కొత్త నటీనటులతో దండనై దూరమిల్‌లై | All new actors in Dandanai duramillai | Sakshi
Sakshi News home page

కొత్త నటీనటులతో దండనై దూరమిల్‌లై

Published Sat, Nov 5 2016 1:31 AM | Last Updated on Mon, Sep 4 2017 7:11 PM

కొత్త నటీనటులతో దండనై దూరమిల్‌లై

కొత్త నటీనటులతో దండనై దూరమిల్‌లై

నూతన తారలు నటిస్తున్న చిత్రం దండనై దూరమిల్‌లై.  నవ నటుడు ఎడిన్ హీరోగా పరిచయం అవుతూ రోడ్‌షో ఎంటర్‌టెయిన్‌మెంట్ పతాకంపై సొంతంగా నిర్మిస్తున్న చిత్రం దండనై దూరమిల్‌లై. ప్రగతి నాయకిగా నటిస్తున్న ఈ చిత్రంలో నిర్మల్, తామరై సెల్వన్, సుభాష్ మణికంళన్, ప్రియాంక, షర్మిళ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. దీంతోపాటు ఈ చిత్రానికి దర్శకత్వం, కూర్పు బాధ్యతలను సద్దాం హుస్సేన్ నిర్వహిస్తున్నారు.

చిత్ర వివరాలను దర్శకుడు తెలుపుతూ ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్న ఐదుగురు యువకులు వాటి నుంచి బయట పడడానికి పని వెతుక్కుంటూ మలేషియా వెళతారన్నారు. అయితే అక్కడ అనుకోకుండా ఒక ముఠా చేతిలో చిక్కుకుని పలు కష్టాలు పడతారని..  వాటి నుంచి వారు బయట పడ్డారా? లేదా? అన్నది అత్యంత సహజత్వంతోనూ, అదే సమయంలో ఉత్కంఠభరితంగానూ తెరకెక్కిస్తున్నట్లు తెలిపారు. చిత్ర నేపథ్యం చాలా కొత్తగానూ, కథ, కథనాలు ఆసక్తిగానూ ఉంటాయని చెప్పారు. దండనై దూరమిల్‌లై చిత్రం ప్రేక్షకులు కచ్చితంగా కొత్త అనుభూతిని కలిగిస్తుందనే నమ్మకాన్ని దర్శకుడు వ్యక్తం చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement