
ప్రియుడు బాబుతో దేబి తంబాగ్ (ఫైల్)
సాక్షి, బెంగళూరు: ప్రియునితో కలిసి భర్తను హత్య చేసిన భార్యను విద్యారణ్యపుర పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నెల 6న రాకేశ్‌తోమంగ్‌ను భార్య దేబి తంబాగ్, ప్రియుడు బాబు అలీ కలిసి హత్య చేశారు. దేబితో బాబుకు అక్రమ సంబంధం ఉంది.
ఈ విషయం రాకేశ్ తోమంగ్‌కు తెలియడంతో భార్యను నిలదీశాడు. ఇద్దరి మధ్య గొడవ జరిగింది. దీంతో అడ్డు తొలగించుకోవాలని ప్రియునితో కలిసి ఇంట్లోనే భర్తను చంపించింది. పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేసి జైలుకు పంపారు. ఈశాన్య రాష్త్రాలకు చెందిన వీరు బెంగళూరులో పని చేసుకునేవారని తెలిసింది.
చదవండి: (ఉదయం ప్రేమవివాహం.. సాయంత్రానికి శవమైన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్)
Comments
Please login to add a commentAdd a comment