
యశవంతపుర : ఓ క్యాబ్ డ్రైవర్‌పై దుండగలు దాష్టీకానికి పాల్పడ్డారు. డ్రైవర్‌ను కారు బ్యానెట్‌పైకి నెట్టి పలు వీధుల్లో తిప్పారు. ఈ అమానుష ఘటన బెంగళూరు బసమేశ్వరనగర పోలీసుస్టేషన్ పరిధిలో జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. సోమవారం రాత్రి శంకరనగరలో క్యాబ్ డ్రైవర్ శంకరేగౌడ ఇంధనం కోసం సమీపంలోని పెట్రోల్ బంక్‌కు వెళ్లాడు. చిల్లర కోసం వేచి ఉండగా స్విఫ్ట్‌కారులో ముగ్గురు యువకులు వచ్చారు. వాహనం పక్కకు తీయాలని పెద్దగా హారన్ మోగించారు. శంకరేగౌడను నోటికోచ్చినట్లు దూషించారు. ఒక యువకుడు సెల్‌ఫోన్‌లో చిత్రీకరిస్తుండగా మిగతా ఇద్దరు శంకరగౌడను తమ కారు బ్యానెట్‌ఫైకి వేసుకొని వేగంతో వెళ్లిపోయారు.
తనను రక్షించాలని శంకరేగౌడ కేకలు వేశాడు. దీనిని చూసినవారు సినిమా షూటింగ్‌గా భావించారు. అయితే తన ప్రాణం పోతుందని, కాపాడాలని శంకరేగౌడ ఆర్తనాదాలు చేయడంతో ప్రజలు పెద్ద సంఖ్యలో రోడ్డుపైకి రావడంతో అకతాయిలు కారు వేగం తగ్గించారు.దీంతో శంకరగౌడ బ్యానెట్ నుంచి దూకి ప్రాణాలు దక్కించుకున్నాడు. ఈ దృశ్యాలన్నీ ఘటనా స్థలంలోని ఇళ్ల వద్ద ఏర్పాటు చేసిన సీసీకెమెరాల్లో రికార్డు అయ్యాయి. వాటి ఆధారంగా బసవేశ్వరనగర పోలీసులు కేసు నమోదు చేసుకోని దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment