
చెక్కు అందజేస్తున్న వేమిరెడ్డి దంపతులు
నెల్లూరు(సెంట్రల్): నెల్లూరులోని ప్రగతి చారిటీస్‌కు రాజ్యసభసభ్యుడు, వైఎస్సార్‌సీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, ప్రశాంతిరెడ్డి దంపతులు రూ.3 లక్షల విరాళాన్ని అందజేశారు. మంగళవారం నెల్లూరులోని తన స్వగృహంలో వేమిరెడ్డి చెక్కు ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 15 సంవత్సరాలుగా మానసిక వికలాంగులైన చిన్నారులకు చేయూతనివ్వడం తమకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తోందన్నారు.
విద్యార్థినికి అభినందన
పదో తరగతి ఫలితాల్లో 581 మార్కులు సాధించిన నెల్లూరు రూరల్ పరిధిలోని వీపీఆర్ విద్య విద్యార్థిని వైష్ణవిని రాజ్యసభసభ్యుడు, వీపీఆర్ ఫౌండేషన్ చైర్మన్ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, ఫౌండేషన్ చైర్‌పర్సన్ వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి మంగళవారం అభినందించారు. ఈ సందర్భంగా వేమిరెడ్డి మాట్లాడుతూ ప్రతిభ చూపిన అమ్మా యిని ఫౌండేషన్ ద్వారా చదివిస్తామన్నారు. తమ విద్యాసంస్థలో చదివి ప్రథమ స్థానంలో వచ్చిన వారి ఉన్నత చదువులకు ఫౌండేషన్ ద్వారా సహకారం అందిస్తామన్నారు. వైష్ణవి వారికి ధన్యవాదాలు తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment