నిందితుడు ముత్తప్ప
సాక్షి, బెంగళూరు(యశవంతపుర): ఉపాధ్యాయ వృత్తికి మచ్చ తెచ్చేలా ఓ అతిథి ఉపాధ్యాయుడు విచక్షణ మరచిపోయాడు. ఏ తప్పూ ఎరగని విద్యార్థిపై దాడికి పాల్పడి బాలుడి మృతికి కారణమయ్యాడు. ఈ విషాద ఘటన గదగ్ జిల్లా నరగుంద తాలూకా హద్లి గ్రామంలో జరిగింది. గదగ్ ఎస్పీ శివప్రకాష్ దేవరాజు కథనం మేరకు వివరాలు... హద్లి గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో ముత్తప్ప అనే వ్యక్తి అతిథి ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. ఇదే పాఠశాలలో గీత అనే మహిళ ఉపాధ్యాయురాలిగా పనిచేస్తోంది.
ఆమె కుమారుడు భరత్ ఇదే పాఠశాలలో చదువుతున్నాడు. గీత, ముత్తప్పలు సన్నిహితంగా మెలిగేవారు. ఇటీవల విద్యార్థులను విహారయాత్రకు తీసుకెళ్లిన సమయంలో గీత మరో ఉపాధ్యాయుడితో చనువుగా మాట్లాడింది. దీంతో ఆమెపై ముత్తప్ప కోపాన్ని పెంచుకున్నాడు. ఈనెల 19న భరత్‌ను బయటకు తీసుకెళ్లి తీవ్రంగా కొట్టాడు. ఈ విషయం తెలుసుకున్న గీత ముత్తప్పను నిలదీయగా ఆమెపై కూడా దాడి చేశాడు. గాయపడిన ఇద్దరినీ ఆస్పత్రికి తరలించగా భరత్ మంగళవారం మృతి చెందాడు. అతని తల్లి గీత చికిత్స పొందుతోంది. నిందతుడు ముత్తప్పను మంగళవారం అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. కాగా ముత్తప్ప తీరుతో తమ పిల్లలను బడికి పంపేందుకు తల్లిదండ్రులు జంకుతున్నారు.
చదవండి: (అనుమానాస్పద స్థితిలో భార్య.. నిద్రమాత్రలు మింగి భర్త..)
Comments
Please login to add a commentAdd a comment