ఏజ్‌లో సెంచరీ దాటి రికార్డు సృష్టించిన బామ్మ..ఆమె ఒకప్పుడూ..! | Tomiko Itooka A Japanese Woman Became The Worlds Oldest Living Person | Sakshi
Sakshi News home page

ఏజ్‌లో సెంచరీ దాటి రికార్డు సృష్టించిన బామ్మ..ఆమె ఒకప్పుడూ..!

Published Fri, Aug 23 2024 5:37 PM | Last Updated on Fri, Aug 23 2024 5:37 PM

Tomiko Itooka A Japanese Woman Became The Worlds Oldest Living Person

ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవన విధానంలో సుదీర్థకాలం బతకం బహుకష్టంగా ఉంది. ఏవో ఒక రోగాలతో 60 లేదా డెభైకే టపా కట్టేస్తున్నారు. సెంచరీ కొట్టడం గగనంగా ఉంది. అలాంటి జపాన్‌కి చెందిన టోమికో ఇటూకా అనే బామ్మ ఏకంగా 116 ఏళ్ల జీవించి రికార్డు సృష్టించి. ప్రపంచంలో సుదీర్ఘకాలం బతికిన మహిళగా గిన్సిస్‌ రికార్డ్సులో స్థానం సంపాదించుకుంది. ఈ విషయాన్ని జెరోంటాలజీ రీసెర్చ్‌ గ్రూప్‌ వెల్లడించింది. 

ఇటూకా పుట్టిన తేదీ సంవత్సరం ఆధారంగా వరల్డ్‌ సూపర్‌సెంటెనేరియన్‌ ర్యాంకింగ్‌ జాబితాలో మొదటి స్థానంలో నిలిచారు. ఈ రీసెర్చ్‌ గ్రూప్‌ 110 లేదా అంతకంటే ఎక్కువ వయసుగల వ్యక్తుల వివరాలను ధృవీకరిస్తుంది. ఇటీవల 117 ఏళ్ల మరియా బ్రాన్యాస్‌ మరణం తరువాత జపాన్‌కి చెందిన 116 ఏళ్ల  టోమికో ఇటూకా ఎక్కువ కాలం జీవించిన మహిళగా గిన్నిస్‌ రికార్డులకెక్కింది. ఆమె ఆషియా నగరంలోని ఒక నర్సింగ్‌ హోమ్‌లో ఉంటుంది. ఆమె తాను పుట్టిన తేదీని కూడా ధృవీకరించింది. 

ఆ బామ్మ సాధించిన రికార్డు గురించి ఆమెకు చెప్పగానే.. వెంటనే థాంక్యూ అని చలాకీగా చెప్పిందంట. అంటే ఆమె స్పందంచిన తీరు చూస్తే..ఆమె  ఈ వయసులో కూడా ఎంతో ఉషారుగా, స్పష్టంగా వినగలుగుతున్నారని తెలుస్తోంది. ఇక ఈ బామ్మ ఇటూకా మూడు నెలల క్రితమే తన పుట్టిన రోజుని జరుపుకుందట. ఒసాకాలో జన్మించిన ఈ బామ్మ ఉన్నత పాఠశాలలో వాలీబాల్‌ క్రీడాకరిణి. 

20వ ఏటన వివాహం చేసుకుందంట. ఆమెకు ఇద్దరు ఆడపిల్లలు, ఇద్దరు మగపిల్లలు ఉన్నారట. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో భర్త నడుపుతున్న టెక్స్‌టైల్‌​ ఫ్యాక్టరీకి సంబంధించిన పనుల్లో సహాయం చేసేవారట. ఆమె వృద్ధ ఆశ్రమంలో చేరడానికి ముందు 1979లో భర్త మరణానంతరం నారాలో ఒంటరిగా నివసించింది. అంతేకాదండోయ్‌ ఏకంగా 3,067-మీటర్లు (10,062-అడుగులు) మౌంట్ ఆన్‌టేక్‌ను ఏకంగా రెండుసార్లు అధిరోహించిందట. వందేళ్లు నిండిన తర్వాత కూడా సుదీర్ఘ పాదయాత్రలు చేసిందట. 

ఆమె లైఫ్‌స్టైల్‌..
ఆమె క్యాల్పిస్ అనే ప్రసిద్ధ పెరుగు రుచిగల పానీయాన్ని తీసుకుంటుంది. ఆమెకు ఇష్టమైన ఆహారం అరటిపండ్లు అని ఆమె సంరక్షకురాలు చెబుతోంది. 

(చదవండి: బరువు తగ్గడంలో 'పంచకర్మ' ది బెస్ట్‌!..అనుభవాన్ని షేర్‌ చేసుకున్న రోహిత్‌ రాయ్‌!)
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement