు, దర్శకుడు భాగ్యరాజ్ సరసన హీరోయిన్‌గా నటించే చాన్స్ కొట్టేసింది. ‘వీట్ల విశేశాంగ’ మూవీతో ప్రగతి హీరోయిన్‌గా తమిళ సినీ పరిశ్రమలో అడుగు పెట్టింది. అదే సమయంలో ఆమె 7 తమిళ సినిమాలతో పాటు ఒక మలయాళ మూవీలో కూడా నటించింది. కెరీర్ సాఫీగా సాగుతున్న క్రమంలో ఆమె పెళ్లి చేసుకుంది. కొంతకాలం నటనకు బ్రేక్ ఇచ్చిన ఆమె ఆ తర్వాత మహేశ్ బాబు బాబీ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయం అయ్యింది.
ఇలా క్యారెక్టర్ అర్టిస్ట్‌గా తెలుగులో అడుగుపెట్టిన ఆమె హీరోలకు తల్లి పాత్రలకు పోషిస్తూ ఒదిగిపోయింది. ఈ క్రమంలో తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఇలా వరస ఆఫర్లు అందుకుంది ప్రగతి పరిశ్రమలో తల్లి పాత్రలకు పాపులరిటీని తెచ్చుకుంది. ఈ నేపథ్యంలో ఆమె తెలుగులో 100కు పైగా చిత్రాల్లో నటించింది. ఉత్తమ నటిగా రెండు నంది అవార్డులు కూడా అందుకుంది. ఇక తమిళంలో 23, మలయాళంలో 2 చిత్రాలు చేసిన ప్రగతి ఈ మూడు భాషల్లో పలు పలు సీరియల్స్‌లో కూడా నటించింది. ఇక రీసెంట్‌గా ‘సూపర్ మచ్చి’ సినిమాలో కనిపించిన ప్రగతి ప్రస్తుతం ‘ఎఫ్ 3’, ‘భోళా శంకర్’ చిత్రాలతో బిజీగా ఉంది. ప్రస్తుతం ఒంటరిగా ఉంటున్న ప్రగతికి ఒక కుమారుడు ఉన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment