Actress Pragathi: Shocking Comments On Casting Couch Details Inside - Sakshi
Sakshi News home page

Actress Pragathi: స్టార్‌ హీరో తనతో గడిపితే చాన్స్‌ ఇస్తానన్నారు.. నటి ప్రగతి షాకింగ్‌ కామెంట్స్‌!

Published Fri, Feb 4 2022 9:00 AM | Last Updated on Sat, Feb 5 2022 7:44 AM

Actress Pragathi Shocking Comments On Casting Couch - Sakshi

క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటి ప్రగతి ఎంత పేరు ప్రఖ్యాతలు పొందిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తనదైన సహజ నటనతో అమ్మ, తల్లి, భార్య పాత్రలకు వన్నెతెచ్చింది.  ఇటీవల సినిమాల్లో ఎక్కువ కనిపించకున్నా.. సోషల్‌ మీడియా ద్వారా మాత్రం ఎప్పుడూ అభిమానులతో టచ్‌లోనే ఉంటుంది. ఫిట్నెస్‌కు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే ప్రగతి..వాటికి సంబంధించిన ఫోటోలను ఎప్పటికప్పుడు సోషల్‌ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటుంది. ఆమె షేర్‌ చేసే వర్కౌట్‌ వీడియోలు వైరల్‌ అయిన సందర్భాలు చాలానే ఉన్నాయి.

 

అలాగే అప్పుడప్పుడు ఆమె చేసే కొన్ని కామెంట్స్‌ కూడా నెట్టింట వైరల్‌ అవుతుంటాయి. ఏ విషయాన్ని అయినా కుండ బద్దలు కొట్టినట్లు చెప్పే ప్రగతి... ఓ ఇంటర్వ్యూలో క్యాస్టింగ్‌ కౌచ్‌ గురించి షాకింగ్‌ కామెంట్స్‌ చేసిందట. ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో అందరిలాగే తాను కూడా ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నానని, దర్శక, నిర్మాతలే కాకుండా.. ఓ స్టార్‌ హీరో కూడా తనతో గడిపితే సినిమాలో అవకాశం ఇస్తామని చెప్పినట్లు ఓ వార్త సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఎలాగోలా ఆ హీరో దగ్గరి నుంచి ప్రగతి తప్పించుకుందట. ఆ హీరో ఎవరనేది మాత్రం ఆమె సీక్రెట్‌గా ఉంచిందట. అయితే ఆమె ఏ ఇంటర్వ్యూలో ఈ కామెంట్స్‌ చేసిందో తెలియదు కానీ.. దానికి సంబంధించిన వార్తలు మాత్రం నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. గతంలో కూడా పలుమార్లు క్యాస్టింగ్‌ కౌచ్‌ గురించి ప్రగతి మాట్లాడిన సంగతి తెలిసిందే. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement