cutting
-
సిక్స్ ప్యాక్ చెఫ్ ’కట్ చేస్తే’ : వరల్డ్ రికార్డ్, వైరల్ వీడియో
కూరగాయలు కట్ చేయడం కూడా ఒక కళే. కళే కాదు వరల్డ్ రికార్డు కూడా అని నిరూపించాడు ఒక నలభీముడు. అదీ కళ్లు మూసుకుని. ‘సిక్స్ ప్యాక్ చెఫ్’గా పేరొందిన కెనడియన్ చెఫ్ వాలెస్ వాంగ్(WallaceWong) కట్ చేయడంలో తన రికార్డుల పరంపరను కొనసాగించాడు. తాజాగా ఏకంగా కళ్లకు గంతలు కట్టుకొని మరీ గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సృష్టించాడు. పదునైన కత్తితో, తొమ్మిది టొమాటోలను సమానభాగాలుగా కట్ చేశాడు.చెఫ్ వాంగ్ జూన్ 12న లండన్‌లో కేవలం 60 సెకండ్ల వ్యవధిలో 9 టమోటాలను కోసి ఈ ఘనతను సాధించాడు. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ఇన్స్టాగ్రామ్ పేజీ దీనికి సంబంధించిన వీడియోను పోస్ట్ చేసింది. వాయువేగంతో, అన్ని టొమాటాలను సమానంగా అందంగా కత్తిరించాడని వెల్లడించింది. ఇక్కడ విశేషం ఏంటేంటే ఏమాత్రం చిన్న తేడా వచ్చిన టమాటా ముక్కల స్థానంలో అతని వేళ్లు ఉండేవి. కానీ ప్రయోగాలు,రికార్డులు అతనికి వెన్నతో పెట్టిన విద్య. View this post on Instagram A post shared by Guinness World Records (@guinnessworldrecords)చాలా జాగ్రత్తగా ఒడుపుగా కట్ చేసి రికార్డు సొంతం చేసుకున్నాడు. వాలెస్ వాంగ్ ఈ ఒక రికార్డును మాత్రమే కాదు 2023, ఇటలీలో మరో రికార్డు కూడా క్రియేట్ చేశాడు. తాజా వీడియోపై కొంతమంది నెటిజన్లు సానుకూలంగా స్పందించగా, మా అమ్మ కూడా బాగా కట్ చేస్తుందని ఒకరు, ఇండియాలో ఇంతకంటే వేగంగా కట్ చేసే నిపుణులు చాలామంది ఉన్నారు అంటూ మరొకరు కమెంట్ చేశారు.వాలెస్ వాంగ్ చెఫ్, ఫిట్నెస్ అథ్లెట్, గిన్నిస్ వరల్డ్ రికార్డ్ హోల్డర్ మాత్రమే కాదు. ఒక కంపెనీకి సీఈవో కూడా. కేన్సర్ సర్వైవర్. ప్రపంచవ్యాప్తంగా అనేక టాప్ మెస్ట్ రెస్టారెంట్లలో పనిచేశాడు. సోషల్ మీడియాలో లక్షలాది మంది ఫాలోవర్లున్నారు. Can he beat the record? #chef #worldrecord #foodpreparation #canadasgottalent #foodchopper guinessworldrecord Wallace Wong attempts a World Record on Canada's Got Talent! 🥕🔪 pic.twitter.com/FpJPRDJ9WC— Olivia Gran (@GranOlivia) April 21, 2024 -
‘జగనన్న భూహక్కు –భూరక్ష’కు సర్వే రాళ్లు సిద్ధం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని 305 గ్రానైట్ కటింగ్, పాలిషింగ్ యూనిట్లకే జగనన్న భూహక్కు–భూరక్ష పథకం కోసం వినియోగించే సర్వే రాళ్ల ఆర్డర్లిస్తున్నామని రాష్ట్ర గనులు, ఇంధన, పర్యావరణ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పారు. మూడో దశలో అక్టోబర్ 15 నాటికి 25.42 లక్షల సర్వే రాళ్లు అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిపారు. వెలగపూడి సచివాలయంలో గ్రానైట్ ఫ్యాక్టరీ నిర్వాహకులతో సర్వే రాళ్ల సరఫరాపై శనివారం ఆయన సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో గ్రానైట్ ఫ్యాక్టరీలకు అండగా నిలిచేందుకు సీఎం జగన్ ప్రాధాన్యం ఇస్తున్నారని, సంక్షోభంలో కూరుకుపోయిన గ్రానైట్ ఫ్యాక్టరీలకు చేయూతనిస్తూ స్లాబ్ సిస్టమ్ తెచ్చారని, విద్యుత్ రాయితీలు కల్పించారని తెలిపారు. సర్వే రాళ్ల తయారీ ఆర్డర్లను గ్రానైట్ ఫ్యాక్టరీలకే ఇవ్వడం వల్ల ఆయా కర్మాగారాల్లో పనులు ముమ్మరంగా జరుగుతున్నాయని, వీటిపై ఆధారపడ్డ వారికి ఉపాధి లభిస్తోందన్నారు. ఇప్పటి వరకు 44.03 లక్షల సర్వే రాళ్లు సరఫరా చేశామని, ఇందుకు రూ.1,153.2 కోట్లను సరఫరాదారులకు, రాళ్ల రవాణా కోసం రూ.63.8 కోట్లు చెల్లించామన్నారు. రీసర్వే కోసం గతంలో గ్రానైట్ కటింగ్, పాలిషింగ్ యూనిట్ల నిర్వాహకులతో జరిగిన సమావేశంలో రోజుకు లక్ష సర్వే రాళ్లు కావాలని కోరామన్నారు. యూనిట్లకు రా మెటీరియల్‌ను కూడా గనుల శాఖ అధికారులు సమకూర్చారని, మొదట రూ.270 ఉన్న రేటును రూ.300కి పెంచామన్నారు. ఇంత చేస్తున్నా ఫ్యాక్టరీలకు బదులు బయటి నుంచి ట్రేడర్లు సర్వే రాళ్లు సరఫరా చేస్తున్నారన్న విషయం తమ దృష్టికి వచ్చిందన్నారు. దీనివల్ల ఫ్యాక్టరీలకు నష్టం జరుగుతోందని, దీనిని ఎట్టిపరిస్థితుల్లోనూ అనుమతించేది లేదని స్పష్టం చేశారు. -
కుమారుని బర్త్‌డే కేక్ కట్ చేస్తూ తండ్రి మృతి!
ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. నగరంలోని ఒక కాలనీలో కుమారుని బర్త్‌డే సందర్భంగా కేక్ కట్ చేస్తుండగా తండ్రి గుండెపోటుతో మృతి చెందాడు. ఈ ఉందంతం స్థానికంగా అందరినీ కంటతడి పెట్టించింది. లక్నోలోని ములాయం నగర్లో ఈ ఉదంతం చోటుచేసుకుంది. సుశీల్‌శర్మ(45) తన భర్య కిరణ్, పిల్లలు సాక్షి, సార్థక్, మన్నత్‌లతో పాటు స్థానికంగా ఉంటున్నాడు. తాజాగా సునీల్ శర్మ తన కుమారుడు సార్థక్ పుట్టినరోజు సంద్భంగా కేక్ కట్ చేస్తుండగా కళ్లుతిరిగి పడిపోయాడు. కుటుంబ సభ్యులు వెంటనే అతనిని ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యులు బాధితుడిని పరిశీలించి మృతి చెందినట్లు ధృవీకరించారు. సునీల్ మృతికి గుండెపోటు కారణమని వైద్యులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. మృతుని భార్య కిరణ్ మాట్లాడుతూ తమపై 22 లక్షలు రుణం ఉందని, ప్రతీనెల రూ. 70 వేలు కడుతున్నామని తెలిపారు. అయితే ఈనెల సొమ్ము కట్టలేకపోవడంతో అప్పు ఇచ్చినవారు ఘోరంగా అవమానించారని, దీంతో తన భర్త తీవ్ర ఆవేదనకు లోనయ్యాడని పేర్కొన్నారు. మృతుని భార్య కిరణ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నామని, దర్యాప్తు చేపడతామని పోలీసులు తెలిపారు. ఇది కూడా చదవండి: బావిలోకి తోసి.. భార్య విలవిలలాడుతుంటే వీడియో తీసి.. -
హెబ్బులి కటింగ్ నిషేధం...
యశవంతపుర: హెబ్బులి సినిమాలో హీరో సుదీప్ ప్రత్యేకమైన తలకట్టుతో కనిపిస్తాడు. అటువంటి కటింగ్ కావాలని పిల్లలు, యువత సెలూన్లలో పట్టుబడుతున్నారు. బాగలకోట జిల్లా జమఖండి తాలూకా కులహళ్లి ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల్లో ఈ మక్కువ ఎక్కువైపోయింది. స్థానిక సెలూన్‌కు వెళ్లి అదే కటింగ్ కొట్టించుకుంటున్నారు. ఒకరిని చూసి మరొకరు వెళ్తుండడంతో స్కూల్లో పాఠాల కంటే ఇదే ఎక్కువ చర్చనీయాంశమైంది. దీంతో దయచేసి మా స్కూలు పిల్లలకు ఈ కటింగ్ చేయవద్దని సెలూన్ నిర్వాహకులకు ఉపాధ్యాయులు స్పష్టంచేశారు. పిల్లలు చదువుకోవడానికి బదులుగా అద్దం ముందు కటింగ్ చూసుకుంటూ గడుపుతున్నారని వాపోయారు. ఎవరైనా వచ్చి అడిగితే హెబ్బులి కటింగ్ చేయరాదని విజ్ఞప్తి చేశారు. -
ధాన్యం నమోదులో దగా!
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: కరీంనగర్‌కు చెందిన శ్రీనివాస్ వేసంగిలో 104 బస్తాల ధాన్యం తూకం వేశాడు. మిల్లు వద్ద ట్రక్‌షీట్‌లో 104 బస్తాలుగానే నమోదు చేశారని భావించాడు. కింద 104 మైనస్ 4 అని రాసినట్టుగా గమనించలేదు. తీరా 100 బస్తాలకు మాత్రమే నగదు జమ కావడంతో అవాక్కయ్యాడు. ఇది ఒక్క కరీంనగర్‌లోనే కాదని, రాష్ట్రవ్యాప్తంగా దాదాపు అన్ని జిల్లాల్లో మిల్లర్లు రైతుల కష్టాన్ని యథేచ్ఛగా దోచేశారని తెలుస్తోంది. మొన్నటిదాకా తాలు పేరిట కొనుగోలు కేంద్రాల్లో, నాణ్యత లేదని రైస్‌మిల్లులో క్వింటాలుకు 9 నుంచి 11 కిలోల వరకు కోతపెట్టారు. వీటికి తోడు తాజాగా మరో కొత్త తరహా దోపిడీకి మిల్లర్లు తెరతీసినట్లు.. శ్రీనివాస్ తరహా ఉదంతాలు స్పష్టం చేస్తున్నాయి. రూ.వందల కోట్ల విలువైన ధాన్యానికి ఎసరు గతేడాది 50.23 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి అయింది. అయితే ఈసారి అకాల వర్షాలు ఇబ్బంది పెట్టినా దిగుబడి పెరిగింది. రాష్ట్రవ్యాప్తంగా 7,037 కొనుగోలు కేంద్రాల్లో 11,39,597 మంది రైతుల నుంచి ఇప్పటివరకూ 66.49 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం సేకరించింది. ఈ మొత్తం ధాన్యం విలువ రూ.12,011 కోట్లుగా అధికారులు పేర్కొన్నారు. ఇందులో దాదాపు రూ.1,500 కోట్లు మినహా మొత్తం ధాన్యం డబ్బులు ప్రభుత్వం చెప్పిన విధంగా రైతుల ఖాతాల్లో జమ చేసింది. వాస్తవానికి ప్రతి క్వింటాలుకు సగటున 10 కిలోల చొప్పున లెక్కలు వేసుకుంటే.. వేలాది క్వింటాళ్ల వరకు ధాన్యం కోతకు గురైంది. సాధారణ తరుగుతోనే రూ.కోట్లు వెనకేసుకున్న మిల్లర్లు ట్రక్ïÙట్ల మాయాజాలం కుంభకోణంతో రూ.వందల కోట్ల విలువైన ధాన్యాన్ని పోగు చేసుకున్నారనే ఆరోపణలు విన్పిస్తున్నాయి. మొత్తం 21 బస్తాలకు కోత..! పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం చిన్న»ొంకురుకి చెందిన రైతులు 10 మంది స్థానిక పీఏసీఎస్‌లో ధాన్యం అమ్ముకున్నారు. ధాన్యం కాంట వేస్తున్నప్పుడే తరుగు పేరుతో 2 కిలోలు కోత విధించారు. 10 మంది రైతులకు చెందిన 625 బస్తాల ధాన్యం లారీలో లోడ్ చేసి మిల్లుకు తరలించారు. అయితే రైతులకు తెలియకుండానే మిల్లుల్లో సైతం మరోసారి కటింగ్ పెట్టారు. తర్వాత ట్రక్ షీట్ మాయాజాలంతో కేవలం 604 బస్తాలకే లెక్కగట్టారు. ఆ మేరకే డబ్బులు రైతుల ఖాతాల్లో జమ అయ్యాయి. దీంతో తమకు ధాన్యం డబ్బులు తక్కువపడ్డాయని రైతులు వాపోతున్నారు. ఎంతలేదన్నా వీరి వద్దనుంచి 9 క్వింటాళ్ల వరకు ధాన్యం దోపిడీకి గురైంది. 11 బస్తాలు కొట్టేశారు వేసంగి ధాన్యాన్ని మహమ్మదాబాద్‌లోని కొను గోలు కేంద్రం ద్వారా విక్రయించాం. నాతో పాటు మరో ఇద్దరు రైతుల బస్తాలు కలిపి మొ త్తం 383 బ్యాగులు తూకం వేశారు. తొలుత కొనుగోలు కేంద్రంలోనే తరుగు పెట్టారు. మళ్లీ మిల్లు వద్దకు వెళ్లాక మొత్తం మీద 372 బస్తాలుగా ట్రక్ïÙటులో నమోదు చేశారు. – ఎండీ ఆలీ, కంచన్‌పల్లి, మహబూబ్‌నగర్ తేమ, తాలు పేరుతో కట్ చేశారు.. యాసంగి సీజన్లో పండించిన ధాన్యాన్ని ఇప్పగూడెం గ్రామంలో ఏర్పాటు చేసిన ఐకేపీ సెంటర్‌కు తీసుకెళ్లా. కాంటా పూర్తయిన తర్వాత, 439 బస్తాలు ఉన్నట్లు లెక్కవేసి రైస్ మిల్లుకు పంపించారు. ధాన్యం బస్తాలు మిల్లుకు వెళ్లిన తర్వాత తేమ, తాలు పేరిట కొన్ని బస్తాలు కట్ చేశారు. మొత్తం మీద 428 బస్తాలనే బిల్లులో చూపించారు. –జి.వెంకటయ్య, ఇప్పగూడెం, స్టేషన్‌ఘన్‌పూర్ రైతుల ఇష్టం మేరకే తరుగు ఎడతెరిపిలేని వర్షాల వల్ల ధాన్యం డామేజ్ వచి్చంది. దానివల్ల రైతుల ఇష్టం మేరకే మిల్లర్లు తరుగు తీశారు. ధాన్యం ఆరబెట్టడం, మళ్ళీ వర్షం పడటం పక్షం రోజులు అదే పరిస్థితి. కానీ ఒకసారి తరుగు తీశాక మళ్ళీ తీయడం ఉండదు. – అన్నమనేని సుధాకర్‌రావు, రైస్ మిల్లర్ల సంఘం రాష్ట్ర కార్యదర్శి మొత్తం డబ్బులు పడలేదు మా ఊరిలోని కొనుగోలు కేంద్రంలో ధాన్యం అమ్మిన. అప్పుడు తరుగుతో 142 బస్తాలు లెక్క గట్టారు. తీరా ఇప్పుడు 138 బస్తాలకే డబ్బులు పడ్డాయి. సెంటర్ వాళ్ళను అడిగితే.. మాకేమీ తెలియదు మిల్లు వాళ్ళను అడగమంటున్నారు. అధికారులు పట్టించుకోవడం లేదు. –ప్రశాంత్, కౌలు రైతు, చిన్న బొంకూర్, సుల్తానాబాద్ 4.4 క్వింటాళ్ల కోత.. రూ.9,800 నష్టం కొనుగోలు కేంద్రం నుంచి మొత్తం 303 బస్తాలు తూకం వేశారు. ఒకలారీలో 199 బస్తాలు పోగా.. ఆరు బ్యాగులు కట్ చేశారు. మరో దాంట్లో 104 బ్యాగులు పోయినయి.. ఐదు బ్యాగులు కట్ చేశారు. మొత్తంగా 4.4 క్వింటాళ్లు కోతతో మొత్తం రూ.9,800 నష్టం జరిగింది. అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదు. – విష్ణువర్ధన్, కరీంనగర్ -
భార్యను చంపి 5 ముక్కలుగా నరికి..
బిలాస్పూర్: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో బిలాస్‌పూర్‌కు చెందిన ఓ వ్యక్తి తన భార్యను చంపి, మృతదేహాన్ని ఐదు ముక్కలుగా నరికి, ఇంట్లోని ఖాళీ నీళ్ల ట్యాంకులో పడేశాడు. సక్రి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఉలాస్‌పూర్ ప్రాంతంలో ఓ వ్యక్తి నకిలీ నోట్లను ముద్రిస్తున్నాడనే అనుమానంతో ఓ ఇంట్లో సోదాలు జరిపారు. బాత్రూం మూలన ఉన్న ట్యాంకులో టేప్ వేసి పాలిధీన్ కవర్లో చుట్టిన శరీర భాగాలు కనిపించడంతో షాక్‌కు గురయ్యారు. అక్రమ సంబంధం అనుమానంతో భార్యను జనవరి 6న గొంతు పిసికి చంపినట్లు విచారణలో అతడు వెల్లడించాడు. అనంతరం కట్టర్‌తో మృతదేహాన్ని ఐదు ముక్కలు కోసి, కొనుక్కొచ్చిన ట్యాంకులో పడేసినట్లు తెలిపాడు. ఇంట్లో నకిలీ నోట్లు, కలర్ ప్రింటర్‌ను స్వాధీనం చేసుకున్నారు. -
పోలీస్ వ్యాన్‌లో బర్త్ డే జరుపుకున్న ఖైదీ: వైరల్
థానే: ఒక ఖైదీ పోలీస్ వ్యాన్‌లో బర్త్ డే జరుపుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో సర్వత్రా పెద్ద ఎత్తున విమర్శలు వెలువెత్తాయి. ఈ ఘటన మహారాష్ట్రలో థానే జిల్లాలో చోటుచేసుకుంది. రోషన్ ఝూ అనే 28 ఏళ్ల నిందితుడు ఒక కేసు విచారణ కోసం కోర్టు వెలుపల నిరీక్షిస్తున్నప్పుడు ఈ ఘటన జరిగింది. అతను ఒక హత్య కేసులో నిందితుడు, గత నాలుగేళ్లుగా జైలులోనే శిక్ష అనుభవిస్తున్నాడు. ఈ మేరకు పోలీసు వ్యాన్‌లో ఉన్న సదరు నిందితుడు రోషన్‌కి అతని అనుచరులు బర్త్ డే కేక్‌ని వ్యాన్ విండ్ వద్ద నుంచి అందించారు. అతను చక్కగా కేక్ కట్ చేసి బర్త్ డే జరుపుకున్నాడు. అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు వాట్సాప్ స్టేటస్‌లోనూ, సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పెద్ద దూమరం రేపింది. అయినా ఒక ఖైదీ పోలీసు వ్యాన్‌లో దర్జాగా వేడుకలు జరుపుకుంటుంటే పోలీసులు ఏం చేస్తున్నారంటూ పెద్ద ఎత్తున్న విమర్శలు వచ్చాయి. ఐతే జైలు సూపరింటెండెంట్ అధికారులు ఆ నిందితుడు కళ్యాణ్ అధర్వడి జైలులో ఖైదీగా ఉన్నాడని, కేసు విచారణ విషయమై అన్ని ప్రోటోకాల్స్‌ని అనుసరించే బయటకు తీసుకువచ్చామని చెప్పారు. ఆ నిందుతుడిని కోర్టులో హాజరుపర్చేందుకు ప్రత్యేక ఎస్కార్ట్ పోలీసు బృందం తీసుకువెళ్లిందని తెలిపారు. ఆ నిందితుడి కార్యకలాపాలపై ఆ బృందం గట్టి నిఘా ఉంచుతుందని చెప్పారు. ఇది అధికారులకు చెడ్డపేరు తీసుకురావాలనే దురుద్దేశంతో కావాలని చేసిన పనిగా అధికారులు పేర్కొన్నారు. పైగా ఆ నిందితుడిని తీసుకువెళ్లిన ఎస్కార్ట్ బృందాన్ని కూడా విచారిస్తున్నామని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. అతనిపై వివిధ పోలీస్స్టేషన్లలో దాడి, హత్యాయత్నం, దోపిడి వంటి ఇతర కేసులు నమోదయ్యాయని అధికారులు తెలిపారు. అంతేగాక 2017లో ఒక కానిస్టేబుల్ పై కూడా దాడి చేశాడని చెబుతున్నారు. (చదవండి: అప్పు తీర్చమన్నందుకు హత్య, ఇద్దరికి జీవితఖైదు ) -
గాజుతో వజ్రాన్నీ కోయవచ్చు!
వజ్రాన్ని వజ్రంతోనే కోయగలమని అంటుంటారు కదా! కానీ, ఇప్పుడు గాజుతోనూ వజ్రంపై గాట్లు పెట్టవచ్చంటున్నారు చైనాలోని మెటీరియల్స్ సైంటిస్ట్‌లు. అంతేకాదు.. వజ్రం కంటే దృఢంగా ఉండే ఈ సరికొత్త గాజు సిలికాన్ మాదిరిగా అర్ధ వాహకం కూడా. ఏఎం–3 అని పిలుస్తున్న ఈ పదార్థం సౌరశక్తి ఘటకాల తయారీలో ఇప్పటివరకూ అసాధ్యమనుకున్న ఎన్నో పనులను సుసాధ్యం చేస్తుందని అంచనా. సహజ, మానవ నిర్మిత వజ్రాలతో కొన్ని పోలికలు ఉన్నప్పటికీ ఏఎం–3లో అణువులు, పరమాణువుల అమరిక వజ్రాల మాదిరిగా స్పష్టంగా ఉండదు. ఇలా నిర్మాణంలో తేడాలున్న వాటిని అమార్ఫస్ అని పిలుస్తుంటారు. ప్లాస్టిక్‌తోపాటు జెల్, గాజు కూడా ఈ కోవలోనివే. కానీ, గాజు మాత్రం దృఢంగా ఉండదన్నది మనకు తెలిసిన విషయమే. అయితే చైనాలోని యన్శాన్ వర్సిటీ శాస్త్రవేత్తలు గాజుకు కూడా ఈ దృఢత్వాన్ని అందించేందుకు కొన్ని ప్రయత్నాలు చేశారు. బంతి ఆకారంలో ఉండే కర్బన అణువుల సాయంతో గాజు అణు నిర్మితిని మార్చే ప్రయత్నం చేసి విజయం సాధించారు. పదార్థపు దృఢత్వాన్ని లెక్కించే వికర్స్ హార్డ్నెస్ టెస్ట్‌లో ఏఎం–3 113 జీపీఏ కలిగి ఉందని పరీక్షల్లో తేలింది. ఉక్కు వికర్స్ సూచీ కేవలం తొమ్మిది మాత్రమే. అంటే.. దీనికి కనీసం 13 రెట్లు ఎక్కువ దృఢమైన గాజు తయారైందన్నమాట. సహజసిద్ధమైన వజ్రాల వికర్స్ సూచీ 70 – 100 వరకూ ఉంటుంది. కానీ, శాస్త్రవేత్తలు ఏఎం–3తో వజ్రాన్ని కోసే ప్రయత్నం చేస్తే గాట్లు పడినట్లు స్పష్టమైంది. అంతేకాకుండా.. ఏఎం–3 గాజు 1.5 – 2.2 ఎలక్ట్రాన్ వోల్టుల బ్యాండ్ గ్యాప్‌లో అర్ధవాహకంగా పనిచేస్తున్నట్లు తెలిసింది. మైక్రోప్రాసెసర్ల తయారీకి ఉపయోగించే సిలికాన్ కూడా ఈ బ్యాండ్గ్యాప్లోనే పనిచేస్తుండటం విశేషం. ఇలాంటి పదార్థం అందుబాటులో ఉంటే.. కాంతిని నేరుగా విద్యుత్తుగా మార్చవచ్చని అంచనా. పరిశోధన వివరాలు నేషనల్ సైన్స్ రివ్యూ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. -
‘కూరగాయల’ కోసం పొడుచుకున్న స్నేహితులు
హైదరాబాద్: ఇద్దరు కలిసి ఒకే పరిశ్రమలో పని చేస్తుండడంతో వారిద్దరూ కలిసి ఒక గది అద్దెకు తీసుకుని నివసిస్తున్నారు. ఈ క్రమంలో వంటావార్పు చేసుకుని తింటూ పనికి వెళ్తున్నారు. అయితే రూమ్‌లో పనులు చెరి సగం చేసుకోవాల్సిన విషయంలో ఇద్దరి అభిప్రాయ బేధాలు వచ్చి చంపుకునే దాక చేరాయి. తాజాగా కూరగాయలు కోయమని మిత్రుడిని అడగా అతడు పెడచెవిన పెట్టడంతో వివాదం మొదలైంది. అటు నుంచి గొడవ పెద్దదై అదే కత్తితో పొడిచే స్థాయికి చేరింది. ఈ ఘటన హైదరాబాద్‌లోని సనత్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. స్థానిక హెచ్‌పీ రోడ్ కాలనీలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన మైతాస్ ఆలి సల్మాన్, ఫిరోజ్ ఒకే గదిలో ఉంటున్నారు. వీరిద్దరూ ఆరు నెలల నుంచి ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు. మంగళవారం రాత్రి 10:30 సమయంలో గదికి వారిద్దరు వచ్చారు. వంట కోసం కూరగాయలు కట్ చేసి ఇవ్వమని మైతాస్ ఆలి కోరగా సల్మాన్ ఫిరోజ్ పట్టించుకోలేదు. దీంతో కూరగాయలు కట్ చేసే కత్తితో సల్మాన్ ఫిరోజ్‌పై దాడి చేశాడు. దీంతో ఫిరోజ్‌కు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఫిరోజ్‌ను గాంధీ ఆస్పత్రికి తరలించారు. అతడి పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. స్థానికులు ఫిర్యాదు చేయడంతో సనత్‌నగర్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
ప్రైవేటు టీచర్లకు కటింగ్ ఫ్రీ..
జనగామ: కరోనా కష్టకాలంలో వేతనాలు లేక ఇబ్బందులు పడుతున్న ప్రైవేట్ ఉపాధ్యాయులకు జనగామ జిల్లా కేంద్రంలోని సోమేశ్వర హెయిర్ సెలూన్ యజమాని గడ్డం నరేశ్ అండగా నిలుస్తున్నారు. ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న ప్రైవేట్ టీచర్లకు తన వంతు సాయంగా ఉచితంగా క్షవరం చేస్తున్నాడు. వాట్సాప్ స్టేటస్ ద్వారా ఈ సేవలపై ఆయన ప్రచారం చేస్తున్నారు. ఈ సందర్భంగా నరేశ్ మాట్లాడుతూ, కరోనా సమయంలో తాను సైతం ఆర్థికంగా ఇబ్బందులు పడ్డానని, తనలా సమస్యలు ఎదుర్కొంటున్న వారికి చేదోడుగా నిలవాలన్న భావనతోనే ఉచితంగా హెయిర్ కటింగ్ చేస్తున్నట్లు తెలిపారు. -
పెట్రో భారం : త్వరలోనే శుభవార్త?!
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా అప్రతిహతంగా పెరుగుతున్న పెట్రోలు, డీజిల్ ధరలపై వినియోగదారులకు త్వరలోనే ఊరట లభించనుందా? తాజా అంచనాలు ఈ ఆశాలనే రేకెత్తిస్తున్నాయి. పెట్రోలు ధరలు రికార్డు స్థాయిలను తాకడంతో వాహనాలను తీయాలంటేనే భయపడుతున్న పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో అటు ప్రతిపక్షాలు, ఇటు ప్రజలు కేంద్రం ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అయితే పెట్రో ధరలపై బీజేపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకునుందనే అంచనాలు భారీగా వ్యాపించాయి. ఈ మేరకు చమురుపై ఉన్న పన్నులు తగ్గించి సామాన్యులపై పడుతున్న భారాన్ని తప్పించాలని యోచిస్తోందట. (పెట్రోలుకు తోడు మరో షాక్ ) పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాలను తగ్గించేందుకు ఆర్థిక మంత్రిత్వశాఖ భారీ కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. వినియోగదారులపై పన్ను భారాన్ని తగ్గించడానికి అత్యంత ప్రభావవంతమైన మార్గాన్ని కనుగొనటానికి ఆర్థిక మంత్రిత్వ శాఖ ఇప్పుడు కొన్ని రాష్ట్రాలు, చమురు కంపెనీలు, చమురు మంత్రిత్వ శాఖలతో సంప్రదింపులు ప్రారంభించింది. ధరలను స్థిరంగా ఉంచగల మార్గాలను అన్వేషిస్తున్నామనీ, మార్చి మధ్య నాటికి సమస్యను ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉందని పేరు చెప్పడానికి ఇష్టపడని అధికార వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం చమురు రిటైల్ ధరలో పన్నుల వాటానే దాదాపు 60 శాతం దాకా ఉంది. ఈ నేపథ్యంలోనే చమురుపై ఉన్న పన్నులను తగ్గించేందుకు వివిధ రాష్ట్రాల ప్రభుత్వాలు, చమురు సంస్థలు, పెట్రోలియం శాఖతో ఆర్థిక శాఖ సంప్రదింపులు చేస్తోంది. కాగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేృత్వంలోని బీజేపీ సర్కార్ గత 12 నెలల్లో రెండుసార్లు పెట్రోల్, డీజిల్ పై పన్నులను పెంచింది. తాజాగా వినియోగదారులపై భారాన్ని తగ్గించేందుకు కసరత్తు చేస్తో్ంది. అంతేకాదు ముడి చమురు ధరలు పెరిగినా.. రోజువారీగా ధరలను సమీక్షించే పద్ధతిని ఉపసంహరించుకోవాలని నిర్ణయించినట్టు కూడా తెలుస్తోంది. మరోవైపు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇటీవల వ్యాఖ్యలు ఈ అంచనాలకు బలాన్నిస్తున్నాయి. ఇంధనంపై పన్నును ఎప్పుడు తగ్గిస్తామో చెప్పలేను, కానీ, పన్ను భారంపై కేంద్ర, రాష్ట్రాలు చర్చించాలి వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. చదవండి: ప్యాసింజర్‌కు అస్వస్థత, కరాచీకి ఎమర్జెన్సీ మళ్లింపు టాటా మోటార్స్‌కు భారీ షాక్ -
పాత వేపచెట్టు : భారీ జరిమానా
సాక్షి,హైదరాబాద్: ‘మొక్కే కదా అని పీకేస్తే...మెగాస్టార్ చిరంజీవి మూవీ ఇంద్ర సినిమాలోని డైలాగ్ గుర్తుందా.. అచ్చంగా పర్యావరణం పట్ల ఇలాగే స్పందించాడో బాలుడు. దీంతో 42 ఏళ్ల వేపచెట్టును నరికి పారేసిన వ్యక్తి భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. భారీ వేపచెట్టును కొట్టివేసిన ఘటనను గమనించిన 8వ తరగతి ఒక విద్యార్థి అటవీ శాఖకు ఫిర్యాదు చేశాడు. దీంతో దర్యాప్తు జరిపిన అటవీ శాఖ అధికారులు అనుమతి లేకుండా చెట్టును నరికివేసినట్లు ధృవీకరించారు. ఇందుకు ఆ వ్యక్తికి 62,075 రూపాయల జరిమానా విధించారు. అలాగే ఈ సంఘటన గురించి తమకు సమాచారం ఇచ్చిన బాలుడికి అధికారులు కృతజ్ఞతలు తెలిపారు. వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ సైదాబాద్ ప్రాంతంలో నాలుగు దశాబ్దాల నాటి పాత వేప చెట్టును నరికివేశాడు ఒకవ్యక్తి. ఇంటి నిర్మాణాకి అడ్డుగా ఉండటంతో వేరే ప్రత్యామ్నాయం వైపు ఏమాత్రం ఆలోచించలేదు. రాత్రికి రాత్రికే ఆ చెట్టును కొట్టించి, అక్కడ ఎలాంటి ఆనవాళ్లు కనిపించడకుండా హుటాహుటిన కలపను కూడా తరలించేశారు. అయితే దీన్ని గమనించిన పిల్లవాడు అందరిలాగా తనకెందుకులే అనుకోలేదు...ఇది మామూలేలే అని అస్సలు మిన్నకుండి పోలేదు.. వెంటనే అటవీశాఖ నంబర్ 1800 425 5364కు ఫోన్ చేశాడు. చెట్టును నరికించిన వ్యక్తి, ఇందుకు సహాయం చేసిన ఇతరులపై చర్యలు తీసుకోవాలని కోరాడు. దీనిపై విచారణ జరిపి, సంబంధిత వ్యక్తులపై రూ .62,075 జరిమానా విధించినట్లు హైదరాబాద్ (తూర్పు) అటవీ అధికారి వెంకటయ్య తెలిపారు. ఈ సందర్భంగా చిన్న వయసులోనే బాధ్యతాయుతంగా వ్యవహరించిన విద్యార్థిని అభినందించారు. ఒక పిల్లవాడు ఫిర్యాదుపై స్పందించి, జరిమానా విధించడం విశేషమే మరి. -
ప‘రేషన్’!
► ఇక బియ్యం, కిరోసిన్ మాత్రమే సరఫరా ► దూరమైన పంచదార ► నిత్యావసర ధరల పెరుగుదలే కారణం నేరడిగొండ(బోథ్): ఒకటో తారీఖు వచ్చిందంటే చౌకధరల దుకాణాల వద్ద సరుకుల కోసం ప్రజలు బారులు తీరడం కనిపిస్తుంది. ఆరోజు పనికి వెళ్లకపోయినా పర్వాలేదు. సరుకులు ఉంటే చాలు అని అనుకునే నిరుపేద ప్రజలు ఎందరో ఉన్నారు. అలాంటిది క్రమక్రమంగా రేషన్ సరుకులను ఒక్కొక్కటిగా దూరం చేయడంతో ప్రజలు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. కేంద్ర ప్రభుత్వం సరుకుల పంపిణీలో రాయితీ ఎత్తివేయడంతో ఆహార భద్రత కార్డులు ఉన్న పేద ప్రజలకు ఇక చౌకధరల దుకాణాల ద్వారా బియ్యం, కిరోసిన్ మాత్రమే పంపిణీ చేయనున్నారు. మిగితా సరుకులన్నీ బహిరంగ మార్కెట్లలో కొనుగోలు చేయాలంటే పెరిగిన ధరల నేపథ్యంలో ప్రజలు జంకుతున్నారు. చాలామంది రేషన్ దుకాణాలపైనే ఆధారపడి జీవనం సాగిస్తుండగా ఇప్పటికే చౌకధరల దుకాణాల్లో ఏ నెల, ఏ సరుకు లేకుండా సరఫరా చేస్తారో తెలియక లబ్దిదారులు లబోదిబోమంటున్నారు. తాజాగా రేషన్ సరుకుల్లో మునుపెన్నడూ లేనివిధంగా కోత విధించడంతో పేద, మధ్యతరగతి ప్రజలు మండిపడుతున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో 344 రేషన్ దుకాణాలు ఉండగా, 1,81,608 మంది లబ్ధిదారులు ఉన్నారు. అందులో 1,68,407 ఆహార భద్రత కార్డులు, 12,928 అంత్యోదయ కార్డులు, 273 అన్నపూర్ణ కార్డులు ఉన్నాయి. వీరికి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రూ.140 తొమ్మిది రకాల సరుకుల్లో బియ్యం, కందిపప్పు, చక్కెర, నూనె, గోధుమ పిండి, కిరోసిన్, ఉప్పు, చింతపండు, తదితర సరుకులను అందించేవారు. తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చక్కెర, మంచినూనె, గోధుమ, చింతపండు, కారంపొడి, ఉప్పు లాంటి సరుకులను అందించారు. గతేడాది రాష్ట్ర ప్రభుత్వం చింతపండు, నూనె, కంది పప్పు, గోధుమ పిండి, కారం తదితర సరుకుల్లో కోత విధించింది. మార్కెట్లో కొనుగోలు చేయాలంటే రూ.300 వరకు ఖర్చు చేయాల్సి వస్తుంది. ఇటీవల చక్కెర రాయితీ ఎత్తివేయడంతో జూన్ నుంచి అది కూడా పేద ప్రజలకు దూరమైంది. ఇక బియ్యంతోనే పేద ప్రజలు సరిపెట్టుకుంటున్నారు. తగ్గిన కిరోసిన్ కోటా వంట గ్యాస్ సిలెండర్‌ను వాడుతున్న కుటుంబాలకు లీటర్, లేని కుటుంబాలకు 2 లీటర్ల చొప్పున కిరోసిన్ సరఫరా చేసే పద్దతిని తాజాగా మార్చేశారు. రాయితీని తగ్గిస్తూ లీటర్‌కు రూ.10ఉన్న కిరోసిన్‌ను రూ.21కి పెంచడంతో పేద ప్రజలకు భారంగా మారింది. నిత్యావసర సరుకులు ఒక్కొక్కటి మాయం కావడంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అన్ని సరుకులు అందించాలి పేదప్రజలకు గతంలో మాదిరి బియ్యంతో పాటు కందిపప్పు, ఉప్పు, కారంపొడి, చక్కెర, చింతపండు సరుకులను రూ.140లకే అందించాలి. ప్రధానంగా విద్యుత్ లేని సమయంలో దీపం వెలిగిద్దామన్నా కిరోసిన్ లేక ఉదయం వేళల్లో టీ తాగాలన్నా చక్కెరను అందించకపోవడంతో మార్కెట్లో అధిక ధరలకు కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. – లచ్చన్న, నేరడిగొండ పంపిణీలో పారదర్శకత పాటిస్తాం ప్రజాపంపిణీ వ్యవస్థలో పారదర్శకత పాటిస్తూ పేద ప్రజలందరికీ సరుకులు దొరికేలా చర్యలు తీసుకుంటున్నాం. ప్రస్తుతం బియ్యం, కిరోసిన్ అందిస్తున్నాం. మే నుంచి చక్కెర కోత విధించడంతో అంత్యోదయ కార్డులు ఉన్నవారికే అందిస్తున్నాం. చింతపండు, కారంపొడి, గోధుమ, తదితర సరుకుల పంపిణీ చేపడితే పక్కదారి పడతున్నాయనే ఉద్దేశ్యంతో నిలిపివేశాం. – కూనాల గంగాధర్, తహసీల్దార్ నేరడిగొండ -
యువతిపై సర్పంచ్, గ్రామస్తుల అమానుషం
జోద్పూర్: రాజస్తాన్ లో దారుణం చోటు చేసుకుంది. తన ఫాంలో చెట్లు నరకడాన్ని వ్యతిరేకించిన యువతిని అమానుషంగా హత్యచేశారు. జోధ్ పూర్ గ్రామంలో ఆదివారం ఈ సంఘటన జరిగింది. గ్రామానికి చెందిన లలిత (20)ను గ్రామ పెద్దలు, మరికొంతమంది గ్రామస్తులు సజీవ దహనం చేసిన ఘటన కలకలం రేపింది. పోలీసులు అందించిన సమాచార ప్రకారం జోధ్‌పూర్‌కు చెందిన గ్రామ సర్పంచ్ సహా కొంతమంది గ్రామస్తులు లలిత పొలంలో చెట్లను నరకడానికి ప్రయత్నించారు. దీన్ని ఆమె తీవ్రంగా ప్రతిఘటించడంతో ఉద్రిక్తత చెలరేగింది. రెచ్చిపోయిన వారు ఆమెపై మూకుమ్మడిగా దాడిచేశారు. అక్కడితో ఆగకుండా ఆవేశంతో విచక్షణ మరచి ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం ఉదయం లలిత కన్నుమూసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని పోలీసు అధికారి సురేష్ చౌదరి తెలిపారు. ముఖ్యంగా ఈ కేసులో ప్రధాన నిందితుడుగా భావిస్తున్న గ్రామ సర్పంచ్ రణవీర్ సింగ్, ఇతర గ్రామస్తులను విచారిస్తున్నట్టు చెప్పారు. విచారణ అనంతరం వారిని అదుపులోకి తీసుకుంటామన్నారు. -
సీనియర్ ఉద్యోగులపై ఆ బ్యాంకు వేటు!
గ్లోబల్ బ్యాంకింగ్ దిగ్గజం హెచ్ఎస్బీసీ సీనియర్ ఉద్యోగులపై వేటు వేయడం ప్రారంభించింది. ఈ వారంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ డివిజెన్లో పనిచేస్తున్న దాదాపు 100 మంది సీనియర్ ఉద్యోగులను హెచ్ఎస్బీసీ తొలగిస్తుందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. ఈ కోత ప్రభావం గ్లోబల్ బ్యాంకింగ్, మార్కెట్స్ డివిజన్లో పనిచేస్తున్న మేనేజింగ్ డైరెక్టర్, డైరెక్టర్ స్థాయిలో ఉండనుందని తెలుస్తోంది. గ్లోబల్ బ్యాంకింగ్ అండ్ మార్కెట్స్‌లో కంపెనీ వార్షిక ప్రదర్శనను సమీక్షిస్తున్నామని బ్యాంకు అధికార ప్రతినిధి ఈ-మెయిల్ ప్రకటనలో తెలిపారు. తమ వ్యాపారాలను వృద్ధి పరుచుకుని, బలపడటానికి కొన్ని మార్పులు చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. హెచ్ఎస్బీసీ తన పూర్తి ఏడాది రాబడులను ఫిబ్రవరి 21న రిపోర్టు చేయనుంది. ఈ ఏడాది హెచ్ఎస్బీసీ బ్యాంకు షేర్లు 3.3 శాతం పైకి ఎగిశాయి. -
ఫిబ్రవరిలో రెపో పావు శాతం కోత: హెచ్ఎస్బీసీ
ముంబై: బ్యాంకులకు తానిచ్చే స్వల్పకాలిక రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు– రెపోను (ప్రస్తుతం 6.25 శాతం) రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఫిబ్రవరిలో పావు శాతం తగ్గిస్తుందని అంతర్జాతీయ ఆర్థిక సేవల సంస్థ– హెచ్ఎస్బీసీ అంచనా వేస్తోంది. అయితే దీని తర్వాత రేట్ల కోతలకు బ్రేక్ పడే అవకాశం ఉందని కూడా పేర్కొంది. వస్తు సేవల పన్ను (జీఎస్టీ) అమలులో అనిశ్చితి, కూడ్ర్ ఆయిల్ ధరలు పెరిగే అవకాశం, మధ్యకాలికంగా ద్రవ్యోల్బణం ఒత్తిళ్లు, అమెరికా సెంట్రల్ బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ (ఫెడ్) రేటు పెంపు అవకాశాలు దీనికి కారణంగా వివరించింది. పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో అక్టోబర్–డిసెంబర్ త్రైమాసిక జీడీపీ వృద్ధి రేటు 5 శాతంగా ఉంటుందని, జనవరి–మార్చి త్రైమాసికంలో ఈ రేటు 6 శాతానికి పెరుగుతుందని హెచ్ఎస్బీసీ అంచనావేసింది. అయితే వృద్ధి రేటు క్రమంగా పుంజుకుంటుందనీ, వచ్చే ఆర్థిక సంవత్సరం (2017–18) ఈ రేటు 7.5–8 శాతం శ్రేణి మధ్య ఉంటుందని పేర్కొంది. -
ఫియట్ కార్ల ధరలు తగ్గాయ్
న్యూఢిల్లీ: ఇతర వాహన కంపెనీలన్నీ వాటి కార్ల ధరల పెంపులో నిమగ్నమై ఉంటే.. ఫియట్ క్రిస్లర్ ఆటోమొబైల్స్ (ఎఫ్సీఏ) ఇండియా మాత్రం వీటికి భిన్నంగా మరంత మంది కస్టమర్ల ఆకర్షించడం కోసం కార్ల ధరల్లో కోత విధించింది. తన సెడాన్ కారు లీనియా ధరను 7.3 శాతం వరకు (రూ.77,121 వరకు).. హ్యాచ్‌బ్యాక్ కారు పుంటో ఈవో ధరను దాదాపు 7 శాతం వరకు (రూ.47,365 వరకు) తగ్గించింది. దీంతో లీనియా కార్ల ధర రూ.7.25 లక్షల నుంచి రూ.9.99 లక్షల శ్రేణికి తగ్గింది. కాగా వీటి ఇదివరకు ధర రూ.7.82 లక్షల నుంచి రూ.10.76 లక్షల శ్రేణిలో ఉంది. ఇక పుంటో ఈవో కార్ల ధర కూడా రూ.5.45 లక్షలు – రూ.7.55 లక్షల శ్రేణికి తగ్గింది. వీటి ఇదివరకు ధర రూ.5.85 లక్షలు– రూ.7.92 లక్షల శ్రేణిలో ఉంది. కాగా ఈ ధరలన్నీ ఎక్స్‌షోరూమ్ ఢిల్లీవి. -
కోత..అవస్థ
