టాలీవుడ్ టాలెంటెడ్ నటీనటులలో సీనియర్ నటి ప్రగతి ఒకరు. హీరోహీరోయిన్లకు తల్లిగా నటిస్తు హోమ్లీ లుక్‌తో ఆ పాత్రల్లో ఒదిగిపోయే ప్రగతి లాక్‌డౌన్‌లో తన డ్యాన్స్ వీడియోలు షేర్ చేసి అభిమానులను ఆశ్చర్యపరిచింది. అప్పటి నుంచి వరుసగా వీడియోలు షేర్ చేస్తూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటున్నారు. ఈ క్రమంలో తాజాగా ప్రగతి తన కూతురిని ఆటపట్టించిన ఓ వీడియోను షేర్ చేసింది.
ఇందులో తన కూతురిని సిల్క్ పదాన్ని ఐదుసార్లు చెప్పమనడంతో ఆమె వెంటనే ఐదు సార్లు చెప్పింది. ఆ తర్వాత స్కిల్ స్పెల్లింగ్ చెప్పమని అడగ్గా.. వెంటనే తడబడకుండా అలవోకగా చెప్పేసింది. ఇక చివరగా ఆవు ఏం తాగుతుందని అడగ్గానే ఆమె కూతురు మిల్క్ అంటూ సమాధానం ఇచ్చి పప్పులో కాలేసింది. కూతురి సమాధానం విని ప్రగతి ఒక్కసారిగా గట్టిగా నవ్వేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియా వైరల్ అవుతోంది. దీనికి నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు.
కాగా లాక్‌డౌన్‌లో ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టిన ప్రగతి అప్పటి నుంచి తరచూ వ్యాయమం వీడియోలను అభిమానులతో పంచుకునేది. ఈ క్రమంలో ముంబాయి చిత్రంలోని హమ్మ.. హమ్మ.. పాటకు డ్యాన్స్ చేసిన వీడియోను పోస్టు చేసి అందరిని ఆకట్టుకుంది. ఆ తర్వాత వరుసగా మాస్ పాటలకు స్టేప్పులేసిన వీడియోలను షేర్ చేస్తు అందరి చూపు తనవైపుకు తిప్పుకుంటోంది. ఇటీవల దళపతి విజయ్ నటించిన మాస్టర్ మూవీ సాంగ్‌కు తన కుమారుడికి పోటిగా లుంగితో తీన్మార్ స్టేప్పులేసింది.
Comments
Please login to add a commentAdd a comment