ఒక గంట వ్యవధిలో ఐదువేల కిలోగ్రాములు బరువుని ఎత్తి రికార్డు సృష్టించాడు | Athelete Lifts Five Thousand Kilograms In Just One Hour To Raise Awareness For Mental Health Sets New Guinness Record | Sakshi
Sakshi News home page

ఒక గంట వ్యవధిలో ఐదువేల కిలోగ్రాములు బరువుని ఎత్తి రికార్డు సృష్టించాడు

Published Wed, Oct 27 2021 4:20 PM | Last Updated on Wed, Oct 27 2021 4:27 PM

Athelete Lifts Five Thousand Kilograms In Just One Hour To Raise Awareness For Mental Health Sets New Guinness Record - Sakshi

కెనడా: మీరు గంటలో ఎంత బరువును ఎత్తగలరో చెప్పగలరా అనంగానే ఆలోచనలో పడతాం. కానీ  కెనడాకు చెందిన ఈ అథ్లెట్ కేవలం ఒక గంట వ్యవధిలో దాదాపు 13 వేల పౌండ్లు (5వేల కిలోగ్రాములు) బరువును ఎత్తి సరి కొత్త గిన్నిస్ వరల్డ్‌ రికార్డును నెలకొల్పాడు. విన్నిపెగ్‌కు చెందిన నోలన్ డి లియోన్ ఫిట్‌నెస్ సెంటర్‌లో ఒక గంట పాటు 70-పౌండ్ల కెటిల్‌బెల్‌ను ఉపయోగించి టర్కిష్ వ్యాయామాలు చేశాడు.

(చదవండి: చూడటానికి పంది రూపు... కానీ అది దూడ)

అయితే ఇది సగటు ఆఫ్రికన్ ఏనుగు బరువు కంటే 5,900 కిలోగ్రాములు ఎక్కువ. ఈ మేరకు డి లియోన్ మానసిక ఆరోగ్యంపై అవగాహన పెంచటమే కాక మానిటోబాలోని మూడ్ డిజార్డర్స్ అసోసియేషన్‌కు మద్దతు ఇవ్వడం కోసమే ఈ రికార్డ్ నెలకొల్పడానికి ప్రయత్నించానని చెప్పాడు. అంతేకాదు ఒక ఫోటోగ్రాఫర్, ఇద్దరు న్యాయమూర్తుల సమక్షంలో సెషన్ మొత్తం ప్రత్యక్ష ప్రసారం చేశారు.

ఈ క్రమంలో అతను 184 వ్యాయామాలు పూర్తి చేశాడు. పైగా న్యాయనిర్ణేతలలో ఒకరు వైట్‌బోర్డ్‌పై ఒక్కో వ్యాయామాన్ని నమోదు చేస్తూనే ఉన్నారు. ఈ మేరకు డి లియోన్ మూడ్ డిజార్డర్స్ అసోసియేషన్ ఆఫ్ మానిటోబా కోసం సుమారు మూడు వేల డాలర్లుకు  పైగా సేకరించారు. అంతేకాదు ఈ ఏడాది మేలో కెనడియన్ క్రిస్ కాక్స్ నెలకొల్పిన టర్కిష్ గెట్-అప్‌తో(బరువులు ఎత్తే వ్యాయమం) 4,868 కిలోలు భారీ బరువు ఎత్తి నెలకొల్పిన గిన్నిస్ వరల్డ్‌ రికార్డును కూడా అధిగమించడం విశేషం. అంతేకాదు దీనికి సంబంధించిన ఒక వీడియో నెట్టింట తెగ వైరల్‌ అవుతుంది. దీంతో నెటిజన్లు డి లియోన్‌ను ప్రశంసిస్తూ రకరకాలుగా ట్వీట్‌ చేశారు. 

(చదవండి: చనిపోయిన సోదరుడి అస్థిపంజరంతోనే కలిసి ఉంటున్న సోదరులు)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement