Illicit relationship
-
ప్రియుడితో కలిసి భర్తను లేపేసిన భార్య!
తొండంగి: కథ అడ్డం తిరిగింది.. ఐదు రోజుల కిందట జరిగిన ఆటో డ్రైవర్ మృతి కేసులో కొత్త కోణం బయట పడింది.. భార్యే ప్రియుడితో కలసి చంపిందని బంధువులు అనుమానిస్తుండగా, వారిద్దరూ పారిపోతుండగా బంధువులు, గ్రామస్తులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఈ ఘటన తొండంగి మండలం ఏవీ నగరంలో గురువారం చర్చనీయాంశమైంది. మృతుని సోదరుడు, సోదరి, కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. ఏవీ నగరం గ్రామానికి చెందిన బత్తిన మధుబాబు (38)కు ఇదే గ్రామానికి చెందిన అతని మేనమామ డేగల ప్రకాష్ కుమార్తె శిరీషతో 2014లో వివాహం జరిగింది.వీరికి ఆరేళ్ల జాయ్ అనే పాప ఉంది. ఆటో డ్రైవర్‌గా మధుబాబు జీవనం సాగిస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. అతనికి తమ్ముడు కిషోర్, చెల్లెలు ఝాన్సీరాణి ఉన్నారు. తల్లిదండ్రులు చాలాకాలం కిందట మృతి చెందారు. కాగా కిషోర్ కాకినాడ ఆర్టీసీలో మెకానిక్‌గా చేస్తున్నాడు. శిరీష నర్సుగా కొంత కాలం కిందట కత్తిపూడి రిఫరల్ ఆస్పత్రిలో పనిచేసింది. అక్కడ పనిచేసిన సమయంలో శంఖవరం మండలం శృంగవరం గ్రామానికి చెందిన పీతల ప్రశాంత్‌తో పరిచయం ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఈ విషయం తెలిసిన మధుబాబుకు, శిరీషల మధ్య తరచూ మనస్పర్థలు వచ్చాయి. దీంతో భర్తను విడిచి శిరీష హైదరాబాద్‌లో చెల్లెలు ఇంటికి కుమార్తెను తీసుకుని వెళ్లిపోయింది. 20 రోజుల కిందట శిరీష హైదరాబాద్‌లో కుమార్తె జాయ్‌ను ఉంచి మళ్లీ ఏవీ నగరంలోని మధుబాబు ఇంటికి వచ్చింది. ఈ నెల 17న మధుబాబుకు బీపీ తక్కువగా ఉందని కత్తిపూడిలో రిఫరల్ ఆస్పత్రికి తీసుకెళ్లినట్టు శిరీష 18న కాకినాడలో ఉంటున్న మరిది కిషోర్‌కు తెలిపింది. దీంతో ఏవీ నగరంలో తన స్నేహితుడిని ఆస్పత్రికి వెళ్లమని చెప్పి అనంతరం కిషోర్ ఆస్పత్రికి చేరుకున్నాడు. అనంతరం మధుబాబుకు పలు పరీక్షలు చేయాలని వైద్యులు సూచించడంతో శుక్రవారం ఏవీ నగరంలో ఇంటికి వచ్చారు. ఆ రోజంతా ఆరోగ్యంగానే మధుబాబు గ్రామంలో తిరిగాడని కుటుంబ సభ్యులు తెలిపారు. శనివారం ఉదయం చనిపోయాడని శిరీష అతని కుటుంబ సభ్యులకు తెలపడంతో వారంతా కలిసి అంత్యక్రియలు నిర్వహించారు. మధుబాబు ఒంటిపై గాయాలున్నట్టు కిషోర్ చూసి శిరీష ప్రవర్తనపై అనుమానం వచ్చింది. ఈ నేపథ్యంలో ఐదు రోజుల అనంతరం బుధవారం అర్ధరాత్రి శిరీషతో అక్రమ సంబంధం ఉన్న పీతల ప్రశాంత్ గ్రామంలోకి రావడం, వీరిద్దరూ పారిపోతుండగా పట్టుకున్నామని మృతుని సోదరుడు కిషోర్, చెల్లెలు భర్త చిన్న తెలిపారు. పట్టుబడిన వారిని పోలీసులకు అప్పగించారు. అక్రమ సంబంధం కారణంగా ప్రియునితో కలసి తన అన్నను హతమార్చారని కిషోర్, ఇతర కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో మధుబాబు మృతి మిస్టరీగా మారింది.అనుమానాస్పద మృతిగా కేసుఏవీ నగరంలో మధుబాబు మృతిపై కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. ఈ మేరకు నిందితులిద్దరినీ అరెస్టు చేసినట్టు ఎస్సై జగన్మోహన్రావు తెలిపారు. మృతదేహానికి పోస్టుమార్టమ్ నిర్వహిస్తామన్నారు. కేసు పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తామన్నారు. -
వర్చువల్ కచ్చడాలు
‘ఒక తల్లి, ముగ్గురు డాడీలు’ యూ ట్యూబ్ ఓపెన్ చెయ్యగానే ఒక చానల్ పెట్టిన థంబ్ నెయిల్ కనపడింది. వ్యూస్ పెంచుకోవడానికి యూట్యూబ్ చానల్స్‌తో పాటు చిన్నా పెద్ద పత్రికల డిజిటల్ విభాగాలు కూడా ఎన్నో ప్రయత్నాలు చేస్తాయి. ‘మతి పోగొట్టే, రచ్చరచ్చ చేసే, పడీపడీ నవ్వే, చూడగానే షాకయ్యే’ ఎన్నో థంబ్ నెయిల్స్ చూస్తూనే ఉన్నాము. కానీ ఆడవాళ్ళ విషయంలో... ముఖ్యంగా పోరాట కులాల నుంచి వచ్చిన ఆడవాళ్ళ విషయంలో ఈ చూపుడు వేళ్ళు మరిన్ని వంకర్లు తిరుగుతాయి. ‘ఆడదాన్ని అడ్డం పెట్టుకుని యుద్ధం చేస్తావా?’ అంటుంది ఫ్యూడల్ సమాజం. పౌరుషమైన విషయాలు మగవారికే కనుక వారు పురుషులయ్యారు. సమాజమూ రాజకీయాలు వగైరాలన్నీ మగవారి టెరిటరీగా ఉన్నంతకాలం ఆడవాళ్ళని రాజకీయాల్లోకి లాగడం తప్పన్నది ఒక అనాగరిక విలువ. ఆ మేరకు స్త్రీలు యుద్ధాలు చేయని సుకుమారులుగా, మాటంటే బడబడా కన్నీరు కార్చే సున్నిత మనస్కులుగా తయారు చేయబడ్డారు. ఇక ఇపుడు అలా లేరు. స్త్రీలు అన్నీ మాట్లాడగలరు. ముక్కూ చెవులూ కోసి పంపినందుకు సంబరపడిన మన మొహాలకేసి జాలిగా చూసి, ‘ప్రేమించడం తప్పా?’ అంటుంది ఆధునిక శూర్పణఖ. ‘పేడితో యుద్ధం చెయ్యనని’ ఆయుధం విసర్జించిన విలువిద్యకారుని ప్రశ్నించింది శిఖండి. ‘భీష్మా! నాతో పోరాడు’ అని సవాల్ చేసినట్లు కూడా రాసింది ఒక రచయిత్రి. స్త్రీలు తమ యుద్ధాలు తామే చేస్తున్నా వారి లైంగిక వ్యక్తిత్వం మగవారి సొత్తుగానే ఉంది. సామాజిక మాధ్యమాల విస్తృతి వల్ల ఈ స్థితి కొత్తరూపం తీసుకుంటోంది. రాజకీయ నాయకులుగా, రాజకీయ కుటుంబీకులుగా, ఉన్నతోద్యోగులుగా, కళాకారులుగా ఇంకా ఎన్నో రంగాలలో స్త్రీలు బాహాట శీలపరీక్షలకు గురవుతున్నారు. చేతిలో ఫోనో, ఛానలో ఉన్న చాలామంది అగ్నిగుండాలకి సమిధలు తయారు చేస్తున్నారు. ‘ఫలానా స్త్రీ ఎవరితో శారీరక సంబంధంలో ఉందీ, ఆమె బిడ్డకి ఎంతమంది డాడీలు, ఆమెకి ఎంతమంది మగాళ్లతో సంబంధాలు ఉన్నాయి, ఆమె ఏ రోజు ఎవరితో ఏ హోటల్లో ఉందీ’ వంటి లక్షోపలక్షల ప్రశ్నలు సమాజాన్ని ఉద్ధరించడం కోసం మీడియా వేస్తూ ఉంటుంది. అంతేకాదు అటువంటి స్త్రీలకి ఎటువంటి శిక్షలు విధించాలో కూడా రచ్చబండలు, బతుకు జట్కాబండులతో పాటు పిల్లా పిచుకా యూట్యూబర్లు, పెద్ద మీడియా సంస్థల, రాజకీయ పార్టీల డిజిటల్ విభాగాలు నిర్ణయిస్తాయి. ‘కామాంధురాలి కళ్ళు పీకాలి’, ‘పరాయి మగాడితో కులికిన స్త్రీని గుడ్డలూడదీసి కొట్టాలి’, ‘అక్రమ సంబంధం పెట్టుకున్న ఆమెని చెట్టుకు కట్టేసి తన్నాలి’ వంటి అనేక శిక్షలను సజెస్టివ్గా చెప్పడంతో పాటు, ఆ యా శిక్షలను అభినయించి చూపగల ధీరులు వారు. స్త్రీ పురుష శారీరక సంబంధాలు వ్యక్తిగతం. వాటిని చర్చించడానికి కొద్దిమందికి మాత్రమే హక్కు ఉంది. అటువంటి వివాదాల్లోని వ్యక్తులు, ఆ యా సంబంధాలలోని అవకాశవాదాన్ని, మోసాన్ని, హింసని గుర్తించి తీర్పు ఇచ్చే న్యాయవ్యవస్థ లేదా ఆ ఇరువురి సమ్మతంతో ప్రయత్నించే మధ్యవర్తులకి మాత్రమే ఆ హక్కు ఉంది. అంతే తప్ప ఎవరు పడితే వారు, వారి సంబంధాలలోకి తొంగి చూసి, చకచకా అడుగులు వేసి వ్యాఖ్యానించడం కుసంస్కారం. తమ రక్తం పంచుకు పుట్టినవారికే ఆస్తి ఇవ్వడం కోసం, బయలాజికల్ తండ్రులుగా తమ స్థితిని నిర్ధారించుకోవడం కోసం స్త్రీ మొలకు ఇనుప కచ్చడాలు బిగించి, తాళాలు వేసిన ఘనత పితృస్వామ్య సమాజానిది. ఇపుడు మీడియా, సోషల్ మీడియా సామాజిక, రాజకీయ రంగాలలో ఉన్న స్త్రీలకు అటువంటి వర్చువల్ కచ్చడాలు బిగించే ప్రయత్నం చేస్తున్నాయి.డియర్ మీడియా– సోషల్ మీడియా! అవినీతిని వెలికి తీయడమే మీ అత్యున్నత లక్ష్యం అయినపుడు అవినీతే ప్రమాణం కావాలి తప్ప ఎవరి వ్యక్తిగతాలయినా మీకెందుకు! వేల కోట్ల సంపన్నుల మీద పెద్దచూపు, పీడిత వర్గాల వ్యక్తిత్వం మీద చిన్నచూపుతో ఉన్న విషయానికి వంద మసాలా దినుసులు కలిపి వార్తలను వండి వడ్డించే హక్కు మీకుందా? ఒక స్త్రీ ఎంతమందితో తిరిగితే, ఎవరితో ఏ సంబంధంలో ఉంటే, ఎవరితో బిడ్డని కంటే మీకేమిటి నొప్పి? స్త్రీలుగా, పోరాట కులాల స్త్రీలుగా, పౌరులుగా, మనుషులుగా మాకు ఉండే హక్కుల పట్ల ఎలానూ అక్కర లేదు. ఏ రాజకీయాలతో ఎలాంటి సంబంధం లేని పసిబిడ్డల పట్ల మానవ సహజమైన తడి కూడా మీకు లేదు. ‘తల్లి వాస్తవం, తండ్రి నమ్మకం’ అన్న నానుడి పాతదే కానీ దాని నిజార్థాన్ని, ‘పిల్లలు మన ద్వారా వస్తారు తప్ప మనకోసం రారు’ అన్న ఖలీల్ గిబ్రన్ తాత్వికార్థాన్ని గ్రహించగలిగితే స్త్రీ పురుష సంబంధాల పట్ల మీ చూపు మారుతుంది. ఒక బిడ్డకు ఎంతమంది డాడీలు అంటూ చర్చ చేసిన ప్రతి మీడియా సంస్థా ఈ రోజు స్త్రీల, బాలల హక్కులను ఉల్లంఘించాయి. వ్యూస్ కోసం ఎంతకైనా తెగించే మిమ్మల్ని చూస్తుంటే, మా శరీరాల చుట్టూ కెమెరాలు బిగించినట్లు, రాబందుల మైకుల చప్పుడు మా తలల మీదుగా వీస్తున్నట్లు ఉంది. దయ చేసి ఆపండి!కె.ఎన్. మల్లీశ్వరి వ్యాసకర్త కార్యదర్శి, ప్రజాస్వామ్య రచయిత్రుల వేదిక, ఏపీmalleswari.kn2008@gmail.com -
భర్తతో విడాకులు.. సంస్థ యజమానితో పవిత్ర ప్రేమపెళ్లి..
కర్ణాటక: మొదటి భర్తతో కాపురం కలసిరాక విడిపోయిన మహిళ రెండో పెళ్లిని చేసుకుంది, అక్కడ కూడా నిరాదరణే ఎదురు కావడంతో తీవ్ర నిర్ణయం తీసుకుంది. భర్త అక్రమ సంబంధాల మోజులో పడి నిర్లక్ష్యం చేయడంతో భార్య డెత్‌నోట్ రాసి ఆత్మహత్య చేసుకున్న ఘటన బెంగళూరులో జరిగింది. వివరాలు.. హెగ్గనహళ్లికి చెందిన పవిత్ర (30) మొదటి భర్తకు గతంలో విడాకులిచ్చింది. ప్రైవేట్ సంస్థలో పని చేస్తున్న పవిత్ర అదే సంస్థ యజమాని చేతన్‌గౌడను ప్రేమించి పెళ్లి చేసుకొంది. అయితే ఇటీవల అతనికి మరో యువతితో సంబంధం ఏర్పడింది. ఈ విషయమై దంపతుల మధ్య గొడవలు జరిగేవి. పిల్లలు కావాలని పవిత్ర భావిస్తే, భర్త ఇందుకు నిరాకరించాడు. భర్త వివాహేతర సంబంధంపై పవిత్ర ప్రశ్నించగా, నేను మగాడిని, ఏమైనా చేసుకుంటానని ఆమె తల్లి ముందే దాడి చేశాడు. భర్త ప్రవర్తనతో తీవ్ర ఆవేదనకు గురైన పవిత్ర సోమవారం భర్తతో గొడవ పడిన వీడియోను, తాను ఆత్మహత్య చేసుకుంటానని రాసిన డెత్‌నోట్‌ను మొబైల్ వాట్సాప్ స్టేటస్‌లో పెట్టింది. అది చూసిన ఆమె తల్లి పద్మమ్మ ఇంటికి వచ్చి చూసేసరికి పవిత్ర ఉరి వేసుకుని విగతజీవిగా మారింది. భర్త, అతని ప్రియురాలిపై డెత్‌నోట్‌లో ఆరోపణలు ఉన్నాయి. తల్లి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా చేతన్‌గౌడ, అతని ప్రియురాలిపై కెంగేరి పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. -
నాచారంలో సెల్ఫీ సూసైడ్
సాక్షి, క్రైమ్ విభాగం: నాచారంలో దారుణం జరిగింది. ఓ వివాహిత ఫేస్బుక్ లైవ్‌లోనే ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబ సమస్యలే అందుకు కారణమని పోలీసులు భావిస్తుండగా.. మరో యువతితో వివాహేతర సంబంధం పెట్టుకున్న ఆమె భర్త, అతని కుటుంబం టార్చర్ భరించలేక తన కూతురు ప్రాణం తీసుకుందని ఆమె తండ్రి వాపోతున్నాడు. ఉద్యోగి అయిన సనా.. తండ్రి ఉంటున్న బిల్డింగ్‌లోనే మరో పోర్షన్లో ఉంటోంది. ఈ క్రమంలో సనాతల్లి ఎంతసేపు తలుపులు కొట్టినా తీయకపోవడంతో బద్ధలు కొట్టిచూశారు. సనా ఫ్యాన్‌కు ఉరేసుకుని కనిపించింది. భర్త, మామల్ని ఫేస్బుక్లో లైవ్‌పెట్టి మరీ ఆమె ఆత్మహత్యకు పాల్పడినట్లు నిర్ధారణ అయ్యింది. కొంతకాలంగా భర్తకు దూరంగా ఉంటున్న ఆమె.. తండ్రి సాయంతో కొడుక్కి(3) స్కూల్లో తాజాగా అడ్మిషన్ ఇప్పించింది. అంతా సంతోషంగా ఉందనుకుంటున్న సమయంలో ఆమె ఇలా చేయడాన్ని ఆ తల్లిదండ్రులు తట్టుకోలేకపోతున్నారు. షాదీ నాటి ఫొటో మతం మార్చుకుని.. వివాహేతర సంబంధంతో.. వివాహేతర సంబంధం.. అల్లుడి కుటుంబం వేధింపుల వల్లే తన కూతురు చనిపోయిందని సనా తండ్రి ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. 2019లో రాజస్థాన్‌కు చెందిన రాజ్‌పుత్ యువకుడు హేమంత్‌తో ఆమె ప్రేమ వివాహం జరిగింది. మతం మారతానని ముందుకొచ్చిన అతను.. ఆమె తండ్రిని ఒప్పించి మరీ వివాహం చేసుకున్నాడు. అయితే.. అతని కుటుంబ సభ్యులకు ఈ వివాహం ఇష్టం లేదు. అందుకే సనాను మానసికంగా వేధింపులకు గురి చేస్తూ వచ్చింది. ఈలోపు అతని దగ్గరికి సంగీతం నేర్చుకోవడానికి సూఫీ ఖాన్ వచ్చింది. సనా తండ్రి నటిగా పరిచయం చేసుకున్న సూఫీ ఖాన్‌తో సనా భర్తకు చనువు ఏర్పడింది. ఇద్దరూ వివాహేతర సంబంధం కొనసాగించారు. దీంతో సనాకు, ఆమె భర్తకు మధ్య గొడవలు జరిగాయి. సూఫీఖానాను ప్రేమలో పడి.. తన కూతురిని నిర్లక్ష్యం చేస్తూ వచ్చాడని.. టార్చర్ పెట్టాడని సనా తండ్రి నాచారం పీఎస్‌లో ఫిర్యాదు కూడా చేశాడు. అప్పుడు ఇరుకుటుంబాలు మాట్లాడుకుని గొడవను సర్దుమణిగేలా చేశాయి. ఆపై ఆ భార్యాభర్తలు రాజస్థాన్ వెళ్లిపోయి ఉద్యోగాలు చేసుకుంటూ కొడుకును చూసుకుంటున్నారు. ఈలోపు సూఫీఖాన్ విషయంలోనే మళ్లీ ఆ భార్యభర్తల మధ్య గొడవలు మొదలయ్యాయి. కోపంతో కొడుకును తీసుకుని తిరిగి నాచారం వచ్చేసిందామె. అయితే కొడుకును చూసుకుంటూ.. సంతోషంగానే ఆమె ఉందని అంతా భావించారు. ఈలోపే ఇలా అఘాయిత్యానికి ఒడిగట్టింది సనా. సూఫీఖాన్కు, సనా భర్త మధ్య జరిగిన సంభాషణలు, వాట్సాప్ ఛాటింగ్, వాళ్లు దిగిన ఫొటోలు, వాళ్ల వివాహేతర సంబంధానికి సంబంధించిన అన్నీ సాక్ష్యాలు తమ వద్ద ఉన్నాయని సనా తండ్రి అంటున్నాడు. తన కూతురికి న్యాయం చేయాలని కన్నీళ్లతో డిమాండ్ చేస్తున్నాడాయన. భర్త వేధింపులు ఎక్కువ కావడంతోనే ఆమె.. వాళ్లను లైవ్‌లో పెట్టి మరీ ఈ అఘాయిత్యానికి ఒడిగట్టిందని ఆమె తండ్రి ఆరోపిస్తున్నాడు. సూఫీఖాన్ బయటకు వస్తే.. మొత్తం అన్ని విషయాలు బయటపడతాయని అంటున్నారాయన. ఈ మేరకు సనా ఫోన్ స్వాధీనం చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. -
అప్సర కేసు.. పోస్ట్‌మార్టం రిపోర్ట్‌లో ఏముందంటే?
సాక్షి, హైదరాబాద్: తన కూతురు అలాంటి అమ్మాయి కాదని.. చాలా కిరాతకంగా చంపాడంటూ కాశీ నుంచి ఇంటికి చేరుకున్న అప్సర తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన ‘సాక్షి’ మీడియాతో మాట్లాడుతూ.. తమకు, సాయికృష్ణ కుటుంబానికి ఎటువంటి రిలేషన్ లేదని, ఇలా అవుతుందనుకోలేదన్నారు. తెలిసిన వెంటనే ఫ్లైట్ ఎక్కి ఇక్కడికి వచ్చానన్నారు. పూజారి అయి ఉండి ఇలా చేశాడని, నిందితుడికి కఠిన శిక్ష పడాలని అప్సర తల్లిదండ్రులు కోరారు. కాగా, ఉస్మానియా మార్చురీలో అప్సర మృతదేహానికి పోస్ట్‌మార్టం చేసిన వైద్యులు.. ఆమె తల్లిదండ్రులకు అప్పగించారు. తలకు బలమైన గాయాలు కావడంతోనే అప్సర మృతి చెందినట్లు అప్సర ప్రిలిమినరీ పోస్ట్‌మార్టం రిపోర్ట్‌లో తేలింది. జరిగింది ఇదే.. గుడికి వచ్చిన అప్సరతో వివాహితుడైన పూజారికి ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి దారి తీసింది. కొన్నాళ్లు బాగానే గడిపారు. తీరా తనను వివాహం చేసుకోవాల్సిందిగా ఆమె నుంచి ఒత్తిడి పెరగడంతో చంపాలని నిర్ణయించుకున్నాడు. పథకం ప్రకారం నగర శివార్లలోకి తీసుకువెళ్లి దారుణంగా హతమార్చాడు. చదవండి: అప్సర కేసు: సాయికృష్ణ అమాయకుడా? మృతదేహాన్ని సరూర్‌నగర్ మండల ఆఫీసు వెనుక ఉన్న పాత సెప్టిక్ ట్యాంక్‌లో పడేసి ఉప్పు, ఎర్రమట్టి నింపాడు. వాసన బయటకు రాకుండా దానికి ఉన్న రెండు మ్యాన్‌హోల్స్‌కు కాంక్రీట్ చేశాడు. తర్వాత ఆమె అదృశ్యమైనట్లు ఆర్జీఐఏ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశాడు. సాంకేతిక ఆధారాలతో ముందుకు వెళ్లిన పోలీసులు ఆమె హత్యకు గురైనట్లు తేల్చారు. అప్సరను దారుణంగా హతమార్చిన నిందితుడు, పూజారి సాయికృష్ణను పోలీసులు, శుక్రవారం అర్ధరాత్రి జడ్జి ఎదుట హాజరుపరిచారు. ఐపీసీ సెక్షన్ 201, 302 ప్రకారం అతనిపై కేసు నమోదు చేశారు. దీంతో నిందితుడికి 14 రోజుల రిమాండ్ విధించగా.. చర్లపల్లి జైలుకు తరలించారు పోలీసులు. -
అప్సర కేసు: సాయికృష్ణ అమాయకుడా?
సాక్షి, హైదరాబాద్: వివాహేతర సంబంధం, ఆపై గొడవల నేపథ్యంలో అప్సరను దారుణంగా హతమార్చిన నిందితుడు, పూజారి సాయికృష్ణను పోలీసులు, శుక్రవారం అర్ధరాత్రి జడ్జి ఎదుట హాజరుపరిచారు. ఐపీసీ సెక్షన్ 201, 302 ప్రకారం అతనిపై కేసు నమోదు చేశారు. దీంతో నిందితుడికి 14 రోజుల రిమాండ్ విధించగా.. చర్లపల్లి జైలుకు తరలించారు పోలీసులు. మరోవైపు అప్సర మృతదేహానికి ఉస్మానియా ఆస్పత్రిలో ఇంకా శవ పరీక్ష(అటాప్సీ) పూర్తి కాలేదు. ఆ ఆలస్యానికి గల కారణాలను అధికారులు ప్రకటించాల్సి ఉంది. చాలాకాలం కిందట చెన్నై నుంచి హైదారాబాద్‌కు వలస వచ్చింది అప్సర కుటుంబం. ఆమె తండ్రి కాశీలో స్థిరపడిపోగా.. తల్లితో కలిసి సరూర్‌నగర్‌లో అద్దె ఇంట్లోంది అప్సర. ఈ క్రమంలో స్థానికంగా ఓ ఆలయంలో పెద్దపూజారిగా పని చేస్తున్న సాయికృష్ణతో గుడిలో అప్సరకు పరిచయం ఏర్పడింది. శంషాబాద్‌లో తాను నిర్వహించే గోశాలకు తరచూ ఆమెను తీసుకెళ్తూ ఉండేవాడు ఆ పూజారి. ఈ క్రమంలో సినిమాల్లో అవకాశం ఇప్పిస్తానంటూ తరచూ ఆమెను కలిసే వంకతో వాళ్ల ఇంటికి సైతం వెళ్తూ వచ్చాడు సాయికృష్ణ. అప్సర తల్లిని అక్కా అని పిలుస్తూ.. ఇంట్లో అన్ని పనులు చేస్తూ ఉండేవాడు. వివాహితుడు అని తెలిసి కూడా అప్సర అతనితో చనువుగా ఉంటూ వచ్చింది. ఆ పరిచయం కాస్త ప్రేమ, ఆపై శారీరక సంబంధానికి దారి తీసింది. ఈ క్రమంలో ఆమె గర్భం దాల్చగా.. అబార్షన్ సైతం చేయించాడు. చివరకు పెళ్లి కోసం ఒత్తిడి చేయడాన్ని టార్చర్‌గా భావించి.. అప్సరను హత్య చేశానని నిందితుడు సాయికృష్ణ అంగీకరించాడు. సాయికృష్ణ అమాయకుడు! ఇక ఈ కేసులో తన కొడుకు సాయికృష్ణ అమాయకుడని అంటున్నాడు అతని తండ్రి. అప్సరతో సంబంధం ఉన్నట్లు తమకు, అంతెందుకు సాయికృష్ణ భార్యకు సైతం తెలియదని అంటున్నాడు. కేవలం డబ్బు కోసమే తన కొడుకును అప్సర కుటుంబం ట్రాప్ చేసి ఉంటుందని ఆయన అరోపిస్తున్నాడు. కూతురిని కంట్రోల్లో పెట్టుకోవాల్సింది తల్లే కదా అంటున్నాడాయన. ఓసారి అప్సర బ్యాంక్ అకౌంట్లను పరిశీలించండి.. ఆమె కుటుంబానికి ఆదాయం ఎలా వస్తుంది? అంటూ నిలదీస్తున్నాడాయన. మరోవైపు సాయికృష్ణ భార్య సైతం తన భర్తను వెనకేసుకొస్తోంది. ‘‘నా భర్తకు అప్సరతో సంబంధం లేదు. అప్సర చేసింది కరెక్ట్ కాదు. ఆమెకు ఎవరివల్ల గర్భం వచ్చిందో?. బహుశా నా భర్తను అప్సర నిజంగానే టార్చర్ చేసి ఉండొచ్చ’’ని అంటోందామె. -
బెయిల్ ఇప్పించి చంపేశాడు
బరేలీ: ప్రతీకారంతో రగిలే వ్యక్తి ఎంతకైనా తెగిస్తాడంటారు. ఉత్తరప్రదేశ్‌లోని ఖేరి జిల్లా మితౌలీ గ్రామంలో కాశీ కాశ్యప్(50) అనే వ్యక్తి అదే చేశాడు. తన కొడుకును చంపి జైల్లో ఉన్న వ్యక్తిని బెయిల్‌పై బయటకు తీసుకొచ్చి మరీ హత్య చేశాడు. కాశీ దంపతులకు జితేంద్ర(14) అనే కొడుకున్నాడు. 2020లో ఓ హత్య కేసులో కాశీ జైలుకెళ్లాడు. తర్వాత అతని భార్యకు సమీప బంధువైన శత్రుధన్ లాలా (47)తో అక్రమ సంబంధం ఏర్పడింది. వారిద్దరూ తమకు అడ్డుగా ఉన్న జితేంద్రను చంపేశారు. ఈ కేసులో ఇద్దరూ జైలుపాలయ్యారు. గతేడాది కాశీ జైలు నుంచి బయటికొచ్చాడు. కొడుకును పొట్టనపెట్టుకున్న లాలాపై ప్రతీకారంతో రగిలిపోయాడు. సొంత ఖర్చుతో లాయర్‌ను ఏర్పాటు చేసి మరీ లాలాను బెయిల్‌పై బయటకు తీసుకొచ్చాడు. శుక్రవారం రాత్రి అతన్ని తుపాకీతో కాల్చి చంపాడు. పోలీసులు కాశీని అదుపులోకి తీసుకున్నారు. -
భార్యను చంపి 5 ముక్కలుగా నరికి..
బిలాస్పూర్: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో బిలాస్‌పూర్‌కు చెందిన ఓ వ్యక్తి తన భార్యను చంపి, మృతదేహాన్ని ఐదు ముక్కలుగా నరికి, ఇంట్లోని ఖాళీ నీళ్ల ట్యాంకులో పడేశాడు. సక్రి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఉలాస్‌పూర్ ప్రాంతంలో ఓ వ్యక్తి నకిలీ నోట్లను ముద్రిస్తున్నాడనే అనుమానంతో ఓ ఇంట్లో సోదాలు జరిపారు. బాత్రూం మూలన ఉన్న ట్యాంకులో టేప్ వేసి పాలిధీన్ కవర్లో చుట్టిన శరీర భాగాలు కనిపించడంతో షాక్‌కు గురయ్యారు. అక్రమ సంబంధం అనుమానంతో భార్యను జనవరి 6న గొంతు పిసికి చంపినట్లు విచారణలో అతడు వెల్లడించాడు. అనంతరం కట్టర్‌తో మృతదేహాన్ని ఐదు ముక్కలు కోసి, కొనుక్కొచ్చిన ట్యాంకులో పడేసినట్లు తెలిపాడు. ఇంట్లో నకిలీ నోట్లు, కలర్ ప్రింటర్‌ను స్వాధీనం చేసుకున్నారు. -
Crime: భర్త లేకుంటే ప్రియుడితో సంతోషంగా ఉండొచ్చని..
సాక్షి, రంగారెడ్డి: వివాహేతర సంబంధాల మోజులో పడి.. మానవ సంబంధాలకు పాతరేస్తున్నారు కొందరు. పక్కదారి పట్టిన ఆ భార్యను.. మంచి దారిలోకి తేవాలని ఆ భర్త చేసిన ప్రయత్నం ఫలించలేదు. పైగా ఒకరకంగా అదే అతని ప్రాణం మీదకు తెచ్చింది కూడా!. హయత్‌నగర్‌లో జరిగిన దారుణ ఘటన.. భార్య చేసిన కుట్ర, బాధితుడి మరణాంతరం కొన్నినెలలకు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్ హయత్ నగర్లో దారుణం జరిగింది. వివాహేతర సంబంధం మోజులో పడి.. భర్త అడ్డు తొలగించుకుంటే ప్రియుడితో సంతోషంగా ఉండొచ్చని ప్లాన్ చేసింది ఓ మహిళ. అందుకోసం ప్రియుడు, అతని స్నేహితులతో కలిసి భర్తపై దాడి చేయించింది. అదృష్టం బాగుండి ఆ టైంకి బతికాడు. అనుమానం రాకుండా కన్నీళ్లు కారుస్తూ.. లేని ప్రేమను నటించిందామె. మంచానపడ్డ ఆ భర్త కొన్నాళ్లకు కన్నుమూశాడు. దీంతో తన కుట్ర బయటకు రాదని ఆమె భావించింది. అయితే.. సన్నిహితురాలి ద్వారానే ఆమె బాగోతం వెలుగులోకి వచ్చింది. హయత్‌నగర్‌లో నివాసం ఉండే శంకర్ గౌడ్, రజితలు ఇద్దరూ ఆర్టీసీ కండక్టర్లు. శంకర్ కూకట్పల్లి, రజిత హయత్ నగర్ డిపో-1లో పని చేస్తుండేవాళ్లు. అయితే.. రజిత పని చేసే డిపోలోనే రాజ్‌కుమార్ ఆర్టీసీ కానిస్టేబుల్‌గా పని చేసేవాడు. ఈ క్రమంలో వాళ్లిద్దరి మధ్య వివాహేతర సంబంధం మొదలైంది. శంకర్ గౌడ్ డ్యూటీ కోసం వెళ్లగానే.. రాజ్‌కుమార్ రజిత కోసం ఇంటికి వచ్చేవాడు. భార్య ప్రవర్తనలో మార్పు గమనించి.. ఆమెను మందలించాడు శంకర్. అయితే..అది ఆమెకు కోపం తెప్పించింది. భర్త లేకుంటే.. ప్రియుడితో సంతోషంగా ఉండొచ్చని భావించింది. ఇందుకోసం ప్రియుడితో కలిసి స్కెచ్ వేసింది. .. ఈ ఏడాది మార్చి 7వ తేదీ రాత్రి డ్యూటీ నుంచి ఇంటికి తిరిగి వస్తున్న శంకర్‌పై.. దారి కాచిన రాజ్‌కుమార్, అతని ఇద్దరి స్నేహితులు దాడికి దిగారు. ఆ దాడిలో శంకర్ తీవ్రంగా గాయపడగా.. తన భర్తపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారని పోలీసులకు ఫిర్యాదు చేసింది రజిత. సీసీటీవీ ఫుటేజీలు పరిశీలించినా.. నిందితులెవరు అనేది పోలీసులు కనిపెట్టలేకపోయారు. ఆ దాడిలో తగిలిన దెబ్బలతో శంకర్ మంచానికే పరిమితం అయ్యాడు. అలా మూడు నెలల తర్వాత గుండెపోటుతో కన్నుమూశాడు. అయితే.. భర్తపై దాడికి సంబంధించిన విషయాన్ని రజిత తన స్నేహితురాలితో పంచుకుంది. ఆమె అతని సోదరుడికి చెప్పడం, ఆ సోదరుడు శంకర్ గౌడ్ సోదరుడికి స్నేహితుడు కావడంతో విషయం బయటకు వచ్చింది. దీంతో శంకర్ సోదరుడు పోలీసులను ఆశ్రయించాడు. కేసును తిరిగి ఓపెన్ చేసిన పోలీసులు.. రాజ్‌కుమార్‌ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. రజితతో వివాహేతర సంబంధమే ఈ దాడికి కారణమని జరిగిందంతా వివరించాడు. దీంతో.. ఐపీసీ సెక్షన్ 307గా కేసు నమోదు చేసుకుని.. రాజ్‌కుమార్, అతని సహకరించిన నీరజ్, ఉమాకాంత్‌లను అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న శంకర్ భార్య రజిత కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. -
సీఎం యోగి ఆదేశాలు.. వీడిన మర్డర్ కేసు మిస్టరీ
లక్నో: అవును.. ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ ఆదేశాలతోనే ఆ మర్డర్ కేసులో మిస్టరీ వీడింది. అయోధ్య పర్యటనలో ఉండగా స్థానికంగా ఓ గర్భిణి హత్య గురించి విని ఆయన ప్రత్యేక దర్యాప్తునకు ఆదేశించగా.. విమర్శల నడుమే ఎట్టకేలకు పోలీసులు ప్రత్యేక శ్రద్ధ కనబరిచి ఆ కేసు చిక్కుముడి విప్పారు. అయోధ్య కోట్వాలీ పోలీస్ స్టేషన్ పరిధిలోని శ్రీరాంపురం కాలనీలో జూన్ 1వ తేదీన ప్రభుత్వ ఉపాధ్యాయిని సుప్రియా వర్మ(35) దారుణ హత్యకు గురైంది. పదునైన ఆయుధంతో ఎవరో ఆమె వీపుభాగంలో పొడిచి చంపి.. దొపిడీకి పాల్పడ్డారు. ఆ సమయంలో ఇంట్లో ఆమె ఒక్కరే ఉన్నారు. పైగా ఆమె ఐదు నెలల గర్భవతి. దీంతో ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించగా.. ఆదేరోజు అయోధ్య పర్యటనలో ఉన్న సీఎం యోగికి విషయం తెలిసింది. వెంటనే ఆయన ఉత్తర ప్రదేశ్ డీజీపీకి ఆయన ఆదేశాలు జారీ చేశారు. ఆధారాలేవీ దొరక్కపోవడంతో ఈకేసులో విచారణ కష్టతరంగా మారింది. ఈ తరుణంలో.. రాజకీయంగా విమర్శలు వెల్లువెత్తాయి. స్వయంగా సీఎం యోగి ఆదేశించినా ఫలితం లేకుండా పోయిందంటూ ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ విమర్శించారు. దీంతో దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులు.. సీసీటీవీ ఫుటేజీలో టీషర్టు ధరించిన ఓ యువకుడిని గుర్తించారు. ఆ కంపెనీ టీషర్టుల ఆన్లైన్ డెలివరీల మీద ఆరా తీసి.. చివరికి నిందితుడిని పట్టేశారు. శారీరక సంబంధమే! అంబేద్కర్‌నగర్ జిల్లా పథాన్పూర్ ఎట్రావులికి చెందిన సుప్రియా వర్మ.. పోస్టింగ్ రిత్యా అయోధ్యలో ఉంటోంది. ఆమె భర్త ఉమేష్ వర్మ కూడా ప్రభుత్వ టీచరే. ఈ క్రమంలో స్థానికంగా ఉంటున్న ఓ మైనర్‌తో ఆమె సంబంధం నడిపించింది. అయితే ఆమె గర్భం దాల్చడంతో భయపడ్డ మైనర్.. ఎలాగైనా ఆ సంబంధం తెంచుకోవాలనుకున్నాడు. కానీ, ఆమె మాత్రం అందుకు అంగీకరించలేదు. ఈ క్రమంలో.. కుటుంబం పరువు పోతుందని భయపడ్డ ఆ కుర్రాడు దారుణానికి తెగబడ్డాడు. హత్యను దోపిడీగా చిత్రీకరించేందుకు.. ఇంట్లో నుంచి యాభై వేల రూపాయల నగదును, ఇతర విలువైన వస్తువులను తీసుకెళ్లాడు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను సీఎంవో కార్యాలయానికి అందజేసినట్లు అయోధ్య డీఐజీ ఏకే సింగ్ వెల్లడించారు. -
సహజీవనం చేస్తున్న మహిళపై.. ఇద్దర్ని హతమార్చి.. మరొకర్ని చంపబోతూ
ఒంగోలు/కలిగిరి: సహజీవనం చేస్తున్న మహిళపై అనుమానం పెంచుకున్నాడు. ఆ ఇద్దరిమధ్యా తలెత్తిన విభేదాల నేపథ్యంలో ఆ మహిళ తన సోదరుడి ఇంటికి వెళ్లిపోయింది. దీంతో ఆ కుటుంబంపై కత్తిదూసిన హంతకుడు ఆమె సోదరుడి భార్యను, కుమారుడిని పట్టపగలే చంపేశాడు. అక్కడి నుంచి ఒంగోలు చేరుకుని తాను సహజీవనం చేసిన మహిళతో చనువుగా ఉంటున్నాడనే అనుమానంతో కత్తితో మరో వ్యక్తి గొంతు కోసే క్రమంలో పోలీసులకు పట్టుబడ్డాడు. శనివారం చోటుచేసుకున్న ఈ ఉదంతానికి సంబంధించిన వివరాలు.. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అంబటివారిపాలేనికి చెందిన నూర్జహాన్‌కు నెల్లూరుకు చెందిన వ్యక్తితో వివాహమైంది. కొంతకాలానికి భర్తతో విడిపోయింది. కాగా, కలిగిరి మండలం పోలంపాడుకు చెందిన సమీప బంధువు షేక్ రబ్బానీ సోదరితో నూర్జహాన్ సోదరుడికి వివాహమైంది. ఆ తర్వాత నూర్జహాన్, అవివాహితుడైన రబ్బానీ మధ్య సాన్నిహిత్యం పెరిగి ఇద్దరూ ఎనిమిదేళ్లుగా సహజీవనం చేస్తున్నారు. వీరిద్దరికి ఓ కుమారుడు. వయసు ఇప్పుడు ఆరేళ్లు. అనుమానం పెనుభూతమై.. రబ్బానీ ఒంగోలులోని 60 అడుగుల రోడ్డులో టీ దుకాణం నిర్వహిస్తూ నూర్జహాన్, కుమారుడితో కలిసి ఉంటున్నాడు. రబ్బానీ స్థానిక సత్యన్నారాయణపురానికి చెందిన మండ్ల కాశీకుమార్ అనే యువకుడిని తన టీ దుకాణంలో పనిలో పెట్టుకున్నాడు. కాగా, నూర్జహాన్‌తో కాశీకుమార్ చనువుగా ఉండటంతో వారిద్దరిపైనా అనుమానం పెంచుకున్నాడు. ఈ విషయమై రబ్బానీ, నూర్జహాన్ మధ్య విభేదాలొచ్చాయి. దీంతో నూర్జహాన్ అంబటివారిపాలెంలోని తన మరో సోదరుడు మస్తాన్ ఇంట్లో ఉంటోంది. నూర్జహాన్ను తన నుంచి దూరం చేసేందుకే కనిపించకుండా చేశారని భావించిన రబ్బానీ.. మస్తాన్ కుటుంబంపై కక్ష పెంచుకున్నాడు. అంబటివారిపాలెంలోని మస్తాన్ ఇంటికి శనివారం చేరుకున్నాడు. ఆ సమయంలో మస్తాన్ నెల్లూరు వెళ్లగా.. మస్తాన్ భార్య మీరమ్మ (45)తో గొడవపడ్డాడు. వెంట తెచ్చుకున్న కత్తితో మీరమ్మ మెడపై నరికాడు. తల్లిపై దాడిని అడ్డుకోబోయిన ఆమె కుమారుడు అక్బర్ ఆలీఫ్ (23)ని పొడిచాడు. తల్లీకుమారులు అక్కడికక్కడే మృతిచెందారు. మరో హత్య చేయబోయి.. అనంతరం రబ్బానీ మోటార్ సైకిల్‌పై ఒంగోలు చేరుకున్నాడు. తన టీ దుకాణంలో పనిచేసిన మండ్ల కాశీకుమార్‌పై మంగమ్మ కాలేజీ జంక్షన్ సమీపంలో దాడిచేసి కత్తితో గొంతు కోశాడు. ఈ విషయాన్ని స్థానికుల ద్వారా తెలుసుకున్న ట్రాఫిక్ కానిస్టేబుల్ రాజశేఖర్ హుటాహుటిన అక్కడకు చేరుకుని రబ్బానీని అదుపులోకి తీసుకుని తాలుకా పోలీసులకు సమాచారం అందించారు. గాయపడిన కాశీకుమార్‌ను రిమ్స్‌కు తరలించారు. తాలూకా సీఐ శ్రీనివాసరెడ్డి ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. నూర్జహాన్ను ఆరు నెలలుగా కాశీకుమార్ నెల్లూరులో దాచి అక్కడకు వెళ్లి వస్తున్నాడని, వారిద్దరి మధ్య అక్రమ సంబంధం ఉందని అందుకే కడతేర్చేందుకు యత్నించినట్లు పేర్కొన్నాడు. నూర్జహాన్ ఎక్కడ ఉందనేది తెలిసినా మీరమ్మ చెప్పనందునే ఆమెను, అడ్డువచ్చిన ఆమె బిడ్డనూ చంపేసినట్లు పోలీసులతో చెప్పినట్టు తెలిసింది. పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు. -
కూతుర్ని హత్య చేసి భర్తను జైలుకు పంపాలనుకున్న మహిళ!
6 Year Old Girl In Noida Murdered By Her Own Mother ఆరేళ్ల బాలికను కన్నతల్లే హత్య చేసి, అడవిలో పడేసిన ఉదంతం స్థానికంగా కలకలంరేపింది. ఈ కేసులో పోలీసులు షాకింగ్ విషయాలను వెల్లడించారు. తన కుమార్తె కనబడటంలేదని, భర్త కిడ్నాప్ చేశాడనే అనుమానంతో పోలీస్ స్టేషన్లో పిర్యాదు చేసింది కూడా. వివరాల్లోకెళ్తే.. పోలీసుల కథనం ప్రకారం.. నవంబర్ 12 న నోయిడాలోని సెక్టార్-93లో ఒక బాలిక మృతదేహం కనుగొన్నారు. బాలిక శవాన్ని పోలీసులు స్వాధీనం చేసుకుని పోస్టుమార్టంకు పంపించారు. కాగా విచారణలో బాలిక పేరు నేహా శర్మ (6) అని తెలిసింది. బాలిక నివాసముంటున్న ఇంటికి విచారణ నిమిత్తం వెళ్లగా, అప్పటికే బాలిక తల్లి భర్తపై కిడ్నాప్ కేసు పెట్టినట్లు తెలిసింది. సమాచారం ప్రకారం.. హత్యకు పాల్పడిన నిందితురాలిని కూడా గుర్తించారు. మహిళ పేరు అనురాధ. ఆమె మృతురాలి తల్లి. నోయిడాలోని సెక్టార్ 93లో నివసముంటున్న అనురాధ, రామ్‌కుమార్‌లు 2010లో వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు ఆడపిల్లలు. ఐతే రామ్‌కుమార్ నివాసముంటున్న ఫ్లాట్‌ను అమ్మి, గ్రామంలో సెటిలవ్వాలని అనుకున్నాడు. ఐతే అప్పటికే మరొక యువకుడితో వివాహేతర సంబంధమున్న భార్య అనురాధకు గ్రామంలో సెటిలవ్వడం ఇష్టంలేదు. దీంతో కూతురు నేహా శర్మను గొంతునులిమి చంపి, సమీపంలోని అడవిలో పడేసింది. ఫ్లాట్‌పై అత్యాశ, వివాహేతర సంబంధం కారణంగా భర్తను తన దారి నుంచి దూరం చేయాలనుకుంది. కూతుర్ని హత్య చేసి ఆ నేరం భర్తపై నెట్టాలని సదరు మహిళ కుట్ర పన్నిందని పోలీసులు పేర్కొన్నారు. సదరు మహిళను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా నేరం ఒప్పుకుంది. చదవండి: కోట్ల విలువచేసే ఇంటికి నిప్పంటించాడు..ఎందుకో తెలుసా? -
అమ్మతనానికే కళంకం.. పిల్లల ముందే ప్రియుడితో కలిసి వ్యభిచారం
లక్నో: అమ్మ ప్రేమ గురించి కవులు, పుస్తకాలు ఎంతో గొప్పగా వర్ణించారు. అయితే వాస్తవంగా చెప్పాలంటే తల్లి ప్రేమ గురించి వర్ణించడానికి మాటలు చాలవు. కానీ నేటి కాలంలో కొందరు మహిళలు బరితెగించి ప్రవర్తిస్తూ.. అమ్మ అనే మాటకే మాయని మచ్చగా మిగులుతున్నారు. శారీరక సుఖం కోసం కన్న బిడ్డలను బలి తీసుకుంటున్నారు. ఈ కోవకు చెందిన సంఘటన ఒకటి ఉత్తరప్రదేశ్, ఘజియాబాద్ కవినగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాలు.. కవినగర్ పోలీస్ స్టేషన్ పరిధికి చెందిన ఓ వ్యక్తికి కొన్నేళ్ల క్రితం నిందుతురాలైన మహిళతో వివాహం అయ్యింది. వారికి ఓ అబ్బాయి, ఇద్దరు అమ్మాయిలు సంతానం. కొన్నేళ్లపాటు వారి కాపురం సజావుగానే సాగింది. ఆ తర్వాత సదరు వ్యక్తి భార్యకు ఓ క్యాబ్ డ్రైవర్‌తో పరిచయం ఏర్పడి.. అది కాస్త వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఈ క్రమంలో భర్త పని కోసం ఇంటి నుంచి వెళ్లగానే.. క్యాబ్ డ్రైవర్ వారి ఇంటికి వచ్చేవాడు. (చదవండి: నాడు యువతి చేతిలో చెంప దెబ్బలు.. నేడు రాజకీయాల్లో ప్రవేశం) ఇక ఇంట్లో పిల్లల ముందే.. సదరు మహిళ, క్యాబ్ డ్రైవర్ విచ్చలవిడిగా ప్రవర్తించేవారు. పిల్లల ముందే వారి తల్లి.. క్యాబ్‌డ్రైవర్‌తో అసభ్యకరంగా ప్రవర్తించేది. అంతేకాక ప్రియుడి కోరిక మేరకు అతడు చెప్పిన వారికి నగ్నంగా మారి వీడియో కాల్స్ చేసేది. వీరి వికృత చేష్టలు చూసి పిల్లలు తీవ్రంగా భయపడేవారు. వారి అరచకాలు అంతటితో ఆగలేదు. సదరు క్యాబ్ డ్రైవర్ తన ప్రియురాలి పిల్లలతో కూడా అసభ్యంగా ప్రవర్తించేవాడు. దీని గురించి ఎవరికైనా చెబితే.. తండ్రిని చంపేస్తామని బెదిరించేవాడు. ఇలా సాగుతున్న వీరి వికృత చేష్టల గురించి ఓ సారి సదరు మహిళ భర్తకు తెలిసింది. ఇరుగుపొరుగు వారు.. అతడు బయటకు వెళ్లాక ఇంటికి ఎవరో ఒక వ్యక్తి వస్తున్నాడని.. రోజు ఇలానే జరుగుతుందిన తెలిపారు. (చదవండి: పోలీస్ కస్టడీలో యువకుడు మృతి.. హత్యా? ఆత్మహత్యా?) అప్పటికే భార్య ప్రవర్తనలో మార్పు రావడంతో అనుమానం వచ్చిన సదరు వ్యక్తి.. భార్యకు తెలియకుండా ఇంట్లో సీసీటీవీ కెమెరా అమర్చాడు. ఇక దానిలో రికార్డయిన దృశ్యాలు చూసి.. అతడికి ఫ్యూజ్‌లు ఎగిరిపోయాయి. భార్య, ఆమె ప్రియుడి వికృత వేషాలు అతడి కంటపడ్డాయి. దీని గురించి భార్యను నిలదీయగా.. నా ఇష్టం.. నా దారికి అడ్డువచ్చావంటే చంపేస్తానని బెదిరించింది. దాంతో సదరు వ్యక్తి పోలీసు స్టేషన్‌కు వెళ్లి.. ఫిర్యాదు చేశాడు. తన భార్య, ఆమె ప్రియుడితో కలిసి తన ఇంట్లోనే వ్యభిచారం చేస్తుందని పేర్కొన్నాడు. తనను, పిల్లలను చంపుతామని బెదిరిస్తున్నాడని ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈ క్రమంలో పోలీసులు బాధితుడి భార్య, ఆమె లవర్ మీద పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. చదవండి: భయపెట్టమంటే.. భయానికే భయం పుట్టించాడు! -
అక్రమ సంబందం తెలిసిందని హత్య చేశారు
సాక్షి, వరంగల్ : వరంగల్ అర్బన్ జిల్లా ఖిలా వరంగల్ మండలం నక్కలపెల్లి గ్రామ శివారు ఇటుక బట్టీలో సోమవారం కలకలం రేపిన బాలుడి హత్య ఘటన మిస్టరీని 24గంటలలోపు మామునూరు పోలీసులు ఛేదించారు. ఓ మహిళతో యువకుడు కొనసాగిస్తున్న అక్రమ సంబంధం ఆమె కుమారుడికి తెలిసిందన్న కారణంతో పొట్టన పెట్టుకున్నట్లే తెలిసింది. ఈ మేరకు మామునూరు పోలీస్ స్ట్రేషన్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈస్ట్‌జోన్ డీసీపీ నాగరాజు వివరాలు వెల్లడించారు. ఒడిస్సా నుంచి నక్కలపల్లికి.. ఒడిస్సా రాష్ట్రం బలంగిరి జిల్లా సోమేశ్వర్ గ్రామానికి చెందిన బోయి సంజుతో అదే జిల్లా డైడుమారి గ్రామానికి చెందిన ఆవివాహతుడైన బంగుల నృత్యకైరా(24) అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. కాగా వరంగల్ ఇటుక బట్టీల్లో కూలి పనిచేస్తే ఎక్కువ డబ్బు సంపాదించవచ్చని ఆశ చూపి రెండు నెలల క్రితం ఆయన తమ్ముళ్లతో పాటు తాను అక్రమ సంబంధం కొనసాగిస్తున్న బోయి సంజు, ఆమె భర్త, ముగ్గురు పిల్లలను తీసుకుని ఖిలా వరంగల్ మండలం నక్కలపెల్లికి వచ్చాడు. అందరూ ఒకే ఇటుక బట్టీలో కూలి పని చేస్తున్నారు. కాగా, సంజు పెద్ద కుమారుడు బోయి దినేష్(11) ఇంటి వద్దే ఉంటుండగా... సంజుతో నృత్యకు ఉన్న సంబంధం ఆ బాలుడికి తెలిసిందని నృత్య అనుమానించాడు. ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకుని ఈనెల 12న ఆదివారం మధ్యాహ్నం దినేష్‌ను బహిర్బూమికి అని చెప్పి ఇంటి నుంచి బలవంతంగా నక్కలపెల్లి చెరువు వద్ద ముళ్ల పొదల్లోకి తీసుకెళ్లాడు. అక్కడ దినేష్ మెడకు తువ్వాల బిగించి గట్టిగా లాగి హత్య చేసి పారిపోయాడు. దినేష్ కనిపించడంలేదని వెతుకున్న క్రమంలోనే సోమవారం ఉదయం శవమై కనిపించగా... మామునూరు పోలీసులు దర్యాప్తు ఆరంభించారు. ఈ మేరకు దర్యాప్తును వేగవంతం చేసి 24 గంటల్లోనే నేరస్తుడు నృత్య కైరా(24)ను అరెస్టు చేసి వివరాలు వెల్లడించారు. కాగా, నిందితుడు బాలుడి తల్లికి తెలియకుండా ఈ ఘటనకు పాల్పడ్డారని తేలినట్లు పోలీసులు తెలిపారు. కేసు విచారణలో కీలకంగా వ్యవహరించిన ఈస్ట్‌జోన్ డీసీపీ నాగరాజు, ఏసీపీ శ్యాంసుందర్, సీఐ సార్ల రాజును సీపీ రవీందర్ ప్రత్యేకంగా అభినందించారు. ఈ సమావేశంలో మామునూరు ఇన్స్పెక్టర్ సార్ల రాజు, గీసుగొండ ఎస్సై నాగరాజు, సిబ్బంది పాల్గొన్నారు. -
సహజీవనం: మరొకరితో సన్నిహితంగా ఉందనే నెపంతో..
సాక్షి, మిర్యాలగూడ: కొబ్బరి బొండాలు నరికే కత్తితో ఓ వ్యక్తి యువకుడిపై హత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన శుక్రవారం సాయంత్రం మిర్యాలగూడలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మాడుగుపల్లి మండలం కల్వలపాలెం గ్రామానికి చెందిన బొల్లెపల్లి వజ్రం గతంలో అబ్దుల్లాపూర్‌మెట్‌లో ఒక మిల్క్ సెంటర్లో పని చేసేవాడు. అక్కడ ఓ భర్త లేని మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. కొంత కాలం తర్వాత వారిద్దరూ మిర్యాలగూడకు వచ్చి టాకారోడ్డులో నివాసముంటూ సహజీవనం చేస్తున్నారు. వజ్రం పట్టణంలోని ఎన్నెస్పీ క్యాంపులో పండ్ల వ్యాపారం చేస్తున్నాడు. ఈ క్రమంలో వారు అద్దెకు ఉండే ఇంట్లోనే మరో గదిలో అద్దెకు ఉంటున్న నకిరేకల్‌కు చెందిన తాండు రాజు ఆ మహిళతో సన్నిహితంగా ఉంటున్నట్లు వజ్రం గమనించాడు. అప్పటి నుంచి ఆమె అనుమానం పెంచుకుని తరుచూ కొట్టసాగాడు. దీంతో కొద్ది రోజుల క్రితం ఆ మహిళ ఇక్కడి నుంచి తన తల్లి గారి ఊరు భూదాన్‌పోచంపల్లికి వెళ్లిపోయింది. దీంతో తాండు రాజు కారణంగానే తాను సఖ్యతగా మెలుగుతున్న మహిళ తనను విడిచి వెళ్లిపోయిందని ఇటీవల వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఈ విషయంపై విచారణ చేసిన సీఐ ఆ మహిళను మూడు రోజుల క్రితం పిలిపించి వివరాలు సేకరించారు. ఆ మహిళ తాను ఎవరిని వివాహం చేసుకోలేదని, ఎవరితోనూ తనకు సంబంధం లేదని తేల్చి చెప్పి తిరిగి వెళ్లిపోయింది. దీంతో తాండు రాజుపై కక్ష పెంచుకున్న బొల్లెపల్లి వజ్రం పథకం ప్రకారం రోడ్డుపై నడిచి వెళుతున్న రాజుపై కొబ్బరి బొండాలు నరికే కత్తితో వెనుకనుంచి నరికాడు. మరో సారి మరో వేటు వేసేందుకు ప్రయత్నిస్తుండగా స్థానికులు అడ్డుకోవడంతో అక్కడి నుంచి పరారయ్యాడు. తీవ్రంగా గయపడిన రాజును స్థానికులు పట్టణంలోని ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు .. పట్టణంలో రద్దీగా ఉండే రోడ్డుపై యువకుడిపై కత్తితో దాడి చేయడంతో పట్టణ ప్రజలు ఒక్కసారిగా హడలిపోయారు. ఏం జరుగుతుందోనని కొందరు పరుగులు పెట్టారు. విషయం తెలుసుకున్న సీఐ దొంతిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి సంఘటన స్థలానికి వెళ్లి వివరాలు సేకరించారు. అనంతరం ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తాండు రాజును వివరాలు అడిగి తెలుసుకున్నారు. నిందితుడు వజ్రం పరారీలో ఉన్నాడని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. కాగా రాజు ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. -
వివాహేతర సంబంధం: ప్రియుడి సాయంతో ఘాతుకం
సాక్షి, మహబూబాబాద్: తన వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడని భర్తను ప్రియుడు, ఆయన స్నేహితులతో కలిసి హత్య చేయించింది ఓ భార్య.. అయితే, ఈ ఘటనను రోడ్డు ప్రమాదంగా నమ్మించేందుకు ప్రయత్నించగా.. పోలీసులు శాస్త్రీయ పద్ధతిలో విచారించడంతో అసలు నిజం బయటపడింది. ఈ మేరకు భార్య, ఆమె ప్రియుడు, ఇందుకు సహకరించిన మరొకరిని అరెస్టు చేయడంతో పాటు, హత్యకు ఉపయోగించిన వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మహబూబాబాద్ టౌన్ పోలీస్ స్టేషన్ సమావేశ మందిరంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి వివరాలు వెల్లడించారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని మంగళి కాలనీకి చెందిన ఇన్నారపు నవీన్ పెయింటర్‌గా పనిచేస్తుండగా ఆయన భార్య శాంతితో కలిసి జీవిస్తున్నాడు. అయితే, మరో పెయింటర్ అయిన దాసరి వెంకటేష్‌తో శాంతికి ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధంగా మారింది. ఈ విషయాన్ని గుర్తించిన నవీన్ తన భార్యను గట్టిగా హెచ్చరించాడు. ఈ విషయంలోనే రెండేళ్ల క్రితం దాసరి వెంకటేష్, పద్దం నవీన్ కలిసి ఇన్నారపు నవీన్‌ను ఊరి బయటకు తీసుకువెళ్లి దేహశుద్ది చేశారు. అనంతరం కూడా దాసరి వెంకటేష్, శాంతి మధ్య వివాహేతర సంబంధం కొనసాగుతుండగా ప్రతిసారి ఇన్నారపు నవీన్ తన భార్యను హెచ్చరిస్తున్నాడు. అయితే, తన భర్తను అడ్డు తొలగిస్తేనే మంచిదని శాంతి చెప్పడంతో వెంకటేష్ అంగీకరించాడు. ఇందులో భాగంగా గతనెల 21వ తేదీన శాంతి తన తల్లిగారిల్లయిన రేగడి తండాకు వెళ్లి రాత్రి 9 గంటలకు మటన్ తీసుకురావాలని తన భర్త నవీన్‌కు ఫోన్లో చెప్పింది. దీంతో ఆయన హోండా యాక్టివాపై రేగడి తండాకు బయలుదేరగా.. ఈ విషయాన్ని శాంతి తన ప్రియుడు వెంకటేష్‌తో పాటు ఆయన స్నేహితుడు పద్దం నవీన్‌కు చేరవేసింది. దీంతో మధ్యలో కాపుకాచిన వెంకటేష్ ఆయన స్నేహితుడు నవీన్ కలిసి ఇన్నారపు నవీన్‌ను ఆపి రోడ్డు పక్కకు లాక్కెళ్లి రాడ్‌తో తలపై కొట్టడమే కాకుండా మెడకు టవల్‌తో ఉరి బిగించి హత్య చేశారు. ఆ తర్వాత రోడ్డు పక్కన ఆయన మృతదేహాన్ని వేసి, దానిపై బండి పడవేసి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. మద్యం గ్లాసులు.. సీసా మూతే ఆధారం రోడ్డు ప్రమాదంలో ఇన్నారపు నవీన్ మృతి చెందినట్లు తెలియడంతో పోలీసులు చేరుకున్నారు. సంఘటన స్థలాన్ని పోలీసులు పరిశీలించగా అక్కడ మద్యం సేవించిన ప్లాస్టిక్ గ్లాసులు, మద్యం బాటిల్ మూత, ప్లాస్టిక్ వాటర్ బాటిల్, నేలపై ఉన్న రక్తపు మరకలు, చిల్లర డబ్బు కనిపించాయి. కేసు నమోదు చేసుకున్న మహబూబాబాద్ రూరల్ సీఐ జూపల్లి వెంకటరత్నం, కురవి ఎస్సై జె.శంకర్రావు నేర స్థలంలో లభించిన మద్యం బాటిల్‌పై ఉన్న బార్కోడ్ ఆధారంగా వైన్స్‌ను గుర్తించి వెళ్లి ఆరా తీశారు. మార్గమధ్యలో సీసీ కెమెరాల్లో కనిపించిన వ్యక్తులతో పాటు మృతుడి భార్య శాంతి కాల్‌డేటాను ఆరా తీయగా.. పలుమార్లు వెంకటేశ్‌తో మాట్లాడినట్లు తేలింది. దీంతో శాంతితో పాటు దాసరి వెంకటేష్, పద్దం నవీన్‌ను మహబూబాబాద్ రూరల్ సీఐ వెంకటరత్నం అదుపులోకి విచారించగా తామే హత్య చేసినట్లు అంగీకరించారు. ఈ మేరకు కేసులో పకడ్బందీగా విచారించిన కురవి ఎస్సై జె.శంకర్రావు, వారి సిబ్బందిని ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి అభినందించారు. ఈ సమావేశంలో డీఎస్పీ ఆంగోతు నరేష్కుమార్, మహబూబాబాబాద్ రూరల్ సీఐ జూపల్లి వెంకటరత్నం, కురవి ఎస్సై జె.శంకర్రావు పాల్గొన్నారు. -
అనైతిక బంధానికి అడ్డొస్తున్నాడనే..
సాక్షి, పటాన్చెరు: ప్రియుడుతో కలసి అడ్డుగా ఉన్న భర్తను హత్య చేయించిన ఘటన పటాన్చెరు పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. శుక్రవారం పటాన్చెరు పోలీస్‌స్టేషన్‌లో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో డీఎస్పీ రాజేశ్వర్‌రావు, సీఐ నరేష్ వివరాలను వెల్లడించారు. మెదక్ జిల్లా పుల్కల్ మండలం ముదిమానిక్యం గ్రామానికి చెందిన బేగరి దివాకర్ 15 ఏళ్ల క్రితం బతుకుదెరువు కోసం కుటుంబ సభ్యులతో కలసి పటాన్చెరు చైతన్యనగర్ కాలనీలో నివాసం ఉంటూ ట్రాక్టర్ డ్రైవర్‌గా జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో గత నెల ఆగస్టు 26న మండల పరిధిలోని పెద్దకంజర్ల గ్రామ శివారులోని ఎల్లమ్మ గుడి సమీపంలో దివాకర్ (39) హత్యకు గురైన సంగతి తెలిసిందే. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. వివరాలు వెల్లడిస్తున్న డీఎస్పీ రాజేశ్వర్ రావు, సీఐ నరేష్ రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం శేరిగూడెం గ్రామానికి చెందిన మైలారం జంగయ్యకు కొన్ని రోజుల క్రితం దివాకర్‌తో పరిచయం ఏర్పడింది. దీంతో వీరి పరిచయం స్నేహంగా మారడంతో దివాకర్ అవసరాల కోసం అప్పుడుప్పుడు జంగయ్య వద్ద డబ్బులు తీసుకునేవాడు. ఈ క్రమంలో జంగయ్య తరుచూ దివాకర్ ఇంటికి వచ్చిపోతుండే వాడు. ఈ క్రమంలో దివాకర్ భార్య సురేఖతో జంగయ్యకు పరిచయం ఏర్పడి అది అక్రమ సంబంధంగా మారింది. జంగయ్యపై దివాకర్‌కు అనుమానం వచ్చిందని దివాకర్ భార్య సురేఖ జంగయ్యతో చెప్పింది. దీంతో ప్రణాళిక వేసిన జంగయ్య తన స్నేహితుడైన నవాపేట్ మండలం పులుమామిడి గ్రామానికి చెందిన ఆకుల పరమేష్, మాదారం గ్రామానికి చెందిన ప్రకాష్‌ను సంప్రదించాడు. దివాకర్‌ను హత్య చేసేందుకు రెండు లక్షల సుపారి మాట్లాడి రూ. లక్షా 30 వేలను అడ్వాన్స్‌గా ఇచ్చాడు. ఈ క్రమంలో ఆగస్టు 26న పథకం ప్రకారం పరమేష్, ప్రకాష్‌లు ఇద్దరు దివాకర్‌కు మద్యం తాగించి మండల పరిధిలోని పెద్దకంజర్ల గ్రామ శివారులో శివానగర్ వైపు వెళ్లే రోడ్డులో గల ఎల్లమ్మ గుడి సమీపంలో దివాకర్‌ను రాయితో తలపై కొట్టి హత్య చేశారు. కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులు హత్యకు కారణమైన జంగయ్య, పరమేష్, ప్రకాష్, దివాకర్ భార్య సురేఖను అదుపులోకి తీసుకొని నలుగురిని రిమాండ్‌కు తరలించారు. వారి వద్ద నుంచి రూ. 13 వేల నాలుగు వందలు, ఐదు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. -
వివాహేతర సంబంధం: నమ్మించి చంపేశారు!
సాక్షి, నిజాంసాగర్: తరచూ కుటుంబ కలహాలు అవుతున్నాయన్న అనుమానంతో ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. తన భర్తతో వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళను హత్య చేశారు. నిజాంసాగర్ మండలం సింగితం గ్రామ అటవీ ప్రాంతంలో గురువారం మధ్యాహ్నం జరిగిన హత్య ఉదంతం శుక్రవారం వెలుగులోకి వచ్చింది. పూర్తి వివరాలిలా ఉన్నాయి. బాన్సువాడ మండలం దక్కల్‌దాని తండాకు చెందిన బోడ అరుణ(35) అనే వివాహితతో, ముదెల్లికి చెందిన వట్నాల అంజయ్య చనువుగా ఉంటున్నారు. ఇద్దరి మధ్య వివాహేతర సంబంధం ఏర్పడంతో మరింత దగ్గరయ్యారు. అప్పటి నుంచి అంజయ్య తన భార్య, పిల్లలతో తరచూ గొడవలు పడ్డాడు. అంజయ్య భార్య కాశవ్వకు, అరుణపై అనుమానం వచ్చింది. తన భర్తతో సంబంధం కారణంగానే గొడవలు జరుగుతున్నాయని కక్ష పెట్టుకున్న కాశవ్వ అరుణను అంతం చేసేందుకు పన్నాగం పన్నింది. ముదెల్లికి చెందిన సుతారి బాలయ్య సహాయం తీసుకుంది. ఎప్పటిలాగే అరుణతో కలిసి కాశవ్వ బాన్సవాడ పట్టణానికి వచ్చింది. తమ బంధువులు పండుగ చేస్తున్నారని, ఊరికి వెళ్దామని అరుణతో నమ్మబలికింది. అప్పటికే సుతారి బాలయ్య గాలీపూర్ గేటు వద్ద వీరి కోసం కాపు కాస్తున్నాడు. బాన్సువాడ నుంచి కాశవ్వ, అరుణ ఇద్దరు కలిసి ఆర్టీసీ బస్సులో వచ్చారు. గాలీపూర్ గేటు వద్ద బస్సు దిగి నిజాంసాగర్ ప్రధాన కాలువ కట్టపై నుంచి కాలినడకన వచ్చారు. అక్కడే ఉన్న బాలయ్య, కాశవ్వ, అరుణ కలిసి సింగితం అటవీ ప్రాంతంలోకి వెళ్లారు. తర్వాత బాలయ్య తన ధోతిని అరుణ గొంతు చుట్టూ చుట్టి నులిమాడు. ఊపిరాడకుండా కొట్టుకుంటున్న అరుణపై కాశవ్వ బండరాయితో మోదడటంతో అరుణ మృతి చెందింది. దాంతో బాలయ్య, కాశవ్వ తిరిగి బాన్సువాడకు వెళ్లి అక్కడి నుంచి ముదెళ్లికి వెళ్లారు. తండా నుంచి వెళ్లిన అరుణ రాత్రి వరకు ఇంటికి రాకపోవడం, ఆచూకీ లేక కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అరుణ వెంట కాశవ్వ వెళ్లినట్లు తండావాసులు ఫిర్యాదులో పేర్కొనడంతో హత్య ఉందంతం వెలుగులోకి వచ్చింది. కాశవ్వను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారించగా అరుణను హత్య చేసినట్లు ఒప్పుకుంది. దాంతో బాన్సువాడ డీఎస్పీ యాదగిరి, పట్టణ సీఐ మహేశ్‌గౌడ్, స్థానిక ఎస్ఐ సాయన్న పోలీసు బలగాలతో ఘటనాస్థలానికి చేరుకున్నారు. పరిశీలించి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం బాన్సువాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బోడ అరుణ మృతదేహం: మృతదేహాన్ని మోసుకు వస్తున్న సిబ్బంది -
బయటకు లాక్కొచ్చి..జుట్టు కత్తిరించి..
రాంచి : యువకుడు తన పట్ల అభ్యంతరకరంగా ప్రవర్తించాడని ఆరోపించిన వివాహితకు చేదు అనుభవం ఎదురైంది. అతడిపై ఫిర్యాదు చేసిన మరుసటి రోజే ఆమెను పిలిపించిన మహిళా పంచాయతీ సభ్యులు సదరు మహిళను దారుణంగా కొట్టి జుట్టు కత్తిరించారు. ఈ అమానుష ఘటన జార్ఖండ్‌లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు...బాధిత మహిళ భర్తతో కలిసి కోడెర్మా జిల్లాలోని దంగోడి అనే గ్రామంలో జీవిస్తోంది. భర్త మేనల్లుడైన 22 ఏళ్ల యువకుడు తరచుగా వాళ్లింటికి వచ్చేవాడు. ఈ క్రమంలో బాధిత మహిళ భర్త ఇంట్లో లేని సమయంలో ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించేవాడు. మూడు నెలలుగా ఇదే తంతు కొనసాగడంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది. ఈ నేపథ్యంలో విషయం తెలుసుకున్న ఆ యువకుడు ఆ ఊరి మహిళా పంచాయతీ సభ్యులను కలిసి బాధిత మహిళతో తనకు వివాహేతర సంబంధం ఉందని, ఈ సంబంధం కొనసాగించాల్సిందిగా తనను వేధిస్తోందని చెప్పాడు. దీంతో వాళ్లంతా ఆమె ఇంటికి చేరుకుని బయటికి లాక్కొచ్చి అర్థనగ్నంగా మార్చి తీవ్రంగా దాడి చేశారు. తప్పు చేశావంటూ ఆమె జట్టు కత్తిరించి పంచాయతీ వద్దకు ఈడ్చుకువచ్చారు. ఈ మేరకు బాధిత మహిళ ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనతో 11 మంది వ్యక్తులకు సంబంధం ఉన్నట్లుగా గుర్తించి వారిని విచారిస్తున్నామని వెల్లడించారు. -
రాడ్‌తో చంపి శవాన్ని బాత్రూమ్లో పడేశాడు
న్యూఢిల్లీ : అక్రమ సంబంధం ఉందన్న అనుమానంతో తనతో సహజీవనం చేసున్నమహిళను ఇనుపరాడ్‌తో కొట్టి చంపిన ఘటన శుక్రవారం రాత్రి ఢిల్లీలో చోటుచేసుకుంది. నిందితుడు హత్య చేసి పారిపోతుండగా రైల్వే స్టేషన్లో అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఐపీసీ 302 సెక్షన్ కింద నిందితుడు రామ్‌దాస్(42)పై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు సీనియర్ పోలీసు అధికారి వెల్లడించారు. వివరాల ప్రకారం.. ఢిల్లీలో నివసిస్తున్న రామ్‌దాస్‌కు ఇదివరకే పెళ్లైందని, భార్య అనుమతితో పాయల్ అనే మహిళతో సహజీవనం చేస్తున్నట్లు పేర్కొన్నారు. రామ్‌దాస్ తన భార్య పేరిట ఉన్న ప్లాట్లు కొనుగోలు విషయంలో పాయల్‌తో గొడవ జరగడంతో, కొన్ని వారాలుగా పాయల్ తన సోదరితో కలిసి ఉంటుంది. ఈ నేపథ్యంలో శుక్రవారం అదే విషయమై మాట్లాడానికి పాయల్ రామ్‌దాస్ వద్దకు వచ్చింది. ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకోవడంతో సహనం కోల్పోయిన రామ్‌దాస్ పాయల్‌ను ఇనుపరాడ్‌తో బలంగా కొట్టడంతో ఆమె అక్కడికక్కడే మరణించినట్లు పోలీసులు తెలిపారు. ఆమె మృతదేహాన్ని బాత్రూంలో పడేసి, డోర్ లాక్ చేసి అక్కడినుంచి పారిపోయినట్లు వెల్లడించారు. విచారణ సమయంలో నేరానికి పాల్పడింది తానేనని నిందితుడు ఒప్పుకున్నట్లు పోలీసులు స్పష్టం చేశారు. -
ప్రేమ వివాహం: అనుమానంతో భార్య, పిల్లల హత్య!
సాక్షి, వికారాబాద్: మతాలు వేరైనా కలిసి జీవించాలనుకున్నారు.. పెద్దలు ఒప్పుకోకపోయినా ఎదిరించి పెళ్లి చేసుకున్నారు. ఆ తెగింపు వారిని ఎక్కువ రోజులు కలిసి ఉండనివ్వలేదు. అనుమానం పెనుభూతమై వారి కాపురాన్ని కూల్చేసింది. కట్టుకున్న భర్త.. తన భార్యతో పాటు ఇద్దరు పిల్లలను కిరాతకంగా హత్యచేశాడు. భార్యపై అనుమానం పెంచుకున్న భర్త.. తన అర్ధాంగితో పాటు ఇద్దరు పిల్లలను హత్య చేసిన దుర్ఘటన ఆదివారం అర్ధరాత్రి వికారాబాద్ జిల్లా కేంద్రంలోని మోతీబాగ్ కాలనీలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. స్థానిక మోతీబాగ్ కాలనీలోని ఓ అద్దె ఇంట్లో ప్రవీణ్, చాందిని(30) దంపతులు.. కుమారుడు అయాన్(10), కూతురు (5) ఏంజిల్‌తో కలిసి ఉంటున్నారు. ప్రవీణ్ మున్సిపల్ పరిధిలోని శివారెడ్డిపేట్‌లో ఉన్న ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్నాడు. చాందిని ధన్నారం సమీపంలోని స్వామి వివేకానంద గురుకుల పాఠశాలలో ప్రైవేటులో టీచర్‌గా పనిచేస్తుండేది. పిల్లలు ఇదే పాఠశాలలో చదువుతున్నారు. భార్యపై అనుమానం... ప్రవీణ్ దళిత సామాజిక వర్గానికి చెందినవాడు. చాందిని ముస్లిం సామాజిక వర్గం. ప్రవీణ్ స్వస్థలం తాండూరు.. కాగా చాలా రోజుల క్రితం వారి కుటుంబం హైదరాబాద్‌లోని లింగంపల్లిల్లో స్థిరపడింది. చాందినిది లింగంపల్లి. వీరిద్దరికి అక్కడే చాలా కాలంగా పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. ఇద్దరు పెళ్లి చేసుకోవాలనుకున్నారు. చాందిని కుటుంబీకులు ఆమెను బలవంతంగా మరోవ్యక్తికి ఇచ్చి పెళ్లి చేశారు. ఇష్టం లేకపోయినా కొన్నాళ్లు అతడితో కాపురం చేసిన చాందినికి ఓ బాబు పుట్టాడు. అనంతరం కొన్నాళ్లకు భార్యాభర్తల మధ్య విభేదాలు రావడంతో ఆరేళ్ల క్రితం విడిపోయారు. అనంతరం ప్రియుడు ప్రవీణ్‌ను పెళ్లి చేసుకొని వికారాబాద్‌లో కాపురం పెట్టారు. చాందిని తనతోపాటు కుమారుడు అయాన్‌ను వెంట తెచ్చుకుంది. కొన్నాళ్లకు వీరికి కూతురు ఏంజిల్ పుట్టింది. ఇద్దరూ ప్రైవేటు ఉద్యోగాలే చేస్తున్నా సంతోషంగా ఉండేవారు. ఇటీవల చాందినిపై అనుమానం పెంచుకున్న ప్రవీణ్ పలుమార్లు గొడవపడినట్లు సన్నిహితులు తెలిపారు. భార్యకు వివాహేతర సంబంధం ఉందని ప్రవీణ్ తరచూ మద్యం తాగుతూ ఆమెపై దాడి చేస్తుండేవాడు. ఈక్రమంలో ఆదివారం రాత్రి కూడా మద్యం మత్తులో ప్రవీణ్ భార్య, ఇద్దరు పిల్లలను హత్య చేశాడు. మూడు రోజులుగా మత్తులోనే.. పది రోజుల క్రితం కూతురు ఏంజిల్ ఒంటిపై వేడినీళ్లు పడ్డాయి. దీంతో చిన్నారి అనారోగ్యానికి గురైంది. ఈ విషయం తెలుసుకున్న ప్రవీణ్ తల్లి హేమలత, తమ్ముడు ప్రదీప్ పాపను చూసేందుకు ఈనెల 2న వికారాబాద్‌కు వచ్చారు. అదే రోజు తమ్ముడు ప్రదీప్‌తో కలిసి ప్రవీణ్ మద్యం తాగాడు. మరుసటి రోజు ప్రదీప్ పుట్టినరోజు ఉండడంతో వారు ఇక్కడే ఉండిపోయారు. పుట్టిన రోజు వేడుకలు చేసుకొని ఆ రాత్రి కూడా అన్నదముళ్లు మద్యం తీసుకున్నారు. 4వ తేదీన ఆదివారం సెలవు దినం కావడంతో ప్రవీణ్ ఇంటి దగ్గరే ఉన్నాడు. దీంతో అన్నదమ్ముళ్లు ఇద్దరూ రోజంతా మద్యం తాగారు. మూడు రోజులుగా మద్యం తాగుతుండడంతో చాందిని భర్తను వారించింది. రాత్రి 10 గంటల సమయంలో ప్రవీణ్ తల్లి, తమ్ముడి ముందే భార్యాభర్తలు గొడవపడ్డారు. దీంతో తాము ఇంటికి వెళ్తామంటూ హేమలత, ప్రదీప్ రైల్వేస్టేషన్‌కు వెళ్లారు. అనంతరం దంపతుల గొడవ తీవ్రమైంది. ఇంట్లో ఉన్న ఇనుపరాడ్డును తీసుకొని ప్రవీణ్ భార్య తలపై బలంగా మోదడంతో అక్కడిక్కడే మృతిచెందింది. అప్పటికే నిద్రలో ఉన్న కుమారుడు అయాన్ లేచి తండ్రి దాడిని గమనించి ఏడ్చే ప్రయత్నం చేశాడు. ఏడుపు విని ఎవరైనా వస్తారనే భయంతో ప్రవీణ్ అతడి గొంతు నులిమి చంపేశాడు. అనంతరం నిద్రపోతున్న చిన్నారి తలపై రాడ్డుతో బలంగా కొట్టి హత్య చేశాడు. తర్వాత ప్రవీణ్ పిల్లలను తల్లి దగ్గర పడుకోబెట్టి బయటకు వచ్చాడు. అక్కడి నుంచి నేరుగా రైల్వేస్టేషన్‌కు వెళ్లాడు. అక్కడే ఉన్న తన తల్లి, తమ్ముడికి హత్య విషయం తెలిపాడు. దీంతో కంగారుపడిన వారు అతడిని తిట్టి పట్టుకునే ప్రయత్నం చేయగా తప్పించుకున్నాడు. దీంతో కంగారుపడిన తల్లి, తమ్ముడు నేరుగా వికారాబాద్ ఠాణాకు వెళ్లి ప్రవీణ్ తన భార్యతో గొడవపడుతున్నట్లు తెలిపారు. అంతలోనే అక్కడికి వచ్చిన నిందితుడు హత్య విషయం పోలీసులకు చెప్పి లొంగిపోయాడు. దుబాయిలో ఉన్నాం.. తన కూతురు దారుణ హత్యకు గురైన విషయం తెలిసిన చాందిని తల్లి మున్నాబేగం బోరున విలపించింది. కూతురు హత్య విషయాన్ని లింగంపల్లిలోని ఆమె ఇంటికి వెళ్లి పోలీసులు చెప్పగా నమ్మలేదు. తమ కూతురు దుబాయ్‌లో క్షేమంగా ఉందన్నారు. పోలీసులు చాందిని, అయాన్ ఫోటో చూపించడంతో చివరకు నమ్మారు. ఐదేళ్ల క్రితం తనకు దుబాయ్ వెళ్లేందుకు వీసా వచ్చిందని తన కుమారుడితో అక్కడికి వెళ్తున్నట్లు చెప్పి చాందిని ఇంటి నుంచి వచ్చిందన్నారు. ఎప్పుడూ సెల్ఫోన్లో వీడియో కాల్ మాట్లాడేదని, దుబాయ్‌లోనే ఉన్నట్లు చెప్పిందని కన్నీటి పర్యంతమయ్యారు. తీవ్ర కలకలం.. ముక్కుపచ్చలారని ఇద్దరు చిన్నారులు దారుణంగా హత్యకు గురవడం పట్టణవాసులను తీవ్రంగా కలచివేసింది. తల్లి పక్కనే నిద్రలో ఉన్నట్లుగా మృతదేహాలు పడిఉన్న దృశ్యం చూపరులకు కంటతడి పెట్టించింది. మృతురాలితల్లి మున్నాబేగం ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ శ్రీనివాస్‌రావు తెలిపారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను బంధువులకు అప్పగించారు. హంతకుడు ప్రవీణ్‌తో పాటు తల్లి హేమలత, తమ్ముడు ప్రదీప్‌ను పోలీసులు అదపులోకి తీసుకొని విచారణ జరుపుతున్నారు. -
ప్రియుడితో దొరికిన మహిళ.. ఆపై...
వెల్లూరు: తమిళనాడులో దారుణం చోటు చేసుకుంది. పరాయి వ్యక్తితో మహిళ వివాహేతర సంబంధం భర్త కంటపడింది. ఇద్దరూ రాసలీలల్లో మునిగిపోయిన సమయంలో అడ్డంగా దొరికిపోయారు. ఆగ్రహంతో ఊగిపోయిన ఆ భర్త.. వారిని ఊరి ముందు నిలబెట్టేందుకు యత్నించాడు. కానీ, అతని నుంచి తప్పించుకునే క్రమంలో ఆ భార్య.. భర్త మర్మాంగాన్ని కొరికిపడేసింది. వెల్లూరులోని గుడియాతం మండలం తురైమూలై గ్రామంలో ఆదివారం జరిగిన ఈ ఘటన కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే... సెంథామరై(55) అనే రైతు తన భార్య జయంతితో కలిసి ఊళ్లో జరిగిన ఉత్సవానికి హాజరయ్యాడు. ఆ సమయంలో జనసందోహంలో భార్య తప్పిపోగా.. కంగారుపడ్డ సెంథామరై ఆమె కోసం అంతా గాలించాడు. ఆ ప్రాంతానికి కాస్త దూరంలోని ఓ మండపంలో ధచ్ఛనమూర్తి అనే వ్యక్తితో ఆమె అభ్యంతరకర స్థితిలో కనిపించింది. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన సెంథామరై వారిని నిలదీశాడు. గ్రామస్థుల కోసం కేక వేయగా.. విషయం తెలిస్తే ఊరంతా చితకబాదుతుందన్నన భయంతో వారిద్దరూ పారిపోయేందుకు యత్నించారు. ఈ క్రమంలో ఆ ముగ్గురి మధ్య పెనుగులాట చోటుచేసుకోగా.. సెంథామరై పంచె ఊడిపోయింది. (భార్య అశ్లీల వీడియో.. తట్టుకోలేక...) భయంతో ఏం చేయాలో పాలుపోని జయంతి.. భర్తపై పడి మర్మాంగాన్ని కొరికి పడేసింది. ఆపై ప్రియుడితో అక్కడి నుంచి పరుగు అందుకుంది. ఉత్సవాల వేడుకల హడావుడి ఎక్కువగా ఉండటంతో స్థానికులెవరూ సెంథామరై కేకలను వినలేదు. కాసేపటికి అటుగా వెళ్తున్న కొందరు రక్తపు మడుగులో పడి ఉన్న సెంథామరైను గమనించి ఆస్పత్రికి తరలించారు. సెల్‌ఫోన్ సిగ్నల్ ఆధారంగా ధచ్ఛనమూర్తి, జయంతిలను గురువారం వెల్లూరు పోలీసులు అరెస్ట్ చేశారు. బహిరంగ అశ్లీలత, హత్యాయత్నం తదితర కేసులు వారిద్దరిపై నమోదు చేసినట్లు స్థానిక ఎస్సై వెల్లడించారు. -
ప్రకాశం జిల్లాలో హోమ్‌గార్డు దారుణ హత్య
-
ప్రియుడిని మంచానికి కట్టేసి.. దారుణం
సాక్షి, కొనకనమిట్ల : వివాహేతర సంబంధం నేపథ్యంలో ప్రియుడిని నమ్మించి మంచానికి కట్టేసి ప్రియురాలు కిరోసిన్ పోసి హత్య చేసిన ఉదంతం ఇది. పోలీసుల కథనం ప్రకారం.. ప్రకాశం జిల్లా పొదిలికి చెందిన షేక్ షబ్బీర్ (32) మర్రిపూడి పోలీసుస్టేషన్లో హోమ్‌గార్డుగా పనిచేస్తున్నాడు. కొంతకాలంగా విధులకు హాజరు కావడం లేదు. ఈ నేపథ్యంలో షబ్బీర్‌కు పొదిలి పట్టణానికి చెందిన షకీరా అలియాస్ ఇమాంబీతో పరిచయం ఏర్పడింది. కొన్ని నెలలుగా వారిద్దరూ కలిసి కొనకనమిట్ల మండలం చవటపల్లి, పేరారెడ్డిపల్లిలో ఉన్న కోళ్ల ఫారాలను లీజుకు తీసుకుని నడుపుతున్నారు. ఇటీవల ఆర్థిక లావాదేవీల వ్యవహారంలో వారి మధ్య మనస్పర్థలు వచ్చాయి. శనివారం రాత్రి చవటపల్లిలోని కోళ్లఫారంలో షబ్బీర్, షకీరాలు ఉన్నారు. ఏం జరిగిందో ఏమోగానీ కోళ్లఫారం నుంచి మంటలు వస్తుండటంతో స్థానికులు వెళ్లి మంటలు ఎందుకు వస్తున్నాయని షకీరాను ప్రశ్నించారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో మంటలు వచ్చాయని సమాధానం చెప్పింది. నమ్మని కోళ్లఫారం యజమాని లోపలికి వెళ్లి చూడగా షబ్బీర్ కాలిపోయి మృతదేహమై కనిపించాడు. మృతదేహం ఉన్న తీరు చూస్తే కిరోసిన్ పోసి నిప్పంటించి చంపినట్లు ఉంది. కాళ్లూ చేతులను గొలుసులతో మంచానికి కట్టేసి తాళాలు కూడా వేసి ఉన్నాయి. సమాచారం తెలుసుకున్న పొదిలి సీఐ శ్రీనివాసరావు, ఇన్చార్జి ఎస్ఐ అబ్దుల్ రహమాన్ సంఘటన స్థలానికి వెళ్లి వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పొదిలి వైద్యశాలకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ శ్రీనివాసరావు తెలిపారు. నిందితులను త్వరలోనే పట్టుకుంటామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. వివాహేతర సంబంధంతో పాటు ఆర్థిక లావాదేవీలే షబ్బీర్ హత్యకు కారణమై ఉంటుందని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. -
పెళ్లి పేరుతో ఎగతాళి
⇒ యువతికి అక్రమ సంబంధం అంటగట్టిన సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ ⇒ గాజువాక పోలీసులను ఆశ్రయించిన బాధితురాలు ⇒ 50 రోజుల తర్వాత తమ పరిధి కాదన్న పోలీసులు ⇒ మంత్రి అచ్చెన్నాయుడు హస్తం ఉందని బాధితురాలి ఆరోపణ ⇒ పెళ్లి కొడుకును అరెస్టు చేసి ఉద్యోగం నుంచి తొలగించాలని డిమాండ్ గాజువాక : ఒక యువతితో వివాహం కుదుర్చుకున్న సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ కట్నం ఎక్కువ వస్తుందనే దురాశతో మరో యువతితో వివాహానికి సిద్ధపడ్డాడు. పెళ్లి పేరుతో యువతిలో రేపిన ఆశలను అక్రమ సంబంధం అంటగట్టి తుంచేశాడు. అందుకోసం ఒక బినామీ ప్రేమికుడిని సృష్టించాడు. పెళ్లి పెద్దలను సైతం పక్కన పెట్టేశాడు. లగ్న పత్రిక రాసుకున్న తర్వాత ఇలా చేయడం అన్యాయం బాబూ అని వేడుకున్న యువతి తల్లిదండ్రులను దిక్కున్నచోట చెప్పుకోమన్నాడు. దిక్కులేక ఖాకీలను ఆశ్రయించిన బాధితురాలిని 50 రోజులపాటు తమ స్టేషన్ చుట్టూ తిప్పించుకున్న గాజువాక పోలీసులు ఇప్పుడా కేసు తమ పరిధిలోకి రాదంటూ చల్లగా సెలవిచ్చారు. ఈ తతంగం వెనుక మంత్రి అచ్చెన్నాయుడు హస్తం ఉందని బాధితులు బోరుమంటున్నారు. ఈ పరిస్థితుల్లో బాధితురాలు మహిళా చేతన అధ్యక్షురాలు కత్తి పద్మను ఆశ్రయించింది. ఈ మేరకు గాజువాకలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తనకు జరిగిన అన్యాయాన్ని బాధితురాలు వివరించింది. ఆమె కథనం ప్రకారం... శ్రీకాకుళం జిల్లా జలుమూరు మండలం టెక్కలిపాడు గ్రామానికి చెందిన దుంగా అప్పలనాయుడు కుమారుడు పాపారావు సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్‌గా పని చేస్తున్నాడు. గాజువాక దరి శ్రీనగర్ అఫీషియల్ కాలనీకి చెందిన రెడ్డి పిన్నన్న కుమార్తె వసంత కుమారిని వివాహం చేసుకోవడానికి పెద్దల ద్వారా సంబంధం ఖాయం చేసుకున్నాడు. రూ.9.5లక్షల కట్నం, ఇతర లాంఛనాలు చెల్లించడానికి పిన్నన్న అంగీకరించడంతో వచ్చే నెల 7న వివాహం చేయాలని నిర్ణయించుకొని లఘ్నపత్రిక రాసుకున్నారు. ఇంతలో ఎక్కువ కట్నం ఇచ్చే సంబంధం కుదరడంతో వసంత కుమారిని వదిలించుకునేందుకు పాపారావు ఓ స్కెచ్ వేశాడు. ఆమెకు ఫోన్ చేసి ‘నీకు ఎవరితోనే ప్రేమ వ్యవహారం ఉందని విన్నాను. ఆ వ్యక్తి నాకు మెసేజ్‌లు పంపుతున్నాడు. అందువల్ల నిన్ను పెళ్లి చేసుకోన’ని చెప్పాడు. ఈ విషయాన్ని ఆమె తన తల్లిదండ్రులకు చెప్పడంతో వారు పాపారావు తల్లిదండ్రులను సంప్రదించారు. వారు కూడా తమ కుమారుడినే సమర్థించి ఈ వివాహం చేసుకోబోమని స్పష్టం చేశారు. పెళ్లి పెద్దలు ఎంత నచ్చజెప్పినా ససేమిరా అనడమే కాక సెటిల్మెంట్ చేసుకుందామంటూ మాట్లాడారు. ఎక్కువ కట్నానికి ఆశపడి వేరే యువతితో వివాహం కుదర్చుకున్నారని, ఈ నెల 24న ఆమెతో వివాహం జరగనుందని వసంత కుమారి తల్లిదండ్రులకు తెలిసింది. దీంతో తమను మోసం చేసిన పాపారావు, అతడి తల్లిదండ్రులపై కేసు నమోదు చేయాలని బాధితులు ఫిబ్రవరి 12న గాజువాక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అప్పట్లో పాపారావు, అతడి తల్లిదండ్రులను గాజువాక పోలీసులు స్టేషన్‌కు పిలిపించారు. విచారణలో ప్రేమ వ్యవహారం అంతా కట్టుకథ అని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. అప్పటికి 50 రోజులు అయినప్పటికీ బాధితుల ఫిర్యాదుపై ఎఫ్ఐఆర్ మాత్రం నమోదు చేయలేదు. దీనిపై మహిళా చేతన ప్రతినిధులు పది రోజుల క్రితం పోలీసులను నిలదీయడంతో ఎఫ్ఐఆర్ నమోదు చేస్తామంటూ ఆరు రోజులు తిప్పించుకున్నారు. చివరకు ఈ కేసు తమ పరిధిలోకి రాదంటూ పోలీసులు తేల్చి చెప్పారు. ఐపీసీ సెక్షన్ 420 ప్రకారం కేసు నమోదు చేయడానికి అన్ని అవకాశాలున్నప్పటికీ మంత్రి అచ్చెన్నాయుడు కార్యాలయం నుంచి వస్తున్న ఫోన్ల వల్ల పోలీసులు కేసు నమోదు చేయలేదని కత్తి పద్మ ఆరోపించారు. పోలీసులు మంత్రి కనుసన్నల్లో నడిచి యువతికి అన్యాయం చేశారన్నారు. పాపారావుపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి అరెస్టు చేయాలని కోరారు. సీఐఎస్ఎఫ్ అధికారులు స్పందించి అతడిని ఉద్యోగం నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు.