కామాంధుడి వృషణాలు కోసేశారు..! | one psychopath Testes cut in nalgonda | Sakshi
Sakshi News home page

కామాంధుడి వృషణాలు కోసేశారు..!

Published Fri, Feb 26 2016 3:23 AM | Last Updated on Mon, Jul 29 2019 5:59 PM

కామాంధుడి వృషణాలు కోసేశారు..! - Sakshi

కామాంధుడి వృషణాలు కోసేశారు..!

పెద్ద అడిశర్లపల్లి: కోరిక తీర్చమంటూ కొంతకాలంగా మహిళను వేధిస్తున్న ఓ కామాంధుడి వృషణాలు కోసేశారు. నల్లగొండ జిల్లాలో జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పెద్ద అడిశర్లపల్లి మండలం నంబాపురం గ్రామ పంచాయతీ పరిధి ఎల్లాపురం గ్రామానికి చెందిన కలకుంట్ల రాంబాబు ఆటోడ్రైవర్‌గా జీవనం సాగిస్తున్నాడు. కొంత కాలంగా అదే గ్రామానికి చెందిన మహిళపై కన్నేశాడు. గత నెలలో సదరు మహిళ రాత్రి వేళ బహిర్భూమికి వెళ్లగా మార్గమధ్యలో అటకాయించాడు. దీంతో బాధితురాలు కేకలు వేయడంతో గ్రామస్తులు రాగా పారిపోయాడు. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి జైలుకు పంపారు. 15 రోజుల క్రితమే జైలు నుంచి బయటికి వచ్చినా అతడి ప్రవర్తనలో మార్పు రాలేదు. దీంతో ఆగ్రహించిన బాధితురాలి కుటుంబ సభ్యులు, బంధువులు బుధవారం అర్ధరాత్రి రాంబాబు ఇంట్లోకి ప్రవేశించారు. నిద్రిస్తున్న అతడి వృషణాలు కోసేసి పారిపోయారు. కుటుంబ సభ్యులు వెంటనే రాంబాబును 108 వాహనంలో దేవరకొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్టు తెలిసింది. నిందితులంతా పరారీలో ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement