బిలాస్‌పూర్: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో బిలాస్‌పూర్‌కు చెందిన ఓ వ్యక్తి తన భార్యను చంపి, మృతదేహాన్ని ఐదు ముక్కలుగా నరికి, ఇంట్లోని ఖాళీ నీళ్ల ట్యాంకులో పడేశాడు. సక్రి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఉలాస్‌పూర్ ప్రాంతంలో ఓ వ్యక్తి నకిలీ నోట్లను ముద్రిస్తున్నాడనే అనుమానంతో ఓ ఇంట్లో సోదాలు జరిపారు.
బాత్‌రూం మూలన ఉన్న ట్యాంకులో టేప్ వేసి పాలిధీన్ కవర్‌లో చుట్టిన శరీర భాగాలు కనిపించడంతో షాక్‌కు గురయ్యారు. అక్రమ సంబంధం అనుమానంతో భార్యను జనవరి 6న గొంతు పిసికి చంపినట్లు విచారణలో అతడు వెల్లడించాడు. అనంతరం కట్టర్‌తో మృతదేహాన్ని ఐదు ముక్కలు కోసి, కొనుక్కొచ్చిన ట్యాంకులో పడేసినట్లు తెలిపాడు. ఇంట్లో నకిలీ నోట్లు, కలర్ ప్రింటర్‌ను స్వాధీనం చేసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment