Kriti Sanon Turns Entrepreneur, Launches 'The Tribe' Fitness Startup - Sakshi
Sakshi News home page

The Tribe: వ్యాపారవేత్తగా మారిన స్టార్ హీరోయిన్‌.. రకుల్‌కు పోటీగా

Published Wed, May 25 2022 12:39 PM | Last Updated on Wed, May 25 2022 1:03 PM

Kriti Sanon Turns Entrepreneur Launches The Tribe Fitness Startup - Sakshi

Kriti Sanon Turns Entrepreneur Launches The Tribe Fitness Startup: హీరోయిన్లు కేవలం గ్లామర్‌ రోల్స్‌కే పరిమితం కాకుండా కథానాయిక ప్రాధాన్యత ఉ‍న్న పాత్రలు చేస్తుంటారు. అలాగే తమలోని సింగర్‌ వంటి వివిధ కళలను బయటపెడుతుంటారు. హీరోయిన్లు ఓ పక్క నటిస్తూనే మరోపక్క నిర్మాతలుగా కూడా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. అంతేకాకుండా మంచి ఫామ్‌లో ఉన్నప్పుడే పలు వ్యాపార రంగాల్లో కూడా సక్సేస్‌ అయ్యేందుకు కృషి చేస్తున్నారు మన కథానాయికలు. ఇలా బిజినెస్‌లోనే కాకుండా ఫిట్‌నెస్‌ రంగంలోకి దిగుతున్నారు ఫిట్‌నెస్‌ బ్యూటీలు. ఇప్పటికే కూల్‌ బ్యూటీ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కు ఎఫ్‌ 45 పేరుతో హైదరబాద్‌తోపాటు వైజాగ్‌లో జిమ్‌లు ఉన్న విషయం తెలిసిందే. .

ప్రస్తుతం ఈ ఫిట్‌నెస్‌ బ్యూటీకి మరో బ్యూటీ పోటీ రానుంది. ఆ భామ ఇంకెవరో కాదు.. 'వన్‌ నేనొక్కడినే' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన కృతి సనన్‌. ది ట్రైబ్‌ అనే జిమ్‌ సెంటర్‌ను ప్రారంభిస్తున్నట్లు సోషల్ మీడియా ద్వారా తెలిపింది ఈ ఫిట్‌నెస్‌గుమ్మ. '8 ఏళ్ల క్రితం నటిగా హిందీ చిత్ర పరిశ్రమలో నా ప్రయాణాన్ని ప్రారంభించాను. సరిగ్గా అదే రోజున ముగ్గురు సూపర్‌ టాలెంటెడ్‌ కో-ఫౌండర్లు అనుష్క నందానీ, కరణ్‌ సాహ్నీ, రాబిన్‌ బెహ్ల్‌లతో కలిసి ఒక వ్యాపారవేత్తగా ది ట్రైబ్‌ను లాంచ్‌ చేస్తున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది.' అని కృతి సనన్‌ ట్వీట్‌ చేసింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్‌ అయింది. దీనికి సంబంధించిన యాప్‌ను వచ్చే సంవత్సరం ప్రవేశపెట్టనుంది. తను నటించిన 'మిమి' సినిమాలో పాత్ర తన ఫిట్‌నెస్‌కు స్ఫూర్తినిచ్చిందని కృతి పేర్కొంది. 

చదవండి: 👇

పగిలిన గాజు ముక్కలతో డ్రెస్‌.. 20 కేజీల బరువు..

కొండపై నుంచి బైక్‌తో సహా దూకిన హీరో..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement