swift car
-
సరికొత్త ది ఎపిక్ న్యూ స్విఫ్ట్ కార్ ను ఆవిష్కరించిన బిగ్ బాస్ ఫేమ్ శ్రీ సత్య (ఫొటోలు)
-
సరికొత్త ది ఎపిక్ న్యూ స్విఫ్ట్ కార్ ను ప్రారంభించిన సినీనటి సోనియా సింగ్ (ఫొటోలు)
-
మారుతీ స్విఫ్ట్ కొత్త మోడల్
న్యూఢిల్లీ: మారుతీ సుజుకీ తమ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ స్విఫ్ట్ కారులో 4వ జనరేషన్ మోడల్‌ను విడుదల చేసింది. దీని ధర రూ. 6.49 లక్షల నుంచి రూ. 9.64 లక్షల వరకు (ఢిల్లీ ఎక్స్‌షోరూం) ఉంటుంది. ఈ కారును అభివృద్ధి చేయడంపై రూ. 1,450 కోట్లు ఇన్వెస్ట్ చేసినట్లు సంస్థ ఎండీ హిసాషి తకెయుచి తెలిపారు. హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్ అమ్మకాల్లో ప్రీమియం విభాగం వాటా 60 శాతంగా ఉంటోందని పేర్కొన్నారు. ప్రస్తుతం ఏటా 7 లక్షల యూనిట్లుగా ఉన్న ఈ సెగ్మెంట్ 2030 నాటికి పది లక్షల యూనిట్లకు చేరగలదని అంచనా వేస్తున్నట్లు పేర్కొన్నారు. -
క్యాబ్ డ్రైవర్ పట్ల అమానుషం
యశవంతపుర : ఓ క్యాబ్ డ్రైవర్‌పై దుండగలు దాష్టీకానికి పాల్పడ్డారు. డ్రైవర్‌ను కారు బ్యానెట్‌పైకి నెట్టి పలు వీధుల్లో తిప్పారు. ఈ అమానుష ఘటన బెంగళూరు బసమేశ్వరనగర పోలీసుస్టేషన్ పరిధిలో జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. సోమవారం రాత్రి శంకరనగరలో క్యాబ్ డ్రైవర్ శంకరేగౌడ ఇంధనం కోసం సమీపంలోని పెట్రోల్ బంక్‌కు వెళ్లాడు. చిల్లర కోసం వేచి ఉండగా స్విఫ్ట్‌కారులో ముగ్గురు యువకులు వచ్చారు. వాహనం పక్కకు తీయాలని పెద్దగా హారన్ మోగించారు. శంకరేగౌడను నోటికోచ్చినట్లు దూషించారు. ఒక యువకుడు సెల్ఫోన్లో చిత్రీకరిస్తుండగా మిగతా ఇద్దరు శంకరగౌడను తమ కారు బ్యానెట్ఫైకి వేసుకొని వేగంతో వెళ్లిపోయారు. తనను రక్షించాలని శంకరేగౌడ కేకలు వేశాడు. దీనిని చూసినవారు సినిమా షూటింగ్‌గా భావించారు. అయితే తన ప్రాణం పోతుందని, కాపాడాలని శంకరేగౌడ ఆర్తనాదాలు చేయడంతో ప్రజలు పెద్ద సంఖ్యలో రోడ్డుపైకి రావడంతో అకతాయిలు కారు వేగం తగ్గించారు.దీంతో శంకరగౌడ బ్యానెట్ నుంచి దూకి ప్రాణాలు దక్కించుకున్నాడు. ఈ దృశ్యాలన్నీ ఘటనా స్థలంలోని ఇళ్ల వద్ద ఏర్పాటు చేసిన సీసీకెమెరాల్లో రికార్డు అయ్యాయి. వాటి ఆధారంగా బసవేశ్వరనగర పోలీసులు కేసు నమోదు చేసుకోని దర్యాప్తు చేస్తున్నారు. -
మారుతీ సుజుకీ కార్లపై రూ.70వేల డిస్కౌంట్
సాక్షి, న్యూఢిల్లీ : దేశీయ కార్ల దిగ్గజం మారుతీ సుజుకీ తన కార్లపై డిస్కౌంట్ ఆఫర్ ప్రకటించింది. ఈ నెలలో తన మోడల్స్‌పై రూ.70వేల వరకు డిస్కౌంట్ అందించనున్నట్టు తెలిపింది. డిస్కౌంట్ అందించే మోడల్స్‌లో స్విఫ్ట్, ఎర్టిగా, డిజైర్లు ఉన్నాయి. ఈ ఆఫర్లో నగదు డిస్కౌంట్లు, ఎక్స్చేంజ్ డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి. ఎక్స్చేంజ్ చేసే కారు, ఏడేళ్ల కంటే తక్కువ వయసున్నది అవ్వాలి. ఒకవేళ ఏడేళ్ల కంటే ఎక్కువ సర్వీసున్న కార్లకు తక్కువ ఎక్స్చేంజ్ డిస్కౌంట్ ఆఫర్ చేస్తుంది. కారు అసలు విలువ నుంచి రూ.35 వేల వరకు ఎక్స్చేంజ్ డిస్కౌంట్ లభిస్తుంది. ఎర్టిగా.. మారుతీ సుజుకీ ప్రకటించిన ఆఫర్ కింద, ఎర్టిగా పెట్రోల్ వేరియంట్ రూ.15వేల నగదు డిస్కౌంట్‌తో లభ్యమవుతుంది. డీజిల్ వేరియంట్‌పై రూ.20వేల డిస్కౌంట్ ఉంది. అదేవిధంగా సీఎన్జీ ట్రిమ్‌పై రూ.10వేల డిస్కౌంట్ లభిస్తుంది. మారుతీ సుజుకీ ఎర్టిగా పెట్రోల్, సీఎన్జీ వేరియంట్లపై రూ.30వేలు, రూ.20వేల వరకు ఎక్స్చేంజ్ డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ డిస్కౌంట్లు కారు వాడిన ఏళ్ల ప్రకారం ఉంటుంది. డీజిల్ వేరియంట్‌పై ఎక్స్చేంజ్ డిస్కౌంట్లు రూ.35వేలు, రూ.25వేలుగా ఉన్నాయి. డిజైర్... మారుతీ సుజుకీ డిజైర్(పెట్రోల్) రెగ్యులర్ ఎడిషన్‌పై రూ.20వేల నగదు డిస్కౌంట్ లభిస్తుంది. స్పెషల్ ఎడిషన్‌పై రూ.27వేల డిస్కౌంట్ ప్రకటించింది. ఎక్స్చేంజ్ డిస్కౌంట్ రూ.20వేల వరకు ఉంది. ఒకవేళ ఏడేళ్ల కంటే ఎక్కువ వయసున్న కారు అయితే ఎక్స్చేంజ్ డిస్కౌంట్ రూ.10వేలకు తగ్గుతుంది. మారుతీ సుజుకి డిజైర్ డీజిల్ వేరియంట్‌పై రూ.10వేల నగదు డిస్కౌంట్, ఎక్స్చేంజ్ డిస్కౌంట్ రూ.20వేల వరకు ఆఫర్ చేస్తుంది. స్విఫ్ట్... మారుతీ సుజుకీ స్విఫ్ట్ రెగ్యులర్ పెట్రోల్ ట్రిమ్ వేరియంట్‌పై రూ.20వేల వరకు నగదు డిస్కౌంట్ అందుబాటులో ఉంది. స్పెషల్ ఎడిషన్ వేరియంట్‌పై రూ.27వేల తగ్గింపు లభిస్తుంది. ఎక్స్చేంజ్ డిస్కౌంట్ రూ.20వేల వరకు, ఒకవేళ కారు ఏడేళ్ల కంటే ఎక్కువ వాడి ఉంటే, డిస్కౌంట్ రూ.10వేలు తగ్గిపోతుంది. మారుతీ సుజుకీ స్విఫ్ట్(డీజిల్)పై రూ.10వేల నగదు డిస్కౌంట్ లభిస్తుంది. దాంతో పాటు రూ.25వేల వరకు ఎక్స్చేంజ్ డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి. ఆల్టో/ఆల్టో కే10... ఆల్టో పెట్రోల్, సీఎన్జీ వేరియంట్లపై రూ.25వేల నగదు డిస్కౌంట్లను మారుతీ సుజుకీ ఆఫర్ చేస్తుంది. మారుతీ సుజుకీ ఆల్టో కే10 పెట్రోల్ ఎంటీపై రూ.22వేల నగదు డిస్కౌంట్ లభ్యమవుతుంది. ఆల్టో కే10 ఏఎంటీపై రూ.27వేల నగదు డిస్కౌంట్‌ను, అన్ని మోడల్స్‌పై రూ.30వేల ఎక్స్చేంజ్ డిస్కౌంట్లను అందుబాటులో ఉంచింది. -
కొత్త మారుతి స్విఫ్ట్ లాంచ్
గ్రేటర్ నోయిడా : స్విఫ్ట్ అభిమానుల ఎదురుచూపులకు స్వస్తి పలికిన మారుతీ సుజుకీ మూడో జనరేషన్‌కు చెందిన కొత్త స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్‌ను నేడు ఆటో ఎక్స్పో 2018లో లాంచ్ చేసింది. ఈ కొత్త వెహికిల్ ధర రూ.5 లక్షల నుంచి ప్రారంభం. పాత మోడల్‌తోనే ఇప్పటికే పాపులర్ కారుగా పేరు తెచ్చుకున్న స్విఫ్ట్, కొత్త రూపకల్పనతో మరింత ఆకట్టుకోబోతుంది. ఈ కొత్త స్విఫ్ట్ పాత దానికి కంటే మరింత ప్రీమియంగా ఉండబోతుంది. 1.21 వీటీవీటీ పెట్రోల్ ఇంజిన్‌ను ఇది కలిగి ఉంది. పాత స్విఫ్ట్ కంటే 7.8 శాతం ఎక్కువ మైలేజ్‌ను ఇది అందిస్తోంది. డీజిల్ డీడీఐఎస్ 190 ఇంజిన్‌ను కూడా ఇది కలిగి ఉంది. పాత దానికంటే 12.7 శాతం ఎక్కువ మైలేజ్‌ను ఈ కొత్త స్విఫ్ట్ ఆఫర్ చేస్తోంది. ఆటో గేర్ స్విఫ్ట్ టెక్నాలజీతో ఇది రూపొందింది. 5వ జనరేషన్ హార్ట్‌టెక్ట్ ప్లాట్‌ఫామ్‌పై మారుతీ సుజుకీ దీన్ని అభివృద్ధి చేసింది. ఇప్పటివరకు ఉన్నమోడల్స్కు పూర్తిగా భిన్నంగా, మోడరన్ లుక్స్‌లో, స్పోర్టీగా, మోర్ ప్రీమియంగా ఈ స్విఫ్ట్‌ను ప్రవేశపెడుతోంది. కొత్త స్విఫ్ట్ పొడవులో 10ఎంఎం చిన్నది. ప్రస్తుతమున్న మోడల్‌తో పోలిస్తే 40ఎంఎం వెడల్పు, 35ఎంఎం లోయర్, 20ఎంఎం లాంగర్ వీల్‌బేస్‌ను ఇది ఆఫర్ చేస్తుంది. -
కొత్త స్విఫ్ట్ స్పోర్టీ లుక్‌లో: ప్రీ బుకింగ్స్
సాక్షి, న్యూడిల్లీ: మారుతి సుజుకి కొత్త 2018 మోడల్‌ను త్వరలోనే అందుబాటులోకి తేనుంది. తన పాపులర్ మోడల్ కారు స్విఫ్ట్ కొత్త ఎడిషన్‌ను లాంచ్ చేయనుంది. ఫిబ్రవరిలో జరిగే ఆటో ఎక్స్‌పోలో దీన్ని అధికారికంగా గా ప్రవేశపెట్టనుంది. దీనికి సంబంధించిన ప్రీ బుకింగ్‌లు జనవరి మూడవ వారంలో ప్రారంభించనుందని పలు నివేదికల ద్వారా తెలుస్తోంది. తాజా నివేదికల ప్రకారం దీనికి రూ .5 లక్షల నుంచి రూ. 8 లక్షల మధ్య నిర్ణయించవచ్చని సమాచారం. ఇప్పటివరకు ఉన్నమోడల్స్కు పూర్తిగా డిఫరెంట్‌లో లుక్‌లో తీసుకొస్తోంది. అప్‌మార్కెట్ స్టీరింగ్ వీల్, స్పోర్టీ, టు -పాడ్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ , టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ విత్ ఆపిల్ కార్ ప్లే, మిర్రర్ లింక్‌తో పాటు మెరుగైన ఇంధన సామర్ధ్యంతో, మరింత శక్తితో దీన్ని రూపొందిస్తోంది. ఇక ఇంజీన్ల విషయానికి వస్తే 1.2 లీటర్ కె-సిరీస్ పెట్రోల్ ఇంజీన్, 1.3 లీటర్ డీజిల్ ఇంజిన్లతో రానుంది. కాగా థర్డ్ జనరేషన్ స్విఫ్ట్ స్పోర్ట్స్ కారు ఫోర్డ్ ఫిగో, హ్యుందాయ్ గ్రాండ్ ఐ టెన్‌కి గట్టి పోటీ ఇస్తుందని భావిస్తున్నారు. -
బస్సును ఢీకొన్న కారు: ఐదుగురి మృతి
కదిరి: అనంతపురం జిల్లా పట్నం గ్రామం వద్ద గురువారం ఉదయం స్విఫ్ట్ కారు ఆర్టీసీ బస్సును ఢీ కొన్న ఘటనలో ఐదుగురు మృతి చెందారు. బళ్లారికి చెందిన ఓ కుటుంబం అక్కడి నుంచి రాయచోటికి కారులో బయలుదేరింది. పట్నం గ్రామం వద్ద వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును ఢీ కొట్టింది. దీంతో కారులో ఉన్న ఇద్దరు మహిళలు, ఇద్దరు పురుషులు, ఓ చిన్నారి అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి పరీశిలించారు. మృతులందరూ ఒకే కుటుంబానికి చెందినవారని భావిస్తున్నారు. మృతులు ఒకే కుటుంబానికి చెందినవారని భావిస్తున్నారు. -
రోడ్డుప్రమాదంలో ఇద్దరు మృతి
నల్లగొండ: నల్లగొండ జిల్లా కేంద్రం సమీపంలోని అన్నెపర్తి గ్రామం వద్ద మంగళవారం అర్ధరాత్రి జరిగిన ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. నల్లగొండ వైపు వెళ్తున్న మారుతి స్విఫ్ట్ కారును ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టి వెళ్లిపోయింది. దీంతో కారు రోడ్డు పక్కనే ఉన్న గుంతలోకి పల్టీ కొట్టింది. కారులో ఉన్న ఇద్దరు తీవ్రగాయాలతో అక్కడికక్కడే చనిపోగా మరొకరు కోమాలోకి వెళ్లారు. క్షతగాత్రుడిని నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మిర్యాలగూడకు చెందిన బాధితులు హైదరాబాద్ నుంచి వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. -
ముంచుకొచ్చిన మృత్యువు
⇒ కాకతీయ కాల్వలోకి దూసుకెళ్లిన కారు ⇒ ఇద్దరు వైద్య ఆరోగ్యశాఖ ఉద్యోగినుల మృతి ⇒ సురక్షితంగా బయటపడ్డ డ్రైవర్ ⇒ కోనేరుపల్లి శివారులో ప్రమాదం చొప్పదండి: మండలంలోని కోనేరుపల్లి శివారులో గల కాకతీయ కాల్వ వంతెన వద్ద ప్రమాదవశాత్తు కారు కాలువలోకి దూసుకెళ్లడంతో చొప్పదండిలోని సామాజిక ఆరోగ్య కేంద్రంలో విధులు నిర్వహిస్తున్న ఇద్దరు ఉద్యోగినులు మృత్యువాతపడ్డారు. సోమవారం మధ్యాహ్నం బోధకాలు మాత్రలు పంపిణీచేసేందుకు చొప్పదండి ఆరోగ్య కేంద్రం నుంచి కోనేరుపల్లికి బయలుదేరిన హెల్త్ సూపర్వైజర్ అనంతకుమారి(48), రెండో ఏఎన్ఎం బాలసరస్వతి(35) కాట్నపల్లి, కోనేరుపల్లి మధ్య కాల్వపై గల వంతెనను దాటి కొద్దిదూరం వెళ్లగానే కారు కాల్వలోకి దూసుకుపోయింది. కారు నీటిలో బోల్తాపడటంతో అనంతకుమారి, బాలసరస్వతి మృతి చెందారు. డ్రైవింగ్ నేర్చుకుంటూ మృత్యువాత ఇటీవలే స్విఫ్ట్ కారును కొనుగోలు చేసిన అనంతకుమారి దానికి ఓ డ్రైవర్‌ను నియమించుకున్నారు. బోదకాలు మాత్రలు పంపిణీ చేసేందుకు కాట్నపల్లి వెళ్లి అక్కడ విధులు పూర్తి చేసుకున్నారు. కాట్నపల్లి క్టస్టర్‌కు సూపర్వైజర్ కావడంతో అనంతకుమారి కోనేరుపల్లికి బయల్దేరారు. అక్కడినుంచి కరీంనగర్ వెళ్లే అవకాశం ఉండటంతో కాట్నపల్లి ఏఎన్ఎం బాలసరస్వతి కూడా కారులో ఎక్కారు. దారిలో అనంతకుమారి కారు డ్రైవింగ్ నేర్చుకుంటుండగా, డ్రైవర్ హరీష్ పక్క సీట్లో కూర్చున్నాడు. ఇంతలో కాకతీయ కాల్వపై మూలమలుపు వద్ద కారు అదుపుతప్పి కాల్వలోకి దూసుకెళ్లింది. వెంటనే కారులోంచి తప్పించకున్న హరీష్ నీటి ప్రవాహంలో ఈదుకుంటూ ప్రాణాలతో బయటపడగా, అనంతకుమారి, బాలసరస్వతి అందులోనే చి క్కుకుని మృతి చెందారు. హరీష్ ద్వారా విష యం తెలుసుకున్న మృతుల కుటుంబసభ్యు లు, బంధువులు, పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్నారు. సమీప గ్రామాల ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. స్థానికులు, పోలీసులు, హెల్త్ సిబ్బంది మృతదేహాల కోసం కాల్వలో గాలింపు చేపట్టారు. సాయంత్రం వరకు క్రేన్ సాయంతో గాలించగా ప్రమాద స్థలంలోనే కారును, డ్రైవింగ్ సీట్లో కూర్చున్న అనంతకుమారిని ఒడ్డుకు చేర్చారు. బాలసరస్వతి మృతదేహాన్ని కరీంనగర్ మండలం కొత్తపల్లి శివారులో వెలికితీశారు. మృతదేహాలను చూసి వారి కుటుంబసభ్యులు బోరున విలపించారు. బాలసరస్వతి కుమారుడు సృ్పహ కోల్పోవడంతో వైద్యసిబ్బంది ఆసుపత్రికి తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కరీంనగర్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. డీఎంహెచ్‌వో అలీం, కరీంనగర్ డీఎస్పీ మల్లారెడ్డి సంఘటన స్థలాన్ని సందర్శించారు. మూడేళ్ల క్రితం చొప్పదండిలో ఉద్యోగంలో చేరిన అనంతకుమారి కరీంనగర్లో నివాసం ఉంటున్నారు. ఆమె భర్త ఆర్టీసీ వర్క్‌షాపులో మెకానికల్ సూపర్వైజర్గా పనిచేస్తున్నాడు. వీరికి ముగ్గురు కుమార్తెలు కాగా, ఇద్దరికి వివాహమైంది. మరో కుమార్తె ఎంబీబీఎస్ చదువుతోంది. ఆరు నెలల క్రితం చొప్పదండిలో విధుల్లో చేరిన బాలసరస్వతి భర్త ఎలిగేడు ఎస్బీహెచ్లో రికార్డ్ అసిస్టెంట్‌గా పని చేస్తున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. డెప్యూటీ సీఎం సంతాపం మంకమ్మతోట : అనంతకుమారి, బాలసర్వతి మృతిపై డెప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి రాజయ్య, డెరైక్టర్ ఆఫ్ హెల్త్ డాక్టర్ సాంబశివరావు, ప్రిన్సిపల్ సెక్రెటరీ సురేష్‌చంద్ర, డీఎంహెచ్ఓ ఎండీ.అలీమ్ సంతాపం ప్రకటించారు. బాధిత కుటుంబాలకు ప్రగాడ సానుభూతిని తెలియజేశారు. విధి నిర్వహణలో మరణించినందున వారి కుటుంబాలను ప్రభుత్వపరంగా ఆదుకుంటామన్నారు. -
ఒకే రోజు మూడు వరుస దాడులు
కమలాపురం: ఒకటి.. రెండు.. మూడు.. ఇవి అంకెలు కాదు.. ఒకే రోజు కమలాపురంలో జరిగిన వరుస దాడులు... ఎన్నడూ లేని విధంగా ఈ సంఘటనలు జరగడంతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. రెండు రోజుల క్రితం పోలీసుల కళ్లుగప్పి నాటకీయ పరిణామాల మధ్య తప్పించుకున్న సునీల్ అప్పుడు పంజా విసరడం మొదలు పెట్టాడా..! పోలీసులకు మళ్లీ చిక్కేలోపు వీలైనంత త్వరగా దాడులు నిర్వహించి అందిన కాడికి దోచుకోవాలని భావించాడా.. వరుసదాడులను పరిశీలిస్తే నిజమేమోననే సందేహాలు తలెత్తుతున్నాయి. వివరాల్లోకెళితే.. ముద్దనూరుకు చెందిన ఇద్దరు వ్యక్తులు తిరుమలకు వెళ్లి తిరుగు ప్రయాణంలో కమలాపురం వద్ద తమ స్విఫ్ట్ కారును నిలబెట్టుకుని నిద్రించసాగారు. ఇంతలో ఇద్దరు దుండుగులు అక్కడికి వచ్చి తాము ఐడీ పార్టీ పోలీసులమని, మీ కారులో ఎర్రచందనం ఉందని తమకు ఫిర్యాదు వచ్చిందని, కారు దిగాలని కోరారు. దీంతో కారు యజమానికి, వారికి మాటా మాటా పెరిగింది. దండగులు కారు యజమానిపై దాడి చేసి వెళ్లిపోయారు. కారు యజమాని పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేయడంతో కమలాపురం పోలీసులు బాధితులతో కలసి కడప వైపు గాలింపు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా కడప ఎయిర్పోర్ట్ వద్ద దుండుగులు వదిలి వెళ్లిన పల్సర్ వాహనం దొరికింది. ఆ వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే చిత్తూరుకు చెందిన కరివేపాకు వ్యాపారి చెంగయ్య లగేజ్ ఆటోలో కడప నుంచి తాడిపత్రి వెపు వెళ్తుండగా.. ఆ ఆటోను నిలిపిన దుండుగులు కమలాపురం వరకు వచ్చారు. అప్పటికే వైఎస్ఆర్ సీపి కార్యాలయం వెనుకవైపు ఒమిని కారులో ఉన్న మరో ఐదుగురు కలసి చెంగయ్యతో పాటు డ్రైవర్‌పై దాడి చేశారు. వారి వద్ద ఉన్న రూ. లక్షను దోపిడీ చేసి వారి చేతులు కట్టేసి కడప-తాడిపత్రి హైవేలోని గొళ్లపల్లె వంక వద్ద పడేశారు. తెల్లవారుజామున 2-3గంటల ప్రాంతంలో ఈ సంఘటన జరిగిందని బాధితులు తెలిపారు. కలకలం రేపిన డాక్డర్ గణేష్ కిడ్నాప్ పట్టణంలోని సొసైటీ కాలనీలో దాదాపు 25ఏళ్ల క్రితం నుంచి ప్రాక్టీస్ చేస్తున్న ప్రైవేట్ డాక్టర్ గణేష్ కిడ్నాప్ వ్యవహారం కలకలం రేపింది. తెల్లవారు జామున 4గంటలకు లగేజీ ఆటోలో నలుగురు వ్యక్తులు డాక్టర్ ఇంటి వద్దకు వచ్చి పేషెంట్‌కు సీరియస్‌గా ఉందని రావాలని కోరారు. దీంతో డాక్టర్ గణేష్ వారి వెంట వెళ్లారు. అంతలోనే సీనీ ఫక్కీలో డాక్టర్ నోటికి ప్లాస్టర్ అంటించి కిడ్నాప్ చేశారు. కాగా ఐదు గంటల ప్రాంతంలో మరో పెషెంట్ వచ్చారు. డాక్టర్ కిందనే ఉన్నారని ఆయన భార్య చెప్పడంతో కిందికి వెళ్లి చూశారు. డాక్టర్ కనిపించలేదు. దీంతో డాక్టర్ కిడ్నాప్‌కు గురయ్యాడని తెలుసుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల రంగ ప్రవేశంతో.. పట్టణంలో సంచలనం రేకెత్తించిన డాక్టర్ గణేష్ కిడ్నాప్ విషయాన్ని పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు. జిల్లా ఎస్పీ నవీన్ గులాఠీ ఆదేశాల మేరకు కడప డీఎస్పీ అశోక్ కుమార్ కమలాపురం నుంచి వెళ్లే అన్ని రూట్లలో పోలీసు నిఘా పెంచారు. సీఐ మొదలుకుని పోలీసు సిబ్బంది సివిల్ డ్రస్‌లో తనిఖీలు చేపట్టారు. దీంతో ఎక్కడ దొరికిపోతామోనని భావించిన నిందితులు డాక్టర్‌ను వదిలేశారు. రూ. కోటి అడిగారు తనను వదిలేందుకు కిడ్నాపర్లు రూ. కోటి డిమాండ్ చేశారని డాక్టర్ గణేష్ తెలిపారు. తన వద్ద అంత డబ్బు లేదని రూ. 50 వేలు మాత్రమే ఉన్నాయని చెప్పానన్నారు. చివరకు డాక్టర్ వద్ద ఉన్న బంగారు చెయిన్, ఉంగరాలు, బ్రాస్లెట్ తీసుకుని ఇర్కాన్ సర్కిల్ వద్ద వదిలేశారు. అక్కడి నుంచి డాక్టర్ ఆటోలో ఇంటికి వచ్చారు. ఇదిలా ఉండగా డాక్టర్ గణేష్‌ను కిడ్నాపర్లు తీవ్రంగా గాయపరిచారు. డబ్బు తేవాలని కోరినప్పుడు డాక్టర్ రాంగ్నంబర్కు ఫోన్ చేయడంతో వారు దాడి చేశారు. భయాందోళనలో ప్రజలు ఒకేసారి వరుసగా మూడు దాడులు జరగడంతో పట్టణ ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. డాక్టర్‌ను కిడ్నాప్ చేశారనే సమాచా రం దావానంలా వ్యాపించడంతో ఆయన ఇంటి వద్దకు చేరుకున్నారు. ఈ విషయంపై డీఎస్పీ అశోక్ కుమార్‌ను వివరణ కోరగా డాక్టర్ ఇంకా ఆ షాక్ నుంచి తేరుకోలేదన్నారు. అన్ని కోణాల్లో దర్యాప్తు వేగవంతం చేస్తామని తెలిపారు. ఇది సునీల్ గ్యాంగ్ పనేనా అని అడిగిన ప్రశ్నకు డీఎస్పీ స్పందిస్తూ ఆ కోణంలో కూడా విచారణ చేపడతామన్నారు.