భోజన ప్రియులు, కుకింగ్ వీడియోలు చేసేవాళ్లు చిత్ర విచిత్రాల ఫుడ్ కాంబినేషన్లు ప్రయత్నిస్తుంటారు. అంతేకాకుండా వాటిని వీడియోల రూపంలో చిత్రీకరించి సోషల్ మీడియాలో షేర్ కూడా చేస్తుంటారు. వీటిలో కొన్ని వంటకాలు నెటిజన్లకు నచ్చుతుండగా.. మరికొన్ని మాత్రం ఇవేం వంటకాలంటూ పెదవి విరుస్తున్నారు. తాజాగా ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారిన ఓ తైవానీస్ రెస్టారెంట్ వంటకం బయటకు వచ్చింది. ‘గాడ్జిల్లా రామెన్’గా పిలువబడే ఆ వంటకంలో మొసలి కాలు చూసి ప్రజలు వణుకుతున్నారు.
ఇదేం వంటకం రా అయ్యా!
వింత అంటే చాలు తక్షణమే అది సోషల్ మీడియాలో తక్షణమే కావాల్సిందే. ఈ మధ్యకాలంలో కొందరు వెరైటీ కాంబినేషన్‌లో తయారు చేస్తూ సరికొత్త రుచులను ప్రపంచానికి పరిచయం చేస్తున్నారు. వీటిలో కొన్ని వంటకాలు చూసేందుకు బాగున్నట్లు అనిపించగా.. మరికొన్ని కాంబినేషన్లు తింటే ఏమౌతుందో అని ఫుడ్ లవర్స్ సైతం ఆందోళన చెందుతున్నారు. తాజాగా తైవానీస్ రెస్టారెంట్ చేసిన ఓ వంటకం విచిత్రంగా, వికారంగా కనపడుతూ ఉన్నప్పటికీ అది ప్రజాదరణ పొందుతోంది.
‘గాడ్జిల్లా రామెన్’ అని పిలువబడే ఈ వంటకంలో ప్రధాన ఆకర్షణగా మొసలికాలు నిలుస్తోంది. మీరు విన్నది నిజమే. మొసలి కాలును ఆవిరి చేయడం ద్వారా దీనిని తయారు చేస్తారట. ఈ వంటకంలో 40 రకాల మసాలాలు వాడతారట. తైవాన్ నుంచి వంటలు వైరల్ కావడం ఇది మొదటిసారి కాదు. కానీ చూడటానికి భయం కలిగించేలా ఉన్న ఈ వంటకంపై నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు చేయగా.. మరికొందరు ఇలాంటి కాంబినేషన్లు విషపూరితం అయ్యే ప్రమాదం ఉందని కామెంట్ చేస్తున్నారు.
చదవండి: అసలేం జరుగుతోంది.. డిగ్రీ పట్టా అందుకొని ‘శవాలు’గా మారుతున్న విద్యార్ధులు!
Comments
Please login to add a commentAdd a comment