అప్పుడప్పుడు రెస్టారెంట్లకు వెళ్లి తినడం చాలా మందికి అలవాటే. బంధువులు ఇంటికి వచ్చినా, స్నేహితులు కలిసినా, లేదా కుటుంబ సభ్యులకు ఇంటి పుడ్ బోర్ కొట్టినా ఠక్కున రెస్టారెంట్లో వాలిపోతుంటారు. ఇక నచ్చిన పుడ్ ఆర్డర్ చేయడం, కడుపు నిండా తినడం ఇవన్నీ రొటీన్‌గా జరిగేవి. అయితే ఇక్కడ రెస్టారెంట్లలో మనకి కనిపించేవి కేవలం ఆహారం మాత్రమే కాదు. అందులో అడుగు పెట్టిన క్షణం నుంచి తిరిగి వచ్చేదాక రెస్టారెంట్ సిబ్బంది ఇచ్చే మర్యాద, పలకరింపులు కూడా బాగుంటాయి.
ముఖ్యంగా అతిథిదేవోభవ అన్నట్లు రెస్టారెంట్ సిబ్బంది నడుచుకునే తీరు మనల్నీ ఆకట్టుకుంటుంది. అయితే కెనడాలోని సుషీ రెస్టారెంట్‌లో ఓ మహిళా కస్టమర్‌కు చేదు అనుభం ఎదురైంది. వివరాల్లోకి వెళితే... కాసాండ్రా మౌరో టిక్‌టాక్‌లో ఒక వీడియోను అప్‌లోడ్ చేసింది. అందులో తాను ఓ రెస్టారెంట్‌లో ఎదుర్కున్న చేదు అనుభవాన్ని పంచుకుంది. కెనడాలోని అంటారియోలోని 'పేపర్ క్రేన్ సుషీ బార్ అండ్ బిస్ట్రో' అనే పేరు గల సుషీ రెస్టారెంట్‌లో తన అనుభవాన్ని వెల్లడించింది. ఇటీవల ఆమె తన స్నేహితురాలితో కలిసి రెస్టారెంట్‌కు వెళ్లింది. మెనూ కార్డ్ తీసుకుని అందులో.. చికెన్ ఫ్రైడ్ రైస్, రొయ్యల టెంపురా, నూడుల్స్ మరియు రెండు సుషీ రోల్స్ కోసం ఆర్డర్ ఇచ్చింది.
అయితే వెయిట్రెస్ వారు చాలా ఎక్కువ ఆహారాన్ని ఆర్డర్ చేశారని భావించి,వద్దు, వద్దు, ఇప్పటికే పుడ్ చాలా ఎక్కువ ఆహారం" అని చెపప్పాడట. మేనేజర్ కూడా వాళ్ళ టేబుల్ దగ్గరికి వెళ్ళి "మేడం ఎక్కువ ఆకలిగా ఉందా?" అని అడిగారట. అంతేనా మేము తినే సమయమంతా, మేము కూర్చున్న చోట నుండి వంటగదివైపు చూడగా అందులో పని చేస్తున్న చెఫ్ మమ్మల్ని చూసి నవ్వుతున్నట్లుగా అనిపించినట్లు ఆమె తెలిపింది. దీంతో ఆమెకు చిరాకు వచ్చి ‘మీ రెస్టారెంట్‌లో కాస్త ఎక్కువ ఫుడ్ ఆర్డర్ చేస్తే ఈ రకంగా వెక్కిరిస్తారా.. ఎక్కువ ఆర్డర్ చేయడం తప్పా’ అంటూ ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసిన వీడియోలో పేర్కొన్నారు. ఆమె చేసిన వ్యాఖ్యలకు సుషి రెస్టారెంట్ స్పందిస్తూ.. మీకు కలిగిన ఈ చేదు అనుభవానికి హృదయపూర్వకంగా క్షమాపణలు తెలుపుతున్నాం. భాష రాకపోవడంతో ఇలా జరిగింది.. తప్ప మిమ్మల్ని అవమానించే ఉద్దేశం కాదని క్షమాపణలు కోరింది.
చదవండి: Imran Khan: అరెస్టుతో నా పరువు పోయింది! 1,500 కోట్ల పరిహారం కోరుతూ NABకి లీగల్ నోటీసులు
Comments
Please login to add a commentAdd a comment