ఆకివీడు : వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ప్రియుడుతో కలిసి భర్తను హత్య చేసిన ఘటన పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడులోని ఎల్‌ఎన్‌పురంలో జరిగింది. ఎల్వీఎన్‌పురానికి చెందిన సీహెచ్. వెంకటేశ్వర్లు అదే ప్రాంతానికి చెందిన దుర్గను పెళ్లి చేసుకున్నాడు. దుర్గ పెళ్ళికి ముందే నాగేందర్ అనే వ్యక్తిని ప్రేమించింది. అయితే దుర్గ పెళ్లి తరువాత కూడా అతనితో వివాహేతర సంబంధం కొనసాగిస్తుంది. భర్త అంటే ఇష్టం లేదని , అతని అడ్డు తొలగించుకోవాలని ప్రియుడుపై ఒత్తిడి తెచ్చింది. పథకం ప్రకారం చంపేందుకు ప్రియుడిని భర్తకు పరిచయం చేసింది. ఈ నెల 11వ తేదీన ఆమె ప్రియుడు వెంకటేశ్వర్లును జన సంచారంలేని ప్రదేశానికి తీసుకెళ్లి అక్కడ ఫుల్‌గా మద్యం తాగించాడు. మద్యం మత్తులో ఉన్న అతణ్ని భార్య దుర్గ, ప్రియుడు నాగేందర్ హతమార్చి కాలువలో పడేశారు. అనుమానాస్పద స్థితిలో దొరికన శవం ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేయగా అసలు విషయం బయటపడింది.