సిక్స్ ప్యాక్ చెఫ్ ’కట్‌ చేస్తే’ : వరల్డ్‌ రికార్డ్‌, వైరల్‌ వీడియో | Canadian Chef Sets Record For Cutting Most Tomatoes Blindfolded In A Minute | Sakshi
Sakshi News home page

సిక్స్ ప్యాక్ చెఫ్ ’కట్‌ చేస్తే’ : వరల్డ్‌ రికార్డ్‌, వైరల్‌ వీడియో

Published Mon, Jul 29 2024 3:32 PM | Last Updated on Mon, Jul 29 2024 3:40 PM

Canadian Chef Sets Record For Cutting Most Tomatoes Blindfolded In A Minute

 కళ్లకు గంతలు కట్టుకొని టొమాటోలు కట్‌ చేసిన గిన్సిస్‌ రికార్డ్‌

కూరగాయలు కట్‌ చేయడం కూడా ఒక కళే. కళే కాదు వరల్డ్‌ రికార్డు కూడా అని నిరూపించాడు ఒక నలభీముడు. అదీ కళ్లు మూసుకుని. ‘సిక్స్ ప్యాక్ చెఫ్’గా పేరొందిన కెనడియన్ చెఫ్ వాలెస్ వాంగ్(WallaceWong) కట్‌ చేయడంలో తన రికార్డుల పరంపరను కొనసాగించాడు.  తాజాగా ఏకంగా కళ్లకు గంతలు  కట్టుకొని మరీ గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్‌ సృష్టించాడు. పదునైన కత్తితో, తొమ్మిది టొమాటోలను సమానభాగాలుగా కట్ చేశాడు.

చెఫ్ వాంగ్‌ జూన్ 12న లండన్‌లో కేవలం 60 సెకండ్ల వ్యవధిలో 9 టమోటాలను కోసి ఈ ఘనతను సాధించాడు. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ఇన్‌స్టాగ్రామ్ పేజీ దీనికి సంబంధించిన వీడియోను పోస్ట్ చేసింది. వాయువేగంతో, అన్ని టొమాటాలను సమానంగా అందంగా కత్తిరించాడని వెల్లడించింది. ఇక్కడ విశేషం ఏంటేంటే ఏమాత్రం చిన్న తేడా వచ్చిన టమాటా ముక్కల స్థానంలో అతని వేళ్లు ఉండేవి. కానీ ప్రయోగాలు,రికార్డులు అతనికి వెన్నతో పెట్టిన విద్య.

చాలా జాగ్రత్తగా ఒడుపుగా కట్‌ చేసి రికార్డు సొంతం చేసుకున్నాడు. వాలెస్ వాంగ్ ఈ ఒక రికార్డును మాత్రమే కాదు 2023, ఇటలీలో మరో రికార్డు కూడా క్రియేట్ చేశాడు. తాజా వీడియోపై కొంతమంది నెటిజన్లు సానుకూలంగా  స్పందించగా, మా అమ్మ  కూడా బాగా కట్ చేస్తుందని ఒకరు, ఇండియాలో ఇంతకంటే వేగంగా కట్‌ చేసే నిపుణులు చాలామంది ఉన్నారు అంటూ మరొకరు కమెంట్‌ చేశారు.

వాలెస్ వాంగ్ చెఫ్, ఫిట్‌నెస్ అథ్లెట్, గిన్నిస్ వరల్డ్ రికార్డ్ హోల్డర్ మాత్రమే కాదు.  ఒక కంపెనీకి సీఈవో కూడా. కేన్సర్ సర్వైవర్.  ప్రపంచవ్యాప్తంగా అనేక టాప్‌ మెస్ట్‌  రెస్టారెంట్‌లలో పనిచేశాడు. సోషల్‌ మీడియాలో లక్షలాది మంది ఫాలోవర్లున్నారు.  

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement