
సాక్షి, న్యూడిల్లీ: మారుతి సుజుకి కొత్త 2018 మోడల్‌ను త్వరలోనే అందుబాటులోకి తేనుంది. తన పాపులర్ మోడల్ కారు స్విఫ్ట్ కొత్త ఎడిషన్‌ను లాంచ్ చేయనుంది. ఫిబ్రవరిలో జరిగే ఆటో ఎక్స్‌పోలో దీన్ని అధికారికంగా గా ప్రవేశపెట్టనుంది. దీనికి సంబంధించిన ప్రీ బుకింగ్‌లు జనవరి మూడవ వారంలో ప్రారంభించనుందని పలు నివేదికల ద్వారా తెలుస్తోంది.
తాజా నివేదికల ప్రకారం దీనికి రూ .5 లక్షల నుంచి రూ. 8 లక్షల మధ్య నిర్ణయించవచ్చని సమాచారం. ఇప్పటివరకు ఉన్నమోడల్స్‌కు పూర్తిగా డిఫరెంట్‌లో లుక్‌లో తీసుకొస్తోంది. అప్‌మార్కెట్ స్టీరింగ్ వీల్, స్పోర్టీ, టు -పాడ్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ , టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ విత్ ఆపిల్ కార్ ప్లే, మిర్రర్ లింక్‌తో పాటు మెరుగైన ఇంధన సామర్ధ్యంతో, మరింత శక్తితో దీన్ని రూపొందిస్తోంది. ఇక ఇంజీన్ల విషయానికి వస్తే 1.2 లీటర్ కె-సిరీస్ పెట్రోల్ ఇంజీన్, 1.3 లీటర్ డీజిల్ ఇంజిన్లతో రానుంది.
కాగా థర్డ్ జనరేషన్ స్విఫ్ట్ స్పోర్ట్స్ కారు ఫోర్డ్ ఫిగో, హ్యుందాయ్ గ్రాండ్ ఐ టెన్‌కి గట్టి పోటీ ఇస్తుందని భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment