fitness center
-
స్టార్స్.. ఫిట్నెస్ ట్రైనర్స్..
ఆరోగ్యం కావాలనుకునే అందరికీ వ్యాయామం అవసరమే. అందుకోసం చాలా కసరత్తులు చేయాలి. దీంతో పాటు ఆహార నియమాలూ కఠినంగా ఉండాలి. సరైన న్యూట్రిషన్ తీసుకున్నప్పుడే సరైన వ్యాయామం చేయగలం. అయితే సినిమా తారలకు సంబంధించి వ్యాయామ అవసరాలు విభిన్నం. ఆరోగ్యంతో పాటు వారు పోషించే పాత్రలు వ్యాయామ శైలులను, అంతేకాదు వ్యాయామ శిక్షకులనూ నిర్ధేశిస్తాయి. అందుకే అందరికీ శిక్షణ ఇవ్వడం ఒక ఎత్తయితే.. సెలిబ్రిటీలకు శిక్షణ ఇవ్వడం మరో ఎత్తు అంటారు స్టార్ ట్రైనర్స్. ఈ నేపథ్యంలో నగరంలో సెలబ్రిటీ ట్రైనర్స్‌గా పేరొందిన కొందరి పరిచయం.. నగరంలోని సెలబ్రిటీ ట్రైనర్‌గా పేరొందిన వారిలో ముందు వరుసలో ఉంటారు కుల్దీప్ సేథ్.. జూబ్లీహిల్స్‌లో ఉన్న ఆయన జిమ్ ఎప్పుడు చూసినా సెలబ్రిటీల రాకపోకలతో కళకళలాడుతూ ఉంటుంది. మెగాస్టార్ చిరంజీవి దగ్గర నుంచి ‘చిరుత’నయుడైన రామ్ చరణ్ దాకా శిక్షణ ఇచ్చారాయన. విజయ్ దేవరకొండ, ఆర్ఎక్స్ 100 ఫేమ్ కార్తికేయ, అందాల ‘రాశి ఖన్నా’, రషి్మక.. తదితర తారలు ఎందరినో చెక్కిన శిల్పిగా పేరు తెచ్చుకున్నారు.సమంత..సత్తా.. అఖిల్‌కూ ఆయనే.. నటి సమంత తన ‘నాగిన్ మొబిలిటీ డ్యాన్స్’ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసినప్పుడు వర్కవుట్ వీడియో వైరల్ అయ్యింది. ఆమె వ్యక్తిగత శిక్షకుడు ఫిట్నెస్ ట్రైనర్ జునైద్ షేక్. అతని గురువు ముస్తఫా అహ్మద్‌ల ఆలోచనే ఇది. దేశంలోనే అత్యంత డిమాండ్ ఉన్న ఫిట్నెస్ ట్రైనర్లలో ఒకరైన జునైద్, స్పెషల్ వర్కవుట్ల రూపకల్పనకు ప్రసిద్ధి చెందారు. ఆయన క్లయింట్లలో అఖిల్ అక్కినేని, మోడల్–డిజైనర్ శిల్పా రెడ్డి మాత్రమే కాదు బాలీవుడ్ స్టార్స్ హృతిక్ రోషన్, రణ్వీర్ సింగ్ తదితరులు కూడా ఉన్నారు.ఎన్టీఆర్‌కూ లాయిడ్.. సినిమా అవసరాలను బట్టి ట్రైనర్స్‌ని మార్చడం స్టార్స్‌కు తప్పనిసరి. ఆర్ఆర్ఆర్ సినిమాలోని గిరిజన యోధుడిగా తన పాత్రకు తగిన టార్జాన్ లాంటి శరీరాకృతిని సాధించడానికి జూనియర్ ఎన్టీఆర్ సెలబ్రిటీ ఫిట్నెస్ కోచ్ లాయిడ్ స్టీవెన్స్‌నే ఎంచుకున్నాడు. అదే విధంగా తాజాగా రాజమౌళి సినిమా చేస్తున్న మహేష్ బాబు అందులోని పాత్రకు తగ్గట్టు తన రూపాన్ని మార్చుకోడానికి లాయిడ్ ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. గతంలో లాయిడ్ జాన్ అబ్రహం, రణ్వీర్ సింగ్ వంటి బాలీవుడ్ స్టార్స్‌కి శిక్షణ ఇచ్చారు.మహేష్‌కి మినాష్.. ఫిట్నెస్ ట్రైనర్ మినాష్ గాబ్రియేల్ గత ఐదేళ్లుగా మహేష్ బాబుతో కలిసి పని చేస్తున్నాడు. ‘ఒకరోజు స్ట్రెంగ్త్ ట్రైనింగ్, ఒకరోజు కార్డియో ఇలా షూట్ ముగిసిన తర్వాత రోజూ సాయంత్రం పూట శిక్షణ ఉంటుంది’ అని మినాష్ అంటున్నారు. ప్రతిరోజూ దాదాపు 60 నిమిషాల పాటు కఠినమైన కసరత్తులు చేసే మహేష్ సెట్లో, సెట్ వెలుపల కూడా ఒక పర్ఫెక్షనిస్ట్ అనీ, గాయాలతో పోరాడడం, వాటిని అధిగమించడం, అద్భుతమైన ఆకృతిని పొందడం..సాధ్యం. ప్రస్తుతం మహేష్ వయసు వెనక్కు వెళుతోంది’ అంటూ తన సూపర్‌స్టార్ స్టూడెంట్‌ని ప్రశంసిస్తారాయన.అనసూయ.. ఆర్జీవి.. అరవై ఏళ్లొచి్చనా ఇంకా ఫిట్‌గా కనిపించే దర్శకుడు రామ్‌గోపాల్ వర్మకు ఫిట్నెస్ శిక్షకునిగా పనిచేశారు విజయ్ గంధం. అలాగే యాంకర్, నటి అనసూయ, నాగేంద్రబాబు.. తదితరులకూ శిక్షణ అందించారు. ‘ఇప్పుడు నటీనటులకు మాత్రమే కాదు దర్శక నిర్మాతలకు సైతం ఫిట్నెస్ మీద పూర్తి అవగాహన, ఆసక్తి ఏర్పడింది. క్రమశిక్షణతో తమను తాము తీర్చిదిద్దుకుంటున్నారు’ అంటారు విజయ్ గంధం. గత కొంత కాలంగా అనేక అగ్రస్థాయి బ్రాండెడ్ జిమ్స్‌లో ట్రైనర్‌గా పనిచేసిన విజయ్.. టాలీవుడ్ తారలు మాత్రమే కాకుండా నగరంలో పలువురు వ్యాపార ప్రముఖులకూ ట్రైనర్‌గా పేరొందారు.వారి ఆసక్తినిబట్టే.. ‘తెరపై తారలు పోషించాల్సిన పాత్రలు, వారి ఇష్టాలు, శరీర తీరుతెన్నులకు అనుగుణంగా వర్కవుట్లను సృష్టించడానికి ఇష్టపడతాను, ఉదాహరణకు హీరో అఖిల్ అక్కినేని క్రీడా అభిమాని. క్రికెట్‌ను ఎక్కువగా ఇష్టపడతాడు. దీన్ని దృష్టిలో ఉంచుకుని, ఆయన వర్కవుట్లు చాలా వరకూ క్రీడల చుట్టూ డిజైన్ చేశా. అదే విధంగా కొందరికి సైక్లింగ్, బ్యాడ్మింటన్ అంటే చాలా ఇష్టం. నేను అలాంటి ఆసక్తులను దృష్టిలో పెట్టుకుని పని చేస్తాను. వ్యాయామం సరదాగా ఉండాలి తప్ప బాధపెట్టకూడదు. సమంత చూడడానికి సున్నితంగా కనిపిస్తుంది. కానీ వర్కవుట్ చేసే టైమ్‌లో బలమైన శక్తిగా మారుతుంది. అందుకే ఆమె నా ఫేవరెట్ క్లయింట్.’ – జునైద్ షేక్, ఫిట్నెస్ ట్రైనర్ -
ఫిట్నెస్ కోసం హోం జిమ్!
మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా సామాజిక మాధ్యమాల్లో వివిధ అంశాలపై స్పందిస్తూ నెటిజన్లకు ఆసక్తి కలిగిస్తుంటారు. ఫిజికల్ ఫిట్‌నెస్‌కు చాలామంది ప్రాధాన్యం ఇస్తారు. అందుకు జిమ్‌కు వెళ్లాలని అనుకుంటారు. కానీ ప్రత్యేకంగా జిమ్‌కు వెళ్లకుండా ఒకే పరికరంతో ఇంట్లోనే ఆ అనుభూతిని పొందుతూ ఫిట్‌గా ఉండొచ్చంటూ మహీంద్రా తెలిపారు. అందుకు సంబంధించి ఇటీవల ఆయన తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసిన ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. అరొలీప్ అనే సంస్థ ద్వారా ఈ పరికరాన్ని నలుగురు ఐఐటీ విద్యార్థులు తయారు చేసినట్లు మహీంద్రా తన ఎక్స్ ఖాతాలో తెలిపారు.Home gym created by 4 IIT grads. No rocket science here.But a clever convergence of mechanics & physical therapy principles to design a product that has global potential. In small apartments & even in Business Hotel rooms! Bravo! pic.twitter.com/Tz1vm1rIYN— anand mahindra (@anandmahindra) October 24, 2024ఇదీ చదవండి: ఏడేళ్ల తర్వాత రిలయన్స్ గుడ్‌న్యూస్‘ఈ హోమ్ జిమ్ పరికరాన్ని నలుగురు ఐఐటీ గ్రాడ్యుయేట్లు తయారు చేశారు. ఇదేమంతా రాకెట్ సైన్స్ కాదు. ఈ పరికరాన్ని చిన్న అపార్ట్మెంట్లు, హోటల్ రూమ్‌ల్లో, చిన్న ఇళ్లల్లోనూ వినియోగించేలా ఏర్పాటు చేశారు. మెకానిక్స్, ఫిజికల్ థెరపీను అనుసందానిస్తూ దీన్ని తయారు చేయడం నిజంగా గొప్ప విషయం’ అని మహీంద్రా ట్వీట్ చేశారు. ఈ కంపెనీలో స్టాక్ బ్రోకింగ్ సంస్థ జెరోధా సీఈవో నితిన్ కామత్ కూడా ఇన్వెస్ట్ చేసినట్లు వీడియో ద్వారా తెలిసింది. ఇందులో ఏఐ ఆధారిత ట్రెయినింగ్ సెషన్లు కూడా ఉన్నట్లు కంపెనీ తెలిపింది. -
జిమ్.. ఆరెంజ్ థీమ్..!
సాక్షి, సిటీబ్యూరో: ప్రత్యేకమైన ఆరెంజ్ థీమ్‌తో వినూత్నంగా అనిపించే ఆరెంజ్ థియరీ ఫిట్నెస్ ఇండియా.. నగరంలో తన సెంటర్‌ను నెలకొల్పింది. బంజారాహిల్స్ రోడ్ నెం–7లో ఏర్పాటైన ఈ ఫిట్నెస్ సెంటర్‌ను నగరవాసులకు అందుబాటులోకి తెచ్చినట్లు ఆదివారం బ్రాండ్ చీఫ్ ఎక్స్పీరియన్స్ ఆఫీసర్ దృష్టి చాబ్రియా తెలిపారు. దాదాపు 2,700 చదరపు అడుగులపైగా విస్తీర్ణంలో ఈ విశాలమైన అత్యాధునిక వ్యాయామ కేంద్రం నెలకొల్పామని, శాస్త్రీయ నేపథ్యం కలిగిన వర్కవుట్స్‌కి తమ బ్రాండ్ పేరొందిందని వివరించారు. మితిమీరిన శిక్షణ అవసరం లేకుండా తమ సభ్యులు ఫిట్నెస్ లక్ష్యాలు చేరుకునేలా తమ వర్కవుట్ రొటీన్ డిజైన్ చేశామన్నారు. అంతర్జాతీయ జీవన ప్రమాణాలకు నిలయమైన హైదరాబాద్‌లో స్థానికులకు నచ్చే వ్యక్తిగతీకరించిన వర్కవుట్ అనుభవాలను అందిస్తామన్నారు. -
వ్యాపారవేత్తగా మారిన స్టార్ హీరోయిన్.. రకుల్‌కు పోటీగా
Kriti Sanon Turns Entrepreneur Launches The Tribe Fitness Startup: హీరోయిన్లు కేవలం గ్లామర్ రోల్స్‌కే పరిమితం కాకుండా కథానాయిక ప్రాధాన్యత ఉన్న పాత్రలు చేస్తుంటారు. అలాగే తమలోని సింగర్ వంటి వివిధ కళలను బయటపెడుతుంటారు. హీరోయిన్లు ఓ పక్క నటిస్తూనే మరోపక్క నిర్మాతలుగా కూడా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. అంతేకాకుండా మంచి ఫామ్‌లో ఉన్నప్పుడే పలు వ్యాపార రంగాల్లో కూడా సక్సేస్ అయ్యేందుకు కృషి చేస్తున్నారు మన కథానాయికలు. ఇలా బిజినెస్‌లోనే కాకుండా ఫిట్నెస్ రంగంలోకి దిగుతున్నారు ఫిట్నెస్ బ్యూటీలు. ఇప్పటికే కూల్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్‌కు ఎఫ్ 45 పేరుతో హైదరబాద్‌తోపాటు వైజాగ్‌లో జిమ్‌లు ఉన్న విషయం తెలిసిందే. . ప్రస్తుతం ఈ ఫిట్నెస్ బ్యూటీకి మరో బ్యూటీ పోటీ రానుంది. ఆ భామ ఇంకెవరో కాదు.. 'వన్ నేనొక్కడినే' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన కృతి సనన్. ది ట్రైబ్ అనే జిమ్ సెంటర్‌ను ప్రారంభిస్తున్నట్లు సోషల్ మీడియా ద్వారా తెలిపింది ఈ ఫిట్నెస్గుమ్మ. '8 ఏళ్ల క్రితం నటిగా హిందీ చిత్ర పరిశ్రమలో నా ప్రయాణాన్ని ప్రారంభించాను. సరిగ్గా అదే రోజున ముగ్గురు సూపర్ టాలెంటెడ్ కో-ఫౌండర్లు అనుష్క నందానీ, కరణ్ సాహ్నీ, రాబిన్ బెహ్ల్‌లతో కలిసి ఒక వ్యాపారవేత్తగా ది ట్రైబ్‌ను లాంచ్ చేస్తున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది.' అని కృతి సనన్ ట్వీట్ చేసింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అయింది. దీనికి సంబంధించిన యాప్‌ను వచ్చే సంవత్సరం ప్రవేశపెట్టనుంది. తను నటించిన 'మిమి' సినిమాలో పాత్ర తన ఫిట్‌నెస్‌కు స్ఫూర్తినిచ్చిందని కృతి పేర్కొంది. చదవండి: 👇 పగిలిన గాజు ముక్కలతో డ్రెస్.. 20 కేజీల బరువు.. కొండపై నుంచి బైక్‌తో సహా దూకిన హీరో.. 8yrs ago, I started my journey as an actor in the hindi film industry! Today, exactly on the same day, I am thrilled to announce my journey as an Entrepreneur with my 3 super talented Co-founders Anushka Nandani, Karan Sawhney and Robin Behl as we launch “The Tribe”. #KeepMoving pic.twitter.com/EovBRSUlt2 — Kriti Sanon (@kritisanon) May 23, 2022 -
ఒక గంట వ్యవధిలో ఐదువేల కిలోగ్రాములు బరువుని ఎత్తి రికార్డు సృష్టించాడు
కెనడా: మీరు గంటలో ఎంత బరువును ఎత్తగలరో చెప్పగలరా అనంగానే ఆలోచనలో పడతాం. కానీ కెనడాకు చెందిన ఈ అథ్లెట్ కేవలం ఒక గంట వ్యవధిలో దాదాపు 13 వేల పౌండ్లు (5వేల కిలోగ్రాములు) బరువును ఎత్తి సరి కొత్త గిన్నిస్ వరల్డ్ రికార్డును నెలకొల్పాడు. విన్నిపెగ్‌కు చెందిన నోలన్ డి లియోన్ ఫిట్నెస్ సెంటర్లో ఒక గంట పాటు 70-పౌండ్ల కెటిల్‌బెల్‌ను ఉపయోగించి టర్కిష్ వ్యాయామాలు చేశాడు. (చదవండి: చూడటానికి పంది రూపు... కానీ అది దూడ) అయితే ఇది సగటు ఆఫ్రికన్ ఏనుగు బరువు కంటే 5,900 కిలోగ్రాములు ఎక్కువ. ఈ మేరకు డి లియోన్ మానసిక ఆరోగ్యంపై అవగాహన పెంచటమే కాక మానిటోబాలోని మూడ్ డిజార్డర్స్ అసోసియేషన్‌కు మద్దతు ఇవ్వడం కోసమే ఈ రికార్డ్ నెలకొల్పడానికి ప్రయత్నించానని చెప్పాడు. అంతేకాదు ఒక ఫోటోగ్రాఫర్, ఇద్దరు న్యాయమూర్తుల సమక్షంలో సెషన్ మొత్తం ప్రత్యక్ష ప్రసారం చేశారు. ఈ క్రమంలో అతను 184 వ్యాయామాలు పూర్తి చేశాడు. పైగా న్యాయనిర్ణేతలలో ఒకరు వైట్‌బోర్డ్‌పై ఒక్కో వ్యాయామాన్ని నమోదు చేస్తూనే ఉన్నారు. ఈ మేరకు డి లియోన్ మూడ్ డిజార్డర్స్ అసోసియేషన్ ఆఫ్ మానిటోబా కోసం సుమారు మూడు వేల డాలర్లుకు పైగా సేకరించారు. అంతేకాదు ఈ ఏడాది మేలో కెనడియన్ క్రిస్ కాక్స్ నెలకొల్పిన టర్కిష్ గెట్-అప్‌తో(బరువులు ఎత్తే వ్యాయమం) 4,868 కిలోలు భారీ బరువు ఎత్తి నెలకొల్పిన గిన్నిస్ వరల్డ్ రికార్డును కూడా అధిగమించడం విశేషం. అంతేకాదు దీనికి సంబంధించిన ఒక వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది. దీంతో నెటిజన్లు డి లియోన్‌ను ప్రశంసిస్తూ రకరకాలుగా ట్వీట్ చేశారు. (చదవండి: చనిపోయిన సోదరుడి అస్థిపంజరంతోనే కలిసి ఉంటున్న సోదరులు) -
Alia Farooq: 4 నెలల్లో 28 కేజీల బరువు తగ్గి.. ఇప్పుడు...
అనేక రంగాల్లో మహిళలు రాణిస్తూ మగవారితో పోటాపోటీగా దూసుకుపోతున్నారు. కానీ ప్రత్యేక ప్రతిపత్తి కలిగిన ప్రాంతాల్లోని మహిళలు అనేక కట్టుబాట్లు, నిబంధనల మధ్య నిర్భయంగా ఇంటి నుంచి బయటకు రావడమే కష్టం. అటువంటిది ఒకప్పుడు ప్రత్యేక రాష్ట్రంగా ఉన్న జమ్మూ కశ్మీర్లో ఎప్పుడూ ఉగ్రమూకల దాడులతో దద్దరిల్లుతూ అశాంతిగా ఉండేది. ఆర్టికల్ 370 రద్దు చేయడంతో.. అక్కడి పరిస్థితులు క్రమంగా మారుతున్నాయి. అయితే కశ్మీర్‌కు చెందిన ఆలియా ఫారుఖ్ ఎనిమిదేళ్ల కిందటే మూసపద్ధతులకు విభిన్నంగా ఆలోచించి, ఫిట్నెస్ను సరికొత్త కెరియర్‌గా మార్చుకుని మహిళా ఫిట్నెస్ ట్రైనర్‌గా రాణిస్తోంది. శ్రీనగర్‌లోని ఖన్యార్కు చెందిన ఆలియా ఇద్దరు పిల్లలకు తల్లి. పిల్లలు పుట్టిన తరువాత హార్మోన్లలో అసమతుల్యత ఏర్పడడంతో ఒక్కసారిగా అధికంగా బరువు పెరిగి, తన పనులు తానే సరిగా చేసుకోలేక నిరాశ, నిస్పృహలు ఆవహించాయి. సరిగ్గా అప్పుడే వెకేషన్లో భాగంగా ఆలియా కుటుంబం ఢిల్లీ వెళ్లింది. అక్కడ ఆలియా తల్లి ఆమెను డాక్టర్‌కు చూపించి ఆమె బరువు పెరగడం, నిరాశకు లోనవడం వంటి సమస్యల గురించి డాక్టర్‌కు చెప్పింది. Photo: Facebook డాక్టర్ జిమ్‌లో చేరి బరువు తగ్గమని సూచించడంతోపాటు ఢిల్లీలో.. పెళ్లి అయ్యి, పిల్లలున్న మహిళలు తమ శరీరాన్ని ఎంత ఫిట్‌గా ఉంచుకుంటున్నారో చూపిస్తూ కౌన్సెలింగ్ ఇచ్చారు. దాంతో ఆలియా ఎలాగైనా బరువు తగ్గాలనుకుంది. ఈ క్రమంలోనే భర్త ప్రోత్సాహంతో జిమ్‌లో చేరింది. కానీ మహిళలు ఎదుర్కొనే సమస్యలు, వారి శారీరక తత్వం గురించి పురుష ట్రైనర్లకు పెద్దగా అర్థం కాదు అనుకునేది. అలా అనుమానం ఉన్నప్పటికీ, ఎలాగైనా బరువు తగ్గాలన్న దృఢనిశ్చయంతో.. జిమ్‌లో చేరిన కేవలం నాలుగు నెలల్లోనే దాదాపు 28 కేజీల బరువు తగ్గింది. ఫిట్నెస్ సొల్యూషన్ ఆలియా భర్త 2010లో ఖన్యార్‌లో ‘ఫిట్నెస్ సొల్యూషన్ జిమ్’ పేరిట జిమ్‌ను ప్రారంభించాడు. కానీ దానిని సరిగా నిర్వహించలేకపోవడం చూసిన ఆలియా అతని జిమ్‌ను తీసుకుని తనే ఒక ఫిట్నెస్ ఇన్‌స్ట్రక్టర్‌గా మారాలనుకుంది. ఈ క్రమంలో జమ్ముకశ్మీర్‌లో ఉన్న బాడీ బిల్డింగ్ అసోసియేషన్‌లో చేరి ఫిట్‌నెస్‌లో పూర్తిస్థాయి శిక్షణ తీసుకుని 2012లో జిమ్ ఇన్‌స్ట్రక్టర్‌గా మారింది. శ్రీనగర్‌లో మహిళా ట్రైనర్ నిర్వహిస్తోన్న తొలి జిమ్ కావడంతో అమ్మాయిలంతా తన జిమ్‌లో చేరడానికి ఆసక్తి కనబరిచారు. Photo: Facebook దీంతో ఈ తొమ్మిదేళ్లలో ఆలియా కశ్మీర్ లోయలోని 20 వేల మందికిపైగా అమ్మాయిలకు ఫిట్‌నెస్‌లో శిక్షణ ఇచ్చింది. ప్రారంభంలో మహిళ జిమ్ నడపడం ఏమిటీ? అని అనేక విమర్శలు, ఈమె ఏమాత్రం నడుపుతుందో చూద్దాం వంటి సవాళ్లు అనేకం ఎదురయ్యాయి. వాటిని సీరియస్‌గా తీసుకోని ఆలియా తన భర్త, అత్తమామల ప్రోత్సాహంతో జిమ్‌ను ధైర్యంగా నిర్వహించేది. దీంతో కశ్మీర్లో తొలి మహిళా ఫిట్నెస్ ట్రైనర్‌గా ఆలియాకు గుర్తింపు రావడమేగాక, అనేక అవార్డులు వరించాయి. అంతేగాక జాతీయ అవార్డుకు నామినేట్ అయ్యింది. జిల్లాకో సెంటర్ ‘మహిళలకు ఉమన్ ఫిట్నెస్ ట్రైనర్ అవసరం చాలా ఉంది. అది నేను ప్రత్యక్షంగా ఫీల్ అయ్యాను. అందుకే స్త్రీలకోసం ప్రత్యేకంగా జిమ్‌ను నిర్వహిస్తున్నాను. హైబీపీ, కొలె్రస్టాల్ స్థాయులు, సంతానలేమితో బాధపడుతోన్న మహిళలకు ప్రతిరోజూ వ్యాయామం తప్పనిసరి. ఈ సమస్యలున్న మహిళలంతా జిమ్‌లో చేరి ఆరోగ్యాన్ని బాగు చేసుకుంటున్నారు. ప్రస్తుతం నా జిమ్‌కు స్పందన బావుండడంతో ప్రభుత్వాన్ని సంప్రదించి జిల్లాకో ‘మహిళా ఫిట్నెస్ సెంటర్’ను ప్రారంభించడానికి ప్రయత్నిస్తున్నాను’’ అని ఆలియా చెప్పింది. చదవండి: Neetu Yadav And Kirti Jangra: ‘ఇంత చదువు చదివి బర్రెలు అమ్ముతావా? -
‘జిమ్’దగీ బదల్‌గయా..
ప్రపంచాన్ని కుదిపేసిన కరోనా నగర ఫిట్నెస్ రంగం రూపు రేఖలు మార్చేస్తోంది. వ్యాయామ ప్రియులలో కొత్త ఆలోచనలు రేకెత్తిస్తూ శిక్షకులు, జిమ్ నిర్వాహకులను కొత్త రూట్ పట్టిస్తోంది. ఓ వైపు జిమ్ సెంటర్లను మూత పడేలా చేస్తూనే మరోవైపు శిక్షకులలో మాత్రం జోష్ నింపుతోంది. సాక్షి, సిటీబ్యూరో కరోనా మహమ్మారి దెబ్బకు అమాంతం కుప్పకూలిన సిటీ ఫిట్నెస్ రంగం.. లాక్డౌన్ సడలింపుల తర్వాత కూడా పూర్తిగా కోలుకున్న దాఖలాలు కనిపించడం లేదు. మరోవైపు ఈ రంగంలో కొత్త కొత్త మార్పులు రావడానికి కరోనా బాటలు వేస్తున్నట్టు స్పష్టమవుతోంది. చదవండి: సిటీలో శంకర్‌దాదా ఎంబీబీఎస్‌లు.. జిమ్స్ ‘లాక్’... నగరంలో ఏడాదికి ముందు కనిపించిన జిమ్స్ సందడి ఇప్పుడు కానరావడం లేదు. ఏడాది క్రితం వరకూ నగరంలో రోజుకో జిమ్, నెలకో ఫిట్నెస్ సెంటర్ అన్నట్టుగా ప్రారంభాలు జరుగుతుండేవి. ఇప్పుడు అది తిరగబడింది. ఎటు చూసినా జిమ్/పిట్నెస్ సెంటర్ల మూసివేతే కనపడుతోంది. దేశవ్యాప్తంగా పేరొందిన ఓ బ్రాండెడ్ జిమ్ కంపెనీ నగరంలోని తమ అన్ని శాఖలనూ మూసివేసింది. దాదాపు రూ.500 కోట్లకు పైగా బ్యాంకు రుణాలు చెల్లించలేని పరిస్థితిలో దేశవ్యాప్తంగా ఉన్న 200 హెల్త్ క్లబ్స్‌తో పాటు సిటీలో కూడా క్లోజ్ చేసేసింది. జూబ్లీహిల్స్‌లోని బీట్స్ జిమ్ మూతపడింది. రోడ్ నెం 36లోని చట్నీస్ హోటల్ ఎదురుంగా ఉండే మరో ఫేమస్ జిమ్, దేశవ్యాప్తంగా బ్రాంచిలు నిర్వహిస్తూ నాలుగేళ్ల క్రితం నగరంలోనూ ఏర్పాటైన మరో జిమ్, 24గంటలూ సేవలందిస్తానంటూ అందుబాటులోకి వచ్చిన మరో అత్యాధునిక హెల్త్ క్లబ్ ఇంకా అనేక బ్రాండెడ్ ఫిట్నెస్ సెంటర్లు తీవ్రమైన నష్టాలతో నడుస్తున్నాయి. ఇప్పటికే ఇవి బ్యాంకు రుణాల విషయంలో కేసులు ఎదుర్కొంటున్నాయి. ట్రైనర్స్ ఖుష్... కరోనా కారణంగా ఫిట్నెస్ ఇండస్ట్రీ కుదేలైనప్పటికీ జిమ్‌లో సభ్యులకు వర్కవుట్ శిక్షణ అందించే ట్రైనర్స్‌కు మాత్రం కలిసి వచ్చింది. లాక్ డౌన్ తర్వాత చాలా మంది ట్రైనర్లకు పర్సనల్ ట్రైనింగ్ ఆఫర్లు వెల్లువెత్తాయి. కస్టమర్ల ఇళ్లకు వెళ్లి ట్రైనింగ్ ఇవ్వడం ద్వారా జిమ్‌లో నెలవారీ జీతానికి కనీసం ఐదు నుంచి పది రెట్లు ఆదాయం, దానితో పాటే ఎవరి దగ్గరా పనిచేసే అవసరం లేకపోవడం వంటి లాభాలు కలుగుతుండడంతో అనుభవజ్ఞులైన ట్రైనర్లకు కరోనా పరోక్షంగా మేలు చేసిందనాలి. లాక్ డౌన్ సడలింపుల తర్వాత జిమ్‌లు తెరుచుకున్నా... పలువురు ట్రైనర్లు తమ ఉద్యోగాలకు గుడ్‌బై చెప్పేశారు. అంతేకాకుండా జిమ్స్‌లో శిక్షణ అందించేటప్పుడు పలువురు మెంబర్స్‌తో ఏర్పడిన ఫ్రెండ్షిప్ తో వారికి పర్సనల్ ట్రైనర్లుగా అవకాశాలు చేజిక్కించుకున్నారు. ఈ కారణంగా జిమ్స్‌కు అటు మెంబర్స్‌తో పాటు ఇటు ట్రైనర్స్ కూడా తగ్గిపోయారు. పరికరాల బిజినెస్ జోష్... డంబెల్స్, బెంచ్‌ప్రెస్, ట్రెడ్ మిల్, బార్రాడ్స్...వగైరా ఎక్విప్మెంట్ వ్యాపారానికి కరోనా ఊపునిచ్చింది. ఎన్నడూ లేనంతగా హోమ్ జిమ్స్ ఏర్పాటు చేసుకోవడానికి సిటిజనులు ఆసక్తి చూపించడంతో జిమ్ ఎక్విప్మెంట్ వ్యాపారం ఊపందుకుంది. ముఖ్యంగా ట్రెడ్మిల్, వర్కవుట్ సైకిల్స్ బాగా సేల్ అయ్యాయని నగరానికి చెందిన ఓ ఎక్విప్మెంట్ సంస్థ ప్రతినిధి చెప్పారు. నెట్..వర్కవుట్... ఇంట్లోనే వ్యాయామాలు చేయడానికి నగరవాసులు అలవాటుపడుతూ వర్కవుట్ గురించి తెలుసుకోవడానికి యూ ట్యూబ్ లో వీడియోలను వీక్షిస్తున్నారు. యోగా, ఎరోబిక్స్, జుంబా, స్ట్రెంగ్త్ ట్రైనింగ్, బాడీ వెయిట్ వర్కవుట్స్... వంటివి చేసే విధానాల గురించి తెలుగులో తెలియజెప్పే వీడియోలకు డిమాండ్ పెరిగింది. దీంతో నగరానికి చెందిన పలువురు జిమ్ ట్రైనర్లు యూ ట్యూబ్ చానెల్స్ ప్రారంభించారు. చిన్న, మధ్య తరహా జిమ్స్ పడుతూ లేస్తూ నడుస్తున్నప్పటికీ..మొత్తం మీద వ్యాపార పరంగా చూస్తే మాత్రం ఫిట్నెస్ రంగం కోలుకోలేని విధంగా దెబ్బతిందనేది నిర్వివాదం. అయితే ఇది రూ.కోట్ల టర్నోవర్ చేసే సంస్థలకే ఎక్కువ నష్టాలు తెచ్చి పెట్టింది. ఆరోగ్యార్థుల్లో అవగాహన పెరగడం, హోమ్ జిమ్స్ పట్ల ఆసక్తి వంటి మంచి మార్పులకూ కరోనా దోహదం చేసింది. ఈ నష్టాల నుంచి కోలుకుని మరో ఏడాదిలోపే ఫిట్నెస్ ఇండస్ట్రీ పూర్వవైభవం సంతరించుకోడం తథ్యమని ఫిట్ నెస్ ట్రైనర్ విజయ్ గంధం ఆశాభావం వ్యక్తం చేశారు. -
ఫిజిక్ ఫేమ్... ట్రాన్స్‌ఫార్మ్!
సాక్షి, సిటీబ్యూరో: ఒకప్పుడు అధికబరువు ఉండేవాళ్లు బరువు తగ్గితే చాలు అనుకునేవారు. తర్వాత స్కిన్ టోనింగ్ కావాలని, శరీరం మంచి షేప్ కావాలని.. అలా అలా వారి ఆకాంక్షలు మారుతూ వచ్చాయి. ఇప్పుడు ఏకంగా ట్రాన్స్‌ఫార్మేషన్‌ను కోరుకుంటున్నారు. ఫిట్నెస్ ప్రియులను ట్రాన్స్ఫార్మేషన్ ట్రెండ్ పట్టి కుదిపేస్తోంది. ఆద్యంతం తమ రూపాన్ని మార్చేసుకునేలా శరీరాన్ని తీర్చిదిద్దుకోవాలనే ఆసక్తి ఇంతింతై విస్తరిస్తోంది. ఈ ఆసక్తి, అభిరుచి వల్ల కొన్ని నెలల గ్యాప్‌లోనే ఓ వ్యక్తి పూర్తిగా కొత్త రూపంలో దర్శనమిస్తుండడం పరిచయస్తులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. సిటీలో ఇటీవలే ప్రారంభమైన ట్రాన్స్ఫార్మేషన్ ట్రెండ్ మరింత మందిని రూపాంతరం చెందించే దిశగా దూసుకుపోతోంది. బీపీ పేషెంట్ టూ సూపర్ ఫిట్ ‘పని ఒత్తిడి, అధిక బరువు వంటి వాటి వల్ల నాకు 28 ఏళ్ల వయసులోనే బి.పి వచ్చింది. అప్పటి నుంచి ప్రతి రోజూ 40 ఎం.జి వరకూ బీపీ టాబ్లెట్ వేసుకునేవాడ్ని’ అంటూ గుర్తు చేసుకున్నారు కొంపల్లి నివాసి నర్వీర్ జాదవ్. జహీరాబాద్ నివాసి అయిన నర్వీర్...తనకు బీపీ సమస్య ప్రారంభమైన 12 ఏళ్ల తర్వాత ఇప్పుడు 28 ఏళ్ల కుర్రాడిలా మారారు. ‘అధికబరువుతో పాటు నన్ను వదలకుండా వెంటాడిన రక్త పోటు సమస్య పూర్తిగా దూరమైంది. ఇప్పుడు కనీసం రోజుకు 10 కి.మీ అవలీలగా పరిగెత్తగలను...’అంటూ ఆత్మవిశ్వాసంతో చెబుతున్నారు. యుక్తవయసులో పేషెంట్‌గా మారిన ఆయనను మధ్య వయసులో ఆరోగ్యవంతుడిగా మార్చిన మార్గం ట్రాన్స్ఫార్మేషన్. ఆరు నూరైనా ఆరోగ్యం సాధించాలనుకున్నా...అంటూన్న నర్వీర్ తన ట్రాన్స్ఫార్మేషన్ ప్రక్రియ గురించి మాట్లాడుతూ ‘చిన్న వయసులో బీపీ రావడం వల్ల బరువు తగ్గాల్సిందేనని వైద్యులు గట్టిగా చెప్పారు. వెంటనే న్యూట్రిషనిస్ట్ డా.అశ్వినిని కలిసి, డైట్ చార్ట్ తీసుకున్నా. మొదట్లో కాస్త తడబడినా, ఆ తర్వాత నెమ్మదిగా కొత్త డైట్‌కి అలవాటు పడ్డా. రెండు నెలల్లోనే 8కిలోలు తగ్గా. ఆ తర్వాత ఫిట్నెస్ ట్రైనర్ వెంకట్‌ని కలిశా. వెయిట్ తగ్గాలని, కాస్త బాడీ షేప్ రావాలని అనుకుంటున్నట్టు చెప్పా. అప్పుడే ఆయన ఫుల్ బాడీ ట్రాన్స్ఫార్మేషన్ గురించి చెప్పారు. తొలుత కొంచెం సంశయించినా...ఆయన ఇచ్చిన ధైర్యంతో సరే అన్నా. అక్కడి నుంచి ఏడాదిలో 86 కిలోల నుంచి 60 కిలోలకు తగ్గిపోయాను. దశలవారీగా వర్కవుట్స్ ఇంటెన్సిటీ పెంచుకుంటూ కఠినమైన వర్కవుట్స్, ఫుడ్ చార్ట్‌తో ఫిజిక్‌ని మార్చుకున్నాను. అదే ఊపులో మూడు నెలల కాలం టార్గెట్గాపెట్టుకుని సిక్స్‌ప్యాక్ కూడా సాధించాను. రోజుకి 20 వైట్ ఎగ్స్, స్టీమ్డ్ ఫిష్, ఫ్రూట్స్, వెజిటబుల్స్, 2.30గంటల వ్యాయామం, యోగా...ఇవన్నీ నా ట్రాన్స్‌ఫార్మేషన్‌లో భాగం అయ్యాయి’’ అంటూ వివరించారు నర్వీర్. ఆద్యంతం.. అపు‘రూపం’.. శరీరం మొత్తాన్ని తీర్చిదిద్దుకోవడంతో పాటు లోపాలన్నీ తొలగించుకోవడం ద్వారా పూర్తి కొత్త రూపాన్ని సంతరించుకోవడమే ‘ట్రాన్స్ఫార్మేషన్’గా ఫిట్నెస్ పరిశ్రమ నిర్వచిస్తోంది. దీని కోసం ఏడాది ఆ పైన వ్యవధి నిర్ణయిస్తోంది. ‘వర్కవుట్ ప్రారంభించేటప్పుడు ఒక రకమైన లక్ష్యంతో ఉండి, ఆ తర్వాత అది వదిలేసి ఇంకోటి ఆ తర్వాత ఇంకోటి..ఇలా మార్పు చేర్పులు చేయడం సర్వసాధారణం. అలాంటివేమీ లేకుండా పూర్తి స్థాయిలో ఒక ఫిట్నెస్ అజెండా రూపొందించుకుని అమలు చేసి రిజల్ట్స్ సాధించేలా చేస్తుంది ట్రాన్స్ఫార్మేషన్’ అని చెప్పారు టార్క్ ఫిట్నెస్ స్టూడియోకు చెందిన ట్రైనర్ ఎమ్.వెంకట్. ట్రాన్స్‌ఫార్మేషన్‌లో భాగంగా నిర్ణీత వ్యవధి నిర్ణయించుకుని దాని ప్రకారం ఓ వైపు బరువు తగ్గడం, మరోవైపు శరీరాన్ని తీర్చిదిద్దడం లక్ష్యంగా దీని కోసం సంపూర్ణమైన డైట్, వర్కవుట్, అన్నీ ముందే నిర్ణయించుకుని రంగంలోకి దిగుతారు. మొత్తం ప్రక్రియ పూర్తయ్యేవరకూ అందులో మరీ అవసరమైతే తప్ప మార్పు చేర్పులు చేయరు. ఈ తరహా ట్రాన్స్‌ఫార్మేషన్‌ను ఎంచుకుని విజయాలు సాధిస్తున్నవారు మరింత మందికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు. అన్ని రకాలుగా...కొత్తగా హోల్ బాడీ ట్రాన్స్ఫార్మేషన్ వల్ల కేవలం రూపంలో మాత్రమే కాదు ఆలోచనా ధోరణిలో కూడా బాగా మార్పు వస్తుంది. ఇది షార్ట్ టర్మ్ కాదు కాబట్టి వ్యక్తి జీవనశైలి కూడా మారిపోతుంది. ఒక 15ఏళ్ల నుంచి 25 ఏళ్ల వరకూ వయసు తగ్గినట్టు కనిపిస్తాం. తద్వారా యుక్తవయసులో మాత్రమే కనిపించే అద్భుతమైన ఆత్మవిశ్వాసం లభిస్తుంది. –ఎమ్.వెంకట్, టార్క్ ఫిట్నెస్ స్టూడియో -
జిమ్ సెంటర్‌ను ప్రారంభించిన నమ్రత
-
బక్వా నాచే షురూ కరో
ఫిట్నెస్ త్రూ ఫన్.. సిటీలో ఇదీ ట్రెండ్. స్టెప్ ఎరోబిక్స్ నుంచి మొదలుపెట్టి సల్సా, బాల్రూమ్ స్టెప్స్, హిప్హాప్.. ఇవన్నీ సిటీలో నృత్యాభిలాషుల కన్నా ఆరోగ్యాభిలాషుల కారణంగానే ఆదరణ పొందుతున్నాయనేది నిర్వివాదం. ఇక జుంబా డ్యాన్స్ స్టైల్ అయితే ప్రతి జిమ్, ఫిట్నెస్ సెంటర్లో తప్పక జత చేయాల్సిన అంశంగా మారిపోయింది. ఇప్పుడు అదే కోవలో వచ్చేస్తోంది బక్వా. - ఎస్.సత్యబాబు నెలన్నర క్రితం హైటెక్ సిటీలో నిర్వహించిన హైదరాబాద్ ఫిట్నెస్ కార్నివాల్ ద్వారా సిటీలో అరంగేట్రం చేసింది బక్వా డ్యాన్స్. సదరు ఈవెంట్‌కి మొత్తంగా వచ్చిన స్పందన కన్నా బక్వా యాక్టివిటీకే ఎక్కువ రెస్పాన్స్ వచ్చింది. కొత్త కొత్త ఫిట్నెస్ మార్గాలు వెతుక్కునే సిటీజనులు ‘ఏమిటీ బక్వా’ అంటూ ఆరా తీయడం మొదలు పెడితే... అప్పటిదాకా దీనిపై అంతగా అవగాహన పెంచుకోని ట్రైనర్లు.. ఒక్కసారిగా నెట్లోకి వెళ్లి బ్లాగులూ, యూ ట్యూబ్ వీడియోలు సెర్చ్ చేసి దీని గురించి ప్రాథమిక పరిజ్ఞానం సంపాదించారు. ప్రస్తుతం సిటీలో జుంబా తదితర డ్యాన్స్ యాక్టివిటీల ద్వారా ఫిట్నెస్ ట్రైనింగ్ ఇస్తున్న శిక్షకుల్లో పలువురిని బక్వా బాగా ఆకట్టుకుంది. దీనికి సంబంధించిన సర్టిఫికేషన్ కోర్స్ చేసేందుకు సిద్ధమవుతున్నారు. రానున్న రోజుల్లో సిటీలో బక్వా సందడి మొదలుకానుంది. ఆఫ్రికా మూలాలు.. సిటీలో సందడి చేయనున్న బక్వా డ్యాన్స్ మూలాలు ఆఫ్రికాలో ఉన్నాయి. సౌతాఫ్రికన్ వార్ డ్యాన్స్, క్యాపొయిరా, కిక్ బాక్సింగ్, లైట్ బాక్సింగ్, స్టెప్ల కలయిక బక్వా. ఇదొక ఫన్ వర్కవుట్ ప్రోగ్రామ్. లైట్ బాక్సింగ్‌ని సూచించే బీవో, సౌతాఫ్రికన్ వార్డ్యాన్స్, ట్రెడిషనల్ క్వైటోను సూచించే కేడబ్ల్యూఏ నుంచి బక్వా పేరు పుట్టింది. అంతర్జాతీయ ఫిట్నెస్ ప్రముఖుడు పాల్ మార్వి దీని సృష్టికర్త. ఏడేళ్ల కృషితో దీన్ని లాస్ఏంజెల్స్లో లాంచ్ చేశాడు. జన్మతః సౌతాఫ్రికాకు చెందిన మార్వి లాస్ఏంజెల్స్లో లీడింగ్ గ్రూప్ ఫిట్నెస్ ఇన్స్ట్రక్టర్. ఈ బక్వాను తన సొంత క్లాసుల గురించి ప్రత్యేకంగా క్రియేట్ చేసుకున్నాడు. తదనంతర కాలంలో ఇది ప్రపంచమంతా పాకింది. తైవాన్, జపాన్, అమెరికా. గ్రీస్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ వంటి చోట్ల హెల్త్పబ్స్లో బక్వా ఇప్పుడు హాట్ వర్కవుట్. విశేషాలెన్నో... దీనిని నేర్చుకోవడానికి డ్యాన్స్‌లో ప్రాథమిక అంశాలు సైతం తెలియనక్కర్లేదు. ప్రపంచంలో సైన్ లాంగ్వేజ్ వినియోగించే ఏకైక వర్కవుట్ ఇదే. అలాగే లెటర్స్, నంబర్స్, హ్యాండ్ సిగ్నల్స్, అమెరికన్ సైన్ లాంగ్వేజ్‌లు ఉపయోగించి చేసే వినూత్నమైన పోగ్రామ్ బక్వా. ఈ యాక్టివిటీలో పాప్, లాటిన్, హౌస్ మ్యూజిక్‌లను బ్యాక్ గ్రౌండ్‌గా వినియోగిస్తారు. ఇందులో పార్టిసిపెంట్స్‌కి తర్వాతి మూవ్‌ని చెప్పడానికి సైన్లాంగ్వేజ్ని ఉపయోగిస్తాడు ఇన్స్ట్రక్టర్. ఈ వర్కవుట్‌లో అందరూ ఒక గ్రూప్‌గా పాల్గొంటారు. డ్యాన్స్ చేసే సమయంలో అక్షరాలను, అంకెలను పార్టిసిపెంట్స్ తమ పాదాలతో డ్రా (చిత్రణ) చేస్తారు. బక్వా ఎల్, 3, జే, కే ఇంకా డజన్ల కొద్దీ ఇతర బక్వా స్టెప్స్‌ను పాదాలతో డ్రా చేస్తారు. మిగిలిన డ్యాన్స్ ఫిట్నెస్ ప్రోగ్రామ్స్ తరహాలో స్టెప్స్ 8 కౌంటింగ్ ఇందులో ఉండదు. అసలు ఇందులో స్టెప్స్ కౌంటింగ్ అవసరమే లేదు. బీట్తో పాటు మ్యూజిక్‌ని ఫీలవుతూ కదలడమే. స్టెప్ తెలిస్తే చాలు ఇన్స్ట్రక్టర్ అందించే కొరియోగ్రఫీ అవసరం లేకుండానే ఫాలో అయిపోవచ్చు. ఉపయోగాలెన్నో... అన్ని వయసుల వారికీ తగ్గట్టుగా, అన్ని రకాల ఫిట్నెస్ లెవల్స్ ఉన్నవారికీ నప్పేలా డిజైన్ చేసిన డ్యాన్సింగ్ వర్కవుట్ బక్వా. ఇంటెన్సిటీ ఉన్నవారికీ, కావాలనుకునే వారికీ, లావుగా ఉన్నవారికీ, సన్నగా ఉన్నవారికీ.. ఇలా అందరికీ ఇది ఉపకరిస్తుంది. టోటల్ బాడీ వర్కవుట్‌గా, అత్యధిక కేలరీలను సహజమైన పద్ధతిలో ఖర్చు చేసేదిగా పేరొందింది. అత్యంత సులభంగా అనిపించే ఈ ప్రోగ్రామ్ ద్వారా ఒక్క సెషన్లో అత్యధికంగా 1,200 కేలరీలు సైతం ఖర్చు చేసే అవకాశం ఉందంటే ఆశ్చర్యమే. ‘జుంబాతో పోల్చి చూస్తే ఇదొక అద్భుతమైన, సమర్థవంతమైన వర్కవుట్. అనూహ్యమైన స్ట్రెస్ బస్టర్. గంటలో 1,000 కేలరీలు ఖర్చు చేయిస్తుంది. జుంబా కూడా ట్రెడిషనల్ 8 కౌంట్ స్టెప్స్‌ను ఫాలో అవుతుంది. అలాగే దీనికన్నా కాస్త స్లో కూడా. బక్వాకి ఎటువంటి కొరియోగ్రఫీ అవసరం లేదు. మనం చేయాల్సిందల్లా... ఇంగ్లిష్ లాంగ్వేజ్ లెటర్స్‌ని, నంబర్స్‌ని మన ఫీట్‌తో డ్రా చేయాలి. ఉదాహరణకు ఎల్, కే, జేలను డ్రా చేయడం లేదా.. మీ దేహాన్ని నంబర్ 3 లాగా కదపడం వంటివి. ఈ డ్యాన్స్‌ను అన్ని వయసుల వారూ ఫాలో కావచ్చు’ అని ముంబైకి చెందిన ట్రైనర్ అంచల్ గుప్తా అంటున్నారు. ఇది కేవలం ఒక వర్కవుట్ మాత్రమే కాదని ఒక ఎమోషనల్ ఎక్స్పీరియన్స్ అని కూడా అంటున్నారు దీని రూపకర్త మార్వి. మన చుట్టూ ఉన్నవారితో ఎనర్జీనీ, ఎగ్జయిట్‌మెంట్‌నీ సమానంగా పంచుకునే అద్భుతమైన అనుభవం అంటున్నాడు. హైలెవల్ కార్డియో వర్కవుట్ చేశామనే ఫీలింగ్‌నే కలగనీయనంత పూర్తి వినోదం దీని స్పెషాలిటీ. -
ప్రైవేటు బస్సులపై రవాణా శాఖ కొరడా
=పర్మిట్ లేకుండా తిరుగుతున్న 8 బస్సుల సీజ్=వేకువజాము నుంచే తనిఖీలు విజయవాడ సిటీ, న్యూస్‌లైన్ : ప్రైవేటు బస్సులపై రవాణా శాఖ కొరడా ఝుళిపించింది. నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న ఎనిమిది ప్రైవేటు బస్సులను అధికారులు సీజ్ చేశారు. మహబూబ్‌నగర్ జిల్లాలో బస్సు దగ్ధం ఘటన నేపథ్యంలో గురువారం తెల్లవారుజాము నుంచి జిల్లాలో రవాణా శాఖ అధికారులు మూడు ప్రాంతాలలో ముమ్మరంగా ఈ తనిఖీలు చేపట్టారు. ప్రధానంగా జాతీయ రహదారిపై వెళ్లే బస్సులను ఆపి ఫిట్నెస్ పరిశీలించారు. డ్రైవర్ల ఫిట్నెస్ను కూడా తనిఖీ చేశారు. కొన్ని బస్సులు పర్మిట్ కూడా లేకుండా తిరుగుతున్నట్టు ఈ సందర్భంగా వెల్లడైంది. సీజ్ చేసిన బస్సులను గన్నవరంలోని ఫిట్నెస్ సెంటర్‌కు పంపినట్లు అధికారులు తెలిపారు. కేశినేని ట్రావెల్స్, సాయిశ్రీకృష్ణ ట్రావెల్స్, ఆరెంజ్ ట్రావెల్స్, ధనుంజయ్ ట్రావెల్స్, భాగ్యలక్ష్మి ట్రావెల్స్, వీఆర్ఎన్ ట్రావెల్స్, ఆర్పీ ట్రావెల్స్, మూన్లైట్స్కు చెందిన బస్సులను సీజ్ చేసినట్లు అధికారులు వివరించారు. ప్రయాణికులు ఇబ్బందిపడకుండా వారిని గమ్యస్థానాలకు చేర్చి వచ్చి స్వాధీనం చేయాలని ఆర్టీఏ అధికారులు ఆ బస్సుల డ్రైవర్లకు ఉత్తర్వులిచ్చారు. ఈ బస్సులకు కాంట్రాక్టు క్యారియర్స్‌గా తక్కువ మొత్తం ట్యాక్స్ కట్టి, స్టేజ్ క్యారియర్స్‌గా వినియోగిస్తూ రవాణా శాఖను మోసగిస్తున్నారు. ఈ బస్సులలో రెండు కర్నాటకకు చెందినవి. గురువారం తెల్లవారుజామున మూడు నుంచి నాలుగు గంటల వరకు గన్నవరం, ఇబ్రహీంపట్నం, విజయవాడ వారధి వద్ద తనిఖీలు చేశారు. డీటీసీ సీహెచ్ శివలింగయ్య పర్యవేక్షణలో 17 మంది ఇన్స్పెక్టర్లు తనిఖీలలో పాల్గొన్నారు. డీ టీసీ శివలింగయ్య ‘న్యూస్‌లైన్’తో మాట్లాడుతూ జిల్లాలో బస్సుల ఫిట్‌నెస్‌పై తరచూ తనిఖీలు చేస్తున్నామని చెప్పారు. జిల్లాలో రిజిస్టరైన 498 బస్సుల ఫిట్‌నెస్‌పై ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నామన్నారు.