లేదు..లేదంటూనే ‘షాక్’ఇస్తున్న సర్కార్ ఇష్టానుసారంగా కరెంట్ కటింగ్‌తో జనం బేజార్ ఖమ్మం: అదేంటో గానీ..కొంతకాలంగా కరెంట్ ఎప్పుడు పోతుందో..ఎంతసేపు తీస్తారో..తిరిగి ఎప్పుడిస్తారో తెలియని పరిస్థితి నెలకొంది. అస్సలు విద్యుత్ కోతలే ఉండవని..పాలకులు గొప్పగా చెప్పినా..ఆచరణలో మాత్రం మళ్లీ పాతరోజులు వచ్చేశాయి. మరమ్మతుల పేరిట సరఫరా ఆపేస్తున్నామని అధికారులు చెబుతుంటే..షరా మామూలే..అని సర్దుకోవాల్సిన దుస్థితి నెలకొంటోంది. ఈ ఏడాది ఇంకా పూర్తిస్థాయిలో పంటల సాగు ఊపందుకోకున్నా..ఈ కోతలెందుకోననే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ట్రాన్స్‌కో బాధ్యులు స్పందించాలని రైతులు, ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో ఎన్పీడీసీఎల్ అధికారులు కొద్దిరోజులుగా ఇష్టారాజ్యంగా విద్యుత్ కోతలు విధిస్తున్నారనే విమర్శలొస్తున్నాయి. మరమతుల పేరిట గంటల కొద్దీ సరఫరా ఆపేస్తున్నారు. రోజుకో ప్రాంతంలో కోత విధిస్తున్నారు. సాగు పనులు చేపట్టిన రైతులు వరి, పత్తి, మిర్చి, ఇతర పంటలకు సాగునీరు పెట్టలేక ఇబ్బంది పడుతున్నారు. బావులు, బోర్లపై ఉన్న విద్యుత్ మొటర్లను ఒకేసారి వినియోగించడంతో పెరిగిన అవసరానికి అనుగుణంగా విద్యుత్ సరఫరా లేక అదనపు లోడ్‌పడి ట్రాన్స్ఫార్మర్లు, విద్యుత్ మోటార్లు కాలిపోతున్నాయి. ఎప్పుడు విద్యుత్ వస్తుందో, ఎప్పుడు పోతుందో తెలియని అయోమయ పరిస్థితి నెలకొంటోంది. కనీసం గంట..వచ్చేది చెప్పలేమంట ఒక వైపు వినియోగానికి సరిపడా విద్యుత్ సరఫరా చేస్తన్నామని అధికారులు చెబుతున్నా..వాస్తవానికి జిల్లాలో ప్రతిరోజూ అన్ని చోట్లలో కరెంట్ కోత విధిస్తున్నారు. కొత్తలైన్లు వేయడం, విద్యుత్ సబ్ స్టేషన్లలో రిపేర్ల కోసం..ప్రతి శనివారం గంటల కొద్దీ సరఫరాను నిలిపేస్తున్నారు. ఇక మిగతా రోజుల్లో కోతలు అనధికారమన్నమాట. ప్రధానంగా ఖమ్మం నగరంలో గతంలో కంటే..ఈ షాక్ ఇటీవల ఎక్కువైంది. పాలేరు, మధిర, ఇల్లెందు డివిజన్లలో తరుచూ విద్యుత్ కోతలు విధిస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. కొన్ని గ్రామాల్లో కరెంట్ పోయిందంటే కనీసం గంట వరకు రాదని, కొన్నిసార్లు ఎన్ని గంటల తర్వాత ఇస్తారో తెలియదని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. మరమ్మతు..జాప్యంమస్తు తరుచూ లైన్లపై ట్రిప్ కావడంతో మరమ్మతు చేయాల్సి వస్తోందని అధికారులు చెబుతున్నారు. అయితే..విద్యుత్ శాఖలోని కింది స్థాయి ఉద్యోగులు సరిపడా లేక రిపేర్‌కు జాప్యం నెలకొంటోంది. మరమతు చేసేందుకు గంటల కొద్దీ సమయం పడుతోందని ప్రజలు ఆరోపిస్తున్నారు. గత నెలరోజుల వ్యవధిలోనే జిల్లాలో 440కి పైగా ట్రాన్స్ఫార్మర్లు దెబ్బతిన్నాయి. ఈ విషయంపై ఇటీవల జిల్లా అధికారులతో ఎన్పీడీసీఎస్ సీఎండీ వెంకటనారాయణ సమీక్షించి ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్రాన్స్ఫార్మర్లు విఫలం కాకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు కూడా. పెరిగిన వాడకం..సరఫరాలో విఫలం ప్రస్తుతం జిల్లాలో వరినాట్లు పడుతుండడం, పత్తి పంట పూత, కాత దశలో ఉండటంతో సాగునీటి అవసరం పెరిగింది. మరోపక్క మిర్చి నార్లు పోయడం, తోటలు వేసే సీజన్ కావడంతో సాగునీటి కోసం బోర్లు, బావులపై విద్యుత్ మోటార్లను వినియోగిస్తుండడంతో..కరెంట్ వాడకం డిమాండ్ పెరిగింది. అయితే ఈ విద్యుత్‌ను సరఫరా చేసేందుకు ప్రభుత్వం, ఎన్పీడీసీఎల్ నుంచి ఎలాంటి ఇబ్బంది లేకున్నా.. ప్రజల అవసరాలకు అనుగుణంగా సరఫరా చేయడంలో అధికారులు విఫలమయ్యారు. దీంతో ఒక వైపు వర్షాలు లేకపోవడం, మరోవైపు ట్రాన్స్ఫార్మర్ల రిపేర్లు, లైన్లట్రిప్ పేరిట గంటల కొద్దీ విద్యుత్ తీసివేస్తున్నారు. ఫలితంగా మిర్చి తోటలు, మిరుపనారు, పత్తి పంట వాడిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇళ్ల వద్ద ఉన్న ప్రజలు కూడా..అప్రకటిత కోతలతో అవస్థలు పడుతున్నారు. పెరిగిన కరెంట్ వాడకం ఇలా.. – జిల్లాలో రోజుకు సగటు వినియోగం 5.865 మిలియన్ యూనిట్లు – ఈనెల 15న 6.667 మిలియన్ యూనిట్లు – 16న 6.96 మిలియన్ యూనిట్ల డిమాండ్ – అంటే రోజుకు 1.2 మిలియన్ యూనిట్లు అధికం. – గత రెండు మూడు రోజుల్లో 372, 424 మెగావాట్ల మేరకు డిమాండ్ -
చెట్టు తల్లి.. చెమ్మగిల్లి
కడెం : చెట్టు తల్లి రోదనలు చెవిన పట్టించుకున్నారు. సహదయంతో స్పందించారు. చెట్టుకు ప్రాణం ఉంటుందని చెట్టూ ప్రాణం పోస్తుందని ప్రచారం చేస్తున్నారు. చెట్లను నరకవద్దని వినూత్న రీతిలో ప్రచారం చేపట్టి పలువురి మన్ననలు పొందుతున్నారు అటవీశాఖ సిబ్బంది. విలువైన కలపను నరకవద్దు. కలపను నరికితే అడవి తల్లి రోదిస్తుంది. ఒక చెట్టును నరికితే దాని పర్యవసనం అనేక కష్టాలు. అంటూ వినూత్న రీతిలో ప్రచారానికి శ్రీకారం చుట్టింది అటవీశాఖ. టైగర్ జోను పరిధిలోని కడెం అటవీ క్షేత్రంలోని దోస్తునగర్ గ్రామ సమీపంలో ఇందన్పల్లి క్రాసింగు వద్ద ప్రధాన రహదారి పక్కన కళాత్మక సందేశాన్నిస్తున్నట్లుగా అందమైన శిల్పాలను ఏర్పాటు చే శారు. స్మగ్లర్లు అడవి తల్లిని రంపంతో కోస్తుంటే దాని నుంచి రక్తస్రావం జరుగుతున్నట్లుగా,ఆ చెట్టు పిల్ల రోదిస్తున్నట్లుగా శిల్పాలను పెట్టారు. వీటిని కొద్దిరోజుల క్రితమే అటవీ శాఖ వారు పెట్టించారు. ప్రధాన రహదారి పక్కనే ఉండడంతో అందరి దష్టిని ఆ శిల్పాలు ఎంతో ఆకర్షిస్తున్నాయి. -
టేకు చెట్టుపై గొడ్డలి వేటు
టేకు చెట్టుపై గొడ్డలి వేటు నేరడిగొండ : పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతిఒక్కరూ మెుక్కలు నాటాలని చెబుతున్నా ప్రభుత్వం అడవులను నాశనం చేసే వారిని మాత్రం అదుపు చేయలేకపోతోంది. ఫలితంగా ఓ వైపు నాటుడు..మరోవైపు నరుకుడు కార్యక్రమం యథేచ్ఛగా కొనసాగుతోంది. బోథ్ అటవీ రేంజ్లో పచ్చని టేకు చెట్లపై నిత్యం గొడ్డలి వేటు పడుతోంది. అయినా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి. బోథ్ రేంజ్లో అధికారుల పర్యవేక్షణ లేక స్మగ్లర్లు దర్జాగా అడవుల్లోకి వెళ్లి టేకు చెట్లు నరికివేస్తునారు. ఇక్కడ ఉన్న టేకు వనం మన రాష్ట్రంలో ఎక్కడా లేదు. దీంతో స్మగ్లర్లు ఇక్కడి టేకుపై కన్నేశారు. దీంతో స్మగ్లర్ల వేటుకు పెద్ద పెద్ద టేకు వక్షాలు నేలకొరిగి మొదళ్లు దర్శనమిస్తున్నాయి. బోథ్ రేంజ్ పరిధిలోని పీచర, బోరిగాం, ఈస్పూర్, నాగమాల్యాల్, అద్దాలతిమ్మాపూర్, గోవింద్పూర్, మర్లపల్లి తదితర ప్రాంతాల్లో ఎక్కడ చూసిన చెట్ల నరికివేత కనిపిస్తోంది. వాటిని చూస్తే ఇటీవలే నరికి వేసినట్లు తెలుస్తోంది. అడుగడుగునా కనిపిస్తున్న చెట్లమొదళ్లతో కలప భారీగా రవాణా అయినట్లు తెలుస్తోంది. అడవులను రక్షించాల్సిన అధికారుల్లో కొందరు పరోక్షంగా స్మగ్లర్లకు సహకరిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. ఇల్లు కడితే అధికారులకు పండుగే.. బోథ్, సోనాల, కౌట, పొచ్చెర, కనుగుట్ట, నేరడిగొండ, వడూర్, కుమారి, తదితర గ్రామాల్లో ఇళ్ల నిర్మాణం ప్రారంభమయ్యిందంటే చాలు కొందరు అటవీ అధికారులకు పండుగ వచ్చినట్టే. దర్వాజలు, కిటì కీలు, తలుపులకు రూ.20వేల నుంచి లక్ష వరకు వసూలు చేస్తూ రూ.10వేల నుంచి 20వేల వరకు రసీదులు ఇచ్చి మిగతాది జేబులో వేసుకుంటున్నారనే ఆరోపణలున్నాయి. చర్యలు తీసుకుంటున్నాం అడవిలో చెట్ల నరికివేత జరగడం లేదు. ఎప్పుడో నరికేసిన మొదళ్లు మాత్రమే ఉన్నాయి. స్మగ్లింగ్ నిరోధానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. – మనోహర్, బోథ్ రేంజ్ అధికారి -
కామాంధుడి వృషణాలు కోసేశారు..!
పెద్ద అడిశర్లపల్లి: కోరిక తీర్చమంటూ కొంతకాలంగా మహిళను వేధిస్తున్న ఓ కామాంధుడి వృషణాలు కోసేశారు. నల్లగొండ జిల్లాలో జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పెద్ద అడిశర్లపల్లి మండలం నంబాపురం గ్రామ పంచాయతీ పరిధి ఎల్లాపురం గ్రామానికి చెందిన కలకుంట్ల రాంబాబు ఆటోడ్రైవర్‌గా జీవనం సాగిస్తున్నాడు. కొంత కాలంగా అదే గ్రామానికి చెందిన మహిళపై కన్నేశాడు. గత నెలలో సదరు మహిళ రాత్రి వేళ బహిర్భూమికి వెళ్లగా మార్గమధ్యలో అటకాయించాడు. దీంతో బాధితురాలు కేకలు వేయడంతో గ్రామస్తులు రాగా పారిపోయాడు. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి జైలుకు పంపారు. 15 రోజుల క్రితమే జైలు నుంచి బయటికి వచ్చినా అతడి ప్రవర్తనలో మార్పు రాలేదు. దీంతో ఆగ్రహించిన బాధితురాలి కుటుంబ సభ్యులు, బంధువులు బుధవారం అర్ధరాత్రి రాంబాబు ఇంట్లోకి ప్రవేశించారు. నిద్రిస్తున్న అతడి వృషణాలు కోసేసి పారిపోయారు. కుటుంబ సభ్యులు వెంటనే రాంబాబును 108 వాహనంలో దేవరకొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్టు తెలిసింది. నిందితులంతా పరారీలో ఉన్నారు. -
8.2 శాతం నుంచి 7.5 శాతానికి..!
