వావ్‌..మనవళ్ల ముందే...రికార్డులు బద్దలు కొట్టింది! | Canadian DonnaJean Wilde break world record abdominal planks | Sakshi
Sakshi News home page

వావ్‌..మనవళ్ల ముందే...రికార్డులు బద్దలు కొట్టింది!

Published Sat, Mar 30 2024 12:39 PM | Last Updated on Sat, Mar 30 2024 1:23 PM

Canadian DonnaJean Wilde break world record abdominal planks - Sakshi

ఒక బామ్మ  ప్రపంచ రికార్డును బద్దలు కొట్టింది. మహిళల స్టమక్‌ ప్లాంక్స్‌లో గిన్నిస్‌ బుక్‌ ఆప్‌ వరల్డ్‌ రికార్డు క్రియేట్‌ చేసింది. కెనడాలోని అల్బెర్టాకు చెందిన ఒక బామ్మ డోనాజీన్ వైల్డ్ ఏకంగా 4.5 గంటల పాటు పొత్తికడుపు ప్లాంక్స్‌  చేసింది. 2019లో కెనడియన్ డానా గ్లోవాకాతో గతంలో నెలకొల్పిన రికార్డు కంటే కేవలం 10 నిమిషాలు ఎక్కువ  ప్లాంక్స్‌ చేసిన ఈ రికార్డును అధిగమించింది.  

గతంలో వైస్ ప్రిన్సిపాల్‌గా పనిచేసిన ఉన్నత పాఠశాలలోనే డోనాజీన్ ఈ ఘనతను సాధించడం విశేషం. దీంతో స్కూలు విద్యార్థులు, తన 12  మంది మనవళ్ల కేరింతల మధ్య ఈ రికార్డు సాధించింది. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్  ఈ వీడియోను సోషల్‌ మీడియాలో షేర్‌  చేసింది.గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ అడ్జుడికేటర్ టీనా షి రికార్డును పరిశీలించారు. 

మొదటి రెండు గంటలు త్వరగానే గడిచిపోయాయని, కానీ తర్వాతి రెండు గంటలు చాలా కష్టంగా గడిచాయని, ఇక చివరి గంటలోచుక్కలు కనిపించాయంటూ తన అనుభవాన్ని పంచుకున్నారు డోనాజీన్‌. పదేళ్ల కఠిన ప్రాక్టీస్‌ తరువాత వరల్డ్ రికార్డ్‌ సాధించడం సంతోషంగా ఉందన్నారు. విశేషం ఏమిటంటే ఆమె చేతుల్లో దీర్ఘకాలిక నొప్పి,  తిమ్మిరితో బాధపడేవారు. దీన్నుంచి బయటపడేందుకు ప్రతీరోజూ ఇచేయడం మొదలు పెట్టారట. డోనాజీన్ ప్రతిరోజూ మూడు గంటల  పాటు  ప్రాక్టీస్‌ చేసేదని,  ఈ రికార్డులో భాగంగా  దానిని ఆరు గంటలకు పెంచిందని చెప్పుకొచ్చారు  ఆమె భర్త రాండీ. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement