
6 Year Old Girl In Noida Murdered By Her Own Mother ఆరేళ్ల బాలికను కన్నతల్లే హత్య చేసి, అడవిలో పడేసిన ఉదంతం స్థానికంగా కలకలంరేపింది. ఈ కేసులో పోలీసులు షాకింగ్ విషయాలను వెల్లడించారు. తన కుమార్తె కనబడటంలేదని, భర్త కిడ్నాప్ చేశాడనే అనుమానంతో పోలీస్ స్టేషన్‌లో పిర్యాదు చేసింది కూడా. వివరాల్లోకెళ్తే..
పోలీసుల కథనం ప్రకారం.. నవంబర్ 12 న నోయిడాలోని సెక్టార్-93లో ఒక బాలిక మృతదేహం కనుగొన్నారు. బాలిక శవాన్ని పోలీసులు స్వాధీనం చేసుకుని పోస్టుమార్టంకు పంపించారు. కాగా విచారణలో బాలిక పేరు నేహా శర్మ (6) అని తెలిసింది. బాలిక నివాసముంటున్న ఇంటికి విచారణ నిమిత్తం వెళ్లగా, అప్పటికే బాలిక తల్లి భర్తపై కిడ్నాప్ కేసు పెట్టినట్లు తెలిసింది.
సమాచారం ప్రకారం.. హత్యకు పాల్పడిన నిందితురాలిని కూడా గుర్తించారు. మహిళ పేరు అనురాధ. ఆమె మృతురాలి తల్లి. నోయిడాలోని సెక్టార్ 93లో నివసముంటున్న అనురాధ, రామ్‌కుమార్‌లు 2010లో వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు ఆడపిల్లలు. ఐతే రామ్‌కుమార్ నివాసముంటున్న ఫ్లాట్‌ను అమ్మి, గ్రామంలో సెటిలవ్వాలని అనుకున్నాడు. ఐతే అప్పటికే మరొక యువకుడితో వివాహేతర సంబంధమున్న భార్య అనురాధకు గ్రామంలో సెటిలవ్వడం ఇష్టంలేదు. దీంతో కూతురు నేహా శర్మను గొంతునులిమి చంపి, సమీపంలోని అడవిలో పడేసింది. ఫ్లాట్‌పై అత్యాశ, వివాహేతర సంబంధం కారణంగా భర్తను తన దారి నుంచి దూరం చేయాలనుకుంది. కూతుర్ని హత్య చేసి ఆ నేరం భర్తపై నెట్టాలని సదరు మహిళ కుట్ర పన్నిందని పోలీసులు పేర్కొన్నారు. సదరు మహిళను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా నేరం ఒప్పుకుంది.
చదవండి: కోట్ల విలువచేసే ఇంటికి నిప్పంటించాడు..ఎందుకో తెలుసా?
Comments
Please login to add a commentAdd a comment