yaswanthpura
-
సుదీప్ చూపు ఆ పార్టీ వైపు.. సంప్రదింపులు జరుపుతున్న మాజీ ఎంపీ
బెంగళూరు: నటుడు కిచ్చ సుదీప్ కాంగ్రెస్‌లో చేరాలని ఆ పార్టీ ఆహ్వానిస్తోంది. ఈ మేరకు పార్టీ మాజీ ఎంపీ రమ్య సుదీప్తో సంప్రదింపులు జరుపుతున్నారు. వచ్చే విధానసభ ఎన్నికల నాటికి ప్రముఖ సినీ నటులను చేర్చుకోవాలని కాంగ్రెస్ యత్నిస్తోంది. ఈ నేపథ్యంలో రమ్య సినీ నటులతో చర్చలు సాగిస్తున్నారు. ఈ చర్చల్లో సుదీప్ స్పందన ఏమిటనేది ఉత్కంఠగా ఉంది. చదవండి: (చింతకాయల విజయ్‌కు షాకిచ్చిన చంద్రబాబు) -
ఉపాధ్యాయ వృత్తికే మచ్చ.. విద్యార్థి తల్లితో సన్నిహితంగా ఉంటూ..
సాక్షి, బెంగళూరు(యశవంతపుర): ఉపాధ్యాయ వృత్తికి మచ్చ తెచ్చేలా ఓ అతిథి ఉపాధ్యాయుడు విచక్షణ మరచిపోయాడు. ఏ తప్పూ ఎరగని విద్యార్థిపై దాడికి పాల్పడి బాలుడి మృతికి కారణమయ్యాడు. ఈ విషాద ఘటన గదగ్ జిల్లా నరగుంద తాలూకా హద్లి గ్రామంలో జరిగింది. గదగ్ ఎస్పీ శివప్రకాష్ దేవరాజు కథనం మేరకు వివరాలు... హద్లి గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో ముత్తప్ప అనే వ్యక్తి అతిథి ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. ఇదే పాఠశాలలో గీత అనే మహిళ ఉపాధ్యాయురాలిగా పనిచేస్తోంది. ఆమె కుమారుడు భరత్ ఇదే పాఠశాలలో చదువుతున్నాడు. గీత, ముత్తప్పలు సన్నిహితంగా మెలిగేవారు. ఇటీవల విద్యార్థులను విహారయాత్రకు తీసుకెళ్లిన సమయంలో గీత మరో ఉపాధ్యాయుడితో చనువుగా మాట్లాడింది. దీంతో ఆమెపై ముత్తప్ప కోపాన్ని పెంచుకున్నాడు. ఈనెల 19న భరత్‌ను బయటకు తీసుకెళ్లి తీవ్రంగా కొట్టాడు. ఈ విషయం తెలుసుకున్న గీత ముత్తప్పను నిలదీయగా ఆమెపై కూడా దాడి చేశాడు. గాయపడిన ఇద్దరినీ ఆస్పత్రికి తరలించగా భరత్ మంగళవారం మృతి చెందాడు. అతని తల్లి గీత చికిత్స పొందుతోంది. నిందతుడు ముత్తప్పను మంగళవారం అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. కాగా ముత్తప్ప తీరుతో తమ పిల్లలను బడికి పంపేందుకు తల్లిదండ్రులు జంకుతున్నారు. చదవండి: (అనుమానాస్పద స్థితిలో భార్య.. నిద్రమాత్రలు మింగి భర్త..) -
అసోం దంపతులు మహా కిలాడీలు.. మాయమాటలతో లక్షల మోసం
సాక్షి, బెంగళూరు(యశవంతపుర): నా భర్త కస్టమ్స్ అధికారి అని, బెంగళూరు కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో పని ఇప్పిస్తామని, అక్కడ అధికారులు సీజ్ చేసిన వస్తువులను తక్కువ ధరకు ఇప్పిస్తామని చెప్పి మోసాలకు పాల్పడుతున్న జంట కటకటాల పాలైంది. దర్బిన్‌దాస్ అలియాస్ మోహన్‌దాస్, అతని భార్య ధనుష్యను కొడిగేనహళ్లి పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ. 34 లక్షల నగదు, 106 గ్రాములు బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ అనూప్‌శెట్టి తెలిపారు. వివరాలు... ఇందిరానగరలో ఓ అకాడమీని నడుపుతున్న స్నేహ భగవత్ వద్ద ధనుష్య శిక్షణకు చేరింది. తన భర్త విమానాశ్రయంలో కస్టమ్స్‌లో పని చేస్తున్నట్లు చెప్పింది. జప్తు చేసిన బంగారు నగలను తక్కువ ధరకు ఇప్పిస్తామని నమ్మించింది. అలా స్నేహ నుంచి పలు విడతలుగా రూ. 68 లక్షలను నగదును వసూలు చేసింది. అంతేకాక అకాడమీలో పని చేస్తున్న సిబ్బంది నుంచి కూడా డబ్బులు వసూలు చేసింది. కొన్నిరోజుల తరువాత ధనుష్య మొబైల్ ఫోన్ స్విచాఫ్ చేసుకుని పరారైంది. దీంతో బాధితులు కొడిగేహళ్లి పోలీసులకు ఫిర్యాదు చేయగా ఆ జంట కోసం గాలింపు చేపట్టారు. చదవండి: (మోసకారి దంపతులు దర్బిన్‌దాస్, ధనుష్య) పలువురి నుంచి వసూళ్లు దేవనహళ్లి తాలూకాలో కూడా ఇదే తరహా మోసం కేసు వీరిపై నమోదై ఉంది. ధనుష్య పిల్లలు చదువుతున్న స్కూల్ ఉపాధ్యాయులు, పిల్లల తల్లిదండ్రులకు కూడా ఇదే మాదిరి మాయ మాటలు చెప్పి లక్షల రూపాయలు గుంజుకుందని పోలీసుల విచారణలో బయట పడింది. తక్కువ ధరలకు ఐఫోన్లు, ల్యాప్‌టాప్‌లను లభిస్తాయని చెప్పుకొని నివాసం ఉండే అపార్ట్మెంట్లోని వారి నుంచి లక్షల రూపాయలను ఆన్లైన్, ఆఫ్‌లైన్‌లో తీసుకుంది. వస్తువులన్నీ ఇప్పించండి, లేదా డబ్బయినా తిరిగి ఇవ్వాలని కొందరు ఒత్తిడి చేయడంతో ధనుష్య, ఆమె భర్త మంగళూరుకు పారిపోయారు. కొడిగేనహళ్లి పోలీసులు మంగళూరుకు వెళ్లి ఈ జంటను పట్టుకుంది. వారి ఇంట్లో రూ. 34 లక్షలు నగదు, 106 గ్రాముల బంగారాన్ని సీజ్ చేశారు. బెంగళూరుకు తరలించి విచారణ చేపట్టారు. -
మోసపోయానని భావించి.. డెత్‌నోట్‌రాసి ప్రైవేట్ లెక్చరర్ బలవన్మరణం
సాక్షి, బెంగళూరు(యశవంతపుర): రాష్ట్రంలో ఆన్లైన్ మోసాలు ఆగడం లేదు. తాజాగా బీదర్ జిల్లాలో ఆన్లైన్లో డబ్బులు పోగొట్టుకున్న ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. వివరాలు... బసవ కల్యాణ తాలూకా ఇస్లాంపురకు చెందిన ఆరతి (28) ఓ ప్రైవేట్ కళాశాలలో లెక్చరర్‌గా పనిచేస్తోంది. ఇటీవల ఆన్లైన్లో రాజగోపాల్ అనే వ్యక్తి పరిచయం అయ్యాడు. నగదు డిపాజిట్ చేస్తే అధిక వడ్డీ ఇప్పిస్తానని చెప్పాడు. దీంతో ఆరతి ఇతరుల వద్ద అప్పు తీసుకుని అతనికి విడతల వారీగా రూ. 2.5 లక్షల నగదు పంపింది. ఆ తరువాత అతని సెల్‌ఫోన్ స్విచాఫ్ వచ్చింది. దీంతో మోసపోయినట్లు భావించిన ఆరతి డెత్‌నోట్ రాసి బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. బసవకల్యాణ గ్రామీణ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. చదవండి: (ఉదయం ప్రేమవివాహం.. సాయంత్రానికి శవమైన సాఫ్ట్వేర్ ఇంజినీర్) -
భర్తకు వివాహేతర సంబంధం తెలియడంతో.. ప్రియుడితో కలిసి ఇంట్లోనే..
సాక్షి, బెంగళూరు: ప్రియునితో కలిసి భర్తను హత్య చేసిన భార్యను విద్యారణ్యపుర పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నెల 6న రాకేశ్తోమంగ్ను భార్య దేబి తంబాగ్, ప్రియుడు బాబు అలీ కలిసి హత్య చేశారు. దేబితో బాబుకు అక్రమ సంబంధం ఉంది. ఈ విషయం రాకేశ్ తోమంగ్కు తెలియడంతో భార్యను నిలదీశాడు. ఇద్దరి మధ్య గొడవ జరిగింది. దీంతో అడ్డు తొలగించుకోవాలని ప్రియునితో కలిసి ఇంట్లోనే భర్తను చంపించింది. పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేసి జైలుకు పంపారు. ఈశాన్య రాష్త్రాలకు చెందిన వీరు బెంగళూరులో పని చేసుకునేవారని తెలిసింది. చదవండి: (ఉదయం ప్రేమవివాహం.. సాయంత్రానికి శవమైన సాఫ్ట్వేర్ ఇంజనీర్) -
నెల కిందటే పెళ్లి.. మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య!
యశవంతపుర: కొత్తగా పెళ్లయిన మహిళా కానిస్టేబుల్ ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన బెంగళూరు ఉత్తర తాలూకా చిక్కగొల్లరహట్టిలో జరిగింది. మృతురాలు నేత్రా (27). ఈమె కామాక్షిపాళ్య ట్రాఫిక్ పోలీసుస్టేషన్లో పని చేస్తోంది. పీణ్యాలో కానిస్టేబుల్ అయిన మంజునాథ్ ఆమెను నెలరోజుల కిందట ప్రేమ పెళ్లి చేసుకున్నాడు. ఇద్దరిదీ తుమకూరు జిల్లా స్వస్థలం. వంట చేసే విషయమై భార్యాభర్తల మధ్య ఘర్షణ జరిగినట్లు, దీంతో ఆమె ఉరివేసుకున్నట్లు తెలిసింది. మాదనాయనహళ్లి పోలీసులు అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేశారు. -
రోడ్డుపక్కన చాక్లెట్లు.. దొరికినన్ని ఎత్తుకెళ్లారు; ట్విస్ట్ ఏంటంటే
యశవంతపుర: రోడ్డు పక్కల మూటల కొద్దీ చాక్లెట్లు కనిపించడంతో పిల్లలు, పెద్దలూ దొరికినన్ని పట్టుకెళ్లారు. ఈ ఘటన ఉత్తర కన్నడ జిల్లా శిరసి సమీపంలోని హుడ్లుమనె వద్ద జరిగింది. తాజా లాక్డౌన్ సమయంలో ఓ చాక్లెట్ల వ్యాపారి అమ్ముడుపోకుండా గడువు(ఎక్స్పైరీ) ముగిసిన క్వింటాల్‌కు పైగా చాక్లెట్లను నగరసభ చెత్త ట్రాక్టర్లో పడేశారు. వాటిని పౌర కార్మికులు రోడ్డు పక్కన విసిరేశారు. పెద్దమొత్తంలో చాక్లెట్లు పడి ఉన్నాయని తెలిసి చిన్నపిల్లలు, పెద్దలు ఎత్తుకెళ్లారు -
ఆర్థిక సమస్యలు.. విషం తాగిన కుటుంబం
యశవంతపుర: పురుగుల మందు తాగిన ఐదుగురిలో దంపతులు, వృద్ధురాలు చనిపోయారు. చిత్రదుర్గ తాలూకా ఇసాముద్ర గ్రామానికి చెందిన తిప్పానాయక్(46), భార్య సుధాబాయి (43), వారి పిల్లలు రాహుల్, రమ్య, తిప్పానాయక్ తల్లి గుండి బాయి(75)లు సోమవారం రాత్రి పురుగుల మందు తాగారు. ప్రాణాపాయంలో ఉన్న ఐదుగురినీ గ్రామస్థులు ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ తిప్పానాయక్, సుధాబాయి, గుండిబాయిలు మృతి చెందారు. పిల్లలు దావణగెరె ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆర్థిక సమస్యలే కారణంగా భావిస్తున్నారు. భరమసాగర పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. -
గ్రామపెద్ద సరేనంటేనే క్షవరం
సాక్షి, యశవంతపుర: దళితులకు క్షవరం చేయబోమనడంతో గొడవ ఏర్పడింది. కర్ణాటకలోని దావణగెరె జిల్లా హరిహర తాలూకా ధళెహళె గ్రామంలో ఈ ఘటన జరిగింది. గ్రామంలో ఇప్పటికీ అంటరానితనం దురాచారం అమలవుతోంది. ఓ క్షౌరశాలలో క్షవరం కోసం కొందరు దళితులు రాగా, క్షురకుడు అన్నప్ప గ్రామ పెద్ద సరేనంటే మీకు క్షవరం చేస్తానని చెప్పాడు. మాకు ఎందుకు క్షవరం చేయవు అని దళిత యువకులు ప్రశ్నించటంతో ఇద్దరి మధ్య వాగ్వాదం మొదలైంది. శుక్రవారం ఉదయం జరిగిన ఈ ఘటన వీడియోలు సోషల్ మీడియాలో రావడంతో శనివారం చర్చనీయాంశమైంది. సంఘటనపై జిల్లాస్థాయి అధికారులు గ్రామంలో పర్యటించి విచారణ చేపట్టారు. ఈ గ్రామంలో దళితులను ఆలయాల్లోకి అనుమతించడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. -
దేవుడి హుండీల్లో అశ్లీల చీటీలు, కండోమ్‌లు..
యశవంతపుర: ఆలయాల్లోని హుండీల్లోకి అశ్లీల సందేశాలు రాసిన చీటీలు,కండోమ్స్ వేసిన మంగళూరులోని జొకట్టి నివాసి అబ్దుల్‌రహీం, అబ్దుల్ తౌఫీక్ అనే నిందితులను మంగళూరు పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులు బుధవారం ఎమ్మెకెరె కొరగజ్జ ఆలయంలో ఉండగా స్థానికులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు వెళ్లి అరెస్ట్ చేశారు. నిందితులు మూడు నెలలుగా పాండేశ్వర, కద్రి, ఉళ్లాల పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఆలయాల్లో ఆకతాయి చర్యలకు పాల్పడుతున్నారని పోలీసులు తెలిపారు. -
కర్ణాటకలో మంకీ ఫీవర్.. తొలి కేసుగా నమోదు
సాక్షి, యశవంతపుర: కర్ణాటకలో చిక్కమగళూరు జిల్లా ఎన్ఆర్ పుర తాలూకా సీతూరు జీపీ పరిధిలోని బెమ్మనెలలో ఒకరికి మంకీ ఫీవర్ (కోతి జ్వరం– కేఎఫ్‌డీ) సోకింది. ఇది మొదటి కేసుగా గుర్తించారు. బాధితునికి కరోనా పాజిటివ్ రావటంతో మరిన్ని పరీక్షలు చేయగా మంకీ ఫీవర్‌గా గుర్తించారు. తీర్థహళ్లి తాలూకా అరగలో జరిగిన ఒక కార్యక్రమానికి వెళ్లి వచ్చిన్నట్లు గుర్తించారు. రోగిని ఉడుపి వద్దనున్న మణిపాల్ ఆస్పత్రికి తరలించారు. తీవ్రమైన జ్వరం, ఒళ్లునొప్పులు, తలనొప్పి తదితరాలు ఈ జబ్బు లక్షణాలు. సకాలంలో చికిత్స అందకపోతే ప్రాణాల మీదకు వచ్చే ప్రమాదముంది. కోతుల ద్వారా మనుషులకు వ్యాపిస్తుంది. -
పోలీసునంటాడు.. సెల్ఫోన్లతో ఉడాయిస్తాడు
యశవంతపుర : పోలీసునంటూ పరిచయం చేసుకొని ప్రజల వద్ద సెల్ఫోన్లు తీసుకొని ఉడాయిస్తున్న గాయత్రినగరకు చెందిన మహేశ్ నాయక్(42) అనే వ్యక్తిని సుబ్రహ్మణ్య నగర పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. నిందితుడినుంచి 2.87 లక్షలు విలువైన సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. వేదమూర్తి అనే వ్యక్తి ఈనెల 8న జీకే ప్రింటింగ్ పాయింట్ వద్ద కారు నిలిపాడు. అక్కడే ఉన్న నిందితుడు తాను పోలీసునంటూ పరిచయం చేసుకొని తన పై అధికారికి కారు అద్దెకు కావాలని రాజాజీనగర 17వ క్రాస్ వద్దకు తీసుకెళ్లాడు. అధికారితో మాట్లాడాలంటూ వేదమూర్తినుంచి సెల్‌ఫోన్ తీసుకొని ఉడాయించాడు. అదేవిధంగా 2019లో జేసీనగర పోలీసుస్టేషన్ పరిధిలో బైక్ చోరీ చేసి నంబర్ ప్లేట్ మార్చి సంచరిస్తూ పోలీసులకు పట్టుబడ్డాడు. నిందితుడిపై రాజాజీనగర, జేసీ నగర పోలీసుస్టేషన్ పరిధిలో పలు చోరీ కేసులున్నాయి. -
క్యాబ్ డ్రైవర్ పట్ల అమానుషం
యశవంతపుర : ఓ క్యాబ్ డ్రైవర్‌పై దుండగలు దాష్టీకానికి పాల్పడ్డారు. డ్రైవర్‌ను కారు బ్యానెట్‌పైకి నెట్టి పలు వీధుల్లో తిప్పారు. ఈ అమానుష ఘటన బెంగళూరు బసమేశ్వరనగర పోలీసుస్టేషన్ పరిధిలో జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. సోమవారం రాత్రి శంకరనగరలో క్యాబ్ డ్రైవర్ శంకరేగౌడ ఇంధనం కోసం సమీపంలోని పెట్రోల్ బంక్‌కు వెళ్లాడు. చిల్లర కోసం వేచి ఉండగా స్విఫ్ట్‌కారులో ముగ్గురు యువకులు వచ్చారు. వాహనం పక్కకు తీయాలని పెద్దగా హారన్ మోగించారు. శంకరేగౌడను నోటికోచ్చినట్లు దూషించారు. ఒక యువకుడు సెల్ఫోన్లో చిత్రీకరిస్తుండగా మిగతా ఇద్దరు శంకరగౌడను తమ కారు బ్యానెట్ఫైకి వేసుకొని వేగంతో వెళ్లిపోయారు. తనను రక్షించాలని శంకరేగౌడ కేకలు వేశాడు. దీనిని చూసినవారు సినిమా షూటింగ్‌గా భావించారు. అయితే తన ప్రాణం పోతుందని, కాపాడాలని శంకరేగౌడ ఆర్తనాదాలు చేయడంతో ప్రజలు పెద్ద సంఖ్యలో రోడ్డుపైకి రావడంతో అకతాయిలు కారు వేగం తగ్గించారు.దీంతో శంకరగౌడ బ్యానెట్ నుంచి దూకి ప్రాణాలు దక్కించుకున్నాడు. ఈ దృశ్యాలన్నీ ఘటనా స్థలంలోని ఇళ్ల వద్ద ఏర్పాటు చేసిన సీసీకెమెరాల్లో రికార్డు అయ్యాయి. వాటి ఆధారంగా బసవేశ్వరనగర పోలీసులు కేసు నమోదు చేసుకోని దర్యాప్తు చేస్తున్నారు. -
ప్రాణం తీసిన సెల్ఫీ
యశవంతపుర : నవ దంపతులు సెల్ఫీ తీసుకుంటూ ప్రమాదవశాత్తూ నదిలో పడి మృతి చెందారు. ఈ విషాద ఘటన హాసన్ సమీపంలోని హేమావతి నదీ వద్ద గురువారం సాయంత్రం చోటు చేసుకుంది. బేలూరు తాలుకా మురహళ్లి గ్రామానికి చెందిన అర్థేశ్(27), హెన్నలి గ్రామానికి చెందిన కృతికా(23)కు రెండు నెలల క్రితం వివాహమైంది. అర్థశ్ బెంగళూరులో ఒక ప్రైవేట్ సంస్థలో పని చేస్తున్నాడు. లాక్డౌన్ కారణంగా సంస్థకు సెలవు ప్రకటించటంతో రెండు రోజుల క్రితం మురహళ్లికి వెళ్లాడు. బుధవారం అత్తగారి ఊరు హెన్నళికి వెళ్లాడు. సాయంత్రం దంపతులు ఇద్దరూ బైకుపై గ్రామ సమీపంలోని హేమావతి నది వద్దకు వెళ్లారు. రాత్రి కావస్తున్న ఇంటికి రాకపోవటంతో అత్తమామలు ఆందోళన చెందారు. ఫోన్ చేసినా స్పందన లేకపోవడంతో నది ప్రాంతం వద్దకు వెళ్లగా బైక్ కనిపించింది. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.రంగంలోకి దిగిన పోలీసులు నది చుట్టూ గాలింపు చేపట్టగా కృతికా మృతదేహం బయట పడింది. శుక్రవారం తెల్లవారుజామున అర్థేశ్ మృతదేహం లభ్యమైంది. మృతదేహాలను సకలేశపుర ఆస్పత్రికి తరలించి పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. నవదంపతులు సెల్ఫీ తీసుకుంటూ ప్రమాదవశాత్తూ నదిలో పడి మృతి చెందారని పోలీసులు తెలిపారు. -
మద్యం ఎక్కువ తాగాడని హత్య
యశవంతపుర : ఇద్దరు స్నేహితుల మధ్య మద్యం విషయంపై జరిగిన ఘర్షణలో ఒకరు హత్యకు గురైన ఘటన రామమూర్తినగర పోలీసుస్టేషన్ పరిధిలో జరగింది. యలహంకకు చెందిన రాజు (40), రామమూర్తినగర 4వ క్రాస్ బోవి కాలనీకి చెందిన నేత స్నేహితులు. మద్యం అంగళ్లు తెరవటంతో మంగళవారం సాయంత్రం ఇద్దరు కలిసి మద్యం తెచ్చుకొని నేతా ఇంట్లోనే రాత్రి 10:30 గంటల వరకు తాగారు. రాజునే ఎక్కువ మద్యం తాగేశాడని నేతా గొడవ పడ్డారు. నేతా రాజు తలను గోడకేసి గుద్ది, మంట పాత్రతో తలపై బలంగా బాది హత్య చేశాడు. రామమూర్తినగర పోలీసులు పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గతంలో వ్యక్తిని హత్య చేసిన నేతా జైలుకెళ్లి వచ్చినట్లు పోలీసులు తెలిపారు. -
మిస్ ఇండియా–17 మనకే !
► దక్షిణాది అమ్మయిలకే ► అందాల కిరీటం ► మిస్ దివా రోష్మిత జోస్యం యశ్వంతపుర: మిస్ ఇండియా–2017 కిరీటాన్ని తమ దక్షిణాది రాష్ట్రాల అమ్మాయిలే కైవసం చేసుకుంటారని ‘2016 మిస్ దివా’ రోష్మిత హరిమూర్తి ధీమా వ్యక్తం చేళశారు. కలర్స్, ఫెమినామిస్ ఇండియా –2017 కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హజరైన ఆమె మీడియాతో మాట్లాడారు. మార్చి నెల 5 వ తేదీన సౌత్జో¯ŒS క్రోనంగ్ కార్యక్రమాన్ని బెంగళూరులోని క్రౌన్ ప్లాజాలో నిర్వహిస్తున్నాట్లు తెలిపారు. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ, కర్ణాటక రాష్ట్రాల నుంచి ఎంపిౖకెన వారిలో ఐదుగురిని ఎంపిక చేయడం జరుగుతుందన్నారు. ముంబైలో జూన్ లో జరిగే గ్రాండ్ ఫైనల్స్‌లో వారు పాల్గొంటారని చెప్పారు. ఈ ఏడాది పోటీల్లో మన అమ్మాయిలలో ఒకరు అందాల కిరీటం సొంతం చేసుకుంటారని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.