2016 భారత్ వృద్ధి రేటు అంచనాకు ఐక్యరాజ్యసమితి కోత న్యూఢిల్లీ/బ్యాంకాక్: భారత్ 2016 ఆర్థికాభివృద్ధి రేటు అంచనాను ఐక్యరాజ్యసమితి తగ్గించింది. ఇంతక్రితం అంచనా 8.2 శాతంకాగా దీనిని 7.5 శాతానికి తగ్గించింది. సంస్కరణల అమల్లో జాప్యమే తమ అంచనా కోతకు కారణమని పేర్కొంది. యూఎన్ ఎకనమిక్ అండ్ సోషల్ కమిషన్ (ఆసియా-పసిఫిక్) ఈ నివేదికను రూపొందించింది. దీని ప్రకారం భూ సేకరణ, కార్మిక చట్టాలు, వస్తు, సేవల పన్ను... వంటి అంశాలు ఉన్నాయి. ఆయా సంస్కరణల పథంలో ముందడుగు పడితే... దేశం వృద్ధి బాటన మరింత పురోగతి సాధించే అవకాశం ఉంది. -
సీసీటీవీ కేబుళ్లను కత్తిరించి....దోచేశారు
గోదావరిఖని: కరీంనగర్ జిల్లాలో దోపిడీ దొంగలు... సీసీ కెమెరాలకు కంటపడకుండా చోరీలు చేసి నగదును దోచుకుపోయారు. గోదావరిఖనిలోని లక్ష్మి నగర్లో గురువారం రాత్రి రెండు షాపుల్లో చోరీలు జరిగాయి. పట్టణంలోని రీగల్ షూమార్ట్, హ్యాండ్లూమ్ షూ కంపెనీ షట్టర్ల తాళాలు పగులగొట్టి దొంగలు రూ.1.70 లక్షల నగదును ఎత్తుకుపోయారు. సీసీ కెమెరాల్లో రికార్డుకాకుండా దొంగలు తెలివిగా వ్యవహరించారు. షాపులోనికి ప్రవేశించిన దొంగలు ముందుగా సీసీ కెమెరాల కేబుళ్లను కత్తిరించారు. ఆ తర్వాత నగదును దోచుకున్నారు. పని పూర్తి చేసుకుని వెళ్ళేటప్పుడు సీసీటీవీ సెట్‌టాప్ బాక్స్‌ను కూడా ఎత్తుకుపోయారు. శుక్రవారం ఉదయం షాపు తెరించేందుకు వచ్చిన యజమానులు చోరీ జరిగినట్టు తెలుసుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు. చోరికి గురైన రెండు దుకాణాల యాజమాన్యం ఒక్కరే కావడం విశేషం. డీఎస్పీ మల్లారెడ్డి, సీఐలు తమ సిబ్బందితో సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. -
కార్పొరేట్ పన్ను కోతకు సిద్ధం!
న్యూఢిల్లీ: కార్పొరేట్ పన్ను తగ్గింపు ప్రక్రియ వచ్చే బడ్జెట్ నుంచీ ప్రారంభమవుతుందని ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ వెల్లడించారు. ఈ నేపథ్యంలో కార్పొరేట్ రంగానికి ప్రస్తుతం ఇస్తున్న పన్ను మినహాయింపులను దశలవారీగా ఉపసంహరణ జాబితా కూడా కొద్ది రోజుల్లో విడుదల చేస్తామంటూ బుధవారం ఆయన సూచనప్రాయంగా చెప్పారు. ప్రస్తుతం 30 శాతంగా ఉన్న కార్పొరేట్ బేసిక్ పన్ను రేటును నాలుగేళ్లలో 25 శాతానికి తగ్గిస్తామని ఆర్థికమంత్రి గత బడ్జెట్ ప్రసంగంలోనే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ పన్నును తగ్గించినప్పుడు కార్పొరేట్ పన్ను మినహాయింపుల అవసరమూ తగ్గుతుందన్న అభిప్రాయాన్ని అత్యున్నత స్థాయి అధికారులు ఇప్పటికే వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న 30 శాతం పన్ను రేటు ఇతర దిగ్గజ ఆసియా దేశాల్లో కార్పొరేట్ పన్ను రేటు కన్నా అధికంగా ఉంది. దీనితో భారత్ పరిశ్రమల అంతర్జాతీయ మార్కెట్లో ‘ధరల పరంగా’ పోటీని ఎదుర్కొనలేకపోతోంది. ‘నేషనల్ స్ట్రేటజీ డే ఇన్ ఇండియా’ పేరుతో వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్, భారత పరిశ్రమల సమాఖ్య ఇక్కడ భారత్ వృద్ధిపై ఒక సదస్సును నిర్వహించాయి. ఈ కార్యక్రమంలో ఆర్థికమంత్రి పేర్కొన్న అంశాల్లో ముఖ్యమైనవి... * క్లిష్టమైన పన్ను సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేస్తోంది. త్వరలో వస్తు, సేవల పన్ను అమలు అవుతుందని విశ్వాసం కూడా ఉంది. దీనిపై కాంగ్రెస్‌తో మరోసారి ప్రభుత్వం చర్చిస్తుంది. కార్పొరేట్ పన్ను మినహాయింపుల తొలగింపులపై సంబంధిత వర్గాల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుంటాం. * దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధి రికవరీ వేగంగా ఉంది. దేశం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 7.5 శాతం నుంచి 8 శాతం శ్రేణిలో వృద్ధి సాధించే సత్తా ఉంది. పరోక్ష పన్ను వసూళ్లలో గణనీయ వృద్ధి రికవరీ వేగాన్ని సూచిస్తోంది. ఆర్థిక సంవత్సరం మొదటి ఏడు నెలల కాలంలో (ఏప్రిల్-అక్టోబర్) పరోక్ష పన్ను వసూళ్లలో 36 శాతం వృద్ధి నమోదయ్యింది. * అమెరికాలో ఫెడ్ రేటు పెంపు అవకాశాలు, చైనా మందగమనం నేపథ్యంలో పరిణామాలు వంటివి భారత్‌పై ప్రత్యక్ష, పరోక్ష ప్రభావాలు చూపిస్తాయనడంలో సందేహం లేదు. అయితే మన ఆర్థిక వ్యవస్థ ప్రాతిపదికన ప్రతికూల ప్రభావాలను సాధ్యమైనంత తగ్గించడానికి కేంద్రం ప్రయత్నిస్తుంది. * విద్యుత్ రంగం సంస్కరణల విషయంలో రానున్న కొద్ది రోజుల్లో ప్రభుత్వం కొన్ని విధానపరమైన నిర్ణయాలు తీసుకుంటుంది. ఈ రంగంలో సమస్యల పరిష్కారమే ప్రభుత్వ లక్ష్యం. * భూ సేకరణ చట్టం విషయంలో రాష్ట్రాలు తమ సొంత చట్టాలను రూపొందించుకునే దిశలో కేంద్రం ప్రోత్సహించాలన్న ధ్యేయంతోనే ఈ విధానంలో మార్పు జరిగింది. దివాలా వ్యవహారాన్ని 180 రోజుల్లో తేల్చాలి..! * ప్రభుత్వానికి కమిటీ సిఫారసులు న్యూఢిల్లీ: దివాలా వ్యవహారానికి సంబంధించి ప్రక్రియ అంతా 180 రోజుల్లో పూర్తిచేయాలని ప్రభుత్వం నియమించిన కమిటీ బుధవారం సిఫారసు చేసింది. ఆర్థిక ఇబ్బందులు, వ్యాపార వైఫల్యం వంటి కారణాల వల్ల తలెత్తే దివాలా ప్రక్రియ సత్వర పరిష్కారం లక్ష్యంగా కమిటీ సిఫారసులను రూపొందించింది. ఈ నివేదికను కమిటీ చైర్మన్, మాజీ లా సెక్రటరీ టీకే విశ్వనాథన్ ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీకి న్యూఢిల్లీలో అందజేశారు. రుణదాతలు, గ్రహీతల మధ్య ఘర్షణలను పరిష్కరించడానికి సంబంధించిన వ్యవస్థను మెరుగుపరచాలని నివేదిక కోరింది. దివాలా అంశాలపై ప్రత్యేక దృష్టికి ఇన్సాల్వెన్సీ రెగ్యులేటర్ ఏర్పాటును కూడా నివేదిక పేర్కొం ది. కంపెనీల విషయంలో న్యాయ అంశాల పరిశీలన అధికారం నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ)కు ఉండాలని సూచించింది. వివిధ కంపెనీలకు పలు విధాలుగా కాకుండా అన్నింటికీ వర్తించేలా ఏకైక సమగ్ర దివాలా చట్టం అవసరమని తెలిపింది. కాగా ఆయా అంశాలన్నింటినీ పరిశీలించి ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటుందని, పార్లమెంటులో బిల్లు ప్రవేశపెడుతుందని ఆర్థిక మంత్రిత్వశాఖ ఒక ప్రకటనలో తెలిపింది. -
ఫీజుల పథకానికి కత్తెర
-
ఫీజుల పథకానికి కత్తెర
ఎంసెట్‌లో 5 వేల ర్యాంకు వరకు వచ్చిన విద్యార్థులకే పూర్తి రీయింబర్స్మెంట్ ♦ అంతకన్నా ఎక్కువ ర్యాంకు వస్తే ప్రభుత్వం గరిష్టంగా చెల్లించేది రూ. 35 వేలే ♦ ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు మాత్రం ర్యాంకుతో నిమిత్తం లేకుండా పథకం వర్తింపు ♦ రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం స్థానిక తెలంగాణ విద్యార్థులే అర్హులు ♦ 2015-16 విద్యాసంవత్సరానికి నిబంధనలను ప్రకటించిన ప్రభుత్వం సాక్షి, హైదరాబాద్ః ఫీజు రీయింబర్స్మెంట్ పథకంపై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టతనిచ్చింది. 2015-16 విద్యాసంవత్సరానికి సంబంధించి పథకం మార్గదర్శకాలను ప్రకటించింది. ఎంసెట్‌లో అయిదు వేల ర్యాంకు వరకు వచ్చిన విద్యార్థులు మాత్రమే పూర్తి రీయింబర్స్మెంట్ పొందేందుకు అర్హులుగా తేల్చింది. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు మాత్రం ర్యాంకుతో సంబంధం లేకుండా పథకాన్ని వర్తింపజేయనుంది. సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో నడిచే ప్రభుత్వ, రెసిడెన్షియల్ కాలేజీల్లో చదువుకున్న విద్యార్థులు, కార్పొరేట్ కాలేజీ స్కీమ్ కింద చదివే విద్యార్థులు కూడా పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ పొందేందుకు అర్హులవుతారు. 5 వేల ర్యాంకు వరకు వచ్చిన విద్యార్థులు కాకుండా మిగతా వారికి.. ఆయా కాలేజీల్లో వసూలు చేసే ఫీజుతో నిమిత్తం లేకుండా గరిష్టంగా రూ.35 వేల ఫీజు లేదా కాలేజీ ఫీజు (ఏది తక్కువ అయితే అది) ప్రభుత్వం అందజేయనుంది. 2013-14లో పదివేల ర్యాంకు వచ్చిన విద్యార్థులకు కూడా పథకాన్ని వర్తింపచేశారు. 2014-15లో ఇదే విధానాన్ని అమలు చేసినా స్థానిక నిబంధన జోడించారు. తాజాగా దీన్ని 5 వేల ర్యాంకుకు పరిమితం చేస్తూ ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. 2014-15కు సంబంధించి గతంలోని ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని కొనసాగిస్తున్నట్లు, రాష్ట్రపతి ఉత్తర్వులకు లోబడి తెలంగాణకు చెందిన స్థానిక విద్యార్థులకే పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్లు చెల్లించనున్నట్లు ఈ ఏడాది మార్చి 10న రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ఉపకారవేతనాలు పొందేందుకు.. ప్రస్తుతం క్వాలిఫై అయిన కోర్సుకు ముందు విద్యార్థులు గత ఏడేళ్ల విద్యాభ్యాసానికి సంబంధించిన రికార్డులను సమర్పించాలని స్పష్టంచేసింది. రాష్ట్ర విభ జన నేపథ్యంలో తెలంగాణలో విడిగా ఎంసెట్‌ను నిర్వహించినందున 2015-16 విద్యాసంవత్సరానికి సంబంధించిన పోస్ట్‌మెట్రిక్ స్కాలర్షిప్స్ పథకంపై మార్గదర్శకాలను విడుదలచేయాలని రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి జూన్ 1న ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. దీనిపై స్పందించిన ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఫీజులకు సంబంధించిన మార్గదర్శకాలను వివరిస్తూ షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి జె.రేమండ్‌పీటర్ మంగళవారం(జూన్ 30న) ఒక మెమో విడుదల చేశారు. ఈ నిబంధనలకు అనుగుణంగా స్కాలర్‌షిప్‌లకు అర్హులైన విద్యార్థుల అలాట్మెంట్ లెటర్లపై ఎంసెట్ కన్వీనర్ ఎండార్స్మెంట్ ఇవ్వాలని ఈ ఉత్వర్వుల్లో స్పష్టంచేశారు. స్థానిక తెలంగాణ విద్యార్థులకే.. ఫీజులకు సంబంధించి ప్రభుత్వపరంగా సవివరంగా తుది మార్గదర్శకాలు వెలువడాల్సి ఉంది. అప్పటివరకు ఎంసెట్ కౌన్సెలింగ్ సందర్భంగా.. రాష్ట్రపతి ఉత్తర్వులకు అనుగుణంగా తెలంగాణలోని అర్హులైన స్థానిక విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ వివరాలను అలాట్మెంట్ లెటర్లపైనే పేర్కొనాలని ఉత్తర్వుల్లో ప్రభుత్వం తెలిపింది. కన్వీనర్ కోటాలో 2015-16 విద్యా సంవత్సరానికి అండర్ గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ కోర్సుల్లో (బి-ఆర్కిటెక్చర్ కోర్సులతో సహా) తుది పరిశీలన తర్వాతే ఫీజు రీయింబర్స్‌మెంట్‌లోని మిగతా అంశాలపై తేల్చనున్నారు. -
రుణమాఫీలో కోతే ప్రభుత్వ లక్ష్యం
వైఎస్సార్ సీపీ నాయకులు అరుణ్‌కుమార్ కంచికచర్ల : రుణమాఫీలో కోత విధించేందుకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించిందని వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ మొండితోక అరుణ్‌కుమార్, మండల కన్వీనర్ బండి జానకిరామయ్య, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు పాటిబండ్ల హరిజగన్నాథరావు తదితరులు శనివారం సంయుక్త ప్రకటనలో పేర్కొన్నారు. ఆధార్‌కార్డు అనుసంధానం, ఇతర నిబంధనల బూచి చూపిస్తూ చాలా వరకు బ్యాంకు ఖాతాలను తగ్గించారని చెప్పారు. రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేముందు రూ.87,612కోట్ల వరకు వ్యవసాయ రుణాలు ఉన్నాయని, ప్రభుత్వం రుణమాఫీ పేరుతో రూ.18.500కోట్లు మాత్రమే బ్యాంకుల ఖాతాలకు జమచేసిందన్నారు. ఈ ఏడాది బడ్జెట్లో ప్రభుత్వం రుణమాఫీ కోసం రూ. 4,300కోట్లు మాత్రమే కేటాయించిందని చెప్పారు. వ్యవసాయానికి తీసుకున్న రుణాలు రైతులు చెల్లించాలని ప్రభుత్వం చెబుతోందని, లేదా సాగుకోసం తీసుకున్న అప్పుకోసం తాకట్టుపెట్టిన బంగారం, పట్టాదార్ పాసు పుస్తకాలు బ్యాంకుల్లో ఉండాల్సిందేననే అంశాన్ని నిబంధనలో ప్రభుత్వం చేర్చడం విడ్డూరంగా ఉందని ఆవేదన వ్యక్తంచేశారు. దీనివల్ల ఇతర వ్యక్తుల నుంచి వ్యవసాయ రుణాలు తీసుకునేందుకు అవకాశం కూడా లేదన్నారు. ఎన్నికల హామీ మేరకు సకాలంలో రుణాలు మాఫీ చేసి తిరిగి కొత్త రుణాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. -
పర్యావరణానికి కోత!
పర్యావరణ శాఖకు తాజా బడ్జెట్లో కోత పడింది. గతేడాది ఈ శాఖకు రూ. 1,764.6 కోట్లను కేటాయించగా, ఈసారి ఐదు శాతం తగ్గించి రూ. 1,681.60 కోట్లను కేటాయించారు. అదేవిధంగా వాయు, నీటి కాలుష్య నివారణ చర్యల కోసం నిధులను 48 శాతం పెంచి రూ. 136.33 కోట్లు కేటాయించారు. జాతీయ నదుల్లో కాలుష్య నివారణకు ప్రత్యేకంగా కేటాయించిందేమీ లేదు. వన్యప్రాణుల సంరక్షణకు, అడవుల పెంపకానికి, ఇతర పర్యావరణ కార్యక్రమాలకు నామమాత్రంగా నిధులు కేటాయించారు. -
3బ్రదర్స్ కార్పొరేట్‌కి కత్తెరేశారు...
సూపర్మార్కెట్స్ దెబ్బకి కిరాణా కొట్లు... డిజైనర్స్ రాకతో దర్జీలు... వరుసపెట్టి కొత్త ఆటంబాంబులు పోటీకొస్తుంటే తట్టుకోలేక పాత సీమటపాకాయలు అల్లల్లాడిపోయాయి. బరిలో నిలవలేక తుస్సుమనేశాయి. కొన్ని ముందే దాసోహమైపోయి ‘పెద్ద’ నీడలో జేరిపోయాయి. కొన్ని మాత్రం గ్లోబలైజేషన్ తెచ్చిన ముప్పును తెలివిగా అందిపుచ్చుకుని తమ ఎదుగుదలకి పైకప్పుగా మార్చుకున్నాయి. ఇప్పుడు తాముసైతం ఆటంబాంబులై మోతమోగిస్తున్నాయి. హైస్కూల్ చదువు దాటని ముగ్గురు అన్నదమ్ములు... ఆటంబాంబులై సాధించిన సక్సెస్ అలాంటిదే. - ఎస్.సత్యబాబు ‘మాది కరీంనగరన్నా. నాయీబ్రాహ్మలం. నాన్న చిన్నగున్నప్పుడే సిటీకి వచ్చేసి షాపులో కటింగ్ పనిల జేరిండు. చిన్నంగా.. ఎట్లనో చేసి కొత్తపేట మారుతీనగ ర్ల సొంతంగా షాపు పెట్టిండు. అయినా ఆదాయం చాలక మా చిన్నతనంలో మస్తు కష్టాలు పడుతుండె’’ అంటూ గుర్తు చేసుకున్నాడు నందు అలియాస్ శ్యామ్. దిల్‌సుఖ్‌నగర్‌లో ఎన్ఆర్ బీ హెయిర్ అండ్ బ్యూటీ పేరుతో దాదాపు వెయ్యి చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఆ ఆధునిక పార్లర్లో కూర్చుని మాట్లాడుతున్న ఆ పాతికేళ్ల కుర్రాడిని చూస్తే.. సిటీలో అలాంటివి మరో 3 పార్లర్లతో పాటు ఏకంగా ఒక హెయిర్ స్టైల్స్ ట్రైనింగ్ అకాడమీ సైతం సొంతంగా నిర్వహిస్తున్న అన్నదమ్ముల్లో ఒకరని చెబితే వెంటనే నమ్మడం కష్టం. ‘ఈ స్టేజికి రానీకి చేయని కష్టం లేదన్న’ అంటూ చెప్పుకొచ్చాడు నందు. చిన్న షాప్... చింతలు తీర్చలేదు... మారుతీనగర్‌లో షాప్ మొదట్లో బాగానే ఉన్నా.. తర్వాత పార్లర్ల ధాటికి పాతకాలపు క్షవరం కొట్టుకు ఆదరణ తగ్గిపోయింది. కుటుంబం నడపడం కష్టమైపోయింది. నందు తండ్రికి సొంత చెల్లెళ్ల పెళ్లి బాధ్యతలు కూడా మీదపడ టంతో.. నందు, రాజు, బబ్లూ (అన్నదమ్ములు)లు చిన్న వయసులోనే సంపాదన కోసం రోడ్డెక్కక తప్పలేదు. ‘నేను సెలూన్లో, తమ్ముళ్లలో ఒకడేమో కార్లు తుడిచి, మరొకడేమో కోఠిలో డాంబర్ గోళీలు (బొద్దింకల మందు) అమ్ముతుండె’ అంటూ గుర్తు చేసుకున్నాడు నందు. ఈ పనుల కారణంగా ముగ్గురి చదువూ హైస్కూల్ దాటలేదు. ఈ పరిస్థితుల్లో.. సిటీలోని బంజారాహిల్స్‌లో ఉన్న జావెద్హబీబ్ సెలూన్లో రాజుకి పని దొరికింది. అక్కడ పనిచేస్తున్నప్పుడే.. పార్లర్స్‌కి, బార్బర్షాప్లకు తేడా ఏమిటి? అక్కడ ఉంటున్నవేమిటి? తాము ఇవ్వలేకపోతున్నవేమిటి అనేది అర్థమైంది. అది అయ్యాక... ఎలాగైనా తాము కూడా అందాలను మెరిపించే పనిలో ఆధునిక విపణి అందిస్తున్న అవకాశాలు అందిపుచ్చుకోవాలనుకున్నారు. అప్పుచేసి.. హెయిర్ స్టైలింగ్ కోర్స్.. ఇల్లు గడవడమే చాలా కష్టం. ముంబై వెళ్లి హెయిర్‌స్టైల్ కోర్స్ చేయాలంటే వేలకు వేలు ఎలా తేవాలి? ‘ఆడ్నించి ఈడ్నించి తెచ్చినం. అమ్మ పుస్తెలు, కమ్మలు అమ్మినం. దొరికిన కాడ అప్పులు చేసినం. ఎట్టయితేనేం... ముంబైలో కోర్సులో జేరినం. వాళ్ల సెలూన్ల జీతానికి జేస్తమని రాసిచ్చి.. ఒక్కరికి కట్టిన ఫీజుతో ఇద్దరం కోర్సు పూర్తి జేసినం’ అంటూ వివరించాడు నందు. ముంబై వెళ్లడం, హెయిర్‌స్టైల్స్ కోర్స్ పూర్తి చేయడం.. ఇవన్నీ ఈ అన్నదమ్ముల ఆలోచనాధోరణిని సమూలంగా మార్చేశాయి. కోర్స్ అనంతరం సిటీలో పేరున్న సెలూన్లో జీతానికి చేరి నాలుగేళ్లపాటు మరింత అనుభవాన్ని సంపాదించారు. అదే సమయంలో జావేద్ హబీబ్ ఫ్రాంఛైజీ ఆఫర్ వీరిని కోరి వచ్చింది. అయితే ఆ బ్రాండ్ పార్లర్ పెట్టాలంటే లక్షలతో పని. కానీ ఈ అన్నదమ్ముల పనితీరు అప్పటికే తెలుసు కాబట్టి... రీజనబుల్ ప్రైస్‌కి ఇస్తామన్నారు జావేద్హబీబ్ బ్రాండ్ వాళ్లు. మంచి అవకాశం అనుకున్నారీ బ్రదర్స్. వద్దు వద్దంటూ వారిస్తున్న కుటుంబ సభ్యుల్ని అతి కష్టమ్మీద ఒప్పించి... దిల్సుఖ్నగర్ రోడ్, మూసారాంబాగ్‌లోని ఆండాల్ బిల్డింగ్ పక్కన, లెజెండ్ బిల్డింగ్‌లో ఫ్రాంఛైజీ స్టార్ట్ చేశారు. మూడేళ్లు గడిచాక.. ఫ్రాంఛైజీగా చెల్లిస్తున్న 20 శాతం మొత్తం గాని మిగిల్చగలిగితే.. తమ కస్టమర్స్‌కి మరింత తక్కువ ధరలకే సేవలు అందించవచ్చునని అనిపించింది. దాంతో మరోసారి ధైర్యం చేశారు. ఫ్రాంఛైజీని వదులుకుని తమ ముగ్గురి పేర్లూ కలిపి ఎన్ఆర్బీ బ్రాండ్ నేమ్‌ని స్టార్ట్ చేశారు. తక్కువ ధరలకే పార్లర్ సర్వీసెస్ ఆఫర్ చేశారు. దీంతో షార్ట్‌టైమ్‌లోనే పార్లర్‌కు మంచి పేరొచ్చింది. కెరీర్ గైడ్స్.. ఒక విజయం మరిన్ని సంకల్పాలకు నాంది అన్నట్టు అదే ఊపులో కొత్తపేట, ఉప్పల్, ఐడీపీఎల్... ప్రాంతాల్లోనూ బ్రాంచీలు నెలకొల్పారు. రెండేళ్ల క్రితమే జావేద్ హబీబ్ ట్రైనింగ్ అకాడమీకి ఫ్రాంఛైజీ తీసుకుని పార్లర్లో కెరీర్‌ను వెతుక్కుంటున్న వారికి ఆశాదీపంలా మారారు. సర్టిఫికెట్ కోర్సు చేయడానికి తాము పడిన కష్టాలు బాగా గుర్తుంచుకున్న ఈ అన్నదమ్ములు ఆ పరిస్థితిని కొంతమందికైనా తప్పించాలని, తక్కువ ఫీజులతో శిక్షణ అందిస్తున్నారు. కులమతాలకు అతీతంగా ఇప్పటికే వందల మంది బ్యూటీ ఇండస్ట్రీలో కెరీర్ అవకాశాలు అందుకునేలా చేశారు. కేవలం వీరి రిఫరెన్స్‌తో మరెంతో మందికి ఉద్యోగాలొచ్చాయి. ఆర్థికంగా స్థోమత లేని నిరుద్యోగ యువతీ యువకులకు ఉచితంగా కూడా శిక్షణనిస్తున్నారు. ఆసక్తి కలవారు 9908512905 ఫోన్‌నంబర్‌ను సంప్రదించవచ్చు. ‘‘ఇంకా పార్లర్లు ఓపెన్ జేసి, స్టేట్లెవల్లో మస్తు పేరు సాధించాలె’’ అంటూ ఆకాంక్ష వ్యక్తం చేస్తున్న ఈ సోదర త్రయం ఆత్మవిశ్వాసం చూస్తుంటే అనుకున్నది సాధించడానికే పుట్టారా అనిపించకమానదు. -
జీవితమే ఒక ‘ఆట’
ఈ చిత్రాలు చూశారా.. ఓ ఫొటో ఇండియూ ఖోఖో కప్పు సాధించిన జట్టు సభ్యులతో సారంగపాణి.. మరో చిత్రంలో కటింగ్ చేస్తున్నది కూడా సారంగపాణియే.. జాతీయ స్థారుులో ఆడిన వ్యక్తి సెలూన్ షాప్‌లో పనిచేయడం ఏంటని ఆశ్చర్య పోతున్నారా.. ఇదీ నిజం..! ఎన్ని పతకాలు సాధించినా.. అవార్డులు వరించినా.. ఏవీ కడుపునింపలే.. ప్రస్తుతం కులవృత్తే ఆకలి తీరుస్తోంది! ప్రత్యేక రాష్ట్రంలోనైనా ఉద్యోగం ఇవ్వాలని సారంగపాణి కోరుతున్నాడు.. ఖిల్లా నుంచి మొదలు.. వరంగల్ కోటకు చెందిన నాగవెల్లి సారంగపాణికి చిన్నతనం నుంచే ఆటలపై ఎంతో ఆసక్తి ఉండేది. స్థానిక ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి వరకు చదువుకున్న సారంగపాణికి ఖోఖో అంటే చచ్చేంత ప్రాణం. అయితే ఖోఖోపై అతడికి ఉన్న అభిరుచిని గమనించిన పాఠశాలకు చెందిన ఉపాధ్యాయులు అందులో నైపుణ్యాలు నేర్పించారు. ఇందులో భాగంగా పాఠశాల, జిల్లా, రాష్ట్రస్థాయిలో ఏటా నిర్వహించే పోటీల్లో సారంగపాణి ప్రతిభ కనబరిచి పతకాలు సాధించేవాడు. కాగా, 1999లో మణిపూర్‌లో జరిగిన జాతీయస్థాయి పోటీల్లో ఆంధ్రప్రదేశ్ జట్టుకు సారథ్యం వహించి బ్రౌంజ్ మెడల్‌ను సంపాదించాడు. 1996లో మొదటిసారిగా అం తర్జాతీయస్థాయిలో కోల్‌కతాలో నిర్వహించిన ఏషియన్ పోటీల్లో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. టోర్నమెంట్లో భారతజట్టు బం గారు పతకం సాధిం చేందుకు సారంగపాణి ఎంతో కృషిచేశాడు. ప్రోత్సాహం కరువు.. నిరుపేద కుటుంబానికి చెందిన సారంగపాణికి ప్రభుత్వ ప్రోత్సాహం కరువవడంతో ఇబ్బం దులు ఎదుర్కొంటున్నాడు. ఖోఖోలో మేరునగధీరుడిగా పేరుగాంచిన సారంగపాణికి కొన్ని నెలల నుంచి ఆర్థిక ఇబ్బందులు నీడలా వెంటాడుతున్నాయి. ఈ క్రమంలో 2001 వరకు పోటీ ల్లో పాల్గొన్న అతడు ది క్కుతోచని పరిస్థితిలో ఖోఖోకు స్వస్తిపలికి కు టుంబపోషణ కోసం కులవృత్తి సెలూన్‌షాపు ను పెట్టుకుని పనిచేస్తున్నాడు. దీంతో రోజు వచ్చే అరకొర సంపాదన తో అనారోగ్యంతో బా ధపడుతున్న తల్లికి వైద్యం చేయిస్తూ జీవిస్తున్నాడు. మంత్రి హామీ బుట్టదాఖలు.. అంతర్జాతీయస్థాయి క్రీడాకారుడిగా పేరు సంపాదించిన సారంగపాణికి అప్పటి హోంశా ఖ మంత్రి దేవేందర్‌గౌడ్ స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగం ఇస్తానని హామీ ఇచ్చారు. అయితే మంత్రి హామీ అమలు కోసం ప్రభుత్వం వద్దకు తిరిగినా సారంగపాణికి ఉద్యో గం రాలేదు. అటు ఉద్యోగం రాక... షాపు సరిగ్గా నడవకపోవడంతో ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయాడు. దీంతో కొన్నేళ్ల నుంచి సారంగపాణి మరో షాపులో కూలీగా పనిచేస్తున్నాడు. సారంగపాణి ట్రాక్ రికార్డ్ పశ్చిమబెంగాల్లో 1988లో నిర్వహించి న సబ్‌జూనియర్ జాతీయస్థాయి ఖోఖో చాంపియన్‌షిప్ పోటీల్లో పాల్గొన్నాడు. మహారాష్ట్రలోని సతారాలో 1992లో జరిగిన నేషనల్ స్కూల్‌గేమ్స్‌లో రజత పతకం సాధించాడు. 1996లో కోల్క తాలో జరిగిన ఏషియన్ చాంపియన్‌షిప్‌లో ఏపీ జట్టుకు బంగారు పతకాన్ని సాధించిపెట్టాడు. మణిపూర్‌లో 1999లో జరిగిన జాతీయస్థాయి పోటీల్లో ఏపీ తరపున ఆడి బ్రౌంజ్మెడల్ సాధించాడు. అలాగే జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించారు. 1998లో ఢిల్లీలో జరిగిన జాతీయస్థాయి పోటీల్లో చాంపియన్ సాధించాడు. 1994లో హర్యానాలో జరిగిన సీనియర్ ఖోఖో పోటీల్లో చాంపియన్‌షిప్ సాధిం చాడు. అలాగే పలు పోటీల్లో ప్రతిభ కనబరిచాడు. -
బ్రెయిన్లో బల్బు వెలిగితే!!
కరెంట్ బల్బుల్లో ఫిలమెంట్ పోతే ఇక అవి వెలగవు. దీంతో వెంటనే వాటిని తీసేసి, కొత్త బల్బులను వాడుతుంటారు. మరి తీసేసిన బల్బులను ఏం చేస్తారు? బ్రెయిన్‌కు కాస్త పని పెడితే వెలగని బల్బులను చెత్తబుట్టకు చేర్చకుండా ఇంటి అలంకరణలో ఇలా ఉపయోగించవచ్చు. మన ఇంటి నుంచి చెత్తను ఎక్కువ చేర్చి పర్యావరణానికి హాని కలగించకుండానూ చేయవచ్చు. వెలగని బల్బులను తీసుకోండి. అత్యంత జాగ్రత్తగా కటర్‌ని ఉపయోగించి పైన ఉండే అల్యూమినియమ్ మూత దగ్గర రంధ్రం చేయండి. రంగు రంగుల పేపర్లు చుట్టిన ఒక సన్నని వైర్‌ను లోపలికి సగం వరకు పంపించి, పైన మైనంతోనో, లేదా మరో బిరడాతోనో బిగించండి. ఆ బల్బులను ఇలా గోడకు వేలాడదీయండి. బల్బు పైన అల్యూమినియం మూత, లోపలి ఫిలమెంట్ తీసేసి, చుట్టూరా రంగు రంగుల గాజు ముక్కలు అతికించండి. లోపల మైనం నింపి, ఒత్తి వేసి వెలిగించండి. దీపావళికే కాదు ఇతర రోజుల్లోనూ చూడచక్కని షోపీస్‌లా ఆకట్టుకుంటుంది. బల్బులోపల సన్నని ఇసుక కొద్దిగా వేసి, పైన కృత్రిమమైన గడ్డిరంగు మొక్కలు అమర్చితే మరొక షోపీస్ తయారవుతుంది. బల్బుల్లో ఫిలమెంట్ తీసేసి, నూనె పోసి ఒత్తిని వేసి వెలిగిస్తే లాంతరులా మారిపోతుంది. బల్బులో సగానికి నీరు నింపి, చిన్న మొక్క వేస్తే చాలు చూడముచ్చటైన ఇండోర్ ప్లాంట్ రెడీ! బల్బుకు రంగు వేసి, పక్షి రెక్కలను అతికించి, కళ్లు, ముక్కు పెయింట్ చేస్తే పక్షి ఆకారం ముందుంటుంది. పిల్లలనూ అమితంగా ఆకట్టుకుంటుంది. నోట్: బల్బులు గ్లాస్‌తో తయారవుతాయి. పగలడం, కోసుకోవడం..వంటి ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. అందుకని వీటి తయారీలో చేతులకు గ్లౌజ్‌లు వేసుకోవడం, కటింగ్‌కు కటర్, గాజు పెంకులు తీసేయడానికి స్పాంజ్... వంటివి అందుబాటులో ఉంచుకోవడం మర్చిపోవద్దు.