Puneeth Rajkumar Workout Video: పునీత్ రాజ్‌కుమార్ ఫిజికల్‌గా చాలా ఫిట్‌గా ఉంటారు. ఇలాంటి వయసులో, ఇంత ఫిట్‌గా ఉన్నవారికి గుండెపోటు రావడం కొంత విస్మయం, మరికొంత ఆందోళన కలిగించే అంశమే.
రాజ్‌కుమార్ చివరిరోజుల వరకు యోగా, వ్యాయామం చేస్తూ వచ్చారు. అలాగే పునీత్ కూడా దేహ దారుఢ్యం, ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యత ఇచ్చారు. మంచి ఫిజిక్‌ను సాధించాలనే ఆసక్తే ఆయన్ను పూర్తి స్థాయి ఫిట్‌నెస్ లవర్‌గా మార్చింది. జిమ్ వర్కవుట్‌తో పాటు క్రాస్ ఫిట్, మార్షల్ ఆర్ట్స్, యోగా వంటివి కూడా ప్రతిరోజూ తప్పనిసరిగా సాధన చేసేవారు. తరచుగా తన వర్కవుట్ వీడియోలను అభిమానులతో పంచుకునేవారు.
(చదవండి: పునీత్ కుటుంబాన్ని వెంటాడుతున్న ‘గుండె పోటు’!)
పునీత్ కఠినమైన వ్యాయామ విన్యాసాలు సంభ్రమాశ్చర్యాలకు గురి చేసేవి. లాక్‌డౌన్ టైమ్‌లో వీలైనన్ని వ్యాయామాలు చేసినా 2 నుంచి 3 కిలోలు బరువు పెరిగానని, లాక్‌డౌన్ ఎత్తేయగానే తిరిగి షేప్ సాధించడం కోసం ఎదురు చూస్తున్నానని పునీత్ ఆ మధ్య అన్నారు. ఆయన ఫిట్‌నెస్ ప్రియత్వానికి ఓ ఉదాహరణ ఇది. వర్కవుట్ చేయని రోజు అంటే తన దృష్టిలో అది వృథా అయిన రోజు అనే పునీత్.. ఏ ఫిట్‌నెస్ మీద ఇష్టంతో గంటల పాటు జిమ్‌లో గడిపారో అదే జిమ్‌లో గుండెపోటుకు గురి కావడం విషాదం. ఈ నేపథ్యంలో రాజ్‌కుమార్ కుటుంబానికి వ్యాయామశాల కలసి రాలేదనే చర్చ సాగుతోంది. గతంలో పునీత్ రెండో సోదరుడు రాఘవేంద్ర జిమ్ చేస్తుండగా పక్షవాతం వచ్చింది. అలాగే గతంలో శివ రాజ్‌కుమార్ కూడా జిమ్‌లో కసరత్తులు చేస్తుండగా అస్వస్థతకు గురయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment